14 -  ధర్మశాన్తినిర్దేశః

ధర్మరాజ ఉవాచ :-

శ్రుతిస్మృత్యుదితం ధర్మం వర్ణానామానుపూర్వశః

ప్రబ్రవీమి నృప శ్రేష్ఠ తం శృణుష్వ సమాహితః

యో భుంజానో శుచిం వాపి చాండాలం పతితం స శత్

క్రోధాదజ్ఞానతో వాపి తస్య వక్ష్యామి నిష్కృతిమ్

త్రిరాత్రం వాపి షడ్రాత్రం యథాసంఖ్యం సమాచరేత్

స్నానం త్రిషవణం విప్ర పంచగవ్యన శుధ్యతి

భుంజానస్య తు విప్రస్య కదాచితవతే గుదమ్

ఉచ్ఛిష్టత్వేఽ శుచిత్వే చ తస్య శుద్ధిం వదామి తే

పూర్వం కృత్వా ద్విజశ్శౌచం పశ్చాదప ఉపస్పృ శేత్

అహోరాత్రోషితో భూత్వా పంచగవ్యేన శుద్ధ్యతి

నిగిరన్యది మే హేత భుక్త్వా వా మేహనే కృతే

అహోరాత్రోషితో భూత్వా జుహుయాత్సరిషానలమ్

యదా భోజనకాలే స్యాదశుచిః బ్రాహ్మణః క్వచిత్

భూమౌ నిధాయ తం గ్రాసం స్నాత్వా శుద్ధిమవాప్నుయాత్

భక్షయిత్వా తు తద్గ్రాసముపవా సేన శుధ్యతి

అశిత్వా చైవ తత్సర్వముపవా సేన శుధ్యతి

అశ్నత శ్చేద్వమిస్స్యాయ్యో హ్యస్వస్థ స్త్రీ శతం జు పేల్

స్వస్థ స్త్రీణి సహస్రాణి గాయత్ర్యాః శోధనం పరమ్

చాండాలైశ్వపచై: స్పృష్టో విణ్మూత్రే చ కృతే ద్విజః

త్రిరాత్రం తు ప్రకుర్వీత భుకోచ్చిష్టష్టడాచరేత్

ఉదక్యాం సూతికాం వాపి సంస్పృశే దన్త్యజో యది

త్రిరాత్రేణ విశుద్ధిస్స్యా దితిశాతాతపోఽబ్రవీత్

రజస్వలా తు సంస్పృష్టాశ్వభిర్మాతంగవాయ సైః

నిరాహారా శుచిస్తే ష్ఠేత్కారే స్నానేన శుద్ధ్యతి

రజస్వలే యదా నార్యావన్యోన్యం స్పృశతః క్వచిత్

శుద్ధ్యేతే బ్రహ్మ కూర్చేన బ్రహ్మ కూర్చేన చోపరి

ఉచ్ఛిష్టేన చ సంస్పృష్టో యో న స్నానం సమాచరేత్

ఋతౌ తు గర్భం శంకిత్వా స్నానం మైధునినస్స్మృతమ్

అనృతౌ తు స్త్రీయం గత్వా శౌచం మూత్రపురీషవత్

ఉభావప్యశుచీ స్యాతాం దంపతీ యాభసంగతౌ

శయనాదుత్థితా నారీ శుచిస్స్యాదశుచిః పుమాన్

భర్తుశ్శరీరశుశ్రూషాం దౌరాత్మ్యాదప్రకుర్వతీ

దండ్యా ద్వాదశకం నారీ వర్షం త్యాజ్యా ధనం వినా

త్యజన్తోఽపతితాన్భంధూన్టళ్యో ఉత్తమసాహసమ్

పితా హి పతితం కొమం న తు మాతా కదాచన

ఆత్మానం ఘాతయేద్యస్తు రజ్జ్వోదిభిరుపక్రమై

మృతే మేధ్యన లేప్తవ్యో జీవతో ద్విశతం దమః

దండ్యాప్తత్పుత్రమిత్రాణి ప్రత్యేకం పాణికం దమమ్

ప్రాయశ్చిత్తం తతః కుర్వుర్యథా శాస్త్రప్రచోదితమ్

ధర్మరాజు పలికెను :- వర్ణాశ్రమములకు క్రమముగా శ్రుతులలో, స్మృతులలో చెప్పిన ధర్మములను వివరించెదను. సావధానముగా వినుము. భోజనము చేయుచు అపవిత్రుని కాని, చండాలుని కాని కోపముతో, అజ్ఞానముతో స్పృశించినచో వరుసగా మూడుదినములు, ఆరుదినములు, మూడు వేళల్లో స్నానము చేసి పంచగవ్యముతో శుద్ధిపొందును. (పంచగవ్యమనగా గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదధి, గోఘృతము). బ్రాహ్మణుడు