నారద మహా పురాణము
43 - పూజాది కధనమ్
వసిష్ఠ ఉవాచ :
వసోర్వచన మాకర్ణ్య గంగామహాత్మ్య సూచకమ్ ।
పునః పప్రచ్ఛ రాజేన్ద్ర తం విప్రం స్వపురోహితమ్ ॥
వసిష్ఠ మహర్షి పలికెను : అంతట మోహినీ దేవి గంగా మహాత్మ్యమును తెలిపిన వసువు మాటలను విని తన పురోహితుని మరల ఇట్లు అడిగేను.
మోహిన్యువాచ :
శ్రుతం విప్ర మయా సర్వం గోదానాది శుభావహమ్ ।
ఆధునా శ్రోతుమిచ్ఛామి గంగావ్రతమనుత్తమమ్ ॥
గంగాదీనాం పూజనం చ స్థాపనం తత్ర పా ద్విజ ।
కిం ఫలం వద సర్వజ్ఞ త్వామహో శరణం గతా ॥
అధునా గతి దాతా త్వం వర్జితాయా స్వబంధుభిః ।
పత్యా విరహితా చాహో పుత్రహీనా విదాం వర ॥
త్వామేవ శరణం ప్రాప్తా పితుర్వచన గౌరవాత్ ।
తద్భవాన్ప్రణతాయా మే గంగామాహాత్మ్య సంయుతమ్ ॥
దేవతారాధనం బ్రూహి యచ్చ్రుత్వా ముచ్యతే హ్యఘాత్ ॥
మోహిని పలికెను : ఓ బ్రాహ్మణోత్తమా, శుభకరములగు గోదానాదులను చక్కగా వింటిని. ఇపుడు సాటిలేని గంగా వ్రతమును వినగోరుచున్నాను. గంగాది పూజనము, స్థాపనము, తత్పలమును సర్వజ్ఞుడవగు నీవు తెలుపుము. నిన్ను నేను శరణు వేడితిని. ఇపుడు నేను పతిహీనను పుత్రహీనను, బంధు వర్జితను. ఇపుడు నీవే నాకు ఉత్తమగతి ప్రదాతవు. నాతండ్రి గారి మాట మీది గౌరవముతో నిన్నే శరణు పొందిన దానను కావున నీవు నిన్నాశ్రయించిన నాకు సాటిలేని గంగా మాహాత్మ్యమును దేవతారాధనమును తెలుపుము. దానిని విని పాప విముక్తురాలనగుదును.
వసిష్ఠ ఉవాచ :
తచ్చ్రుత్వా మోహినీ వాక్యం వసుర్విప్ర:. ప్రతాపవాన్ ।
సభాజ్య మోహినీం భూప ప్రాహ వేదవిదాం వరః ॥
వసిష్ఠ మహర్షి పలికెను : తేజో వంతుడగు వసువు మోహినీ వాక్యమును విని ఆమెను చక్కగా ఆదరించి వేద విదుత్తముడిట్లు పలికెను.
వసురువాచ:
సాధు పృష్టం త్వయా దేవి! లోకానాం హితకామ్యయా ।
గంగా మహాత్మ్య మఖిలం మహా పాప ప్రణాశనమ్ ॥
వృషధ్వజేన కధితం శివేన దయయా పురా ॥
ప్రీత్యా దేవ్యాభిపృష్టేన గంగాతీర నివాసినా ।
దేవైస్తు భుక్తం పూర్వాహ్ణే మధ్యాహ్నే ఋషిభిస్తథా ॥
అపరాహ్ణేచ పితృభిః శర్వర్యం గుహ్యకాదిభిః ।
సర్వావేలా అతిక్రమ్య నక్త భోజన ముత్తమమ్ ॥
ఉపవాసాద్వరం భైక్ష్యం భైక్ష్యద్వర మయాచితమ్ ।
అయాచితాద్వరం నక్తం తస్మాన్నక్తం సమాచరేత్ ॥
హవిష్య భోజనం స్నానం సత్యమాహార లాఘవమ్ ।
అగ్నికార్యమధః శయ్యాం నక్తాశీ షట్ సమాచరేత్ ॥
గంగాతీరే మాఘమాసే యః కుర్యాన్నక్త భోజనమ్ ।
శివాయతన పార్శ్వేతు కృశరం ఘృత సంయుతమ్ ॥
నైవేద్యం చ నివేద్యైవ కృశరాన్నం శివస్య తు ।
కాష్ఠ మౌనేన భుంజానో జిహ్వాతౌల్యం వివర్జయేత్ ॥
పలాశపాత్రే భుంజాన: శివం స్మృత్వా జితేంద్రియః ।
ధర్మరాజస్య దేవ్యాశ్చ పృథక్పిండం ప్రకల్పయేత్ ॥
సోపవాసశ్చతుర్థశ్యాం భవేదుభయ పక్షయోః ।
పౌర్ణమాస్యాం తు గంధైశ్చ గంగాయాః సలిలైస్తధా ॥
శివం సంస్నాప్య పయసా మధ్వాజ్యదధిభి: పృథక్ ।
తధైవ హేమపుష్పం చ లింగమూర్ద్ని వినిక్షిపేత్ ॥
తతో దద్యాత్తు శక్త్యైవా పూపంచ ఘృత పాచితమ్ ।
తిలాడకం ప్రగృహ్యాద శివలింగోపరి క్షిపేత్ ॥
నీలోత్పలైశ్చ సర్వేశం పూజయేత్పంకజైరపి ।
తదలాభేతు సౌవర్ణైః పంకజైః పూజయేద్ధరమ్ ॥
పాయసం చాత్ర మధ్యక్తం ఘృత యుక్తం చ గుగ్గులమ్ ।
మృతదీపం తధా చైవ చందనాద్యైర్వాలే పనమ్ ॥
దద్యాద్భక్త్యా మహేశాయ తథా పత్రఫలాని చ ।
కృష్ణగోమిధునం చైవ సరూపం చ నివేదయేత్ ॥
భోజయేద్భ్రాహ్మణానష్టౌ మాసాంతే తు సదక్షిణాన్ ।
వర్జయేన్మధు మాంసం చ తం మాసం బ్రహ్మచర్యవాన్ ॥
ఏవం కృత్వా యధోద్దిష్ట మేకవారమిదం వ్రతమ్ ।
యమైశ్చ నియమైర్యుక్త: శ్రద్ధా భక్తి పరాయణః ॥
ఇహ భోగానవాప్నోతి ప్రేత్యచానుత్తమాం గతిమ్ ।
ఇంద్రనీల ప్రతీకాశై ర్వమానైః శిఖిసంయుతైః ॥
దివ్యరత్నమయైశ్చైవ దివ్యభోగ సమన్వితైః ।
గత్వా శివపురం రమ్యం సర్వస్వకుల సంయుతః ॥
సుహృద్భిర్వివిధైశ్చైవ వివిధానప్యభీప్సితాన్ ।
భుక్త్యా భోగాన శేషాంశ్చ యావదాభూత సంప్లవమ్ ॥
తతో భవతి ధర్మా త్మా జంబూద్వీపపతి స్తధా ।
