నారద మహా పురాణము
121 - ద్వాధవమాసస్థ ద్వాదశీవ్రత నిరూపణమ్
సనాతన ఉవాచ :-
అధ వ్రతాని ద్వాదశ్యా కధయామి తవానఘ ।
యాని కృత్వా నరో లోకే విష్ణోః ప్రియతరో భవేత్
చైత్రస్యశుక్ల ద్వాదశ్యాం మదన వ్రతమాచరేత్ ।
స్థాపయేద్రవణం కుంభం సితతండులపూరితమ్
నానాఫలయుతం తద్వ దిక్షుదండసమన్వితమ్ ।
సితవస్త్రయుగచ్ఛన్నం సితచందన చర్చితమ్
నానాభక్ష్యసమోపేతం సహిరణ్యం స్వశక్తితః ।
తామ్రపత్రం గుడోపేతం తస్యోపరి నివేశయేత్
తత్ర సంపూజయేద్దేవం కామరూపిణ మచ్యుతమ్ ।
గంధాద్యైరుపచారైస్తు సోపవాసోపరేఽహని
పునఃప్రాతస్సమభ్యర్చ్య బ్రాహ్మణాయ నివేదయేత్ ।
బ్రాహ్మణాన్ఫో జయేచైవ తేభ్యో దద్యాచ్చ దక్షిణామ్
వర్షమేవంవ్రతంకృత్వా ఘృతధేను సమన్వితమ్ ।
శయ్యాంతుదద్యాద్గురవే సర్వోపస్కారసంయుతామ్
కాంచనం కామదేవం చ శుక్లాం గాం చ పయస్వినీమ్ ।
వాసోభిర్ద్విజ దాంపత్యం పూజయిత్వా సమర్పయేత్
ప్రీయతాం కామరూపీ మే హరిరిత్యేవముచ్చరన్ ।
యః కుర్యాద్విధినానేన మదన ద్వాదశీవ్రతమ్
ససర్వపాపనిర్ముక్తః ప్రాప్నోతి హరిసామ్యతామ్ ।
అస్యామేసముద్ధిష్టం భరద్వాదశికావ్రతమ్
స్వాస్తృతాం తత్ర శయ్యాం తు కృత్వాత్ర శ్రీయుతం హరిమ్ ।
సంస్థాప్య మండపం పుష్పై సదుపర్యుపకల్పయేత్
తతస్సంపూజ్య గంధాద్యై ర్వతీ జాగరణం నిశి ।
నృత్యవాదిత్రగీతాద్యై స్తతః ప్రాతఃపరేహని
సశయ్యం శ్రీహరి హైమం ద్విజాగ్ర్యాయ నివేదయేత్ ।
ద్విజాన్సంభోజ్యవిసృజే దక్షిణాభిః ప్రతోషితాన్
ఏవంకృతవ్రతస్యాపి దాంపత్యం జాయతే స్థిరమ్ ।
సప్తజన్మను భుంక్తేచ భోగాన్లోక ద్వయప్సితాన్
వైశాఖశుక్లద్వాదశ్యాం సోపవాసో జితేన్దియః ।
సంపూజ్య మాధవంభక్త్యా గంధాద్యైరుపచారకైః
పక్వాన్నం తృప్తిజనకం మధురం సోదకుంభకమ్ ।
విప్రాయ దద్యాద్విధివ న్మాధవః ప్రీయతామితి
ద్వాదశ్యాం జ్యేష్ఠశుక్లాయాం పూజయిత్వా త్రివిక్రమమ్ ।
గంధాద్యైర్మధురాన్నాధ్యం కరకం వినివేదయేత్
ప్రతీ ద్విజాయ తత్పశ్చ దేకభుక్తం సమాచరేత్ ।
ప్రతేనానేనసంతుష్ణో దేవదేవస్త్రివిక్రమః
దదాతి విపులాన్ఫోగా నంతే మోక్షం చ నారద! ।
ఆషాఢ శుక్లద్వాదశ్యాం ద్విజాన్జదశ భోజయేత్
మధురాన్నేన తాన్పూజ్య పృధగ్గంధాదికాః క్రమాత్ ।
తేభ్యో వాసాంసి దండాంశ్చ బ్రహ్మసూత్రాణి ముద్రికాః
పాత్రాణి చ దదేద్భక్త్యా విష్ణుర్మేషీయతామితి
సనాతనమహర్షి పలికెను :- ఓపుణ్యాత్ముడా ఇపుడు నీకు ద్వాదశివ్రతములను చెప్పెదను. ఈ వ్రతములనాచరించువారు శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రులగుదురు. చైత్రశుక్లద్వాదశినాడు మదన వ్రతమాచరించవలయును. తెల్లని బియ్యముతో నింపిన కొత్త కలశమును స్థాపించవలయును. ఆకలశము చుట్టు నానాఫలమును, చెఱుకుగడలనుంచవలయును. రెండు తెల్లని వస్త్రములతో కప్పవలయును. తెల్లని చందనమును పూయవలయును. సోనో భక్ష్యములనుంచవలయును. శక్తి కొలది బంగారమునుంచ వలయును. ఆకలశము మిద గుడముతో కూడిన తామ్రపత్రమునుంచవలయును. ఆపత్రము. మిద కామరూపి యగు అచ్యుతుని ఉపవశించి మరునాడు గంధాద్యుపచారములతో పూజించవలయును. మరల ప్రొద్దున పూజించి బ్రాహ్మణునకు దానమును గావించవలయును. బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనీయవలయును. ఇట్లు ఈవ్రతమును ఒక సంవత్సరము గావించి ఘృతధేను సమన్వితముగా సర్వోపస్కారసహితమగు శయ్యను గురువునకు దానము చేయవలయును. కాంచనమును, కామదేవుని, శ్వేతగోవును, వస్త్రములను బ్రాహ్మణదంపతులను పూజించి సమర్పించవలయును. ఈదానమును గావించునపుడు, కామరూపియగు శ్రీహరి ప్రీతి చెందుగాక అని పలుకవలయును. ఇట్లు ఈమదన ద్వాదశీవ్రతమును యధావిధిగా నాచరించినవారు సర్వపాపవినిర్ముక్తులై హరిసామ్యమును పొందెదరు. ఈద్వాదశినాడే భర్తృద్వాదశికా వ్రతముకూడా చెప్పబడియున్నది. చక్కగా ఏర్పరచబడిన శయ్యను అమర్చి ఆశయపై పుష్పములతో మండపమును నిర్మించి ఆ మండపముపై శ్రీసహితుడగు