భోజనము చేయుచుండగా మలము స్రవించినచో ఏర్పడిన అపవిత్రత తొలగుటకు పాదప్రక్షాళనము చేసుకొని ఆచమనము చేసి ఒక దినము ఉపవాసముండి పంచగవ్యమును సేవించవలయును. భోజనము చేయుచున్నపుడు మూత్రస్రావము జరిగినచో ఒకదినము ఉపవాసముచేసి నేతితో హోమమును చేయవలయును. భోజనము చేయుచుండగా బ్రాహ్మణుడు అపవిత్రుడైనచో చేతిలోని ఆహారమును భూమి పైనుంచి స్నానము చేసినచో శుద్ధిని పొందును. ఒకవేళ ఆ ఆహారమును భుజించినచో ఉపవాసము చేసినచో శుద్ధిని పొందును. మొత్తము ఆహారమును తీసుకొనినచో మూడు దినములుపవసించవలయును. భోజనము చేయుచుండగా వాంతిచేసుకొనినచో ఆనారోగ్యముగా ఉన్నవాడు. మూడువందలు, ఆరోగ్యముగా నున్నవాడు మూడువేలు గాయత్రీ జపమును చేయవలయును. మలమూత్రోత్సర్జనము చేయుచున్నపుడు చండాలుడు కాని, శ్వపచుడు కాని స్పృశించినచో మూడురోజులుపవసించవలయును. భోజనము చేసిన తరువాత అశుచిగా ఉన్నపుడు స్పృశించినచో ఆరు” దినములు పవసించవలయును. రజస్వల అయిన స్త్రీని కాని, ప్రసవించిన స్త్రీని కాని చండాలుడు స్పృశించినచో మూడు దినములు తరువాత శుద్ది పొందును అని శాతాతపమహర్షి చెప్పెను. రజస్వలఅయిన స్త్రీని కుక్కలు, కాకులు, కిరాతులు స్పృశించినచో నిరాహారముగా ఉండి యథాసమయమున స్నానము చేయవలయును. రజస్వలలైన ఇరువురు స్త్రీలు ఒకరినొకరు తాకినచో బ్రహ్మ కూర్చమనువ్రతముతో శుద్ధి పొందెదరు. అపవిత్రుడు స్పృశించినపుడు స్నానము చేయనివాడు కూడా బ్రహ్మకూర్చమను వ్రతముచే శుద్ధిని పొందును. “ఋతుకాలమున గర్భవతి యని శంకించి సంభోగము చేసినవానికి స్నానముతో శుద్ధి కలుగును. ఋతుకాలము కానపుడు స్త్రీ సంగమమును జరిపినచో మూత్ర పురీషోత్సర్జనము చేసినప్పుటి వలె పాదప్రక్షాలనము ఆచమనము చేయవలయును. సంభోగ సమయమున స్త్రీ పురుషులిరువురూ అపవిత్రులగుదురు. శయ్య మీదినుండి లేచినచో స్త్రీ శుద్ధురాలగును. పురుషుడు మాత్రము అశుచిగానే యుండును. దుష్టత్వముతో భర్త శరీరమును సేవించని స్త్రీని ధనమేమీ ఇవ్వకుండగా పన్నెండు సంవత్సరములు త్యాగము చేయవలయును. పతితులు కొని, బంధువులను త్యజించినవారిని ఉత్తమ సాహస దండముచే శిక్షించవలెను. పతితుడైతే కావచ్చును. కాని తల్లి ఎన్నడూ పతితురాలు (పుత్రుని దృష్టిలో) కాదు. తాడుచే ఉరిపోసుకొనుట మొదలగు విధానములతో ఆత్మహత్యకు పాల్పడినచో, మరణించినచో మృతదేహమును పవిత్ర పదార్థములతో పూయవలయును. ఒకవేళ జీవించెనేని రెండువందల నాణెములను అపరాధమును విధించవలయును. ఆత్మహత్య చేసుకొనిన వాని పుత్ర పౌత్రాదులను కూడా ఒకొక్కనాణెము అపరాధముగా విధించి దండించవలయును. తరువాత శాస్త్రముననుసరించి ప్రాయశ్చిత్తము నాచరించవలయును.

