నారద మహా పురాణము
57 - సంక్షిప్త ఛందోవర్ణనమ్
సనందన ఉవాచ :-
వైదికం లౌకికం చాపి ఛందో ద్వివిధముచ్యతే।
మాత్రావర్ణవిభేదేన తచ్చాపి ద్వివిధం పునః॥
మయౌ రసౌ తతౌ భనౌ గురుర్లఘురపి ద్విజ।
కారణం ఛందసి ప్రోక్తాశ్ఛన్షశాస్త్ర విశారదైః॥
సర్వగో మగణః ప్రోక్తో ముఖలో యగణప్స్మృతః।
మధ్యలో రగణ శ్చైవ ప్రాంత్యగస్సగణో మతః॥
తగణాన్తలఘుః ఖ్యాతో మధ్యగో జో భ ఆదిగః।
త్రిలఘుర్నగణః ప్రోక్తస్రికా వర్మగణా మునే॥
చతుర్ణాస్తు గణాః పంచ ప్రోక్తా ఆర్యాది సంమతాః।
సంయోగశ్చ విసర్గశ్చానుస్వారో లఘుతః పరః॥
లఘార్టీరత్వమాఖ్యాతి దీర్ఘగో లోలఘుర్మతః।
పాదశ్చతుర్ధభాగస్సాద్విచ్ఛేదో యతిరుచ్యతే॥
సమమర్ధసమం వృత్తం విషమం చాపి నారద !
తుల్యలక్షణతః పాదచతుష్కే సమముచ్యతే॥
ఆదిత్రికే ద్విచతుర్రే సమమర్థపమం తతమ్।
లక్ష్మభిన్నం యస్య పాదచతు విషమం హి తత్ ॥
ఏకాక్షరాత్సమారభ్య వర్ణాకైకస్య వృద్ధితః।
షడ్వింశత్యక్షరం యావత్పాదస్తావత్పృథక్ఫృథక్॥
తత్పరం చండవృష్ట్యాదిదండకాః పరికల్పితాః।
త్రిభిషడ్భిః పదైర్గాథాః శృణు పంజ్ఞా యథోత్తరమ్॥
ఉత్తాత్యుక్తా తథా మధ్య ప్రతిష్టా న్యాసపూర్వికా।
గాయత్ర్యుష్ణగనుష్టుప్పు బృహతీ పంక్తి రేవ చ॥
త్రిష్ణుపు జగతీచైవ తథాతిజగతీ మతా।
శక్వరీ సాతిపూర్వా చ ఆష్యత్యష్టీ తతస్స్మృతే॥
ధృతిశ్చ విధృతి శ్చైవ వృతిః ప్రకృతిరాకృతిః।
వికృతిప్సంకృతిశ్చవ తధాతికృతిరుత్కృతి।
ఇత్యేతా ఛందసాం సంజ్ఞా ప్రస్తారాద్భేదభాగికాః।
పాదే పర్వగురౌ పూర్వా ల్లఘుం స్థాప్య గురోరధః॥
యథోపరి తథా శేషమగ్రే ప్రాగ్వన్య సేదపి।
ఏష ప్రస్తార ఉదితః యావత్సర్వలఘుర్భవేత్॥
నష్టాంకాగ్ధ సమేలస్యాద్విషమే సైవ సోర్ధ్వగః।
ఉద్దిషే ద్విగుణా నాద్యాదంగాన్నంమీల్య అస్థితాన్॥
కృత్వా సైకాన్వదేత్సంఖ్యామితి ప్రాహుః పురావీదః।
వర్ణాన్సెనానృత్తభవానుత్తరాధరతస్థ్సితాన్॥
ఏకాది క్రమల శ్చైకానుపర్యుపరి విన్య సేత్।
ఉపాంత్యతో నివర్గీత త్యజన్నే కైకమూర్థ్వతః॥
ఉపర్యాద్యాద్దురోరేవమేకద్వ్యాదిలగాక్రియా।
లగక్రియాంకసందోహే భవేత్సంఖ్యావిశ్రితే॥
ఉద్దిష్టాంకసమాహారస్స్తైకో వా జనయేదిమామ్।
సంఖ్యేవ ద్విగుణైకోనా సద్భిరధ్వా ప్రకీర్తితః॥
ఇత్యేతత్కించిదాఖ్యాతం లక్షణం ఛందసాం మునే।
ప్రస్తారోక్తప్రభేదానాం నామానన్త్యం ప్రగాహతే॥
ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే సంక్షిప్తఛందోవర్ణనం నామ సప్తపంచాశత్త మోధ్యాయః॥
సనందన మహర్షి పలికెను :-
ఓ నారద మహామునీ! ఛందస్సు వైదికము, లౌకికము అని రెండు విధములు. ఈ రెండు విధముల చందస్సు మాత్రా, వర్ణము అను భేదముచే మరల రెండు విధములు. ఛందశ్శాస్త్ర విశారదులు మగణము, యగణము, రగణము, సగణము, తగణము, జగణము, భగణము, నగణము అని ఎనిమిది గణములు. గురువు లఘువులు ఛందశ్శాస్త్రమునకు కారణములు అని చెప్పిరి. మూడు గురువులు కలది మగణము. ఆది లఘువు యగణము. మధ్యలఘువు రగణము, అంత్యగురువు సగణము, అంత్యలఘువు తగణము, మధ్యగురువు జగణము, ఆది గురువు భగణము, మూడు లఘువులు కలది నగణము. ఒక్కొక్క గణమున మూడు వర్ణములుండును. నాలుగు లఘువులుకలగణములు