నారద మహా పురాణము
29 - తిథ్యాదినిర్ణయః
సనక ఉవాచ :-
తిథీనాం నిర్ణయం వక్ష్యే ప్రాయశ్చితవిధిం తథా।
శృణుష్వ తన్ము నిశ్రేష్ఠ కర్మ సిద్ధార్యతో భవేత్॥
శ్రౌతం స్మార్తం వ్రతం దానం యచ్చాన్యత్కర్మ వైదికమ్।
అనిర్ణీతాసు తిథీషు న కించిత్ఫలతి ద్విజ॥
నాగవిద్దా తు యా షష్ఠి శివవిద్దా తు సప్తమి।
దశమ్యేకాదశీ విద్దా నోపోష్యాస్స్యుః కదాచన॥
దర్శం చ పౌర్ణమాపీ చ సప్తమీ పితృవాసరమ్।
పూర్వవిద్ధం ప్రకుర్వాణో నరకాయోపపద్యతే॥
ఏకాదశ్యష్టమీ షష్ఠి పౌర్ణమాసీ చతుర్ధశి।
అమావాస్యా తృతీయా చ హ్యుపవాసవ్రతాదిషు॥
పరవిద్ధాః ప్రశస్తా స్యుః న గ్రాహ్యాః పూర్వసంయుతాః।
కృష్ణపక్షే పూర్వవిద్ధాం సప్తమీం చ చతుర్దశీమ్॥
ప్రశస్తాం కేచిహ్హుశ్చ తృతీయాం నవమీం తథా।
వ్రతాదీనాం తు సర్వేషాం శుక్లపక్షో విశిష్యతే॥
అపరాహ్ణచ్చ పూర్వాహ్ణo గ్రాహ్యం శ్రేష్ఠతరం యతః।
అసంభవే వ్రతాదీనాం యది పౌర్వాహ్ణీకీ తిథి:॥
ముహూర్తద్వితయం గ్రాహ్యం భగవత్యుదితే రవౌ।
ప్రదోషవ్యాపినీ గ్రాహ్యా తిథిరక్తవతే సదా॥
ఉపోషితవ్యం నక్షత్రం యేనాస్తం యాతి భాస్కరః।
తిథినక్షత్రసంయోగవిహితవ్రతకర్మణి॥
ప్రదోషవ్యాపినీ గ్రాహ్యా త్వన్యథా నిష్ఫలం భవేత్ ।
ఆర్థరాత్రాదధో యాతు నక్షత్రవ్యాపినీ తిథిః॥
సైవ గ్రాహ్యా మునిశ్రేష్ఠ నక్షత్రవిహితవ్రతే।
యద్యర్ధరాత్రయోర్వ్యాప్తం నక్షత్రం తు దినద్వయే॥
తత్పుణ్యం తిథిసంయుక్తం నక్షత్రగ్రాహ్యముచ్యతే।
అర్ధరాత్రద్వయే స్యాతాం నక్షత్రం చ తిథిర్యది॥
క్షయే పూర్వా ప్రశస్తా స్యాద్వృద్ధే కార్యా తథోత్తరా।
అర్ధరాత్రద్వయవ్యాప్తా తిథిర్నక్షత్రసంయుతా॥
ప్రసవృద్ధివిశూన్యా చేత్ గ్రాహ్యాపూర్వతథాపరా।
జ్యేష్టా సంమిశ్రితం మూలం రోహిణీ వహ్నిసంయుతా॥
మైత్రేణ సంయుతా జ్యేష్టా సంతానాదివినాశినీ।
తత స్వస్తిధయః పుణ్యాః కర్మానుష్టానతో దివా॥
రాత్రివ్రతేషు సర్వేషు రాత్రియోగో విశిష్యతే।
తిథిరక్షత్రయోగేన యా పుణ్యా పరికీర్తితా॥
తస్యాం తు తద్గతం కార్యం సైవ కార్యా విచక్షణిః।
ఉదయవ్యాపినీ గ్రాహ్యా శ్రవణద్వాదశీవ్రతే॥
సూర్యేన్దుగ్రహణే యావత్తావద్గ్రాహ్యా జపాదిషు।
సంక్రాంతిషు తు సర్వాసు పుణ్యకాలో నిగ్యతే॥
స్నానదానజపాదీనాం కుర్వాతామక్షయం ఫలమ్।
తత్ర కర్కటకో జ్ఞేయో దక్షిణాయనసంక్రమః॥