హరిని స్థాపించి గంధాద్యుపచారమునుచేసి, మరునాడు ప్రాతఃకాలమున శయ్యతోపాటు బంగారముతో చేసిన బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింపచేసి విడిచిపుచ్చవలయును. ఇట్లు వ్రతము నాచరించువారి దాంపత్యము స్థిరముగా నుండును. ఏడు జన్మలలో ఉభయలోకభోగములననుభవించును. వైశాఖ శుక్లద్వాదశి నాడు ఉపవసించి, జితేంద్రియుడై భక్తిచే మాధవుని గంధాద్యుపచారములచే పూజించి తృప్తిని కలిగించు మధురమగు పక్వాన్నమును ఉదకుంభసహితముగా మాధవుడు ప్రీతిచెందుగాక యని బ్రాహ్మణునకు దానము గావించవలయును. జ్యేష్ఠశుక్ల ద్వాదశినాడు త్రివిక్రముని గంధాదులతో పూజించీ మధురాన్సయుతమగు కరకమును బ్రాహ్మణునకు సమర్పించవలయును. వ్రతమునాచరించు వాడు ఏకభుక్తముగా నుండవలయును. ఈవ్రతముతో సంతోషించిన దేవదేవుడగు త్రివిక్రముడు ఇహమున సకల భోగములను, అంతమున మోక్షమును ప్రసాదించును. ఆషాఢ శుక్లద్వాదశినాడు పన్నెండు మంది బ్రాహ్మణులను క్రమముగా గంధాదులతో పూజించి మధురాన్నమును భుజింపచేసి వారికి వస్త్రములను, దండములను, బ్రహ్మసూత్రములను ముద్రికలను పాత్రలను భక్తితో విష్ణువు ప్రీతి చెందుగాకయని దానము గావించవలయును.
ద్వాదశ్యాం తు నభ శ్శుక్లే శ్రీధరం పూజయేద్ర్వతీ
గంధాద్యైస్పనరో భక్త్యా దధిభకైర్ద్విజోత్తమాన్ ।
సంభోజ్య దక్షిణాది రౌప్యాం దత్వా నత్వావిసర్జయేత్
వ్రతేనానేన దేవేశ శ్రీధరః ప్రియతామితి ।
ద్వాదశ్యాం నభస్యశుక్లే ప్రతీ సంపూజ్య వామనమ్
తదగ్రే భోజయే ద్విపా నాయసైక్టాదశైవచ ।
సౌవర్ణిం దక్షిణాం దత్వా విష్ణుప్రీతికరో భవేత్
ద్వాదశ్యామిషశుక్లాయాం పద్మనాభం సమర్చయేత్ ।
గంధాద్యైరుపచారైస్తు తదగ్రే భోజయేద్ద్విజాన్
మధురాన్నేన వస్త్రాడ్యాం సౌవర్లీం దక్షిణాం దదేత్ ।
వ్రతేనైతేన సంతుష్టః పద్మనాభో ద్విజోత్తమ
శ్వేతద్వీపగతిం దద్యా ద్దేహభోగాంశ్చ వాంఛితాన్ ।
కార్తికే కృష్ణపక్షే తు గోవత్సద్వాదశీవ్రతమ్
తత్ర వత్సయుతాం గాం తు సమాలిఖ్య సుగంధిభిః ।
చందనాద్యైస్తధాపుష్ప మాలాభిః ప్రార్ఘ్య తామ్రకే
పాత్రే పుష్పాక్షతతిలై రర్యం కృత్వా విధానతః ।
ప్రదద్యాత్పాదమూలేస్యాం మంత్రేణానేన నారద!
క్షీరోదార్ణవసంభూతే సురాసురనమస్కృతే ।
సర్వదేవమయే దేవి! సర్వదేవైరలంకృతే
మాతర్మాతర్గవాంమాత గృహాణార్ఘ్యం నమోస్తు తే ।
తతో మాషాదిసంసిద్దా న్వటకాంశ్చ నివేదయేత్
ఏవం పంచదశ్రేకం వా యధావిభవమాత్మనః ।
సురభి! త్వం జగన్మాతా నిత్యం విష్ణుపదే స్థితా
సర్వదేవమయే గ్రాసం మయాదత్తమిమం గ్రస ।
సర్వదేవమయే గ్రాసం మయాదత్తమిమం గ్రస
మాతర్మమాభిలషితం సఫలం కురు నల్గిని! ।
తద్దినేతైలపక్వం చ స్థాలీపక్వం ద్విజోత్తమ
గోక్షీరం గోఘృతంచైవ దధితక్రం చ వర్జయేత్ ।
ద్వాదశ్యామూర్ఖశుక్లాయాం దేవం దామోదరం ద్విజు
సమభ్యర్యోపచారైస్తు గంధాద్యైస్సునసమాహితః ।
తదగ్రే భోజయేద్విప్రా నక్వాన్నేనార్కసంఖ్యకాన్
తతః కుంభానుదక్పూర్లా న్యస్త్రచ్ఛన్నానమర్చితాన్ ।
సపూగమోదకస్వర్ణాం క్షేభ్యః ప్రీత్యా సమర్పయేత్
ఏవం కృతే ప్రియో విష్ణో ర్జాయతే ఖిల భోగయుక్ ।
దేహాంతే విష్ణుసాయుజ్యం లభతే నాత్ర సంశయః
నీరాజనవ్రతం చాత్ర గదితం తన్నిబోధ మే ।
సుషోత్తితం జగన్నాథ మలంకృత్య నిశాగమే
ఆలంకృతనవంవహ్ని ముత్పాద్యాభ్యర్చ్య మంత్రతః ।
హుత్వా తత్ర సముద్గీస్తే రౌప్యదీపికయామునే
గంధపుష్పాద్యర్చితయా జనై ర్నిరాజయద్ధరిమ్ ।
తళైవానుగతాం లక్ష్మీం బ్రహ్మణిం చండికాం తధా
ఆదిత్యం శంకరం గౌరీం యక్షం గణపతిం గ్రహాన్ ।
మాతృః పితృన్నగాన్నాగా నర్వాన్నీరాజయేత్ర్కమాత్
గవాం నీరాజనం కుర్యా న్మహిష్యాదీంశ్చ మండలమ్ ।
నమో యేతితి శబైశ్చ ఘంటాశంఖాది నిస్స్వనైః
సిందూరాలిస్తశృంగాణాం చిత్రాంగాణాంచ వర్ణకైః ।
గవాం కోలాహలే వృత్తే నీరాజనమహోత్సవే
తురగాంలక్షణోపేతా స్ధజాంశ్చ మదవిప్లుతాన్ ।
రాజచిహ్నాని సర్వాణి ఛత్రాదీని చ నారద!
