90 -  అధ్యాయము

నిత్యాపటలకథనమ్ :

అథాతో విప్ర నిత్యానాం ప్రయోగాదిసమన్వితమ్

పటలం తేభిధాస్యామి నిత్యాభ్యర్చన దీపకమ్

లలితాయాస్త్రిభిర్వర్ణై స్సకలార్థాభిధీయతే

శేషేణ దేవిరూపేణ తేన స్యాదిదూరితమ్

అశేషతో జగత్కృత్నం హృల్లేఖాత్మకముచ్యతే

తస్యాశ్చార్థస్తు కథితస్సర్వతంత్రేషు గోపితః

వ్మోమ్నా ప్రకాశమానత్వం గ్రసమానత్వమగ్నినా

తయోర్విమర్శ ఈకార బిందునా తన్నిపాలనమ్

 పిండకర్తరి బీజాఖ్య మంత్రి మాలాభిః క్రమాత్

 ఏకార్ణవక్షో ద్వ్యర్థాశ్చ త్రిదిళ్ముఖముఖార్ణవాః

వృత్తిజార్ణాంల్లిఖేదంకై ర్వ్యత్యస్తకమయోగతః

 నైర్భేదయోజనం కుర్యాత్సందర్భాణామశేషతః

దేవ్యాత్మకం సముదయం విశ్రాప్తిం చ శివాత్మకమ్

 ఉభయాత్మకమస్యాత్మస్వరూపం తైశ్చ భావయేత్

కాలేనాన్యచ్చ దు:ఖార్తి వాసనానాశ ధ్రువమ్

పరిహంతామయం సర్వ స్వరూపం చాత్మవిగ్రహమ్

సదాత్మకం స్ఫురతాఖ్యం అరోషోపాధివర్జితమ్

 ప్రకాశరూపమాత్మత్వే వస్తు తద్భాసతే పరమ్

యత ఏవమతోలోలే నాస్త్యమంత్రం యదక్షరమ్

 యద్విద్యేతి సమాఖ్యాతం సర్వధా సర్వతస్సదా

వాసరేషు తు తేష్వేవం సర్వాపత్తారకం భవేత్

తద్విధానం చ వక్ష్యామి సమ్యగాసవకల్పనమ్

గౌడీ పై తథా మాధ్వీ త్యేవం తత్రివిధం స్మృతమ్

 గుడ ముష్ణోదకే క్షిప్త్యా సమాలోడ్య వినిక్షిపేత్

 ఘటే కాచమయే తస్మిన్ ఘాతకీ సుమనోరజః

 ఘాత్యా భూమౌ సంధ్యయోస్తు కరై స్సంక్షోభ్య

భూయసా మాసమాత్రే గతే తస్మిన్నిమగ్నే రజసి ద్రుతమ్

సంశోధ్య పూజయేత్తేన గౌడీ సా గుడయోగతః

ఏవం మధుసమాయోన్మాధ్వీ ప్రెస్టీం శ్రుణు ప్రియ

 అధ్యర్థద్విగుణీ తోయే శ్రపయేత్తందులం శనైః

దినత్రయోషితే తస్మిన్గాతంకురరజః క్షిపేత్

దినమేకం ధృతే వాతే నివాతే స్థాపయేత్తతః

ఉదకైర్లోలితం పశ్చాద్దలితం పైష్టికం మధు

వృక్షజం ఫలజం చేతి ద్వివిధం క్రియతే మధు

 తన్నిర్మాణం శృణుష్వాద్య యధాస్వాదన్మనో లయః

 మృద్వీకాం వాథ ఖర్జూరఫలం పుష్పమథాపి వా

 మధూకస్యాంభసి క్షిప్త్యా శతమర్థావశేషితమ్

ప్రాక్సుతాసవలేశేన మిలితం దివస ద్వయాత్

గాలితం స్వాదు పూజార్హం మనోలయకరం శుభమ్

వార్షంతు నాలికేరం స్యాద్ధాంతాలస్యాధ తాలతః

ఫలకాండంతుతం దుగ్గం నీతం సద్యో రసావహమ్

నాలికేరఫలాంతస్థ సలిలే శశినా యుతే

ఆర్థపూగఫలోత్తం తు రసం సంక్షిప్య తాపయేత్

 ఆతపే సద్య ఏవైతదాసవం దేవతా ప్రియమ్

 ఆసవైరేభిరుదితైరర్ఘ్యం దేవ్యై నివేదయేత్

దేవైః కృత్వా తతస్సద్యో దద్యాత్తత్సిద్ధయే ద్వయమ్

సాధకో నియతాహార స్సమాధిస్థః పిబేత్సదా

 న కదాచితిబేత్సిద్గో దేవ్యర్థ మనివేదితమ్

పానం చ తావత్కుర్వీత యానతా స్యాత్మనోలయః

తతః కరోతి చేత్సద్యః పాతకీ భవతి ధ్రువమ్

దేవతా గురుశిష్టాన్నంపిబన్నా సవమాశయా

 పొతకీ రాజదండ్యశ్చ రిక్టోపాసక ఏవ చ

నవతి తమోధ్యాయః సాధ్యసాధకయోరేతసౌమ్య ఏవ సూరితమ్

 సిద్ధస్య సర్వదా ప్రోక్తం యతో సౌ తన్మయో భవేత్

పూజయేత్ప్రోక్తరూపస్తు ప్రోక్తరూపాశ్చ తాః క్రమాత్

ఉపచారైరాసవైశ్చ మత్త్స్యై ర్మాంసైస్తు సంస్కృతైః

సనత్కుమార మహర్షి పలికెను :-

ఓ బ్రాహ్మణోత్తమా ! ప్రయోగాది సమన్వితమగు నిత్యాభ్యర్చన దీపకమగు నిత్యా పటలమును చెప్పెదను. లలితా దేవి యొక్క మూడు వర్ణములచే సకలార్థములు చెప్పబడును. మిగిలిన దేవీ రూపముచే చెప్పబడిన దానిచే ఇది చెప్పబడుచున్నది. ఈ సమస్త జగత్తు హృల్లేఖాత్మకముగా చెప్పబడినది. సర్వతంత్రములందు రహస్యముగా నుంచబడిన అర్ధము చెప్పబడినది. ఆకాశముచే ప్రకాశము, అగ్నిచే గ్రసమానత్వము. ఈ రెంటి విమర్శయే బిందుయుత ఈకారము. దీనినే ఫాలన మందురు. పిండి కర్తృత్వము నందు మాలానామకరములు బీజాఖ్యములగు మన్తములు క్రమముగా ఏకాక్షరములు ద్వ్యక్షరములు, త్ర్యక్షరములు చతురాధ్య క్షరములుగా నుండును. అంకములచే వృత్తి భవార్లములను లిఖించవలయును. వ్యస్త క్రమయోగముతో వ్రాయవలయును. ఆవర్ణములచే భేదయోజనమును చేయవలయును. అశేష సందర్భములకిదియే క్రమము. సముదయము దేవ్యాత్మకము, విశ్రాంతి శివాత్మకము, ఆత్మ స్వరూపము ఉభయాత్మకముగా భావన చేయవలయును. ఇట్లు చేసినచో కొంత కాలమునకు దుఃఖార్తి నాశము జరుగును. సర్వస్వరూపము పరిహాంతామయము. ఆత్మ విగ్రహము. అరోపోపాధి వర్జితము స్పురతాఖ్యము సదాత్మకము. ఆత్మత్వమున ప్రకాశ రూపమగు వస్తువు భాసించును. కావున లోకమున అ మంత్రాత్మకమగు అక్షరము లేదు. ఇదియే అంతటా అన్ని వేళలా విద్యయనబడును. ఆయా వాసరము లందు ఇట్లాచరించిన సర్వాపత్తారకమగును. ఇపుడు చక్కగా ఆసవకల్పనా విధానమును చెప్పెదను. ఈ ఆసవము గౌడీ, పైస్టీ, మాధ్వీయని మూడు విధములు. వేడి నీటిలో బెల్లమును పడవేసి చక్కగా కలిపి గాజుకుండలో వేసి దానిలో ఉమ్మెంత పూవుల పొడి కలిపి, భూమిలో నుంచవలయును. ప్రతిదినము రెండు పూటలా చేతులచే కలుపు చుండ వలయును. ఇట్లు ఒక మాసము చేసినచో పుప్పొడి కలిసిపోవును.అపుడు ఆ యాసవముచే పూజించవలయును. గుడముతో కలిసినది కావున ఈ ఆసనమును గౌడీ యందురు. ఇట్లే మధువును కలిపినచో మాధియగును. ఇక పైష్టి ఆసనమును చెప్పెదను వినుము. రెండున్నర రెట్లు అధికముగానున్న నీటిలో బియ్యమును నానబెట్టవలయును. అట్లు మూడు దినముల తరువాత ధ్యాత్యంకుర రజమును పడవేయవలయును. ఒక దినము గానీ ఉన్నచోట ఉంచి తరువాత నివాత ప్రదేశమున నుంచవలయును. నీటితో కలిపిన తరువాత అడుగున జారిపడినది పెద్దీ ఆసవమగును. ఈ మధువు వృక్షజమని, ఫలజమని రెండు విధములు. ఈ రెండు విధముల ఆసవమును నిర్మించు విధానమును వినుము. ఈ యాసవమును సేవించినచో మనోలయమగును. ద్రాక్షఫలమును కానీ ఖర్జూర ఫలమును కొని పుష్పమును కాని ఇప్ప పూవు నీటిలో పడవేసి సగములగునట్లుగా చేసి మొదట వచ్చిన ఆసవశేషముచే రెండు దినములు కలిపినచో తేలినది రుచికరము పూజార్హమగు ఆసవము శుభప్రదము మనోలయకరమగును. ఇక వృక్షజాసవము నాలికేరముకాని హింతాలముకాని తాలము కాని వృక్షముకాని వృక్షములయొక్క ఫలకాండముల నుండి స్రవించిన రసము రసావహము గా నుండును. నాలికేర ఫలంతర్భాగమున నున్న జలము శశియుతమగునపుడు, అర్థపూగ ఫలోత్తమగు రసమును సంగ్రహించి ఎండలో నుంచినచో ఏర్పడు ఆసవము దేవతా ప్రీతికరమగును. ఇట్టి ఆసవములచే దేవికి ఆర్యము నర్పించవలయును. సాధకుడు ఆహారనియము కలవాడై సమాధిలో నుండి ఆసవపానమును గావించవలయును. దేవికి నివేదన చేయక ఆసవపానము చేయరాదు. మనోలయమగు వరకే పానము చేయవలయును. తరువాత కూడా పానము చేసినచో మహాపాతకి యగును. దేవతా గురువులకు నివేదన చేయని ఆసవమును పానము చేసినవాడు పాతకి రాజదండ్యుడు, రిక్టోపాసకుడగును. సాధ్యసాధకములకు కామ్యముగా చెప్పబడినది. సిద్ద విషయమున ఎప్పుడూ చెప్పబడియే యున్నది. కావున సాధకుడు తన్మయుడు కావలయును. ఉక్తరూపుడై ఉక్తరూపులగు దేవతలను క్రమముగా ఉపచారములచే, ఆసవములచే, మత్స్య మాంసములచే పూజించవలయును.

అథ కామ్యార్చనం వక్ష్యే ప్రయోగాంశ్చాపి నారద!

యేషామాచరణాత్సిద్ధిం సాధకో లభతే ధ్రువమ్

చైత్రే దమనకై రర్చేత్పూర్ణాయాం మదనోత్సవమ్

 వైశాఖే మాసి పూర్ణాయాం పూజయేద్దేమ పుష్పకైః

జ్యేష్ఠ్యాం ఫలైర్యద్దేవీం కదలీ పన సామ్రాజైః

ఆషాఢ్యం చన్దనైరెలా జాతీ కంకోల కుంకుమైః

శ్రావణ్యామాగమోక్తేన విధినార్చేత్సవిత్రకైః

 పౌష్ఠపద్యాం గంధపుష్పై ర్యజేదా కేతకీసుమైః

ఆశ్వయుజ్యాం కన్యకార్చా భూషా వస్త్రధనాదిభిః

కార్తిక్యాం కుంకుమైశ్చైవ నీశి దీప గభైరపి .