తత్ర భుంక్తే సమస్తాంశ్చ భోగాన్విగత కల్మషః ॥
సురూపః సుభగశ్చైవ తథా విహిత శాసనః ।
సర్వరోగవినిర్ముక్త: సోఃఽప్యే తత్ఫలభాగ్భవేత్ ॥
వైశాఖే శుక్ల పక్షే వా చతుర్థశ్యాం సమాహితః ।
శాల్యన్నం క్షీరసంయుక్తం యః కుర్యాన్నక్తభోజనమ్ ॥
శివం సంపూజ్య పుష్పాద్యైః భోజ్యం తు సంనివేద్యచ ।
కాష్ఠమౌనేన భుంజానో వటకాష్ఠేన వైవతథా ॥
మౌనేన ప్రయతో భూత్వా కుర్యాద్యై దంత ధావనమ్ ।
శివలింగసమీపే తు గంగాతీరే నిశి స్వపేత్ ॥
పౌర్ణమాస్యాం ప్రభాతే తు గంగాయాం విధినా తథా ।
స్నాత్వోపవాసం సంకల్ప్య కుర్యా జ్జాగరణం నిశి ॥
లింగం ఘృతేన సంస్నాప్య పుష్ప గంధా దిభిస్తధా ।
నైవేద్య ధూప దీపైశ్చ సంపూజ్య వృషభం శుభమ్ ॥
సుశ్వేత పుష్ప వస్త్రాద్యై ర్హారిద్రైశ్చందనైస్తథా ।
అలంకృత్య విధానేన శివాయ వినివేదయేత్ ॥
బ్రాహ్మణాంశ్చ యధా శక్తి పాయ సేనతు భోజయేత్ ।
ఏవం సకృచ్చయో భక్త్యా కరోతి శ్రద్ధయాన్వితః ॥
లభతే దైవపాదోన యుగానాం ద్వి సహస్రకమ్ ।
తపః కృత్వా తు నియమా ద్యత్పుణ్యం తదసంశయమ్ ॥
హంసకుంద ప్రభాయుక్తై హేమ జాలవిభూషణైః ॥
స్వకీయ పితృభిః సార్థం ప్రయతీశ్వర మందిరమ్ ।
నీలోత్పల సుగంధాభి: సురూపాభిః సమంతతః ॥
కాంతాభిర్దివ్య రూపాభి ర్భుక్త్యా భోగాననేకశః ।
అనంతకాలమైశ్వర్య యుక్తో భూత్వా తతో భువి ॥
జాయతే స మహీపాలః కీర్త్యైశ్వర్య సమన్వితః ।
ఏకచ్ఛత్రేణ స మహీం పాలయత్యాజ్ఞయా సహ ॥
అంతే వైరాగ్య సంపన్నో గంగాం స లభతే పునః ।
స తయాశ్రద్ధ యా యుక్తో గంగాయాం మరణం లభేత్ ॥
తథా తత్ర స్మృతిం లబ్ధ్వా మోక్ష మాప్నోతి స ధ్రువమ్ ।
జ్యేష్ఠే మాసి సితే పక్షే దశమ్యాం హస్త సంయుతే ॥
గంగాతీరే తు పురుషో నారీ వా భక్తిభావతః ।
నిశాయాం జాగరం కృత్వా గంగాం దశవిధైస్తతః ॥
పుష్పైర్గంధైశ్చ నైవేద్యైః ఫలైశ్చ దశసంఖ్యయా ।
తథైవదీ పై స్తాంబూలైః పూజయేచ్చ్రద్ధయాన్వితః ॥
స్నాత్వా భక్త్యాతు జాహ్నవ్యాం దశకృత్వో విధానతః ।
దశప్రసృతి కృష్ణాంశ్చ తిలాన్సర్పిశ్చ వై జలే ॥
సక్తుపిండానుడపిండా న్దద్యాచ్చ దశ సంఖ్యయా ।
తతో గంగాతటే రమ్యే హేమ్నా రూప్యేణ వా తథా ॥
గంగాయాః ప్రతిమాం కృత్వా వక్ష్యమాణస్వరూపిణీమ్ ।
పద్మస్వస్తిక చిహ్నస్య సంస్థితస్య తథోపరి ॥
వస్త్రస్రగ్ధామకంఠస్య పూర్ణకుంభస్య చోపరి ।
సంస్థాప్య పూజయేద్దేవీం తదలాభే మృదాది వా ॥
అథ తత్రాప్యశక్తశ్చే ల్లిఖేత్పిష్టేన వై భువి ।
చతుర్భుజాం సునేత్రాంచ చంద్రాయుత సమప్రభామ్ ॥
చామరైర్వీ జ్యమానాంచ శ్వేతచ్చత్రోపశోభితామ్ ।
సుప్రసన్నాం చ వరదాం కరుణార్ద్ర నిజాంతరామ్ ॥
సుధాప్లావిత భూపృష్టాం దేవాది భిరభి ష్టుతామ్ ।
దివ్యరత్న పరీతాంచ దివ్యమాల్యానులేపనామ్
ధ్యాత్వా జలే యధా ప్రోక్తాం తత్రార్చాయాం తు పూజయేత్ ।
వక్ష్యమాణేన మంత్రేణ కుర్యాత్పూజాం విశేషతః
పంచామృతేన చ స్నాన మర్చాయాం తు విశిష్యతే ।
ప్రతిమాగ్రే స్థండిలే తు గోమయేనోపలేపయేత్
నారాయణం మహేశం చ బ్రహ్మాణం భాస్కరం తథా ।
భగీరథం చ నృపతిం హిమవంతం నగేశ్వరమ్
గంధపుష్పాదిభిశ్చైవ యధా శక్తి ప్రపూజయేత్ ।
దశ ప్రస్థాం తిలాన్దద్యా దశ విపేభ్య ఏవ చ
దశప్రస్థాన్యవాన్దద్యా ద్దశగవ్యైర్యధా హితాన్ ।
మత్స్య కచ్ఛప మండూక మకరాది జలేచరాన్
కారితాన్వై యథాశక్తి స్వర్ణేన రజతేన వా ।
తదలాభే పిష్ఠ మయాన్ అభ్యర్చ కుసుమాదిభిః
గంగాయాo ప్రక్షిపేత్పూర్వం మంత్రేణైవ తు మంత్రవిత్
రథయాత్రాదినే తస్మిన్ విభవే సతి కారయేత్ ।
రథా రూఢ ప్రతికృతిం గంగాయా స్తుత్తరాముఖామ్
భ్రమంత్యా దర్శనం లోక దుర్లభం పాపకర్మణామ్ ।
దుర్గాయా రధ యాత్రాస్తి తదై వాత్రాపి కారయేత్
ఏవం కృత్వా విధానేన విత్తశాఠ్య వివర్జితః ।
దశపాపై ర్వక్ష్య మాణైః సద్య ఏవ విముచ్యతే
అదత్తానాముపాదానం హింసావా విధానతః ।
పరదారోప సేవాచ కాయికం త్రివిధం స్మృతమ్
పారుష్యమనృతం వాపి పైశున్యం చాపి సర్వశః ।
అసంబద్ధ ప్రలాపశ్చ వాచికం స్యాచ్చతుర్విధమ్