రాజా పురోధసా సార్థం మంత్రిభృత్యపురస్సరః ।
పూజయిత్వా యధాన్యాయం నీరాజ్య స్వయమాదరాత్
శంఖతూర్యాది ఘోషైశ్చ నానారత్నవినిర్మితే ।
సింహాసనే నవే క్లుప్తీ తిప్షత్సమ్యగలంకృతః
తతస్సులక్షణేర్యుక్తా వేశ్యా వాధకులాంగనా ।
శీరోపరి నరేన్లస్య తయా నీరాజయేచ్చనైః
ఏవమేషా మహాశాంతిః కర్తవ్యా ప్రతి వత్సరమ్ ।
రాజ్ఞా విత్తవతాన్యేన వర్షమారోగ్యమిచ్ఛతా
యేషాం రాష్ట్రే పురే గ్రామే క్రియతే శాంతీరుత్తమా ।
నీరాజనాభిధా విప్ర! తద్రోగా యాంతి సంక్షయమ్
శ్రావణశుక్లద్వాదశినాడు శ్రీధరుని భక్తితో గంధాద్యుపచారములతో పూజించి, బ్రాహ్మణోత్తములను దధితో చక్కగా భోజనము చేయించి, వెండిని దక్షణగా నిచ్చి నమస్కరించి విడువవలయును. ఈవ్రతముతో దేవేశుడగు శ్రీధరుడు ప్రీతి చెందుగాక యని పలుక వలయును. భాద్రపద శుక్లద్వాదశినాడు వామనుని చక్కగా పూజించి వామనుని ముందు పన్నెండు మంది బ్రాహ్మణులను పాయసముతో భుజింపచేసి సువర్ణమును దక్షిణగానిచ్చి శ్రీమహావిష్ణువునకు ప్రీతి పాత్రుడగును. ఆశ్వయుజ శుద్ధ ద్వాదశినాడు పద్మనాభుని గంధాద్యుపచారములతో పూజించి, పద్మనాభునిముందు బ్రాహ్మణులను మధురాన్నముతో భుజింపచేసి సువర్ణమును దక్షిణగా నీయవలయును. ఈవ్రతముతో సంతోషించిన పద్మనాభుడు ఇహమున వాంఛితసకలభోగములను శ్వేతద్వీపగతిని ఇచ్చును. కార్తిక కృష్ణద్వాదశినాడు గోవత్సద్వాదశీవ్రతము చెప్పబడినది. ద్వాదశినాడు తామ్రపాత్రపై సుగంధముగల చందనాదులతో వత్ససహితమగు గోవును లిఖించి పుష్పమాలతో పూజించి, యధావిధిగా పుష్పాక్షతతిలలో ఆర్ఘ్యమునిచ్చి ఈమంత్రముతో గోపాదములమున జలమును విడువవలయును. క్షీరసాగర సంజాతా! సురాసుర నమస్కృతా సర్వదేవమయా దేవీ సర్వదేవాలంకృతా గోవులకు మాతా మామాతా ఈ ఆర్యమును గ్రహించుము. నీకు నమస్కారము తరువాత మాషాదిసంసిద్ధములగువంటకములను నివేదన చేయవలయును. ఇట్లు తమతమ విభవానుసారముగా అయిదు కాని పది కాని ఒకటి కాని గోవులను ఓ సురభీ! జగన్మాతా నిత్యము విష్ణుపదమున నుండు దానా సర్వదేవస్వరూపిణీ నేనిచ్చు ఈ గ్రాసమును భుజించుము. సర్వదేవస్వరూపిణీ! సర్వదేవాలంకృతా నా అభిలాషను సఫలము చేయుము. అని పలికి గ్రాసమునీయవలయును. ఈ దినమున తైలపక్వమును, స్థాలీపక్వమును, గోక్షీరమును, గోఘృతమును, గోధధి, తక్రమును విడువవలయును. కార్తీక శుక్లద్వాదశినాడు సావధానముతో దామోదరుని గంధాద్యుపచారములతో చక్కగా పూజించి, దామోదరుముని ముందు పన్నెండు బ్రాహ్మణులను పక్వాన్నముతో భుజింపచేయవలయును. తరువాత నీటితో నింపిన కుంభములను వస్త్రచ్ఛన్నము గావించి చక్కగా పూజించి మోదక స్వర్ణములను ప్రీతితో వారికి సమర్పించవలయును. ఇట్లు చేసినచో శ్రీమహావిష్ణువునకు ప్రీతిపాత్రుడగును. అఖిలభోగములనను భవించి దేహాంతమున విష్ణుసాయిజ్యమును పొందును. ఈదినముననే నీరాజనవ్రతము కూడా చెప్పబడినది. దానిని తెలియుము. సాయంకాలమున నిదురించి లేచిన జగన్నాధుని చక్కగా అలంకరించి, తాను అలంకరించు కొని కొత్తగా అగ్నిని కల్పించి, మంత్రములతో పూజించి, జ్వలించిన అగ్నిలో హోమము గావించి రౌప్యదీపకయామునమునందు గంధ పుష్పాదులచే అర్చించిన దానితో శ్రీహరికి నీరాజనమును గావించవలయును. శ్రీహరి వెంట అక్కడే ఉన్న లక్ష్మీదేవిని, సరస్వతిని, చండికను, సూర్యుని, శంకరుని, గౌరీదేవిని, యక్షుని, గణపతిని, నవగ్రహములను, మాతృదేవతలను, పితరులను పర్వతములను, సర్పములను, అందరికీ క్రమముగా నీరాజనమీయవలయును. గోవులను నీరాజనము గావించవలయును. మహష్యాదులకు మండలమును గావించవలయును. నమశ్శబ్దములచే జయశబ్దములచే, ఘంటా శంఖా ధ్వనులచే, సిందూరము పూయబడిన శృంగములను, చిత్రాంగముల