74 - హనున్మన్త్ర కథనమ్

సనత్కుమార ఉవాచ : -

అథోచ్యన్తే  హనుమతో మన్త్రాస్సర్వేష్టదాయకాః,

యాన్సమారాధ్య విప్రేన్ద్ర తత్తుల్యాచరణా నరాః.

 మనుస్స్వరేందుసంయుక్తం గగనం చ భగాన్వితాః,

 హసఫాగ్నినిశాధీశాః ద్వితీయం బీజమీరితమ్

 స్వఫాగ్నయో భగేంద్వాడ్వస్త్రుతీయం బీజమీరితమ్,

 వియద్బృగ్వన్ని మన్విన్దుయుక్తం స్యాచ్చ చతుర్థకమ్.

పంచమం భగచంద్రాఢ్యా వియద్భ్రగుప్వకాగ్నయః,

మన్విందాడ్వౌ హసౌ షష్ఠం జేన్తస్స్యాద్ధనుమాంప్తతః.

హృదయాంతో మహామన్త్రరాజోఽయం ద్వాదశాక్షరః,

రామచన్ద్రో మునిశ్చాస్య, జగతీ ఛన్ద ఈరితమ్.

దేవతా హనుమాన్భీజం షష్ఠం శక్తిర్ద్వితీయకమ్,

షడ్భీజైశ్చ షడంగాని శిరో భాలే దృశోర్ముఖే.

గలే బాహుద్వయే చైన హృది కుక్షౌ చ నాభితః,

ధ్వజే జానుద్వయే పాదద్వయే వర్ణాన్క్రమాన్య సేత్.

షడ్భీజాని పదద్వన్ద్వం మూర్ద్ని భాలే ముఖే హృది,

నాభావూర్వోర్జంఘయోశ్చ పాదయోర్విన్యపేత్క్రమాత్.

అంజనీ గర్భసంభూతం తతో ధ్యాయేత్కపీశ్వరమ్,

ఉద్యత్కోట్యర్కసంకాశం జగత్ప్రక్షోభకారకమ్.

శ్రీరామాంఘిధ్యాననిష్ఠం సుగ్రీవప్రముఖార్చితమ్,

విత్రాపయన్తం నాదేన రాక్షసాన్మారుతిం భజేత్ .

ధ్యాత్వైవం ప్రజ పేద్భాను సహస్రం విజితేన్ద్రియః,

దశాంశం జుహుయాద్వ్రిహీన్పయోదధ్యాజ్యమిశ్రితాన్.

 పూర్వోక్తే వైష్ణవే పీఠే మూర్తిం సంకల్ప్య మూలతః,

ఆవాహ్యా తత్ర సంపూజ్య సాద్యాదిభిరుపాయనైః.

 కేశరేష్వంగపూజా స్యాత్పత్రేషు చ తతోర్చయేత్,

రామభక్తో మహాతేజాః కపిరాజో మహాబలః.

ద్రోణాద్రిహారకో మేరుపీఠకార్చనకారకః దక్షిణాశా భాస్కరశ్చ సర్వవిఘ్నవినాశకః

ఇత్ధం సంపూజ్య నామాని దళాగ్రేషు తతోఽర్చయేత్ సుగ్రీవమంగదం నీలం జాంబవన్తం నలం తథా.

సుషేణం ద్వివిదం మైన్దం లోకపాలాంప్తతోర్చయేత్ వజ్రాద్యానపి పంపూజ్య సిద్ధి శ్చైవం మనుర్భవేత్

మన్త్రం నవశతం రాత్రౌ జపేద్దశదినావధి యో నరస్తస్య నశ్యన్తి రాజశత్రూత్ధభీతయః

మాతులుంగామ్రకదలీఫలైర్హుత్వా సహస్రకమ్ ద్వవింశతి బ్రహ్మ చారివిప్రాన్సంభోజయేచ్ఛుచాన్

ఏవంకృతే భూతవిషగ్రహరోగాద్యుపద్రవాః నశ్యంతి తత్కణాదేవ విద్వేషిగహదానవాః

అష్టోత్తరశతేనాంబుమంత్రితం వషనాశనమ్ భూతాపస్మారకృత్యోర్థజ్వరే తన్మ స్త్రమన్త్రితైః

భస్మభిప్సలిలైర్వాపి తాడయేజ్జ్వరిణం మధా త్రిదినాజ్జ్వరముక్త్వో సౌ సుఖం చ లభతే నరః

ఔషదం వా జలం వాపి భుక్త్వా తన్మన్త్రమన్త్రితమ్ సర్వాన్రోగాన్పరాభూయ సుఖీ భవతి తత్కణాత్

తజ్ఞప్తభస్మ లిప్తాంగో భుక్త్వా తన్మన్త్రితం పయః యోద్ధుం గచ్ఛేచ్చ యో మంత్రి సంఘైర్న బాధ్యతే

శస్త్రక్షతం వ్రణస్పోటో లూతాస్పోటోఽపి భస్మనా త్రిర్జప్రేన చ సంప్పృష్టాశ్శుష్యంత్యేవ న సంశయః

 జ పేదర్కాస్తమారభ్య యావదర్కోదయో భవేత్ మన్త్రం సప్తదినం యావచ్చాదాయ భస్మకీలకౌ

నిఖనేదభిమన్త్య్రాశు శత్రూణాం ద్వార్యలక్షిత: విద్వేషం మిధ ఆపన్నా పలాయంతేఽరయోఽచిరాత్

భస్మాంబుచన్దనం మంత్రి మంత్రేణానేన మంత్రితమ్ భక్ష్యాది యోజితం యస్మై దదాతి స తు దాపవత్

క్రూరాశ్చ జంతవోఽప్యేవం భవన్తి వశవర్తినః గృహీత్వేశానదిక్సంస్థం కరంజతరుమూలకమ్

 కృత్వా తేనాంగుష్ఠమాత్రాం ప్రతిమాం చ హనూమతః,

కృత్వా ప్రాణప్రతిష్టాం చ సిందూరాద్యైః ప్రపూజ్య చ.

గృహస్యాభిముఖీం ద్వారే నిఖనేన్మన్త్రముచ్చరన్,

గ్రహాభిచారరోగాగ్నివిషచౌరనృపోద్భవాః .

 న జాయన్తే గృహే తస్మిన్ కదాచిదప్యుపద్రవాః,

తద్గృహం ధనపుత్రాద్యైరేధతే ప్రత్యహశ్చిరమ్.

నిశి యత్ర వనే భస్మ మృత్య్నయా వాపి యత్నతః,

శత్రోః ప్రతికృతిం కృత్వా హృది నామ పమాలిఖేత్.

కృత్వా ప్రాణప్రతిష్ఠాన్తo భిద్యాచ్ఛస్త్రైర్మనుం జపన్,

మంత్రాంతే ప్రోచ్చరేచ్ఛత్రోర్నామ ఛిన్ధీ చ ఛిన్ధీ చ.

 మారయేతి చ తస్యాంతే దంతైరోష్ఠం నిపీడ్య చ,

పాణ్యోస్తలే ప్రపీడ్యాథ త్యక్త్వా తం స్వగృహం వ్రజేత్.

కుర్వన్సప్తదినం చైవం హన్యాచ్ఛత్రుం న సంశయః,

రాజికాలవణైర్ముక్త చికురః పితృకాననే.

 ధత్తూర ఫలపుష్పైశ్చ నఖరోమవి షైరవి,

ద్విపకౌశికగృధ్రాణాం పక్ష్మేశ్శోష్మాంతకాక్షజైః.

సమిద్భిస్త్రిశతం యామ్య దిజ్ముఖో జుహుయాన్నిశి,

ఏవం సప్తదినం కుర్వన్ మారయేదుద్ధతం రిపుమ్.

విత్రాపస్త్రిదినం రాత్రౌ స్మశానే షట్శతం జపేత్,

 తతో వేతాల ఉత్థాయ వడేద్ఛావి శుభాశుభమ్.

కింకరీభూ వర్తేత కురుతే సాధకోదితమ్,

భస్మాంబుమంత్రితం రాత్రౌ సహస్రావృత్తికం పునః.

దినత్రయం చతఃపశ్చాత్ప్రక్షి పేత్ప్రమాష చ,

యాసు కాసు చ స్థూలాసు లఘుష్యపి విశేషతః.

మంత్రప్రభావాచ్చలనం భవత్యేవ న సంశయః,

అష్టమ్యాం వా చతుర్దశ్యాం కుజే వా రవివాపరే.

హనుమత్ప్రతిమాం పట్టే మాషైస్నేహపరిప్లుతైః,

కుర్యాద్రమాణ విశుద్దాత్మా సర్వలక్షణలక్షితామ్.

తైలదీపం వామభాగే ఘృతదీపం తు దక్షిణే,

 సంస్థాప్యావాహయేత్పశ్చాత్ మూలమంత్రేణ మన్త్రవిత్.

ప్రాణప్రతిష్ఠాం కృత్వా చ పాద్యాదీని సమర్పయేత్,

 రక్త చన్దనపు ష్పైశ్చ సిందూరాదైస్సమర్చయేత్.

ధూపం దీపం ప్రదాయాథ నైవేద్యం చ సమర్పయేత్,

అపూపమోదనం శాకమేదకాన్వటకాదికమ్.

సాజ్యం చ తత్సమర్యాథ మూలమంత్రేణ మంత్రవిత్,

అఖండితాన్యహిలతాదళాని సప్తవింశతిమ్.

 త్రిధా కృత్వా సపూగావి మూలేనైవ సమర్పయేత్,

ఏవం సoపూజ్య మంత్రజ్ఞో జపెద్దశశతం మనుమ్.

 కర్పూరారార్తికం కృత్వా స్తుత్వా చ బహుధా సుధీః,

 నిజేప్సితం నివేద్యాథ విధివద్వీసృజేత్తతః.