పరద్రవ్యోష్య భి ధ్యానం మనసానిష్ట చింతనమ్ ।
వితథాభినివేశశ్చ మానసం త్రివిధం స్మృతమ్
ఏతైర్దశవిధైః పాపైః కోటి జన్మ సముద్భవైః ।
ముచ్యతే నాత్ర సందేహో బ్రహ్మణా వచనం యథా
దశ త్రింశచ్చ తా న్పూర్వాన్పితౄ నేవ తధాపరాన్ ।
ఉద్ధరత్యేవ సంసారాన్మంత్రేణానేన పూజితా
ఓం నమో దశహరాయై నారాయణ్యై గంగాయై నమః ।
ఇతి మంత్రేణ యో మర్త్యో దినే తస్మిన్దివానిశమ్
జసేత్పంచ సహస్రాణి దశధర్మఫలం లభేత్ ।
ఉద్ధరేద్దశ పూర్వాణి పరాణిచ భవార్ణవాత్
వక్ష్యమాణమిదం స్తోత్రం విధినా ప్రతిగృహ్య చ ।
గంగాగ్రే తద్దినే జప్యం విష్ణు పూజాం ప్రవర్తయేత్
ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమోఽస్తుతే ।
నమోస్తు విష్ణురూపిణ్యై గంగాయై తే నమో నమః
సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజ మూర్తయే ।
సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠే నమోఽస్తు తే
స్థాణు జంగమ సంభూత విషహన్త్రి నమోఽస్తుతే ।
సంసార విషనాశిన్యై జీవనాయై నమో నమః
తాపత్రితయ హన్త్యై చ ప్రాణేశ్వర్యై నమో నమః ।
శాంత్యై సంతాపహారిణ్యై నమస్తే సర్వమూర్తయే
సర్వసంశుద్ధ కారిణ్యై నమః పాపవిముక్తయే ।
భుక్తి ముక్తి ప్రదాయిన్యై భోగవత్యై నమో నమః
మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః ।
నమస్త్రైలోక్యమూర్తియై త్రిదశాయై నమోనమః
నమస్తే శుక్లసంస్థాయై క్షేమవత్యై నమోనమః ।
త్రిదశాసన సంస్థాయై తేజోవత్యై నమోస్తుతే
మందాయై లింగధారిణ్యై నారాయణ్యై నమో నమః ।
నమస్తే విశ్వమిత్రాయై రేవత్యై తే నమోనమః
బృహత్యై తే నమో నిత్యం లోకధాత్ర్యై నమోనమః ।
నమస్తే విశ్వముఖ్యాయై నందిన్యై తే నమో నమః
పృధ్యై శివామృతాయై చ విరజాయై నమోనమః ।
పరావరగతాద్యాయై తారాయై తే నమోనమః
నమస్తే సర్వ సంస్థాయై అభిన్నాయై నమో నమః ।
శాంతాయై తే ప్రతిష్టాయై వరదాయై నమోనమః
ఉగ్రాయై ముఖజల్పాయై సంజీవిన్యై నమో నమః ।
బ్రహ్మాగాయై బ్రహ్మాదాయై దురిత ఘ్న్యై నమోనమః
ప్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమోనమః ।
వీలుషాయై దుర్గహన్త్ర్యై దక్షాయై తే నమో నమః
సర్వాపత్ర్పతి పక్షాయై మంగలాయై నమో నమః ।
పరాపరే పరే తుభ్యం నమో మోక్ష ప్రదే సదా
గంగా మమాగ్రతో భూయా ద్గంగా మే పార్వయో స్తధా ।
గంగా మే సర్వతో భూయాత్వయి గంగేఽస్తు మే స్థితిః
ఆదౌ త్వమంతే మధ్యే చ సర్వా త్వం గాం గతే శివే ।
త్వమేవ మూలప్రకృతి స్త్వం హి నారాయణః ప్రభుః
గంగే త్వం పరమాత్మా చ శివస్తుభ్యం నమోనమః ।
ఇతీదం పఠితం స్తోత్రం నిత్యం భక్తి పరస్తు యః
శృణోతి శ్రద్దయా వాపి కాయవాచిక సంభవైః ।
దశధా సంస్థితై ర్థోషై స్సర్వైరేవ ప్రముచ్యతే
రోగీప్రముచ్యతే రోగా న్ముచ్యేతాపన్న ఆపదః ।
ద్విషద్భ్యో బంధనాచ్చాపి భయేభ్యశ్చ విముచ్యతే
సర్వాన్కామానవాప్నోతి ప్రేత్య బ్రహ్మణి లీయతే ।
ఇదం స్తోత్రం గృహే యస్య లిఖితం పరిపూజ్యతే
నాగ్నిచౌర భయం తత్ర పాపేభ్యోఽపి భయం నహి ।
తస్యాం దశమ్యామేచ్చ స్తోత్రం గంగాజలే స్థితః
జపంస్తు దశకృత్వశ్చ దరిద్రో వాపి చాక్షమః ।
సోఽపీ తత్ఫలమాప్నోతి గంగాం సంపూజ్య భక్తితః
పూర్వోక్తేన విధానేన ఫలం యత్పరికీర్తితమ్ ।
యథా గౌరీ తధా గంగా తస్మాద్గౌర్యాస్తు పూజనే
విధిర్యో విహితస్సమ్యక్ స్కోపి గంగా ప్రపూజనే ।
యథా శివస్తధా విష్ణు ర్యధా విష్ణుస్తధా హ్యుమా
ఉమా యథా తధా గంగా చాత్ర భేదో న విద్యతే ।
విష్ణురుద్రాంతరం యశ్చ గంగాగౌర్యంతరం తధా
లక్ష్మీగౌర్యంతరం యశ్చ ప్రబ్రూతే మూఢదీస్తు సః
