నారద మహా పురాణము
119 - ద్వాదశమాసస్థిత దశమి వ్రత కధనమ్
సనాతన ఉవాచ :-
అధతేఽహం ప్రవక్ష్యామి దశమ్యా వై వ్రతానిచ ।
యాని కృత్వా నరో భక్త్యా ధర్మరాజ ప్రియో భవేత్
చైత్ర శుక్ల దశమ్యాం తు ధర్మరాజం స్రపూజయేత్ ।
తత్కాల సంభవైః పుషైః ఫలైః గంధాదిభిస్తధా
సోపవాసో వైక భుక్తో భోజయిత్వా ద్విజోత్తమాన్ ।
చతుర్ధశ తతస్తేభ్య శ్శక్త్యా దద్యాచ్ఛ దక్షిణామ్
ఏవం యః కురుతే విప్ర ధర్మరాజు ప్రపూజనమ్ ।
స ధర్మస్యాజ్ఞయా గచ్ఛే ద్దేవై స్సాధర్మ్య మచ్యుతః
దశమ్యాం మాధవే శుక్లే విష్ణుమభ్యర్చ్య మానవః ।
గంధాద్యై రుపచారైశ్చ శ్వేతపుపై సుగంధిభిః
శతం ప్రదక్షిణాః కృత్వా విప్రాన్సం భోజ్యయ త్నతః ।
లభతే వైష్ణవం లోకం నాత్ర కార్యా విచారణా
జ్యేష్ఠ శుక్ల దశమ్యాం తు జాహ్నవీ సరితాం వరా ।
సమాయాతా ధరాం స్వర్గా తస్మాత్సా పుణ్యదా స్మృతా
జ్యేష్ఠ శుక్ల దలం హస్తో బుధశ్చ దశమి తిధిః ।
గరానన్ద వ్యతీపాతాః కన్యేస్తు వృష భాస్కరాః
దశయోగస్సమాఖ్యాత మహాపుణ్యతమో ద్విజ ।
హరతే దశ పాపాని తస్మాద్దశహరస్స్మృతః
అస్యాం యో జాహ్నవీం ప్రాప్య స్నాతి సంప్రీత మానసః ।
విధినా జాహ్నవీతోయే స యాతి హరిమందిరమ్
ఆషాఢ శుక్ల దశమి పుణ్యా మన్వాదికై స్మృతా ।
తస్యాం స్నానం జపో దానం హోమో వా స్వర్గతి ప్రదాః
శ్రావణే శుక్లదశమి సర్వాశాపరి పూర్తిదా ।
అస్యాం శివార్చనం శస్తం గంధాద్యై రుపచారకైః
తత్రోపవాసో నక్తం ద్విజానాం భోజనం జపః ।
హేమో దానం చ ధేన్వాదే స్సర్వపాప ప్రణాశనమ్
అధో నభస్య శుక్లాయాం దశమ్యాం ద్విజసత్తమ ।
వ్రతం దశావతారాఖ్యం తత్ర స్నానం జలాశయే
కృత్వా సంధ్యాది నియమం దేవర్షి పితృతర్పణమ్ ।
తతో దశావతారాణి సమభ్యర్చేత్సమాహితః
మత్స్యం కూర్మం వరాహం చ నరసింహం త్రివిక్రమమ్ ।
రామం రామం చ కృష్ణంచ బౌద్ధం కల్కినమేవచ
దశమూర్తీస్తు సౌవర్ణీః పూజయిత్వా విధానతః ।
దశభ్యో విప్రవర్యేభ్యో దద్యాత్సత్కృత్య నారద
ఉపవాసం చైక భుక్తం కృత్వా సంభోజ్య వాడవాన్ ।
విసృజ్య పశ్చాద్భుంజీత స్వయం స్వేస్టైస్సమాహితః
భక్త్యా కృత్వా వ్రతం త్వేత ద్భుక్త్యా భోగానిహోత్తమాన్ ।
విమానేన ప్రజేదంతే విష్ణులోకంసనాతనమ్
సనాతన మహర్షి పలికెను :-
ఇపుడు నీకు దశమి వ్రతములను చెప్పెదను. ఈ వ్రతములనుచేయు మానవుడు ధర్మరాజునకు ఇష్టుడగును. చైత్రశుక్ల దశమినాడు ఆ సమయము లభించు ఫలపుష్పాదులచే గంధాదులచే ధర్మరాజును పూజ, గవలయును.ఉపవసించి కాని ఏక భుక్తముతో కాని పూజించి పదునాలుగు మంది బ్రాహ్మణులను భుజింపచేసి శక్తి కొలది దక్షిణనీయవలయును. ఇట్లు ధర్మరాజును పూజించువాడు ధర్మరాజాజ్ఞచే దేవతలతో సమానుడగును. వైశాఖ శద్ధ దశమినాడు శ్రీ మహావిష్ణువును గంధాద్యుపచారములతో, సువాసనగల తెల్లని పూవులచే పూజించి, నూరు ప్రదక్షిణలనాచరించి, ప్రయత్నముతో బ్రాహ్మణులను భుజింపచేసినచో శ్రీ విష్ణులోకమును పొందును. జ్యేష్ఠశుద్ధ దశమినాడు గంగానది స్వర్గమునుండి భూలోకమున కొచ్చెను కావున ఈ దశమి పరమ పవిత్రమైనది. జ్యేష్టమాస శుక్లపక్షము, బుధగ్రహము, దశమి తిధి, గర, ఆనంద వ్యతీపాతములు, కన్యేష్ణువు, వృషభ, సూర్యుడు ఈ దశయోగము మహాపుణ్యతమము. ఈ యోగము పదిపాపములను హరించును కావున దీనిని దశహరయందురు. ఈ దినమున గంగానదికి వెళ్ళి, ప్రీతితో యధావిధిగా గంగా జలమున స్నానము చేసినవాడు శ్రీహరి లోకమును చేరును. ఆషాఢ శుక్లదశమి పవిత్రమైనదని మన్వాదులు చెప్పిరి. ఈ దినమున స్నానము, జపము, దానము హోమములు స్వర్గమును ప్రసాదించును. శ్రావణ శుక్ల దశమి సర్వాశాపూరకము. ఈ రోజు శివుని గంధాద్యుపచారములచే పూజించవలయును. ఉపవాసము కాని ఏక భుక్తము కాని చేయుచు, బ్రాహ్మణులను భుజింపచేసి, జపము, పరము, గోవులకు అన్నదానము సర్వపాపనాశకము. భాద్రపద శుక్లదశమినాడు దశావతార వ్రతము చెప్పబడినది. ఈ దినమున జలాశయమున స్నానము చేసి సంధ్యావందన మాచరించి, దేవర్షి పితృతర్పణము చేసి, సావధానముతో దశావతారములను పూజించవలయును. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, శ్రీరామ, పరశురామ, కృష్ణ, బుద్ద కల్కులు దశావతారములు. బంగారముతో దశావతారమూర్తులను చేయించి, యధావిధిగా పూజించి పదిమంది బ్రాహ్మణులను పూజించి దానము చేయవలయును. ఉపవాసమును కాని ఏకభుక్తమును కొని చేసి బ్రహ్మచారులకు భోజనము పెట్టి విడిచి తాను భుజించవలయును. ఈ వ్రతమును భక్తిచే చేసి ఇహలోకమున సకల భోగములనుభవించి అంతమున విమానమునధిరోహించి విష్ణులోకమును చేరును.
అశ్వినే శుక్లదశమి విజయా సా ప్రకీర్తితా ।
చతుర్గోమయ పిండాని ప్రాతర్న్యస్య గృహాంగణే
చక్రవాల స్వరూపేణ తన్మధ్యే రామలక్ష్మణౌ ।
తధా భరత శత్రుఘ్నా పూజయే చ్చతురోఽపిహి
సపిధానాసు పాత్రేషు గోమయీషు చతసృషు ।
క్లిన్నం ధాన్యం సరౌప్యం తు ధృత్వా ధౌతాంశుకావృతమ్
పితృమాతృ భ్రాతృపుత్ర జాయా భృత్య సమన్వితమ్ ।
సంపూజ్య గంధపుష్పాద్యౌ రైవేద్యైశ్చ విధానతః
నమస్కృత్యాధ భుంజీత ద్విజాన్సంపూజ్య పూజితాన్ ।
ఏవం కృత్వా విధానంతు నరోవరం సుఖాన్వితః
ధనధాన్య సమృదశ దిశ్చితం జాయతే ద్విజ ।
అధాపరాష్ట్ర సమయే దశమ్యాం సంనిమగ్రితమ్
పూర్వదిక్షు శమిం విప్ర గత్వా తన్మూలజాం మృదమ్ ।
గృహీత్వా స్వగృహం ప్రాప్య గీత వాదిత్ర నిస్స్వనైః
సంపూజ్య తాం విధానేన సజ్జీకృత్య స్వకం బలమ్ ।
నిర్గత్య పూర్వ ద్వారేణ గ్రామద్బహి రనాకులః
తత శ్శత్రు ప్రతికృతిం నిర్మితాం పత్ర కాదిభిః ।
మనసా కల్పితాం వాపి స్వర్ణం పుంఖ శరేణ వై
విధ్యేదితి భృశం ప్రీతః ప్రాప్నుయాత్స్వగృహం నిశి ।
ఏవం కృత విధి ర్వాపి గచ్ఛేద్వా శత్రు నిగ్రహే
ఏప్రైవం దశమి విప్ర విధానాచరితా సదా ।
ధనం జయం సుతాన్ గాశ్చ గజాశ్వం వాప్యజావికమ్
దద్యాదిహ శరీరాంతే స్వర్గతిం చాపి నారద !
ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయదశమి యందురు. ప్రాతః కాలమున గృహాంగణమున (వాకీట) నాలుగు గోమయ పిండములను చక్రవాల రూపమున నుంచి వాటిమధ్య భాగమున రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను పూజించవలయును. మూత ఉన్న నాలుగు గోమయ పాత్రలలో క్లిన్నమగు (తడిసిన ధాన్యమును వెండితో నుంచి ధోత వస్త్రముతో కప్పి పితృమాతృ భ్రాతృపుత్ర జాయా భృత్య సమన్వితముగా యధావిధిగా గంధపుష్పనైవేద్యాదులతో పూజించి నమస్కరించి, బ్రాహ్మణులను భుజింపచేసి, పూజించి, దక్షిణనిచ్చి,తాను భుజించవలయును. ఇట్లు వ్రతము నాచరించినవాడు ఆ సంవత్సరము ధనధాన్యసమృద్ధికలవాడై సుఖముగా ఉండును. ఇక అపరాష్ట్ర సమయమున దశమినాడు చక్కగా పూజించిన తూర్పుదిక్కుననున్న శమీవృక్షప్రాంతమునకు వెళ్ళి దాని మూలమున నున్న మట్టిని తీసుకొని స్వగృహమునకొచ్చి, గీతవాద్య ధ్వనులతో ఆ మట్టిని యధావిధిగా పూజించి సిద్దముచేసి, తన పరివార బలముతో పూర్వద్వారమునుండి బయలువడలి స్వస్థ చిత్తముతో గ్రామమునకు బయటవెళ్ళి, పత్రకాదులచే చేయబడిన శత్రు ప్రతికృతిని కానీ, మనసుతో కల్పించిన ప్రతికృతిని కాని బాణముతో బాగుగాకొట్టి సంతోషముతో తన ఇంటిని చేరవలయును. ఇట్లుచేసిన తరువాత శత్రువును ఓడించుటకు యుద్దమునకు కూడా వెళ్ళవచ్చును. ఇట్లు విజయదశమిని యధావిధిగా నాచరించినవారు ధనమును, జయమును, పుత్రులను, గోవులను, గజములను, అశ్వములను, మేకలను, గొఱ్ఱలను ఇహలోకమున పొంది అంతమున స్వర్గమును చేరును.