జలాగ్యుద్బంధన భ్రష్టాః ప్రవ్రజ్యానాశకచ్యుతాః

విషప్రపతనధ్వస్తా శస్త్రఘాతహతాశ్చ యే

న చైతే ప్రత్యవసితాః సర్వలోకబహిష్కృతాః

చాంద్రాయణేన శుద్ధ్యన్తి తప్తక్రుచ్చ్రద్వయేన వా

ఉభయావసితః పాపశ్యామచ్ఛబలకాచ్యుతః

చాంద్రాయణాభ్యాం శుద్ధ్యేత దత్వా ధేనుం తథా వృషమ్

శ్వశృగాలప్లవంగాద్యైః మాను షైశ్చ రతిం వినా

స్పృష్టస్నాత్వా శుచిస్సద్యో దివాసంధ్యాసు రాత్రిషు

అజ్ఞానాద్వా తు యో భుక్త్వా చాండాలాన్నం కథంచన

గోమూత్రయావకాహారో మాసార్దేన విశుద్ధ్యతి

గోబ్రాహ్మణగృహం దగ్ధ్వ మృతంచోద్బంధనాదినా

పాశం శ్రీత్వా తథా తస్య కృత్రమేకం చరేద్ద్విజ

చాండాలపుల్కసానాం చ భుక్త్వా హత్వా చ యోషితమ్

కృచ్ఛార్థమాచరేత్ జ్ఞానాదజ్ఞానాదైందవద్వయమ్

గోపాలకాన్నభోక్తౄ రాణాం తన్నారీగామినాం తథా

ఆగమ్యాగమనే విప్రో మద్యమాంసభక్షణే

తప్తకృచ్చ్రపరిక్షిప్తో మౌర్వీహోమేన శుద్ధ్యతి

మహాపాతకకర్తారశ్చత్వారోఽథ విశేషతః

అగ్నిం ప్రవిశ్య శుద్ధ్యన్తి స్థిత్వా వామహతి కృతౌ

రహస్యకరణోఽప్యేవం మాసమభ్యస్య పూరుషః

అఘమర్షణసూక్తం వా శుద్ధ్యోదనర్జలే జపన్ రజకశ్చర్మ కారశ్చ నట్ బురుడ ఏవ చ

కైవర్త మేదభిల్లాశ్చ సప్తైతే హ్యాక్ష్యజాస్మృతాః భుక్త్వా చైషాం శ్రియో గత్వా పీత్వా యః ప్రతిగృహ్యతి

