నారద మహా పురాణము
73 - రామాద్యుపాసనావర్ణనమ్
సనత్కుమార ఉవాచ :-
ఆథ రామస్య మనవో వక్షస్తే పిద్ధిదాయకాః,
యేషామారాధనాన్మర్త్యాప్తరంతి భవసాగరమ్.
సర్వేషు మంత్రవర్యేషు శ్రేష్ఠం వైష్ణవముచ్యతే,
గౌణపత్యేషు సౌరేషు శాక్తనైవేష్వభీష్టదమ్.
వైష్ణవేష్వపి మంత్రేషు రామమంత్రాః ప్రసాధికాః,
గౌణపత్యాదిమంత్రేభ్యః కోటికోటి గుణాధికాః,
విష్ణుశయ్యా స్థితో వహ్నిరిందుభూషితమస్తకః,
రామాయ హృదయాంతోయం మహాఘోఘవినాశనః.
పర్వేషు రామమంత్రేషు హ్యతిశ్రేష్ఠషడక్షరః,
బ్రహ్మహత్యాపహస్రాణి జ్ఞాతాజ్ఞాతకృతాని చ
స్వర్ణ పేయసురాపానగురుతల్పయుతాని చ,
కోటికోటీసహస్రాణి హ్యుపపాపాని యాని వై.
నున్తస్యోచ్చారణాత్సద్యో లయం యాంతి న సంశయః,
బ్రహ్మమునిస్స్యాద్గాయత్రీ ఛందో రామశ్చ దేవతా.
అద్యం బీజం చ పృచ్ఛక్తిర్వీనియోగోఖిలాప్తయే,
షడ్డీరభాజా బీజేన షడంగొని సమాచరేత్,
బ్రహ్మరంధ్రే భ్రువోర్మధ్యే హృన్నాభ్యోర్థుహ్యపాదయోః,
మంత్రవర్ణాంత్రమానయ్య కేశవాదీన్ ప్రవిన్య సేత్.
పీఠిన్యాసాదికం కృత్వా ధ్యాయేఢృది రఘోత్తమమ్,
కాలాంభోధరకొంతం చ వీరాసనసమాశ్రితమ్.
జ్ఞానముద్రాం దక్షహా స్తే దధతం జానునీతరమ్,
పరోరుహకరాం పీతావిద్యుదోభోం చ పార్శ్వశామ్.
పశ్యంతీం రామవక్రాబ్జం వివిధాకల్పభూషితమ్,
ధ్యాల్వెవం ప్రజ పేద్వర్ణలక్షం మంత్రి దశాంశతః,
కమలైర్జుహుయాద్వహ్నౌ బ్రాహ్మణానోజయేత్తతః,
పూజయేద్వెష్ణవే పీతే విమలాదిసమన్వితే,
మూర్తిం మూలేన పంకల్ప్య తస్యామావాహ్యా సాధకః,
పీతాం వామే సమాసీనాం తన్మంత్రేణ ప్రపూజయేత్ .
రమాసీతాపదం జేస్తం ద్విశాస్త్రం జానకీ మనుః,
అగ్నేశ్శార్థం చ పంపూజ్య శరాన్పార్శ్వద్వయేర్చయేత్.
కేశరేషు షడంగాని పత్రీ స్వేతాన్సమర్చయేత్ ,
హనుమంతం చ సుగ్రీవం భరతం సవిభీషణమ్.
లక్ష్మాంగదశత్రుఘ్నాన్ జాంబవంతం క్రమాత్పునః,
వాచయస్తం హనుమాన్తమగ్రతో ధృతపుస్తకమ్.
యజేద్భరతశత్రుఘ్నా పార్శ్వయోర్ధృతచామి,
ధృతాతపత్రం హస్తాభ్యాం లక్ష్మణం పృష్ఠతోర్చయేత్ .
తతోఇష్టపత్ర సృష్టిం చ జపంతం విజయం తథా,
సురాష్ట్రం రాష్ట్ర సాలం చ ఆకోపం ధర్మపాలకమ్.
సుమంతం చేతి సంపూజ్య లోకేశానాయుధైర్యుతాన్,
ఏవం రామం సమారాధ్య జీవన్ముక్తః ప్రజాయతే.
చందనాకై: ప్రజుహుయాజ్జాతీపు షెస్సమాహితః,
రాజవశ్యాయ కమలైర్ధనధాన్యాది సిద్ధయే.
లక్ష్మీకొమః ప్రజుహుయాత్ర్పసూనైర్భిల్పసంభవైః,
ఆజ్యాకెర్నీలకమలైర్వశయేదఖిలం జగత్.
ఘృతాక్తశతపర్వీభిర్డీర్ఘాయుశ్చ నిరామయః,
రక్తాత్పలానాం హోమేన ధనం ప్రాప్నోతి వాంఛితమ్.
పాలాశకుసుమైర్ఘత్వా మేధావవీ జాయతే నరః,
తజ్ఞప్తాంభః పిబేత్రాతర్వత్సరాత్కవిరాడ్భవేత్.
తన్మంత్రితాన్నం భుంజీత మహారోగప్రశాంతయే,
రోగోక్షౌషధహోమేన తద్రోగాన్ము చ్యతే క్షణాత్.
నదీతీరే చ గోష్ఠీ వాజపే ల్లక్షం పయోవ్రత,
పాయ పేసొజ్యయుక్తేన హుత్వా విద్యావిధిర్ఛ కేజ్.
పరీక్షిణాధిపత్యో యః శాకాహారో జలాంతరే,
జపేల్లక్షం చ జుహుయాదిల్వపు షెడ్డశాంశతః.
తదైవ పునరాప్నోతి స్వాధిపత్యం న సంశయః,
ఉపోష్య గంగాతీరాంతే స్థిత్వా లక్షం జపేన్నరః.
దశాంశం కమలైర్హుత్వా బిల్వోత్థర్వాపురసూనకైః,
మధురత్రయసంయుక్తి రాజ్యశ్రీయనువాప్నుయాత్.
మార్గమా సే జలే స్థిత్వా కందమూలఫలాశనః,
లక్షం జప్త్వా దశాంశేన పాయ సైర్జుహుయాదపౌ.
శ్రీరామచన్దపదృశః పుత్రః పౌత్రోపి జాయతే,
అన్యేపి బహవప్సన్స్ ప్రయోగా మన్తరాజకే.
కింతు ప్రయోగకర్తృణాం పరలోకో న విద్యతే,
షట్కోణం వసుపత్రం.
షట్కోణేషు షడర్ణాని మన్తస్య విలిభేద్బుధః,
అష్టపతే తథాష్టార్ణాం లిఖేత్ ప్రణవగర్భితాన్.
కామబీజం రవిదలే మధ్యేమంత్రావృతాభిధామ్,
సుదర్శనావృతం బాహ్యే దీక్టు యుగ్మావృతం తథా,
వజ్రోల్లపద్భూమి గేహం కన్జర్వాంకుశపాశకై,
భూమ్యా చ విలపత్కోణం యస్త్రరాజమిదం స్మృతమ్.
భూర్జష్టగంధైపుంలిఖ్య పూజయేడుక్తవర్త్మనా,
షట్కోణేషు దలార్కాబ్జన్యా వేష్టవృతయుగ్మతః.
కేపరేషష్టపత్రస్య పరద్వంద్వం లిఖేదధః,
బహిస్తు మాతృకాం చైవ మంత్రం ప్రాణనిధాయనమ్.
యస్త్రామేతచ్ఛుభే ఘ(సే కంతే వా దక్షిణే భుజే,
మూర్ఖ వా ధారయేన్మస్త్రీ పర్వపాపైః ప్రముచ్యతే.
మదినే శుభనక్షత్రే సుదేశే శల్యవర్జితే,
వశ్యాకర్షణవిద్వేషద్రావణోచ్చాటనాదికమ్.
పుష్యద్వయం తథాదిత్యార్షామఘాసు యథాక్రమమ్,
దూర్వోత్థా లేఖవీ వత్యే తథాకృష్టా కరంజజా.
నరాస్థిజా మారణే తు స్తంభనే రాజవృక్షజా,
శాంతిపుష్ట్యాయుషాం పిర్ధ్యే పర్వాపచ్ఛమనాయ చ.
విభ్రమోత్పాదనే చైవ శిలాయాం విలిఖేద్బుధః,
ఖరచర్మణి విద్వేషే ధ్వజే తూచ్చాటనాయ చ.
శత్రూణాం జ్వరసంతాపశోకమారణకర్మణి,
పీతవస్త్రం లిఖిత్వా తు సాధయేత్పాధకోత్తమః
వశ్యాకృష్టా చాష్టగంధైస్సంపూజ్య చ యథావిధి,
చితాంగారాదినా చైవ తాడనోచ్చాటనాదికమ్.
