నారద మహా పురాణము
91 - మహేశ మంత్ర కథనమ్
సనత్కుమార ఉవాచ :-
అథ వక్ష్యే మహేశస్య మంత్రం సర్వార్థ సాధకమ్ ।
యం సమారాధ్య మనుజో భుక్తిం ముక్తిం చ విందతి
హృదయం స బకః స్సూక్ష్మో లాంతోనంతాన్వితో మరుత్ ।
పంచాక్షరో మనుః ప్రోక్త స్తారాద్యోయం షడక్షరః
వామదేవో మునిశ్ఛన్దః పంక్తిరీశో స్య దేవతా।
షడ్భిర్వర్ణైషడంగాని కుర్యాన్మంత్రేణ దేశికః
మంత్రవర్ణాదికాన్య స్యే నమ్రమూర్తీర్యథా క్రమమ్ ।
తర్జనీమధ్యయోరంత్యానామికాంగుష్టకే పునః .
తాస్స్యుస్తత్పురుషాహోర భవవామేశసంజ్లికాః ।
వక్రహృత్పద గుహ్యేషు నిజమూర్ధని తాః పునః
ప్రాగ్యామ్యవారుణోదీచ్య మధ్యవర్తేషు పంచసు ।
మంత్రాంగాని న్యసేత్పశ్చాజ్ఞాతియుక్తాని షట్కమాత్
కుర్వీత గోలకన్యాసం రక్షాయై తదనన్తరమ్ ।
హృది వక్రేం సయోరూర్వ్యోః కంటే నాథో ద్విపార్శ్వయోః
పృష్ఠే హృది తథా మూర్ఖ వదనే నేత్రయోర్నసోః ।
దోఁపత్సంధిషు సాగ్రేషు విన్యసేత్తదనన్తరమ్
శిరో వదన హృతుక్షి సోరు పాదద్వయే పునః ।
హృది వక్రాంబుజే టంకమృగభయ వరేష్వథ
వక్రాంసహృత్సపాదోరు జఠరేషు క్రమాన్న్యసేత్ ।
మూలమంత్రస్య షడ్వర్ణాన్యధావద్దేశికోత్తమః
మూర్ఖ భాలోదరాంగేషు హృదయే తొః పునర్య సేత్ ।
పశ్చాదనేన మంత్రేణ కుర్వీత వ్యాపకం సుధీః
నమోస్యనన్తరూపాయ జ్యోతిర్లింగామృతాత్మనే ।
చతుర్మూర్తివపుశ్ఛాయాభాసితాంగాయ శంభవే
ఏవం న్యస్తశరీరసౌ చింతయేత్పార్వతీపతిమ్ ।
ధ్యాయేన్నిత్యం మహేశానం రౌప్యపర్వతసన్నిభమ్
చారు చంద్రావతంసం చ రత్నాకల్పోజ్జ్వలాంగకమ్ ।
పరశ్వథ వరాభీతి మృగహస్తం శుభాననమ్
పద్మాసీనం సమంతాత్తు స్తుతం సుమనసాం గజైః ।
వ్యాఘకృత్తిం వసానం చ విశ్వాద్యం విశ్వరూపకమ్
త్రినేత్రం పంచవక్రం చ సర్వభీతిహరం శివమ్ ।
తత్య లక్షం జపేన్మస్రం దీక్షితశైవ వర్మనా
తావత్సంఖ్యాసహస్రాణి జుహుయాత్సాయసై శుభైః ।
తతస్సిద్గో భవేన్మన్తస్సాదకాభీష్ట సిద్ధిదః
దేవం సంపూజయేతీరే వామాదినవశక్తికే ।
వామా జ్యేష్ణా తథా రౌద్రీ కాలీ కలపదాదికా
వికారిణ్యాహ్వయా ప్రోక్తా బలాద్యా వికరిణ్యథ।
బలప్రమథనీ పశ్చాత్ సర్వభూత దమన్యథ
మనోన్మనీతి సంప్రోక్తా శైవ పీఠస్య శక్తయః ।
నమో భగవతే పశ్చాత్సకలాది వదేత్తతః
గుణాత్మ శక్తిభక్తాయ తతో నన్తాయ తత్పరమ్ ।
యోగపీఠాత్మకే భూయో నమస్తారాదికో మనుః
అమునా మనునా దద్యాదాసనం గిరిజాపతేః ।
మూర్తిం మూలేన సంకల్ప్య తత్రావాహ్య యజేచ్ఛివమ్
కర్ణికాయాం యజేన్మూర్తీ రీశమీశాన దిగ్గజమ్ ।
శుద్ధ స్ఫటిక సంకాశదీక్ష తత్పురుషాదికా
పీతాంజన శ్వేతరక్తాః ప్రధాన సదృశాయుధాః ।
చతుర్వక్ర సమాయుక్తా యనానత్తా ప్రపూజయేత్
కోణేష్వన్నివృత్త్యాద్యా స్తేజోరూపాః కలాః।
క్రమాత్ అంగాని కేసరస్థాని విఘ్నేశానన్నగాన్యజేత్
అనన్తం సుఖనామానం శివోత్తమమనన్తరమ్ ।
ఏకనేత్రమేకరుద్రం త్రిమూర్తిం తదనన్తరమ్
పశ్చాఛ్ఛికంఠనామానం శిఖండినమితి క్రమాత్ ।
రక్తపీతసితారక్తకృష్ణరక్తాంజనాసితాన్
కిరీటార్పితబాలేన్జూన్పద్మస్థాన్భూషణాన్వితాన్ ।
త్రినేత్రాః(లవజ్రాస్త్ర చాప హస్తాన్మనోరమాన్
ఉత్తరాది యజేత్పశ్చాద్రుద్రం చండేశ్వరం పునః ।
తతో నన్దిమహాకాలౌ గణేశం వృషభం పునః
అథ భృంగిం ర్టిం స్కన్దమేతాన్పద్మాసనస్థితాన్ ।
స్వర్ణతోయారుణశ్యామముక్తేస్తు సితపాటలాన్
ఇంద్రాదయస్తతః పూజ్యా వజ్రాద్యాయుధ సంయుతాః ।
ఇళం సంపూజయేద్దేవం సహస్రం నిత్యశో జపేత్
సర్వపాపవినిర్ముక్తః ప్రాప్నుయాద్వాంఛితం శ్రియమ్ ।
ద్విసహస్రం జపనోగాన్ముచ్యతే నాత్ర సంశయః
త్రిసహస్రం జపన్మస్త్రం దీర్ఘమాయురవాప్నుయాత్ ।
సహస్రవృద్ధ్యా ప్రజపన్సర్వకామానవాప్నుయాత్
ఆజ్యాన్వితై స్తిలైశ్శుద్దెర్జుహుయా ల్లక్షమాదరాత్ ।
ఉత్పాతజనితాంక్లే శాన్నాశయేన్నాత్ర సంశయః
శతలక్షం జపన్సాక్షాచ్చివో భవతి మానవః ।
సనత్కుమార మహర్షి పలికెను :- ఇక ఇపుడు సర్వార్థ సాధకమగు మహాశమన్తమును చెప్పెదను. ఈ మంత్రోపాసన వలన మానవుడు భుక్తిముక్తులను పొందగలడు. ' నమః శివాయ' అనునది పంచాక్షర మంత్రము. ఓం అను దానిని మొదట చేర్చినచో షడక్షర మంత్రమగును. వామదేవుడు ముని. పంక్తి ఛందస్సు. ఈశ్వరుడు దేవత. సాధకుడు మంత్రములోని షడక్షరములచే షడంగములను న్యాసము చేయవలయును. మంత్ర వర్ణాదికములను మంత్రమూర్తులను యధాక్రమముగా న్యాసము గావించవలయును. తర్జనీ మధ్యమ కనిష్ఠక అంగుష్ఠములందు తత్పురుష అఘోర భవ వామేశ సంజ్ఞలుండును. వక్ర హృత్పద గుహ్యము లందు శిరస్సున, తూర్పు దక్షిణ పశ్చిమోత్తర మధ్య వక్రము లందు అయిదింటి యందు మంత్రాంగన్యాసమును గావించి తరువాత రక్షణ కొరకు గోలకన్యాసమును చేయవలయును. హృదయమున, వక్రము, భుజము లందు, ఊరుపు లందు కంఠనాభి పార్వద్వయములందు, పృష్ఠమున హృదయమున శిరస్సున, వదననేత్ర నాసి కలయందు, బాహువులందు, పాదసంధులందు న్యాసమును చేయవలయును. శిరోవదన హృతుడి ఊరు పాదద్వయ హృదయ వస్త్రాంబుజ టంకమృగా భయకరము లందు, వక్రాస హృత్సపాదోరు జఠరములందు క్రమముగా న్యాసమును గావించవలయును. ఈ స్థానములందు మూలమంత్రము యొక్క అక్షర షట్కమును యథావిధిగా న్యాసమును గావించవలయును. మూర్థ ఫాలోదరాంస హృదయములందు ఆవర్ణములను మరల న్యాసము గావించవలయును. తరువాత ఈ మంత్రముచే వ్యాపకముగా నాచరించవలయును. అనంత రూపునకు, జ్యోతిర్లింగా మృతాత్మకు, చతుర్మూర్తి వపువునకు, ఛాయాభాసితాంగునకు శంభువునకు నమస్కారము. ఇట్లు అంగన్యాసమును గావించి పార్వతీపతిని ధ్యానించవలయును. మహేశ్వరుని రజతాద్రి సన్నిహితుని, చారు చంద్రావతంసుని, రత్నాకల్పోజ్జ్వలాంగుని, పరశ్వధవరాభీతి మృగహస్తుని, శుభాననుని, పద్మాసీనుని, అంతటా దేవతల సమూహములచే స్తోత్రము చేయబడుచున్న వానిని, వ్యాఘ్ర చర్మధారిని, విశ్వాద్యుని, విశ్వరూపిని, త్రినేత్రుని, పంచవక్రుని, సర్వభీతి హరుని, శివుని ధ్యానించవలయును. మూడు లక్షల జపమును చేయవలయును. మూడువేలు పాయసముచే హోమమును గావించవలయును. అపుడు సాధకాభీష్ట ప్రదమగు మంత్రము సిద్ధించును. తరువాత వామాది నవశక్తి యుతమగు పీఠమున దేవుని పూజించవలయును. వామా, జ్యేష్ణా, రౌద్రీ, కాలీ, కలప దారికా, వికారిణీ, బలాద్యా, వికరిణీ, బలప్రమథనీ, సర్వభూత దమనీ, మనోన్మనీ, అనునవి శక్తులు. “ఓం నమో భగవతే సకలాది గుణాత్మశక్తి భక్తాయ అనంతాయ యోగ పీఠాత్మనే న నమః” అనుమంత్రముచే గిరిజాపతికి ఆసనమును కల్పించవలయును. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తి యందు శివుని ఆవాహన గావించి పూజించవలయును. కర్ణిక యందు మూర్తులను ఈశుని ఈశాన దిగ్గజమును పూజించవలయును. శుద్ధ స్పటిక సంకాశుడగు ఈశుని పూజించవలయును. దిక్కున తత్పురుషా దికులను పీతాంజన శ్వేత రక్తవర్లులను ప్రధాన సదృశాయుధులను, చతుర్వక్తులను యధావిధిగా పూజించవలయును. కోణములందు తేజోరూపులగు నివృత్త్యద్యులను యధాక్రమముగా పూజించవలయును. కేసరములలో నున్న అంగములను విఘేశులను పన్నగులను పూజించవలయును. సుఖనాముడగు అనంతుని, శివోత్తముని, ఏకనేత్రుని, ఏకరుద్రుని, త్రిమూర్తిని, తరువాత శ్రీ కంఠుని, శిఖండిని క్రమముగా రక్తపీత సీతావక్త కృష్ణ రక్తాంజనా సీత వర్ణులను, కిరీటార్పిత బాలేన్గులను పద్మస్థులను, భూషణాన్వితులను, త్రినేత్రులను, శూలవజ్రాస్త్ర చాపహస్తులను మనోరములను పూజించవలయును. తరువాత ఉత్తరాది దిక్కులందు రుద్రుని, చండేశ్వరుని పూజించవలయును. తరువాత నంది మహాకాల గణేశ వృషభములను పూజించవలయును. తరువాత భృంగిని, రిటిని, స్కందుని, పద్మాసనస్థులనగా స్వర్ణతోయారుణ శ్యామ ముత్తేందు సీత పాటల వర్ణులను పూజించవలయును. తరువాత వజ్రాద్యాయుధ సంయుతులగు ఇంద్రాదులను పూజించవలయును. ఇట్లు ఈశ్వరుని పూజించి ప్రతినిత్యము వేయి జపమును చేయవలయును. ఇట్లు జపించినచో సర్వపాప వినిర్ముక్తుడై అభీష్టమును పొందగలడు. రెండువేలు జపించినచో, రోగముక్తుడగును. మూడువేలు జపించినచో దీర్గాయుష్యమును పొందును. ఇట్లు ఒక్కొక్క వేయి అధికముగా జపించినచో సర్వాభీష్టములను పొందును. నేయి కలిపిన శుద్దతిలలచే లక్ష హోమమును చేసినచో ఉత్పాతముల వలన కలుగు క్లేశములన్నియూ నశించును. కోటి జపించినచో సాక్షాత్తుగా శివుడే యగును.