నైవేద్యాన్నేన సంభోజ్య బ్రాహ్మణాన్సప్తసంఖ్యయా,

నివేదితాని పర్ణాని తేభ్యో దద్యాద్విభజ్య చ.

దక్షిణాం చ యధాశక్తి దత్త్వా తాగ్విసృజేత్సుధీః,

 తత ఇష్టగణైస్సార్థం స్వయం భుంజీత వాగ్యతః .

తద్దినే భూమిశయ్యాం చ బ్రహ్మచర్యం సమాచరేత్,

ఏవం యః కురుతే మర్త్యస్సోచిరాదేవ నిశ్చితమ్.

 ప్రాప్నుయాత్సకలాన్కామాన్కపీశస్య ప్రసాదతః,

హనుమత్ప్రతిమాం భూమౌ విలిఖేత్తత్పురో మనుమ్.

సాధ్యనామద్వితీయాన్తం విమోచయ విమోచయ తత్పూర్వం మార్జయేద్వామపాణినాధ పునర్లిఖేత్.

ఏవమష్టోత్తరశతం లిఖిత్వా మార్జయేత్పునః,

ఏవం కృతే మహాకారా గృహాచ్ఛీ ఘం విముచ్యతే.

ఏవమన్యావి కర్మాణి కుర్యాత్పల్లవముల్లిఖన్,

 షర్షష పైర్వశ్యకృద్ధొమో విద్వేషే హయమారజై:.

కుంకుమైరిద్మకాష్ఠైర్వా మరీచైర్జీర కైరపి,

జ్వరే దూర్వాగుడూచీభిర్దధ్నా క్షీరేణ వా ఘృతైః.

శూలే కరంజవాతాం సమిద్భిస్తైలలోలితైః,

 త్రైలోక్తాభిశ్చ నిగుడే సమిద్భిర్వా ప్రయత్నతః.

సౌభాగ్యే చన్దనైశ్చన్ద్రలోచనైర్వా లవంగ కైః,

సుగంధపు ష్పైర్వస్త్రాప్యై తత్తద్ధాన్యేస్తథాప్తయే.

 రిపుపాదరజోభిశ్చ రాజీలవణమిశ్రితైః,

హోమయేత్సప్తరాత్రం చ రిపుర్యాతి యమాలయమ్.

 ధాన్యైప్సంప్రాప్యతే ధాన్యం అన్నైరన్నపముచ్చ్రయః,

తిలాజ్యక్షీరమధుభిర్మహిషికో సమృద్ధయే.

కిం బహూక్తైర్వి షే వ్యాధే శాంతామో హే చ మారణే,

వివాదే స్తంభనే ధ్యూతే భూతభూతౌ చ సంకటే.

వశ్యే యుద్ధే క్షతే దివ్యే బంధమోక్షే మహావనే,

సాధతోఽయం నృణాం దద్యాన్మన్త్ర శ్రేయస్సునిశ్చితమ్.

సనత్కుమార మహర్షి పలికెను : ఇపుడు సర్వాభీష్టప్రదములగు హనుమన్మస్త్రములను చెప్పెదను. ఈ మంత్రములను సించిన మానవులు హనుమంతుని ఆచరణ గలవారగుదురు. ఈ మంత్రము స్వరేందుసంయుక్తము గగనము భగాన్వితములగు. హసపాగ్నిని నిశాధీశులు ద్వితీయబీజముగా చెప్పబడిరి. భగేంద్వాఢ్యములగు స్వఫాగ్నులు తృతీయ బీజము. వియదృగ్వన్నీ మన్విందు యుక్తము చతుర్థ బీజము. భగచంద్రౌఢ్యవియదృగుస్వకాగ్నులు పంచమ బీజము.మన్వింద్యాఢ్యములు హసలు షష్టబీజము. ఈ బీజముల తరువాత చతుర్థివిభక్త్యంత హనుమత్పదముండును. చివర నమః పదమున్న ఈ మంత్రరాజము ద్వాదశాక్షరి. ఈ మంత్రమునకు ముని రామచంద్రుడు జగతీ ఛన్దస్సు. హనుమంతుడు దేవతా షష్ణము బీజము ద్వితీయము శక్తి. షడీజములచే షడంగములను శిరోఫాలనేత్రముఖ గల బాహుద్వయ హృదయకుకి నాభి ధ్వజ జాను పాదద్వయములందు క్రమముగా న్యాసము చేయవలయును. షడీజములను పొదద్వయమున, శిరమున, ఫాలమున, ముఖమున, హృదయమున, నాభియందు, ఊరువులయందు, జంఘలందు, పాదములందు క్రమముగా న్యాసము చేయవలయును. తరువాత అంజనీగర్భసంభూతుడగు కపీశ్వరుని ధ్యానించవలయును. ఉదయించు కోటి సూర్యుల తేజస్సు కలవాడు, జగత్ర్పక్షోభకారకుడు, శ్రీరామపాదముల ధ్యానమున నిష్ఠ కలవాడు, సుగ్రీవ ప్రముఖార్చితుడు, నాదముచే రాక్షసులను భయ పెట్టుచున్న హనుమంతుని స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి ఇంద్రియనిగ్రహముతో పన్నెండు వేలు జపించవలయును. దశాంశమును పయోదధ్యాజ్యమిశ్రితములగు పాయసములచే హోమమును గావించవలయును. పూర్వోక్ష వైష్ణవపీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆవాహన గావించి పొద్యొద్యుయనములచే పూజించి, కేసరములందు అందేపూజను, పత్రములందు పూజను గావించవలయును. రామభక్తుడు, మహాతేజోవంతుడు, కపిరాజు, మహాబలుడు, ద్రోణాద్రిహారకుడు, మేరుపీఠార్చనకారకుడు, దక్షిణాశాభానుడు, సర్వవిఘ్నవినాశకుడు, అను నామములతో