సనకమహర్షి పలికెను :- తిథి నిర్ణయమును ప్రాయశ్చిత్త విధిని చెప్పెదను. ఓ మునిశ్రేష్టా ! దీనివలన కర్మ సిద్ది కలుగును. కావున వినుము. శ్రాతస్మార్తవ్రతదానాదికములు వైదికములగు కర్మలు తిథి నిర్ణయము జరుగనిచో ఫలించజాలవు. ఏకాదశి, అష్టమి, షష్టి, పూర్ణిమ, చతుర్దశి, తృతీయ, ఈ తిథులు ఉపవాసవ్రతాదులందు తరువాతి తిథితో విద్దమైనచో ప్రశస్తములగును. పూర్వతిథితో కూడినవి గ్రహించదగినవి కావు. నాగవిద్దయగు షష్టి శివ విద్దయగు. సప్తమి, ఏకాదశీ విద్ధయగు దశమి ఉపవాసమునకు యోగ్యములు కావు. అమావాస్య, పూర్ణిమ సప్తమి పితృవాసరము పూర్వ తిథి విద్దమైన దానిని ఆచరించినచో నరకమును చెందును. కృష్ణపక్షమును సప్తమి, చతుర్దశి, తృతీయ నవమి పూర్వతిథి విద్దమైనచో ప్రశస్తమని కొందరు చెప్పేదరు. అన్ని వ్రతములకు శుక్లపక్షము ప్రశస్తము. అపరాహ్ణము కంటే పూర్వాహ్ణము శ్రేష్ఠం. ప్రతాదులకు పూర్వాహ్ణకీ తిథి కుదురనిచో సూర్యోదయము తరువాత రెండు ముహూర్తముల కాలమున గ్రహించవలయును. సూర్యుడస్తమించు నక్షత్రమును తిథితో కూడియున్నదానిని విహితకర్మలలో స్వీకరించవలయును. ప్రదోషకాలవ్యా పిని యగు తిథిని గ్రహించవలయును. అట్లు కానిచో నిష్పలమగును. నక్షత్రమున విధించిన ప్రతి విషయమున అర్థరాత్రము తరువాత నక్షత్ర వ్యాప్తిని యగు తిథిని స్వీకరించవలయును. రెండు అర్ధరాత్రములలో నక్షత్రము వ్యాపించియున్నచో తిథియుక్తమైన నక్షత్రమును గ్రహించవలయును. తిథి నక్షత్రములు రెండర్థరాత్రములలో క్షయమునకు పూర్వము వృద్ధికి ఉత్తరము ప్రశస్తము. నక్షత్రముతో కూడిన తిథి అర్ధరాత్ర ద్వయ వ్యాప్త మైనచో ప్రసవృద్ది శూన్య మైనచో పూర్వమును పరమును కూడా గ్రహించవచ్చును. జేషానక్షత్రముతో కూడినమూల, కృత్తికతో కూడిన రోహిణి, అనూరాధతో కూడిన జ్యేష్ఠ సంతానాది వినాశిని యగును. కర్మానుష్టానమునకు పగటి తిథులు ప్రశస్తములు. రాత్రివ్రతము లన్నిటిలో రాత్రియోగము ప్రశస్తము. ఏ నక్షత్రముతో కూడియున్న ఏ తిథి పవిత్రముగా పేర్కొన బడినదో ఆ తిథిలో ఆ వ్రతమును చేయవలయును. శ్రవణ ద్వాదశీ వ్రతమున ఉదయ వ్యాపినీ తిథిని గ్రహించవలయును. సూర్య చంద్ర గ్రహణములు ఉన్నంతవరకే జపాదులతో స్వీకరించవలయును. అన్ని సంక్రమణములలో పుణ్యకాలము విశేషించిన అక్షయ ఫలము లభించును. కర్కాటక సంక్రమణమున దక్షిణాయన పుణ్య కాలము సంక్రమించును.