స చందైర్మార్గ శీర్యాం తు నాలికేరైరపూపకైః

పౌష్యాం స శర్కరగుడై ర్గవాం దుగై స్సమర్చయేత్

స్వర్ణరౌప్యైః పంకజేస్తు మాఘ్యం సౌగంధికాదిభిః

 ఫాల్గున్యాం వివిధైర్ధవ్యైః ఫలైః పుషైః సుగంధిభిః.

పర్వతాగ్రే యజేద్దేవీం పలాశ కుసుమైర్నిశి

సిద్ధద్రవ్యైశ్చ సప్తాహాత్ ఖేచరీ మేలనం భవేత్

అరణ్యే వటమూలే వా కుంజే వా ధరణీ భృతాం

కదంబ జాతి పుష్పాభ్యాం సిద్ధద్రవ్యై శివాం యజేత్ 

మాసేన సిద్ధా యక్షిణ్య: ప్రత్యక్ష వాంత ప్రదాః

 కేతకీ కుసుమై సిద్ధా శ్చేటకా వారిధేస్తటే

ఆజ్ఞామభీష్టాం కుర్వన్తో రణే మాయాం మహాద్భుతామ్

 వసూన మాలాం భూషాం చ దద్యురస్యేహాయానిశమ్

 పీఠమృక్ష ద్రుమైః కృత్వా తత్ర దేవీం యజేన్నిశి

 శాల్మలైః కుసుమై సిద్ధద్రవ్యైర్మాసం తు నిర్భయమ్

శ్మశానదేశే విప్రేంద్ర సిద్ధ్యన్యస్య పిశాచకాః

 ఆశ్మపాతప్రహారాద్యై ర్జీయాదాభిర్దిషాశ్చిరమ్

  నిర్జనే విపినే రాత్రి మాస మాత్రం తు నిర్భయ: 

యజేద్దేవీం చక్రగతాం సిద్ధ ద్రవ్య సమన్వితామ్

మాలతీ జాత పున్నాగ కేతకీ మరుభిః క్రమాత్

తేన సిద్ధ్యస్తి వేతలా స్తానారు హ్యాచ్ఛయాచరేత్

శ్మశానే చండికా గేహే నిర్జనే విపినేపి వా

మధ్యరాత్రే యజేద్దేవీం కృష్ణ వస్త్ర విభూషణైః

కృష్ణ చక్రేతికృష్ణాం తాం అతిక్రుద్ధాశయో యజేత్

 సాధ్యయోనిం తదగ్రే తు బలిం చిందన్నివేదయేత్

సిద్ధ ద్రవ్య సమేతం తు మాసాత్తద్భాలలోచనాత్

జాయనే భీషణాః కృత్యాస్తాభ్యసిద్ధిం నివేదయేత్

విశ్వ సంహార సంతుష్టా పునరేత్య నిషేచ్చయా

దేవ్యా లలాట నేత్రే స్యుః ప్రార్థితే తు తిరోహితాః

రక్త భూషాంబరాలేపమాలాభూషితవిగ్రహాః

ఉద్యానే నిర్జనే దేవీం చక్రే సంచింత్య పూజయేత్

కహోర చంపకాశోక పాటలా శతపత్రకైః

సిద్ధ ద్రవ్య నమోపేతై రాయాస్సిధ్యంతి మాసతః

 యాసాం ప్రసాద లాభైన కామరూపో భవేన్నరః

 యాభిర్విశ్వజయీ విశ్వచారీ విశ్వవినోదవాన్

షడాధారాబ్లమధ్యే తు చక్రం సంచిన్య పూజయేత్

 చంద్ర చందన కస్తూరీ మృగనాభి మహోదయైః

త్రికాలజ్జా భవేద్దేవీం తేషు సమ్యగ్విచింతయేత్

 పూర్ణప్రతీతా భవ్యాని వికలే భవ్యమారితమ్

దేవీం చక్రేణ సహితాం స్మరేద్భక్తియుతో నరః

 వివేకా విభవా విశ్వా వితతా చ ప్రకీర్తితా

కామినీ ఖేచరా గర్వా పురాణా పరమేశ్వరీ

గౌరీ శివాహ్యమేయా చ విమలా విజయా పరా

పవిత్రా పీడనీ విద్యా విశ్వేశీ శివవల్లభా

అశేష రూపా స్వానందాంబుజాక్షీ చాప్యనిన్దితా

 వరదా వాక్యదా వాణీ వివిధ వేదవిగ్రహా

విద్యా వాగేశ్వరీ సత్యా సంయతా చ సరస్వతీ

నిర్మలానన్దరూపా చ హ్యమృతా మానదా తథా

 పూషా చైవ తధా తుష్టి పుష్టి శ్చాపి రతి ర్ధతిః

శశినీ చఫ్రికా కాంతి ర్ద్యోత్స్నా శ్రీః ప్రీతిరంగదా

దేవీ నామాని చైతాని చులుకే సలిలే స్మరన్

మాతృకాసహితాం విగ్నాం త్రిరావృత్యా మృతాత్మికామ్

తాడీం సారస్వతీం జిహ్వాం దీపాకారం స్మరనిబేత్

 అజ్ఞాచ్చతుర్విధం తస్య పాండిత్యం భువి జాయతే

 ఏవం నిత్యముషఃకాలే యః కుర్యాచ్ఛుద్ధమానసః

 స యోగీ బ్రహ్మవిజ్ఞానీ శివయోగీ తధాత్మవిత్

అనుగ్రహోక్త చక్రస్థాం దేవీం తాభిర్వతాం స్మరేత్

చంపకేన్జీవరైర్మాసాదారోగ్యముపజాయతే

జ్వర భూత గ్రహోన్మాద శీతకాకామలాక్షిహృత్

 దంతకర్ణజ్వర శిరః శూల గుల్మాది కుక్షిజాః

 ప్రణ ప్రమేహచ్ఛర్ధ్యరో గ్రహణ్యామ త్రిదోషజాః.

 సర్వే తథా శమం యాన్తి పూజయా పరమేశ్వరీ

 ద్రవ్యం చక్రస్య నిర్మాణే కాశ్మీరం సముదీరితమ్

సిందూరం గైరికం లాక్షాదరదం చన్దన ద్వయమ్

 బిలద్వారే లిఖేత్రస్రం షోడశ త్ర్యప్రసంయుతమ్

 దరదేనాస్యమధ్యస్థాం పూజయేత్పరమేశ్వరీమ్

తాభిస్తచ్ఛక్తిభిస్సాకం సిద్ధద్రవ్యై సుగంధిభిః

కుసుమైర్మాసమాత్రేణ నాగ కన్యా సమన్వితమ్

పాతాలాదిషు లోకేషు రమయత్యనిశం శివమ్

యక్ష రాక్షస గంధర్వ సిద్ధ విద్యాధరాంగనాః

 పిశాచా గుహ్యకా వీరాః కిన్నరా భుజగాస్తథా

సిద్ధ్యస్తి పూజనాత్తత తథా తత్రోక్త కాలతః

కింశుకై ర్భూషణావాప్తా పాటలైర్గజసిద్ధయే

రక్తాత్పలైరశ్వసిదౌ కుముదైశ్చర సిద్ధయే

ఉత్పలైరుఫ్ఘసంసిద్యై తగరైః పశు సిద్ధయే

జంబీరైర్మహిషావాష్యై లకుచైరజసిద్ధయే

దాడిమైర్నిధిసంసిద్యై మధుకైర్గాన సిద్ధయే

బకులై రంగనాసిప్లై కప్లోరై పుత్ర సిద్ధయే

శతపత్రైర్జయావాపై కేతకై ర్వాహనాప్తయే

సౌరభాష్యైః ప్రసూనైస్తు నిత్యం సౌభాగ్య సిద్ధయే

 పూజయేన్మాసమాత్రం వా ద్విగుణం త్రిగుణం తు వా .