షడక్షరశ్శక్తిరుద్ధః కధితోఽ ష్టాక్షరో మనుః
ఋషిశ్చన్దః పురా ప్రోక్తో దేవతా స్యాదుమాపతిః ।
అంగాని పూర్వముక్తాని సౌమ్యమీశం విచింతయేత్
బంధూకాభం త్రినేత్రం చ శశిఖండధరం విభుమ్ ।
స్మేరాస్యం స్వకరైశ్శూలం కపాలం వరదాభయే
వహస్తం చారుభూషాఢ్యం వామోరుస్తాద్రికన్యయా ।
భుజే నాశిష్టదేహంతం చింతయేన్మనసా హృది.
మనులక్షం జపే న్మస్త్రం తత్సహస్రం యధావిధి ।
జుహుయాన్మధురాసికై రారగ్వధ సమిద్వరైః
ప్రాగ్రత్తే పూజయేత్పలే గంధపుష్పైరుమాపతిమ్।
అంగావృతైః బహిః పూజ్యా హృల్లేఖాద్యా యథా పురా
మధ్య ప్రాగ్దాక్షిణోదీచ్యపశ్చిమేషు విధానతః ।
యజేత్పూర్వదిపతేషు వృషభాద్యాననుక్రమాత్
శూలటంకాక్షవలయ కమండలు లసత్కరమ్ ।
రక్తాకారం త్రినయనం చండేశనథ పూజయేత్
చక్రశంఖాభయాభీష్టకరాం మరకతప్రభామ్ ।
దుర్గాం ప్రపూజయేత్స్యాం త్రినేత్రాం చారుభూషణామ్
కల్పశాఖాంతరే ఘంటాం దధానం ద్వాదశేక్షణమ్ ।
బాలారాభం శిశుం కాంతం షణ్ముఖం పూజయేత్తతః
నందినం చ యజేత్సౌమ్యం రత్నభూషణమండితమ్ ।
పరశ్వథ వరాభీతి టంకినం శ్యామవిగ్రహమ్
పాశాంకుశవరాభీష్టధారిణం కుంకుమప్రభమ్ ।
విఘ్ననాయకమభ్యర్చేచ్చంద్రార్క కృతశేఖరమ్
శ్యామం రక్తాత్పలకరం వామాంకన్యస్తతత్కరమ్ ।
ద్వినేత్రం రక్త వస్త్రాఢ్యం సేనాపతిమధార్చయేత్
తతోష్ట మాతరః పూజ్యా బ్రాహ్మ్యాద్యా ప్రోక్తలక్షణాః ।
ఇంద్రాదికాన్లోకపాలాన్స్వస్వ దిక్షు సమర్చయేత్
వజ్రాదీని తదస్రాణి తద్బహిః క్రమతోర్చయేత్ ।
ఏవం యో భజతే మంత్రి దేవీం శంభుముమాపతిమ్
స భవేత్సర్వకాలానాం సౌభాగ్యశ్రేయసాం పదమ్ ।
సాంత పద్యాంతసంయుక్తో, బిందు భూషిత మస్తకః
ప్రాసాదాభ్యో మనుః ప్రోక్తో భజతాం సర్వసిద్ధిదః।
షడ్డీర్ఘయుక్తబీజేన షడంగవిధిరీరితః
షడర్ణవత్తు మున్యాద్యాః ప్రోక్తాశ్చాస్యాపి నారద! ।
ఈశానాద్యా న్య సేన్మూర్తీ రంగుష్ఠాదిషు దేశికః
ఈశానాఖ్యం తత్పురుషమఘోరం తదనన్తరమ్ ।
వామదేవాహ్వయం సద్యో ఆతబీజం క్రమాద్విదు:
ఉకారాద్యైః పంచహ్రస్వైః ర్విలోమాన్సంయుతం చ యత్ ।
తత్తదంగుళిభిర్భూయాస్తత్తద్బీజాదికాన్య సేత్
శిరోవదన హృద్దుహ్య పాదదేశే యధాక్రమాత్ ।
ఊర్ద్వ ప్రాగ్దక్షిణాదీచ్చ పశ్చిమేషు ముఖేషు చ
తతః ప్రవిన్యసేద్విద్వానష్టత్రింశత్కలాస్తనౌ ।
ఈశానాద్యా ఋచస్సమ్యగంగులీషు యధాక్రమాత్
అంగుష్టాదికనిష్టాన్తం న్యసేద్దేశికసత్తమః ।
మూర్దాస్యహృదయాంభోజగుహ్యపాదే తు తాః పునః
వక్రే మూర్ధాదిషు న్యస్య భూయోంగాని ప్రకల్పయేత్ ।
తార పంచకముచ్చార్య సర్వజ్ఞాయ హృదీరితమ్
అమృతే తేజోమాలిని తృప్తాయేతి పదం పునః ।
తదంతే బ్రహ్మశిరసే శిరోగం జ్వలితం తతః
శిఖిం శిఖాయ పరతో నాదిబోధాయ తచ్ఛిఖా ।
వజ్రణే వజ్రహస్తాయ స్వతంత్రాయ తనుచ్ఛదమ్
సౌం ఖాం హౌమితి సంభాప్య పరతతం గుహ్యశక్తయే ।
నేత్రముక్తం క్లిపశుం హుం ఫడనే నేత్ర శక్తయే
అస్త్రముక్తం షడంగాని కుర్యాదేవం సమాహితః ।
పూర్వదక్షిణపశ్చాత్తాక్సౌమ్యమధ్యేషు పంచసు
వక్రేషు పంచ విన్య స్యేదీశానస్య కలాః క్రమాత్ ।
ఈశానస్సర్వ విద్యానాం శశినీ ప్రధమా కలా
ఈశ్వరస్సర్వ భూతానాం మంగలా తదనన్తరమ్ ।
బ్రహ్మధిపతిశ్శబ్దాంతే బ్రహ్మణోధిపతిః పునః
బ్రహ్మేష్టదా తృతీయా స్యాచ్ఛివో మే అస్తు తత్పరా ।
మరీచిః కథితా విప్ర చతుర్ధి చ సదాశివే
అంశుమాలిన్యథాపరా ప్రణవాద్యా నమోన్వితాః ।
పూర్వపశ్చిమయామ్యోదగత్తేషు తదనన్తరమ్
చతస్రా విన్యసేన్మశ్రీ పురుషస్య కలాః క్రమాత్ ।
ఆద్యా తత్పురుషాయేతి విద్మహే శాంతిమీరితో
మహాదేవాయ శబ్దాంతే ధీమహి స్స్యాత్తతః పరమ్।
విద్యా ద్వితీయా కథితా తన్నో రుద్రః పదం తతః
ప్రతిష్ఠా కథితా పశ్చాతృతీయా స్సాత్రచోదయాత్ ।
నివృత్తిస్తత్పరా సర్వా ప్రణవాద్యా నమోన్వితా హృది
చాంసద్వయే నాభిమక్షాపఘీధ వక్షసి ।
అథోరసి కలాన్య స్వేదజ్జి మంత్రి యథావిధి
అఘోరేభ్యస్తథా పూర్వహిరితా ప్రధమాకలా ।
అధ హోరేభ్య ఇత్యంతే మహాస్యాత్తదనన్తరమ్
అఘోరాంతే క్షమా పశ్చాతృతీయా పరికీర్తితా ।
ఘోరతరేభ్యో నిద్రాస్యా త్సర్వేభ్యస్సర్వతత్పరా
వ్యాధిస్తు పంచమి ప్రోక్తా శర్వేభ్యస్త దనన్తరమ్ ।
మృత్యుర్నిగదితా షష్ఠి నమస్తే అస్తు తత్పరమ్
క్షుధాస్యాత్సప్తమి రుద్రరూపేభ్యః కధితా తృషా ।
అష్టమి కధితా ఏతా ధ్రువాద్యా నమసాన్వితాః
గుహ్యయుగ్మోరుయుగ్మేషు జానుజంఘస్ఫిజోః పునః ।
కట్యాం పార్వద్వయే వామ కలాన్య స్యేత్రయోదశ
ప్రధమా వామదేవాయ నమోనే స్యాద్రుజా కలా ।
స్యాజ్యేష్టాయ నమో రక్షా ద్వితీయా పరికీర్తితా
కలకామా పంచమి స్యాత్తతో వికరణాయ చ ।
నమస్సంయమనీ షష్ఠి కధి తదనన్తరమ్
బలక్రియా సప్తమిష్టా కలా వికరణాయ చ ।