పూర్వతో ఘటికాస్త్రింశత్పుణ్యకాలం విదుర్భుధాః।
వృషభౌ వృశ్చికే చైవ సింహో కుంభే తథైవ చ॥
పూర్వమష్టముహూర్తాస్తు గ్రాహ్యాస్నాన జపాదిషు।
తులాయాం చైవ మే షే చ పూర్వతః పరతస్తథా॥
జ్ఞేయా దశైవ ఘటికా దత్తస్యాక్షయతా వహాః।
కన్యాయాం మిధునేచైవ మీనే ధనుషి చ ద్విజ॥
ఘటికాష్షోడశ జ్ఞేయా పరతః పుణ్యదాయికాః।
మాకరం సంక్రమం ప్రాహురుత్తరాయణసంజ్ఞకమ్॥
పరాస్త్రింశచ్చ ఘటికాశ్చత్వారింశచ్చ పూర్వవత్।
ఆదిత్యశీతకిరణౌ గ్రాహ్యావస్తంగతౌ యది॥
స్నాత్వా భుంజీత విప్రేన్ద్ర పరేద్యుశ్శుద్ధ మండలమ్।
దృష్టచంద్రా సినీవాలీ నష్టచంద్రా కుహూ స్మృతా॥
అమావాస్యా ద్విధా ప్రోక్తా విద్వద్భిర్ధర్మ లిప్పుభిః।
సినీవాలీ ద్విజైః గ్రాహ్యా సాగ్నికైశాద్దకర్మణి॥
కుహూ స్త్రీభిస్తదా శూద్రైరపి వానాగ్ని క్రైస్తథా।
అపరాహ్ణాద్వయవ్యాపిన్యమావాస్యా తిథిర్యది॥
క్షయే పూర్వా తు కర్తవ్యా వృద్ధే కార్యా తథోత్తరా।
అమావాస్యా ప్రతీతా చేన్మధ్యాహ్నాత్పరతో యది॥
భూతవిద్ధేతి విఖ్యాతా సద్భిశ్శాస్త్ర విశారదై:।
అత్యంతక్షయపక్షే తు పరేద్యుర్నాపరాహ్ణగా॥
తత్ర గ్రాహ్యా సినివాలీ సాయాహ్నవ్యాపినీ తిధిః।
అర్వాచీనక్షయే చైవ సాయాహ్నవ్యాపినీ తిథికి॥
సినీవాలీ పరా గ్రహ్యా సర్వధా శ్రాద్ధ కర్మణి।
అత్యంతతిథివృద్దే తు భూతవిద్దాం పరిత్యజేత్॥
గ్రాహ్యా స్యాదపరాహ్ణస్థా కుహూః పైతృకకర్మణి।
యథార్వాచీనవృద్ధే తు సంత్యాజ్యా భూతసంయుతా
పరేద్యుద్విబుధశ్రేష్ఠైః కుహూర్గ్రాహ్యా పరాహ్ణగా।
మధ్యాహ్నద్వితయే వ్యాప్తా హ్యమావాస్యా తిథిర్యది॥
తత్రేచ్చయా చ సంగ్రాహ్యా పూర్వా వాథ పరాథ వా।
అన్వాధానం ప్రవక్ష్యామి సంతస్సంపూర్ణపర్వణి॥
ప్రతిపద్దివ సే కుర్యాద్యాగం చ మునిసత్తమ।
పర్వణో యశ్చతుర్థాంశ ఆద్యాః ప్రతిప్రదస్త్రయః॥
యాగకాలస విజ్ఞేయః ప్రాతరుక్తో మనీషిభిః।
మధ్యాహ్నద్వితయే స్యాతామమావాస్యా చ పూర్ణిమా॥
పరేద్యు రేవ విప్రేన్ద్ర సద్యః కాలో విధీయతే।
పూర్వద్వయే పరేద్యుస్స్యాత్సంగవానరతో యది।
సద్యఃకాలః పరేద్యుస్స్యాద్ జ్ఞేయమేవం తిథిక్టయే॥
