1 – ఉత్తరార్థము: ద్వాదశీమహాత్మ్యవర్ణనమ్

శ్రీ గణేశాయనమః శ్రీ కృష్ణాయనమః

పాంతు వో జలద శ్యామాః శార్జ జ్యాఘాతకర్కశాః

త్రైలోక్యమండపస్తంభా శ్చత్వారో హరిబాహవః

సురాసుర శిరోరత్న నిఘృష్ట మణిరంజితమ్

హరిపాదాంబుజద్వంద్వ మభీష్టప్రదమస్తు నః

మాంధాతోవాచ:-

పాపేన్థనస్య ఘోరస్య శుష్కా ర్ద్ర స్య ద్విజోత్తమ

కో వహ్నిర్దహతే తస్య తద్భవాన్వక్తుమర్హతి

నాజ్ఞాతం త్రిషు లోకేషు చతుర్ముఖసముద్భవ

 విద్యతే తవ విప్రేన్ద్ర త్రివిధస్య సునిశ్చితమ్

అజ్ఞాతం పాతకం శుష్కం జ్ఞాతం చార్ద్ర ముదాహృతమ్

భావ్యం వాప్యధవాతీతం వర్తమానం వదస్వ నః

 వహ్నినా కేన తద్భస్మ భవేదేతన్మతం మమ

 శ్రీ గణేశునకు నమస్కారము. శ్రీ కృష్ణునకు నమస్కారము.

మేఘము వలె నల్లనివి శార్జధనువు అల్లి త్రాడు తాకుడుతో గట్టిబారినలో కత్రయమండప స్తంభములైన శ్రీహరినాలుగు బాహువులు మిమ్ములను కాపాడుగాక. దేవదానవశిరోరత్నములతో ప్రకాశించు శ్రీహరిపాదపద్మములు మా భీష్టముల నెరవేర్చుగాక.

మాంధాత పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా? ఘోరమగు శుష్కార్ధమగు పాసేన్దనమును ఏ అగ్ని దహించునో మీరు చెప్పుడు. ఓ బ్రాహ్మపుత్రా! మూడులోకములలో నున్న మూడు విధములగు జ్ఞానములలో నీకు తెలియనది లేదు. తెలియని పాతకమును శుష్కమని తెలిసినదానిని ఆర్థ చెప్పెదరు. జరుగ బోవునది, జరిగినది, జరుగుచున్నది అను మూడు విధములగు పాపములు ఏ అగ్నితో నశించునో నాకు తెలుపుము.