దశమ్యాం కార్తీకే శుక్లే సార్వభౌమ వ్రతం చరేత్
కృతోపవాసో వైకాశీ నిశీధ్యేమిఽపూపకాదిభిః ।
దశదిక్షు బలిం దద్యాత్ గృహాద్వాపి పురాద్బహిః
మండలేఽష్టదలే క్లుప్తే గోవిడ్లిప్త ధరాతలే ।
మంత్రేరేభిర్ద్విజశ్రేష్ఠ ! గణేశాది కృతార్చనః
యో మే పూర్వగతః పాప్మా పాపకేనేహ కర్మణా ।
తమిశ్రో దేవరాజోఽద్య నాశయత్వఖిలేస్టదః
యో మేవహ్నిగతః పాప్మా పాపకేనేహ కర్మణా ।
తేజో రాజోఽథవహ్నిస్తం నాశయత్వఖిలేష్టదః
యో మే దక్షగతః పాప్మా పాపకేనేహ కర్మణా ।
తం యమః ప్రేతరాజో వై నాశయత్వఖిలేష్టదః
యో మే నైఋతిగః పాప్మా పాపకేనేహ కర్మణా ।
రక్ష రాజో నైఋతి స్తం నాశయత్వఖిలేష్టదః
యో మే పశ్చిమగః పాప్మా పాపకేనేహ కర్మణా ।
యాదః పతిస్తం వరుణ్ నాశయత్వఖిలేష్టదః
యో మే వాయుగతః పాప్మా పాపకేనేహ కర్మణా ।
వాయుస్తం మరుతాం రాజో నాశయత్వఖిలేష్టదః
యో మే సౌమ్యగతః పాప్మా పాపకేనేహ కర్మణా ।
సోమస్త మృక్షయక్షేశో నాశయత్వఖిలేష్టదః
యో మే ఈశగతః పాప్మా పాపకేనేహ కర్మణా ।
ఈశానో భూతనాథస్తం నాశయత్వఖిలేష్టదః
యో మే ఊర్థ్వగతః పాప్మా పాపకేనేహ కర్మణా ।
బ్రహ్మప్రజాపతీ శస్తం స్థాశయత్వఖిలేష్టదః
యో మేఽధ సంస్థితః పాప్మొ పాపకేనేహ కర్మణా ।
అనంతో నాగరాజస్తం నాశయత్వఖిలేష్టదః
ఇత్యేవం దశదిశసు బలిం దత్వా సమాహితః ।
క్షేత్రపాలాయ తద్బా హ్యే క్షిపేద్బలి మతంద్రితః
ఏవం కృత విధి శ్శేషం నీశాయాం నినయే త్సుధీః ।
గీతైస్సుమంగల ప్రాయై సృవపారైర్జపాదిభిః
ప్రాతస్నాత్వా సమభ్యర్చ్య లోకపాలాన్టిజోత్తమాన్ ।
ద్వాదశాభ్యర్చ్య సంభోజ్య శక్తితో దక్షిణాం దదేత్
ఇత్థం కృత్వా వ్రతం విప్ర భోగాస్భుక్వైహికా ఞ్చఛాన్ ।
యుగం స్వర్గ సుఖం భుక్త్యా సార్వభౌమో నృపో భవేత్
ఇక కార్తీక శుక్ల దశమినాడు సార్వభౌమ వ్రతము నాచరించవలయును. ఏక భుక్తముతోకాని ఉపవాసముతోకాని, నిశీఢ కాలమున అపూపాదులతో పదిదిక్కులందు ఇంటి వెలుపలకాని గ్రామమునకు వెలుపలకాని బలిని ఆర్పించవలయును. గోమయముచే అలికిన భూమిమీద అష్టదల పద్మమును లిఖించి, గణేశాదులను ఈ మంత్రములచే అర్పించవలయును. నేను చేసిన పాపకర్మచే పూర్వదిక్కున నున్న పాపమును దేవరాజగు ఇంద్రుడు ఇపుడు నశింపచేయుగాక. నేను చేసిన పాపకర్మలచే ఆగ్నేయ దిక్కున నునళ్ళీ నా పాపరాశిని అఖిలేష్టపదుడు తేజోరాజగు అగ్ని నశింపచేయుగాక. నాపాపకర్మల వలన దక్షిణ దిక్కుననున్న నా పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు ప్రేతరాజగు యముడు నశింపచేయుగాక. నా పాపకర్మల వలన నైఋతి దిశలో నున్న పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు రారాజగు నిబతి నశింపచేయుగాక. నాపాప కర్మల పశ్చిమ దిక్కునను నా పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు యాదః పతియగు వరుణుడు నశింపచేయుగాక. నా పాపకర్మల వలన వాయవ్య దిక్కున నున్న పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు మరుత్తుల రాజగు వాయువు నశింపచేయుగావుత. నాపాప కర్మలవలన ఉత్తర దీక్కున నున్న నా పాపరాశి అఖిలేష్ట ప్రదుడు ఋక్షయక్ష అధిపతియగు సోముడు నశింపచేయుగాక. నా పాపకర్మల వలన ఈశాన్య దిక్కున నున్న నాపాపరాశిని అఖిలేష్టపదుడు భూతనాధుడగు ఈశానుడు నశింపచేయుగాక. నాపాప కర్మల వలన ఊర్థ్వ దిక్కునున్న నాపాప రాశిని అఖిలేష్ట ప్రదుడు ప్రజాపతి యగు బ్రహ్మనశింప చేయుగాక. నాపాప కర్మవలన అధోభాగముననున్న నాపాపరాశిని అఖిలేష్ట ప్రదుడు నాగరాజగు అనంతుడు నశింపచేయుగాత. ఇట్లు సావధానముతో పదిదిక్కులందు బలినిచ్చి దాని వెలుపల క్షేత్ర పాలునకు బలినీయవలయును. ఇట్లు ఆచరించి మిగిలిన రాత్రిని మంగలగీతములచే స్తుతి పాఠములచే, జపాదులచే గడుపవలయును. ప్రాతః కాలమున లేచి స్నానముచేసి లోకపాలులను బ్రాహ్మణులను పూజించి, పన్నెండు మందిని భుజింపచేసి శక్తికొలది దక్షిణనీయవలయును. ఇట్లు వ్రతము నాచరించి ఇహలోకమున భోగములననుభవించి ఒకయుగకాలము స్వర్గసుఖముననుభవించి సార్వభౌముడగును.