బహువిధవర్ణములతో, నీరాజన మహోత్సవములతో గోవుల కోలాహలము జరుగుచుండగా, సలక్షణములగు అశ్వములను, మదించిన గజములను, సర్వవిధములగు రాజచిహ్నములగు ఛత్రాదులను పూజించి స్వయముగా ఆదరముతో నీరాజనము నిచ్చి, శంఖభేర్యాది ఘోషములతో నానారత్న నిర్మితమగు సింహాసనమున చక్కగా అలంకరించుకొని కూర్చుం డవలయును. తరువాత సర్వలక్షణ లక్షితయగు వేశ్యకాని, కులాంగన కాని రాజుగారి శిరస్సుపై మెల్లగా నీరాజనము నీయవలయును. ఇట్లు మహారాజులు లేదా ధనవంతులు ఆరోగ్యమును కోరువారు ప్రతిసంవత్సరము ఈమహా శాంతిని జరుపవలయును. ఇట్లు సర్వోత్తమ మగు నీరాజన శాంతిని జరిపిన రాష్ట్రమున, పురమున రోగములు నశించి ఆరోగ్యము విలసిల్లును.
ద్వాదశ్యాం మార్గశుక్లాయాం సాధ్యవ్రతమనుత్తమమ్ ।
మనోభవస్తధాప్రాణో నరో యాతశ్చవీర్యవాన్
చితిర్హయో నృపశ్చైవ హంసో నారాయణస్తధా ।
విభుశ్చాపి ప్రభుశ్చైవ సాధ్యా ద్వాదశ కీర్తితాః
పూజయేద్దంధపుష్పాద్యై రేతాంస్తందుల కల్పితాన్ ।
తతో ద్విజాగ్రా నృంభోజ్య ద్వాదశాత్ర సుదక్షిణాః
దత్వా తేభ్యసువిసృజే తీయాన్నారాయణస్తితి ।
ఏతస్సామేవవిదితం ద్వాదశాదిత్యసంజ్ఞితమ్
వ్రతం తత్రార్చయే ధీమా నాదిత్యాక్టాదశాపి చ ।
ధాతా మిత్ర్యోద్యమా పూషా శక్రోంశో వరుణ్ భగః
త్వష్టా వివస్వాన్సవితా విష్ణుద్ఘాదశ రరితాః ।
ప్రతిమాసం తు శుక్లాయాం ద్వాదశ్యామర్చ్య యత్నతః
వర్షం నద్ర్వతాంతే తు ప్రతిమా ద్వాదశాపి చ ।
హైమిస్సంపూజ్య విధినా భోజయిత్వా ద్విజోత్తమాన్
మధురాన్నైస్సు సత్కృత్య ప్రత్యేకం చార్పయే ద్ర్వతీ ।
ఏవం వ్రతం నరః కృత్వా ద్వాదశాదిత్య సంజ్ఞకమ్
సూర్యలోకం సమాసాద్య భుక్త్యా భోగాంశ్చరం తతః ।
జాయతే భువి ధర్మాత్మా మనుష్యో రోగవర్జితః
తతో వ్రతస్య పుణ్యేన పునరేవ లభే ద్ర్వతమ్ ।
తత్పుణ్యే సరవేర్భిత్యా మండలం ద్విజసత్తమ
నిరంజనం నిరాకారం నిర్ద్వంద్వం బ్రహ్మ చాప్నుయాత్ ।
అశ్రితాఖండ సంజ్ఞం చ వ్రతముక్తం ద్విజోత్తమ
మూర్తిం నిర్మాయ సౌవర్లీం జనార్దన సమాహ్వయామ్ ।
అభ్యర్చ్య గంధపుష్పాద్యై స్తదగ్రే భోజయే ద్ద్విజాన్
ద్వాదశప్రతిమాసం తు నక్తాశిస్స్యాజ్జితేన్దియః ।
తతస్సమాంతే తాం మూర్తిం సమభ్యర్చ్యవిధానతః
గురవే ధనుసహితాు దద్యాత్సంప్రార్థయేత్తధా ।
శతజన్మసు యత్కించి న్మయాఖండవ్రతం కృతమ్
భగవంస్యత సాదేన తదఖండమిహాస్తు మే ।
తతస్సంభోజ్యవిప్రాగ్ర్యా నఖండాడ్యైస్తు పాయసైః
ద్వాదశైవ హి సౌవర్లీం దక్షిణాం ప్రదదేన్నమేత్ ।
ఇతి కృత్వా వ్రతం విప్ర ప్రీణయిత్వా జనార్దనమ్
సౌవర్ణేన విమానేన యాతి విష్ణోః పరం పదమ్ ।
పౌషస్య కృష్ణద్వాదశ్యాం రూపవ్రతముదీరితమ్
దశమ్యాం విధివత్నాత్వా గృహ్లియార్టోమయం ప్రతీ ।
శ్వేతాయామైనకవర్ణాయా ఆన్తరిక్షగతం ద్విజ
అష్టోత్తరశతం తేన పిండికాః కల్ప్య నారద! ।
శోషయేదాతపే ధృత్వా పాత్ర తామ్రధ మృణ్మయే
ఏకాదశ్యాం సోపవాస స్సమభ్యర్చ్య విధానతః ।
సౌవర్లీం ప్రతిమాం విష్ణో ర్నిశాయాం జాగరం చరేత్
సుమంగలైఫీతవాద్యై స్తోత్రపాలైర్జపాదిభిః ।
తతః ప్రభాతే ద్వాదశ్యాం తిలపాత్రోపరి స్థితామ్
అంబుపూర్ణే ఘటే న్యస్య పూజయదుపచారకైః ।
తూగ్నిం నవముత్పాద్య కాష్ఠసంఘర్షణాదిభిః
తం సమభ్యర్చ్య విధివల్ ఏకైకాం పిండికాం సుధీః ।
హావయేత్సతిలాజ్యాం చ ద్వాదశాక్షరవిద్యయా
వైష్ణవ్యాధ చ పూర్ణాంచ శతమష్టోత్తరం తతః ।
భోజయేత్పాయస్వైప్రా నీత్యా సుస్సిగ్డమానసః
సహితాం చ ఘటేనైవ ప్రతిమం గురవేర్పయేత్ ।
విప్రేభ్యో దక్షిణాం శక్త్యా దత్యా నత్వా విసర్జయేత్
నరో వా యది వా నారీ వ్రతం కృత్వైవమాదరాత్ ।
లభతే రూపసౌభాగ్యం నాత్ర కార్యా విచారణా