వసిష్ఠ ఉవాచ :-

శ్రూయతాం నృపశార్దూల వహ్నినా యేన తద్భవేత్

 భస్మ శుష్కం తధార్ధ్రం చ పాపమస్య హ్యశేషతః

ఆవాప్య వాసరం విష్ణో ర్యోనరస్సంగతేంద్రియః

 ఉపవాసపరో భూత్వా పూజయేన్మధుసూదనమ్

 సధాత్రీస్నానసహితో రాత్రే జాగరణాన్వితః

 విశోధయతి పాపాని కితవో హి యధా ధనమ్

ఏకాదశీసమాఖ్యేన వహ్నినా పాతకేంధనమ్

భస్మతాం యాతి రాజేన్ద్ర అపి జన్మశతోద్భవమ్

 నేదృశం పావనం కించి న్నరాణాం భూప విద్యతే

 యాదృశం పద్మనాభస్య దినం పాతకహానిదమ్

తావత్పాపాని దేహాఽస్మిం స్తిష్ఠన్తి మనుజాధిప

యావన్నోపవసేజ్జంతుః పద్మనాభదినం శుభమ్

అశ్వమేధసహస్రాణి రాజసూయశతానిచ

 ఏకాదశ్యుపవాసస్య కలాం నార్హతిషోడశీమ్

ఏకాదశేంద్రియైః పాపం యత్కృతం భవతి ప్రభో

ఏకాదశ్యుపవాసేన తత్సర్వంవిలయం వ్రజేత్

ఏకాదశీసమం కించిత్ పాపనాశం నవిద్యతే

వ్యాజేనాపి కృతంరాజ న్నదర్శయతి భాస్కరిమ్

 స్వర్గమోక్షప్రదా హ్యేషా రాజ్యపుత్రప్రదాయినీ

సుకలత్రప్రదా హ్యేషా శరీరారోగ్యదాయినీ

న గంగా న గయా భూప న కాశీ న చ పుష్కరమ్

న చాపీ కౌరవం క్షేత్రం న రేవా నచ దేవికా

యమునా చంద్రభాగా చ పుణ్యా భూప హరేర్దినాత్

 అనాయాసేన రాజేన్ద్ర ప్రాప్యతే హరిమందిరమ్

రాత్రౌ జాగరణం కృత్వా సముపోష్య హరేర్దినమ్

సర్వపాపనిర్ముక్తో విష్ణులోకే వ్రజేన్నరః

దశైవ మాతృకే పక్షే దశ రాజేన్ద్ర పైతృకే

 భార్యాయా దశ పక్షేచ పురుషానుద్ధరేత్తధా

ఆత్మాన మపి రాజేన్ద్ర స నయే ద్వైష్ణవం పురమ్

చింతానుణిసమా హ్యేషా అధవాపి నిధెస్సమా

 సంకల్పపాదపప్రఖ్యా వేదవాక్యోపమాధవా

ద్వాదశీం యే ప్రపన్నా హి నరా నరవరోత్తమ

తే ద్వన్ద్వ బాహవో జాతా నాగారికృతవాహనాః

 స్రగ్విణః పీత వస్త్రాశ్చ ప్రయాంతి హరిమందిరమ్

 ఏష ప్రభావో హి మయా ద్వాదశ్యాః పరికీర్తితః

 పాపేస్థనస్య ఘోరస్య పావకాఖ్యో మహీపతే

హరేర్దినం సదోపేష్యం నరైర్థర్మపరాయణైః

 ఇచ్ఛద్భిర్విపులా న్యోగా న్పుత్రపౌత్రదికాంస్తధా

 హరిదినమిహమర్త్యో యః కరోత్యాదరేణ

నరవర స తు కుక్షిం మాతురాప్నోతి నైవ

 బహువృజినసమేతోఽ కామతః కామతో వా

 వ్రజతి పదమనంతం లోకనాధస్యవిష్ణోః

 ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే ద్వాదశీమాహాత్మ్యవర్ణననం నామ ప్రధమోఽధ్యాయః.

వసిష్ఠమహర్షిపలికెను :- ఓ రాజోత్తమా! ఆర్ద్రపాపము, శుష్కపాపము సమస్తము ఏ అగ్నితో దహించబడునో వినుము. విష్ణు వాసరమగు ఏకాదశినాడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉపవసించి మధుసూదనుని పూజించవలయును. స్నానమునాచరించి ఉపవసించి, రాత్రి జాగరణ చేసినచో తస్కరుడు ధనమును హరించునట్లు సకలపాపములను హరించును. ఏకాదశి యను అగ్ని నూరు జన్మల పాపరాశిని భస్మము చేయును. పద్మనాభవాసరమంతటి పాపనాశకమగు పరమపవిత్రమైనది మానవులకు మరొకటి లేదు. ఏకాదశి ఉపవాసము వరకే మానవుని దేహములో పాపములుండును. వేయి ఆశ్వమేధయాగములు, నూరు రాజసూయయాగములు, ఏకాదశీఉపవాసములోని ఒక అంశతో సాటిరావు. మానవుడు ఏకాదశేంద్రియములతో చేసినపాపములన్నియూ ఏకాదశ్యుపవాసముతో నశించును. ఏకాదశితోసాటివచ్చు పాపనాశకము మరియొకటిలేదు. మిషతో ఆచరించిననూ యమదర్శనము కాదు. ఈ ఏకాదశి సర్వమును మోక్షమును ప్రసాదించును. రాజ్యమును పుత్రులనిచ్చును. మంచి భార్యనిచ్చును. శరీరాగ్యమును ప్రసాదించును. గంగానది, గయాక్షేతము, కాశీ, పుష్కరము, కురుక్షేత్రము, రేవానది, దేవిక, యమునో, చంద్రభాగా, ఇవన్నియూ హరిదినమంత పవిత్రము కాజాలవు. ఆయాసము లేకుండగా హరిమందిరమును చేర్చును. ఏకాదశినాడు పవసించి, రాత్రి జాగరణము చేసి సర్వపాపవిముక్తుడై విష్ణులోకమును చేరును. ఏకాదశ్యుపవాసము మాతృపక్షమున పదితరములను, పితృపక్షమున పదితరములను, భార్యాపక్షమున పది తరములను ఉద్దరించును. ఉపవసించిన వానిని కూడా విష్ణుపురమును చేర్చును. ఏకాదశి చింతామణితో నిధితో సమానము. సంకల్పమను కల్పవృక్షము వేదవాక్యము వంటివి యగు ద్వాదశిని ఆశ్రయించిన నరులు నాలుగు భుజములు కలిగి గరుడ వాహనులు, మాల్యధారులు, పీతాంబరధారులుగా హరిమందిరమును చేరుదురు. ఇది యంతయు ద్వాదశీ ప్రభావము. నీకు చెప్పితిని. ఘోరమగు పాపరాశికి అగ్నిహోత్రము. ఏకాదశి ఎపుడు ఉపవసించదగినదే. పుత్ర పౌత్రాదివిపుల భోగములననుభవించ గోరు మానవులు ఈ వ్రతము నాచరించవలయును. ఈలోకమున ఆదరముతో హరిదినమును ఇష్టముతో కాని అయిష్టముతోకాని ఆచరించువారు ఎన్ని పాపముకలవారైనను శ్రీమహావిష్ణులోకమును పొందెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున ద్వాదశీమహాత్మ్య వర్ణణమను మొదటి అధ్యాయము సమాప్తము.