కృచ్చ్రార్థమాచరే జ్ఞానాదజ్ఞానాదైందవద్వయమ్

మాతరం గురుపత్నీం చ దుహితృభగినీస్నుషాః

సంగమ్య ప్రవిశేదగ్నిం నాన్యా శుద్ధ్విధీయతే

రాజ్ఞీం ప్రవ్రజితాం ధాత్రీం తథా వర్ణోత్తమామపి

గత్వా కృచ్చ్రద్వయం కుర్యాత్సగోత్రామభిగమ్యచ

అమూషు పితృగోత్రాసు మాతృగోత్రగతాసు చ

పరదా రేషు సర్వేషు కృచ్చ్రార్థం తపనం చరేత్

వేశ్యాభిగమనే పాపం వ్యపోహన్తి ద్విజాస్తథా

పీత్వా సకృత్సుతప్తం చ పంచరాత్రం కుశోదకమ్

గురుతల్పగతో కుర్యాద్భ్రాహ్మణో విధివదతమ్

గోఘ్నస్య కేచిదిచ్ఛన్తి కేచిచ్చైవావకీర్ణినః

దండాదూర్థ్వం ప్రహారేణ యస్తు గాం వినిపాతయేత్

ద్విగుణం గోవ్రతం తస్య ప్రాయశ్చిత్తం విశోధయేత్

అంగుష్ఠమాత్రస్థూలస్తు బాహుమాత్రప్రమాణకః

సార్ద్రకస్సపలాశశ్చ గోదండః పరికీర్తితః

గవాం నిపాతనే చైవ గోర్భోఽపి సంభవేద్యది

ఏకైకశశ్చరేత్కృచ్చమేషా గోఘ్నస్య నిష్కృతి

బంధనే రోధనే చైవ పోషణే వా గవాం రుజామ్

సంపద్యతే చేన్మరణం నిమిత్తే నైవ లిప్యతే

మూర్ఛితః పతితో వాపి దండేనాభిహతస్తతః

ఉత్థాయ షట్పదం గచ్ఛేత్సప్త పంచ దశాపి వా

గ్రాసం వా యది గృహ్ణీయాత్తోయం వాపి పిబేద్యది

సర్వవ్యాధిప్రణష్టానాం ప్రాయశ్చిత్తం న విద్యతే

కాష్ఠలోష్ట్రాశ్మభిర్గావశ్నస్త్రైర్వా నిహతా యది

ప్రాయశ్చిత్తం స్మృతం తత్ర శస్త్రే శస్త్రే నిగద్యతే

కాష్ఠే సంతాపనం ప్రోక్తం ప్రాజాపత్యం తు లోష్టకే

తప్త కృచ్ఛంతు పాషాణే శస్త్రే చాప్యతికృచ్ఛకమ్

ఔషధం స్నేహమాహారం దద్యాద్గోబ్రాహ్మణేషు చ

నీటిచే అగ్నిచే బంధనముచే ఆత్మహత్య చేసుకొనవలయునని ప్రయత్నించి విఫలమైనవారు, సన్యాసవ్రతమును భంగము చేసి పతితులైనవారు, విషపొనము చేసినవారు, పైనుండి క్రిందపడినవారు, శస్త్రప్రహారముచే ఆత్మహత్యను ప్రయత్నించినవారు ప్రాయశ్చితార్హులుకారు సమాజమున వ్యవహారమునకు యోగ్యులు కారు. అందరిచే బహిష్కరించదగినవారు. చాంద్రాయణవ్రతముచే కాని, తప్తకచవ్రతమును రెండుమార్లు ఆచరించికొని శుద్దులగుదురు. మాహాపాతకములను ఉపపాతకములను ఆచరించి భ్రష్టులైనవారు, నల్లని పశువును వినియోగించే యజ్ఞముచేయుటకు అనర్హులు. వీరు రెండు చాంద్రాయణవ్రతములచే శుద్దులగుదురు లేదా గోవును, వృషభమును దానముచే కొని శుద్దులగుదురు.కావలెనని కాక అచింతితముగా శునక జంబుక వానరాదులు, పతిత పురుషులు, పగలు, సంధ్యాసమయమున, రాత్రి పూట స్పృశించినచో వెంటనే స్నానము చేసినచో శుద్ధి కలుగును. తెలియక చండాలాన్నమును భుజించిన పోరు పది హేను రోజులు గోమూత్రములో వండిన ఆహారమును భుజించినచో శుద్దులగుదురు. బ్రాహ్మణ గృహమును, గోనివాసమును దాహము చేసినవాడు, ఉరిపోసుకొని మరణించవలయునని ప్రయత్నించినవారు, ఉరితాడును ఛేదించి ఒక కృచవ్రతము నాచరించినచో శుద్దులగుదురు. తెలియక చండాలపుల్కసుల భోజనము చేసినవారు, స్త్రీని వధించినవారు రెండు చాంద్రాయణవ్రతములగోచరించవలయును. తెలిసి చేసినచో అర్థకృచ్చవ్రతము నాచరించవలయును. గోపాలకుల అన్నమును భుజించినవారు, వారి స్త్రీలతో రమించినవారు, పొందరాని స్త్రీలను పొందినవారు, మద్యపానము