మార్గశీర్షశుక్ల ద్వాదశినాడు సర్వోత్తమమగు సాధ్యవ్రతమునాచరించవలయును. మనోభవుడు, ప్రాణుడు, నరుడు, వీర్యవంతుడు, చితి, హయము, నృపుడు, హంస, నారాయణుడు, విభువు, ప్రభువు అని పన్నెండు మంది సాధ్యులనబడుదురు. ఈ పన్నెండు మందిని తండులములతో కల్పించి గంధపుష్పాదులచే పూజించవలయును. తరువాత పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి, మంచిదక్షిణలనిచ్చి, నారాయణుడు ప్రీతిచెందుగాక యని వారిని విడువవలయును. ఈదినముననే ద్వాదశాది వ్రతము కూడా చెప్పబడినది. ఈవ్రతమున ద్వాదశాదిత్యులను పూజించవలయును. ధాత,మిత్రుడు, అర్యమా, పూషా, శుక్రుడు, అంశుడు, వరుణుడు, భగుడు, త్వష్టా, వివస్వాన్, సవితా, విష్ణువు అనువారలు ద్వాదశాదిత్యులు. ప్రతి మాసమున శుక్ల ద్వాదశినాడు ద్వాదశాదిత్యులను శ్రద్ధతో పూజించి ఒక సంవత్సరము వ్రతమునాచరించవలయును. వ్రతాంతమున ద్వాదశసువర్ణప్రతిమలను యధావిధిగా పూజించి, పన్నెండు మంది బ్రాహ్మణోత్తములను మధురాన్నములతో భుజింపచేసి చక్కగా సత్కరించి వారికి ఒకొక్కరికి ఒక్కొక్క ప్రతిమను అర్పించవలయును. ఈద్వాదశాదిత్య వ్రతము నాచరించినవాడు ద్వాదశాదిత్యమనబడు సూర్యలోకమనుపొంది, అచట చాలాకాలము సకల భోగములననుభవించి భూలోకమున ధర్మాత్ముడు రోగశూన్యుడు అగు మనుష్యునిగా జన్మించును. మరలవ్రతపుణ్యవశమున మరలవ్రతము చేయును. ఈ పుణ్యలోకముతో సూర్యమండలమును ఛేదించుకొని నిరంజనము, నిరాకారము నిర్ద్వంద్వము అగు పరబ్రహ్మను చేరును. ఈదినముననే అఖండవ్రతము చెప్పబడినది. బంగారముతో జనార్ధన మూర్తిని నిర్మించి, గందపుష్పాదులచే పూజించి, ఆమూర్తియందు, ప్రతిమాసము పన్నెండుమంది బ్రాహ్మణులను భుజింపచేయవలయును. వ్రతము నాచరించువాడు జితేంద్రియుడై రాత్రిభోజనమును మాత్రమే చేయలయును. సంవత్సరాంతమున ఆ జనార్ధన మూర్తిని చక్కగా పూజించి ధేను సహితముగా గురువునకు సమర్పించి ఇట్లు ప్రార్థించవలయును. నేను నూరుజన్మలలో ఏకొద్ది అఖండ వ్రతమునాచరించిననూ పూజ్యుడా! మి అనుగ్రహమువలన ఇపుడు అఖండమునిచట ఉండునిండు. తరువాత పన్నెండుమంది బ్రాహ్మణులను ఖండములతో పాయసములతో చక్కగా భుజింపచేసి సువర్ణదక్షిణ నిచ్చి నమస్కరించవలయును. ఇట్లు వ్రతము నాచరించి జనార్ధనుని సంతోషింపచేసి స్వర్ణవిమానముతో విష్ణులోకమును చేరును. పుష్యబహుళ ద్వాదశినాడు రూపవ్రతము చెప్పబడినది. దశమితిధిన యధావిధిగా స్నానమాచరించి, శ్వేతగోవుయొక్క కాని ఒకేరంగు కలగోవు యొక్క కాని పేడను భూమిమీద పడకముందే ఆకాశము నుండియే స్వీకరించవలయును. ఆగోమయముతో నూటా ఎనిమిది ముద్దలను చేసి తామ్రపాత్ర యందు కాని మృణ్మయపాత్రయందు కాని ఉంచి పట్టుకొని ఎండలో ఆరబెట్టవలయును. ఏకాదశినాడు ఉపవసించి శ్రీమహావిష్ణువు యొక్క సువర్ణపతిమను యధావిధిగా చక్కగా పూజించి, ఆరాత్రి మంగళగీతములతో, వాద్యములతో, స్తోతపాఠములతో, జపాదులతో జాగరణ చేయవలయును. తరువాత ద్వాదశినాడు ప్రాతఃకాలమున తలపాత్రపై నున్న ప్రతిమను, జలపూర్ణఘటమున నుంచి షోడశోపచారములచే పూజించి కట్టెలను వరిపిడిచేసి కొత్తగా అగ్నిని ఉత్పత్తిచేసి, యధావిధిగా పూజించి ఒక్కొక్క ఎండిన గోమయపిండమును (పిడికను) నువ్వులతో నేయితో కలిపి ద్వాదశాక్షర మంత్రము చే (ఓంనమోభగవతే వాసుదేవాయ) అష్టోత్తర శతమునుహోమము గావించవలయును. తరువాత ప్రీతితో ఆనందముతో బ్రాహ్మణులను పాయసాన్నములను భుజింపచేయవలయును. ఘటసహితముగా సువర్ణప్రతిమను గురువునకు అర్పించవలయును. బ్రాహ్మణులకు శక్తిననుసరించి దక్షిణలనిచ్చి, నమస్కరించివిడిచిపెట్టవలయును. ఇట్లు ఈవ్రతమును ఆదరముతో నాచరించి స్త్రీ కాని పురుషుడు కాని చక్కని రూపమును సౌభాగ్యమును పొందును. ఈ విషయమున ఆలోచించవలసిన అసవరము లేదు.