సర్వైరేకాదశీ గ్రాహ్యా దశమీ పరివర్జితా దశమీసంయుతా హంతి పుణ్యం జన్మత్రయార్జితమ్॥
ఏకాదశీ కలామాత్రా ద్వాదశ్యాం తు ప్రతీయతే॥
ద్వాదశీ చ త్రయోదశ్యామస్తి చేత్సా పరా స్మృతా
సంపూర్ణైకాదశీ శుద్ధ ద్వాదశ్యాం చ ప్రతీయతే॥
త్యయోదశీ చ రాత్ర్యంతే తత్ర వక్ష్యామి నిర్ణయమ్॥
పూర్వా గృహస్థైః సాకార్యా హ్యుత్తరా యతిభిస్తదా॥
గృహస్థాస్సిద్ధిమిచ్ఛంతి యతో మోక్షం యతీశ్వరాః।
ద్వాదశ్యాం తు కలాయాం వా యది లభ్యత పారణా॥
తదానీం దశమీ విద్దాప్యుపోష్యైకాదశీ తిథిః॥
శుక్లే వా యది కృష్ణే వా భవేదేకాదశీద్వయమ్।
గృహస్థానాం తు పూర్వోక్తా యతీనాముత్తరా స్మృతా॥
ద్వాదశ్యాం విద్యతే కించిద్దశమీసంయుతా యది।
దీనక్షయే ద్వితీయైవ సర్వేషాం పరికీర్తితా॥
విద్ధాప్యేకాదశీ గ్రాహ్యా పరతో ద్వాదశీ న చేత్।
అవిద్ధాఽపి నిషిద్ధైవ పర ద్వాదశీ యది॥
ఏకాదశీ ద్వాదశీ చ రాత్రిశే షే త్రయోదశీ।
ద్వాదశద్వాదశీ పుణ్యా త్రయోదశ్యాం చ పారణే॥
ఏకాదశీ కలామాత్రా విద్యతే ద్వాదశీ దినే।
ద్వాదశీ చ త్రయోదశ్యాం నాస్తి వా విద్యతే థవా॥
విద్దాప్యేకాదశీ తత్ర పూర్వా స్యాద్గృహిణాం తథా।
యతిభిశోత్తరా గ్రాహ్యా హ్యవీరాభిస్తథైవ చ॥
సంపూర్ణైకాదశీ శుద్ధ ద్వాదశ్యాం నాస్తి కించన।
ద్వాదశీ చ త్రయోదశ్యామస్తి తత్ర కథం భవేత్॥
పూర్వా గృహస్థైః కార్యాత్ర యతిభిశ్చత్తరా తిథిః।
ఉపో ష్యైవ ద్వితీయేతి కేచిదాపుశ్చ భక్తితః॥
ఏకాదశీ యదా విద్దా ద్వాదశ్యాం న ప్రతీయతే।
ద్వాదశీ చ త్రయోదశ్యామస్తి తత్రైవ చాపరే॥
ఉపోష్యా ద్వాదశీ శుద్దా సర్వైరేవ న సంశయః।
కేచిదాపుశ్చ పూర్వాం తు తన్మతం న సమంజసమ్॥
దక్షిణాయన పుణ్యకాలమున మొదటి ముప్పది ఘటికలు పుణ్యకాలమని పండితులు చెప్పెదరు. వృషభ వృశ్చిక సింహ కుంభ సంక్రమణములలో స్నాన జపాదులకు మొదటి ఎనిమిది ముహూర్తములను గ్రహించవలయును. తులా మేష సంక్రమణులలో మొదటి, చివరి పది ఘటికలు పుణ్యకాలముగా తెలియ వలయును. కన్యా మిథున మీన ధనుస్సంక్రమణములలో తరువాతి పదునారు ఘటికలు