నమో వృద్ధి స్యష్టమాస్యాద్బలాంతే చ స్థిరాకలా
పశ్చాత్రమధనాయాంతే నమోరాత్రి రుదీరితా ।
సర్వభూత దమనాయ నమోంతే భ్రమణీకలా
నమోంతే మోహినీ ప్రోక్తా మంత్రజ్ఞే ర్ద్వాదశీకలా ।
మనోన్మన్యై నమః పశ్చాజ్ఞ్వరా ప్రోక్తా త్రయోదశి
ప్రణవాద్యాశ్చతుర్థ్యన్హా నమోంతాస్తు ప్రకీర్తితాః ।
పాదదోస్తననాసాసు మూర్ఖ బాహుయుగే న్యసేత్
సద్యోజాత భవాస్సమ్యగజ్జి మంత్రాః కలాః క్రమాత్ ।
సద్యోజాతం ప్రపద్యామి సిద్ధిస్స్యాత్రథమా కలా
సద్యోజాతాయ వై భూయో నమో స్సాద్బుద్ధిరీరితా ।
భవేద్యతిస్తృతీయా స్యాదభవే తదనన్తరమ్
లక్ష్మీ చతుర్థి కధితా తతో నాతిభవే పదమ్ ।
మేధా స్యాత్పంచమి ప్రోక్తా కలాభూయో భవస్వ మామ్
ప్రాజ్ఞా సమితా షష్ఠీ భవాంతే స్యాత్ర్పభాకలా ।
ఉద్భవాయ నమః పశ్చాత్సుధా స్యాదష్టమి కలా
ప్రణవాద్యాశ్చతుర్థంతాః కలా స్సర్వా నమోన్వితాః ।
అష్టాత్రింశత్కలాః ప్రోక్తా పంచ బ్రహ్మపదాదికాః
ఇతి విన్యస్తదేహోసౌ భవేద్దంగాధర స్వయమ్ ।
తత స్సమాహితో భూత్వా ధ్యాయేదేవం సదాశివమ్
సితపీతాసిత శ్వేతజపాభైః పంచభిర్ముఖైః ।
అక్షైర్యుతం గ్లాముకుటం కోటిపూర్ణేందు సంప్రభమ్
శూలం టంకం కృపాణం చ వజ్రాగ్యపతీన్కరైః ।
దధానం భూషణోద్దీప్తం ఘంటపాశ వరాభయాన్
ఏవం ధ్యాత్వా జపేన్మస్త్రం పంచలక్షం మధుప్లుతైః ।
ప్రసూనైః కరవీరోతైః జుహుయాత్తద్దశాంశతః
పూర్వోదితే యజేతీరే మూర్తిం మూలేన కల్పయేత్ ।
ఆవాహ్య పూజయేత్తస్యాం మూర్తా వావరణే స్సహ
శక్తిం డమరుకా భీతివరాన్సందధతం కరై ।
ఈశానం తీక్షణం శుభ్రమైశాన్యాం దిశి పూజయేత్
పరశ్వణ వరాభీతీర్దధానం విద్యుదుజ్జ్వలమ్ ।
చతుర్ముఖం తత్పురుషం త్రినేత్రం పూర్వతోర్చయేత్
అక్షసజం వేదపాశా ఋషిం డమరుకం తతః ।
ఖట్వాంగం నిశితం శూలం కపాలం బిభ్రతం కరైః
అంజనాభం చతుర్వక్రం భీమదంతం భయావహమ్ ।
అఘోరం తీక్షణం యామ్యే పూజయేన్మన్ల విత్తమః
కుంకుమాభం చతుర్వక్రం వామదేవం త్రిలోచనమ్ ।
హరిణాక్షగుణాభీతి వరహస్తం చతుర్ముఖమ్
బాలేందు శేఖరోల్లాసి ముకుటం పశ్చిమే యజేత్ ।
కర్పూరేందు నిభం సౌమ్యం సద్యో జాతం త్రిలోచనమ్
వరాభయాక్షవలయ కుఠారాన్దధతం కరైః ।
విలాసినం స్మేరవక్రం సౌమ్యే సమ్యక్సమర్చయేత్
కోణేష్వరేన్నివృత్త్యాద్యా స్తేజోరూపాః కలాః క్రమాత్ ।
విఘ్నేశ్వరా ననంతాద్యా నత్రేషు పరితో యజేత్
ఉమాదికాస్తతో బాహ్యే శక్రాద్యానాయుధై స్సహ ।
ఇతి సంపూజ్య దేవేశం భక్త్యా పరమయా యుతః
ప్రీణయేనృత్యగీతాద్యై స్సోతైర్మంత్రి మనోహరైః ।
శక్తి రుద్ధమగు షడక్షర మంత్రము. అట్లే అష్టాక్షర మంత్రము కూడా కలదు. ఈ మంత్రమునకు ఋషి, ఛందస్సు పూర్వ మంత్రమునకు వలెనే యుందురు. ఉమాపతి దేవత. అంగములన్నియూ పూర్వోత్తములే. ప్రశాంతుడగు ఈశ్వరుని ధ్యానించవలయును. బంధూక పుష్ప సన్నిభుడు, త్రినేత్రుడు, బాలేందు ధరుడు, చిరునవ్వు ముఖము గలవాడు, కరములలో శూలమును కపాలమును, వరదాభయములను ధరించువాడు, చారు భూషణ భూషితుడు, వామోరువున నున్న పార్వతిని బాహువులచ ఆశ్లేషించే యున్న ఈశ్వరుని మనసుచే హృదయమున ధ్యానించవలయును. తొమ్మిది లక్షలు జపించవలయును. తొమ్మిదివేలు యధావిధిగా మధుప్లుతములగు ఆరగ్వధ సమిధలచే హోమమును చేయవలయును. ప్రాగుక్త పీఠమున గంధ పుష్పములచే ఉమాపతిని పూజించవలయును. పూర్వమువలె అంగావృత్తులచే హృల్లేఖాదులను పూజించవలయును. మధ్య ప్రాగ్దాక్షిణోదీచ్య పశ్చిమ దిక్కులందు యధావిధిగా పూజించవలయును. పూర్వాది పత్రములందు వృషభాదులను యధాక్రమముగా పూజించవలయును. శూలటంకాక్షవలయ కమండలులచే శోభించు హస్తములు కలవాడు, రక్త కారుడు, త్రినయనుడు, అగు చండేశుని పూజించవలయును. తరువాత చక్రశంఖాభయాభీష్టకరురాలు మరకత ప్రభయగు దుర్గను సౌమ్యను త్రినేత్రను చారుభూషణను పూజించవలయును కల్పశాఖాంతరమున ఘంటాధారిని, ద్వాదశనేత్రుని, బాలార్క సన్నిభుని, శిశువును, సుందరుని షణ్ముఖుని పూజించవలయును. తరువాత సౌమ్యుడగు నందిని పూజించవలయును. తరువాత రత్న భూషణ మండితుని పరశ్వధవరా భీతిటంక ధారిని శ్యామ విగ్రహుని, పాశాంకుశ వరాభీష్ట ధారిని, కుంకుమ సంకాశుని విఘ్న నాయకుని పూజించవలయును. తరువాత చంద్రార్థ కృతశేఖరుడు, శ్యాముడు, రకోత్సలకరుడు, వామాంకన్యస్త సత్కరుడు, ద్వినేత్రుడు, రక్తవస్త్రాడ్యుడు యగు సేనాపతిని పూజించవలయును. తరువాత యధోక్త లక్షణములు కల బ్రాహ్మీ మొదలగు అష్టమాతృకలను పూజించవలయును. తరువాత వారి వారి దిక్కులందు ఇంద్రాది లోకపాలురకు వారి ఆయుధములను బయట పూజించవలయును. ఇట్లు సాధకుడు ఉమాపతియగు శంకరుని పూజించినచో అన్ని లోకములలో అతను సౌభాగ్యశ్రేయస్సులలో ఉత్తముడగును.