సహస్యే శుక్లపక్షేతు సుజన్మ ద్వాదశీవ్రతమ్ ।
తత్ర స్నాత్వా విధానేన గృహ్ణీయాద్వార్జికవ్రతమ్
పీత్వా గోశృంగవార్యాదౌ తాం చ కృత్వా ప్రదక్షిణమ్ ।
ప్రతిమాసం తతశ్శుక్లే ద్వాదశ్యా దానమాచరేత్
ఘృతప్రస్థే తచ్చతుష్పం క్రమాద్వీర్యవస్యచ ।
ద్విరకం హామతిలాఢకార్థం పయసాం ఘటమ్
రౌప్యస్య మాషమేకంచ తృప్తికృన్మిష్టపక్వకమ్ ।
ఛత్రం మాషార్థ హేమ్నశ్చ ప్రస్థం ఫాణితముత్తమమ్
చందనం పలికం వస్త్రం పంచహస్తోన్మతం తమమ్ ।
ఏవం తు మాసికం దానం కృత్వా ప్రాశ్య యధాక్రమమ్
గోమూత్రం జలమాజ్యంవా పక్త్యా శాకం చతుర్విధం ।
దధియుక్తం చ యావాన్నం తిలాజ్యం శర్కరాన్వితమ్
దర్భాంబుషీరముదితం ప్రాశనం ప్రతిమాసికమ్ ।
ఏవం కృతవ్రతో వర్షం సౌవర్లీం ప్రతిమాం రవేః
కృత్వా వై తామ్రపాత్రస్థాం న్యస్యాభర్చ్యవిధానతః ।
గురవే ధేనుసహితాం ప్రత్యర్య ప్రణమేత్పురః
విప్రాగ్ద్వాదశ సంభోజ్య తేభ్యో దద్యాచ్చ దక్షిణామ్ ।
ఏవం కృతవ్రతో విప్ర జన్మాప్నోత్యుత్తమేకులే
నీరోగో ధనధాన్యాణ్యో భవేచ్చావికలేశ్రియః ।
మాఘస్యశుక్లద్వాదశ్యాం శాలగ్రామశిలాం ద్విజ
అభ్యర్చ్య విధివద్భక్త్యా సువర్ణం తన్ముఖిన్యసేత్ ।
తాం స్థాప్య రౌప్యపాత్రే తు సితవస్త్రయుగావృతమ్
ప్రదద్యాద్వేదవిదుషే తం హిం సంభోజయేత్తతః ।
పాయసాన్నేన ఖండాజ్య సహితేన హితేన చ
ఏవం కృత్యేక భుక్తస్స న్విష్ణుచింతనతత్పరః ।
వైష్ణవం లభతే ధామ భుక్త్యా భోగాని హాప్సితాన్
అంత్యే సితాయాం ద్వాదశ్యాం సౌవర్లీం ప్రతిమాం హరేః ।
అభ్యర్య గంధపుష్పాద్యై ర్థద్యాద్వేదవి ద్విజ
ద్విషట్కసంఖ్యా న్విప్రాంశ్చ భోజయిత్వాచ దక్షిణామ్ ।
దత్వావిసర్జయేత్పశ్చా త్స్వయం భుంజీత బాంధవైః
త్రిస్పృశోన్మీలినీపక్ష వర్థినీ వంజులీ తధా ।
జయా చ విజయా చైవ జయంతీ చాపరాజితా
ఏతా అష్టా సదోపోష్యా ద్వాదశ్యః పాపహారికాః
పుష్యశుక్లద్వాదశినాడు సుజన్మద్వాదశీవ్రతమునాచరించవలయును. ఆనాడు యధావిధిగా స్నానమాచరించి వార్షికవ్రతమును స్వీకరించవలయును. మొదట గోశృంగజలమును త్రాగి గోవునకు ప్రదిక్షణము గావించి ప్రతిమాసమున శుక్లద్వాదశినాడు ఇట్లు దానమును గావించవలయును. ఘృతప్రస్థమున క్రమముగా ద్రోహులు యవలు రెండొంతులు, హోమతిలలు, ఆఢకార్థము, పయోఘటము, ఒకమాసము వెండి, తృప్తిని కలిగించు మిష్టపక్వము, ఛత్రము, మాసార్థ హేమప్రస్థము, ఉత్తమపాణితము, చందనము, పలికము, వస్త్రము, పంచహస్తపరిమితము. ఈ వస్తువులను మాసికదానము గావించి, యధాక్రమముగా గోమూత్రమును, జలమును నేతిని, శాకమును నాలుగు విధములుగా వండినదానిని, పెరుగుకలిపిన క్షీరమును, ప్రతిమాసము ప్రాశన గావించవలయును. ఇట్లు ఒక సంవత్సర కాలము వ్రతము నాచరించి సూర్యుని బంగారు ప్రతిమను నిర్మించి తామ్రపాత్రలో నుంచి, యధావిధిగా పూజించి ధేను సహితముగా స్వర్ణప్రతిమను గురువునకు సమర్పించి నమస్కరించవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి వారికి దక్షిణనీయవలయును. ఇట్లు వ్రతమునాచరించినచో ఉత్తమకులమున రోగరహితుడుగా, ధనధాన్యయుతడుగా, ఇంద్రియనిగ్రహముతో పూజించి సాలగ్రామముఖమున సువర్ణము నుంచి వెండిపాత్రలో సాలగ్రామమునుంచి, తెల్లని రెండు వస్త్రములచే కప్పి వేదజ్జునకు దానము చేసి, అతనికి భోజనము పెట్టవలయును. ఇట్లు చేసి ఏకభుక్తముగా నుండి విష్ణువును ధ్యానించుచు ఇహలోకభోగములననుభవించి విష్ణులోకమును చేరును. ఫాల్గుణశుక్లద్వాదశినాడు శ్రీహరిసువర్ణప్రతిమను గంధపుపుష్పాదులచే పూజించి వేదజ్జున కీయవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణనిచ్చి, విడిచి తాను బంధువులతో కలిసి భుజించవలయును. త్రిస్టశ, ఉన్నీలనీ పక్షవర్దానీ,వంజులీ, జయా, విజయా, యజనీ అపరాజితా, అను ఈ ఎనిమిది ద్వాదశులు పాపనాశకములు. కావున ఎపుడూ ఉపవసించవలయును.