యావత్ఫలావాప్తి కాంక్షీ శర్కరా ఘృత పాయసైః

స చక్రపరివారాంతాం దేవీం సలిల మధ్యగామ్

 తర్పయేత్కుసుమై స్సార్యై స్సర్వోపద్రవశాన్తయే

ఘృతైః పూర్ణాయుషస్సిడ్యై నొర్రె సౌభాగ్యసిద్ధయే

దుగైరారోగ్యసంసిధ్యై త్రిభిరైశ్వర్య సిద్ధయే

నాలికేరోదకై: ప్రీత్యై హిమతోయైరృపాప్తయే

సర్వార్థ సిద్ధయే తోయైరభిషించే న్మహేశ్వరీమ్

 పూగోద్యానే యజేద్దేవీం సిద్ధద్రవ్యై ర్డివానిశమ్

 నివసంస్తృత తత్పుషైర్జాయతే మన్మధో పమః

 పూర్ణాసు నియతం దేవీం కన్యకాయాం సమర్చయన్

 కృత్యాః పరేరితా మంత్రా విముఖాంస్త్నానసంతి వై

 లింగత్రయమయీం దేవీం చక్రస్థాభిశ్చ శక్తిభిః

పూజయన్నిష్టమఖిలం లభతే త్ర పరత్ర చ

శతమానకృతైః స్వర్ణ పుష్పై సౌభాగ్య వాసితైః

పూజయన్మాసమాత్రేణ ప్రాగ్టన్మాద్యైర్విముచ్యతే

తథారత్నైశ్చ నవభిర్మాసం తు యది పూజయేత్

విముక్తసర్వపాపౌఘై స్తాం చ పశ్యతి చక్షు

 అంశుకైరర్చయేద్దేవీం మాసమాత్రం సుగంధిభిః

ముచ్యతే పాపకృత్యాది దుఃఖో ఫైరితరైరపి

దేవీరూపం స్వమాత్మానం చక్రం శక్తీ సమంతతః

భావయన్విషయైః పుషై పూజయంస్తన్మయో భవేత్

షోడశానాం తు నిత్యానాం ప్రత్యేకం తిథయః

క్రమాత్ తత్తత్తిదౌ తద్భజనం జపహోమాదికం చరేత్

 ఘృతం చ శర్కరా దుగ్ధమపూపం కదలీఫలమ్

షోద్రం గుడం నాలికేరఫలం లాజా తిలం దధి

 పృథుకం చణకం ముద్ద పాయసం చ నివేదయేత్

 కామేశ్వర్యాది శక్తీనాం సర్వాసామపి చోదితమ్

ఆద్యాయా లలితాయాస్తు సర్వాణ్యేతాని సర్వదా

నివేదయేచ్చ జుహుయాద్వహ్నౌ దద్యాన్నృణామపి

తత్తద్విద్యాక్షర ప్రోక్తమౌషధం తత్రమాణతః

సంపిష్య గుటికీకృత్య తాభిస్సర్వం చ సాధయేత్

రవివారేఒరుణాంభోజై: కుముపై సోమవారకే

భౌమే రక్తాత్పలైస్సౌమ్యే వారే తగరసంభవైః

 గురువారే సుకఫ్లోరై శుక్రవారే సితాంబుజై

 నీలోత్పలైర్మన్లవారే పూజయేదిష్టమాదరాత్

 నివేదయేత్ర్కమాత్రేషు రవివారాదిషు క్రమాత్

 పాయసం దుగ్గకదలీ నవనీతసితాఘృతమ్

 ఏవమిష్టం సమారాధ్య దేవీం గంధాదిభిర్యజేత్

 గ్రహపీడాం విజిత్యాశు సుఖాని చ సమశ్నుతే

 అర్థరాత్రే తు సాధ్యాం స్త్రీం స్మరన్మదన వహ్నినా

 దహ్యమానాం హృతస్వాంతాం మస్తక స్థాపితాం జలిమ్

 వికీర్ణకేశీమాలోలలోచనా మరుణారుణామ్

 వాయుప్రేంఖత్పతాకస్థపదాం పద్మకలేవరామ్

వివేక విధురాం మత్తాం మానలక్ట్రాభయాతిగామ్

 చింతయన్నర్చయేచ్చక్రం మధ్యే దేవీం దిగంబరామ్

 జపాదాడిమబంధూకకింశుకాద్యై స్సమర్చయేత్

అన్యైసుగంధిశేఫాలీ కుసుమాద్యైస్సమర్చయేత్

 త్రిసప్తరాత్రాదాయాతి ప్రోక్తరూపా మదాకులా

యావచ్ఛరీరపాతస్స్వాచ్ఛాపో వానపగాస్య సా

 పద్మై రక్షిస్తిమధ్వకై రోమాల్లక్ష్మీమవాప్నుయాత్

తథైవ కైరవైరకై రంగనా స్వవశం నయేత్

సమాన రూపవత్సాయాః శుక్లాయాః గో: పయఃఫుతైః

 మల్లికా మాలతీ జాతీ శతపత్రే రుతై ర్భవేత్

కీర్తిర్విద్యాధనారోగ్య సౌభాగ్య విత్తపాదికమ్

ఆరగ్వధప్రసూనైస్తు డౌద్రాకైర్హవనాద్భవేత్

స్వర్గాదిస్తంభనం శత్రరపాదీనాం క్రుధోపి చ

 ఆజ్యాకైః కరవీరోతైః ప్రసూనై రరుగైర్హుతైః

రక్తాంబరాణి వనితా భూపామాత్య వశం తధా

భూషా వాహన వాణిజ్య సిద్ధయశ్చాస్య వాంఛితాః

లవణె స్సర్షపై రౌరైరితరై రాధ హోమతః

సతైలాకైర్నిశామధ్యే త్వానయేద్వాంఛితాం వధూమ్

 తైలాకై ర్జుహుయాత్కృష్ణదరపుపై ర్నిశాంతయే

 మాసాదరాతేస్తస్యార్తీ ర్జ్వరేణ భవతి ధ్రువమ్

 ఆరుష్కురైరతాభ్యకై స్తద్బీజీర్నిశి హోమతః

శత్రర్హాహవణాని స్యుర్దుస్సాధ్యాని చికిత్సకైః

 తథా తతైలసంసీకై స్టీజైరం కోలకైరపి

మరీచై స్పర్షపాజ్యాకైర్నిశి హోమానుసారతః

వాంఛితాం వనితాం కామజ్వరాల్తామానయే ద్రుతమ్

 శాలిభిశ్చాజ్యసంసీకై మాచ్ఛాలీన వాప్నుయాత్

ముగ్గేర్ముద్ధం ఘృతైరాజ్యం సిద్దెరిళం హుతైర్భవేత్

 సాధ్యర్షవృక్షసంభూతాం పిష్టపాదరజః

కృతామ్ రాజీ మరీచిలోజోల్డెం పుత్తలీం జుహుయాన్నిశి

 ప్రపదాభ్యాం చ జంఘాభ్యాం జానుభ్యామూరు యుగ్మతః

నాభే రధస్తాద్ధయాదిన్నే నాకంఠతస్తథా

శిరసా చ సుతీక్షేన ఛిత్వా శస్త్రేణ వై క్రమాత్మ ఏవం

 ద్వాదశధా హోమాన్నరనారీ నరాధిపా

వశ్యా భవని సప్తాహాజ్జ్వరాఠీ శ్చాస్యవాంఛయా

పిష్టన గుడయుక్తేన మరీచైర్జీరవైర్యుతామ్

 కృత్వా పుత్తలికాం సాధ్య నామయుక్తా మధో

హృదా సనామ హోమసంపాత ఘృతేవా పాచ్యతాం పునః

స్పుశన్నిజకరాగ్రేణ సహస్రం ప్రజపేన్మనుమ్

అభ్యర్చ్య తదతాభ్యక్తం భక్షయేత్తద్ధియా జపన్

నర నారీ నృపాస్తస్య వశ్యాస్సులర్మరణావధి

శక్త్యష్టగంధం సంపిష్య కన్యయా శిశిరే జలే

తేన వై తిలకం ఫాలే ధారయన్వశయేజ్జగత్

శాలి తందులమాదాయ ప్రస్థం భాండేన వై క్షిపేత్

సమానవర్ణ వత్సాయా రక్తాయా గో: పయస్తథా

ద్విగుణం తత్ర నిక్షిప్య శ్రపయేత్సంస్కృతే నలే

 ఘృతేన సిక్తం సిక్తం తు కృత్వా తత్సహితం

కరే విధాయ విద్యామష్ణోర్ద్వశతం జప్త్యా హువేత్తతః

ఏవం హోమో మహాలక్ష్మీ మావహెల్పతిసత్కృః

శుక్రవారేప్వపి తథా వర్షానప సమో భవేత్

పంచమ్యాం తు విశేషేణ ప్రాగ్వధోమం సమాచరేత్

తస్యాం తిధౌ త్రిమధ్వజైర్మల్మికాయ్యై సితైరునేత్

అన్నాజ్యాభ్యాం చ నియతం హుత్వాన్నాడ్యో భవేన్నరః

 యద్యద్ధి వాంఛితం వస్తు తత్తత్సర్వం తు సర్వదా

ఘృత హోమాదవాప్నోతి తథైవ తిలతండులైః

 అరుణోః పంకజైర్క్లోమం కుర్వంఫ్రిమధురాప్లుతైః

మండలాల్లభతే లక్ష్మీం మహతీం శ్లాఘ్యవిగ్రహామ్

కఫ్లోరై: బౌద్రసంయుకై పూర్ణాద్యం తద్దినావధి

జుహుయాన్నిత్యశో భక్త్యా సహస్రం వికచే శుభైః

 స తు కీర్తిం ధనం పుత్రాస్ర్పప్నుయా నాత్ర సంశయః

 చంపకైః షోద్ర సంసికై సహస్రహవనాద్భువమ్

 లభతే స్వర్ణ నిష్కాణాం శతం మాసేన నారద

పాటలైరత సంసీకై స్త్రీసహస్రం హుతైస్తధా

దర్శాదిమాసాల్లభతే చిత్రాణి వసనాని చ

కర్పూర చన్ద నాద్యాని సుగంధాని తు మాసతః

వస్తూని లభతే హృద్యైరన్యైర్ఫోగోపయోగిభిః

శాలిభిః క్షీరసిక్తాభిస్సప్తమిషు శతం హుతమ్

 తేన శాలసమృద్ధిస్స్యాన్మాసై షడ్భిర సంశయమ్

తిలై రుతైస్తు దివసైర్వర్జాదారోగ్యమాప్నుయాత్

 స్వజన్మర్క్ష త్రిషు తధా 'దూర్వాభి ర్జుహుయాన్నరః

 నిరతంకో మహాభోగ శ్శతం వర్షాణి జీవతి

 గుడూచీతిలదూర్వాభి క్రిషు జన్మసు వా హుసేత్

 తేనాయుశ్రీ యశోభోగ పుణ్యనిధ్యాది మాన్భవేత్

ఘృతపాయసదుగ్గేస్తు హుతై స్తేషు త్రిషు క్రమాత్

 ఆయురారోగ్య విభవైరృపామాత్యో భవేత్తధా

సప్తమ్యాం కదలీ హోమాత్ సౌభాగ్యం లభతేన్వహమ్

దూర్వా త్రికైస్తు ప్రాదేశమానైప్తి స్వాదు సంయుతైః

 జుహుయాద్దినశో ఘోరే సన్నిపాతజ్వరే తధా

తద్దినేషు జపేద్విద్యాం నిత్యశస్సలిలం స్పుశన్

 సహస్ర వారం తతోయై స్నానం పొనం సమాచరేత్

 పాకాద్యమపి తైరేవకుర్యాద్రోగ విముక్తయే

సాధ్యరక్షవృక్ష సంచూర్ణం త్ర్యూషణం సర్షపం తలమ్

 పిష్టం చ సాధ్యపాదోత్తరజసా చ సమన్వితమ్

కృత్వా పుత్తలికాం సమ్యదయే నామ సంయుతమ్

ప్రాగ్వచ్ఛిత్వాయసై జై శ్మసైః పుత్తలికాం హునేత్ ఏవం.

దినైస్సప్తభిస్తు సాధ్య వశ్యో భవేద్ధృఢమ్

తథావిధాం పుత్తలికాం కుండమధ్యే నిఖన్య చ

 ఉపర్యగ్నం నిధాయాధ విద్యయా దిన హునేత్

 త్రీసహస్రం త్రియాయాయాం సర్షపైసదసాప్లుతైః

శతయోజన దూరాదప్యానయేద్వనితాం బలాత్

వశద్వనితాం హోమాత్ కౌశికైర్మధుమిశ్రితైః

నాలికేరఫలోపేతై రుడైర్లక్ష్మీ మవాప్నుయాత్

తధాజ్యసికైః కహ్లరైః క్షీరాకై కరుణోత్పలైః

త్రిమధ్వకై శ్చంపకైశ్చ ప్రసూనైర్వకులోద్భవైః

మధూకజై: ప్రసూనైశ్చ హుతైః కన్యామవాప్నుయాత్

 పున్నాగజైరుతైర్వప్రాణ్యాజ్యైరిష్ట మవాప్నుయాత్

మాహిషైర్మహిషీ రాజై రజాగ్దవైశ్చ స్తథా అవాప్నోతి

హుతైరాజ్యై రత్నై రత్నం చ సాధకః

 శాలిపిష్టమయీం కృత్వా పుత్తలీం ససితాం తతః

 హృద్దేశన్యస్రనామార్గాం పచేతైలాజ్యయోర్నిశి

తన్మనాశ్చ దివారాత్రా విద్యా జప్తాం తు భక్షయేత్

 సప్తరాత్ర ప్రయోగేణ నరో నారీ నృపోసి వా

 దాసవద్వశమాయాతి చిత్త ప్రాణాది

 చార్పయేత్ హయారీ పుష్పైరరుణ్ణి సితై రాజుహుయాత్తధా

సప్తరాత్రాన్మహతీమవాప్నోతి శ్రీయన్నరః

ఛాగమాంసై స్త్రీమధ్వకై రోమాత్స్వర్ణ మవాప్నుయాత్

క్షీరాకైస్సస్యసంపన్నాం భువమాప్నోతి మండలాల్

పద్మాక్షేర్ఘవనాల్లక్ష్మీ మవాప్నోతి త్రిభిర్దినైః

బిల్యైర్దశాంశం జుహుయాన్మభ్రాద్యై స్సాధనే జపే

ఏవం సంసిద్ధమంత్రస్తు మంత్రితైశ్చులుకోదకై:

ఫణిదష్టమృతానాం తు ముఖే సంతాడ్య జీవయేత్

తత్కర్లయోర్జపన్విద్యాం యష్ట్యా వాజపసిద్ధయా

సంతాగ్య శీర్షం సహసా మృతముత్తాపయేదితి

కృత్వా యోనిం కుండమధ్యే తత్రాగ్నౌ విధివద్దునేత్

తిలపర్షపగోధూమశాలిధాన్యయవైరునేత్

త్రిమధ్వకై రేకశో వా సమేతై ర్వా సమృద్ధయే

బకులై శ్చంపకైరన్లై: కహొరై కరుణోత్పలైః

 కైరవైరల్లికా మన్గమధూకైరిందిరాప్తయే

అశోకైః పాటలైర్చిల్వై జాతీ వికంకత్తెస్సితైః

నవనీలోత్పలైరశ్వ రిపుడైః కర్ణికారజై!