విషాదక్షీరయోగేన మారణం భవతి ధ్రువమ్,
లిఖిత్వవం యస్త్రరాజం గంధపుషాదిభిర్యజేత్.
త్రిలోహవేష్టితం కృత్వా ధారయేత్ సాధకోత్తమః,
బీజం రామాయ ఠద్వంద్వం మంత్రోయం రసవర్ణకః.
సనత్కుమార మహర్షి పలికెను: ఇపుడిక సిద్ధిదాయకములగు శ్రీరామ మంత్రములను చెప్పెదను. ఈ మంత్రముల నారాధించుటవలన మానవులు సంసారసాగరమును తరించెదరు. ఉత్తమమంత్రములన్నింటిలో విష్ణుమంత్రములు శ్రేష్ఠములు. గాణపత్య, సౌర శాక్తమంత్రములలో ఉత్తమము వైష్ణవ మంత్రము. వైష్ణవమంత్రముల కంటే రామమంత్రములు కోటి కోటి గుణాధికములు. విష్ణుశయ్యా స్థితుడగు వహ్ని ఇందు భూషితమస్తకుడు. రామాయ అనునది హృదయాంతముగా గల ఈ మంత్రము మహాపాపరాశులను నశింపచేయును. రామ మంత్రము లన్నింటిలో అతి శ్రేష్టమైనది ఈ రామషడక్షరి తెలిసి తెలియకచేసిన బ్రహ్మహత్యాసహస్రములు, స్వర్ణ సేయ సురాపాన గురుతల్పాదికములగు మహాపాపములు వేలకోట్ల ఉపపాతకములు అన్నియూ ఈ మంత్రోచ్చారణ వలన వెంటనే నశించిపోవును. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ, గాయత్రీ ఛందస్సు, శ్రీరాముడు దేవత. బీజము ఆద్యము హృదయము శక్తి అఖిలాప్తికి వినియోగము షడ్దర్షభాజమగు బీజముచే షడంగన్యాసమును చేయవలయును. బ్రహ్మ రంధ్రమున, భ్రూమధ్యమున, హృదయనాభి గుహ్యపొదములందు క్రమముగా మంత్రివరన్యాసమును చేసి కేశవాదులను న్యాసము చేయవలయును. పీఠిన్యాసాదికము నాచరించి హృదయమున శ్రీరామచంద్రుని ధ్యానించవలయును. కాలాంభోధరము వలే సుందరుడు, వీరాసనసమాస్థితుడు, దక్షిణహస్తమున జ్ఞానముద్రను ధరించి వామహస్తమును జానువు పైనుంచిన వాడు, పద్మహస్త విద్యుత్సన్నిభయగు సీత పోమపార్శ్వమున నుండి రాముని ముఖమును చూచుచు బహవిధభూషణ భూషితయగు సీతతో నున్న రాముని ధ్యానించి అక్షర లక్షలు జపించి దశాంశమును అగ్నిలో కమలములతో హోమము చేసి బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలయును. విమలాది సమన్వితమగు వైష్ణవపీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు ఆవాహనము చేసి పూజించ వలయును. వామ భాగమున ఆసీనురాలగు సీతను ఆమె మంత్రముచే పూజించవలయును. రమాసీతాయై తరువాత ద్వీతాంతము సీతామంత్రము. అగ్ని వలన శార్ణమును పూజించి, పార్శ్వద్వయమున శరములను పూజించవలయును. కేశరములందు షడంగములను, పత్రములందు హనుమంతుని, సుగ్రీవుని, భరతుని, విభీషణుని, లక్ష్మణాంగదశతృఘ్నులను జాంబవంతుని క్రమముగా, మాటలాడుచున్న ముందు పుస్తకమును ధరించి యున్న హనుమంతుని, రెండు పార్శ్వములలో చామరములను ధరించియున్న భరత శత్రుఘ్సులను వెనుక భాగమున ఛత్రమును ధరించియున్న లక్ష్మణుని అర్చించవలయును. తరువాత అష్టపత్రమున సృష్టిని జపించుచున్న విజయుని, సురాష్ట్రుని, రాష్ట్ర పాలుని, అరోపుని, ధర్మపాలకుని, సుమంతుని, చక్కగా పూజించి, ఆయుధో పేతులగు లోకేశులను పూజించవలయును. ఇట్లు రామునారాధించినవాడు జీవన్ముక్తుడగును. చందనము కలిపిన జాతీపుష్పములచే సావధానముగా హోమమును చేయవవలయును. అట్లు చేసిన రాజులు వశులగుదురు. ధనధాన్యాది సిద్ధికి కమలముచే హోమమును చేయవలయును. నేతితో కలిసిన నీలకమలములచే . హోమమును గావించిన సకలజగత్తు వశమగును. నేయికలిపిన శతపర్వములచే హోమమును గావించిన రోగములు తొలగి దీర్ఘాయుష్మంతుడగును. ఎఱ్ఱకలువలచే హోమమును గావించినచో వాంఛితధనమును పొందును. మోదుగు పూలచే హోమమును చేసినచో మేధావియగును. ఈ మంత్రముచే మంత్రించబడిన జలమును ఒక సంవత్సరము పానము చేసినచో కవివర్యుడగును. ఈ మంత్రముచే మంత్రించబడిన అన్నమును తినినచో మహారోగములు నశించును. ఆయారోగములకు నిర్దేశించబడిన ఔషధముచే హోమముగావించినచో ఆ రోగము తొలగిపోవును. నదీతీరమున కాని కోషమున కొని పయోవ్రతుడై లక జపించవలయును. నేయి కలిపిన పాయసముచే హోమమును చేసినచో విద్యానిధియగును. అధికారమునుండి తొలగినవాడు శాఖాహారుడై ఇతర తీర్థమున లక్ష జపించి బిల్వపుష్పములచే దశాంశము హోమమును గావించినచో వెంటనే తన అధికారము తిరిగి లభించును. ఉపవాసము చేసి గంగాతీరమున నిలిచి లక్ష జపము చేసి దశాంశమును కమలములచే కొని బిల్వపుష్పములచే కొని హోమము గావించినచో రాజ్యసంపదను పొందును. మార్గశీర్షమాసమున కందమూలఫలాశనుడై జలమున నిలిచి లక్ష జపము చేసి దశాంశమును పాయసముచే హోమమును గావించినచో శ్రీరామచంద్రుని వంటి పుత్రుడు కాని పౌత్రుడు కొని కలుగును. ఇంకను ఈ మంత్రవిషయమున చాలా ప్రయోగములున్నవు. కాని ప్రయోగమును చేయువారికి పరలోకము కలుగదు. షట్కోణవసుపత్రమున బాహ్యార్కదళమును లిఖించవలయును. షట్కోణములందు షడక్షరములను వ్రాయవలయును. అష్టపత్రమునందు అష్టాక్షరములను ప్రణవసహితములుగా వ్రాయవలయును. రవిదళమున కామబీజమును, మధ్యమున మంత్రావృతమును, బాహ్యమున సుదర్శనావృతమును, దిక్కులలో యుగావృతమును లిఖించవలయును. వజ్రములచే శోభించు భూగృహమున కందరాంకుశపాశములచే భూమియందు కోణాకారముగా లిఖించినది యంత్రరాజముగా పేర్కొనబడినది. భూర్జపత్రమున లిఖించిన యంత్రమున అష్టగంధములచే లేపనము గావించి యథోక్త విధిగా పూజించవలయును. షట్కోణములందు దలారాబములను ఇష్టవృతయుగ్మముగా, కేశరములందు అష్టపత్రము యొక్క స్వరద్వంద్వమును లిఖించవలయును. ఇట్లు లిఖించిన యంత్రమును శుభదినమున కంఠమునకాని, దక్షిణభుజమునకాని, శిరమున కొని ధరించినచో సర్వపాపములు నశించును. శుభదినమున, శుభనక్షత్రమున, శుభప్రదేశమున శల్యవర్జితమున వశ్యాకర్షణవిద్వేషద్రావణ ఉచ్చోటనాదికమును, పుష్యద్వయము, పునర్వసు, ఆర్గామఘా నక్షత్రములలో యథాక్రమముగా దూర్వచే ఏర్పరిచిన లేఖనిని వశీకరణమున, ఆకర్షణకు కరంజమున మారణమున నరాస్థిజమున స్తంభనమున రాజ వృక్షజమున, శాంతి పుష్టి ఆయుష్యము కొఱకు సర్వాపన్నివారణకు, విభ్రమోత్పాతనముననకు శిలయందు వ్రాయవలయును. విద్వేష విషయమున ఖరచర్మము పై ఉచ్చాటనము ధ్వజము పై వ్రాయవలయును. శత్రవులకు జ్వరసంతాప శోకమారణ కర్మల కొఱకు పీతవస్త్రమున లిఖించవలయును. వశీకరణకోజకు, ఆకర్షణ కొరకు అష్టగంధములచే యథావిధిగా పూజించవలయును. తాడోచ్చాటనాదికమునకు చితాంగారాదులచే చేయవలయును. విషార్కజీరయోగముచే మారణము తథ్యము. ఇట్లు యంత్రరాజమును లిఖించి గంధపుష్పాదులచే పూజించవలయును. యంత్రమును త్రిలోహ వేష్టనము గావించి ధరించవలయును. ఈ మంత్రమునకు ఠద్వంద్వము బీజము. ఈ మంత్రము షడక్షరములు కలది.