సాంత పద్యాంత సంయుక్తము బిందు భూషిత మస్తకము ప్రాసాదమను మంత్రము సేవించు వారికి సర్వాభీష్ట ఫలప్రదము. షడ్దర్భయుక్త బీజములచే సడంగ కల్పన చేయవలయును. ఈ మంత్రమునకు కూడా షడక్షర మంత్రమునకు వలె మున్యాదులు చెప్పబడిరి. సాధకుడు అంగుష్టాదులందు ఈశానాదులకు న్యాసము గావించవలయును. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అని క్రమముగా తెలియవలయును. ఉకొరాదులకు పంచహ్రస్వములచే విలోమములను సంయుతముగా ఆయా యంగుళములచే ఆయా బీజములను న్యాసము చేయవలయును. శిరోవదన హృద్దుహ్య పాదదేశమున యధాక్రమముగా ఊర్థ్వప్రాగ్దాక్షిణోదీత్య పశ్చిమ ముఖములందు న్యాసము చేయవలయును. తరువాత ప్రాజ్ఞుడు తన శరీరము నందు ముప్పది యెనిమిది కలలను న్యాసము గావించవలయును. ఈశానాదీ ఋక్కులను క్రమము ననుసరించి అంగుష్ఠాది కనీషానము అంగుళుల యందు న్యాసమును గావించవలయును. మరల అదే ఋక్కులను మూర్దాస్యహృదయ పాదముల యందుంచవలయును. మరల వక్రమూర్ణాదులందు అంగకల్పన గావించవలయును. తార పంచకమునుచ్చరించి “సర్వజ్ఞాయ నమః” అని హృదయమున, అమృత తేజోమాలినీ తృప్తాయ బ్రహ్మశిరసే అని శిరస్సున “జ్వలితం శిఖి. శిఖాయా నాది బోధాయ” అని శిఖ యందు, “వజ్రణే వజ్రహస్తాయ స్వతంత్రాయ కవచమ్” అని కవచమున “సౌంఖాం హోంతం గుహ్య శక్తయే” అని నేత్రమున, “క్లిపశుం హుంఫట్” అని అస్త్రమును ఇట్లు షడంగ కల్పన చేయివలయును. పూర్వదక్షిణ పశ్చాత్ ప్రాక్ సౌమ్య మధ్యములను అయిదు దిక్కులందు, అయిదు వక్రములందు ఈశాన కలలను అయిదింటిని న్యాసమును గావించవలయును. "ఈశాన స్సర్వ విద్యానాం “అనునది శశినీ అను పేరు గల ప్రథమ కళ. “ఈశ్వర స్సర్వ భూతానాం” అనునది మంగళ రెండవ కల. “బ్రహ్మధిపతి బ్రహ్మణోధిపతిః అనునది బ్రహ్మేష్టద యను మూడవకల “బ్రహ్మా శివోమే అస్తు” అనునది మరీచి యను నాలుగవ కళ సదా శివుని యందుంచవలయును. అయిదవ కళ అంశుమాలిని యనునది. ఇవియన్నియు ప్రణవాదులు నమోంతములుగా చెప్పుకోనవలయును. పూర్వ పశ్చిమయ్యా దజ్ వక్రములందు నాలుగు పురుష కలలను న్యాసమును గావించవలయును. “తత్పురుషాయ విద్మహే” అనునది మొదటి కల. దీనిని శాంతి యందురు. “మహా దేవాయ ధీమహి” అనునది రెండవది. “తన్నో రుద్రః” అనునది తృతీయ. “ప్రచోదయాత్” అనునది నాలుగవది ఈ నాలుగు మొదట ప్రణవము చివరకు అనునవి కలుగు యుండును. హృదయమున, భుజద్వయమున, నాభియందు, కుక్షియందు, పృష్ఠమున, వక్ష స్థలమున, ఉరస్సున ఎనిమిది కలలను యధావిధిగా న్యాసమును చేయవలయును. “అఘోరేభ్యః" అనునది మొదటి కల. “అధఘోరేభ్యః" అనునది మోహయను రెండవ కళ. “అఘోర అనునది క్షమా, అను మూడవ కల. ఘోరతరేభ్యః అనునది నాలుగవకల. “సర్వేభ్యః” అనునది అయిదవకల. 'సర్వశర్వేభ్యః' అనునది ఆరవకల. “నమస్తే అస్తు” అని క్షుధా అను ఏడవకల. 'రుద్రరూపేభ్యః' అని తృషాయను అష్టమికల. ఇవన్నియూ ధ్రువాదికములు నమోన్వితములుగా నుండును. గుహ్యయుగ్మ ఊరు యుగ్మములందు జాను జంఘసిజములందు, కటియందు, పార్వద్వయము నందు పదమూడు వామకలలను న్యాసము గావించవలయును. “ఓం వామదేవాయ నమః” అని మొదటి కలనురు జాయందురు. “ఓం జ్యేష్ఠాయ నమః” అనునది రక్షాయను రెండవ కల. “ఓం శ్రేష్టాయ నమః” అనునది మూడవది ఓం కాలాయనమః' అనునది నాలుగవది. “ఓం బలాయనమః” అనునది ఏడవది. ఓం వికరణాయ నమః” అనునది ఎనిమిదవది. “ఓం బలాయనమః” అనునది తొమ్మిదవది. “ఓం ప్రమథనాయనమః” అనునది పదియవ కల. “ఓం సర్వభూత దమనాయనమః:” అనునది పదకొండవ కల. “ఓం నమః” అనునది పన్నెండవ కల. “ఓం మనోన్మన్యై నమః” అనునది జ్వరాయను పదమూడవ కల. పాద బాహుస్తన నాసామూర్తా భుజ యుగ్మములందు న్యాసము చేయవలయును. సద్యోజాత భవములగు ఎనిమిది మంత్రములు కలలుంచవలయును. “సద్యో జాతం ప్రపద్యామి” అనునది సిదియను మొదటి కల. “సద్వో జాతాయ నమః” అనునది వుధియను రెండవ కల. “ఓం భవాయ నమః” అనునది మూడవది “ఓం అభవాయ నమః” అనునది నాలుగవది. లక్ష్మీ అనునది. “ఓం నాతి భవాయ నమః” అనునది అయిదవది. “ఓం భవాయ నమః” అనునది ప్రాజ్ఞా అను ఆరవకల. “ఓం అభవాయ నమః' అనునది ఏడవది. “ఓం ఉద్భవాయ నమః” అనునది ఎనిమిదవ కల. ఇట్లు మొత్తము ముప్పది యెనిమిది కలలు చెప్పబడినవి. ఇందులో అయిదు బ్రహ్మ పదాదికములు. ఇట్లు న్యాసదేహుడగు వాడు స్వయముగా గంగాధరుడగును. అపుడు సావధాన మనస్కుడై ఇట్లు సదాశివుని ధ్యానించవలయును. సీత పీత అసిత శ్వేత జపావర్ణములు కల అయిదు ముఖములతో నేత్రములతో నున్నవాడు, బాలేందు శేఖరుడు, కోటీ పూర్ణేందు నిభుడు, శూలటంక కృపాణ వజ్రాగ్యహిపతులను ధరించువాడు సర్వభూషణ భూషితుడు, ఘంటాపాశ వరాభయములను ధరించువాడుగానున్న సదాశివుని ధ్యానించిమంత్రమును అయిదు లక్షలు జపించవలయును. తేనె కలిపిన గన్నేరు పూవులచే హోమమును చేయవలయును. పూర్వోక్త పీఠమున పూజించవలయును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి దేవుని ఆవాహన గావించి ఆమూర్తియందు ఆవరణలచే పూజించవలయును. శక్తిని డమరుకాభయ వరములను ధరించువానిని త్రినేత్రుని ఈశానుని శుభ్రవర్లుని ఈశాన్య దిక్కున పూజించవలయును. పరశు ఏణ వరాభీతులను ధరించువాడు విద్యుదుజ్జలుడు, చతుర్ముఖుడు, త్రినేత్రుడు అగు తత్పురుషుని తూర్పు దిక్కున పూజించవలయును. అక్షసజమును, వేద పాశములను ఋషిని డమరుకను, ఖట్వాంగమును, నిశిత శూలమును, కపాలమును ధరించువాడు, అంజనాభుడు, చతుర్వక్రుడు, భీమదంతుడు భయావహుడు, త్రినేత్రుడు అగు అఘోరుని దక్షిణదిక్కున పూజించవలయును. కుంకుమ సంకాశుడు, చతుర్వక్రుడు, త్రిలోచనుడు, హరిణాక్ష గుణాభీతి వరహస్తుడు, చతుర్ముఖుడు బాలేందుశేఖరుడు యగు వామదేవుని పశ్చిమమున పూజించవలయును. కర్చూరేందు నిభుడు సౌమ్యుడు త్రిలోచనుడు వరాభయాక్ష వలయ కుఠారములను ధరించువాడు, విలాసి, స్మేర వక్రుడు అగు సద్యోజాతుని ఉత్తరమున పూజించవలయును. కోణములందు నివృత్త్యాదులగు తేజారూపులగు కలలను క్రమముగా పూజించవలయును. చుట్టూ పత్రములందు అనన్హాదులగు విఘ్నేశ్వరులను పూజించవలయును. తరువాత బాహ్యమున ఉమాదీకమును. ఆయుధ సహితలగు ఇంద్రాదులను పూజించవలయును. ఇట్లు ఉత్తమ భక్తి కలవాడై దేవేశుని చక్కగా పూజించి నృత్యగీతాదులచే సుందరములగు స్తోతములచే దేవేశుని సంతోషింప జేయవలయును.
తారో మాయా వియద్బిందు మనుస్వర సమన్వితః
పంచాక్షర సమాయుక్తో వసువర్లో మనుర్మతః
పంచాక్షరోక్తవతుర్యాదంగన్యాసాదికం బుధః
సిందూరాభం లసద్రత్న ముకుటం చంద్ర మౌళినమ్ ।
దివ్య భూషాంగరాగం చ నాగయజ్ఞోపవీతినమ్
వామోరుస్థప్రియోరోజన్యస్తహస్తం చ బిభ్రతమ్ ।
వేదటంకేష్టమభయం ధ్యాయేత్సర్వేశ్వగం శివమ్
అష్టలక్షం జపేన్మస్త్రం తత్సహస్రం ఘృతాన్వితైః ।
పాయసై ర్జుహుయాతీరే మూర్తిం సంకల్ప్య మూలతః
అంగైరావరణం పూర్వ మనస్తాద్యై రనన్తరమ్ ।
ఉమాదిభి స్సముద్దిష్టం తృతీయం లోకనాయకై:
చతుర్థం పంచమం తేషామాయుధైః పరికీర్తితమ్ ।
ఏవం ప్రతిదినం దేవం పూజయేత్సాధకోత్తమః
పుత్రపౌత్రాదిగాం లక్ష్మీం సంప్రాప్య హ్యత్ర మోదతే ।
తారస్థిరాసకర్ణేందురగు స్సర్గ సమన్వితః
అక్షరాత్మా నిగదితో మంత్రో మృత్యుం జయాత్మకః ।
ఋషిః కహోలో దేవ్యాది గాయత్రీ ఛంద్ర ఈరితమ్
మృత్యుంజయో మహాదేవో దేవతాస్య సమీరితః ।
భృగుణా దీర్ఘయుక్తేన షడంగాని సమాచరేత్
చంద్రార్క హుతభుజ్నెత్రం స్మితాస్యం యుగ్మపద్మగం ।
ముద్రాపాశైణాక్ష సూత్ర లసత్పాణిం శశిప్రభమ్
భాలేన్లు విగలత్పీయూషప్లుతాంగ మలంకృతమ్ ।
హారాద్యై న్నిజ కాంత్యాతు ధ్యాయే ద్విశ్వ విమోహనమ్
గుణలక్షం జపేన్మస్తం తద్దశాంశం హుసేత్సుధీః ।
అమృతా శకలై శ్శుద్ధ దుగ్గాజ్య సమభి ఫుతైః
శైవే సంపూజయేతీరే మూర్తీం సంకల్ప్య మూలతః ।
అంగావరణమారాధ్య పశ్చాల్లోకేశ్వరాన్యజేత్
తదస్రాణి తతో బాహ్యా పూజయేత్సాధకోత్తమః ।
జప పూజాదిభిస్సిద్ధే మన్తస్మిన్మునిసత్తమ
కుర్యాత్రయోగాన్కల్పోక్తానభీష్ట ఫలసిద్ధయే ।
దుగ్ధసికై సుధాఖండై రుత్వా ప్రత్యహమాదరాత్
సహస్ర మాసపర్యన్తం లభేదాయుర్ధనం సుతాన్ ।
సుధావటతీతాన్పూర్వా పయస్సర్దిః పయో హవిః
సపద్రవ్యాణి వారేషు క్రమాద్దశశతం హుసేత్ ।
సప్తాధికాన్టిజాన్నిత్యం భోజయేన్మధురాన్వితమ్ ।
ఋత్విగ్యో దక్షిణాం దద్యాదరుణాం గాం పయస్వినీమ్ ।
గురుం సంప్రీణయేత్పశ్చా డ్జనాద్యైర్దేవతాధియా
అనేన విధినా సాధ్యః కృత్యా ద్రోహజ్వరాదిభిః ।
విముక్తస్సు చిరం జీవేచ్ఛరదాం శతమంజసా
అభిచారే జ్వరే స్తంభ హోరోన్మాదే శిరోగదే ।
అసాధ్య రోగే క్షేవడాక్తా మోహే దాహె మహాభయే
హోమోయం శాంతిదః ప్రోక్త స్సర్వాభయప్రదాయకః ।
ద్రవ్యై రేఖైః ప్రజుహుయాత్రిజన్మసు యథావిధి
భోజయేన్మధురై రోజ్యై ర్రాహ్మణాన్వేదపారగాన్ ।
దీర్ఘమాయురవాప్నోతి వాంఛితాం విందతి శ్రియమ్
ఏకాదశాహుతీర్నిత్యం దూర్వాహభర్జుహుయాద్బుధః ।
అపమృత్యుజిదేవ స్యాదాయురారోగ్య వర్ధనమ్
త్రిజన్మసు సుధావల్లీ కాశ్మీరీ బకులోద్భవైః ।
సమిద్వరైః కృతో హోమ స్సర్వమృత్యు గదాపహః
సిద్ధార్డేర్విహితో హోమో మహాజ్వర వినాశనః ।
అపామార్గ సమిదోమ స్సర్వామయ నిఘాదనః .