 హోమాల్లక్ష్మీం చ సౌభాగ్యం నిధిమాయుర్యశో

 లభేత్ దూర్వాం గుడూచీమశ్వత్థం వటమారగ్వధం తథా

 సితార్కప్లక్షజం హుత్వా చిరాన్ముచేత రోగతః

 ఇక్షుజంబూనారికేల మోచాగుడ సితాయుతైః

అచలాం లభతే లక్ష్మీం భోక్తా చ భవతి ధ్రువమ్

సర్షపాజ్యై రుతే మృత్యుః కాషాగ్నౌ వైరినృత్యవే

 చతురంగులబైక్తోమాత్ చతురంగబలే రిపౌ

సప్తాహా ద్రోగదుఃఖార్తీర్భవత్యేవ న సంశయః

 నిత్యం నిత్యార్చనం కుర్యాత్తధా హోమం ఘృతేన

 వై విద్యాభిమంత్రితం తోయం పిబేత్రాత స్తదాప్తయే

 చన్హనో శీర కర్పూర కస్తూరీ రోచనాన్వితైః

కాశ్మీర కాలా గురుభి ర్మగ స్వేద మయైరపి

 పూజయేచ్చ శివామేతెర్గంధై స్సర్వార్ధ సిద్ధయే

 సర్వాభిరపి నిత్యాభిః ప్రాతరాతృకయా సమమ్

 త్రిజప్తాభిః పిబేతోయం తధా వాక్సిద్ధయే శివమ్

 విదధ్యాత్సాధనం ప్రాగ్వద్వర్ణలక్షం పయోవ్రతః

త్రిస్వాదుసికైకరుణే రంబుజైర్ఘవనం చరేత్

 జపతర్పణ హోమార్చా సేవసిద్ధమన్నురః

కుర్యాదుక్త ప్రయోగాంశ్చ నచేత్తన్మనుదేవతాః

 ప్రాణాంస్తస్య గ్రసంత్యేవ కుపితాస్తత్కక్షణాన్మునే

అనయా విద్యయా లోకే యదసాధ్యం న తత్క్వచిత్

ఓ నారదా! ఇక ఇపుడు కామ్యార్చనను ప్రయోగములను చేప్పెదను. వీటిని ఆచరించినచో సాధకుడు సిద్ధిని పొందును. చైత్రమాసమున దమనకములతో పూజించవలయును. పూర్ణిమనాడు మదనోత్సవమును జరుపవలయును. వైశాఖ పూర్ణిమనాడు బంగారు పుష్పములచే పూజించవలయును. జ్యేష్ఠ పూర్ణిమ నాడు కదలీ పనసామ్ర ఫలములచే పూజించవలయును. ఆషాఢ పూర్ణిమనాడు చందనములచే ఏలా జాతీ కంకోల కుంకుమలచే దేవిని పూజించవలయును. శ్రావణ పూర్ణిమ నాడు ఆగమోక్త విధిచే పవిత్రములచే కాని మొగలు ఫూవులచే కాని పూజించవలయును. ఆశ్వయుజ పూర్ణిమనాడు భూషావస్త్ర ధనాదులచే కన్యను అర్చించవలయును. కార్తీక పూర్ణిమనాడు రాత్రి యందు దీపములచే, పగలు కుంకుమలచే అర్చించవలయును. మార్గశీర్ష పూర్ణిమన చంద్ర సహితములగు నాలికేరములచే అపూపములచే పూజించవలయును. పుష్య పూర్ణిమనాడు శర్కరచే గుడములచే పాలచే ఆర్చించవలయును. మాఘపూర్ణిమన స్వర్ణ రూప్యములచే, పంకజములచే సౌగంధికాదులచే పూజించవలయును. ఫాల్గున పూర్ణిమనాడు వివిధ ద్రవ్యములచే, ఫలములచే సుగంధ పుష్పములచే పూజించవలయును. రాత్రిపూట పర్వతాగ్రమునందు మోదుగు పూవులచే పూజించవలయును. ఇట్లు సిద్ధ ద్రవ్యములచే పూజించినచో ఏడు దినములలో ఖేచరీ మేలనము జరుగును. అరణ్యమున కొని, వటమూలమున కాని చెట్ల పొదలలోకాని కదంబ జాతి పుష్పములచే సిద్ధ ద్రవ్యములచే శివను పూజించవలయును ఇట్లు ఒక మాసము చేసినచో సిద్దులు యక్షిణులు ప్రత్యక్షమై అభీష్టముల నిత్తురు. సముద్ర తీరమున మొగలి పూవులచే పూజించినచో ఖేటకులు సిద్ధించెదరు. అభీష్టమగు ఆజ్ఞను పాలించెదరు. యుద్దమున ఆశ్చర్యకరమగు మాయను చేయుదురు. సాధకుని ఇష్టముననుసరించి ధనమును మాలలను భూషణములను ఇతురు. ఋక్షద్రుమములచే పీఠము నేర్పరచి ఆ పీఠముపై దేవిని పూజించవలయును. శాల్మలీ కుసుమములచే సిద్ద ద్రవ్యములచే ఒక మాసము నిర్భయముతో శ్మశాన దేశమున పూజించినచో పిశాచములు సిద్ధించును. శత్రువుల పాషాణ వర్షాదుల నుండి కూడా జీవించును. నిర్జనారణ్యమున రాత్రి యందు ఒక మాసము నిర్భయుడై సిద్ధ ద్రవ్య సమన్విత చక్రగతయగు దేవిని మాలతీ జాత "పున్నాగ కేతకీమరు పుష్పములచే పూజించవలయును. ఇట్లు పూజించినచో వేతాలులు సిద్ధించెదరు. వేతాలులనధిరోహించి స్వేచ్ఛగా సంచరించవచ్చును. శ్మశానమున కాని, చండికాలయమున కాని, నిర్జనారణ్యమున కాని మధ్యరాత్రమున కృష్ణ చక్రమున అతికృష్ణయగు దేవిని కృష్ణ వస్త్ర విభూషణములచే కోపావీషుడై పూజించవలయును. ఆదేవి ముందు సాధ్యయోనిని బలిగా ఛేదించి నివేదన చేయవలయును. సిద్ద ద్రవ్య సమేతముగా చేయవలయును. ఇట్లు ఒక మాసము చేయవలయును. సిద్ద ద్రవ్య సమేతముగా చేయవలయును. ఇట్లు ఒక మాసము చేసినచో ఆ దేవీ ఫాలలోచనము నుండి భయంకరులగు కృత్యలు పుట్టెదరు. వారికి సిద్దిని నివేదించవలయును. విశ్వ సంహార సంతుష్టలై మరల నిజేచ్చచే వచ్చి దేవీలలాట నేత్రమున నుందురు. ప్రార్థించినచో తిరోహితులగుదురు. రక్త భూషాంబరా లేపమాలా భూషిత విగ్రహాలై యుందురు. నిర్జనోద్యానమున చక్రమున దేవిని ధ్యానించి పూజించవలయును. కహోర చంపకాశోక పాటల శతపత్రముల చేసి ద్రవ్యసముపేతములచే పూజించినచో ఒక మాసములో మాయలు సిద్ధించును.ఈ మాయా ప్రసాదము వలన నరుడు కామరూపి యగును. విశ్వ విజయీ, విశ్వచారీ, విశ్వ వినోదములు కలవాడగును. షడాధారాబ్ది మధ్యమున చక్రమును ధ్యానించి పూజించవలయును. చన్ల చన్దన కస్తూరీ మృగనాభి మహా దయములచే పూజించవలయును. ఇట్లు చేసిన త్రికాలజ్ఞుడగును. త్రికాలములందు దేవిని చక్కగా ధ్యానించవలయును. పూర్ణ ప్రతీతిలో భవ్యము, వికలమున అభవ్యము చెప్పబడినది. చక్ర సహిత దేవిని భక్తియుతుడై స్మరించవలయును. వివేకా, విభవా, విశ్వా, వితతో, కామినీ, ఖేచరీ, గర్వా, పురాణా, పరమేశ్వరీ, గౌరీ, శివా, అమేయా, విమలా, విజయా, పరా, పవిత్రా, పీడనీ, విద్యా, విశ్వేశీ, శివ వల్లభా, అశేష రూపా, స్వానందా, అంబుజాక్షీ, అనిందితా, వరదా, వాక్యదా, వాణీ, వివిధా, వేద విగ్రహా, విద్యా, వాగేశ్వరీ, సత్యా, సంయుతా, సరస్వతీ, నిర్మలా, ఆనందరూపా, అమృతా, మానదా, పూషా, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశినీ, చంద్రికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ, ప్రీతి, అంగదా, ఈ దేవీ నామములను చులుకసలిలమున స్మరించుచు మాతృకా సహిత, విగ్న, త్రికావృత్తిచే అమృతాత్మిక సారస్వలు జిహ్వను దీపాకారముగా స్మరించుచు తొడిని పానము చేయవలయును. ఒక సంవత్సరములో చతుర్విధ పాండిత్యము కలుగును. ఇట్లు పరిశుద్ధ మనస్కుడై ప్రతినిత్యము చేయువాడు యోగి, బ్రహ్మవిత్తు, జ్ఞానీ, శివయోగి, ఆత్మవిత్ యగును. పైన చెప్పియున్న చక్రముననున్న దేవిని మాతృకా సహితను స్మరించవలయును. ఒక మాసము చంపకములచే నిందీవరములచే పూజించిన ఆరోగ్యము కలుగును. అట్లే జ్వర భూత గ్రహోన్మాద శీత కాకామలాక్షులను హరించును. దంత కర్ణ జ్వర శిరశ్శూల గుల్మాది కుక్షి రోగములు, వ్రణప్రమేహ ఛర్ధి ఆర్శ గ్రహిణి ఆమ త్రిదోషజములు అన్నియూ పరమేశ్వరీ పూజచే శాంతించును. చక్ర నిర్మాణమును కాశ్మీరముచే చేయవలయును. లేదా సిందూరము, గైరికము, లాక్షా, దరదము, చందన ద్వయము వీటిచే కూడా నిర్మించవచ్చును. బిలద్వారమున షోడ శత్త్యస సంయుతమగు త్ర్యసమును లిఖించవలయును. ఈ మధ్యన నున్న పరమేశ్వరిని దరదముచే పూజించవలయును. వారితో వారి శక్తులతో కూడియున్న పరమేశ్వరుని సుగంధము కల సిద్ద ద్రవ్యములచే పూవులచే ఒక మాసము. పూజించినచో పాతాలాది లోకములందు నాగ కన్యాసంయుతుడై చాలా కాలము ఆనందించును. యధావిధిగా యధోదిత కాలమున పూజించుటచే యక్షరాక్షస గంధర్వ సిద్ధ విద్యాధరాంగనలు, పిశాచములు గుహ్యములు, కిన్నరులు, భుజగులు సిద్ధించెదరు. మోదుగు పూవులచే పూజించిన భూషణములు, పాటలములచే పూజించిన గజములు, ఎర్ర కలువల పూజచే అశ్వములు, కుముద పూజచే వాహనములు, ఉత్పల పూజచే ఒంటెలు, తగర పూజచే పశువులు, జంబీరపూజచే మహిషములు, లకుచములచే మేకలు, దాడిమ పూజచే నిధులు, ఇప్పపూల పూజచే గానము, పొగడ పూల పూజచే అంగనలు, కహోర పూజచే పుత్రులు శత పత్ర పూజచే జయము, కేతక పూజచే వాహనములు, సుగంధి పుష్పపూజ చేనిత్య సౌభాగ్యము కలుగును. ఒక మాసము కాని రెండు మూడు మాసములు కానీ లేదా ఫలావాప్తి వరకు కాని శర్కరా ఘృత పాయసములచే సచక్రపరివార సలిల మధ్యగ యగు దేవిని పూజించవలయును. సర్వోపద్రవ శాంతి కొరకు అర్యములచే పుష్పములచే తర్పణము గావించవలయును. సంపూర్ణాయుష్యముకొరకు నేతితో, సౌభాగ్యసిద్ధికి తేనెతో, ఆరోగ్యము కొరకు పాలతో ఐశ్వర్యము కొరకు మూడింటిచే, ప్రీతి కొరకు నాలికేరోదకముచే, నృపాప్తికి చల్లని నీటితో, సర్వార్థ సిద్ధికి జలముచే అభిషేకము గావిచంవలయును. పగలు రాత్రి పూగోద్యానమున సిద్ద ద్రవ్యములచే పూజించవలయును. ఆ ఉద్యానమున నివసించి పుష్పములచే పూజించినచో మన్మథుని వంటి సౌందర్యము కలవాడగును. పూర్ణిమల యందు నియతముగా కన్యక యందు దేవిని అర్చించవలయును. ఇట్లు చేసినచో పరప్రయుక్త కృత్యలు విముఖములై ప్రయోగించిన వారినే సంహరించును. లింగత్రయమయి యగు దేవిని చక్రస్థ శక్తులతో పూజించినచో ఈ లోకమున పరలోకమున సర్వాభీష్టములను పొందును. సుగంధములగు నూరు బంగారు పుష్పములచే ఒక మాసము పూజించినచో పూర్వ జన్మకృత పాపముల నుండి విముక్తి పొందును. నవరత్నములచే ఒక మాసము పూజించినచో సర్వపాపములు నశించి దేవిని కనులారా చూడగలడు. ఒక మాసము సుగంధముగల అంశుకములచే పూజించినచో సకల పాపకృత్యముల నుండి ఇతర దుఃఖ రాశుల నుండి విముక్తి పొందును. తనను తాను దేవీ రూపముగా చక్రమును చుట్టూ శక్తులను భావించుచు సుగంధ పుష్పములచే పూజించుచు తన్మయుడు కావలయును. షోడశాన్విత దేవతా పూజకు ప్రత్యేక క్రమముగా తిధులు నిర్దేశించబడియున్నవి. ఆయా తిధులలో ఆయాదేవతలకు పూజాజపహోమాదుల నాచరించ వలయును. ఘృతము, శర్కర, పాలు, అపూపము, కదలీ ఫలము, తేనె, గుడము, నాలికేర ఫలము, పేలాలు, నువ్వులు, దధి, అటుకులు, శనగలు, పెసలు, పాయసములను నివేదన చేయవలయును. ఈ నివేదన కామేశ్వర్యాది సమస్త శక్తులకు చెప్పబడినది. ఆద్యాలలితను ఇవి అన్నియు అన్నివేళలలో నివేదన చేయవలయును. అగ్నిలో హోమమును గావించవలయును. నరులకు దానము చేయవలయును. ఆయా విద్యాక్షరములచే చెప్పబడిన ఔషధమును ఆయాప్రమాణాను సారముగా మర్దనచేసి గుటీకలుగా చేసుకొని, వాటిని అన్నిటిని సాధించవలయును. ఆదివారమున అరుణాంభోజములచే, సోమవారమున కుముదములచే, మంగళవారమున రక్తాత్పలములచే, బుధవారమున తగరములచే గురువారమున కహ్లారములచే, శుక్రవారమున తెల్లని పద్మములచే, శనివారమున నీలోత్పలముచే స్వేష్ణ దేవతను పూజించవలయును. అట్లు పూజించి ఆదివారము మొదలగు వారములలో క్రమముగా పాయసమును, పాలను, కదలీ ఫలములను, నవనీతమును, శర్కరను, నేతిని నివేదన చేయవలయును. ఇట్లు ఇష్టదేవిని చక్కగా పూజించి గందొదులను అర్పించవలయును. ఇట్లు చేసినచో గ్రహపీడ తొలగి సర్వసుఖముల నందగలడు. అర్థరాత్రి యందు మదనాగ్నిచే తపించు, హరించబడిన హృదయముగల, చేతులు జోడించి శిరస్సున ధరించియున్న, జుట్టు విరబోసుకొని, బెదురు చూపులు గలదై, ఎఱ్ఱని కన్నులు గలదై, గాలిచే ఎగురు గొట్టబడు వస్త్రము గలదై, పద్మసుందరి, వివేకము నశించినదై, మదము గలిగి, మానలజ్ఞా భయములను విడిచియున్న ఇష్టురాలగు స్త్రీని చింతించుచు చక్రమును అర్చించి, చక్రమధ్యమున దిగంబర దేవిని జపాదాడిమ బంధూక కింశుకాది పుష్పములచే పూజించవలయును. అట్లే సుగంధ భరితములగు శేషాలీ పుష్పములచే పూజించవలయును. ఇట్లు ఇరువది యొక్క దినములు చేసినచో ఇష్టసుందరి చింతించిన రూపముతో మదము కలదై వచ్చి తీరును. శరీరపాతము వరకు అతనితోనే యుండును. పాలు పెరుగు తేనె కలిపి రక్త పద్మములచే పూజించినచో సంపదలు కలుగును. ఎట్టి కలువలచే పూజించిన యువతులు వశమగుదురు. సమాన రూపముగల దూడయున్న ఆవుపాలు కలిపిన మల్లికామాలతీ జాతి శతపత్రములచే పూజించినచో కీర్తి, విద్యా, ధనారోగ్య, సౌభాగ్య సంపదలు కలుగును. తేనె కలిపిన అశోక పుష్పములచే పూజించినచో స్వర్ణాదిస్తంభనము, యుద్ధమున కోపించియున్న శత్రు స్తంభనము జరుగును. నేయి కలిసిన ఎఱ్ఱని గన్నేరు పూలచే పూజించినచో రక్తవస్త్రములు, వనితలు, రాజులు మంత్రులు స్వవశమున నుందురు. ఇతను కోరిన ఆభరణ వాహన వాణిజ్య సిద్దులు చేకూరును. అర్థరాత్రమున నూనె కలిపిన ఎఱ్ఱని ఆవాలచే కాని లవణములచే కాని హోమమును గావించిన కోరిన యువతి వచ్చును. రాత్రి మధ్యలో నూనె కలిపిన నల్లని పుష్పములచే పూజించినచో ఒక నెలలో శత్రువునకు జ్వరపీడ కలుగును. నేయి కలిపిన ఆరుపుష్కరములచే కాని తద్బీజములచే కాని రాత్రి హోమము గావించినచో శత్రువులకు వైద్యులు తొలగించలేని దాహవ్రణాదులు సంభవించును. అట్లే ఆ నూనె కలిపిన బీజములచే కాని అంకోలములచే కాని ఆవాలు నేయి కలిపిన మిరియాలచే రాత్రి హోమము చేసినచో తాను కోరిన స్త్రీ కామాతురయై సమీపించును. నేయి కలిపిన బియ్యముచే హోమమును గావించినచో తండుల సమృద్ధి కలుగును. పెసలచే హోమము గావించిన పెసలు, నేతితో కావించిన నేయి లభించును. సాధించ వలసిన వాని నక్షత్ర సంబంధము గల చెట్టు నుండి తీసిన పిండిని పాదరజముతో కలిపి రాజీ మరిచీ లోకోత్తమగు బొమ్మను రాత్రి యందు హోమమును గావించవలయును. పాదములతో, పిక్కలతో, మోకాళ్ళతో, తొడలతో, నాభి క్రింది నుండి, హృదయము నుండి కంఠము వరకు శిరస్సుతో నిశిత శస్త్రముచే ఛేదించి క్రమముగా పన్నెండు విధములుగా హోమము గావించిన నరనారీ నరాధిపులు ఏడు దినములలో వశులగుదురు. సాధకుడు కోరినచో జ్వరము, ఆర్తి కలుగును. బెల్లము కలిపిన పిండిచే, జిలకర్రతో కలిసిన మిరియాలచే బొమ్మను చేసి బొమ్మ హృదయమున సాధ్యనామమును వ్రాసి నామోచ్చారణచే నేతిచో హోమమును చేసి, ఆ బొమ్మను తన కరాగ్రముచే స్పృశించుచు మన్తమును వేయిమార్లు జపించవలయును. ఆ బొమ్మను నేతితో తడిపి చక్కగా పూజించి అదే ధ్యానముచే జపించుచు భక్షించవలయును. ఇట్లు చేసినచో నరనారీ నృపాదులు జీవితాంతము వశులై యుందురు. శక్త్యష్ట గంధమును చల్లని నీటితో చక్కగా కన్యచే మర్ధింప చేసి దానితో ఫాల భాగమున తిలకమును ధరించినచో జగత్తు వశమగును. ప్రస్థ మాత్ర పరిమాణముగల బియ్యమును తీసుకొని కొత్త కుండలో వేసి సమానమగు వర్ణముగల దూడయున్న ఆవుపాలను రెండింతలు ఆ కుండలో నుంచి సంస్కరించిన అగ్నిలో ఉడుకబెట్ట వలయును. నేతితో తడిసిన ఆ ముద్దను శర్కర కలిపి చేతిలోనికి తీసుకొని నూటయెనిమిది మార్లు మంత్రమును జపించి హోమము గావించవలయును. ఇట్లు ప్రతిపత్తున చేసిన హోమము మహాలక్ష్మిని ప్రసాదించును. ఇట్లు ప్రతి శుక్రవారము గావించిన రాజతుల్యుడగును. విశేషించి పంచమినాడు పైన చెప్పిన విధముగా హోమమును గావించవలయును. పంచమినాడు పాలు పెరుగు తేనె కలిపిన మల్లికాదులచే హోమమును చేయవలయును. అన్నముచే నేయిచే హోమమును చేసిన అన్నాడ్యుడగును. కోరిన వస్తువులన్నియూ లభించును. నేతిచే హోమము గావించిననూ, నువ్వులచే తండులములచే గాని హోమమును గావించినచో అభీష్ట వస్తుసిద్ది కలుగును. పాలు పెరుగు తేనె కలిపిన ఎఱ్ఱని పద్మములచే హోమమును నలుబది రోజులు గావించినచో, మహాలక్ష్మిని పొందును. తేనె కలిపిన వేయి కలువలచే నేయికలిపి ప్రతిదినము భక్తిచే హోమమును గావించినచో కీర్తిని ధనమును పుత్రులను పొందును. తేనెతో కలిపిన చంపకములచే వేయి హోమము ఒక మాసము చేసినచో నూరు బంగారు నాణెములు లభించును. నేయి కలిపిన పాటల పుష్పములచే మూడువేలు' హోమము గావించినచో అమావాస్య నుండి నెల దినములలో చిత్ర వస్త్రములను పొందును. కర్పూర చందనాది సుగంధి వస్తువులు లభించును. ఇతర భోగోపయోగులగు వస్తువులు కూడా లభించును. ప్రతి సప్తమి తిధి యందు పాలు కలిపిన బియ్యముచే ఆరునెలలు నూరు హోమమును గావించిన శాలి సమృద్ది కలుగును. నువ్వులతో ఒక సంవత్సరము హోమమును గావించినచో ఆరోగ్యమును పొందును. నిజ నక్షత్రమున మూడు మార్లు దూర్వాహోమము గావించినచో రోగాదులు నశించి మహాభోగములచే నూరు వర్షములు జీవించును. మూడు జన్మ నక్షత్రములందు గుడూచీతిల దూర్వలచే హోమమును గావిచంవలయును. ఇట్లు చేసినచో ఆయు శ్ర్ళీ యశోభోగ పుణ్య నిధ్యాదులు లభించును. ఇట్లు మూడు జన్మ నక్షత్రములలో ఘృత పాయసదుగ్ధములతో హోమము గావించినచో ఆయురారోగ్య వైభములచే రాజమంత్రి తుల్యులగును. ప్రతి సప్తమీన కదలీ హోమము చేసినచో సౌభాగ్యము లభించును. ప్రాదేశ సూత్రములగు మూడు దూర్వలచే పాలు పెరుగు తేనెలు కలిపి నిత్యము సన్నిపాత జ్వరమున్నపుడు హోమమును గావించవలయును. ఆ దినములలో జలమును స్పృశించుచు మంత్రమును జపించవలయును. ఆ జలముచే వేయిమార్లు స్నానమును పానము నాచరించవలయును. పొకాదులను కూడా ఆ జలముతోనే చేసినచో రోగ విముక్తుడగును. సాధ్యనక్షత్ర వృక్ష చూర్ణమును పాలు పెరుగు తేనెలతో కలిపి, ఆవాలు, నువ్వులు పిడి, సాధ్య. పాదరజస్సుతో కూడియున్న దానిచే బొమ్మను చేసి హృదయమున సాధ్యనామమున వ్రాసి నిశితాయుధములచే పైన చెప్పినట్లు ఖండించి హోమమును గావించవలయును. ఇట్లు ఏడుదినములు చేసిన సాధ్యుడు వశ్యుడగును. అటువంటి బొమ్మను కుండ మధ్యమున పాతిపెట్టి, పైన అగ్ని నుంచి మంత్రములో ప్రతినిత్యము హోమమును చేయవయలును. రాత్రిపూట మూడువేలు ఆపాలచే రసముతో కలిపి హోమమును గావించినచో నూరు యోజన దూరముల నుండి కూడా వనితను తీసుకొని వచ్చును. మధు మిశ్రిత కౌశికములచే హోమమును గావించిన స్త్రీని వశము చేయును. నాలికేర ఫలములతో కూడియున్న గుడముచే హోమమును గావించిన లక్ష్మి లభించును. అట్లే నేయి కలిపిన కలువలచే, పాలు కలిసిన ఎర్రకలువలచే, పాలు పెరుగు తేనె కలిపిన చంపకములచే, పొగడ పూవులచే, ఇప్ప పూవులచే హోమము గావించినచో కన్య లభించును. పున్నాగ పుష్పములచే హోమము చేసిన వస్త్రములు, నేతి హోమమున ఇష్టములు మహిష క్షీరహోమమున మహిషములు, అజక్షీర హోమమున అజములు, గవ్యహోమముచే గోవులు రత్నహోమముచే రత్నములు లభించును. వరిపిండితో బొమ్మను చేసి శర్కర కలిపి, హృదయమున నామాక్షరములను వ్రాసి రాత్రిపూట నూనెలో నేతిలో ఉడికించవలయును. దానియందే మనసు నుంచి మంత్రమును జపించుచు భక్షించవలయును. ఇట్లు ఏడు రాత్రులు చేసినచో నరుడు నారి నృపాదులు దాసులవలె వశులై మనసును ప్రాణాదులను అర్పించెదరు. తెల్లని లేదా ఎఱ్ఱని గన్నేరు పూవులచే ఇరువది యొక దినములు హోమమును గావించిన మహా సంపదలను పొందును. పాలు పెరుగు తేనె కలిపి ఛాగ మాంసముతో హోమమును గావించిన బంగారమును పొందును. పాలు కలిపి హోమము గావించి సస్యశ్యామలమగు భూమిని పొందును. మూడు దినములు పద్మాక్షములచే హోమము గావించిన లక్ష్మిని పొందును. మారేడుచే ద శాంశ హోమమును చేయవలయును. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినవాడు మంత్రించిన ములుకోదకములచే పాము కరిచి, మరణించిన వారి ముఖముపై చల్లి బ్రతికించవచ్చును. పాము కరిచి మరణించిన వారి చెవిలో మంత్రమును చదివి కాని, జపసిద్ధమగు దండముచే శిరస్సున కొట్టి లేపవచ్చును. కుండమధ్యమున యోనిని లిఖించి అగ్నిని స్థాపించి యధావిధిగా హోమమును చేయవలయును. నువ్వులు, ఆవాలు, గోధుమలు, బియ్యము, యవలు మొదలగు వాటిచే హోమమును చేయవలయును. పాలు పెరుగు తేనెలు కలిపి ఒక్కొక్క ధాన్యముతో కాని, అన్ని కలిపి కాని సమృద్ధి కొరకు హోమమును చేయవలయును. పొగడ సంపెంగ, పద్మములు, కప్లోరములు, ఎర్రకలువలు, నల్లకలువలు, మల్లికా కుంద మధూకాదులచే హోమము చేసిన లక్ష్మీని పొందును. అశోక పాటల బిల్వజాతి కంకత నవనీలోత్పల కరవీర కర్ణికారపుష్పములచే హోమమున చేసిన లక్ష్మిని సౌభాగ్యమును, నిధిని, ఆయుష్యమును, కీర్తిని పొందును. దూర్వను, గుడూచిని, అశ్వత్తమును, వటమును, ఆరగ్వధమును సితార్క ప్లక్షములచే హోమమును గావించి రోగ విముక్తుడగును. ఇక్షు, జంబూ నాలికేర మోనా గుడసితమిశ్రములచే హోమమును గావించిన స్థిరమగు లక్ష్మిని పొంది సమస్త భోగముల ననుభవించును, నేయి ఆవాలతో హోమమును గావించిన మృత్యువు, కాషాగ్నియందు శత్రుమృత్యువు కలుగును. చతురంగుల పరిమాణముల గల సమిధలచే హోమమును గావించిన శత్రువు యొక్క చతురంగబలము ఏడు దినములలో రోగదుఃఖార్తులు కలిగి నశించును. ప్రతి నిత్యము నిత్యార్చన గావించి ఘృతముచే హోమమును గావించవలయును. విద్యాభిమంత్రిత జలమును ప్రాతః కాలమున త్రాగవలయును. చందనోశీర కర్పూర కస్తూరీ రోచ నాయుతములగు కాశీకాలాగురు కస్తూరీ మిశ్రిత గంధములతో సర్వార్థ సిద్ధి కొరకు పూజించవలయును. ప్రాతః కాలమున మాతృకతో సర్వనిత్యా మంత్రములను మూడుసార్లు జపించి జలపానము గావించిన వాక్సిద్ధి కలుగును. పయోవ్రతము స్వీకరించి పూర్వమువలె వర్ణలక్ష జపము గావించవలయును. పాలు పెరుగు తేనె కలిసిన పద్మముల చే దశాంశము హోమము గావించవలయును. జపతరణ హోమార్చనాభిషేకాదులతో మంత్ర సిద్ధిని పొంది పైన చెప్పబడిన ప్రయోగములను చేయవలయును. అట్లు చేయనిచో ఆ మంత్ర దేవతలు కోపించి ఆ క్షణముననే సాధకుని ప్రాణములను హరింతురు. ఈ విద్యచే సాధ్యము కానిదేదీ ఈ జగత్తున లేదు.