శ్రీనారద ఉవాచ :-
కీదృశం లక్షణం బ్రహ్మ న్నేతాసాం కిం ఫలం థధా
తత్సర్వం మేసమాచక్ష్య యాశ్చాన్యాః పుణ్యదాయికాః
నారదమహర్షి పలికెను :- ఈ ద్వాదశులకు లక్షణమేమిటి? ఫలమేమిటి. ఇట్లే పుణ్యప్రదములు ఇంకను ఏవికలవు? వాటిన్నింటిని నాకు తెలుపుడు.
సూత ఉవాచ :-
ఇత్తం సనాతనః పృష్ణో నారదేన ద్విజోత్తమః ।
ప్రశస్య భ్రాతరం ప్రాహ మహాభాగవం తమునిః
సూతమహర్షి పలికెను :- ఇట్లు నారదమహర్షి సనాతనమహర్షిని అడుగగా సనాతన మహర్షి పరమభాగవతోత్తముడగు నారదుని ప్రశంసించి ఇట్లు పలికెను.
సనాతన ఉవాచ :-
సాధు పృష్టం త్వయా భ్రాతః ।
సాధూనాం సంశయచ్ఛిదా
వక్షే మహాద్వాదశీనాం లక్షణం చ ఫలం పృథక్ ।
ఏకాదశీనివృత్తాచే త్సూర్యస్యోదయతః పురా
తదాతు త్రిస్పృశా నామ ద్వాదశీ సా మహాఫలా ।
అస్యాముపోష్య గోవిన్దం యః పూజయతి నారద!
అశ్వమేధసహస్రస్య స ఫలం లభతేధ్రువమ్ ।
యదారుణోదయే విధా దశమ్యైకాదశీతిథిః
తదా తాం సంపరిత్యజ్య ద్వాదశీం సముపోషయేత్ ।
తత్రేష్టా వాసుదేవాఖ్యం సమ్యక్పూజావిధానతః
రాజసూయసహస్రస్య ఫలమున్మీలితే లభేత్ ।
యవోదయేతు సవితు ర్యామ్యాల్వేకాదశీం సశేత్
తదా వంజులికాఖ్యాం తు తాం త్యక్త్యాపోషయేత్సదా ।
అస్యాం సంకర్షణం దేవం గంధాద్యైరుపచారకైః
పూజయేత్సతతం భక్త్యా సర్వసాభయదం పరమ్ ।
ఏషా మహాద్వాదశీ తు సర్వక్రతుఫలప్రదా
సర్వపాపహరా ప్రోక్తా సర్వసంపత్ర్పదాయినీ ।
కుహూ రాకా యదా వృద్ధే స్వాతావిప్ర యదా తదా
పక్షవర్థనికా నామ ద్వాదశి సా మహాఫలా ।
తస్యాం సంపూజయేద్దేవం ప్రద్యుమ్నం జగతాం పతిమ్
యదా తు ధవలే పక్షే ద్వాదశీస్యాన్మఘాన్వితా ।
తదా ప్రోక్తా జయా నామ సర్వశత్రువినాశినీ
అస్యాం సంపూజయేద్దేవం అనిరుద్ధం రమాపతిమ్ ।
సర్వకామప్రదం నృణాం సర్వసౌభాగ్యదాయకమ్
శ్రవణ క్షయుతాచేత్స్యా ద్ఘాదశీ ధవలే దలే ।
తదా సా విజయా నామ తస్యామర్చేద్గదాధరమ్
సర్వసౌఖ్యప్రదం శశ్వ త్సర్వభోగపరాయణమ్ ।
సర్వతీర్థఫలం విప్ర తాంతోపాష్యాపుయాన్నరః
యదా స్యాచ్చ సితే పక్షే ప్రజాపత్యక్ష సంయుతా ।
ద్వాదశీ సా మహాపుణ్యా జయన్త నామతస్స్మతా
యస్యాం సమర్చయేద్దేవం వామనం సిద్ధిదం నృణామ్ ।
ఉపోసితైషా విక్రేన్ల సర్వవ్రతఫలప్రదా
సర్వదానఫలాచాపి భుక్తిముక్తి ప్రదాయినీ ।
యదా తుస్యాత్సితే పక్షే ద్వాదశిజీవభాన్వితా
తదాపరాజితా ప్రోక్తా సర్వజ్ఞానప్రదాయినీ ।
అస్యాం సమర్చయేద్దేవం నారాయణమనామయమ్
సర్వైశ్వర్యప్రదం సాక్షా త్పుత్రపౌత్ర వివర్ధనమ్ ।
సంసారపాశవిచ్ఛిత్తి కారకం జ్ఞానసాగరమ్
అస్యాస్తూపోషణాదేవ ముక్తస్స్యాద్వీప్రభోజనః ।
యదా త్వాషాఢశుక్లాయాం ద్వాదశ్యామైత్రభం భవేత్
తదా వ్రతతద్వయం కార్యం నోపోషేకదైవతమ్ ।
శ్రవణరక్షయుతాయాం చ ద్వాదశ్యాం భాద్రశుక్లకే
ఊర్జీ సితాయాం ద్వాదశ్యాం అన్యభే చ వ్రతద్వయమ్ ।
ఏతాభ్యోన్యత్ర విప్రేన్ల ద్వాదశ్యామేక భుక్తకమ్
నిసర్గతస్సముద్ధిష్టం వ్రతం పాతకనాశనమ్ ।
ఏకాదశ్యాం వ్రతం నిత్యం ద్వాదశ్యాస్సహితం యతః
నోద్యాపనమిహోర్దిష్టం కర్తవ్యం జీవితావధి
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగేబృహదుపాఖ్యానే చతుర్థపాదే ద్వాదశమాసస్థ ద్వాదశీవ్రతనిరూపణం నామ ఏకవింశత్యధిక శతతమ్యోధ్యాయః.