వసువు పలికెను : ఓ మోహినీ! నీవు లోకహితమును కోరి చక్కగా అడిగితివి. మహా పాప ప్రణాశకమగు సమస్త గంగామాహాత్మ్యమును పూర్వము వృషధ్వజుడగు శివుడు దయచే గంగాతీరమున పార్వతీదేవి యడుగగా చెప్పెను. దేవతలు పూర్వాహ్లామున భుజింతురు. ఋషులు మధ్యాహ్నమున, ఆపరాష్ట్రమున పితరులు, రాత్రిపూట గుహ్యకాదులు భుజింతురు. కావున ఈ అన్ని వేళలను దాటి రాత్రి భోజనము ఉత్తమము. ఉపవాసముకంటే భిక్షావ్రతము ఉత్తమము. భైక్ష్యము కంటే అయాచితవ్రతము మేలు. ఆయా చితవ్రతము కంటే నక్త భోజన వ్రతము మేలు. కావున ఈ నక్త వ్రతము నాచరించ వలయును. హ విష్య భోజనము, స్నానము, సత్యము, ఆహార లాఘవము, అగ్నికార్యము, అధః శయ్యా ఈ ఆరింటిని నక్త భోజి ఆచరించవలయును. మాఘ మాసమున గంగాతీరమున నక్త వ్రతము నాచరించ వలయును. శివాలయ పార్శ్వ భాగమున నువ్వుల అన్నమును ఘృతముతో కలిపి శివునికి నివేదన చేసి కాష్ఠ మౌనముచే భుజించుచు జిహ్వా చాపల్యమును విడువ వలయును. జితేంద్రియుడై శివుని ధ్యానించుచూ మోదుగాకు పాత్రలో భుజించవలయును. ధర్మరాజునకు, దేవికీ విడిగా ముద్దలను కల్పించవలయును. రెండు పక్షములలో చతుర్దశినాడు ఉపవసించ వలయును. పూర్ణిమనాడు గంధములతో గంగాజలముతో పాలు పెరుగు నేయి తేనెలలో శివునికి స్నానము చేయించి (విడిగా), లింగ శిరోభాగమున హోమపుష్పము నుంచవలయును. తరువాత శక్తి కొలది ఘృతపోచితములగు అపూపములను శక్తికి సమర్పించవలయును. తీశాడకమును గ్రహించి శివలింగోపరిభాగమున నుంచవలయును. నీలో త్పలములచే పంకజములచే సర్వేశ్వరుని పూజించవలయును. ఇవి లభించనిచో సువర్ల పంకజములచే పూజించ వలయును. తేనె కలిపిన పాయసమును, ఘృతయుక్తమగు గుగులమును, ఘృతదీపమును చందనాది విలేపనమును, మహేశ్వరునికి భక్తితో సమర్పించ వలయును. అట్లే పత్రములను ఫలములను సమర్పించవలయును. సమాన రూపమగు కృష్ణగో మిధునమును సమర్పించ వలయును. మాసాంతమున ఎనిమిది మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణల నీయ వలయును. ఈ మాసము బ్రహ్మచర్యమును అవలంభించి మద్య మాంసములను విడువవలయును. ఇట్లు యధావిధిగా యమనియమాది యుక్తుడై, శ్రద్ధా భక్తి పరాయణుడై ఒక మారు ఈ వ్రతము నాచరించినవాడు ఇహలోకమున అన్నిభోగములను పొంది అంతమున ఉత్తమ గతిని పొందును. ఇంద్రనీల ప్రతీకాశములు, శిఖిసంయుతములు, దివ్యరత్సమయములు, దివ్యభోగసమన్వితములు, అగు విమానములచే, రమ్యమగు శివపురమునకు స్వకులము వారందరితో కలిసి వెళ్ళి, మిత్రులతో కూడా వేళ్ళి బహు విధాభీప్సితములను అశేష భోగములను అను భవించి ప్రళయ కాలము వర కుండి, తరువాత జంబూ ద్వీపపతిగా ధర్మాత్ముడుగా పుట్టును. కల్మషరహితుడై ఇచట సకల భోగములననుభవించును. సుందరుడు సౌ భాగ్యవంతుడు, అందరిని శాసించువాడు, సర్వరోగ వినిర్ముక్తుడు అగును. అతను కూడా ఈ ఫలమును పొందును. ఇక వైశాఖ శుక్ల చతుర్దశినాడు సావధానుడై క్షీరసంయుక్తమగు శాల్యన్నమును రాత్రిపూట భుజించవలయును. మొదట పుష్పాదులచే శివుని పూజించి, అన్నమును నివేదన చేసి కాష్ఠ మౌనముతో భుజించవలయును. మొదట వటకాష్ఠముతో మౌనముగా దంతధావనమును చేయ వలయును. రాత్రిపూట గంగా తీరమున శివలింగ సమీపమున పరుండవలయును. పూర్ణిమా ప్రాతఃకాలమున యధావిధిగా గంగానదిలో స్నానమాడి ఉపవాసమును సంకల్పించి, రాత్రిపూట జాగరణ చేయవలయును. శివలింగమును ఘృతముతో స్నానము చేయించి, పుష్ప గంధాదులచే ధూప దీపనైవేద్యములచే పూజించి శుభకరమగు వృషభమును శ్వేత పుష్పవస్త్రాదులచే హరిద్రా చందనములచే అలంకరించి శివునికి నివేదన చేయవలయును. శక్తి కొలది బ్రాహ్మణులకు పాయసమును భుజింప చేయవలయును. ఇట్లు భక్తి శ్రద్దలతో ఒకసారి రెండు వేల యుగములు ఒక పాదము తక్కువగా తపస్సు చేసిన కలుగు పుణ్యమును పొందును. హంస కుంద ప్రభా యుక్తములు చన సన్నిభములు, సుశ్వేత వృషయుక్తములు ముక్తా జాలవి భూషితములు అగు విమానములతో తమ పితరులతో కలిసి ఈశ్వర మందిరమును చేరును. అంతట నీలోత్పలసుగంధులు రూప వతులగు యువతులతో పలుభోగములనుభవించును. తరువాత భూలోకమున రాజుగా పుట్టి అనంతకాలము ఐశ్వర్యయు క్తుడై కీర్తి సమన్వితుడై ఏక ఛత్రముగా భూమిని పరిపాలించును. అంతకాలమున వైరాగ్య సంపన్నుడై గంగను పొందును. గంగయందు శ్రద్ధాభక్తులు కలవాడు కావున గంగానదిలో మరణమును పొందును. దానిచే పూర్వజన్మజ్ఞానమును పొంది మోక్షమును పొందును.