మహాసుదర్శనమనుః కథ్యతే సిద్ధిదాయకః,
సుదర్శన మహాశబ్దాచ్చక్రరాజేశ్వరేతి చ.
దుష్టాంతకదుష్టభయానకదుష్టభయంకరమ్,
భిన్ది ద్వయం భిన్లియుగ్మం విదారయ యుగం తతః.
పరమంత్రాస్ట్రోసర్వడ్జ్వల భక్షయ ద్వితయం తతః,
ద్రాసయ ద్వితయం వర్మాస్త్రాగ్మి జాయాంతిమో మనుః.
ఆష్టషష్ట్యక్షరః ప్రోక్తో యంత్ర సంవేష్టనౌ త్వయమ్,
తారోహాఋద్భవాన్ జేన్తో జేన్తో హి రఘునందనః.
రక్షోఘ్న విశదాయాంతే మధురాదిప్రపన్న చ,
వరదాయామితాంతే తేజసే పదమీరయేత్.
బాలాయాంతే తు రామాయ విష్ణవే హృదయాంతమః,
సప్త చత్వారింశదర్ణో మాలామంత్రయమీరితః.
విశ్వామిత్ర మునిశ్చాప్య గాయత్రీ చన్ద ఈరితమ్,
శ్రీరామో దేవతా బీజం ధ్రువశ్శక్తిశ్చ కద్వయమ్.
షడ్రీరస్వరయుగ్మాయా బీజేమాంగావి కలయేత్,
ధ్యానపూజాదికం సర్వమష్య పూర్వవదాచరేత్.
అయమారాధితో మస్త్రపర్వాన్ కామానయచ్చతి,
స్వకామసత్యవాగ్లక్ష్మీ తారాధ్యః పంచవర్ణకః.
షడక్షరషద్విధస్స్యాత్ చతుర్వర్గఫలప్రదః,
బ్రహ్మ సంమోహనళ్ళకీర్ణక్షిణామూర్తిసంజ్ఞకః,
అగస్త్యశివః ప్రోక్తా ప్లే తేషాం మునయః క్రమాత్,
అథవా కామబీజాదేర్విశ్వామిత్ర మునిప్స్మృతః.
చన్దః ప్రోక్తం చ గాయత్రీ శ్రీరామో దేవతా పునః,
బీజశక్తి రాఘవాంత్యం మంత్రార్లెస్స్యాత్తడంగకమ్.
బీజైషత్తీర్ఘయుకైర్వా మంత్రార్థాన్పూర్వమన్న పేత్,
ధ్యాయేత్కల్పతరోర్మూలే సువర్ణమయమండ పే.
పుష్పకాఖ్య విమానాన్త సింహాసనపరిచ్ఛదే,
పద్మే వసుదలే దేవమిస్ట్రనీలపమప్రభమ్.
వీరాపనసమాసీనం జ్ఞానముద్రోపశోభితమ్,
వామోరున్యస్తతద్ధస్తం పీతాలక్ష్మణ పేవితమ్.
రత్నకల్పం విభుం ధ్యాత్వా వర్ణలక్షం జపేన్మనుమ్,
యద్వా స్మారాదిమంత్రాణాం జయాభం చ హరిం స్మరేత్.
యజనం కామ్యకర్మాణి పర్వం కుర్యాత్తడర్ణవత్,
రామశ్చ చంద్రభద్రంతో జేనమోస్తం ధ్రువాదికః.
మంత్రావష్టాక్షరో హ్యేతో తారాణంల్యౌ చేన్నవాక్షరౌ,
ఏతేషాం యజనం పర్వం కుర్యాన్మస్ట్రీ షడ్గర్లవత్.
జానకీవల్లభో జేన్తో ద్వితాన్తః కవచాదికః,
దశార్ణోయం మహామంత్రో వశిష్టాప్య మునిప్స్వరాట్.
ఛన్దశ్చ దేవతా పీతా పతిర్భీజం తథారిమమ్,
స్వాహా శక్తిశ్చ కామేన కుర్యాదంగాని షట్క్రమాత్.
శిరోలలాటభ్రూమధ్యతాలుకంతేఘవృద్యపి,
నాభ్యంఘిజానుపాదేషు దశార్ణాన్విన్య పేన్మ నోః.
అయోధ్యానగరే రత్నచిత్రసౌవర్ణమండ పే,
మన్గారపు షేరాబద్ధవితానే తోరణాన్వితే.
సింహాసనే పమాసీనం పుష్పకోపరి రాఘవమ్,
రక్షోభిర్హరిభిర్దేవైస్సువిమానగతైశ్శుభైః.
సంస్తూయమానం మునిభిః ప్రహ్వేశ్చ పరి సేవితమ్,
సీతాలంకృతవామాంగం లక్ష్మణేనోపశోభితమ్.
శ్యామం ప్రసన్నవదనం సర్వాభరణభూషితమ్,
ఏవం ధ్యాత్వా జపే న్మస్ట్రీ వర్ణలక్షం సమాహితః.
దశాంశః కమలైర్ఘమో యజనం చ షడర్లవత్,
రామో హేంతో ధనుష్పాణిర్జన్తోనే వహ్నిసుందరీ.
దశాక్షరోఒయం మన్తస్య మునిరహ్మా విరాట్పునః,
ఛన్దస్తు దేవతా ప్రోక్తో రామో రాక్షసమర్దనః.
ఆద్యం బీజం ద్వితశ్శక్తిర్భీజేనాంగాని కల్పయేత్,
వర్ణన్యాసం తథా ధ్యానం పురశ్చర్యార్చనాదికమ్.
దశాక్షరోక్తవత్కుర్యాచాపబాణధరం స్మరేత్,
తారో నమో భగవతే రామాంతే చంద్రభద్రకౌ.
జేంతావరాక్షరో మంత్రౌ ఋషిర్ధ్యానాది పూర్వవత్,
శ్రీపూర్వం జయపూర్వం చ తద్ద్విధా రామనామ చ.
త్రయోదశాక్షరో మంత్రో మునిరహ్మా విరాట్స్మృతమ్,
ఛన్దస్తు దేవతా ప్రోక్తో రామః పాపౌఘనాశనః.
షడంగాని ప్రకుర్వీత ద్విరావృత్త్యా పదత్రయైః,
ధ్యానార్చనాదికం పర్వం హ్యస్య కుర్యాద్దశార్ణవత్.
ఇక ఇపుడు సిద్ధిదాయకమగు మహాసుదర్శనమంత్రమును చేప్పెదను.
“సుదర్శన! మహాచక్రరాజేశ్వర ! దుష్టాంతక ! దుష్టభయానక !
దుష్ట భయంకర ! ఛిన్ద ! ఛిన్ది ! భిన్ది ! భిన్ది ! విదారయ విదారయ !
పరమంత్రాన్ గ్రస ! గ్రస ! భక్షయ భక్షయ ! త్రాసయ ! త్రాసయ !
స్వాహా !”