పుణ్యకాలము. మకర సంక్రమణము ఉత్తరాయణ పుణ్యకాలమందురు. తరువాత ముప్పది ఘటికలు, మొదటివలే నలుబదీ ఘటికలు ప్రశస్తములు. సూర్య చంద్రులు గ్రహణముతో అస్తమించిన యెడల మరునాడు శుద్ధ మండలమును చూచి స్నానము చేసి భుజించవలయును. ధర్మమును పొందగోరు విద్వాంసులు సీనివాలీ కుహూ అను పేర్లచే అమావాస్య రెండు విధములని చెప్పిరి. చంద్రుడు కనబడిన అమావాస్య సినీవాలీ అని, కనపడని అమావాస్య కుహూ అని సిద్ధాంతము. సాగ్నిహోత్రులగు విప్రులు శ్రాద్ధకర్మలో సినీవాలినే గ్రహించవలయును. స్త్రీలు శూద్రులు అనగ్నిహోత్రులు కుహూను స్వీకరించవలయును. అమావాస్య తిథి అపరా వ్యా పీని అయినచో క్షయమునకు (మృతాహము) పూర్వమును, వృద్ధికి అపరమును గ్రహించవలయును. మధ్యా హ్నము తరువాత అమావాస్య ప్రతీయమానమగుచో శాస్త్ర విశారదులగు సజ్జనులు భూతవిద్దా అందురు. అమావాస్య అత్యన్త క్షీణమై రెండవరోజు అపరాహ్లా వ్యా పని కానిచో సాయాహ్నవ్యా పిని యగు సినీవాలినే గ్రహించవలయును. రెండవరోజు క్షీణించినచో సాయాహ్నవ్యా పినిగాయున్నచో తరుచాత నున్న సినీవాలిని గ్రహించవలయును. అమావాస్య అత్యంతవృద్ధిగా నున్నచో భూతవిద్ధను పరిత్యజించవలయును. పితృకర్మలో అపరాష్ట్ర వ్యాపినియగు కుహూను స్వీకరించవలయును. రెండవ దినమున వృద్ధియైనచో భూతవిద్దను విడువవలయును. రెండవ దీనము పరాహ్లావ్యాపిని అయినచో కుహూను గ్రహించవలయునని పండితులు చెప్పెదరు. రెండు మధ్యాహ్నములలో అమావాస్య వ్యాపించియున్నచో యధేష్టముగా మొదటి దానిని కాని రెండవదానిని కాని స్వీకరించవచ్చును. ఇక ఇపుడు సంపూర్ణ పర్వలో అన్వాధానమును (పితృయజ్ఞము)చెప్పెదను. ప్రతిపద్దినమున యాగమును చేయవలయును. పర్వలోని నాలుగవ అంశము ప్రతిపత్తు లోని మొదటీమూడు ఘటికలు ప్రశస్తములు ఈ సమయమే యాగకాలమని తెలియవలయునని పండితులు నిర్ణయించిరి. అమావాస్య కాని పూర్ణిమ కాని రెండు మధ్యాహ్నములలో ఉండెనేని రెండవదినమే సద్యఃకాలముగా గ్రహించవలయును. పూర్వద్వయమైనచో పరసంగమున్న రెండవదినమునే