చేసిన బ్రాహ్మణులు, గో మాంసభక్షణము చేసిన విప్రులు తప్తకృచ్చవ్రతముచే కాని, నూనెలో తడిపిన దారములతో హోమమును చేసిన కాని శుద్ధులగుదురు. నాలుగు మహాపాతకములను ఆచరించినవారు అగ్నిప్రవేశముతో కాని, మహాక్రతుప్రవేశముతో కాని శుద్దులగుదురు. రహస్యముగా పాపముల నాచరించినవారు ఒకనెల నీటిలో నిలిచి అఘమర్షణ సూక్తమును జపించినచో శుద్ధలగుదురు. రజకులు, చర్మ కారులు, నటులు, బురుడులు, కైవర్తులు, మేదులు భిల్లులు” అను ఏడుగురు అన్యజులు. తెలిసి వీరి అన్నమును తినిననూ, స్త్రీలతో రమించిననూ, నీరు త్రాగినను, దానము పరిగ్రహించినను అర్ధకృచవ్రత మాచరించవలయును. తెలియక చేసినచో రెండు చాంద్రాయణ వ్రతములగొచరించవలయును. తల్లిని, గురుపత్నిని, పుత్రికను, చెల్లెలును, కోడలును సంగమించినచో అగ్నిప్రవేశము తప్ప మరొక ప్రాయశ్చిత్తము లేదు. మహారాణిని, సన్యాసినిని, పెంపుడుతల్లిని, ఉత్తమవర్ణసంజాతను సంగమించినచో రెండు కృచ్చవ్రతముల నాచరించవలయును. సమాన గోత్రము కల స్త్రీని పొందినను రెండు కృచ్చవ్రతముల నాచరించవలయును. మాత్సగోత్రము కల స్త్రీలను, పిత్సగోత్రము కల స్త్రీలను, పరదారలను సంగమించినచో అర్థక్పచువ్రతము నాచరించవలయును. వేశ్యాగమనము చేసిన బ్రాహ్మణులకు కూడా అర్థకచవత్రముచే శుద్ధి కలుగును. గురుపత్నీసంగమము చేసిన బ్రాహ్మణుడు బాగుగా వేడిగా యున్న నీటిని ఒకసారి త్రాగి దర్భజలమును అయిదు మార్లు త్రాగి యథావిధిగా వ్రతము నాచరించవలయును. గో హత్య చేసిన వానికీ, మహాపాతకముల నాచరించిన వారికి కూడా ఇదే ప్రాయశ్చిత్తము నిర్ణయించబడినది. దండముతో ప్రహరించి ఆవును క్రిందపడవేసిన వానికి రెట్టింపు గోవ్రతము (గోదండము) ప్రాయశ్చిత్తముగా వీధించబడినది. అంగుష్ఠమంత లావు, బాహువంత పొడవుగానున్న పచ్చి మోదుగు దండము గోదండమనబడును. ఆ దండముతో ప్రహారమే గోవ్రతము. గోవును దండముతో ప్రహరించినపుడు గర్భపాతము సంభవించినచో ఒక్కొక్కదానికి ఒక్కొక్క కృచ్ఛవ్రతము నాచరించవలయును. ఆవును బంధించినపుడు అడ్డగించినపుడు, పోషించినపుడు గోవుకు పీడ కలిగినచో లేదా మరణము సంభవించినచో, దండప్రహారము చేయవలయును. ఆ ప్రహారముచే మూర్చపోయి లేచిన తరువాత అయిదారేడు పది అడుగులు నడిచి వెళ్ళవలయును. గడ్డి తిని నీరు త్రాగి వ్యాధి నశించినచో ప్రాయశ్చిత్తము లేదు. అనగా వ్యాధిగ్రస్తమైన గోవునకు దండముతో వ్యాధి నశించినచో ప్రాయశ్చిత్తముతో పనిలేదు. వ్యాధి లేని గోవును దండన చేసినచో అతనినిట్లు శిక్షించవలయును. ఇదే ప్రాయశ్చిత్తము. దండముతో మట్టిగడ్డలతో రాళ్ళతో ఆయుధములతో గోవును ప్రహరించినచో ఒక్కొక్క ప్రహారమునకు విడిగా ప్రాయశ్చిత్తములు చెప్పబడినవి. దండప్రహారముతో డురణించినచో సాంతపనప్రతమును, మట్టిగడ్డతో మరణించినచో ప్రాజాపత్య వ్రతమును పొషాణ ఘాతమునకు తప్త కచ్ఛవ్రతమును, శస్త్రఘాతమునకు ఆబను ఆచరించి గో బ్రాహ్మణులకు ఔషధమును, ఆహారమును తెలమును దానము చేయవలయును. ఒకవేళ దానము చేసిన ఔషధాదులు సేవించుట వలన మరణము సంభవించిన చో ప్రాయశ్చిత్తముతో పని లేదు.

దీయమానే విపత్తిః స్యాత్ప్రాయశ్చిత్తం తదా న హి

తైలభేషజపానే చ భేషజానాం చ భక్షణే

విశల్యకరణే చైవ ప్రాయశ్చిత్తం న విద్యతే

వత్సానాం కంఠబంధన క్రియయా భేషజేన తు

సాయం సంగోపనార్థం చ త్వదోషో రోషబంధయోః

పాదే చైవాస్య రోమాణి ద్విపాదే శ్మశ్రు కేవలమ్

త్రిపాదే తు శిఖావర్తం మూలే సర్వం సమాచరేత్

సర్వాన్కేశాన్సముద్ధృత్య భేదయేదంగులద్వయమ్

ఏవమేవ తు నారీణాం ముండనం శిరసస్స్మృతమ్

న శ్రియా వపనం కార్యం న చ వీరాసనం స్మృతమ్

న చ గోష్థే నివాస్కోఽ స్తి న గచ్చన్తీ మనువ్రజేత్

రాజా వా రాజపుత్ర వా బ్రాహ్మణో వా బహుశ్రుతః

అకృత్వా వపనం తేషాం ప్రాయశ్చిత్తం వినిర్ధి తేల్

కేశానాం రక్షణార్థం చ ద్విగుణం వ్రతమాచరేత్

ద్విగుణీ తు ప్రతే చీర్ణే ద్విగుణా వ్రతదక్షిణా

పాపం న క్షీయతే హన్తుర్దాతా చ నరకం వ్రజేత్

అశ్రౌతస్మార్తవిహితం ప్రాయశ్చిత్తం వదన్తి యే

తాన్దర్మ విఘ్నకర్తౄంశ్చ రాజా దండేన పీడయేత్

న చైతాన్పీడయేద్రాజా కథంచిత్కామమోహితః

తత్పాపం శతథా భూత్వా తమేవ పరిసర్పతి

ప్రాయశ్చిత్తే తతశ్చీర్ణే కుర్యాద్భ్రాహ్మణభోజనమ్

వింశతిర్గా వృష శ్చైకం దద్యాత్తేషాం చ దక్షిణామ్

క్రిమిభిస్తృణసంభూతైర్మక్షికాదినిపాతితైః

కృచ్చ్రార్థం ప్రకుర్వీత శక్త్యా దద్యాచ్చ దక్షిణామ్

ప్రాయశ్చిత్తం చ కృత్వా వై భోజయిత్వా ద్విజోత్తమాన్

సువర్ణమానికం దద్యాత్తతః శుద్ధిర్విధీయతే

చాండాలశ్వపచైస్పష్టే నిశి స్నానం విధీయతే

న వ సేత్తత్ర రాత్రౌ తు సద్యస్నానేన శుద్ధ్యతి

వ సేదథ యదా రాత్రావజ్ఞానాదవిచక్షణః

తదా తస్య తు తత్పాపం శతథా పరివర్తతే

ఉద్గచ్ఛన్తి చ నక్షత్రాణ్యుపరిష్టాచ్ఛ యే గ్రహాః

సంసృష్టే రశ్మభి స్తేషాముదకస్నానమాచరేత్

యాశ్చాన్తర్జలవల్మీ కమూషికోషరవర్త్మసు

శ్మశానే శౌచశే షే చ న గ్రాహ్యాః సప్తమృత్తిక్కా

ఇష్టాపూర్తం తు కర్తవ్యం బ్రాహ్మణేన ప్రయత్నతః

ఇష్టేన లభతే స్వర్గం మోక్షం పూర్తేన చాప్నుయాత్

విత్త క్షేపో భవేదిష్టం తడాగం పూర్తముచ్యతే

ఇచ్చిన ఔషధమును కాని, తైలమును కాని పానము చేసినపుడు మరణము సంభవించినచో ఇచ్చిన వారికి ప్రాయశ్చిత్తముతో పనిలేదు. దూడలకు మందు త్రాగించుటకు కంఠమున త్రాడు కట్టునపుడు, సాయంకాలము రక్షణ కొఱకు బంధించినపుడు దోషము లేదు. పాదప్రాయశ్చిత్తమునకు కేశములను కర్తనము చేయవలయును. రెండు పాదముల ప్రాయశ్చిత్తమునకు మీసములు తీయవలయును. మూడు పాదముల ప్రాయశ్చిత్తమునకు శీఖను, పూర్తి