జ్యేష్ఠ శుద్ధ దశమి హస్తా నక్షత్రయుక్త మగుచో గంగాతీరమున నరుడు కాని నారీ కాని భక్తి భావము చే రాత్రి జాగరణ కావించి, గంగను పదివిధములగు పుష్ప గంధనైవైద్య ఫలములను దశసంఖ్యచే దీపములను తాంబూలములను సమర్పించి పూజించవలయును. గంగానదిలో పదిమార్లు యధావిధిగా స్నానమాడి భుజించి దశప్రస్థ ప్రమాణములగు నువ్వులను నేయిని దశసంఖ్యచే సత్తుపిండములను, గుడపిండములను గంగా జలమున అర్పించ వలయును. తరువాత సుందరమగు గంగాతీరమున బంగారముచే కానీ వెండిచే కాని, పద్మస్వస్తిక చిహ్నములు కల పూర్ణ కుంభము పైన ఉన, వస్త్ర సగ్లామములు కుంభమునకు కంఠభాగమున చుట్టి యుండగా గంగాదేవి ప్రతిమను నిర్మించి స్థాపించి పూజించ వలయును. స్వర్ణాదులు లభించనిచో మదాదులచే చేయవచ్చును. అది కూడా లభించనిచో పిండిచే వ్రాయవలయును. చతుర్భుజములు కలది, సునేత్ర, చంద్రాయుత సమప్రభ, చామరములచే వీయబడునది, శ్వేత చ్ఛత్రోప శోభిత, సుప్రసన్న, వీరద, కరుణార్ధాంతరంగ, సుధామ్లోవీత భూపృష్ఠ, దేవాదులచే సంస్థూయ మాన, దివ్యరత్న పరీత, దివ్యమాల్యాను లేపన, యగు గంగాదేవిని నిర్మించి స్థాపించి, జలమున ధ్యానించి, ప్రతిమను పూజించవలయును. చెప్ప బోవు మంత్రముచే విశేష పూజగావించ వలయును. ప్రతిమను పంచామృతము తోస్నానమును చేయించ వలయును. ప్రతిమగ్ర భాగమున భూమిని గోమయముతో అలుక వలయును. నారాయణుని, మహేశుని బ్రహ్మను భాస్కరుని, భగీరధ రాజును, హిమవత్పర్వతమును, గంధ పుష్పాదులచే యధా శక్తిగా పూజించవలయును. పదిమంది బ్రాహ్మణులకు దశ ప్రస్థ పరిమాణ తిలలను దానము గావించ వలయును. దశ ప్రస్థయవలను గవ్యముచే కలిపి దానముగావించ వలయును. మత్స్యకచ్చప మండూకమక రాగి జలచరములను స్వర్ణముచే ... కాని రజీతముచే కాని నిర్మించి, స్వర్ణరజతములు లభించనిచో పిష్టముచే నిర్మించి కుసుమాదులచే పూజించి గంగలో పడవేయవలయును. మొదట మంత్రవిత్తే మంత్రముచే విభవమున్నచో రథయాత్రను జరుప వలయును. గంగా ప్రతిమను ఉత్తరాభి ముఖముగా రథారూఢను చేసి తిప్ప వలయును. రధారూఢ యగు గంగాదర్శనము పాపులకు దుర్లభము. దుర్గా రధయాత్ర వలెనే గంగా రధయాత్రను చేయవలయును. ఇట్లు యధావిధిగా విత్తలోభమును విడిచి చేయువాడు ఈ చెప్ప - బోవు పది పాపములనుండి విముక్తుడగును. ఈయని వాటిని గ్రహించుట, అ విధాన హింస, పరదారా భిగమనము, అనునవి మూడు కాయిక పాపములు. కఠినముగా మాట లాడుట, అసత్య భాషణము, చాడీలు చెప్పుట, అసంబద్ధ ప్రలాపములు అను నాలుగు వాచిక పాపములు. పరద్రవ్యములందు ధ్యానము, మనసుచే అనిష్ట చింతనము, అసత్యాభినివేశము అనునవి మూడు మానస పాపములు. కోటి జన్మలలో ఏర్పడిన ఈదశ విధములగు పాపములచే విముక్తుడగునని బ్రహ్మవాక్యము. ఈ మంత్రముచే పూజించ బడిన గంగాదేవి పది పూర్వ తరములను, పది ఉత్తర తరములను, ఇతరములగు పది తరములను ఇట్లు ముప్పది పితరులను తరింప చేయును. “ఓం నమో దశహరాయై నారాయణ్యే గంగాయై నమః” అని మంత్రము. దశవిధపాపములను హరించి నారాయణి