దళాగ్రములందు చక్కగా పూజించి అర్చించవలయును. సుగ్రీవుని, అంగదుని, నీలుని, జాంబవంతుని, నలుని, సుషేణుని, ద్వివీదుని, మైందుని, లోకపాలకులను అర్చించవలయును. వజ్రాదులను కూడా పూజించి మంత్ర సిద్ధిని పొందవలయును. పది దినములు ప్రతి రాత్రి మంత్రమును తొమ్మిది వందలమార్లు జపించవలయును. అట్లు జపించినవారికి రాజుల వలన శత్రువుల వలన కలుగును భయము తొలగి పొవును. మాతులుంగ ఆమ్ర కదలీఫలములచే ఒక వేయి హోమము గావించి ఇరువది రెండు మంది బ్రాహ్మణ బ్రహ్మ చారులకు భోజనమునిడినచో భూత విషగ్రహరోగాద్యుపద్రవములు విద్వేషి గ్రహ దానవులు వెంటనే నశించును. నూటా ఎనిమిది మార్లు మంత్రించిన జలము విషమును నశింపచేయును. భూత అపస్మార కృత్యల వలన కలుగు జ్వరము ఈ మంత్రముచే మంత్రించ బడిన భస్మముచే కొని జలముచే కొని జ్వరము వచ్చిన వానిని కోపముచే కొట్టినచో మూడు రోజులలో జ్వరము తొలగి ఆనందమును పొందును. ఈ మంత్రముచే మంత్రించబడిన ఔషధమునుకొని జలమును కొని భుజించిన అన్ని రోగములను పారదోలి వెంటనే సుఖమును పొందును. మంత్రించబడిన భస్మమును శరీరమున పూసుకొని, మంత్రించబడిన జలమును పానము చేసి యుద్ధమునకు బయలుదేరినచో శస్త్రాస్త్రములచే బాధించబడరు. శస్త్రము వలన కలుగు గాయము, వ్రణము వలన ఏర్పడిన గాయము, ఖదుల వలన కలుగు గాయము మూడు మార్లు జపించిన భస్మమును స్పృశింపచేసినచో మానును. సూర్యాస్తమయమునుండి సూర్యోదయమువరకు ఏడు దినములు జపించి భస్మమును కీలమును తీసుకొని మంత్రించి శత్రుద్వారమున రహస్యముగా భూమిలో స్థాపించవలయును. ఇట్లు చేసినచో వారిలో వారు కలహించుకొని పలాయనమగుదురు. ఈ మంత్రముచే మంత్రించ బడిన చందనమునుకాని భస్మమును కాని భక్ష్యాదులలో కలిపి ఎవనికి భుజించుటకు ఇచ్చిన వాడు దాసునివలే యగును. క్రూర జంతువులు కూడా ఇట్లే వశవర్తులగును. ఈశాన్యదిక్కున నున్న కరంజతరుమూలభాగముచే హనుమంతుని ప్రతిమను అంగుష్ఠమాత్రముగా చేసి, ప్రాణ ప్రతిష్ఠను చేసి సిందూరొదులచే పూజించి గృహాభిముఖముగా ద్వారమున మంత్రమునుచ్చరించుచు భూమిలో స్థాపించవలయును. ఇట్లు చేసినచో ఆ ఇంటిలో ఎప్పుడు గ్రహ, అభిచార, రోగ, అగ్ని, విష, చోర నృపులవలన కలుగు ఉపద్రవలు కలుగవు. మరియు ఆ గృహము ధన ధాన్య పుత్రాదులచే సమృద్ధమగును. రాత్రి పూట అరణ్యములో భస్మముచే కాని మట్టిచే కాని ప్రయత్నముచే శత్రు ప్రతికృతుని చేసి హృదయమున పేరును వ్రాసి, ప్రాణప్రతిష్ఠను చేసి, మంత్రమునుచ్చరించుచూ శస్త్రములచే భేదించవలయును. మంత్రాంతమున శత్రునామమునుచ్చరించి చిన్ధీ  చిన్ధీయని పలుకవలయును - తరువాత మారయ అని పలుకవలయును. దంతములచే ఓష్ఠములను పీడించుచు,అరచేతులను వత్తి ఆ ప్రతిమను వదిలి తన గృహమునకు వెళ్ళవలయును. ఇట్లు ఏడురోజులు చేసినచో శత్రువు మృతి చెందును. స్మశానమున వెంట్రుకలు విరబోసుకొని రాజికాలవణములచే ఉమ్మెంత పూవులచే పండ్లచే, నఖర్మ విషములచే కాకి, గుడ్లగూబ గద్దల రెక్కల ఈకలచే శ్లేష్మాంతకాక్ష జములగు సమిధలచే దక్షిణాభిముఖుడై మూడు వందలు హోమమును చేయవలయును. ఇట్లు ప్రతిరాత్రి ఏడు దినములు చేసినచో బలవంతుడగు శత్రువును సంహరించును. స్మశానమున మూడు దినములు రాత్రులలో ఆరొందలు జపించవలయును. అంతట భేతాళుడు కింకరునిగా ఉండి సాధకుడు చెప్పిన దానిని చేయుచుండును. మంత్రించబడిన భస్మమును కాని, జలమును కొని రాత్రియందు సహస్రావృత్తిని దీనత్రయము జరిపి స్థూలములైన, లేదా కృశించిన ప్రతిమలలో చలనము కలుగును. అష్టమినొడు కాని చతుర్దశినాడు కాని, భౌమవారమున కాని, ఆదివారమునకొని పట్టమున హనుమంతుని ప్రతిమను నూనె కలిపిన మాషములచే పరిశుద్దాత్ముడై సుందరముగా ఏర్పరచవలయును. ఆ ప్రతిమకు వామభాగమున తైలదీపమును, దక్షిణభాగమున ఘృతదీపమునుంచి మూలమంత్రముచే ఆవాహనగావించి ప్రాణప్రతిష్టను గావించి పాద్యాదులను సమర్పించవలయును. రక్త చన్దన పుష్పములచే సిందూరాదులచే అర్చించవలయును. ధూపదీపములనిచ్చి నైవేద్యములను సమర్పించవలయును. ఆపూపమోదకములను శాకవటకొదులను నేతితో సమర్పించి మూలమంత్రముచే అఖండితములగు అహిలతాదలములను ఇరువదేడింటిని మూడు భాగములను చేసి వక్కలచే మూల మంత్రోచ్చారణే సమర్పించవలయును. ఇట్లు చక్కగా పూజించి మంత్రజ్ఞుడు వేయి మార్లు జపించవలయును. తరువాత కర్పూర హారతినిచ్చి. బహువిధముల స్తుతించి నిజాభిలాషను నివేదించి యథావిధిగా విసర్జన చేయవలయును. నైవేద్యాన్నమును ఏడుగురు బ్రాహ్మణులచే భుజింపచేసి నివేదితపర్ణములను విభజించి వారికీయవలయును.  యథాశక్తిగా దక్షిణను సమర్పించి వారిని పంపవలయును. తరువాత ఇష్టులతో కలిసి తాను వాఙ్మయమముతో భుజించవలయును. ఆ దినమున భూమి శయ్యను ఏర్పరచి బ్రహ్మ చర్యమును అవలంబించవలయును. ఇట్లాచరించిన మనుజుడు హనుమదనుగ్రహముచే సకలాభీష్టములను పొందగలడు. భూమి మీద హనుమతతిమను లిఖించి, ఆ ప్రతిమముందు మంత్రమును సాధించదలచిన వాని పేరును ద్వితీయాంతముగా వ్రాసి, దాని తరువాత “విమోచయ విమోచయ” అను వ్రాయవలయును. వామహస్తముచే తుడిచి మరల వ్రాయవలయును. ఇట్లు నూటా ఎనిమిదీ మార్లు వ్రాసి తుడువవలయును. ఇట్లు చేసినచో మహాకారాగార బంధమునుండి విముక్తుడగును. ఇట్లు పల్లవమును లిఖించుచు ఇతర కార్యములను చేయవలయును. ఇతరములను వశము చేసుకొనవలయునన్న ఆవాలచే హోమమును చేయవలయును. శత్రత్వమున మినుములచే హోమమును చేయవలయును. కుంకుమచే కొని, ఇద్మ కాష్టములచే కాని, మిరియాలచే కాని, జీలకఱచేకాని, పెరుగుచేకాని, పొలచేకాని నేయిచేకాని చేయవలయును. శూలరోగమున నూనె కలిపిన కరంజవొలూరి సమిధలచే కాని, తైల మిశ్రితములగు నిరుడీసమిధలచే కాని, సౌభాగ్యమునకు చందనములచే కాని, ఇంద్రలోచనములచే కాని, లవ్ గములచేకాని, వస్త్ర ప్రాప్తికి సుగంధ పుష్పములచే, ఆయాధాన్యముల ప్రాప్తికి ఆయాధాన్యములచే హోమమును చేయవలయును. రాజీలవణమిశ్రితములైన శత్రుపాదరజములచే ఏడుదినములు హోమమును గావించినచో శత్రువు యమలోకమును చేరును. ధాన్యముచే హోమమును చేసినచో ధాన్యము లభించును. అన్నముచే హోమము గావించిన అన్నసమృద్ధి కలుగును. గేదెలు ఆవులు సమృద్ధిగా  కలుగుటకు తిలాజ్యక్టీర మధువులచే హోమమును చేయవలయును. ఇంకనూ ఏమి చెప్పవలయును. విషభయమున, వ్యాధియందు, శాంతియందు, మోహమందు, మారణమున, వివాదమున, స్తంభనమున, ద్యూతమున, భూతభయమున, సంకటమున, వశీకరణమున, యుద్దమున క్షత్రియందు, దివ్యములైన బంధమోక్షములందు, మహారణ్యమున ఈ మంత్రమును సాధించిన నరులకకకకు శ్రేయస్సు చేకూరును.

వక్ష్యేథ హనుమద్యన్త్రం సర్వసిద్ధిప్రదాయకమ్.

లాంగూలాకారసంయుక్తం వలయత్రితయం లిఖేత్,

సాధ్యనామ లిఖేన్మధ్యే పాశి బీజప్రవేష్టితమ్.

ఉపర్యష్టచదం కృత్వా పత్రేషు కవచం లిఖేత్,

తద్భహిర్దన్తమాలిఖ్య తద్భహిశ్చతురస్రకమ్.

చతురస్రస్య రేఖాగ్రే త్రిశూలావి పమాలిఖేత్,

సైం బీజం భూపురస్యాష్టవజ్రేషు లిలిఖేత్తతః.

కోణేష్వంకుశమాలిఖ్య మాలామంత్రేణ వేష్టయేత్,

తత్సర్వం వేష్టయేద్యన్త్రవలయత్రితయేన చ.

శిలాయాం ఫలకే వస్త్రే తామ్రపత్రేథ కుడ్యకే,

తాడపత్రేథ భూర్జ వా రోచనానాభికుంకుభైః.

యంత్రమేతత్సమాలిఖ్య నిరాహారో జితేన్ద్రియః,

కపేః ప్రాణాన్ప్రతిష్టాప్య పూజయేత్తద్యథావిధి.

అశేషదుఃఖశాన్త్యార్థం మంత్రే పంధారయేద్బుధః,

మారేజ్వరాభిచారాది సర్వోపద్రవనాశనమ్.

యోషితామపి బాలానాం ధృతం జనమనోహరమ్,

 భూతకృత్యపిశాచానాం దర్శనాదేవ నాశనమ్.

మాలామంత్రమథో వక్ష్యే తారో వాగ్విష్ణు గేహినీ,

దీర్ఘత్రయాన్వితా మాయా ప్రాగుక్తం కూటపంచకమ్.

ధ్రువో హృద్దనుమాన్జేన్తోథ ప్రకటపరాక్రమః,

ఆక్రాన్తదిజ్మండలాన్తే యశోవితాన సంపదేత్.

ధవలీకృతవర్ణాన్తే జగత్ప్రితయ వజ్ర చ,

దేహజ్వలదగ్నిసూర్యకోట్యంతే చ సమప్రభ.

 తూరుహాపదాంతే తు రుద్రావతార పంవదేత్,

లంకాపురీ తతః పశ్చాత్ దహనోదధిలంఘన.

దశగ్రీవశిరం పశ్చాత్కృతాంతక పదం వదేత్,

పీతాతే శ్వపన పదం వాయ్వంతే సుతమీరయేత్.

 అంజనాగర్భసంభూత శ్రీరామలక్ష్మణాన్వితః,

నందంతి కరవర్ణాంతే సైన్యప్రాకార ఈరయేత్.

సుగ్రీవసఖ్యకాద్వర్ణాద్రణవాలినిబర్హణ,

కారణద్రోణశబ్దాంతే పర్వతోత్పాటనేతి చ.

 ఆశోకవనవీథ్యంతే దారణాక్షకుమారక,

 ఛేదనాంతే వనరక్షా కరాంతే తు సమూహ చ.

విభంజనాంతే బ్రహ్మాస్త్ర బ్రహ్మశక్తిగపేతి చ,

లక్ష్మణాంతే శక్తి భేదనివారణపదం వత్.

విశల్యోషధిశబ్దాంతే సమానయన వదేత్,

బాలోదీత తతో భానుమండలగ్రసనేతి చ.

 మేఘనాదహోమపదాద్విధ్వంపనపదం వదేత్,

ఇంద్రజిద్వధకారాంతే ణ పీతారక్ష కేతి చ.

రాక్ష సీసంఘశబ్దాంతే విదారణపదం వదేత్,

కుంభకర్ణాదిసంకీర్త్య వధాంతే చ పరాయణ.

శ్రీరామభక్తివర్ణాoతే తత్పరేతి సముద్ర చ వ్యోమ ద్రుమలంఘనేతి మహాసామర్థ్యసంవదేత్.