అనునది మంత్రము. అరువది యెనిమిదక్షరములు - గలది. ఈ మంత్రము యనసంవేషనమునకు ఉపయోగించును. “ఓమ్ నమో భగవతే రఘనందనాయ రక్షోఘ్న విశదాయ మధురప్రసన్నవరదానాయ అమిత తేజసే బాలాయ రామాయ విష్ణవే నమః” అనునది నలుబది యేడక్షరములు గల మంత్రము. దీనిని మాలామంత్రమందురు. ఈ మంత్రమునకు విశ్వామిత్రమహర్షి ముని. గాయత్రీ ఛన్దస్సు శ్రీరాముడు దేవత ధ్రువబీజము కద్వయము శక్తి షడ్రీరస్వరయుగ్మబీజముచే అంగన్యాసమును గావించవలయును. ఈ మంత్రమునకు ధ్యాన పూజాదికమంతయు పూర్వము వలే ఆచరించవలయును. ఇట్లు ఆరాధించబడిన ఈ మంత్రము సర్వకామముల నిచ్చును. స్వకామసత్యవాగ్లలక్ష్మీ తారాడ్యము పంచవర్ణకము. షడక్షర మంత్రము షడ్విధము చతుర్వర్గఫల ప్రదము. బ్రహ్మ సంమోహనము. దక్షిణామూర్తి శక్తి అగస్త్యుడు శ్రీ శివుడు మునులు. తేజోకామబీజానికి విశ్వామిత్రుడు ఋషి. గాయత్రీ ఛన్దస్సు శ్రీరాముడు దేవత. బీజశక్తి ఆధమాంత్యము. మంత్రవర్ణములచే షడంగన్యాసము చేయవలయును. షడ్డీరయుక్త బీజములచే మంత్రవర్ణన్యాసము చేయవలయును. కల్పవృక్షమూలమున సువర్ణమయమండపమున పుష్పకవిమానాంతర్భాగమున సింహాసనము పై భాగమున అష్టదల పద్మమున ఇంద్రనీల సమప్రభుడు, వీరాసనసమాసీనుడు జ్ఞానముద్రోపశోభితుడు వామోరున్యస్తహస్తుడు, సీతాలక్ష్మణ సేవితుడు రత్నాకల్పుడగు శ్రీరామ విభుని ధ్యానించి అక్షర లక్షమంత్రమును జపించవలయును. లేదా స్మారాది మంత్రములను జయాభుడగు హరిని స్మరించవలయును. కామ్యకర్మలయందు ప్రయోగములను, పూజను షడక్షర మంత్రము వలె చేయవవలయును. “ఓం రామచంద్రాయనమః” “ఓం రామభద్రాయనమః” అనునవి రెండు మంత్రములు. అష్టాక్షరములు కలవి తారాంత్యములైనచో నవాక్షరములు కలవి. ఈ మంత్రములకు పూజాదికమంతటిని షడక్షరీవలెనే చేయవలయును. “ఓం జానకీ వల్లభాయనమః” అనునది దశాక్షరీ మంత్రము. ఈ మంత్రమునకు వశిష్ఠమహర్షి ముని. స్వరాట్చనస్సు. దేవత సీతాపతి ఆదిమబీజము. స్వాహాశక్తి. షడంగన్యాసమును యథోక్తముగా నాచరించవలయును. శిరోలలాట భ్రూమధ్యతాలు కంఠహృదయనాభి అంఘీ జొనుపాదములందు మంత్రముల దశాక్షరములను న్యాసము చేయవలయును. అయోధ్యానగరమున రత్నచిత్రసువర్ణ మండపమున మందారపుష్పబద్దవితానమున తోరణయుతమైన సింహాసనమున పుష్పకోపరి భాగమున నున్న వానిని, రాక్షసులచే వానరులచే దేవతలచే విమానముల నుండి స్తుతించబడు వానిని, వినయశీలుడగు మునులచే సేవించబడువానిని, వామభాగమున సీతాదేవిచే శోభించువానిని, లక్ష్మణసహితుని, శ్యామాంగుని, ప్రసన్నవదనుని, సర్వాభరణభూషితుని, రామచంద్రుని ధ్యానించి అక్షరలక్ష జపము నాచరించవలయును. దశాంశమును కమలములచే హోమమును గావించవలయును. పూజాదికమును షడక్షరి మంత్రము వలె చేయవలయును. “రామాయ ధనుష్పాణయే స్వాహా” అను మంత్రము దశాక్షరములు కలది. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ విరాట్చనస్సు. రాక్షసమర్ధనుడగు రామచంద్రుడు దేవత, బీజము ఆద్యము, ద్వితము శక్తి. బీజముచే అంగన్యాసమును చేయవలయును. వర్ణన్యాసమును, ధ్యానమును, పురశ్చర్య అర్చనాదికమును దశాక్షరమంత్రమునకు వలె చేయవలయును. చాప బాణధరుడగు రాముని స్మరించవలయును. “ఓం నమో భగవతే రామచంద్రాయ” “ఓం నమో భగవతే రామ భద్రాయ” అనునవి ద్వాదశాక్షరి మంత్రములు. ఋషి ధ్యానాదికమును పూర్వము వలె నాచరించవలయును. రామనామము శ్రీ పూర్వము జయ పూర్వము అని రెండు విధములు. ఇట్లు చేసినచో పై మంత్రములు త్రయోదశాక్షరములు కలవగును. బ్రహ్మముని, విరాట్చన్లస్సు పాపసమూహానాశకుడగు రాముడు దేవత. మూడు పదములచే ద్విరావృత్తిచే షడంగన్యాసమును చేయవలయును. ఈ మంత్రమునకు ధ్యానార్చనాదికమునంతటిని దశాక్టరోక్తముగా నాచరించవలయును.
తారో నమో భగవతే రామాయాంతే మహాపదమ్,
పురుషాయ హృదంతోఽయం మనుష్టాదశాక్షరః.
విశ్వామిత్రో మునిశ్చన్దో ధృతీ రామోప్య దేవతా,
తారో బీజం నమశ్శక్తిశ్చంద్రాక్ష్యబ్ధ్యగ్నిషడ్భుజై:.
వర్ణైర్మంతోత్థితైః కుర్యాచ్షడంగాని పమాహితః,
విశ్శాణభేరీపటహ శంఖతుర్యాదీనిస్స్వనైః.
ప్రవృత్తనృత్యే పరితో జయమంగలభాషితే,
చన్దనాగురుకస్తూరీకర్పూరాదిసువాపితే.
నాకుసుమసౌరభ్యవాహిగంధవహాన్వితే,
దేవగంధర్వనారీభిర్గాయన్త భిరలంకృతే..
సింహాసనే సమాపీనం పుష్పకోపరి రాఘవమ్,
సౌమిత్రి పీతాసహితం జటాముకుటశోభితమ్.
చాపబాణధరం శ్యామం ససుగ్రీవవిభీషణమ్,
హత్వా రావణమాయాంతం కృతత్రైలోక్యరక్షణమ్.
ఏవం ధ్యాత్వా జ పేద్వర్ణలక్షం మంత్రి దశాంశత:,
ఘృతాకై: పాయ సైర్హుత్వా యజనం పూర్వవచ్చరేత్.
ప్రణవో హృదయం పీతాపతయే తదనన్తరమ్,
రామాయ హనయుగ్మాంతే వర్మాస్త్రాగ్ని ప్రియాంతిమః.
ఏకోనవింశద్వర్ణోయం మన్త్రర్వార్థసాధకః,
విశ్వామిత్రో మునీశ్చాస్యానుష్టుప్ఛన్ద ఉదాహృతమ్.
దేవతా రామభద్రో జం బీజం శక్తిర్నమ ఇతి,
మంత్రోత్థితైః క్రమాద్వర్ణైస్తతో ధ్యాయేచ్చ పూర్వవత్.
పూజనం కామ్యకర్మాది పర్వమస్య షడర్ణవత్,
తారస్స్వబీజం కమలా రామభద్రేతి సంపఠేత్.
మహేష్వాప పదాంతే తు రఘవీర నృపోత్తను,
దశాస్యాంతకశబ్దాంతే మాం రక్ష దేహి సంపఠేత్.
పరమాంతే మే శ్రియం స్యాన్మంత్రో బాణగుణాక్షరః,
బీజైర్వియుక్తో ద్వాత్రింశదర్ణోయం ఫలదాయకః,
విశ్వామిత్రో మునిశ్చాస్యానుష్టుప్ఛన్ద ఉదాహృతమ్,
దేవతా రామభద్రోత్ర బీజం' స్వం శక్తిరిన్దిరా.
బీజత్రయాద్యైః కుర్వీత సదైస్సర్వేణ మంత్రవిత్,
పంచాంగానీ చ విన్యస్య మంత్రవర్ణాన్క్రుమాన్న్య పేత్.
మూర్ద్ని భాలే దృశాశ్శ్రోతే గండయుగ్మే సనాపికే,
ఆస్యే దోస్సంధియుగలే స్తనహృన్నాభిష క్రమాత్.
కటౌ మేడ్రే పాయుపాదపంధిష్వర్ణాన్న్య పేన్మనోః,
ధ్యానార్చనాదికం చాస్య పూర్వవత్సముపాచరేత్.
లక్షత్రయం పురశ్చర్యా పాయ సైర్హవనం నుతమ్,
ధ్యాత్వా రామం పీతవర్ణం జపేల్లక్షం సమాహితః.
దశాంశం కమలైర్హుత్వా ధనైర్ధనపతిర్భవేత్,
తారో మాయా రామద్వంద్వం దాశరధాయ హృచ్చ వై.
ఏకాదశాక్షరో మంత్ర మున్యాద్యర్చాష్య పూర్వవత్ ,
త్రైలోక్యాంతే తు నాధాయ హృదంతో వసువర్ణవాన్.
ఆస్యాపి పూర్వవత్సర్వం న్యాపధ్యానార్చనాదికమ్,
ఆంజనేయపడొంతే తు గురవే హృదయాంతిమ:.