యగు గంగకు నమస్కారము అని అని యర్థము. ఈ మంత్రమును ఆదినము రాత్రింబవళ్ళు అయిదు వేలు జపించ వలయును. దశ ధర్మఫలము లభించును. సంసారసాగరమునుండి దశపూర్వులను, దశపరపితరులను తరింప చేయును. చెప్పబోవు ఈ స్తోత్రమును యధావిధిగా గ్రహించి ఆ దినమున గంగాగ్రభాగమున జపించి విష్ను పూజను చేయవలయును. శివరూపురాలికి, గంగాదేవికి, శివదకు నమస్కారము. విష్ణురూపిణి యగు గంగకు నమస్కారము. సర్వదేవ స్వరూపిణికి, ఔషధమూర్తికి, అందరికి అన్ని వ్యాధులకు ఔషధరూపు రాలకి నమస్కారము. స్థాణు జంగమసంభూత విషహారిణికి, సంసార విషనాశనికి, జీవన స్వరూపురాలికి నమస్కారము. తాపత్రయ నివారిణికి, ప్రాణేశ్వరికి, శాంతి స్వరూపిణికి, సంతాప హారిణికి, సర్వమూర్తికి నమస్కారము. సర్వసంశుద్దకారిణికి పాపవిముక్తికి నమస్కారము. భుక్తి ముక్తి ప్రదాయినికి, భోగవతికి, స్వర్గ ప్రదకు, మందాకినికి నమస్కారము. త్రైలోక్య స్వరూపురాలికి, త్రిదశకు, శుక్ల సంస్థకు, క్షేమ వతికి నమస్కారము. త్రిదశాసన సంస్థకు, తేజోవతికి, మందకు, లింగధారిణికి, నారాయణికి నమస్కారము. విశ్వమిత్రకు, రేవతికి, బృహతికీ, లోకధాత్రికి నమస్కారము. విశ్వ ముఖ్యకు, నందినికీ, పృధివికి, శివామృతకు, విరజకు నమస్కారము. పరావరగతాద్యకు, తారకు, సర్వసంస్థకు అభిన్నకు నమస్కారము. శాంతకు, ప్రతిష్ఠకు, వరదకు, ఉగ్ర, ముఖజలకు, సంజీవినికి, బ్రహ్మగకు, బ్రహ్మదకు, దురితఘ్నికి నమస్కారము. ప్రణతార్తి ప్రభజంనికి, జగన్మాతకు, విలుషకు, దుర్గహస్రాకి, దక్షకు నమస్కారము. సర్వాపత్రతి పక్షకు, మంగలకు, పరాపరురాలకు, పరమ మోక్ష ప్రదాత్రికి నమస్కారము. గంగ నా ముందు భాగమున, పార్శ్వము లందు సర్వదిశలందు ఉండు గాక, నా ఉనికి నీయందే ఉండు గాత. ఆది మధ్యాంతములందు భూమి యందు నీవుంటివి. నీవే మూల ప్రకృతివి. నీవే నారాయణ ప్రభువు. నీవే పరమాత్మవు. నీవే శివునివి. నీకు నమస్కారము. ఇట్లు ఈ స్తోత్రమును భక్తి పరుడై ప్రతినిత్యము పఠించువానికి, వినువానికి వినిపించు వానికి కొయిక వాచిక మానస భావములగు దశవిధ పాపములనుండి విముక్తుడగును. రోగి రోగములనుండి, ఆ పన్నుడు ఆపదలనుండి, విముక్తుడగును. శత్రువులనుండి, బంధనములనుండి, భయములనుండి విముక్తుడగును. నలను పొందును. అంతమున బ్రహ్మలో లీనమగును. ఈ స్తోత్రమును లిఖించి ఇంటిలో పూజించబడినచో అగ్ని చోర భయములు పాప భయములుండవు. ఈ దశమినాడు ఈ స్తోత్రమును గంగా జలమున నిలిచి పదిమార్లు జపించినచో దరిద్రుడు, అసమర్థుడు కూడా గంగా పూజను గావించిన వాడు ఆ ఫలమును పొందును. కావున పూర్వోక్త విధానముచే చెప్పబడిన ఫలితము లభించును. గంగ గౌరి వంటిది. కావున గౌరీ పూజనమున చెప్పబడిన విధియే గంగా పూజనమున అనుసరించవలయును. శివుడెట్లో విష్ణువట్లే. విష్ణువెట్లో పార్వతియట్లు. పార్వతి వలె గంగ. ఈ విషయమున భేదములేదు. హరిహరులకు గంగా గౌరులకు, లక్ష్మీపార్వతులకు భేదమును చూచువాడు, చెప్పువాడు మూడబుద్దీయే.