దక్షిణామూర్తయే పూర్వం తుభ్యం పదమనన్తరమ్ ।
వటమూల పదస్యాంతే ప్రవదేచ్చ నివాసినే ధ్యా
నైకనిరతాంగాయ పశ్చాద్రూయాన్నమః పదమ్ ।
రుద్రాయ శంభవే తార శక్తి రుద్దోయ మిరతః
షత్రింశదక్షరో మంత్రస్సర్వకామ ఫలప్రదః ।
మునిశుకస్సముద్దిష్టశ్ఛంద్యోనుష్టుప్రకీర్తితమ్,
దేవతా దక్షిణామూర్తిర్నామ్నా శంభు రుదీరితః ।
తార శక్తియుతైః పూర్వం ప్రీమాద్యంతైశ్చ మంత్రజైః
షటష్ణాషేషు వహ్న్యరై ర్హృదయాద్యంగ కల్పనమ్ ।
మూర్థి ఫాలే దృశో శ్రోత్రే గండయుగ్మే సనాసికే
ఆస్య దోస్సంధిషు గలే స్తన హృన్నాభి మండలే ।
కట్యాం గుహ్యే పునః పాద సంధిష్వర్లాన్న్య సేన్మనోః
వ్యాపకం తారశక్తిభ్యాం కుర్యాద్దేపే తతః పరం ।
హిమాచలతటే రమ్యే సిద్ద కిన్నర సేవితే
వివిధ ద్రుమ శాఖాభి సర్వతో వారితాత పే ।
సుపుష్పితైర్లతాజాలైరాగ్లిష్ట కుసుమదుమే
శిలావివర నిర్గచ్ఛన్నిర్ఘరానిలా శీతలే ।
గాయద్దేవాంగనాసంఘే నృత్యద్బర్హికదంబకే
కూజత్కోకిలసంఘ్న ముఖరీకృతదిజ్మఖే ।
పరస్పరవినిర్ముక్తమాత్సర్య మృగసేవితా
జలజైసలజైః పుషై రామాదిభిరలంకృతే ।
ఆద్యైశ్ళుకాద్యై ర్మునిభి రజస్రసుఖసేవితా
పురందరముఖై ర్దేవై స్సాంగనాద్యై ర్వలోకితే।
వటవృక్షం వలుహోచ్ఛాయం పద్మరాగ ఫలోజ్జ్వలమ్
గారుత్మతమయైః పతైర్నిబిడై రుపశోభితమ్ ।
నవరత్న మయాకలై గ్లంబమానైరలం కృతమ్
సంసార తాప విచ్చేద కుశలచ్చాయ మద్భుతమ్ ।
తస్య మూలే సుసంక్లుప్తరత్నసింహాసనే శుభే
ఆసీనమసీతా కల్పం శరచ్చంద్ర నిభాననమ్ ।
కైలాసాద్రినిభం త్ర్యక్షం చంద్రాంకిత కపర్దకమ్
నాసాగ్రాలోకన పరం వీరాసనసమస్థితమ్ ।
భద్రాటకే కురంగాఢ్య జానుస్థ కరపల్లవమ్
కక్షాబద్ధ భుజంగం చ సుప్రసన్నం హరం స్మరేత్ ।
అయుతద్వయసంయుక్త గుణలక్షం జపేన్మనుమ్
తద్దశాంశం తిలై శ్శుద్దె ర్టు హుయాత్క్షీర సంయుతైః।
పంచాక్షరోదితే పీలే తద్విధానేన పూజయేత్
భిక్షాహారో జపేన్మాసం మనుమేనం జితేంద్రియః ।
నిత్యం సహస్రమష్టార్థం పరాం విన్ధతి వాక్రియమ్
త్రివారం జప్తమైతేన పయస్తు మనునా పిబేత్ ।
దక్షిణామూర్తిసంధ్యానాచ్ఛాస్త్రవ్యాఖ్యానకృద్భవేత్
తారము మాయా వియదిందు మనుస్వర సమన్వితముగా పంచాక్షరయుక్తమగు అష్టాక్షరీ మంత్రము తంత్ర శాస్త్ర సమ్మతము. ఈ మంత్రమునకు అంగన్యాసాది కమంతటిని పంచాక్షరీ మంత్రమునకు వలెనే ఆచరించవలయును. సిందూర సంకాశుడు శోభించు రత్నకిరీటము కలవాడు, చంద్రమౌళి, దివ్య భూషాంగరాగములు కలవాడు, నాగ యజ్ఞోపవీతమును ధరించినవాడు, వామోరువున నున్న ప్రియురాలి స్తనములపై నుంచిన చేయి కలవాడు, వేదటంకేష్టా భయధారి యగు శివుని ధ్యానించవలయును. మంత్రమును ఎనిమిది లక్షలు జపించవలయును. ఎనిమిది వేలు నేయితో కలిపిన పాయసముతో హోమమును గావించవలయును. పీఠమున మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి మొదట అంగములచే ఆవరణ పూజను గావించి, తరువాత ఉమాదులతో కూడియున్న వారిని పూజించి, లోకానాయకుల నారాధించి, వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు సాధకోత్తముడు ప్రతిదినము పూజించ వలయును. ఇట్లు చేసినచో పుత్ర పౌత్ర ధనాదులను పొంది ఆనందించును. ఓంకారము లం సవర్ణేందు భృగువు సర్గ సమన్వితము అక్షరాత్మకమగునది మృత్యుంజయ మంత్రముగా చెప్పబడినది. (ఓం లం త్ర్యంబకాయ నమః) అనునది. ఈ మంత్రమునకు కహోల ఋషి గాయత్రీ ఛందస్సు. మహా దేవుడగు మృత్యుంజయుడు దేవత. దీర్ఘ యుక్తమగు భృగువుచే షడంగ న్యాసమును చేయవలయును. సూర్య చంద్రాగ్ని నేత్రుడు, స్మితాస్యుడు, యుగ్మ పద్మగుడు, ముద్రాపాశైణాక్షసూత్రల సత్పాణి, శశిప్రభుడు, ఫాలేందు విగలత్పీయూష ఫ్లుతాంగుడు, హారాదులచే నిజకొంతిచే అలంకృతుడగు విశ్వమోహినుని ధ్యానించవలయును. మంత్రమును ఆరులక్షలు జపించవలయును. దశాంశమును శుద్ద దుగ్లాజ్య సమభి పుతములగు అమృత కలశలములచే హోమమును గావించ వలయును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పీఠమున శివుని పూజించవలయును. అంగావరణములను పూజించి లోకపాలకులను పూజించవలయును. తరువాత బాహ్య ప్రదేశమున వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు జప పూజాదికములచే మంత్రము సిద్ధించిన తరువాత అభీష్ట ఫలసిద్ధి కొరకు కల్పోక్త విధానముచే ప్రయోగముల నాచరించవలయును. ప్రతిదినము ఆదరముచే క్షీరసిక్తములగు సుధాఖండములచే హోమమును వేయిచొప్పున ఒకనెల చేసినచో ఆయుష్యమును, ధనమును పుత్రులను పొందును, సుధామిశ్రితములగు క్షీరములు నేయి, పాలు హవిస్సు మొదలగు ఏడు ద్రవ్యములను ఏడువారములలో క్రమముగా వేయి హోమమును గావించి ప్రతిదినము ఏడుకంటే ఎక్కువ మందిని బ్రాహ్మణులను మధుర పదార్థ యుక్తముగా భోజనమును చేయించవలయును. ఋత్విజులకు పాలనిచ్చు అరుణ వర్ణము గల గోవును దక్షిణనీయవలయును. గురువును దైవబుద్దిచే ధనాదులను సమర్పించి ప్రీతుని గానించవలయును. ఈ విధానముగా ఆచరించినచో కృత్యాద్రోహ జ్వరాదులచే విముక్తుడగును. నూరు సంవత్సరములు ఆరోగ్యానందములచే జీవించును. అభిచారమున, జ్వరమున, స్తంభనమున, ఘోరోన్మాదమున, శిరోవ్యాధియందు, అసాధ్యమగు రోగము నందు, శ్వేతార్తి యందు మోహ దాహ మహాభయములందు ఈ హోమము శాంతిని ప్రసాదించి సర్వాభయ ప్రదానము గావించును. ఈ ద్రవ్యములచే మూడు వేళలలో యథావిధిగా హోమము నాచరించవలయును. వేద పారగులగు బ్రాహ్మణులను మధుర పదార్థములచే భోజనము చేయించవలయును. ఇట్లు చేసినచో దీర్ఘాయుష్యమును కోరిన సంపదను పొందగలడు. పండితుడు ప్రతిదినము గరకతో ఏకాదశాహుతుల నీయవలయును. ఇట్లు చేసినచో అపమృత్యువును జయించి ఆయురారోగ్యములు వృద్ధి పొందును. మూడు వేళలలో సుధావల్లీ కాశ్మీరవకుల సమిధలచే హోమమును గావించినచో మృత్యు భయము వీడి సర్వరోగములు తొలగి ఆనందించును. ఆవాలచే హోమమును గావించినచో మహా జ్వరము నశించును. ఉత్తరేణి సమిధలచే చేయు హోమము సర్వరోగ నివారకము.