మంత్రో నవాక్షరోఽస్యాపి యజనం పూర్వవన్మతమ్,
జేన్తం రామపదం పశ్చాద్దృదయం పంచవర్ణవత్
మునిర్ధ్యానార్చనం చాప్య ప్రోక్తం సర్వం షడర్ణవత్,
రామాంతే చన్ద్రభద్రౌ చ జేన్తౌ పావకవల్లభా.
మంత్రౌ ద్వౌ చ సమాఖ్యాతౌ మున్యాద్యర్చాది పూర్వవత్,
వహ్నిశ్శేషాన్వితశ్చైవ చన్ద్రభూషితమస్తకః.
ఏకాక్షరో రఘుపతేర్మన్తః కల్పద్రుమోఽపరః,
బ్రహ్మా మునిస్స్యాద్గాయత్రీ చన్దో రామ్మోఽస్య దేవతా,
షడ్దీర్ఘాడ్యేన మంత్రేణ షడంగాని సమాచరేత్,
సరయూతీరమందారవేదికాపంకజాసనే.
శ్యామం వీరాసనా పీనం జ్ఞానముద్రోపశోభితమ్,
వామోరున్యస్తతద్ధస్తం పీతాలక్ష్మణసంయుతమ్.
అవేక్ష మాణత్మానం మన్మధామితతేజపమ్,
శుద్ధస్ఫటికసంకాశం కేవలం మోక్షకాంక్షయా.
చింతయేత్పరమాత్మానమృతులక్షం జపేన్మనుమ్,
పర్వం షడర్ణవచ్చాష్య హోమనిత్యార్చనాదికమ్.
వహ్ని శ్శేషాపనో భాంతః కేవలో ద్వ్యక్షరో మనుః,
ఏకాక్షరోక్తవత్సరం మునిధ్యానార్చనాదికమ్.
తారమానారమానంగ చాస్త్రబీజైర్ద్వివర్ణకః,
త్ర్యక్షరో మంత్రరాజస్స్యాత్షడ్విధస్సకలేష్టదః.
ద్వ్యక్షరశ్చన్ద్ర భద్రాన్తో ద్వివిధశ్చతురక్షరః,
ఏకార్తోక్తవదేతేషాం మునిధ్యానార్చనాదికమ్.
తారో రామశ్చతుర్థ్యన్తో వర్మాస్త్రం వహ్నివల్లభా,
అష్టోర్ణోయం మహామంత్ర మున్యాద్యర్చా షడర్ణవత్.
తారో మాయా హృదంతే స్యా రామాయ ప్రణవాంతమః,
శివో మా రామమంత్రోయమష్టార్ణస్సర్వ సిద్ధిదః.
ఋషిస్సదాశివః ప్రోక్తో గాయత్రీ ఛన్దరీతమ్,
శివోమా రామచంద్రోత్ర దేవతా పరికీర్తితః.
షద్వీర్యయామాయ యాతు ధ్రువపంచార్ణయుక్తయా,
షడంగాని విధాయాథ ధ్యాయేద్ధృది సురార్చితమ్.
రామం త్రినేత్రం సోమార్ధధారిణం శూలినం వరమ్,
భస్మోద్ధూలితపర్వాంగం కపర్దినముపాస్మ .
రామాభిరామాం సౌందర్య సీమాం సోమావతంసినీమ్,
పాశాంకుశధనుర్బాణధరాం ధ్యాయేత్త్రిలో చనీమ్.
ఏవం ధ్యాత్వా జపేద్వర్ణలక్షం త్రిమధురాన్వితైః,
బిల్వపత్రైః ఫలైః పుష్పైస్త్రీలైర్వా పంకజైర్హునేత్.
స్వయమాయాన్తి నిధయస్సిద్ధయశ్చ సురేప్సితాః,
తారో మాయా చ భరతాశ్రగ్రజరామమనో భవః.
వహ్నిజాయా ద్వాదశార్ణో మన్త్రకల్పద్రుమో పరః,
అంగిరాశ్చ మునిశ్ఛన్దో గాయత్రీ దేవతా పునః.
శ్రీరామో భువనాబీజం స్వాహా శక్తిస్సమీరితః,
చన్ద్రేకమునిభూనేత్రైర్మనార్లెరంగకల్పనమ్.
ధ్యానపూజాదికం చాస్య సర్వం కుర్యాత్తడర్లవత్,
ప్రణవో హృదయం సీతాపతే రామశ్చ జేస్తామః.
హనద్వయాంతే వర్మాస్త్రం మన్తషోడశవర్ణవాన్,
అగస్యోస్య మునిశ్ఛన్లో బృహతీ దేవతా పునః.
శ్రీరామోహం తథా బీజం రాం శక్తిస్సముదీరితా,
రామాజ్ఞివహ్ని వేదాక్షివర్ణః పంచాంగకల్పనా.
ధ్యానపూజాదికం సర్వమస్య కుర్యాత్తడర్లవత్,
తారో హృచ్చేవ బ్రహ్మణ్య సేవ్యాయ పదమీరయేత్.
రామాయాకుంఠశబ్దాంతం తేజసే చ సమీరయేత్,
ఉత్తమశ్లోకధుర్యాయ సంభృగుః కామికాన్వితః.
దండార్పితాం ప్రియే మంత్రో రామరామాక్షరో మతః,
ఋషిశ్శుక్రస్తథానుష్టుప్ఛందో రామోప్య దేవతా.
పాదైసర్వేణ పంచాంగం కుర్యాచ్ఛేషం షడర్లవత్,
లక్షం జపో దశాంశేన జుహుయాత్సాయ సైస్సుధీః.
సిద్ధమంత్రస్య భుక్తిస్స్యాన్ముక్తిః పాతకనాశనమ్.
“ఓం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః” అను మంత్రము పదునెనిమిదకరములు కలది. ఈ మంత్రమునకు విశ్వామిత్రుడు మహర్షి. ధృతి ఛన్దస్సు. రాముడు దేవత ఓం అనునది బీజము. నమః ఆనునది శక్తి. 1,3,4,6,2 మంత్రవర్ణములచే షడంగన్యాసము చేయవలయును. నిశ్శాణభేరీపటహ శంఖతూర్యాది ధ్వనులచే చుట్టూ నృత్యము జరుగుచుండగా, జయమంగలనాదములు చెలరేగుచుండగా, చందనాగురు కస్తూరీ కర్పూరాది పరిమళ వస్తువులు నిండగా పయి . విధముల పుష్పముల సువాసనలను వాయువు తెచ్చుచుండగా, పాడుచున్న దేవగంధర్వ స్త్రీలచే శోభించుచుండగా, సింహాసనమున పుష్పకోపరిభాగమున సమాసీనుడైన సీతా లక్ష్మణ సహితుడు, జయామకుట శోభితుడు, చాపబాణధరుడు,శ్యామసుందరుడు, సుగ్రీవ విభీషణాదిసహితుడు త్రైలోక్యరక్షకుడు యుద్ధమున కొచ్చిన రావణుని చంపినవాడు అగు రామచంద్రుని ధ్యానించి అక్షర లక్ష జపించి, దశాంశమును నేయి కలిపిన పాయసముచే హోమమును చేయవలయును. పూజాదికమును పూర్వము వలె నాచరించవలయును. “ఓం నమో సీతాపతయే రామాయ హన హన హుం ఫట్ స్వాహా"అనునది పందొమ్మిది అక్షరముల మంత్రము. సర్వార్థ సాధకము. విశ్వామిత్రుడు ఋషి అనుష్టుప్ఛనస్సు. రామభద్రుడు దేవత. జం అనునది బీజము. నమః అనునది శక్తి మంత్రవర్ణములచే అంగన్యాసము గావించి పూర్వము వలే ధ్యానమును చేయవలయును. పూజనోదికమంతయు షడక్షరివలే నాచరించవలయును. “ఓం నమో కమలా రామభద్ర మ హేష్వాస రఘు వీర నృపోత్తమ దశాస్యాంతక మాం రక్ష దేహి పరమాం శ్రియమ్.” అనునది ముప్పదేడక్షరములు గల మంత్రము. బీజములు లేనిచో ముప్పది రెండక్షరములు గల మంత్రమిది. సర్వఫలదాయకము. విశ్వామిత్ర మహర్షి ఋషి. - అనుష్టుప్ఛన్లస్సు. రామభద్రుడు దేవత, స్వం బీజము. ఇందిరా శక్తి బీజత్రయోద్యములు గల పదములచే పంచాంగన్యాసము చేయవలయును. శిరస్సున, ఫాలభాగమున, నేత్రములలో, శ్రోత్రములలో గండద్వయమున, నాసికయందు, ఆస్యమున, బాహువులందు, సంధులందు, స్తనములందు, హృదయమున, నాభియందు, కటియందు, మేడ్రమున, పాయుపొద సంధులలో మంత్రాక్షర న్యాసమును గావించవలయును. ధ్యానొర్చనాదికమును పూర్వమువలే నాచరించవలయును. లక్షత్రియ జపము, పొయసహవనము పురశ్చర్య పీత వర్ణుడగు రాముని ధ్యానించి నావధానముచే లక్షజపము చేయవలయును. దశాంశమును కమలములచే హోమమును గావించి ధనపతి యగును. ఓఓఓం రమారమా దశరధాయ నమః” అనునది ఏకాదశాక్షర మంత్రము. మున్యాదికము పూజాదికమంతయు పూర్వము వలే నాచరించవలయును. “త్రైలోక్యనాధాయ నమః” అనునది అష్టాక్షర మంత్రము. న్యాస ధ్యానాదిక మంతయు పూర్వమువలే నాచరించవలయును. “ఆంజనేయగురవే నమః” అనునది నవాక్షర మంత్రము. ఈ మంత్రమునకు పూజాదికమును పూర్వము వలె నాచరించవలయును.