మహాతేజఃపుంజశబ్దాద్విరాజమానవొచ్చరేత్,

స్వామివచనసంపాదితార్జునాంతే చ సంయుగమ్.

సహాయాంతే కుమారేతి బ్రహ్మ చారిన్పదం వదేత్,

గంభీరశబ్రోదయాంతే దక్షిణాపథసంవదేత్.

మార్తాండమేరుశబ్దాంతే వదేత్పర్వత పీటికా,

   అర్చనాంతే తు పకలమంత్రాంతే ఏమ పదం వదేత్.

ఆచార్య మమ శబ్దాంతే సర్వగ్రహావినాశన,

సర్వజ్వరోచ్చాటనాంతే సర్వవిషవినాశనం.

సర్వాపత్తి నివారణ సర్వదుష్టనిబర్హణ,

సర్వవ్యాధ్యాది సంప్రోచ్య భయాంతే చ నివారణ.

సర్వశత్రుచ్ఛేదనాంతే తతో మమ పరస్య చ,

తతస్త్రిభువనాంతే తు పుంస్త్రీనపుంపకాత్మకమ్.

 సర్వజీవపదాంతే తు జాతం వశయ యుగ్మకమ్,

మమజ్ఞాకారకం పశ్చాత్ సంపాదయ యుగం పునః.

 తతో నానా నామధేయాన్సర్వానురాజ్ఞససంపత్,

 పరివారాన్మ మేత్యన్త్యే సేవకాన్కురు యుగ్మ కమ్.

సర్వశస్త్రాస్త్రవీత్యన్త్యే షాణి విధ్వంపయ ద్వయమ్,

లజ్జాదీర్ఘతయో పేతా హోత్రయం చైహియుగ్మ కమ్.

 విలోమం పంచకూటాని సర్వశత్రూన్ హనద్వయమ్,

పరబలాని పదేత్యంతే సైన్యాని క్షోభయ ద్యయమ్.

 మమ పర్వం కార్యజాతం సాధయేతి ద్వయం తతః,

సర్వదుష్టదుర్జనాంతే ముఖాని కీలయద్వయమ్.

దేత్రయం వర్మ త్రితయం ఫట్ త్రయం హాంత్రయం తతః,

వహ్ని ప్రియాంతో మంత్రోయం మాలాసం జ్ఞోఖలేష్టదః.

వస్పష్టబాణవర్ణోయం మన్త్రస్సర్వే వేష్టసాధకః,

మహాభయే మహోత్పాతే స్మృత్యోయం దుఃఖనాశనః.

ద్వాదశార్ణస్య షట్కూటం త్యక్త్వా బీజం తథాదిమమ్,

 పంచకూటాత్మకో మంత్రః సర్వకామప్రదాయకః.

రామచంద్రో మునిశ్చాస్య గాయత్రీ ఛన్ద ఈరితమ్,

 హనుమాన్దేవతా ప్రోక్తో వినియెగ్యోఖిలాస్తయే.

పంచబీజై స్సమ స్తేన షడంగాని సమాచరేత్.

 రామదూతో లక్ష్మణాంతే ప్రాణదాతాంజనీసుతః,

 సీతాశోకవినాశోఽయం లంకాప్రాసాదభంజనః.

హనుమదాద్యాః పంచైతే బీజాద్యా జేయుతాః పునః,

షడంగమనవో హ్యేతే ధ్యానపూజాదిపూర్వవత్.

ప్రణవో వాగ్భవం పద్మా మాయా దీర్ఘత్రయాన్వితా,

పంచకూటాని మంత్రోయం రుద్రార్ణస్సర్వ సిద్ధిదః.

ధ్యానపూజాదికం సర్వమస్యాపి పూర్వవన్మతమ్,

 అయమారాధితో మన్త్రస్సర్వాభీష్టప్రదాయకః.

 ఇక ఇపుడు సర్వసిద్ధి ప్రదాయకమగు హనుమద్యస్త్రమును చెప్పెదను. లాంగులాకారసంయుక్తముగా వల యత్రయమును లిఖించవలయును. పాశబీజమున ప్రవేశింపచేసి మధ్యభాగమున సాధ్యనామమును లిఖించవలయును. పైభాగమున అష్టదళములను లిఖించి పత్రములందు కవచమును లిఖించవలయును. బయటి భా, పత్రములందు కవచమును  లిఖించవలయును. బయటి భాగమున దంతమును లిఖించి, దాని వెలుపల చతురస్రమును, చతురస్రరేఖాగ్రభాగమున త్రిశూలములను లిఖించవలయును. భూపురాష్ట్రవజ్రములలో ‘సౌం’ అను బీజమును కోణములయందు అంకుశమును లిఖించి మాలామంత్రముచే పరివేష్టించవలయును. దీనినంతటిని యంత్రవలయత్రితయముచే వేష్టనము చేయవలయును. శిలయందు కాని, ఫలకమునందుకొని, తాళపత్రమునందుకొని భూర్జ పత్రమునందు  కాని గోరోచన కస్తూరి కుంకుమలచే ఈ యంత్రమును వ్రాసి నిరాహారుడై, ఇంద్రియములను జయించి, హనుమంతునికీ ప్రాణప్రతిష్ఠ చేసి యథావిధిగా పూజించవలయును. సమస్త దుఃఖనాశనమునకై ఈ యంత్రమును ధరించవలయును. మారణ, జ్వర, అభిచారాది సర్వోపద్రవములు ఈ యంత్రధారణము వలన నశించును. స్త్రీలు బొలులు ధరించినచో సర్వలోకము వశ్యమగును. ఈ యంత్రమును చూచిన వెంచనే భూతకృత్యా పిశాచాదులు పొరిపోవును.

ఇక ఇపుడు మాలామంత్రమును చెప్పెదను. మొదట తారము తరువాత వాక్కులక్ష్మి దీర్ఘత్రయాన్వితా మాయా మొదట చెప్పిన పంచకూటములు ధ్రువము హృదయము. “ఓం నమో హనుమతే ప్రకటపరాక్రమ! ఆక్రాంత దీజ్ మండల యశోవితాన ! ధనళీకృత జగత్తాతయ ! వజ్రదేహ ! జ్వలదగ్ని సూర్యకోటిసమప్రభ తనూరుహ ! రుద్రావతార ! లంకాపురీదహన ! ఉదధిలంఘన ! దశగ్రీవశిరఃకృతాంతక ! సీతాశ్వసన ! వాయుసుత ! అంజనాగర్భసంభూత ! శ్రీరామలక్ష్మణాన్విత ! నందంతికర ! సైన్యప్రాకార ! సుగ్రీవసఖ్యక ! రణవాలినిబర్హణకరణ ! ద్రోణ పర్వతోత్పాటన ! అశోక వనవిధ్దారణ ! అక్ష కుమారకచ్ఛేదన ! వనరక్షకరసమూహవిభంజన ! బ్రహ్మస్త్ర బ్రహ్మ శక్తి గ్రస. ! లక్ష్మణ శక్తి భేద నివారణ ! విశల్యోషధి సమానయన ! బాలోదిత భానుమండల గ్రసన ! మేఘనాద హోమ విధ్వంసన ! ఇంద్రజి ద్వధ కారణ ! సీతారక్షక ! రాక్షసీ సంఘ విదారణ ! కుంభకర్ణాది వధ పరాయణ ! శ్రీరామ భక్తి తత్పర ! సముద్రవ్యోమద్రుమ లంఘన ! మహాసామర్థ్య ! మహాతేజఃపుంజ విరాజమాన ! స్వామి వచనసంపాదితార్జున సంయుగ సహాయ ! కుమార బ్రహ్మ చారిన్ ! గంభీరోదయ దక్షిణాపథ మార్తాండ ! మేరు పర్వత పీఠికార్చన ! సకల మంత్రమ ! ఆచార్య ! మమ సర్వగ్రహ వినాశన ! సర్వజ్వరోచ్చాటన ! సర్వవిషవినాశన ! సర్వాపత్తి నివారణ ! సర్వదుష్ట నిబర్హణ ! సర్వవ్యాధ్యాది భయనివారణ ! సర్వశత్రుచ్చెదన ! మమ పరస్యచ త్రిభువన పుంస్త్రీ నపుంసకాత్మక సర్వజీవ జాతం వశయ! వశయ ! మమాజోకొరకం సంపాదయ ! సంపాదయ !” అని పఠించి నానా నామధేయములు గల సర్వరాజులను పఠించవలయును. “పరీవారాన్ మమ సేవకన్ కురు కురు సర్వశస్త్రాస్తవిషాణి విధ్యంసయ ! విధ్వంసయ !”  తరువాత లజ్జా దీర్ఘత్రయో పేతమగు హోత్రయమును ఏహిద్వయమును, పంచకూటములను విలోమము గా  నుచ్చరించి “సర్వశత్రూన్ హన హన ! పరబలాని పర సైన్యాని కోభయ ! శోభయ ! మమ సర్వకార్యజాతం సాధయ సాధయ ! సర్వదుష్టదుర్జన ముఖాని కీలయ ! కీలయ ! “ ఆని పలికి తరువాత దౌత్రయమును వర్మ త్రితయమును, ఫట్ త్రయమును, హాంత్రయమును, పలికి “స్వాహా” అని చివరికి పలికిన ఇది మాలామంత్రమగును. సకలా భీష్టప్రదము 588 వర్ణములు గల మంత్రమిది. సర్వేష్టసాధకము మహాభయమున, మహోత్పాతమున ఈ మంత్రము దుఃఖనాశకము ద్వాదశాక్షరి యొక్క షట్కూటమును వదిలి ఆది బీజమును కలిపి పంచకూటాత్మకమగు ఈ మంత్రము సర్వాభీష్టప్రదాయకము ఈ మంత్రమునకు రామచంద్రుడు ముని, గాయత్రీ ఛందస్సు, హనుమంతుడు దేవత. అఖిలాప్తికి వినియోగము చేయవలయును. సంపూర్ణపంచబీజములతో షడంగములను కల్పించవలయును. “రామదూతాయ” ‘లక్ష్మణ ప్రాణదాత్రే’ ‘అంజనీసుతాయి’  ‘సీతాశోకవినాశాయ’ ‘లంకాప్రాసాద భంజనాయ’ ‘హనుమతే’ అను వాటిలో మొదటి అయిదు బీజాదులగును. ఇవియే షడంగమంత్రములు. ధ్యాన పూజాదికమంతయు పూర్వము వలె నాచరించవలయును. ప్రణవము పొగృవము పద్మోమాయా దీర్ఘత్రయాన్వితము పంచకూటములు గల ఈ మంత్రము ఏకాదశాక్షరములు గలది సర్వసిద్ధిప్రదము. ఈ మంత్రమునకు కూడా ధ్యానపూజాదికమంతయు పూర్వము వలే నాచరించవలయును. ఈ మంత్రము నారాధించినచో సర్వాభీష్టముల నొసంగును.