అరణ్యవటమూలే చ పర్వతాగ్రగుహాసు చ

 ఉద్యాన మధ్యకాంతారే మాతృపాదపమూలతః

సింధు తీరే వనే చైనా యక్షిణీ స్సాధయేన్నరః

కమలైః కైరవైః రక్తై స్సితై సౌగంధికోత్పలైః

 సుగంధి శేఫాలికయా త్రిమధ్యకైర్యధావిధి

 హోమాత్సప్తసువారేషు తన్మండలత ఏవ వై

  విజయం సమవాప్నోతి సమరే ద్వంద్వయుద్ధకే

 మల్లయుద్ధే శస్త్రయుద్ధే వాదే ద్యూతాహ్వయేపి చ

   వ్యవహారేషు సర్వత్ర జయమాప్నోతి నిశ్చితమ్

 చతురంగులజైః పుష్పై రోమాత్సంస్తంభయేదరీన్

తధైవ కర్ణికారోతైః పున్నాగోత్త్థేర్నమేరుజైః

 చంపకైః కేతకై రాజవృక్షజై ర్మాధవోద్భవైః

ప్రాగ్వద్ద్వారేషు జుహుయాత్ర్కమాత్పుషైస్తు సప్తభిః

 ప్రోకేషు స్తంభనం శత్రోర్భంగో వా భవతి ధ్రువమ్

శత్రోర్నక్షత్ర వృక్షాగ్నౌ తత్సమిద్భిస్తు హోమతః

 సర్షపాజ్యఘ్రుతాభిస్తే ప్రణమంత్యేవ పాదయోః

 మృత్యుకాష్ఠానలే మృత్యు పత్ర పుష్ప ఫలైరపి

సమిద్భిర్జుహుయాత్సమ్యగ్జారే శార్చనపూర్వకమ్

అంతే శ్చతురంగం తు బలం రోగార్ధితం భవేత్

తేనాస్య విజయో భూయాన్నిధనేనాపి వా పునః

అర్క వారేర్కజై రిఫ్మై సమిధేగ్నౌ తదుద్భవైః

పత్రైః పుష్పైః ఫలైః కాండై ర్మూలైశ్చాపి హులేత్క్రమాత్.