“రామాయనమః” అనునది పంచాక్షర మంత్రము. మునిధ్యాన పూజాదికమంతయు షడక్షరిమంత్రమువలె నాచరించవలయును. రామచంద్రాయ స్వాహా” “రామ భద్రాయ స్వాహా" అను రెండుమంత్రములకు కూడా మునిధ్యానార్చనాదికము పూర్వము వలె నాచరించవలయును. శేషాన్వితుడగు వహ్ని చంద్ర భూషితమస్తకుడు రామచంద్రుని ఏకాక్షర మంత్రము. మరియొక కల్పవృక్షము. ముని బ్రహ్మ గాయత్రీ ఛందస్సు శ్రీరామచంద్రుడు దేవత. షడ్దర్గాఢ్యమంత్రముచే షడంగములనాచరించవలయును. సరయూ తీరమున మందార వేదిక పై పద్మాసనమున, వీరాసనాసీనుడు శ్యామాంగుడు, జ్ఞానముద్రోపశోభితుడు, వామోరున్యస్త హస్తుడు సీతాలక్ష్మణసహితుడు, ఆత్మదర్శి మన్మధాతీత తేజస్కుడు, శుద్ధస్ఫటిక సంకాశుడు పరమాత్మ అయిన శ్రీరామచంద్రుని మోక్షాభిలాషులు ధ్యానించి మంత్రమును ఆరు లక్షలు జపించవలయును. హోమనిత్యార్చనాదికమును షడక్షరమంత్రమువలె నాచరించవలయును. శేషాసన వహ్నిభాంతమున ద్వ్యక్షరమనువు ఏకాక్షరమంత్రమువలె సర్వము నాచరించవలయును. త్ర్యక్షర మంత్రరాజము సకలాభీష్టప్రదము. చంద్రభద్రాంతము చతురక్షరము " ద్వివిధము. ఈ మంత్రములన్నింటిని మునిధ్యానార్చనాదికమంతయు ఏకాక్షరమంత్రము వలె నాచరించవలయును. “ఓం రామాయ హుం ఫట్ స్వాహా” అనునది అష్టాక్షర మంత్రము. మునిధ్యేనార్చనాదికమంతయు షడక్షరమంత్రము వలె నాచరించవలయును. ఇట్ల శివోమారామమంత్రములు అష్టాక్షరములు గల మంత్రములు సర్వాభీష్టప్రదములు. సదాశివుడు ఋషి గాయత్రీ ఛన్దస్సు శివోమారామచంద్రుడు దేవతా. షడ్వీర్యయుతమగు పంచాక్షరయుక్తమగు ధ్రువముచే షడంగన్యాసము నాచరించి, హృదయమున సురార్చితుడగు రాముని, సోమార్ధధారి, త్రినేత్రుడు, శూలి, భస్మోద్ధూలిత సర్వాంగుడు కపర్ది అయిన శివుని ధ్యానింతుము. రామాభిరామ, సౌందర్య సీమ, సోమాభరణ, పాశాంకుశధనుర్బాణధారిణి, త్రిలో చనయగు సీతను ధ్యానించి అక్షరలక్ష జపించవలయును. బిల్వపత్రములతో. ఫలములతో పుష్పములతో 'పద్మములతో హోమమును చేయవలయును. ఇట్లు చేసినచో దేవతలచే అభిలషించబడు నిధులు సిద్ధులు స్వయముగా వచ్చి చేరును. తారము మాయ"భరతాగ్రజరామమనోభవస్వాహా” అనునది ద్వాదశాక్షరి మంత్రము" ఇది "మరియొక కల్పవృక్షము ముని అంగిరసుడు. గాయత్రీ ఛందస్సు-శ్రీరామచంద్రుడు - దేవత భువనబీజము స్వాహా శక్తి ,,,, మంత్రాక్షరములచే షడంగన్యాసమునాచరించవలయును. ధ్యానపూజాది కమంతయు షడక్షరివలే నాచరించవలయును. “ఓం నమస్సీతాపతయే రామాయ హనహన ఫట్” అనునది షోడశాక్షర మంత్రము. అగస్త్యమహర్షిముని. బృహతీ ఛందస్సు. శ్రీరామ చంద్రుడు దేవత. అహం బీజము, రాం శక్తి 1,1,7,1,3 వర్ణములచే పంచాంగ కల్పన చేయవలయును. ధ్యాన పూజాదికమంతయు షడక్షరమంత్రమువలె నాచరించవలయును. “ఓం నమో బ్రహ్మణ్య సేవ్యాయ రామాయ అకుంఠతేజ సే ఉత్తమ శ్లోకధుర్యాయ" అనునది మరియొక మంత్రము. శుక్రుడు ఋషి అనుష్టుప్పన్లస్సు. శ్రీరామచంద్రుడు దేవత. షడక్షరిమంత్రమువలె పానములచే పంచాంగకల్పన చేయవలయును. మంత్రమును ఒక లక్ష జపించవలయును. దశాంశము పాయసముచే హోమము నాచరించవలయును. ఈ మంత్రము సిద్ధించినచో సర్వపాపములు నశించును. భుక్తిముక్తులు లభించును.
ఆదౌ దాశరథాయాంతే విద్మ హే పదముచ్చరేత్.
తత సీతావల్లభాయ ధీమహీతి సముచ్చరేత్,
తన్నో రామః ప్రచోవర్ణోదయాదితి చ సంవదేత్
ఏషోక్తా రామగాయత్రీ పర్వాభీష్టఫలప్రదా,
పద్మా సీతాపదం జేస్తం తద్వయాంతం షడక్షరః.
వాల్మీకిశ్చ మునిశ్ఛన్దో గాయత్రీ దేవతా పునః,
సీతా భగవతీ ప్రోక్తా శ్రీం బీజం వహ్నిసుందరీ.
శక్తిష్టడ్దీర్ఘయుక్రేన బీజేనాంగాని కల్పయేత్,
తతో ధ్యాయేన్మహాదేవీం సీతాం త్రైలోక్యపూజితామ్.
తప్త హాటకవర్ణాభాం పద్మయుగ్మం కరద్వయే,
సద్రత్నభూషణస్ఫూర్జద్దివ్యదేహాం శుభాత్మికామ్.
నానావస్త్రాం శశిముఖీం పద్మాక్షీం ముదితాంతరామ్,
పశ్యంతీం రాఘవం పుణ్యం శయ్యార్థ్యం షడ్గుణేశ్వరీమ్.
ఏవం ధ్యాత్వా జ పేద్వర్ణలక్షం మంత్రి దశాంశతః,
జుహుయాత్కమలైః ఫుల్లైః పీఠే పూర్వోదితే యజేత్.
మూర్తిం సంకల్ప్య మూలేన తస్యామావాహ్య జానకీమ్,
సంపూజ్య దక్షిణే రామమభ్యర్చ్యాగ్రేఽనిలాత్మజమ్.
పృష్టే లక్ష్మణమభ్యర్చ్య షట్కోణేష్వంగపూజనమ్,
పత్త్రేషు మంత్రముఖ్యాంశ్చ బాహ్యే లోకేశ్వరానునః.
వజ్రాద్యానపి సంపూజ్య పర్వసిద్దేశ్వరో భవేత్,
జాతీపు ష్పైశ్చన్దనాకై రాజవశ్యాయ హోమయేత్.
కమలైర్ధనధాన్యాప్తిర్నీలాబ్జైర్వశయన్జగత్,
బిల్వపత్రైశ్శ్రియః ప్రాప్తిర్దూర్వాభీ రోగశాంతయే.
కిం బహూక్తేన సౌభాగ్యం పుత్రాన్పౌత్రాన్సరం సుఖమ్,
ధనం ధాన్యం చ మోక్షం చ సీతారాధనతో లభేత్.