నమో భగవతే పశ్చాదనన్త న్ద్రశేఖరాంజనేయాయ మహాంతేతు బలాయాంతేఽగ్నివల్లభా.

అష్టాదశార్ణో మంత్రోయం మునిరీశ్వరసంజ్ఞకః,

ఛన్ధోనుష్టుబ్ధేవతా తు హనుమాన్పవనాత్మజః.

 హం బీజం వహ్ని వనితా శక్తిః ప్రోక్తా మనీషిభిః,

 ఆంజనేయాయ హృదయం శిరశ్చ రుద్రమూర్తయే.

శిఖాయాం వాయు పుత్రాయాగ్నిభార్యాయ వర్మణి,

 రామదూతాయ నేత్రం స్యాద్భ్రహ్మస్త్రాయాస్త్రమీరితమ్.

 తప్త చామీకరనిభం భీఘ్నపంఏహితాంజలిమ్,

చలత్కుండలదీప్తాస్యం పద్మాక్షం మారుతిం స్మరేత్.

ధ్వాత్వైవమయుతం జప్త్వా దశాంశం జుహుయాత్తిలైః,

వైష్ణవే పూజయేత్పీరే ప్రాగుద్దిష్టేన వర్త్మనా.

 అష్టోత్తరశతం నిత్యం నక్తభోజీ జితేన్ద్రియః,

 జపిత్వా క్షుద్రరోగేభ్యో ముచ్యతే నాత్ర సంశయః.

మహారోగనివృత్యై తు సహస్రం ప్రత్యహం జపేత్,

రాక్షసౌఘం వినిఘ్నాన్తం కపిం ధ్యాత్వాఘనాశనమ్.

 అయుతం ప్రజపేన్నిత్యమచీరాజ్జయతి ద్విషమ్,

సుగ్రీవేణ సమం రామం సందధానం కపిం స్మరన్.

   పేదయుతం యస్తు పంధిం కుర్యాద్ద్విషడ్జ్వయోః,

ధ్యాత్వా లం కాం దహస్తం తమయుతం ప్రజ పేన్మనుమ్.

అచిరాదేవ శత్రూణాం గ్రామాన్సంప్రద హేత్సుధీః,

ధ్యాత్వా ప్రయాణసమయే హనుమన్తం జపేన్మనుమ్.

 యో యాతి సోఽచిరాచ్వేష్టం సాధయిత్వా గృహే వ్రజేత్ ,

 హనుమన్తం పదా గేహా యోర్చయేజ్జపతత్పరః.

 ఆరోగ్యం చ శ్రియం కాంతిం లభతే నిరుపద్రవమ్,

కాననే వ్యాఘచోరేభ్యో రక్షేన్మునురయం స్మృతః.

ప్రస్వాపకాలే శయ్యాయాం స్మరేన్మస్త్రమనన్యధీః,

తస్య దుస్స్వప్నచౌరాదిభయం నైవ భవేత్క్వచిత్.

వియత్సేన్దుర్లనుమతే తతో రుద్రాత్మ య చ వర్మాస్త్రాన్తో మహామంత్ర ద్వాదశార్జ్ష్ట సిద్ధికృత్.

రామచన్ద్రో మునిశ్చాస్య జగతీ ఛన్ద ఈరీతమ్,

హనుమాన్దేవతా బీజమౌడ్యం శక్తిర్హుమీరితా.

షడ్దీర్ఘభాజా బీజేన షడంగాని సమాచరేత్,

మహా శైలం యముత్పాట్య ధావనం రావణం ప్రతి.

లాక్షారక్తరుణం రౌద్రం కాలాంతకయమోపమమ్,

జ్వలదగ్నిసమం జైత్రం సూర్యకోటిసమప్రభమ్.

అంగదాద్యైర్మహావీర్వైష్టితం రుద్రరూపిణమ్,

తిష్ఠ తిష్ఠ రణే దుష్ట సృజన్తం ఘోరవిస్స్వనమ్.

శైవరూపిణమధ్యర్య ధ్యాత్వా లక్షం జపేన్మనుమ్,

 దశాంశం జుహుయాద్వీట్రాన్సయోదధ్యాజ్యమిశ్రితాన్.

పూర్వోత్తే వైష్ణవే పీకే విమలాదీపమన్వితే,

మూర్తిం సంకల్ప్య మూలేన పూజా కార్యా హనూమతః.

ధ్యానైకమా త్రోపినృణాం సిద్ధిరేవ న సంశయః,

అథాస్య సాధనం వక్ష్యే లోకానాం హితకామ్యయా.

 హనుమత్సాధనం పుణ్యం మహాపాతకనాశనమ్,

ఏతద్గుహ్యతమం లోకే శీఘ్ర సిద్ధికరం పరమ్.

మంత్రీ యస్య ప్రసాదేన త్రైలోక్యవిజయీ భవేత్,

ప్రోతస్స్నాత్వా నదీతీరే ఉపవిశ్య కుశాపనే.

ప్రాణాయామషడంగే చ మూలేన సకలం చరేత్,

 పుష్పాంజల్యష్టకం దత్వా ధ్యాత్వా రానుం పసీతకమ్.

తామ్రపా త్రే తతః పద్మమష్టపత్రం పకేశరమ్,

కుచన్దనేన ఘృ ష్టేన సంలిఖేత్త చ్ఛలాకయా.

 కర్ణికాయాం లిఖేన్మస్త్రం తత్రావాహ్య కపీశ్వరమ్,

మూర్తిం మూలేన సంకల్ప్య ధ్యాత్వా పాద్యాదికం చరేత్.

 గన్దపుష్పాదికం సర్వం నివేద్య మూలమంత్రతః,

 కేపరేషు షడంగాని దలేషు చ తతోర్చయేత్.

సుగ్రీవం లక్ష్మణం చైవ హ్యంగదనలనీల,

జాంబవనం చ కుముదం కేసరీశం దలేర్చయేత్.

దీక్పాలంశ్చాపి వజ్రాదీన్ పూజయేత్తదనన్తరమ్,

ఏవం సిద్దే మనౌ మ న్త్రీ సాధయేత్స్వేమాత్మని.

 నదీతీరే కాననే వా సర్వతే విజలేఽథవా,

సాధయేత్సాధకశ్రేష్టా భూమిగ్రహణపూర్వకమ్.

 జితాహారో జితశ్వాసో జితవాక జితే న్ద్రియః,

దిగ్బంధనాదికం కృత్వా న్యాసధ్యానాదిపూర్వకమ్.

 లక్షం జపేన్మస్త్రరాజం పూజయిత్వా తు పూర్వవత్,

లక్షాంతే దీవసం ప్రాప్య కుర్యాచ్చ పూజనం మహత్.

 ఏకాగ్రమనసా సమ్యక్ ద్యాత్వా పవననందనమ్,

 దివారా త్రౌ జపం కుర్యాద్యావత్సంభవేత్.

సుదృఢం సాధకం మత్వా నిశీధే పవనాత్మజ,

సుప్రసన్నస్తతో భూత్వా ప్రయాతి సాధకోగ్రతః.

యథేప్సితం వరం దత్వా సాధకాయ కపీశ్వరః,

వరం లబ్ధ్యా సాధకేన్ద్రో వీహరేదాత్మనస్సుఖైః.

 ఏతద్ధి సాధనం పుణ్యం లోకానాం హితకామ్యయా,

ప్రకాశితం రహస్యం వై దేవానామపి దుర్లభమ్.

“నమో భగవతే అనంత చంద్రశేఖరాంజనేయాయ మహాబలాయ స్వాహా” ఈ మంత్రము పదునెనిమిదికరములు కలది. ఈశ్వరుడు ముని అనుష్టుమ్ ఛందస్సు. పవనాత్మజుడగు హనుమంతుడు దేవత హం బీజము స్వాహాశక్తి ఆంజనేయాయ అనునది హృదయము. రుద్రమూర్తయే అనునది శిరస్సు. వాయుపుత్రాయ అనునది శిఖ. అగ్ని గర్భాయ అనునది కవచము. రామదూతాయ అనునది నేత్రము. బ్రహ్మాస్త్రాయ అనునది అస్త్రము. చక్కగా పుటము పెట్టిన బంగారు వన్నె కలవాడు, అంజలిబద్దుడు, చలత్కుండలదీప్తాస్యుడు, పద్మాకుడగు మారుతిని స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి పది వేలు జపించి దశాంశమును తిలలచే హోమమును చేయవలయును. పూర్వోక్తవిధానముతో వైష్ణవ పీఠమున పూజించవలయును. ప్రతిదినము అష్ణోత్తరశతమును జపించుచు రాత్రి మాత్రమే భోజనము చేయుచు జితేంద్రియుడైయున్నచో కుద్రరోగముల నుండి విముక్తి పొందును. మహారోగ నివృత్తికి ప్రతిదినము సహస్రము జపించవలయును. రాక్షససమూహములను సంహరించుచుఉన్న పొపనోశకుడగు హనుమంతుని ధ్యానించి ప్రతిదినము పదివేలు జపించినచో త్వరలో శత్రువును జయించును. సుగ్రీవునితో రాముని కలుపుచున్న హనుమంతుని స్మరించి పదివేలు జపించినచో శత్రువులచే సంధి కుదురును. లంకాదహనమును గావించుచున్న ఆంజనేయుని ధ్యానించి పదివేలు జపించినచో త్వరలో శత్రుగ్రామములను దహింప చేయును. ప్రయాణ సమయమున హనుమంతుని ధ్యానించి మంత్రమును జపించినచో వెళ్ళిన చోట త్వరగా తన అభీష్టమును సాధించుకొని తిరిగి ఇల్లు చేరును. జపతత్పరుడై ఇంటిలో ప్రతి నిత్యము ఆంజనేయుని అర్చించువాడు ఆరోగ్యమును, సంపదను, కాంతిని ఉపద్రవరాహిత్యమునను పొందును. ఈ మంత్రమును స్మరించినచో అరణ్యమున వ్యాఘ్రచోరభయము నుండి కాపాడబడును. నిదురించు సమయమున ఈ మంత్రమును స్మరించినచో దుస్స్వప్న చోరభయములు తొలగును.