గ్రహించవలయును. తిథిక్టయమున్నచో సద్యఃకాలము రెండవదినమే అగును. దశమీ విద్ధకొని ఏకాదశినే అందరూ గ్రహించవలయును. దశమీ విద్దయగు ఏకాదశి జన్మత్రయ సంచితమగు పుణ్యమును నశింపచేయును. ద్వాదశీ తిథియందు ఏకాదశి కలామాత్రముగా నున్ననూ, త్రయోదశి తిథిలో ద్వొదశి కలామాత్రమున్ననూ అది చాలా శ్రేష్ఠము. శుద్దమైన సంపూర్ణేకొదశి ద్వాదశి తిథియందు కూడా ప్రతీతియగుచో, రాత్రి చివర త్రయోదశీ ప్రతీతయున్నచో అచటమొదటి దానిని గృహస్థులు, రెండవ దానిని యతులు స్వీకరించవలయును. గృహస్థులు ఫలసిద్ధిని యతులు మోక్షమును కోరెదరు కదా ! ద్వొదశీ తిథిని కలామాత్రము కూడా పారాణాకాలము లభించినచో దశమీ విద్దయగు ఏకాదశి అయిననూ ఉపవసించవలయును. శుక్లపక్షమున కాని కృష్ణపక్షము కాని కృష్ణపక్షమున కానీ ఏకాదశీ ద్వయము వచ్చినచో గృహస్థులు మొదటి దానిని, యతులు రెండవదానిని గ్రహించవలయును దశమీ సంయుతమగు ఏకాదశి ద్వాదశీ తిథిను కూడా కొంచెమున్న చో దినక్షయమున అందరూ రెండవ దానినే స్వీకరించవలయును. రెండవదినమున ద్వాదశి లేనిచో దశమీ విద్ద అయిననూ ఏకాదశిని గ్రహించవలయును. రెండవదినమున ద్వాదశియున్నచో విద్దలేకున్ననూ మొదట ఏకాదశిని విడువలయును. ఏకాదశి ద్వాదశి రాత్రి శేషముగా త్రయోదశి ఉన్న చో ద్వాదశీ తిథిన ఉపవాసముండి త్రయోదశిన పారణ చేయవలయును. ద్వాదశీ దినమున కలామాత్రము ఏకాదశియున్నను, త్రయోదశిన ద్వాదశియున్ననూ లేకున్ననూ దశమీ విద్దయగు ఏకాదశిని గృహస్థులు, యతులు రెండవదానినే స్వీకరించవలయును. సంపూర్ణేకాదశి ద్వాదశినాడే మాత్రములేక, త్రయోదశిన ద్వాదశి కొంచమున్న చో మొదటి దానిని గృహస్థులు రెండవదానిని యతులు స్వీకరించవలయును. రెండవదినమునే ఉపసించవలయునని కొందరి మతము, ఏకాదశీ దశమీ విద్ద అయి ద్వాదశిన ప్రతీతికానిచో, ద్వాదశీ తిథి త్రయోదశిన వ్యాపించియున్నచో అచటనే వ్రతమునుచేయవలయునని మరికొందరి మతము. శుద్ధ ద్వాదశీ తిథిననే అందరూ ఉపవసించవలయునని సిద్ధాంతము. కొందరు మొదటి దినమునే ఆచరించవలయునందురు కాని అది సమంజసము కాదు.