శుక్లపక్షే దివా భూమౌ గంగాయా ముత్తరాయణే
ధన్యాదేహో ఏముంచంతి హృదయస్థే జనార్దనే ।
యే ముంచంతి నరాః ప్రాణాన్ గంగాయాం విధినందిని
తే విష్ణులోకం గచ్ఛంతి స్తూయ మానా దివి స్థితైః ।
అర్ధోదకేన జాహ్నవ్యాం మ్రియతేఽనశనేన యః
స యాతి న పునర్జన్మ బ్రహ్మ సాయుజ్యమేతి చ ।
యా గతి ర్యోగయుక్తస్య సాత్త్వికస్య మనీషిణః
సా గతిస్త్యజతః ప్రాణా న్గంగాయాం తు శరీరిణః ।
అనశనం గృహీత్వా యో గంగాతీరే మృతో నరః
సత్యమేవ పరం లోక మాప్నోతి పితృభిస్సహ ।
గంగాయాం మరణాత్ర్పాణా న్యో ప్రాజ్ఞస్యక్తు మిచ్ఛతి
గతాని బహుజన్మాని యత్ర యత్ర మృతానిచ ।
మహాంశ్చాపి గతః కాలో యత్ర తత్రాపి గచ్ఛతః
అత్ర దూరే సమీపే చ సదృశం యోజన ద్వయమ్ ।
గంగాయా మరణేనేహ నాత్ర కార్యా విచారణా
జ్ఞానతో ఽ జ్ఞానతో వాపీ కామతో ఽ కామతోపివా ।
గంగాయాం తు మృతో మర్త్య స్వర్గం మోక్షం చ విందతి
ప్రాణేషూత్సృజ్య మానేషు యో గంగాం సంస్మరేన్నరః ।
స్పృశేద్వా పాపశీలోఽపి స వై యాతి పరాం గతిమ్
గంగాం గత్వా యైశరీరం విస్పష్ట ప్రాప్తిదీరా స్తేతు దేసమత్వమ్ ।
తస్మాత్సర్వా న్ప్రోహ్యా ముక్తి ప్రదాత్వే సేవేద్గంగా మా శరీర్య పాతమ్
అంతరిక్షే క్షితౌ తోయే పాపీయానపి యో మృతః ।
బ్రహ్మవిష్ణు శివైః పూజ్యం పదమక్షయ్య మశ్నుతే
యోధర్మిష్ఠశ్చ సప్రాణః ప్రయాత శ్శిష్టసంమతః ।
చింతయేన్మనసా గంగాం స గతిం పరమాం లభేత్
యత్ర యత్ర మృతో వాపి మరణే సముపస్థితే ।
భక్త్యా గంగాం స్మరస్యాతి శైవం వా వైష్ణవం పురమ్
శంభోర్జటాకలాపాతు వినిష్క్రాంతతి కర్కశాత్ ।
ప్లావయిత్వా దివం నిన్యే యా పాపానగరాత్మజాన్
యావంత్యస్థీని గంగాయాం తిష్ఠన్తి పురుషస వై ।
తావ ద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే
గంగాతోటేతు యస్యాస్థి నీతా ప్రక్షిప్య తే నరైః ।
తత్కాలమాదిత:కృత్వా స్వర్గలోకే భవేత్స్థితిః
గంగాతోయే తు యస్యాస్థి ప్రాప్యతే శుభకర్మణః ।
న తస్య పునరావృత్తి ర్ర్బహ్మలోకాతధంచన
దశాహాభ్యన్తరేయస్య గంగాతోయేకస్థి సంగతమ్ ।
గంగాయాం మరణే యాదృ క్తాదృక్ఫల మవాప్నుయాత్
స్నాత్వాషితతః పంచగన్యేన సి హిరణ్య మధ్వాజ్యతి లైట్నియోజ్య ।
తథస్థి పిండo పటకే నిధాయ పశ్యన్దిశం ప్రేత గణోప గూడామ్
నమోఽస్తు ధర్మాయ వదన్ప్ర విశ్య జలం స మే ప్రీత ఇతి క్షిపేచ్చ ।
స్నాత్వా తతఫీు వటాక్షయం చ దృష్ట్యా ప్రదద్యాదధ దక్షిణాం తు
ఏవం కృతాహ ప్రేత పురే స్థితస్య స్వర్గే గతిస్స్యాత్తు మహేన్ద్రతుల్యా
ప్రవాహ మవధిం కృత్వా యావద్ధస్త చతుష్టయమ్ ।
తత్ర నారాయణ స్వామీ నాన్య స్వామీ కదాచన
భాద్రశుక్ల చతుర్థ శ్యాం యావదాక్రమతే జలమ్
తావద్గర్భం విజానీయా త్తద్దూరం తీరముచ్యతే ।
సార్థహస్త శతం యావ ద్గర్భ సీరం తతః పరమ్
ఇతి కేషాం మతం దేవి శ్రుతిస్మృతిషు సంమతమ్ ।
తీరాద్గవ్యూతి మాత్రం తు పరితః క్షేత్రముచ్యతే
తీరం త్యక్త్యా వసేత్ క్షేత్రే తీరే వాసో న చేష్యతే ।
ఏకయోజనవిస్తీర్ణ క్షేత్రసీమా తటద్వయాత్
గంగాసీమాం న లంఘన్తి పాపాన్య ప్య ఖిలాన్యపి ।
తే తు దృష్ట్యా పలాయన్తే యథా సింహం వనౌకసః
యత్ర గంగా మహాభాగే రామశంభుతపోవనమ్ ।
సిద్ధక్షేత్రం తు తజ్ఞేయం సమంతాత్తు త్రియోజనమ్
తీర్దే న ప్రతి గృహ్ణీయా త్పుణ్యేష్వాయ తనేషు చ ।
నిమిత్తేషు చ సర్వేషు తన్నివృత్తో భవేన్నరః
తీర్థ యః ప్రతిగృహ్ణాతి పుణ్యేష్వాయత నేషు చ ।
నిష్ఫలం తస్య తతీర్థం యావత్తద్దానముచ్యతే
గంగా విక్రయణాద్దేవి విష్ణోర్విక్రయణం భవేత్ ।
జనార్దనే తు విక్రీతే విక్రీతం భువనత్రయమ్
గంగాతీర సముద్భూతాం మృదం మూర్ద్నా బిభర్తి యః ।
బిభర్త రూపం సోఽర్కస్య తమో నాశాయ కేవలమ్
గంగాపులినజా ధూలి మస్తీర్యాధ నిజాన్ పితృన్ ।
ప్రిణయన్యోనరః పిండాన్ దద్యాత్తాన్ స్వర్నయే దపి
ఇదం తేభిహితం భద్రే గంగామాహాత్మ్య ముత్తమమ్ ।
పఠన్ శృణ్వన్న రోహ్యేతి తద్విష్ణోం పరమం పదమ్
నిత్యం జప్యమిదం భక్త్యా ప్రయతై శ్రద్ధయాన్వితైః ।
వైష్ణవీం గతిమిచ్ఛద్భి శైవిం వా విధినందిని
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తర భాగే మోహినీ వసు సంవాదే గంగా మాహాత్మ్యే పూజాది కధనం నామ త్రిచత్వారిం శత్తమోఽధ్యాయః.