“శ్రీ హనుమతే రుద్రాత్మకాయ స్వాహా” అను మంత్రము ద్వాదశాక్షరి ఈ మంత్రము అష్టసిద్ధులను కలిగించును. ఈ మంత్రమునకు రామచంద్రుడు ముని జగతీ ఛందస్సు హనుమంతుడు దేవత. ఆద్యబీజము హుం ఆనునది శక్తిషడ్డీర్ఘయుతమగు బీజములచే షడంగములను కల్పించవలయును మహాపర్వతమును పెకిలించి శత్రువు మీదికి లంఘించుచున్న, లాక్షారక్తారుణుడు, రౌద్రుడు, కాలాంతకయమోపముడు, మండుచున్న అగ్నివంటివాడు, జయశీలుడు, కోటి సూర్యసమప్రభుడు, ఆంగదాది నుహవీరులతో పరివేష్టితుడు, రుద్రరూపి, యుద్ధమున ‘దుష్టుడా నీలు నిలు” అని మహా నాదమును చేయువాడు శైవరూపియగు ఆంజనేయుని పూజించి ధ్యానించి లక్ష జపించవలయును. దశాంశమును పాలు పెరుగు నెయ్యి కలిపిన ధాన్యముచే హోమమును చేయవలయును. పూర్వోక్తమగు వైష్ణవపీఠమున విమలాదియుతమగు దొని పై మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి హనుమంతుని పూజను విధివిధానముగా చేయవలయును. కేవలము ధ్యానము చేసిన నరులను కూడా సిద్ధి కలుగును. ఇక ఇపుడు లోకహితమును కోరి ఈ మంత్రసాధనమును చెప్పేదను. ఈ హనుమత్సాధనము పరమ పావనము. మహాపాతకనాశనము. ఇది అత్యంత రహస్యమైనది. మానవులకు శీఘ్రసిద్ధి ప్రదము. హనుమంతుని అనుగ్రహముచే మంత్రసిద్ధి పొందినవాడు త్రైలోక్యవిజయి కాగలడు. ప్రాతఃకాలమున స్నానమాచరించి, నదీతీరమున దర్భాసనమున కూర్చుండి, మూలమంత్రముచే ప్రాణాయామమును షడంగకల్పనను చేయవలయును. అష్ట పుష్పాంజలులనిచ్చి, సీతాసహితుడగు రాముని ధ్యానించి, తామ్ర పొత్రమునందు కేసరములతో కూడిన అష్టపత్రపద్మమును చక్కగా మర్థించిన చందనముచే శలాకతో లిఖించవలయును. కర్ణికయందు మహామంత్రమును లిఖించి అచట కపీశ్వరుని ఆవాహించి, మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ధ్యానించి పొద్యొదికము నోసంగవలయును. మూలమంత్రముచే గంధపుష్పాదికములను నివేదించి కేశరములందు షడంగములను కల్పించి, దలములందు సుగ్రీవుని, లక్ష్మణుని, అంగదుని, నలనీలులను, జాంబవంతుని, కుముదుని, కేసరీశుని చక్కగా అర్చించవలయును. తరువాత దిక్పాలకులను వజ్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత తన ఇష్టమును సాధించుకొనవచ్చును. నదీతీరమున కొని, కొనన మునకాని, పర్వతమున కాని, ఏకాంతమున కాని సాధకుడు భూమిగ్రహణ పూర్వకముగా సాధించవలయును. జితాహారుడై, జీతశ్వాసుడై, జితవాక్కె, జితేంద్రియుడై, దిగ్బంధనాదికమును చేసి న్యాసధ్యానాదిక పూర్వకముగా మంతర్రాజమును లక్ష జపించి, పూర్వమువలె పూజించి, లక్షముగిసిన తరువాత దివసమున మహాపూజనమును చేయవలయును. ఏకాగ్రమనస్సుతో పవనాత్మజుని ధ్యానించి హనుమత్సందర్శనమగు వరకు దివారాత్రములు జపించవలయును. నిశీధకాలమున హనుమంతుడు సాధకుని ధార్యమును గుర్తించి సుప్రసన్నుడై సాధకుని ముందు ప్రత్యక్షమగును. సాధకుడు కోరిన వరమునిచ్చును. అట్లు వరమును పొంది సాధకుడు సుఖముగా విహరించవచ్చును. లోకహితమును కోరి అతిరహస్యము, పరమ పవిత్రము, దేవతలకు కూడా దుర్లభము అగు ఈ సాధనమును తెలియజేసితిని.

అన్యానపి ప్రయోగాంశ్చ సాధయేదాత్మనో హితాన్,

వియదిందుయుతం పశ్చాన్జేన్తం పవననందనమ్.

 వహ్ని ప్రియాంతో మంత్రోయం దశార్ణస్సర్వకామదః,

మున్యాదికం చ పూర్వోక్తం షడంగాన్యపి పూర్వవత్.

 ధ్యాయేద్రణే హనూమన్తం సూర్యకోటిసమప్రభమ్,

ధావన్తం రావణం జేతుం దృష్ట్వా సత్వరముత్తితమ్.

లక్ష్మణం చ మహావీరం పతితం రణభూతలే,

గురుం చ క్రోధముత్పాద్య గ్రహీతుల గురుపర్వతమ్.

 హాహాకారైస్సదర్పైశ్చ కంపయంతం జగత్త్రయమ్,

ఆబ్రహ్మాండం సమాప్య కృత్వా భీమం కలేవరమ్.

 లక్షం జు పెద్దశాంశేన జుహుయాత్పూర్వవత్సుధీః,

పూర్వవత్పూజనం ప్రోక్తం మంత్రస్యాస్య విధానతః.

 ఏవం సిద్ధే మనౌ మంత్రీ సాధయేదాత్మనో హితమ్,

ఆస్యాపి మంత్రవర్యస్య రహస్యం సాధనం తు వై.

సుగోప్యం సర్వతంత్రేషు న దేయం యస్య కస్యచిత్,

 బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ కృతనిత్యక్రియశ్శుచిః.

గత్వా నదీం తతస్స్నాత్వా తీర్ధమావాహ్య చాష్టధా,

 మూలమంత్రం తతో జప్త్వా సించేదాదిత్యసంఖ్యయా.

 ఏవం స్నానాదికం కృత్వా గంగాతీరేథవా పునః,

పర్వతే వా వనే వాపి భూమిగ్రహణపూర్వకమ్.

ఆద్యవర్ణైః పూరకం స్యాత్పంచవర్గైశ్చ కుంభకమ్,

రేచకం చ పునర్యాద్యే రేవం ప్రాణాన్నియమ్య చ.

విధాయ భూతశుద్ధ్యాదిపీఠిన్యాసావధి పునః,

ధ్యాత్వా పూర్వోక్తవిధినా సంపూజ్య చ కపీశ్వరమ్.

 తదగ్రే ప్రజ పేన్నిత్యం సాధకో యుతమాదరాత్,

 సప్తమే దివసే ప్రాస్తే కుర్యాచ్చ పూజనం మహత్.

ఏకాగ్రమనసా మంత్రి దివారాత్రం జపేన్మనుమ్,

మహాభయం ప్రదత్వా త్రిభాగ శేషాసు నిశ్చితమ్.

 యామినీషు సమాయాతి నియతం పవనాత్మజః,

యథేప్సితం వరం దద్యాత్సాధకాయ కపీశ్వరః.

విద్యాం వాపి ధనం వాపి రాజ్యం వా శత్రునిగ్రహమ్,

తత్క్షణాదేవ చాప్నోతి సత్యం సత్యం న సంశయః .

ఇహలో కేఽఖిలాన్కామాన్యుక్త్వాంతే ముక్తిమాప్నుయాత్,

సద్యాచితం వాయుయుగ్మం హనూమంతేతి చోద్ధరేత్. 

ఫలాంతే ప్రక్రియనేత్రయుక్తా చ కాబకొతతః,

ధగ్గంతే ధగితేత్యుక్త్వా ఆయురాస్వపదం తతః.

లోహితో గరుడో హేతిబాణనేత్రాక్షరో మనుః,

మున్యాదికం తు పూర్వోక్తం ప్లీహరోగహరో హరిః.

దేవతా చ సముద్దిష్టా ప్లీహయుక్తో దరే పునః,

 నాగవల్లీదళం స్థాప్యముపర్యాచ్ఛాదయేత్పునః.

వస్త్రం చైవాష్టగుణితం తతస్సాధకపత్తమః,

శకలం వంశఖం తస్యోపరి ముంచేత్కపిం స్మరేత్ .