మార్గశుక్ల దశమ్యాం తు చరేదారోగ్యకం వ్రతమ్ ।
గంధాద్యై రర్చయే ద్విపాన్ దశతచ్చరణోదకమ్
పీత్వాధ దక్షిణాం దత్వా విసృజేదేక భోజనః ।
ఏతత్కృత్వా వ్రతం విప్ర హ్యారోగ్యం ప్రాప్య భూతలే
ధర్మరాజ ప్రసాదేన మోదతే దివి దేవవత్ ।
పౌషే దశమ్యాం శుక్లాయాం విశ్వేదేవాన్సమర్చయేత్
క్రతుం దక్షం వసూనృత్యం కాలం కామం మునిం గురుమ్ ।
విప్రం రామం చ దశధా కేశవస్తానమాస్థితః
స్థాపయిత్వా దర్భమయా నాసనేషు చ సంస్థితాన్ ।
గంధైర్దూపై సధా దీపై రైవేద్యై శ్చాపి నారద
ప్రత్యేకం దక్షిణాం దత్వా ప్రణీపత్య విసర్జయేత్ ।
దక్షిణాం తాం ద్విజాగ్రేభ్యో గురవే వా సమర్పయేత్
ఏవం కృత విధి శ్చైక భుక్తో భోగీ వ్రతీ భవేత్ ।
లోకద్వయస్య విప్రరే నాత్ర కార్యా విచారణా
మాఘశుక్ల దశమ్యాం తు సోపవాసో జితేంద్రియః ।
దేవానంగిరసో నామ దశ సమ్య కమర్చయేత్
కృత్వా స్వర్ణమయా న్విఘ్ర గంధాద్యై రుపచారకైః ।
ఆత్మాహాయుర్మనో దక్షో మదః ప్రాణస్త ధైవచ
బర్హిష్మాంశ్చ గవిష్ఠశ్చ దత్త సత్యశ్చతే దశ ।
దశ విప్రా నోజయిత్వా మధురాన్నేన నారద
మూర్తీస్తేభ్యః ప్రదద్యాత్తాః స్వర్గలోకాప్తయే క్రమాత్ ।
అంత్యశుక్ల దశమ్యాంతు చతుర్దశ యమాన్యజేత్
యమశ్చ ధర్మరాజశ్చ మృత్యుశ్చైవాంతకస్తధా ।
వైవస్వతశ్చ కాలశ్చ సర్వభూతక్షయస్తధా
జాదుమ్బరశ్చ దద్నశ్చ ద్వౌనీల పరమేష్ఠినౌ ।
వృకోదరశ్చ చిత్రశ్చ చిత్రగుప్త శ్చతుర్దశ
గంధాద్యైరుపచారైశ్చ సమభ్యర్చ్యాధ తర్పయేత్ ।
తిలాంబు మిశ్రాంజలిభి ర్దర్భైః ప్రత్యేక శస్త్రిభిః
తతశ్చ దద్యాత్సూర్యార్ఘ్యం తామ్ర పాత్రేణ నారద ।
రక్తచందన సంమిశ్ర తిలాక్షత యవాంబుభిః
ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే ।
గృహాణార్ఘ్యం మయా దత్తం భక్త్యా మామనుకం పయ
ఇతి మంత్రేణ దత్యార్యం విప్రాన్ఫోజ్య చతుర్దశ ।
రౌప్యాం సుదక్షిణాం దత్వా విసృజ్యాన్నీత చ స్వయమ్
భుక్త్యా భోగాంశ్చ పుత్రార్థా నైహికాన్దేవ దుర్లభాన్
విమానవరమాస్థాయ దేహంతే విష్ణులోకభాక్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్ధపాదే ద్వాదశమాస స్థిత దశమి వ్రత నిరూపణం నామ ఏకోన వింశత్యధిక శతతమోధ్యాయః.