ఉత్తరాయణమున, శుక్ల పక్షమున, భూమి మీద, పగలు, గంగయందు, హృదయమున జనార్ధనుని ఉంచుకొని ధన్యులు మాత్రమే దేహమును విడుతురు. ఓ బ్రహ్మపుత్రీ! గంగయందు ప్రాణములను విడిచిన నరులు దేవతలచే స్తుతించబడుచు విష్ణులోకమునకు వెళ్ళేదరు. గంగానది యందు దప్పితోకాని నిరాహారముతో కాని మరణించువారు పునర్జన్మనందరు. బ్రహ్మసాయుజ్యమును పొందెదరు. సాత్విక బుద్ధి గల వానికి, యోగయుక్తునికి లభించు గతి గంగలో ప్రాణములను విడిచిన వానికి లభించును. ఉపవాసముచే గంగా తీరమున మృతి చెందినవాడు పితరులతో పరలోకమును పొందును. గంగానదిలో ప్రాణములను విడువదలిచిన వాడు పూర్వజన్మలను విడిచిన వాడగును. పూర్వమృతులను విడిచిన వాడగును. చాలా కాలము గడిచిపోవును. ఇచట రెండు యోజనముల దూరము సమీపము సమానమే. తెలిసి, తెలియక, కోరీ, కోరకనైనను గంగ యందు మరణించినవాడు స్వర్గమును మోక్షమును పొందును. ప్రాణములు పోవుచుండగా గంగను తలచినవాడు, లేదా తాకినవాడు పాపశీలుడైనను ఉత్తమగతిని పొందును. గంగకు వెళ్ళి శరీరమును విడిచిన వారు దేవసములగుదురు. కావున అన్నిటిని విడిచి ముక్తి కొరకు శరీర పాతము వరకు గంగను సేవించవలయును. అంతరిక్షమున కాని, క్షితియందుకాని, జలమునందు కాని గంగా సంబంధమునుండగా మరణించినవాడు బ్రహ్మ విష్ణుశివులచే పూజించబడు అక్షయపదమును పొందును. ధర్మిష్ణుడు శిష్ట సమ్మతుడు ప్రాణప్రయాణ సమయమున మనసున గంగను ధ్యానించిన, పరమగతిని పొందును. ఎచట మృతి చెందిననూ మరణకాలమున గంగను భక్తిచే స్మరించువాడు శివలోకమును కాని విష్ణులోకమును కాని పొందును అతి కర్కశమగు శివుని జటా జూటము నుండి బయలువెడలి పాపులను సగరపుత్రులను తడిపి స్వర్గమున చేర్చెను. ఎన్ని అస్థులు గంగలో ఉండునో అన్ని వేల యేండ్లు స్వర్గలోకమున నివసించును. గంగా జలమున అస్థులను పడవేసిన నాటి నుండి అతను స్వర్గమున నివసించును. గంగా జలమున ఆస్తులున్నవాడు మరల బ్రహ్మలోకము నుండి ఇటకు రాబోడు. మరణించిన పది రోజులలోపు గంగలోన అస్తులను కలిపినచో గంగా మరణఫలము లభించును. స్నానము చేసి అస్థులను పంచగవ్యములచే స్నానము చేయించి, హిరణ్యమధు, ఆజ్య తిలలతో కలిపి అస్థి పిండమును హస్త పుటమున నిడుకొని దక్షిణ దిక్కును చూచుచు ధర్మరాజునకు నమస్కారమని పలుకుచు జలమున ప్రవేశించి అతను ప్రీతిచెందుగాక అని గంగలో వేయవలయును. తరువాత స్నానము నాచరించి తీర్థమును అక్షయ వటమును దర్శించి దక్షిణలనిచ్చినచో నరకమున నున్న వానికి స్వర్గమున ఉనికి కలగును. ప్రవాహము నుండి నాలుగు హస్తముల ప్రమాణ ప్రదేశమున నారాయణ మూర్తియే యుండును. ఇచట జలమును గ్రహించరాదు. భాద్రశుక్ల చతుర్దశినాడు జలమాక్రమించు ప్రాంతము వరకు గర్భమనబడును. దూర ప్రాంతము అంతయే తీరమనబడును. నూట యాభైహస్తముల ప్రమాణ ప్రాంతు. గర్బము, తరువాతది తీరమనబడును. ఇది శ్రుతి స్మృతులలో చెప్పబడిన కొందరి మతము. తీరము నుండి రెండు క్రోసుల దూరము క్షేత్రమనబడును. తీరమును విడిచి క్షేత్రమున నివసించవలయును. తీరమున నివసించరాదు. రెండు తటముల నుండి ఒక యోజన విస్తార ప్రాంతము క్షేత్రసీమయనబడును. సమస్త పాపములు గంగాసీమను దాటజాలవు. గంగాసీమను చూచిన పాప ములు సింహమును చూచిన క్షుద్రమ్సగముల వలె పలాయనమును పాటించును. గంగా ప్రాంతమున రామశంభుతపోవనమున్న ప్రదేశము మూడు యోజనముల ప్రాంతము సిద్ద క్షేత్రమనబడును. పుణ్యకాలము లందు, ఆయతనములందు సర్వనిమిత్తము లందు తీర్థము గ్రహించరాదు. పుణ్యములందు ఆయతనము లందు తీర్థము లందు గ్రహించు వాని తీర్థము నిష్పలమగును. గంగా విక్రయణమున విష్ణు విక్రయణము అగును. జనార్ధన విక్రయణమున మూడు లోకములు విక్రయించినట్లగును. గంగా తీరసముద్భవమగు మృత్తికను తల దాల్చినవాడు సూర్యరూపమును ధరించును. గంగాతీర ధూలిని పరిచి పిండ ప్రదానము గావించినచో పితరులను స్వర్గమునకు చేర్చును. ఓ భద్రురాలా నీకు ఈ గంగా మహాత్మ్యమును చెప్పితిని. ఈ మాహాత్మ్యమును చదివిననూ వినిననూ నరుడు విష్ణులోకమును పొందును. ఈ గంగా మాహాత్మ్యమును ప్రతిదినము భక్తిచే శ్రద్ధచే విష్ణులోకమును కాని, శివలోకమును కాని కోరువారు జపించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసు సంవాదమున గంగా మాహాత్మ్యమున పూజాది కధన మను నలుబది మూడవ అధ్యాయము.
Summary of chapter 170 of the Nārada Mahā Purana is as follows:
ఆంగిరస మహర్షి మరియు దేవగురు బృహస్పతి ఆరాధించిన దివ్య తీర్థముల మాహాత్మ్యము ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. బృహస్పతి తీర్థ స్నానము వలన జ్ఞాన వికాసము, గ్రహదోష నివారణ మరియు సద్బుద్ధి సిద్ధించునని నిరూపించబడినది.