 ఆరణ్యసాణకోత్పన్నే వహ్నౌ యష్టిం ప్రతాపయేత్ ,

బదరీభూరుహాత్తాంతాం మంత్రేణానేన పప్తధా.

తయా సంతాడయేద్వంశశకలం జఠరే స్థితమ్,

సప్తకృత్వః ప్లీహరోగో నాశమాయాతి నిశ్చితమ్.

 తారో నమో భగవతే ఆంజనేయాయ చోచ్చరేత్,

అముకస్య శృంఖలాంతో టయద్వితయమీరయేత్.

 బంధమోక్షం కురుయుగం స్వాహాంతోఽయం మనుర్మతః,

ఈశ్వరోస్య మునిశ్ఛన్దోనుష్టుప్చ దేవతా పునః.

 శృంఖలామోచకశ్శీమాన్హనుమాన్పవనాత్మజః,

హం బీజం తద్వయం శక్తిర్బంధమోక్షే నియోగతా.

 షడ్ధీర్ఘవహ్నియుక్తేన బీజేనాంగాని కల్పయేత్,

వామే శైలం వైరిభేదం విశుద్ధంటంకమన్యతః.

 దధానం స్పర్ణవర్ణం చ ధ్యాయేత్కుండలినం హరిమ్,

ఏవం ధ్యాత్వా జు పేల్లక్షం దశాంశం చూతపల్లవైః.

 జుహుయాత్పూర్వవత్ప్రోక్తం యజనం వాస్య సూరిభిః,

మహాకారాగృహే ప్రాప్తో హ్యయుతం ప్రజ పేన్నరః.

 శీఘ్రం కారాగృహాన్ముక్తస్సుఖీ భవతి నిశ్చతమ్,

 యంత్రం చాస్య ప్రవక్ష్యామి బంధమోక్షకరం శుభమ్.

 ఆత్మ కు హితకరములగు ఇతర ప్రయోగములను కూడా సాధించవలయును. “శ్రీ పవననందనాయ స్వాహా” అను మంత్రము దశాక్షరి సర్వకామప్రదము. ఈమంత్రములకు మున్యాదీకము షడంగములు పూర్వము వలెనే తెలియవలయును. కోటి సూర్యసమప్రభుడు, యుద్ధమున రావణుని జయించుటకు లంఘించుచున్న, రణభూమియందు పడి యున్న మహావీరుడగు లక్ష్మణుని చూచి లేచినవానిని, గొప్ప కోపమును కలిగించి గొప్ప పర్వతమును గ్రహించ యత్నించువానిని, దర్పముచే చేయు సింహనాదములచే జగత్తయమును కంపింప చేయుచున్నవాడు, బ్రహ్మండమంతయు వ్యాపింపచేయు భయంకర శరీరము కలవాడు అగు హనుమంతుని ధ్యానించవలయును. మంత్రమును ఒక లక్ష జపించవలయును. పూర్వము వలె హోమమును చేయవలయును. ఈ మంత్రమునకు పూజనము కూడా పూర్వము వలెనే చెప్పబడినది. ఇట్లు మంత్రము సిద్దించిన తరువాత ఆత్మ హితమును సాధించవలయును. ఈ మంత్రమునకు కూడా సాధనము పరమ రహస్యము. సర్వతంత్రములందుకూడా చక్కగా రక్షింపదగినది. అందరికీ ఈయరాదు. బ్రాహ్మీ ముహూర్తమున లేచి నిత్యకృత్యములను నెరవేర్చుకొని పరిశుద్దుడై నదికి వెళ్ళి స్నానమాచరించి అష్టతీర్థములను ఆవహించి, మూలమంత్రమును జపించి పన్నెండు మార్లు ప్రోక్షించవలయును. ఇట్లు స్నానాదికమునాచరించి గంగాతీరమున కొని, పర్వత ప్రాంతమున కాని వనమున కానీ భూమిగ్రహణ పూర్వకముగా ఆద్యవర్ణములచే పూరకమును, పంచవర్గములతో కుంభకమును, యాదులచే రేచకమును ఆచరించి ప్రాణాయామము నాచరించి పీఠన్యాసావధిగా భూతశుద్ద్యాదికమును ఆచరించి, ధ్యానము చేసి పూర్వోక్త విధిచే కపీశ్వరుని చక్కగా పూజించి సాధకుడు కపీశ్వరుని ముందు గొప్ప పూజనమాచరించవలయును. ఏకాగ్రమనస్సుతో దివారాత్రములు జపించవలయును. రాత్రి మూడు భాగములు మిగిలియుండగా నిశ్చయముగా హనుమంతుడు వచ్చి, అభయము నిచ్చి కోరిన వరము నొసంగును. విద్యను కాని, ధనమును కొని, రాజ్యమునుకాని, శత్రునిగ్రహమును కొని ఆక్షణముననే పొందగలడు. ఈ విషయమున సంశయమేలేదు. ఈ లోకమున సకలాభీష్టములను పొంది అంతమున మోక్షమును పొందును. సద్యొచితము వాయుయగు ము హనుమంత అని పలికి, ఫలాంతమున ప్రక్రియా నేత్రయుక్తమగు కానిక తరువాత ధగంతమున ధగిత యని పలికి ఆయురాస్వపదమును లోహిత గరుడ పదములచే హేతి బాణ నేత్రాక్షరమగు మంత్రమిది. మున్యాదికమంతయూ పూర్వోక్త విధానముగా నుండును. ఈ మంత్రమున ధ్యానించబడు హనుమంతుడు ప్లేహరోగమును హరించును. ఈ మంత్రమునకు హనుమంతుడు దేవత. ప్లేహరోగయుక్తమగు ఉదరమున నాగవల్లీ దలమునుంచి పై భాగమున ఆచ్చాదన చేయవలయును. తరువాత ఎనిమిది రెట్లు వస్త్రమునుంచి వంశ శకలమును దాని పై నుంచవలయును. తరువాత కపీశ్వరుని స్మరించవలయును. ఆరణ్యసాణమున పుట్టిన వహ్నియందు యష్టినీ తపింపచేయవలయును. బదరీవృక్షజమగు ఆ యష్టిని ఈ మంత్రముచే ఏడు మార్లు జఠరమున నున్న వంశశకలమును తొడనము చేయవలయును. ఇట్లు ఏడుమార్లు కొట్టినచో ప్లేహరోగము నశించును. “ఓం నమో భగవతే ఆంజనేయాయ” అనునది మంత్రము. దీని తరువాత “శృంఖలాం త్రోటయత్రోటయ బంధమోక్షం కురు కురు స్వాహా” అని పలుకవలయును. ఇట్లు మంత్రము పరిపూర్ణము. ఈ మంత్రమునకు ముని ఈశ్వరుడు. అనుష్టుప్ఛన్దస్సు. శృంఖలామోచనుడు పవనాత్మజుడగు హనుమంతుడు దేవత. హం అనునది బీజము, ఈ ద్వయము శక్తి, బంధమోక్షము వినియోగము. షడీర్ఘవ హ్నియుక్తమగు బీజముచే అంగములను కల్పించవలయును. వామభాగమున వైరిభేదకమగు శైలమును, దక్షిణభాగమున టంకమున ధరించినవాడు, స్వర్ణవర్ణుడు, కుండలియగు హనుమంతుని ధ్యానించవలయును, ఇట్లు ధ్యానము చేసి లక్ష జపించవలయును. దశాంశమును మామిడి చిగురులచే హోమమును చేయవలయును. పూజనమంతయు పూర్వోక్తవిధానమున గావించవలయును. మహాకారాగృహము ప్రాప్తించినచో పదివేలు జపించవలయును. త్వరగా కారాగృహమునుండి విముక్తుడై ఆనందించును. ఇక ఇపుడు శుభము. బంధమును విడిపించు యంత్రమును చెప్పెదను.

అష్టచధాంతః షట్కోణం సాధ్యనామపమన్వితమ్,

షట్కోణేషు ధ్రువం జెన్తమాంజనేయ పదం లిఖేత్.

అష్టచ్చధేషు విలిఖేత్ప్రణవో వాంతు వాత్వితి,

గోరోచనా కుంకుమేన లిఖిత్వా యన్త్రముత్తమమ్.

 ధృత్వా మూర్ద్ని జపేన్మన్త్రమయుతం బంధముక్తయే,

యన్త్రమేతల్లిఖిత్వా తు మృత్తికోపరి మార్జయేత్.

 దక్షహస్తేన మన్త్రజ్ఞః ప్రత్యహం మండలావధి,

ఏవం కృతే మహాకారాగృహాన్మన్త్రీ విముచ్యతే.

 గగనం జ్వలనస్సాక్షి మర్క తి ద్వయం తతః,

తోయేశ శేషే మకరే ముంచతి ముంచతి.

తతశ్శృంఖలికాం చేతి వేదనేద్రాక్షరో మనుః,

ఇమం మన్త్రo దక్షకరే లిఖిత్వా వామనస్తతః.

 దూరీకృత్య జేన్మన్త్రమష్టోత్తరశతం బుధః,

త్రిసప్తాహాతబద్ధోఽసౌ ముచ్యతే నాత్ర సంశయః.

 మున్యాద్యర్చాదికం సర్వమస్య పూర్వవదాచరేత్,

లక్షం జపో దశాంశేన శుభైర్ధైవ్యైశ్చ హోమయేత్.

 పుచ్ఛాకారే సువస్త్రసెశ్చ లేఖన్యాక్షురకోత్థయా,

గంధాష్ట్ర కైర్లిఖేద్రూపం కపిరాజస్య సున్దరమ్.

తన్మ ధ్యేష్టదశార్ణం శత్రునామాన్వితం లిఖేత్,

తేన మన్త్రాభి జ ప్తేన శిరోబద్ధీన భూమీపః.

జయత్యంగణం పర్వం దర్శనాదేవ నిశ్చతమ్,

చన్ద్రసూర్యోపరాగాదౌ పూర్వోక్తం లేఖయేద్ధ్వజే.