సంక్రాంతౌ రవివారే చ పాతగ్రహణయోస్తథా।
పారణం చోపవాసం చ న కుర్వాత్పుత్రవాన్గృహీ॥
అర్కేహ్ని పర్వరాత్రౌ చ చతుర్దశ్యష్ట మీదివా ఏకాదశ్యామహోరాత్రం భుక్త్వా చాంద్రాయణం చరేత్
ఆదిత్యగ్రహణే ప్రాప్తే పూర్వయామత్రయే తథా నాద్యాద్వే యది భుంజీత సురా పేన సమో భవేత్॥
అన్వాధామేష్టిమధ్యే తు గ్రహణే చంద్రసూర్యయోః ప్రాయశ్చిత్తం మునిశ్రేష్ఠ కర్తవ్యం తత్ర యాజ్ఞికైః
చంద్రోపరాగే జుహుయాత్ దశమే సోమ ఇత్యృచా ఆప్యాయస్వ ఋచా చైవ సోమపాస్త ఇతి ద్విజ
సూర్యోపరాగే జుహుయాదుదుత్యం జాతవేదసమ్ ఆసత్యేనోద్వయం చైవ త్రయో మంత్రాః ఉదాహృతాః
ఏవం తిథిం వినిశ్చిత్య స్మృతిమార్గేణ పండితః యః కరోతి వ్రతాదీని తస్య స్యాదక్షయం ఫలమ్॥
వేదప్రణిహితో ధర్మో ధర్మైస్తుష్యతి కేశవః తస్మాద్ధర్మపరా యాంతి తద్విష్ణోః పరమం పదమ్
ధర్మాన్యే కర్తుమిచ్ఛంతి తే వై కృష్ణస్వరూపిణః తస్మాత్తాంస్తు భవవ్యాధిః కదాచిన్నైవ బాధతే॥
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమపాదే తిథ్యాదినిర్ణయో నామఏకోనత్రింశోఽధ్యాయః॥
సంక్రమణమున ఆదివారమున వ్యతీపాత్తున గ్రహణకాలమున పుత్రవంతుడగు గృహస్థుడు పారణమును కాని వుపవాసమును కాని చేయరాదు. అమావాస్యనాడు పగలు పూర్ణిమారాత్రిన చతుర్దశీ అష్టములలో పగలు, ఏకాదశి పగలు రాత్రులు భుజించెనేని చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. సూర్యగ్రహణము ప్రాప్తించునపుడు ముందుగా మూడు రూములు భుజించరాదు. భుజించెనేని సురాపానసమపాపము కలుగును. అన్వాధానయోగ మధ్య కాలమున చంద్రసూర్యగ్రహణము వచ్చినచో యాజ్ఞికులు ప్రాయశ్చిత్తమును చేయవలయును. చంద్రగ్రహణసమయమున ‘దశమే సోమ’ అను ఋక్కుచే యాగమును చేయవలయును. ‘ఆప్యాయస్వ’ అను ఋక్కుచే ‘సోమపాస్త’ అను మంత్రముచే చేయవలయును. సూర్యగ్రహణకాలము “ఉదుత్యం జాతవేదసం” “ఆసత్యేన” అను మంత్రములచే హోమమును చేయవలయును. ఇట్లు పండితులు స్మృతిమార్గముచే తిథిని నిశ్చయించి ప్రతాదులనాచరించినచో అక్షయఫలము లభించును. ధర్మము వేదప్రణిహితము. ధర్మముచే శ్రీహరి సంతోషించును. కావున ధర్మపరులు శ్రీ విష్ణువుయొక్క పరమపదమును చేరెదరు. ధర్మమునాచరించదలచువారు సాక్షాత్తు శ్రీకృష్ణస్వరూపులు. కావున ధర్మా చారపరులను సంసారవ్యాధి తాకజాలదు.
ఇది శ్రీ బృహాన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున తిథ్యాధినిర్ణయమను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 29 of the Nārada Mahā Purana is as follows:
వివిధ పూజలు, వ్రతములు మరియు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అత్యంత ఆవశ్యకమైన తిథి నిర్ణయ శ్లోకములు మరియు కాలమాన విచారణ ఈ అధ్యాయంలో వివరించబడినది. సూర్యోదయ తిథి మరియు క్షయ వృద్ధి తిథుల ప్రాధాన్యతను శాస్త్రబద్ధంగా ఇక్కడ అభివర్ణించబడినది.