సవర్ణారుణవత్సాయా ఘృత సీకైస్తు మండలాత్

అరాతి దిజ్మఖో భూత్వా కుండే త్ర్యసే విధానతః

పలాయతే వా రోగార్త ప్రణమేద్వా భయాన్వితః

పలాశే ధ్మానలే తస్య పంచాంగై సదతాఫ్టుతైః

 హోమేన సోమవారే చ భావే త్రాగ్వన్న సంశయః

ఖాదిరధ్మానలే తస్య పంచాంగై సదతాప్లుతైః

వారే భౌమస్య హవనాత్తదాప్నోతి సునిశ్చితమ్

 అపామార్గస్య సౌమ్యేహ్ని పిప్పలస్య గురోర్దినే

ఉదుంబరస్య భృగుజే శమ్యా మాందేహ్ని గోఘృతైః

 శుభ్రపీతసితశ్యామ వర్ణాద్యాః పూర్వవత్తధా

 తత్ఫలం సమవాప్నోతి తత్సమిద్దీపితే_నలే

 ప్రతిపత్తిధిమారభ్య పంచమ్యంతం క్రమేణ వై

శాలీ చణకముదైశ్చ యపమాషైశ్చ హోమతః

 మాహిషాజ్యప్లుతెస్తాభి స్తిథిభి స్సమవాప్నుయాత్

షష్ట్యాది సప్తమ్యంతం చొజా భవఘృతైథా

ప్రాగుకై ర్నిస్తుపై మాత్రాగుక్త ఫలమాప్నుయాత్

 తదూర్థ్వం పంచకేల్వేలైస్సమగైశ్చ తిలద్వయైః

సీతాన్నై: పాయసైస్సికై రావికైస్తు ఘృతైస్తథా

హవనాత్త దవాప్నోతి యదాదౌ ఫలమిరితమ్

ఏవం నక్షత్ర వృక్షోళ వహ్నౌ తెసైర్మధుఫుతైః

హవనాదపి తత్ర్పాప్తిర్భవత్యేవ నసంశయః

 విద్యాం సంసాధ్య పూర్వం తు పశ్చాదుజ్ఞానశేషతః

ప్రయోగాన్సాధయేఢీమాన్మంగతాయాః ప్రసాదతః

 సంపూజ్య దేవతాం విప్ర కుమారీం కన్యకాం తు వాడ

స శుభావయవాల ముగ్ధాం స్నాతాం ధౌతాంబరాం శుభామ్

 తధావిధం కుమారం వా సంస్థాప్యాభ్యర్చ్యవిద్యయా

 స్పష్టశీర్ఘ జపేద్విద్యాం శతవారం తధార్చయేత్

ప్రసూనైరరుణ్ణి శ్శుభై సౌరభాడ్యై రథాపివా

 దద్యాదుగ్గులుధూపం చ యావత్కర్మావసానకమ్

తతో దేవ్యా సమావిషే తస్మిన్సంపూజ్య భక్తితః

తతస్తానుపచారైసైః ప్రాగుకైర్విద్యయా ప్రతీ

ప్రజపంస్తాం తతః పృచ్ఛేదభీష్టం కధయేచ్చ సా

భూతం భవద్భవిష్యం చ యదన్యన్మనసి స్థితమ్

జన్మానరాణ్యతీతాని సర్వం సా పూజితా వదేత్

 తతస్తాం ప్రాగ్వదభ్యర్య స్వాత్మన్యుద్వాస్యతాం జపేత్

 సహస్రవారం స్థిరధీః పూర్ణాత్మా విచరేత్సుఖీ

 మధుర త్రయ సంసీకై రరుణే రంబుజై శ్రియమ్

 ప్రాప్నోతి మండలం హోమాన్ సితై సైశ్చ మహద్యశః

క్షాద్రాకైరుత్పలైరక్టెర్షవనాత్రోక్తకాలతః

సువర్ణం సమవాప్నోతి నిధిం వా వసుధాం తు వా

 క్షీరాకైః కైరవైర్హామాత్రోక్తం కామమవాప్నుయాత్

 ధాన్యాని వివిధాన్యాశు సుభగస్స భవేన్నరః

 ఆజ్యాకైరుత్పలైర్ధో మాద్వాంఛితం సమవాప్నుయాత్

 తదక్తైరపి కహ్లరైర్హవనాద్రాజవల్లభః

పలాశ పు స్త్రీస్వాదుయుకై స్తత్కాలహోమతః

 చతుర్విధం తు పాండిత్యం భవత్యేవ న సంశయః

 లాజై స్త్రీ మధురోపేతై స్తత్కాల హనేన వై

కన్యకాం లభతే పత్నీం సమస్తగుణసంయుతామ్

నాలికేర ఫలక్షదం ససితం సగుడం తు వా

ద్రాక్షం జుహుయాత్తద్వదయాత్నాద్ధన దోపమ:

త ధైవాన్నాజ్యహోమేన స తందులతిలైరపి

 సితైః ప్రసూనైరాక్సిద్ధిం హవనాత్సమవాప్నుయాత్

సితరకై సుమిలితై రాయురారోగ్య మాప్నుయాత్

దూర్వాత్రికై క్రిమధ్వకై ర్ఘవనాత్తు జయేచ్చతాన్

 తథా గుడూచ్యాహోమేన పాయసేన తిలేన చ శ్రీ

 ఖండ పంక కర్పూర మిలితై శ్శత పత్రకైః

 హవనాఛ్ఛినుమాప్నోతి యా వదన్వయగా భవేత్

కుంకుమం హిమతోయేన పిష్ట్వా కర్పూర సంయుతమ్

 తత్సంకమర్ధితై రోమాత్కఫ్లోరైర్వికచైస్సమైః

రాజకల్పయా భూయావేద్వర్షశతంభువి

నిస్సపతో నిరాతంకో నిర్ద్వందో నిర్మలావయః

ఇక్షుకొండస్య శకలైర్హవనాద్వస్త్ర మాప్నుయాత్

తధైవ కరవీరోతై ప్రసూనైరరుణ్ణి సితైః కాద్రాకై

 పాటిలా పుషైర్హవనాద్వశయేద్వధూః

 తథైవ పంకజైర్ఘమాద్రూపొజీవాం వశం నయేత్

సరూపవత్సా సితగో క్షీరాక్షసిత హోమతః

లభతే నుపమాం లక్ష్మీ మపి పాపిష్టచేతనః

 సౌవీరాకైస్తు కార్పాస బీజస్తత్కాలహోమతః

 అర్దేష్ణుకుండే నియతం వశగా పవో మునే

అరిష్టపత్రిస్తద్బీజై సద్వహ్నౌతెస్తధా హుతైః

మృత్యుబీజైర్నింబతైలసిక్లెర్టోమాన్నిహంతి

తాన్ రోగార్తాం స్తురగాంస్తద్వత్పంచ గవ్యైతైర్రువమ్

 అక్షబీజైసు తైలాక్తైర్హోమ స్సర్వ వినాశనః

కరంజబీజై స్సంసిస్తే మాద్వైరీ పిశాచవాన్

 తధైవాక్షతరూద్భూతపంచాంగహవనాదపి

నింబతైలాన్వితై రక్షద్రుమబీజై సుహోమతః

 తద్దినే స్యాదపస్మారీ వైరీ భవతి నిశ్చితమ్

అంతేర్జన్మ నక్షత్ర వృక్షంధనగతే నలే

 తద్యోనిపిశితై సైశ్చ హవనన్మృత్యు కృత్రిపోః

 పద్మాక్షభీజైస్పర్షప తైలాకై ర్హవనాత్తధా

జాయనే వైరిణః కుష్ఠరోగాదేహవిలోపకాః

మరీచైస్సర్షపై రోమాతో తైలాకైర్మధ్యరాజకే

 దాహజ్వరేణ గ్రస్తస్యాదరాతి సద్దినే ధ్రువమ్

 ఏవం నిగ్రహ హోమేషు స్వరక్షాయై తధాన్వహమ్

 స్నిగ్గే సంప్రాప్తసద్విద్యైర్జపహోమాది కారయేత్

 మృత్యుంజయేన వాతత్త త్రయోగా స్థాభిరేవవా

 విద్యాభి రన్యధాసిద్ధ మంత్ర మస్యాను నాశయేత్

లక్షత్రయం కృతే ప్రోక్తం త్రేతాయాం ద్విగుణం తథా

 ద్వాపరే త్రిగుణం ప్రోక్తం కరౌ తత్తు చతుర్గుణమ్

దశాంశం హవనం కార్యం తర్పణం తద్దశాంశతః

తద్దశాంశం మార్జనం స్యాద్దశాంశం ద్విజ భోజనమ్

 ఏవం క్రమేణ సర్వాసాం యాయా సంఖ్యా జపస్యసా

 కార్యా సిద్యై తు విద్యాయా స్తతః కుర్యాత్పయోగకాన్

ద్విగుణో హి జపః కార్య: కామేశ్వర్యా మునీశ్వర

సిద్దే మంత్ర ప్రయోగాస్తు విదధీత యథా

తథా జపో లక్షం సమాఖ్యాతో హోమాదిస్తద్దశాంశతః

 కర్తవ్యో భగమాలాయా విద్యా సిద్ధ్యే మునీశ్వర

నిత్యక్లిన్నా జపః ప్రోక్తో లక్షం హోమో దశాంశతః

 కార్యస్సిద్యై తు విద్యాయాః ప్రయోగాత్సాధకోత్తమః

తతో మౌనీ పయోభక్షః ప్రజపేన్నవలక్షకమ్

 భేరుండా మంత్రముక్తం తు శేషం కుర్యాత్ర యత్నతః

 లక్షత్రయం జపోవహ్నివాసిన్యా స్సముదీరితః

 అన్యత్సర్వం పురావచ్చ కార్యం సాధకసత్తమైః

మహావజ్రేశ్వరీ విద్యా జపో లక్షత్రమో మతః

హవనాది దశాంశేన కార్యం ప్రోక్తకమేణ హి

అతండ్రితో జపేల్లక్షమితం దూతీ మనుం మునే

 తద్దశాంశక్రమేణేవ హోమాది ప్రోక్తమార్గతః

త్వరితాం ప్రజపేల్లక్షప్రమితాం తద్దశాంశతః

కృత్వా హోమాదికం సర్వం విద్యాసిధ్యై మునీశ్వర

 జపో లక్షం సమాఖ్యాతో హోమాదిస్తద్దశాంశతః

 విద్యాయాః కులసుందర్యా కర్తవ్యో ద్విజసత్తమ

నిత్యా నిత్యా జపో విప్ర త్రిలక్షప్రమితో మతః

హోమాదిస్తద్దశాంశేన కార్యప్రోక్త విధానతః

 త్రిపంచాశల్లక్షముక్తి నియమేన మునీశ్వర

జపో నిత్యపతాకాయా హోమాదిస్తద్దశాంశతః

విజయాయాః జపః ప్రోక్తో లక్షమానేన నారద 

 అన్యత్పూర్వవదాఖ్యాతం విద్యాసిద్యై తు సాధనమ్

దస్త్రలక్షప్రమాణేన సర్వమంగలికాం జపేత్

తద్దశాంశక్రమేణేవ హోమాది సముదీరితమ్

 అష్టలక్షం హవిష్యాశీ జ్వాలామాలినికాం జపేత్

 హోమాదిస్తద్దశాంశేన ప్రోకద్రవ్యైస్సమీరితః

చిత్రాయ భూప లక్షం తు జపో హోమాదికస్తతః

ప్రోక్తేన విధినా కార్యో విద్యాసిడ్యై మునీశ్వర

 ఏతత్సంక్షేపతః ప్రోక్తం నిత్యా పటలసూచితః

 జ్ఞాతవ్యం సర్వమేవాత్ర యన్తసాధనపూర్వకమ్

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే నిత్యా పటల కథనం నామ నవతి తమోధ్యాయః.