అయిదున్నవి ఆర్యాదిసమ్మతములు. సంయోగముకొని, విసర్గలు కాని, అనుస్వారము కాని లఘువు తరువాత ఉన్నచో ఆ లఘువు. ల అనగా లఘువు. శ్లోకములోని నాలుగవభాగమును పాదమందురు. వచ్చేదమును యతి అందురు. వృత్తములు సమము, అర్థసమము, విషమము అని మూడు విధములు. నాలుగు పాదములు ఒకే లక్షణముతో నున్నయెడల సమవృత్తమందురు. మొదటి మూడవపాదములు, రెండవ నాలుగవ పాదములు ఒకేవిధముగా నున్నచో అర్థసమమందురు. ప్రతిపోదము వేరు వేరు లక్షణములు కలిగియున్నచో విషమవృత్తమందురు. ఒక అక్షరము నుండి మొదలిడి ఒక్కొక్క అక్షరమును పెంచుచు ఇరువదియార్డు అక్షరముల వరకు పొదములు విడివిడిగా ఉండును. తరువాత చండవృష్టి మొదలగు దండదండకములు చెప్పబడినవి. మూడు ఆరు పాదములచే గాధలు చెప్పబడినవి. ఇపుడు వరుసగా ఆ ఛందస్సు పేర్లను చెప్పెదను వినుము. ఉక్త, అత్యుక్తా, మధ్యా, ప్రతిషా, సుప్రతిష్ఠ, గాయత్రీ, ఉషైక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్ణుప్, జగతీ, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్ట, అత్యష్టా, ధృతి, విధృతి,కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంస్క స్కృతి, అతిక్పతి, ఉత్కృతి అని ఛందస్సు లకు సంజలు ప్రసారమును బటి భేదమును పొందినవి. అన్నిగురువులు కల పొదమును తీసుకొని మొదటి నుండి గురువు క్రింద లఘువును నుంచవలయును. పైన చేసినట్లే ముందు కూడా మొదటి వలె నుంచవలయును. దీనినే ప్రస్తారమందురు. ఈ ప్రస్తారము అన్ని లఘువులు వచ్చేవరకు చేయవలయును. ప్రస్తారమున గురువునకు = చిహ్నముండును. లఘువునకు చిహ్నముండును. నష్టాలకార్డ సమమున లఘువుండును. విషమమున అదియే ఊర్ధ్వగమగును. ఉద్దిష్టమున మొదటినుండి రెట్టింపుగా అంకములను తీసుకొని లఘువులలో ఉన్నవాటిని కలిపి ఆరెంటిని ఒకటిచేసి సంఖ్యను చెప్పవలయును అని ప్రాచీనజ్ఞులు చెప్పేదరు. ఉత్తరాధరములుగా నున్న, వృత్తముల నుండి పుట్టిన వర్ణములను ఒకటి మొదలుకొని వరుసగా ఒక్కొక్కదొని ఉపరిభాగమున ఉంచవలయును. చివరిదానీ సమీపమున ఆపవలయును. పై నుండి ఒక్కొక్క దానిని విడిచి పెట్టవలయును. పై భాగమున మొదటి గురువునుండి ఒకటి రెండు మొదలగు లగక్రియలను చేయవలయును. అనగా లఘువు గురువులను ఉంచవలయును. లగక్రియాంక సందోహమును కలిపినచో సంఖ్యయగును. ఉద్దిష్ణాంకము కాని, సమాహారము కాని, సైకము కాని ఈక్రియను కలిగించును. సంఖ్యయే ద్విగుణము, ఏకోనము అగును. అని సత్పురుషులు ఛందోమార్గమును బోధించిరి ఇట్లు కొంచెము ఛందస్సుల లక్షణమును చెప్పితిని. ప్రస్తారమున చెప్పబడిన భేదములకు అంతములేదని చెప్పబడినది.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున సంక్షిప్త ఛందోవర్ణనమను యాబయేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 58 of the Nārada Mahā Purana is as follows:
ఆకాశంలో ప్రసరించే నవగ్రహముల నిజమైన స్థానములను గణించే గ్రహస్ఫుట పరిలేఖన విధానము ఈ అధ్యాయంలో నిరూపించబడినది. గ్రహముల మంద ఉచ్ఛ నీచ స్థానములు మరియు విక్రమాది గతుల గణన శాస్త్రం ఇక్కడ సుస్పష్టంగా వర్ణించబడినది.