సనాతనమహర్షిపలికెను :- సోదరా, సాధు జనుల సంశయమును తొలగించునట్లుగా చక్కగా అడిగితివి. ఇపుడు నేను ఈ మహాద్వాదశుల లక్షణలను ఫలములను చక్కగా చెప్పెదను. సూర్యోదయమునకు ముందే ఏకాదశి నివృత్తయైనచో ఆద్వాదశిత్రిస్ర్ప శాయనబడును. మహాఫలదాయినియగును. ఈద్వాదశినాడు పవసించి గోవిన్దుని పూజించినవాడు సహస్రాశ్వమేధఫలములను పొందును. అరుణోదయ కాలమున ఏకాదశినిధయైనచో ఆఏకాదశిని విడిచి ద్వాదశినాడుపవసించవలయును. ఆనాడు వాసుదేవుని చక్కగా పూజావిధానముతో పూజించి సహస్రరాజసూయయజ్ఞఫలమును పొందును. ఈద్వాదశిఉన్మీలితా యందురు. సూర్యోదయ కాలమున దశమి ఏకాదశిని స్పృశించినచో ఆ ఏకాదశి వంజులికా యనబడును. దానిని విడిచి ద్వాదశిన ఉపవసించవలయును. ఈనాడు సంకర్షణ దేవుని గంధాద్యుపచారములచే భక్తితో చక్కగా పూజించవలయును. ఇది అందరికి అభయప్రదము. ఈద్వాదశి మహా ద్వాదశి సర్వయజ్ఞ ఫలప్రద. సర్వపాపహార, సర్వసంపత్ర్పదాయిని. పూర్ణిమాఅమావాస్యలు వృద్ధిచెందియున్నచో వచ్చు ద్వాదశి పక్ష వర్ధని యందురు. ఇది మహాఫలప్రద. ఈనాడు జగత్పతి యగు ప్రద్యుమ్నుని పూజించవలయును. శుక్లపక్షమున ద్వాదశిమఘానాక్షత్ర యుక్తమైనచో దానిని జయాలందురు. ఈ ద్వాదశిసర్వశత్రు వినాశిని. ఈనాడు సర్వకామప్రదుడు సర్వసౌభాగ్యదాయకుడు రమాపతియగు అనిరుద్ధుని పూజించవలయును. శుక్లపక్షమున ద్వాదశి శ్రవణానక్షత్రయుక్తమగుచో విజయాఅనబడును. ఈనాడు సర్వభోగపరాయణుడు సర్వసౌఖ్యప్రదుడగు గదాధరుని పూజించ వలయును. ఈనాడుపవసించిన వాడు సర్వతీర్థఫలమును పొందును. శుక్లద్వాదశి రోహిణీనక్షత్రయుక్తమైనచో జయస్తీ యనబడును. ఇది మహాపుణ్యప్రదా. ఈనాడు సర్వసిద్ధిప్రదుడగు వామనుని పూజించ వలయును. ఈనాడు పవసించినచో సర్వవ్రతఫలప్రదము. సర్వదానఫలప్రదము. భుక్తిముక్తి ప్రదాయిని. శుక్ల పక్షద్వాదశి పుష్యమీ నక్షత్ర యుక్తమైనచో అపరాజితాయనబడును. ఇది సర్వజ్ఞాన ప్రదాయిని. ఈనాడు ఆనామయుడు, సర్వైశ్వర్యప్రదుడు, పుత్రపౌత్ర వివర్థనుడు, సంసార పాశవిచ్చత్తికారకుడు జ్ఞానసాగరుడగు నారాయణుని పూజించవలయును. ఈనాడు పవసించి బ్రాహ్మణులను భుజింపచేసినచో ముక్తుడగును. ఆఫౌఢ శుక్ల ద్వాదశి అనూరాధా నక్షత్ర యుక్తమైనచో వ్రతద్వయమును చేయవలయును. ఒకదేవతగా రెండువ్రతములు చేయుట ఈవిషయమున దోషముకాదు. భాద్రపద శుక్లద్వాదశి శ్రవణా నక్షత్రయుక్తమైనచో, కార్తీక శుద్ధ ద్వాదశి రేవతీ నక్షత్ర యుక్తమైనచో వ్రతద్వయము నాచరించవలయును. ఈద్వాదశులకంటే ఇతర ద్వాదశులలో ఏకభుక్తము నాచరించ వలయును. సహజముగా ఈవ్రతము సకలపాతకనాశనము. ద్వాదశీసహితముగా ఏకాదశీవ్రతము నిత్యము. ఈవ్రతమునకు ఉద్యాపనము లేదు. జీవితాంతము నాచరించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమునద్వాదశమాసస్థిత ద్వాదశీవ్రత నిరూపణమను నూటా ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 123 of the Nārada Mahā Purana is as follows:
శ్రీ నారద మహాపురాణమును మరియు ఇతర సత్పురాణములను భక్తిశ్రద్ధలతో శ్రవణము చేయుట వలన లభించే అనంత పుణ్యరాశి ఈ అధ్యాయంలో ప్రబోధించబడినది. పురాణ పఠనము వలన సర్వ పాపములు భస్మీపటలమై విష్ణులోక ప్రాప్తి సిద్ధించునని నిరూపించబడినది.