“ఓం దక్షిణా మూర్తయే తుభ్యం వటమూలనివాసినే".
ధ్యానై కనిరతాంగాయ నమో రుద్రాయ శంభవే హుంఫట్” అను ఈ మంత్రము ముప్పది యారు అక్షరములు కలది. సర్వాభీష్ట ఫలప్రదము. శుకమహర్షి ముని. అనుష్టుప్చందస్సు. దక్షిణామూర్తి నామముగల శంభువు దేవత. తారాశక్తి యుతములగు హీమాద్యంతముల షట్ సప్త అష్ట వర్ణములందు హృదయాద్యంగ కల్పన గావించవలయును. శిరస్సున, ఫాలమున, నేత్రములందు, కర్ణములందు, గండయుగ్మమున, నాసికయందు, ఆస్యదోస్సంధులందు గలము, స్తనహృన్నాభి మండలములందు, కటి ప్రదేశమున గుహ్యమున, మరల పాదసంధులందు మంత్ర వర్ణన్యాసమును గావించవలయును. తరువాత దేహమున తారశక్తులచే వ్యాపకము నాచరించవలయును. సుందరమగు హిమాచల తటమున, సిద్ద కిన్నర సేవితమున, వివిధ ద్రుమ శాఖలచే అంతట ఆతపమును వారించుచోట పూలతో నిండిన తీగలచే చుట్టబడిన చెట్లు గల ప్రాంతమున, శిలా వివరముల నుండి వెలువడు సెలయేళ్ళ నుండి వచ్చు చల్లని గాలి గలిగినచోట, గానము చేయుచున్న దేవాంగనా సంఘములు కలిగి, నాట్యము చేయుచున్న నెమళ్ళు కలిగి కోకిల కూతలచే దిక్కులు ధ్వనించుచుండగా పరస్పరము వైరమును విడిచిన మృగములచే సేవించబడుచున్న ప్రదేశమున జలజ స్థలజ పుష్పములచే సుగంధము గలదై ఆది ఋషులగు శుకాదులచే ఆనందముగా సేవించబడుచున్న, అంగనా సహితులగు పురందరాదులచే చూడబడుచున్న ప్రదేశమున, గొప్ప నీడ గలిగి పద్మరాగ ఫలోజ్జ్వలమగు, గరుత్మత పత్రములు దట్టముగా వ్యాపించియున్న నవరత్నమయములకు ఊడలు వేలాడుచున్న సంసార తాప విచ్చేద కుశలమగు ఛాయకల అద్బుతమగు వట వృక్షమూలమున సుసంక్లుప్తము శుభము అగు రత్న సింహాసనమున ఆసీనుడైయున్న అసీతా భుని, శరచ్చన్రనిభాననుని, కైలాసాద్రినిభుని, త్రినేత్రుని, చంద్రకాంతి కపర్డుని, నాసాగ్రాలోకన పరుని, వీరాసన సమస్థితుని, ఛద్రాటక కురంగాఢ్య జానుస్థ కరపల్లవుని, కక్షా బద్ధ భుజంగుని, సుప్రసన్నుడగు హరుని స్మరించవలయును. ఆరు లక్షల ఇరవై వేలు జపించవలయును. దశాంశము పాలు కలిపిన శుద్ద తిలలచే హోమమును గావించవలయును. పంచాక్షరోక్త పీఠమున యధావిధిగా పూజించవలయును. భిక్షాహారుడై ఒకనెల ఈ మంత్రమును జపించవలయును. ప్రతి దినము నాలుగువేలు జపించినచో వాకంపదను పొందును. ఈ మంత్రముచే జపించిన పాలను మూడు మార్లు త్రాగి దక్షిణామూర్తిని ధ్యానించినచో శాస్త్రములను వ్యాఖ్యానము చేయగల పాండిత్యమును పొందును.
ప్రణవో హృదయం పశ్చాద్వదేద్భగవతే పదమ్ ।
జేయుతం దక్షిణామూర్తి మహ్యం మేధా ముదీరయేత్
ప్రయచ్ఛ రద్వయాంతోయం ద్వావింశత్యక్షరో మనుః ।
మునిశ్చతుర్ముఖ శ్ఛందో గాయత్రీ దేవతోదితా
తారరుద్దే స్వరై ర్ణీర్జ షడ్భిరంగాని కల్పయేత్ ।
పదైర్మంత్ర భవైర్వాపి ధ్యానాద్యం పూర్వవన్మతమ్
లోహితో గ్యాసన స్సద్యో బిందు మాన్రధమం తతః ।
ద్వితీయం బ్రహ్మబీజస్థా దీర్ఘా శాంతీందు భూషితా
తృతీయా లాంగలీశార్ల మంత్ర బీజత్రయాన్వితః ।
నీలకంఠాత్మకః ప్రోకో విషద్వయహరః పరః
హరద్వయం వహ్నిజాయా హృదయం పరికీర్తితమ్ ।
కపర్దినే పదయుగం శిరోమంత్ర ఉదాహృతః
నీలకంఠాయ ఠ ద్వంద్వం శిఖామంత్రోయ మీరితః ।
కాలకూట పదస్యాంతే విషభక్షణ జేయుతమ్
హుంఫట్ కవచముద్దిష్టం నీలకంఠిన ఇత్యతః ।
స్వాహాంత మస్త్రవేతాని పంచాంగాని మనోర్విదు:
మూర్థి కంటే హృదంభోజే క్రమాద్బీజత్రయం న్యసేత్ ।
బాలార్కాయుత వర్చస్కం జటా జూటేందు శోభితమ్
నాగభూషం జపవటీం శూలం బ్రహ్మ కపాలకమ్ ।
ఖట్వాంగం దధతం దోర్భిస్త్రినేత్రం చింతయేద్ధరమ్
లక్షత్రయం జపేన్మంత్రం తద్దశాంశం ససరిషా।
హవిషా జుహుయాత్సమ్యక్సంస్కృతే హవ్యవాహనే
శైవం పీరే యజేద్దేవం నీలకంఠం సమాహితః ।
మృత్యుంజయ విధానేన విషద్వయ వినాశనమ్
అగ్నిస్సంవర్తకాదిత్య రానితా షష్టి బిందుమాన్ ।
చింతామణిరితి ఖ్యాతం బీజం సర్వ సమృద్ధిదమ్
కశ్యపో మునిరాఖ్యాత శ్ఛన్లోనుఘుబుదాహృతమ్ ।
అర్ధనారీశ్వరః ప్రోక్తో దేవతా జగతాం పతిః
రేఫాదివ్యంజనైషడ్భిః కుర్యాదంగాని షట్కమాత్ ।
త్రినేత్రం నీలమణిభం శూలపాశం కపాలకమ్
రక్టోత్పలం చ హస్తాబ్జె ర్దధతం చారుభూషణమ్ ।
బాలేన్లు బద్ధమకుటమర్థనారీశ్వరం స్మరేత్
ఏకలక్షం జపేన్మస్త్రం త్రిశతం మధురాప్లుతైః ।
తిలైరునేద్యజేత్పీరే శైవంగా వరణెస్సహ
వృషాద్యైర్మాతృభిః పశ్చాల్లోకపాలై సదాయుదైః ।
ప్రాసాదాద్యం జపేన్మస్త్రం అయుతం రోగశాంతయే
స్వాహా వృత్తమిదం బీజం విగలత్పరమామృతమ్ ।
చన్రబింబస్థితం మూర్ఖ ధ్యాతం క్ష్వేడ గదాపహమ్
ప్రతిలోమ స్వరాఢ్యా చ బీజం వహ్నిగ్న హాస్థితమ్ ।
రేఫాదివ్యం జనోల్లాసి షట్కోణాభివృతం బహిః
భూతార్తస్య స్మృతం మూర్త్నీ భూతమాశు వినాశయేత్।
పీడితాంగే స్మృతం తత్తత్పీడాం శమయతి ధ్రువమ్
ప్రణవో హృదయం పశ్చాత్ జేన్తః పశుపతిః పునః ।
తారో నమో భూతపదం తతోధిపతయే ధ్రువమ్
నమో రుద్రాయ యుగలం ఖడ్గరావణశబ్దతః ।
విహర ద్వితయం పశ్చాత్ నరీ నృత్య యుగం పృథక్
శ్మశాన భస్మా చితాంతే శరణ్యాయ తతః పరమ్ ।
ఘంటా కపాల మాలాది ధరాయేతి పదం పునః
వ్యాఘ్రచర్మ పదస్యాంతే పరిధానాయ తత్పరమ్ ।
శశాంక కృతశబ్దాంతే శేఖరాయ తతః పరమ్
కృష్ణసరపదాత్పశ్చా ద్వదేద్యజ్ఞోపవీతినే ।
బలయుగ్మం చలాయుగ్మ మనివర్తకపాలినే