ప్రాయశ్చిత్తమునకు సంపూర్ణముగా క్షౌరము చేయవలయును. స్త్రీకి ప్రాయశ్చిత్తము చేయవలసివచ్చినపుడు మొత్తము కేశములను పట్టుకొని రెండంగులములను మాత్రము కర్తనము చేయవలయును, స్త్రీలకు ఇదియే శిరోముండనము. స్త్రీలకు పూర్తిగా వపనము కొని, వీరాసనము కాని వీధించబడియుండలేదు. స్త్రీలకు గోశాలలో నివాసము కాని, నడుచుచున్న ఆవు వెంట వెళ్ళుట కాని విధించబడలేదు. రాజు కాని, రాజపుత్రుడు కాని, విద్వాంసుడైన బ్రాహ్మణుడు కాని పాపమును ఆచరించినచో శిరోముండనము కాక ఇతర ప్రాయశ్చిత్తము నాచరించవలయును. కేశరక్షణ కొఱకు రెట్టింపు వ్రతముల నాచరించవలయును. రెట్టింపు వ్రతము నాచరించి రెట్టింపు దక్షిణల నీయవలయును. శ్రుతి స్మృతులలో విధించబడని ప్రాయశ్చిత్తమును చెప్పినచో హంతకునికి పాపము నశించదు. చెప్పినవాడు నరకమునకు వెళ్ళును. అట్లు ధర్మమునకు వీఘ్నములను కల్పించువారిని రాజు దండించవలయును. ఇట్లు ధర్మ విఘాతకలను రాజు కామమోహితుడై దండించనిచో అతని పాపము నూరు రెట్లు పెరిగి రాజును పీడించును. ప్రాయశ్చిత్తము జరిపిన తరువాత బ్రాహ్మణ భోజనమును జరిపించవలయును. ఇరువది ఆవులను ఒక వృషభమును బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వవలయును. గోవును దండాదులచే ప్రహారము చేసినపుడు గాయమేర్పడి గడ్డిలో పుట్టిన పురుగులచే మక్తి కొదులచే గాయము పెరిగినపుడు అర్ధకృచ్ఛవ్రతము నాచరించవలయును. శక్తి ననుసరించి దక్షిణ నీయవలయును. ప్రాయశ్చిత్తము నాచరించి బ్రాహ్మణులకు భోజనమునుంచి కొంచెము బంగారమును దానము చేసి శుద్ధిని పొందును. రాత్రిపూట చండాల శ్వపచుల స్పర్శ ఏర్పడినపుడు రాత్రిలేనిచో వెంటనే స్నానముచే శుద్ది కలుగును. ఒకవేళ స్పర్శ కలిగినచో ప్రాతఃకాలమున స్నానముచే శుద్ధి యేర్పడును. తెలియక రాత్రి అంతయు చండాలాదులతో కలిసి యున్నచో ఆ పాపము నూరురెట్లు పెరుగును. గ్రహములు కాని, నక్షత్రములు పైనుండి వెళ్ళుచున్నపుడు కిరణస్పర్శ కలిగినచో జలస్నానముచే శుద్ధి యేర్పడును. నీటిలోపలనున్న మట్టిని, పుట్టలోని మట్టిని, మూషిక బిలములోని మట్టిని, చౌడు భూమిలోని మట్టిని, మార్గములోని మట్టిని, శ్మశానములోని మట్టిని, శౌచశేషములోని మట్టిని ఈ సప్తమృత్తికలను గ్రహించరాదు. బ్రాహ్మణుడు గట్టి ప్రయత్నముతో నైనను ఇష్టాపూర్తమును ఆచరించవలయును. ఇష్టముచే స్వర్గము, పూర్తముచే మోక్షము లభించును. ద్రవ్యమును విరివిగా దానము చేయుట ఇష్టమనబడును. తటాకాదులను నిర్మించుట పూర్తమనబడును.