అరణ్యమున మజ్జిచెట్టు మూలమున, పర్వతాగ్రమున గుహలలో ఉద్యాన మధ్య భాగమున, కాంతారమున, మాతృ పాదప మూలమున, నదీ తీరమున, వనమున, ఈ యక్షిణీ విద్యలను సాధించవలయును. కమలములచే, ఎట్టకలువలచే, తెల్లని సౌగంధికా పుష్పములచే, కలువలచే, సుగంధిశేఫాలికా పుష్పములచే పొలుపెరుగుతేనే కలిపి యథావిధిగా ఏడు వారములు కాని, నలుబది రోజులు కాని హోమమును చేసినచో యుద్ధమున విజయమును పొందును. మల్లయుద్దమున, ద్వంద్వ యుద్ధమున, వాదమున, ద్యూతమున, సర్వ వ్యవహారములలో విజయమును పొంది తీరును. చతురంగుల పుష్పములచే హోమమును గావించి శత్రుస్తంభనము చేయగలడు. అట్లే కర్ణికార పున్నాగమేరు చంపకకైతక రాజవృక్ష మాధవ పుష్ప సప్తకముచే ద్వారములందు యథా పూర్వకముగా హోమము చేసినచో శత్రు స్తంభనము కాని శత్రు భంగముకాని జరుగును. శత్రు నక్షత్ర వృక్షాన్ని యందే ఆ సమిధలచే ఆవాలు నెయ్యి కలిపి హోమమును గావించినచో శత్రువు పాదాక్రాంతుడగును. మృత్యుకాష్టాన్ని యందు నుృత్యుపత్ర పుష్పములచే, సమిధలచే ద్వారే శార్చన పూర్వకముగా హోమమును గావించిన శత్రువుల చతురంగ బలము రోగ పీడితమగును. దానిచే సాధకునికి జయము లభించును. లేదా శత్రు సంహారముచే కూడా విజయము లభించును. ఆదివారమున జిల్లేడు కట్టెలతో బాగుగా మండుచున్న అగ్నియందు జిల్లేడు సమిధలచే పత్రపుష్ప ఫలకాండములతో సమాన వర్ణములు గల దూడయున్న ఆవునెయ్యిచే తడిపి నలుబదిరోజులు త్ర్యస్త్రమండలమున యధావిధిగా శత్రుదిక్కున ముఖముచేసి హోమము గావించినచో రోగార్తుడై పలాయనము గావించును. భయారుడై పాదాక్రాంతుడగును. సోమవారమున మోదుగు కాష్ఠముచే చక్కగా మండుచున్న అగ్నిలో మోదుగు సమిధలచే పత్ర పుష్ప ఫలకొండములచే నేతితో తడిపి హోమము గావించినచో పైన చెప్పిన ఫలము సంభవించును. మంగళవారమున చంద్రకాష్ఠములలో మండించిన అగ్నిలో నేయికలిపిన చండ్ర సమిధలచే పత్రపుష్ప ఫలకాండములచే హోమమును గావించిన పూర్వోక్తఫలము లభించును. బుధవారమున అపామార్గ కాషాగ్నిలో, గురువారమున రాగికట్టెల అగ్నిలో, శుక్రవారము మేడి కట్టెల అగ్నిలో, శనివారము జమ్మి కట్టెల అగ్నిలో నేయి కలిపిన శుభ్రపీత సీత శ్యామ వర్ణములు కల ఆయా సమిత్ పత్ర పుష్ప ఫలకొండములచే హోమమును గావించిన పూర్వోక్త ఫలము లభించును. ప్రతిపత్తి నుండి పంచమి వరకు క్రమముగా జాలీ చణక ముద్దయవ మాషలచే మాహిష ఘృతము కలిపి హోమమును గావించినచో పూర్వోక్త ఫలములను పొందును. షష్టి నుండి సప్తమి వరకు మేక నెయ్యి కలిపిన ప్రాగుక్త ద్రవ్యములచే హోమమును గావించిన పూర్వోక్త ఫలము లభించును. ఆ తరువాత, అయిదు తిధులలో పైన చెప్పబడిన ద్రవ్యములచే తిలద్వయముచే, సీతాన్నములచే, పాయసములచే మేక నేతితో హోమమును గావించినచో పూర్వోక్త ఫలమును పొందును. ఇట్లే నక్షత్ర వృక్షముల నుండి పుట్టిన అగ్నిలో నేయిలో కలిపిన ద్రవ్యములచే హోమమును గావించిననూ పూర్వోక్త ఫలము లభించును. మొదట విద్యను సాధించి తరువాత మంగళానుగ్రహముతో సమస్త ప్రయోగములను సాధించవలయును. దేవతను కాని బ్రాహ్మణకుమారిని కాని, కన్యకనుకాని శుభావయవములు కలిగి ముగ్ధయై స్నాత దౌతాంబర శుభకరియగుదానిని కాని ఇట్టి కుమారుని కాని స్థాపించి విద్యచే పూజించి, శిరస్సును స్పృశించుచు మంత్రమును నూరుమార్లు జపించి పూజించవలయును. ఎట్టని తెల్లని గంధము గల పూవులతో పూజించవలయును. కర్మపూర్తి యగువరకు గుగులు ధూపమును వేయవలయును. అపుడు దేవి ఆవేశించియున్న కుమారునీ లేదా కుమారిని భక్తితో చక్కగా పూజించి పూర్వోక్త షోడచాశోపచారములచే సేవించి మంత్రజపమును చేయుచు తన అభీష్టమును అడుగవలయును. ఆమె అభీష్టములను భూత భవిష్యద్వర్తమానములను మనసులోనున్న సమస్త విషయములను జన్మాంతర విషయములను కూడా చెప్పును. తరువాత మరల ఆ దేవిని పూర్వోక్తముగా పూజించి తనలో ఉద్వాసన చేసి మంత్రమును జపించవలయును. ఇట్లు వేయిమార్లు జయించి స్థిరబుద్ధి కలవాడై పూర్ణాత్ముడై సుఖము కలవాడై విహరించవలయును. పాలు, పెరుగు, తేనె కలిపిన ఎఱ్ఱని పద్మములచే నలుబది రోజులు హోమము గావించిన సంపదను, తెల్లని పద్మములచే చేసిన కీర్తిని పొందును. తేనె కలిపిన ఎఱ్ఱని కలువలచే హోమమును గావించినచో బంగారమును కొని నీధిని కాని భూమిని కొని పొందును. పాలు కలిపిన కలువలచే హోమమును గావించిన కోరినవి లభించును. ధాన్యములను పొందును. సౌందర్యవంతుడగుసు. నేయి కలిపిన కలువల హోమముచే కోరిన దానిని పొందును. నేయి కలిపిన ఎఱ్ఱని కలువల హోమముచే రాజప్రియుడగును. పాలు, పెరుగు, తేన్డే కలిపిన మోదుగు పూవుల హోమముచే చతుర్విధ పాండిత్యమును పొందును. పాలు, పెరుగు, తేనె కలిపిన పేలాల హోమముచే సమస్త గుణ సంపూర్ణయగు కన్యను భార్యగా పొందును. బెల్లముకాని శర్కరకాని కలిపిన నాలికేర ఫలక్షదముచే హోమమును గావించినచో యత్నరహితముగనే కుబేరు డంతటి ధనవంతుడగును. నేయి కలిపిన అన్నముతో, బియ్యము కలిపిన నువ్వులతో, ఎర్రని పూవులచే, ఎర్రగన్నేరు పూవులచే, తెల్లగన్నేరు పూవులచే హోమము చేసినచో వాక్సిద్ధి కలుగును. తెల్లని ఎర్రని పూవులను కలిపి హోమము చేసినచో ఆయురారోగ్యములు లభించును. పాలు పెరుగు తేనె కలిపిన దూర్వాత్రయముచే హోమము చేసిన శత్రుజయము లభించును. గుడూచీ హోమముచే పాయసముచే, తిలలచే, శ్రీ ఖండ పంక కర్పూర మిలితములైన శతపత్రములచే హోమమును చేసిన సంపదను పొందును. వంశ పారంపర్యముగా స్థిరముగా నుండును. కర్పూర సంయుతమగు కుంకుంమను హిమతోయముచే మర్థించి ఆ పంకముచే, వికసించిన కలువలచే హోమము చేసినచో రాజంతటి వాడగును. సంపదలతో తులతూగును. నూరు సంవత్సరములు జీవించును. శత్రు రహితముగా, ఆపదహితముగా, సాటిలేనివాడై, పరిశుద్దమనస్కుడై యుండును. ఇక్షుకాండ శకల హోమముచే వస్త్రములను పొందును. అట్లే ఎర్రని తెల్లని గన్నేరు పూలచే కాని, తేనెతో కలిపిన పాటల పుష్పములచే హోమమును గావించిన స్త్రీలు వశ్యులగుదురు. అట్లే పద్మ హోమముచే వేశ్యలు వశ్యులగుదురు. సమాన రూపము గల దూడయున్న నల్లని ఆవుపాలలో శర్కర కలిపి హోమమును చేసినచో పాపస్వభావము కలవాడైనను సాటిలేని సంపదను పొందును. సౌవీరముచే కలిపిన పత్తి గింజలచే హోమముగావించిన శత్రువులు వశ్యులగుదురు. అరిష్ట పత్రములచే కాని, బీజములచే కాని అరిష్టాగ్నిలో మృత్యుబీజములచే నింబతైల సిక్తముగా హోమమును గావించిన శత్రునాశము జరిగి తీరును. పంచ గవ్య హోమముచే రోగార్త తురగములు ఆరోగ్యమును పొందును. నూనె కలిపిన అక్షబీజములచే హోమమును గావించిన సర్వవినాశము జరుగును. చక్కగా తడిపిన కరంజ బీజములచే హోమమును గావించిన శత్రువు పిశాచగ్రస్తుడగును. అక్షతరుజన్యములను పత్రపుష్ప ఫలకాండ సమిధలచే హోమము గావించిననూ పూర్వోక్త ఫలము లభించును. నింబతైలము కలిపిన అక్షద్రుమబీజములచే హోమము గావించిన శత్రువు అదే దినమున అపస్మారమును పొందును. శత్రు జన్మ నక్షత్ర వృక్ష సమిధలచే ప్రజ్వరిల్లిన అగ్నిలో అదే వృక్షము యొక్క పంచాగములచే హోమము గావించిన శత్రువు మరణించును; ఆవాల నూనె కలిపిన తామర పూసలచే హోమమును గావించినచో శత్రువులు కుష్ఠరోగగ్రస్తులై దేహలోపము గల వారగుదురు. మిరియాల ఆవాలచే నూనెలో కలిపి హోమము గావించినచో ఆదే దినమున శత్రువు దాహ జ్వరగ్రస్తుడగును. ఇట్లు శత్రునిగ్రహము కొరకు చేయు హోమములందు, తన రక్షణ కొరకు ప్రతి దినము భక్తియుతుడై సద్విద్యలచే జప హోమాదుల నాచరించవలయును. మృత్యుంజయ మంత్రముచే కాని ఆయా ప్రయోగములందుండు విద్యలచే ఇతని అన్యధా సిద్దమంత్రమును వెంటనే నశింప చేయును. కృతయుగమున మూడులక్షలు జపము గావించిన మంత్రసిద్ది లభించును. త్రేతాయుగమున రెట్టింపు చేయవలయును. ద్వాపరయుగమున మూడురెట్లు, కలియుగమున నాలుగురెట్లు చేయవలయును. దశాంశము హోమము, తద్దశాంశము బ్రాహ్మణ భోజనము గావించవలయును. ఈ క్రమముచే అన్ని విద్యలకు చెప్పబడిన సంఖ్యానుసారముగా జపమునుచేసి మంత్రసిద్ధిని పొంది తరువాత ప్రయోగాదులను చేయవలయును. కామేశ్వరీ జపము రెండితలు చేయవలయును. మంత్రసిద్ధి జరిగిన తరువాత ప్రయోగాదులను చేయవలయును. భగమాలా మంత్రమును లక్ష జపించి దశాంశము హోమమును చేయవలయును. నిత్యక్లిన్నా జపము లక్ష దశాంశము హోమమును చేయవలయును. తరువాత ప్రయోగములను చేయవలయును. భేరుండ మంత్రమును మౌనముతో క్షీరపానము మాత్రము చేయుంచు తొమ్మిది లక్షలు జపమును చేయవలయును. తరువాత మిగిలిన వాటిని చేయవలయును. వహ్ని వాసినికి మూడు లక్షలు జపము చేయవలయును. మిగిలిన దంతయు యధా పూర్వముగా చేయవలయును. మహావజ్రేశ్వరీ విద్యాజపమును మూడులక్షలు చేయవలయును. యధోక్త క్రమముగా దశాంశమును హోమము చేయవలయును. దూతీమంత్రమును లక్ష జపించవలయును. దశాంశ క్రమముగా హోమాదులు చేయ వలయును. త్వరితా మంత్రమును లక్ష జపించవలయును; విద్యాసిద్దికి హోమాదికమును చేయవలయును. కులసుందరీ మంత్రమునకు లక్ష జపము దశాంశము హోమాదులను చేయవలయును. నిత్యానిత్యా జపము మూడు లక్షలు దశాంశము హోమాదులు చెప్పబడినవి. నిత్యపతాకా మంత్రజపము యాబది మూడులక్షలు జపము దశాంశము, హోమాదులు గావించవలయును. విజయాజపముమూడు లక్షలు, సర్వమంగలకా జపము ముప్పది రెండు లక్షలు, జ్వాలామాలిని మంత్రమునకు ఎనిమిది లక్షల జపము యధోక్త ద్రవ్యములచే దశాంశ హోమమును గావించవలయును. చిత్రా మంత్రమునకు పదునారు లక్షల జపము దశాంశ హోమాదులు చేయవలయును. ఇట్లు నిత్యోపటంమును మొదటి నుండి చివరి వరకు సంక్షేపముగా చెప్పితిని. ఇచట అంతయూ యంత్ర సాధన పూర్వకముగా చేయవలయును అని తెలియవలయు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగ మున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున నిత్యాపటలకథనమను తొంబదియ -  అధ్యాయము సమాప్తము.