హనోయుగ్మం తతో భూతాం స్రాసయద్వితయం పునః ।
భూయోమండలమధ్యే స్యాత్కటయుగ్మం తతఃపరమ్
రుద్రాంకుశేన శమయ ప్రవేశయయుగం తతః ।
ఆవేశయయుగం పశ్చాచ్ఛండాసి పదమిరయేత్
ధారాధిపతి రుద్రీయం జ్ఞాపయత్యగ్నిసుందరీ ।
ఖడ్గరావణమంత్రోయం సప్తత్యూర్థశతాక్షరః
భూతాధిపతయే స్వాహా పూజామంత్రోయవారితః ।
సిద్ధమంత్రయముదితో జపాదేవ ప్రసిద్ధ్యతి
అయుతద్వితయాత్పశ్చాత్ భూతాదిగ్రహే క్షమః ।
మాయా స్ఫురద్వయం భూయః ప్రస్ఫురద్వితయం పునః
ఘాతయ ద్వితయం వర్మ ఫడంతస్సముదీరితః ।
ఏకపంచాశదర్లోయ మహొరాస్త్రం మహామనుః
అఘోరోస్య మునిః ప్రోక్త స్త్రీవృచ్ఛంద ఉదాహృతమ్ ।
ఆఘోరరుద్రస్సందిష్ణో దేవతామన్రనాయకః
హృదయం పంచభిఃప్రోక్తం శరషడ్ళి రుదాహృతమ్ ।
శిఖాదశభిరాఖ్యాతా నవభిః కవచం మతమ్
వసున్దర్లే సృతం నేత్రం దశార్ణరస్రమిరితమ్ ।
మూర్డి నేత్రాస్యకంధేషు హృనాభ్యామూరుషు క్రమాత్
జానుజంఘాపదద్వంద్వే రుద్రభిన్నాక్షదైర్య సేత్ ।
పంచషట్కాష్టవేదాంగద్విద్వ్యర్థిరసలోచనైః
శ్యామం త్రినేత్రం సర్పాఢ్యం రక్తవస్త్రాంగరాగవమ్ ।
నానాశస్త్ర ధరం ధ్యాయేదఘోరాఖ్యం సదాశివమ్
భూత వేతాల కాదీనాం క్షమోయం నిగ్రహె మనుః
“ఓం నమోభగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రయచ్ఛస్వాహా" అనునీమన్తము ఇరువది రెండక్షరములు కలది. చతుర్ముఖబ్రహ్మఋషి, గాయత్రీఛందస్సు. ఓంకార సహితమగు దీరస్వరములలో (ఆరు) అంగకల్పన చేయవలయును. లేదా మంత్రములోని ఆరుపదములచే కాని చేయవచ్చును. “ఫ్రోం, రీం, క్లీం” అనునది బీజత్రయాన్వితంత్రము. ఇది నీలకంఠమవ్ర మనబడును. ఇది విషద్వయమును పూరించును. “హరహరస్వాహా" అనునది హృదయము “కపర్దినేమ” అనునది శిరోమంత్రము. “నీలకంఠాయస్వాహా” అనునది శిఖామంత్రము. “కాలకూటవిషభక్షణాయ హుంఫట్” అనునది కవచమంత్రము. “నీలకంఠనే స్వాహా" అనునది అప్రమంత్రము. ఇవి మంత్రమునకు పంచాంగములు. శిరస్సున కంఠమున, హృదయమున, క్రమముగా బీజత్రయ న్యాసమును గావించవలయును. పదివేల బాలార్కుల తేజస్సు కలవాడు, జటాజూటేందు శోభితుడు, నాగభూషుడు, జపమాలను, శూలమును, బ్రహ్మకపాలమును, ఖట్వాంగమును ధరించువాడు, త్రినేత్రుడగు శివుని ధ్యానించవలయును. మంత్రమును మూడు లక్షలు జపించి దశాంశమును నేయి కలిపిన హవిస్సుతో సంస్కృతాగ్నిలో హోమమును చేయవలయును. శైవపీఠమున నీలకంఠుని పూజించవలయును. మృత్యుంజయవిధానముచే విషద్వయ వినాశుని పూజించవలయును. అగ్నిసంవర్తనాదిత్యఅనిలులు షష్టి బిందుమత్, చింతామణి యను పేరుగల బీజము సరస్వమృద్ధిప్రదము. ఈ బీజమునకు కశ్యపుడు మహర్షి, అనుష్టుప్చందస్సు. అర్థ నారీశ్వరుడు దేవత రేఫాదులగు ఆరువ్యంజనములచే అంగన్యాసమును చేయవలయును. త్రినేత్రుడు నీలమణి సన్నిభుడు, శూలపాశములను, కపాలములను, రక్తాత్పలములను ధరించువాడు, చారు భూషణుడు, బాలేన్లు బద్దముకుటుడు, అగు అర్థనారీశ్వరుని ధ్యానించవలయును. ఒక లక్ష జపించవలయును. పీఠమున శైపోంగావరణలచే పూజించవలయును. వృషాది మాత్న కలను, సాయుధులగు లోకపాలకులను పూజించవలయును. ప్రాసాదాద్య మంత్రమును రోగశాంతికి పదివేలు జపించవలయును. స్వాహావృత్తమగు నీ బీజము స్రవించు అమృతము వంటిది. దీనిని ధ్యానించినచో అనగా (అం) అను బీజము ధ్యానించినచో క్షేడరోగము శాంతించును. ప్రతిలోమ స్వరాఢ్యము వహ్ని గృహమున నున్న బీజము రేఫాది వ్యంజనోల్లాసి, బహిర్భాగమున షట్కోణాభివృతమును స్మరించినచో భూతార్జునకు భూతశాంతి జరగును. పీడితాంగమున స్మరించినచో ఆయా పీడను తొలగించును. “ఓం నమ: పశుపతయే, ఓం నమో భూతాధిపతయే నమో రుద్రాయ నమో రుద్రాయ ఖడ్గ రావణ విహర విహర నరీ నృత్య నరీ నృత్య శ్మశాన భస్మారచిత శరణ్యాయ ఘంటా కపాల మాలాది ధరాయ, వాఘ్ర చర్మ పరిధానాయ శశాంక కృతశేఖరాయ, కృష్ణ సర్పయజ్ఞోపవీతినే బల బల చలా చలా నివర్తక పాలినే హనుహను భూతాంస్త్రాసయ త్రాసయ,మండల మధ్యే కట కట రుద్రాంకుశేన శమయ ప్రవేశయ ప్రవేశయ, ఆవేశయ ఆవేశయ చండాసి ధరాధిపతి రుద్రీయం జ్ఞాపయతి స్వాహా" అనునది ఖడ్గ రావణ మంత్రము. నూటా డెబ్బది అక్షరములు గలది. “భూతాధి పతయే స్వాహా" అనునది పూజా మంత్రము. ఇది సిద్ధ మంత్రముగా చెప్పబడినది. కావున జపించి నంత మాత్రముననే సిద్దించును. ఇరువది వేలు జపించిన తరువాత భూతాది నిర్బంధమున సమర్థుడగును. “హీం స్ఫుర స్ఫుర, ప్రస్పుర ప్రస్పుర, ఘాతయ ఘాతయ హుంఫట్” అనునది చివర చేర్చిన యాబది యొక అక్షరములుగల ఈ మహామంత్రము అఘోరాస్త్రమనబడును. ఈ మంత్రమును అఘోరముని. త్రివృచ్ఛందస్సు. అఘోర రుద్రుడు దేవత. అయిదింటిచే హృదయమును, ఆరింటిచే శిరమును, పదింటిచే శిఖను, తొమ్మిదింటిచే కవచమును. ఎనిమిదింటిచే నేత్రమును, పదింటిచే అస్త్రమును చేయవలయును. శిరోనేత్రస్య కంఠములందు, హృదయ భ్యూరువులందు జాను జంఘ పదద్వంద్వములందు రుద్రభిన్నాక్షరములచే న్యాసమును గావించవలయును. ఈన్యాసమును 5,6,8,6,2,2,6,3, వర్ణములచే చేయవలయును. శ్యాముడు, త్రినేత్రుడు, సర్వాఢ్యుడు, రక్త వస్త్రాంగ రాగకుడు, నానా శస్త్రధరుడు అగు అఘోరుడను పేరు గల సదా శివుని ధ్యానించవలయును. ఈ మంత్రము భూత భేతాళ నిగ్రహ సమర్థము.