మార్గశిర్ష శుద్ధ దశమినాడు ఆరోగ్యవ్రతము నాచరించవలయును. పదిమంది బ్రాహ్మణులను గంధాదులతో పూజించి, వారి పాదోదకమును పానము చేసి దక్షిణనిచ్చి విడిచి ఏక భుక్తముగా నుండవలయును. ఈ వ్రతమునుచేసిన వారు భూలోకమున ఆరోగ్యమును పొంది, ధర్మరాజానుగ్రహముచే స్వర్గమున దేవతవలె ఆనందింతురు. పుష్య శుక్ల దశమినాడు విశ్వేదేవతలను పూజించవలయును. క్రతువును, దక్షుని, వస్తువులను, సత్యుని, కాలుని, కాముని, మునిని, గురువును, విప్రుని, రామునీ ఈ పదిమందిలో పదిరూపులుగా కేశవుడున్నాడు. ఈ పదిమందిని దర్భలరూపముగా ఆసనములపై స్థాపించి గంధధూప దీప నైవేద్యములచే పూజించి ఒక్కొక్కరికి దక్షిణలనిచ్చి విడువవలయును. ఆ దక్షిణలను బ్రాహ్మణులకు కాని గురువుకుకాని సమర్పించవలయును. ఇట్లు ఏకభుక్తముతో ఈ వ్రతము నాచరించినవాడు ఇహపరములలో భోగములననుభవించును. మాఘశుక్ల దశమినాడు ఉపవసించి జితేంద్రియుడై అంగిరసులను పేరుగల పదిమంది దేవతలను బంగారుమూర్తులను చేసి గంధాద్యుపచారములచే చక్కగా పూజిచంవలయును. ఆత్మా, ఆయువు, మనసు, దక్షుడు, మద, ప్రాణ, బర్హిష్మాన్, గనిష్టుడు, దత్తుడు, సత్యుడు అనువారలు దశాంగిరసులు. పదిమంది బ్రాహ్మణులకు మధురాన్నములతో భోజనముపెట్టి, దశస్వర్ణమూర్తులను క్రమముగా దానము చేయవలయును. ఫాల్గున శుద్ద దశమినాడు పదునాలుగు మంది యములను పూజించవలయును. యముడు, ధర్మరాజు, మృత్యువు, అంతకుడు, వైవస్వతుడు, కాలుడు, సర్వభూతక్షయుడు, ఔదుమ్బరుడు, దధ్నుడు, నీలుడు, పరమేష్ఠి, వృకోదరుడు, చిత్రగుప్తుడు అనువారలు పదునాలుగు మంది యములు. గంధాద్యుప చారములతో చక్కగా పూజించి తిల అంబుమిశ్రాంబులతో ధరలతో ఒక్కొక్కరికి మూడుమార్లు తర్పణము చేయవలయును. తరువాత తామ్రపాత్రతో రక్తచన్దన సమంమిశ్రితలాక్షతయ వాంబువులతో సూర్యునకు అర్ఘ్యమియవలయును. ఓ సూర్యా! సహశ్రాంశూ? తేజోరాశీ ! జగత్పతీ! రమ్ము, నేను భక్తితో నిచ్చు అర్ఘ్యమును స్వీకరించి నన్ను దయ చూడుము. అను మంత్రముతో అర్ఘ్యము నిచ్చి పదునాలుగు మంది బ్రాహ్మణులను భుజింపచేసి, వెండిని దక్షిణగా నిచ్చి విడిచి, తాను భుజించవలయును. ఇట్లు యధావిధిగా వ్రతము నాచరించినవాడు ధర్మరాజానుగ్రహము వలన ఇహలోకమున పుత్రాది సకల భోగములను అనుభవించి, ఉత్తమ విమానమునధిరోహించి దేహాంతమున విష్ణులోకమును చేరును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వ భాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధ పాదమున ద్వాదశమాస స్థిత దశమివ్రత నిరూపణమను నూటాపందొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 121 of the Nārada Mahā Purana is as follows:
సంసార సాగరాన్ని దాటుటకు శ్రీహరి భక్తియే ఏకైక నౌక అని సనందన మహర్షి ఈ అధ్యాయంలో ఉపదేశించినారు. అనన్యమైన హరిభక్తి వలన మానవుడు చతుర్విధ పురుషార్థములను పొంది ఆత్యంతిక మోక్షమును సాధించుతాడని నిరూపించబడినది.