 ధ్వజమాదాయ మన్త్రజ్ఞసంస్పర్శాన్మోక్షణావధి,

మాతృకాం జాపయేత్పశ్చాద్దశాం సేన చ హోమయేత్.

 తిలైప్సర్షపసంమిశ్రైప్సంస్కృతే హవ్యవాహనే,

గజే ధ్వజం సమారోప్య గచ్ఛేద్యుద్ధాయ భూమిపః.

గజస్థం తం ధ్వజం దృష్ట్వా పలాయన్తేఽరయో ధ్రువమ్,

మహారక్షాకరం యన్త్రం వక్ష్యే సమ్యక్షనూమతః.

 లిఖేద్వసుదలం పద్మం సాధ్యాఖ్యాయుతకర్ణికమ్,

దలేఽష్ట కోణమాలిఖ్య మాలామంత్రేణ వేష్టయేత్.

తద్భహిర్మాయయావేష్ట్య ప్రాణస్థాపనమాచరేత్,

 లిఖితం స్వర్ణలేఖన్యా భూర్జపత్రే సుశోభనే.

 కాశ్మీరరోచనాభ్యాం తు త్రిలో హేన చ వేష్టితమ్,

సంపాతసాధితం యన్త్రం భుజే వా మూర్జి దా రయేత్.

 రణే దురోదరే వాదే వ్యవహారే జయం లభేత్ ,

గ్ర హైర్వి ఘ్నైర్నిషైశస్త్రైశ్చోరైర్నెవాభిభూయతే.

సర్వాన్రోగానపాకృత్య చిరంజీవేచ్ఛతం సమాః,

షడ్దీర్ఘయుక్తం గగనం వహ్న్యఖ్యం తారసంపుటమ్.

 అష్టోర్ణోయం మహామంత్ర మాలామంత్రోథ కథ్యతే,

ప్రణవో వజ్రకాయేతి వజ్రతుండేతి సంపఠేత్.

కపిలాంతే పింగలేతి ఊర్ధ్వకేశమహాపదమ్,

బలరక్తముఖాంతే తు తడిజ్జిహ్వమహాతతః.

 రౌద్రదంష్ట్రోత్కటం పశ్చాకహద్వంద్వం కరాలితి,

 మహద్దృఢప్రహారేణ లోకేశ్వరవధాత్తతః.

వాయుర్మహా సేతుపదం బంధాంతే పమహాపునః,

శైలప్రవాహగగనే చర ఏ హ్యేపి సంవదేత్.

భగవన్మహాబలాంతే పరాక్రమపదం వదేశ్,

భైరవాజ్ఞాపయే హ్యేహి మహారౌద్రపదం తతః.

దీర్ఘపుచ్ఛేన వర్ణాంతే వదోద్వేషయవైరిణమ్,

జంభయ ద్వయమాభాష్య వర్మాగ్రౌంతో మనుర్మతః.

 మాలాహ్వయో ద్విజశ్రేష్ఠ శరనేత్రధరాక్షరః,

మాలామంత్రాష్ట్రాల్లయోశ్చ మున్యాద్యర్చా తు పూర్వవత్.

జప్తో యుద్ధీ జయం దద్యాద్వాంధే వ్యాధివినాశనః,

 ఏవం యో భజేపన్మంత్రీ వాయుపుత్రం కపీశ్వరమ్.

సర్వాన్స లభతే కామాన్దేవైరపి సుదుర్లభాన్,

 ధనం ధాన్యంపుతాన్పౌత్రాన్సౌభాగ్యమతులం యశః.

మేధాం విద్యాం ప్రభాం రాజ్యాం వివాదే విజయం తథా,

వశ్యాద్యాని కర్మాణి పంగరే విజయం తథా.

వశ్యాద్యావి కర్మాణి సంగరే విజయం తథా,

ఉపాపితోఽoజనాగర్భసంభూతః ప్రదదాత్యలమ్.

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే పనత్కుమారవిభాగే తృతీయపాదే హనుమన్మస్త్రకథనం నామచతుస్సప్తతితమోఽధ్యాయః.

అష్టదళములలోపల సాధ్యానామసమన్వితముగా షట్కోణమును లిఖించవలయును. షట్కోణములలో ధ్రువమును ‘ఆంజనేయాయ’ అను పదమును వ్రాయవలయును. అష్టదళములలో ప్రణవమును వాతు వాతు అని వ్రాయవలయును. గోరోచనముచే కుంకుమచే ఈ ఉత్తమ యంత్రమును వ్రాసి శిరస్సున ధరించి పదివేలు జపించవలయును. మట్టిమీద కుడిచేతితో వ్రాసి చెరుపవలయును. ఇట్లు నలుబది రోజులు ప్రతిదినము చేసినచో మహాకారాగారమునుండి విముక్తి లభించును. గగనము, అగ్ని, సూర్యుడు, మర్కట మర్కట అనునది జలము, చంద్రుడు, మకరము పరిముంచతి ముంచతి శృంఖలికా వీటితో కలిసి ముప్పది నాలుగక్షరముల మంత్రము. ఈ మంత్రమును కుడి చేతియందు వ్రాసి వామహస్తముచే చేరిపి మంత్రమును అష్టోత్తర శతమును జపించవలయును. ఇట్లు మూడు సప్తాహములు చేసినచో బద్దుడు ముక్తుడగును. ఈ మంత్రమునకు మున్యాదికము పూజాదికమంతయు పూర్వము వలె చేయవలయును. ఒక లక్ష జపము చేసి శుభ ద్రవ్యములచే హోమమును చేయవలయును. పుచ్చాకారమగు పవిత్రవస్త్రమునందు కురకము వలన ఏర్పడిన లేఖినిచే గంధాష్టకములచే హనుమంతుని సుందరరూపమును లిఖించవలయును. ఆ మధ్యలో అష్టాక్షరిని దశాక్షరిని శత్రునామ సహితముగా వ్రాయవలయును. ఆ యంత్రమును మంత్రించి శిరమున ధరించి యుద్ధములకు వెళ్ళినచో శత్రు సైన్యమును జయించును. సూర్య చంద్రగ్రహణములలో పూర్వోక్త యంత్రమును ధ్వజమున వ్రాయవలయును. గ్రహణ స్పర్శనుండి మోక్షము వరకు మంత్రజ్ఞుడు ధ్వజమును తీసుకొని మాతృకామంత్రమును జపించవలయును. తరువాత దశాంశమును హోమముగావించవలయును. సంస్కరించబడిన అగ్ని హోత్రములో ఆవాలు కలిపిన నువ్వులతో హోమమును చేసి గజము పై ధ్వజమునుంచి యుద్ధమునకు వెళ్ళవలయును. గజము పైనున్న ధ్వజమును చూచి శత్రువులు పారిపోవుదురు. ఇక ఇపుడు మహారక్షాకరమగు హనుమద్యంత్రమును చెప్పెదను. మొదట అష్టదళపద్మమును లిఖించి సాధ్యనామయుతముగా కర్ణికను వ్రాయవలయును. దాని బయట మాయచే వేష్టించి ప్రాణప్రతిష్ఠ చేయవలయును. స్వర్ణలేఖినితో చక్కని భూర్జపత్రమము పై కాశ్మీరరోచనములచే వ్రాయబడిన యంత్రమును లోహత్రముచే కప్పివైచి చక్కగా సాధించిన యంత్రమును భుజమున కాని శిరస్సును కాని ధరించవలయును. యుద్దమున, దూత్యమున, పొదమున, వ్యవహారమున జయము లభించును. గ్రహములచే, విఘ్నములచే, విషయములచే, శస్త్రములచే చోరులచే భయము కలుగదు. అన్ని రోగములను పారదోలి నూరు సంవత్సరములు జీవించును. షడ్దర్షయుక్తాకాశము, తార సంపుటమగు అగ్నితో కూడిన ఈ మంత్రము అష్టాక్షరీమంత్రము “ఓం నమో ఆంజనేయాయ” అనునది. ఇక ఇప్పుడు మాలామంత్రమును చేప్పెదను. “ఓం వజ్రకాయ! వజ్రతుండ ! కపిల ! పింగల ! ఊర్ద్వ కేశ ! మహాబల ! రక్తముఖ ! తడిజ్జిహ్వా ! మహారౌద్రదంష్ట్ర ! ఉత్కటం వహ ! వహ ! కరాల ! మహాధృడ ప్రహారేణ లంకేశ్వరవధాత్ వాయు మహా సేతుబంధ ! మహా శైల ప్రవాహ గగనే చర ! ఏ హ్యే హి ! భగవన్మహాబల పరాక్రమ ! భైరవ'! ఆజ్ఞాపయ ! ఏ హ్యే హి ! మహారౌద్ర ! దీర్ఘపుచ్చేన వేష్టయ వైరిణమ్. జంభయ జంభయ ! హుంఫట్” ఇది మాలామంత్రము. శరనేత్రధరాక్షరము. మాలామంత్రమునకు అష్టాక్షరికి మునిపూజాదికము పూర్వమువలెనే యుండును. యుద్దమున జపించిన జయము, వ్యాధిలో వ్యాధినాశనము, జరుగును. ఇట్లు వాయుపుత్రుడగు కపీశ్వరుని భజించువాడు దేవతలకు కూడా దుర్లభములగు సకలాభీష్టములను పొందును. ధనధాన్యపుత్రపౌత్రసౌభాగ్యకీర్తి మేధావిద్యాప్రభారాజ్యములను వాదవిజయమును, సర్వలోకవశ్యతను యుద్ధజయమును ఆంజనేయుని అనుగ్రహమువలన పొందును.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున సనత్కుమార విభాగమున తృతీయపాదమున హనుమన్మస్త్రకథనమను డెబ్బదినాలుగ -  అధ్యాయము సమాప్తము.