తారో వాంతో ధరాసంస్థో వామనేత్రేందు భూషితః
పాశీ బకః కర్ణనేత్ర వర్మాస్తాంతో షడక్షరః ।
మనుః పాశుపతాస్త్రాఖ్యో గ్రహక్షుద్ర నివారణ:
షడ్భిర్వర్ణై షడంగాని హుం ఫడంతై స్సజాతిభిః ।
మధ్యాహ్నాక్క ప్రభం భీమం త్ర్యక్షం పన్నగ భూషణమ్
నానాశస్త్రం చతుర్వక్రం స్మరేత్పశుపతిం హరమ్ ।
వర్ణలక్షం జపేన్మస్త్రం జుహుయాత్తద్దశాంశతః
గన్యేన సర్ఫిషా మంత్ర సంస్కృతే హవ్యవాహనే ।
శైలే పీలే యజేదంగ మాతృలోకేశ్వరా యుదైః
అనే మంత్రితం తోయం భూతగ్రస్తముఖే క్షిపేత్ ।
సద్యస్స ముంచతి క్రందాత్ మహామంత్ర ప్రభావతః
అనేన మంత్రితాన్బాణా న్విస్పజేద్యుధి యో నరః ।
జయేత్క్షణేన నిఖిల్చాతూన్పార్థ ఇవాపరః
వర్ణాంతిమో బిందుయుతః క్షేత్ర పాలాయ హృన్మను
తారాద్యేవ సువర్లోయం క్షేత్ర పాలస్య కీర్తితః ।
షడ్డీర్ఘ యుక్త బీజేన షడంగం న్యస్య చింతయేత్
నీలాచలాభం దిగ్వస్త్రం సర్పభూషం త్రిలోచనమ్ ।
పింగోర్డ్వకేశాన్దధతం కపాలం చ గదాం స్మరేత్
లక్షమేకం జపేన్మస్త్రం జుహుయాత్తద్దశాంశతః ।
చరుణా ఘృతసిక్తేన తతః క్షేత్ర సమర్చయేత్
ధర్మాదికల్పితే పీకే సాంగావరణ మాదరాత్ ।
తస్మే సపరివారాయ బిలమేతేన నిర్హరేత్
పూర్వమేహి ద్వయం పశ్చాద్విద్విషం పురుషం ద్వయమ్ ।
భంజయ ద్వితయం భూయో నర్తయ ద్వితయం పునః
తతో విఘ్నపదద్వంద్వం మహాభైరవ తత్పరమ్ ।
క్షేత్రపాలబలిం గృష్ణ ద్వయం పావక సుందరీ
బలిమంత్రయ మాఖ్యాత స్సర్వకామ ఫలప్రదః ।
సోపదేశం బృహత్పిండే స్సర్వకామఫలప్రదః
స్మృత్వా యధోక్తం క్షేత్రేశం తస్య హస్తే బలిం హరేత్ ।
బలినానేన సంతుష్టః క్షేత్రపాలః ప్రయచ్ఛతి
కాంతిం మేధాం బలారోగ్యం తేజః పుష్టిం యశశ్రియమ్ ।
ఉద్దరేద్వటుకం జైనం ఆపదుద్దారణం తధా
కురుద్వయం తతః పశ్చాద్వటుకం జైన ముచ్చరేత్ ।
శక్తి రుద్రో ధ్రువాదిశ్చ ద్వావింశత్యక్షరో మనుః
ద్విచతుస్సప్త వేదాళి చంద్రార్జీ రంగకం మనోః ।
బాలం స్ఫటికసంకాశం తల్లోలలసీతాననం
దివ్యాకర్చైః ప్రదీప్తాంగం త్యక్షం దండత్రిశూలినమ్ ।
సుప్రసన్నం స్మరేద్భక్త్యా భక్తానామభయంకరమ్
వర్ణలక్షం జపేన్మస్త్రం హవిష్యాశీ జితేన్షియః ।
తద్దశాంశం ప్రజుహుయా త్రిలైర్మధుర సంయుతైః
ధర్మాదికల్పితే పీకే పంకజే చాతిశోభనే ।
షట్కోణాంత గ్రికోణస్థ వ్యోమ పంకజు సంయుతే
బటుకం పూజయేద్దేవం సాంగావరణకం క్రమాత్ ।
శత్రుపక్షస్య రుధిరం పిశితం చ దినే దినే
భక్షయస్వ గజై స్వార్థం సారమేయ సమన్వితః ।
బలి మంత్రయ మాఖ్యాత శత్రు నామ్నా విదర్భతః
అనేన బలినా హృష్టా బటుక: పరసైన్యకమ్ ।
ఛితాగణేభ్యో విభజే దామిషం క్రుద్ధ మానసః
అంకుశో వహ్ని శిఖరో లాంత దాంత ఇతీరితః ।
షడంతశ్చండమంత్రయం త్రివర్ణాత్మా సమీరితః
అస్య త్రితో మునిః ప్రోక్తశ్ఛందోనుష్టు బుదాహృతమ్ ।
చండీశో దేవతా ప్రోక్తా వక్ష్యతేంగ ప్రకల్పనమ్
హృదయం దీప్త ఫట్రోక్తం జ్వల ఫట్శిర ఈరితమ్ ।
శిఖాజ్వాలని ఫట్ వహ ఫట్కవచం మతమ్
హుంఫట్నేత్ర మాఖ్యాతం సర్వ జ్వాలిని ఫట్పరమ్ ।
విన్యస్యైవం షడంగాని తతో దేవం విచింతయేత్
చండేశ్వరం రక్తతనుం త్ర్యక్షం రక్తాంబరావృతమ్ ।
దధతం చ త్రిశూలక్ష మాలాటంక కమండలూన్
వర్ణలక్షం జనోన్మస్త్రం హోమం కుర్యాద్దశాంశతః ।
మధురత్రయ సంయుకై ర్విశుద్దై స్త్రీలతండులైః
పంచాక్షరోదితే పీలే మూర్తిం మూలేన కల్పయేత్ ।
కూరేశో బిందు సయుక్తస్తత శ్చండేశ్వరాయ చ
హృదయం మనురఖ్యాతశ్చండేశస్య ప్రపూజనే ।
అంగైర్మాతృభిరాశేశై ర్వజాద్యై రావృతిర్భవేత్
శైవమంత్రేషు నిష్ణాత శ్చండేశ్వర మనుం జపేత్ ।
సర్వాన్కామానవాప్నోతి పరత్రేహ చ నందతి
తారము వాంతము ధరాసంస్థము వామనేత్రేందు భూషితము పాశీ బకము కర్ణనేత్ర వర్మాస్రాంతమగు ఈ మంత్రము ఆరక్షరములు కలది. ఇది పాశుపతమంత్రము. క్షుద్రగ్రహ నివారకము. ఆరువర్ణములచే ఆరంగములను కల్పించవలయును. ప్రత్యంగకల్పనలో హుంఫడంతములచే చేయవలయును. మధ్యాహ్నసూర్య సంకాశుడు, భయంకరుడు, త్రినేత్రుడు, పన్నగ భూషణుడు, నానా శస్త్రధరుడు, చతుర్వక్రుడు, అగు పశుపతిని ధ్యానించవలయును. మస్తమును అక్షరలక్ష (ఆరులక్షలు) జపించ వలయును. దశాంశము గోఘృతముచే సంస్కృత్నాలో హోమమును చేయవలయును. ఈ మంత్రముచే మంత్రించబడిన జలమును గ్రహ గ్రస్తుని ముఖమున నుంచవలయును. మహామంత్ర ప్రభావము వలన వెంటనే గ్రహ విముక్తుడగును.యుద్ధమున ఈ మంత్రముచే మంత్రించబడిన బాణములను ప్రయోగించినచో అర్జునునివలె సకల శత్రువులను జయించును. “ఓం హం క్షేతపాలాయ నమ:” అనునది ఎనిమిదిక్షరములు గలది క్షేతపాల మంత్రము. షడ్డీరయుక్త బీజముచే షడంగన్యాసమును చేయవలయును. నీలాద్రి సన్నిభుడు, దిగంబరుడు, సర్పభూషణుడు, త్రిలోచనుడు, పింగోర్డ్వకేశుడు, కపాల గదాధారిని స్మరించవలయును. మన్తమును ఒక లక్ష జపించవలయును. దశాంశము ఘృతసిక్త చరువుతో హోమమును గావించవలయును. తరువాత క్షేత్రమున అర్చించవలయును. ధర్మాదులచే కల్పించిన పీఠమున ఆదరముచే సాంగావరణములను పూజించవలయును. తరువాత సరిపరివారుడై నక్షేత్రపాలునకు ఈ మంత్రముచే బలిని అర్పించవలయును. “ఏహి ఏహి విద్విషం పురుషం భంజయ భంజయ నర్తయ నర్తయ విఘ్న విఘ్న మహా భైరవ ! క్షేత్రపాల బలిం గృష్ణ గృష్ణ స్వాహా" అనునది బలి మంత్రము. ఈ మంత్రము సర్వకామ ఫలప్రదము. సాధకుడు రాత్రులందు సోపదేశముగా బృహత్పిండములను చేసి యధోకక్షేత్రపాలకుని ధ్యానించి క్షేత్రపాలుని హస్తమున బలిని అర్పించవలయును. ఈ బలిచే సంతోషించిన క్షేత్రపాలుడు కాంతిని, మేధను, బలారోగ్యములను, తేజస్సును, పుష్టిని, యశస్సును, సంపదను ఇచ్చును.
“ఓం బటుకాయ ఆపదుద్ధరణం కురు కురు వటుకాయ స్వాహా” అనునది ఇరువది రెండక్షరముల మంత్రము. 24,7,4,1 అక్షరములచే అంగన్యాసమును చేయవలయును. బాలుడు, స్ఫటిక సంకాశుడు, స్ఫటికలోలలసీతాననుడు, దివ్యాభరణ భూషితుడు త్రినేత్రుడు, దండ త్రిశూలధారి, సుప్రసన్నుడు, భక్తాభయకరుడగు బటుకుని ధ్యానించవలయును. హవిస్సును భుజించుచు జితేంద్రియుడై అక్షర లక్షలు జపించవలయును. దశాంశమును మధుర సంఫుత తిలలచే హోమమును చేయవలయును. ధర్మాది కల్పిత పీఠమున అతి శోభనమగు పంకజమున లోక త్రికోణములు గల షట్కోణమున వ్యోమ పంకజ సంయుతమున సాంగావరణములతో ఆదరముచే వటుకుని పూజించవలయును. ప్రతిదినము శత్రుపక్షరుధిరమును మాంసమును గణములతో కలిపి సారమయ సమన్వితుడవై భక్షించుము అను అర్థముగల “శత్రు పక్షస్య రుధిరం పిశితం చ దినేదినే భక్షయస్వ గజై స్సార్థం సారమేయ సమన్విత:” అన ఈ బలిమంత్రము శత్రనామాంకితముగా బలిని అర్పించవలయు. ఈ బలిచే సంతుష్టుడైన బటుకుడు పరసైన్యమును ఛేదించి కోపముచే గణములకు శత్రుమాంసమును విభజించి ఇచ్చును. “శ్రీం హ్రీం ఫట్" అనునదీ చండమంత్రము. త్రివర్ణాత్మకముగా చెప్పబడినది. ఈ మంత్రమునకు త్రితముని. అనుష్టుప్ఛన్లస్సు. చండేశుడు దేవత. “దీప్త ఫట్" అనునది హృదయము జ్వలపట్' అనునది నేత్రము. “సర్వ జ్వాలిని ఫట్" అనునది కవచము. ఇట్లు షడంగ న్యాసమును గావించి దేవుని ధ్యానించవలయును. రక్తదేహుడు త్రినేత్రుడు, రక్తాంబరావృతుడు. త్రిశూలాక్షమాలాటంక కమండలుధారియగు చండేశుని ధ్యానించవలయును. మూడు లక్షలు జపించవలయును. దశాంశమును మధురత్రయసంక్తములగు పరిశుద్దతిలతండులములచే హోమమును గావించవలయును. పంచాక్షరోక్తపీఠమున మూర్తిని మూలమంత్రముచే సంకల్పించవలయును. అం చండేశ్వరాయనమ: “అనునది చండీశ్వర పూజా మంత్రము. ఆంగమాతృకలోకపాలాయుధములకు ఆవరణపూజగావించవలయును. దైవమంత్రనిష్ణాతుడు మాత్రమే చండేశ్వర మంత్రమును జపించవలయును. సర్వాభీష్టములను పొంది ఇహపరములలో ఆనందించును.
శృణు నారద వక్ష్యామి దివ్యం మాహేశ్వరం స్తవమ్ ।
యస్య పాతేన పూజాయాం సిద్ధ్యంతి మనవోఖిలాః
ధరాంబగ్నిమరుద్వ్యోమ మఖేశేంద్వర్కమూర్తయే ।
సర్వభూతాంతరస్థాయ శంకరాయ నమోనమః
శ్రుత్యంతకృతవాసాయ శ్రుతయే శ్రుతి జన్మనే ।
అతీంద్రియాయ మహసే శాశ్వతాయ నమోనమః
Summary of chapter 93 of the Nārada Mahā Purana is as follows:
కాశీ క్షేత్రంలో ప్రవహించే దివ్య గంగా నది యొక్క అనంతమైన మాహాత్మ్యము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. కాశీ గంగా స్నానము వలన జీవునికి లభించే మణికర్ణికా ముక్తి వైభవము ఇక్కడ ప్రశంసించబడినది.