శక్రస్సేన్దుర్లక్ష్మణాయ హృదయం సప్తవర్ణవాన్,
అగస్త్యోస్య మునిశ్ఛన్దో గాయత్రీ దేవతా పునః.
లక్ష్మణాభ్యో మహావీరశ్చాఢ్యం హృద్బీజశక్తి కే,
షడ్డీర్గాఢ్యన బీజేన షడంగాని సమాచరేత్.
ద్విభుజం స్వర్ణరుచిరతనుం పద్మవిభేక్షణమ్,
ధనుర్బాణకరం రామం సేవాసంసక్తమానసమ్.
ధ్యాత్వైవం ప్రజ పేద్వర్ణలక్షం మంత్రీ దశాంశతః,
మధ్వాక్తైః పాయ సైర్హుత్వా రామపీఠే ప్రపూజయేత్.
రామనద్యజనం చాస్య సర్వసిద్ధిప్రదో హ్యయమ్,
సాకల్యం రామపూజాయా యదిచ్ఛేన్నియతో నరః.
తేన యత్నేన కర్తవ్యం లక్ష్మణార్చనమాదరాత్,
శ్రీరామచన్ద్రభేదాస్తు బహవస్సన్తి సిద్ధిదాః.
తత్సాధకైస్సదా కార్యం లక్ష్మణారాధనం శుభమ్,
అష్టోత్తరపహస్రం వా శతం వా పుసమాహితైః.
లక్ష్మణస్య మనుర్జపో ముముక్షుభితంద్రితైః,
అజప్త్వా లక్ష్మణమనుం రామమంత్రాన్జపంతి యే.
న తేషాం జాయతే సిద్ధిర్హనిరేవ పదే పదే,
యోజపేల్లక్ష్మణమనుం నిత్యమేకాంతమాష్ఠితః.
ముచ్యతే సర్వపా పేభ్యస్సర్వాన్కామానవాప్నుయాత్,
జయప్రధానో మంత్రోయం రాజ్యప్రాప్తైకసాధనమ్.
నష్టరాజ్యాప్తయే మస్త్రం జపేల్లక్షం సమాహితః,
సోఽచిరాన్నష్టరాజ్యం పం ప్రాప్నోత్యేవ న సంశయః. ధ్యాయన్రామామయోధ్యాయామభిషిక్త మనన్యదీ:
పంచాయుతం మనం జప్త్వా నష్టరాజ్యమవాప్నుయాత్.
నాగపాశవినిర్ముక్తం ధ్యాత్వా లక్ష్మణమాదరాత్,
అయుతం ప్రజు పేన్మన్త్రం నిగడాన్ముచ్యతే ధ్రువమ్.
వాతాత్మజేనానీతాభిరోషధీభిర్గతవ్యధమ్,
ధ్యాత్వా లక్షం జపన్మన్త్రమల్పమృత్యుం జయేద్ద్రువమ్.
ఘాతయన్తం మేఘనాదం ధ్యాత్వా లక్షం జుపేన్మనుమ్,
దుర్జయం వాపి వేగేన జయేట్రిపుబలం మహత్.
ధ్యాత్వా శూర్పణఖానాసాఛేదనోద్యుక్తమానసమ్,
సహస్రం ప్రజు పేన్మన్త్రం పురుహూతాదికాన్జయేత్.
రామపాదాబ్జి సేవార్థం కృతోద్యోగమధౌ స్మరన్,
ప్రజపంల్లక్షమేకాన్తే మహారోగాతముచ్యతే.
త్రిమాసం విజితాహారో నిత్యం పడ్డపహస్రకమ్,
అష్టోత్తరశతైః పుష్పైర్నిశ్ఛిద్రైశ్శతపత్రకైః
పూజయిత్వా విధానేన పాయసం చ సశర్కరమ్,
నివేద్య ప్రజపేన్మన్త్రం కుష్టరోగాతముచ్యతే.
విజనే విజితాహారప్షణ్మాసం విధినాము,
క్షయరోగాత్ప్రముచ్యేత సత్యం సత్యం న సంశయం.
అభిమంత్ర్య జలం ప్రాతర్మంత్రేణ త్రిస్సమాహితః,
త్రిసంధ్యం వా పిబేన్నిత్యం ముచ్యతే సర్వరోగతః.
దారిద్ర్యం వా పరాభూతం జాయతే ధనదోపమః,
విషాదిదోషసంస్పర్శో న భవేత్తు కదాచన.
మనునా మన్త్రితైస్తోయైః ప్రత్యహం క్షాళయన్ముఖమ్, ముఖనేత్రాదిపంభూతాఞ్జయేద్రోగాంశ్చ దారుణాన్.
పీత్వాభిమంత్రితం త్వమ్బః కుక్షి రోగాణయేద్ధ్రువమ్,
లక్ష్మణప్రతిమాం కృత్వా దద్యాద్భక్త్యా విధానతః.
స సర్వేభ్యోథ రోగేభ్యో ముచ్యతే నాత్ర సంశయః,
కన్యార్థి విమలా పాణిగ్రహణాపక్తమానసః.
ధ్యాయన్లక్షం జపేన్మంత్రీ అబ్జైర్హుత్వా దశాంశతః,
ఈప్సితాం లభతే కన్యాం శీఘ్రమేవ న సంశయః.
దీక్షితం జృంభణాస్త్రాణాం మంత్రేషు నియతవ్రతమ్,
ధ్యాత్వా చ విధివన్నిత్యం జపేన్మా సత్రయం మనుమ్.
పూజాపురస్సరం సప్తపహస్రం విజితేంద్రియః,
పర్వాసామపి విద్యానాం తత్త్వజ్ఞో జాయతే నరః.
విశ్వామిత్రక్రతువరే కృతాద్భుతపరాక్రమమ్,
ధ్యాయంల్లక్షం జపేన్మన్త్రం ముచ్యతే మహతో భయాత్.
కృతనిత్యక్రియశ్శుద్ధస్త్రీకాలం ప్రజ పేన్మనుయ్,
సర్వపాపవినిర్ముక్తో యాతి విష్ణోః పరం పదమ్..
దీక్షితో విధివన్మన్త్రీ గుణైర్విగతకల్మషః,
స్వాచార నియతో దాంతో గృహస్థో విజితేంద్రియః.
ఐహికానన పేక్ష్యేవ నిష్కామో యోఽర్చయేద్విభుమ్,
ససర్వాన్పుణ్య పాపౌఘాన్దగ్ధా నిర్మలమానసః.
పునరావృత్తిరహితశ్శాశ్వతం పదమశ్నుతే,
సకామో వాఞ్చితాన్ లబ్ధ్వా భుక్త్వా భోగాన్మనోగతాన్.
జాతీష్మ రశ్చిరం భూత్వా యాతి విష్ణోః పరం పదమ్,
దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి.
దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్"' అనునది రామగాయత్రి ఈ గాయత్రి సర్వాభీష్టఫలప్రదాయిని. “పద్మా సీతాయై ఫట్" అనునది షడక్టరి వాల్మీకి ముని. గాయత్రీ ఛందస్సు భగవతి సీత దేవత, శ్రీం అనునది బీజము. స్వాహా శక్తి. షడ్డీర్ఘయుక్తమగు బీజముచే అంగకల్పన చేయవలయును. తరువాత త్రైలోక్యపూజిత మహాదేవి తప్తకాంచన సన్నిభ, హస్తద్వయమున పద్మద్వయమును ధరించి రత్నభూషణములచే శోభించు దివ్య దేహము గలది, శుభాత్మక, నానావస్త్రధారిణి, చంద్రముఖి, పద్మాక్షి, సంతుష్టాంతరంగ, పావనుడగు రామచంద్రుని చూచుచుండునది, షడ్గుణేశ్వరి యగు సీతను ధ్యానించవలయును. ఇట్లు ధ్యానము చేసి మంత్రమును అక్షరలక్ష జపించవలయును. దశాంశమును కమలములతో హోమము చేయవలయును. పూర్వోక్త పీఠమున పూజించవలయును. మూల మంత్రముతో మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు జానకి నావాహించి, దక్షిణ భాగమున రామచంద్రుని, అగ్రభగమున హనుమంతుని, పృష్ఠభాగమున లక్ష్మణుని పూజించి, షట్కోణములందు అంగపూజ గావించి, పత్రములందు మంత్రిముఖ్యులను బాహ్యభాగమున లోకాధిపతులను, వజ్రాదులను పూజించి సర్వ సిద్ధీశ్వరుడగును. చందనము నలదీశ జాతీపుష్పములచే హోమమును గావించిన రోజులు వశులగుదురు. కమలములచే హోమము గావించిన జగత్తు వశమగును. మారేడు దళములచే హోమముచేసినచో సంపద, దూర్వాదళములచే హోమము గావించిన రోగములు శాంతించును. ఇంకను ఏమి చెప్పవలయును. సీతారాధన వలన ధనము, ధాన్యము, సౌభాగ్యము పుత్రులు, పౌత్రులు, ఉత్తమ సుఖము, మోక్షము లభించును. “ఓం లక్ష్మణాయ నమః” అనునది, సప్తాక్షరీ మంత్రము. ఈ - మంత్రమునకు అగస్త్యమహర్షిముని, గాయత్రీ ఛందస్సు మహావీరుడగు లక్ష్మణుడు దేవత, నమః అనునది బీజము, శక్తి షడీరాడ్యమగు బీజముచే షడంగముల నాచరించవలయును. బాహుద్వయములు కలవాడు, స్వర్ణనిభదేహుడు, పద్మాకుడు, ధనుర్బాణధరుడు, రామ సేవాసంసక్తమానసుడు అగు లక్ష్మణుని ధ్యానము గావించి మంత్రమునను అక్షరలక్ష జపించవలయును. దశాంశమును తేనే కలిపిన పొయసముచే హోమముగావించి రామపీఠమున పూజించవలయును. రామమంత్రము వలెనే పూజాదికమును గావించవలయును. ఈ మంత్రము సర్వసిద్ధిప్రదము. రామపూజ సంపూర్ణము కావలయునని భావించినచో ఆదరముచే లక్ష్మణార్చన గావించవలయును. శ్రీరామచన్దమంత్రములలో చాలా భేదములు సిద్దిప్రదములు గలవు. ఆ మంత్ర సిద్ధిని కోరువారు. లక్ష్మణారాధనను తప్పకగొచరించవలయును. అష్ణోత్తర సహస్రము కాని, అష్టోత్తర శతము కొని లక్ష్మణ మంత్రమును సావధానముగా ముముక్షువులు జాడ్యమును వీడి జపించవలయును. లక్ష్మణ మంత్రమును జపించక రామమంత్రమును జపించినవారికి సిద్ది కలుగక పోగా ప్రతిక్షణము హానియే కలుగుచుండును. ఏకాంతమున లక్ష్మణ మంత్రమును జపించువారు, సర్వపాపవినిర్ముక్తులై సర్వాభీష్టములను పొందెదరు. ఈ మంత్రమునకు ముఖ్యఫలము జయము. రాజ్యప్రాప్తికి ఉత్తమ సాధనము, నష్టరాజ్యప్రాప్తికి ఈ మంత్రమును ఒక లక్ష సావధానమనస్కుడై జపించినచో వెంటనే స్వరాజ్యమును పొందును. అనన్యమనస్కుడై అయోధ్యాభిషిక్తుడగు రాముని ధ్యానించుచు, మంత్రమును యాబది వేలు జపించినచో నష్టరాజ్యము లభించును. నాగపాశ వినిర్ముక్తుడగు లక్ష్మణుని ఆదరముచే ధ్యానించి మంత్రమును పది వేలు జపించినచో బంధముక్తుడగును. హనుమంతునిచే తేబడిన ఔషధములచే గతవ్యధుడగు లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో అపమృత్యువును జయించును. మేఘనాధుని సంహరించుచున్న లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో జయింప శక్యముకాని శత్రు బలమును కూడా త్వరలో జయించును. శూర్పణఖ నాసికను ఛేదించు ప్రయత్నమున నున్న లక్ష్మణుని ధ్యానించి ఒకవేయి జపించినచో ఇంద్రాదులను సైతము జయించును.
రామపాదపద్మములను సేవించుట కొఱకు ప్రయత్నించు లక్ష్మణుని ధ్యానించి ఏకాంతమున లక్ష జపించినచో మహా రోగమునుండి విముక్తుడగును. మూడు మాసములు ఆహారనియమముతో ప్రతి నిత్యము నూటా ఎనిమిది పుష్పములచే కాని నిశ్చిద్రములైన పద్మముల చే కాని పూజించి, ఏడువేల మార్లు జపించినచో కుష్టురోగమునుండి వినిర్ముక్తుడగును. ఏకొంతమున ఆహార నియమముతో ఆరు మాసములు ఈ విధానమును అనుసరించినచో క్షయ రోగము నుండి వినిర్ముక్తుడగును. ప్రాతఃకాలమున సావధానమనస్కుడై మూడు మార్లు మంత్రించిన జలమును మూడు మార్లు మూడువేళలలో త్రాగినచో అన్ని రోగములనుండి వినిర్ముక్తుడగును. దారిద్ర్యము తోలగి కుబేరుడంతటి వాడగును. విషాది దోషస్పర్శకూడా కలుగదు. మంత్రించిన జలముచే ప్రతి నిత్యము ముఖ ప్రక్షాళనమును గావించు కొనినచో ముఖానేత్రాదులకు సంభవించు భయంకర రోగములను జయించగలుగును. మంత్రించిన జలమును పానముచేసినచో కుస్తీరోగములు తొలగిపోవును. లక్ష్మణప్రతిమను చేసి యథావిధిగా భక్తి చే బ్రాహ్మణునికి దొనము గావించినచో సర్వరోగములనుండి ముక్తుడగును. కన్యార్థియైనవాడు విమలాపాణిగ్రహణాసక్తమానసుడై ధ్యానము చేయుచు లక్ష జపించిన దశాంశమును పద్మములచే హోమమును గావించినచో త్వరలో తాను కోరిన కన్య లభించును. దీక్షితుని, జృంభణాస్తాది మంత్రములందు నియతవ్రతుని లక్ష్మణుని ధ్యానించి విధి విధానముచే ప్రతినిత్యము ఏడు వేలు జపించుచు మూడు నెలలు నియమము నాచరించి పూజాదులనుగావించినచో సర్వవిద్యాతత్త్వజ్ఞుడగును. విశ్వామిత్రయాగమున అద్భుత పరాక్రమమును చూపిన లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో మహా భయము నుండి ముక్తుడగును. నిత్యానుష్టానము నాచరించి ప్రీతి నిత్యము మూడు వేళలా పరిశుద్దుడై మంత్రమును జపించినచో సర్వపాపనిర్ముక్తుడై శ్రీ మహావిష్ణులోకమగు పరమపదమును పొందును. విధివిధానముగా దీక్షితుడై సద్గుణములచే గతకల్మషుడై స్వాచారనియతుడై అంతరింద్రియనిగ్రహము కలవాడై, గుహస్తుడు బహిరింద్రియములను జయించినవాడై, ఐహికములన పేక్షింపక నిష్కాముడై లక్ష్మణుని అర్చించినవాడు సర్వపాపపుణ్యరాసులను భస్మము గావించి నిర్మలమనస్కుడై పునరావృత్తి రహితమగు శాశ్వత పరబ్రహ్మలోకమును పొందును. సకొమునిగా పూజించినచో కోరిన కోరికలను పొంది, మనసున తలచిన భోగములననుభవించి చాలా జన్మలు పూర్వజన్మజ్ఞానము కలవాడై అన్యమున పరమ పదమును పొందును.
నిద్రాచంద్రాన్వితాపశ్చాద్భరతాయ హృదంతిమ.
సప్తాక్షరో మనుశ్చాస్య మున్యాద్యర్చాది పూర్వవత్,
ఒక స్సేన్దుశ్చ శత్రుఘ్నపరం జేన్తం హృదస్తామః.
సప్తాక్షరోఽయం శత్రుఘ్నమన్త్రస్సప ర్వేష్టసిద్ధిదః.
ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే సనత్కుమారవిభాగే తృతీయపాదే రామాద్యుపాసనావర్ణనం నామ త్రిసప్తతితమోఽధ్యాయః
శ్రీ భరతాయనమః” అనునది సప్తాక్షరీ మంత్రము. ఈ మంత్రమునకు ఋషి, ఛందస్సు, దేవతా, పూజాదికమంతయు పూర్వమంత్రమునకు వలెనే అని తెలియవలయును. “శ్రీ శత్రుఘ్నాయ నమః” అనునది సప్తాక్షర శత్రుఘ్నమంత్రము. సకలాభీష్టప్రదము.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున సనత్కుమారవిభాగమున తృతీయపాదమున రామాద్యుపాసనా వర్ణనమను డెబ్బదిమూడ - అధ్యాయము ముగిసినది.
Summary of chapter 74 of the Nārada Mahā Purana is as follows:
శ్రీరామ దూతయైన శ్రీ హనుమంతుని దివ్య మంత్రోపాసనా విధానము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. హనుమత్ మంత్ర జపము, కవచము మరియు అంజనేయ ఆరాధన వలన సర్వ గ్రహ దోషములు, భూత ప్రేత బాధలు నశించి ధైర్యము సిద్ధించునని నిరూపించబడినది.