ఆరామాంశ్చ విశేషేణ దేవద్రోస్తథైవ చ

వాపీకూపతగాగాని దేవతాయతనాని చ

పతితాన్యుద్ధరేద్యస్తు స పూర్తఫలమశ్నుతే

శుక్లాయా ఆహరేన్మూత్రం కృష్ణాయాః గోశ్శకృత్తథా

తామ్రాయాశ్చ పయో గ్రాహ్యం శ్వేతాయాశ్చ దధి స్మృతమ్

కపిలాయా ఘృతం గ్రాహ్యం మహాపాతకనాశనమ్

కు శైస్తీర్దనదీతోయైః సర్వద్రవ్యం పృథక్ పృథక్

ఆహృత్య ప్రణనైవ ఉత్థాప్య ప్రణవేన చ

ప్రణవేన సమాలోడ్య ప్రణవేనైవ సం పిబేత్

పాలాశే మధ్యమే పర్ణే భాండే తామ్రమయే శుభే

పిబేత్పుష్కరపర్ణే వా మృణ్మయే వా కుశోదకమ్

సూతకే తు సముత్పన్నే ద్వితీయే సముపస్థితే

ద్వితీయే నాస్తి దోషస్తు ప్రథమేనైవ శుద్ధ్యతి

జాతేన శుధ్యతే జాతం మృతేన మృతకం తథా

గర్భసంస్రవణే మా సే త్రీణ్యహాని వినిర్దిశేత్

రాత్రిభిర్మాసతుల్యాభర్గర్భస్రావే విశుద్ధ్యతి

రజస్యుపరచే సాధ్వీ స్నానేన స్త్రీ రజస్వలా

స్వగోత్రాద్బ్రశ్యతే నారీ వివాహాత్సప్తమే పదే

స్వామిగోత్రేణ కర్తవ్యాస్తస్యాః పిండోదకక్రియాః

ఉద్దేశ్యం పిండదానే స్యాత్పిండే పిండే ద్వినామతః

షణ్ణాం దేయాస్త్రయః పిండా ఏవం దాతా న ముహ్యతి

స్వేన భర్త్రా సహస్రాబ్దం మాతా భుక్తా సుదైవతమ్

పితామహ్యపీ స్వేనైవ స్వేనైవ ప్రపితామహీ

వర్షే వర్షే తు కుర్వీత మాతా పిత్రోస్తు సత్కృతిమ్

అదైవం భోజయేచ్చ్రాద్ధం పిండమేకం తు నిర్వ పేత్

నిత్యం నైమిత్తికం కామ్యం వృద్ధిశ్రాద్ధమథాపరమ్

పార్వణం చేతి విజ్ఞేయం శ్రాద్ధం పంచవిధం బుధైః

గ్రహోపరాగే సంక్రాన్తౌ పర్వోత్సవ మహాలయే

నిర్వ పేత్త్రీన్నరః పిండానేకమేవ మృతేఽహని

అనూడా న పృథక్కన్యా పిండే గోత్రే చ సూతకే

పాణిగ్రహణమంత్రాభ్యాం స్వగోత్రాద్బ్రుశ్యతే తతః

యేన యేన తు వర్ణేన యా కన్యా పరిణీయతే

తత్సమం సూతకం యాతి తథాపిండోదకేఽపి చ

వివాహే చైవ సంవృత్తే చతుర్దేఽహని రాత్రిషు

ఏకత్వం సా ప్రజేద్ఛర్తుః పిండే గోత్రే చ సూతకే

ప్రథమేఽహ్ని ద్వితీయే వా తృతీయే వా చతుర్థకే

అస్థిసంచయనం కార్యం బంధుభిర్హితబుద్ధిభిః

చతుర్థే పంచమే చైవ సప్తమే నవమే తథా

అస్థిసంచయనం ప్రోక్తం వర్ణానామనుపూర్వశః

ఏకాదశా హే (పేతస్య యస్య చోత్సృజ్యతే వృషః

ముచ్యతే పేతలోకాత్స స్వర్గలోకే మహీయతే

నాభిమాత్రే జలే స్థిత్వా హృదయేన తు చింతయేత్

ఆగచ్ఛన్తు మే పితరో గృష్ణన్త్వేతాఞ్జాలాంజలీన్

హస్తౌ కృత్వా తు సంయుక్తా పూరయిత్వా జలేన చ

గోశృంగమాత్రముగ్ధృత్య జలమధ్యే వినిక్షిపేత్

ఆకాశే చ క్షి పేద్వారి వారిస్థో దక్షిణాముఖః

పితృణాం స్థానమాకాశం దక్షిణ దిక్ తథైవ చ

ఆపో దేవగణాః ప్రోక్తా ఆపః పితృగణాస్తథా

తస్మాదస్య జలం దేయం పితృణాం హితమిచ్ఛతా

దివా సూర్యాంశుసంతప్తం రాత్రౌ నక్షత్రమారుతైః

మధ్యయోరప్యుభాభ్యాం చ పవిత్రం సర్వదా జలమ్

స్వభావయుక్తమవ్యక్తమమేధ్యేన సదా శుచిః

భాండస్థం ధరణీస్థం వా పవిత్రం సర్వదా జలమ్

దేవతానాం పితృణాం చ జలం దద్యాజ్జలాంజలీన్

అసంస్కృతప్రమీతానాం స్థలే దద్యాద్విచక్షణః

శ్రాద్ధే హవనకాలే చ దద్యాదే కేన పాణినా

ఉభాభ్యాం తర్పణే దద్యాదేష ధర్మో వ్యవస్థితః

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణే పూర్వభాగే ప్రథమపాదే ధర్మశాన్తినిర్దేశో నామ చతుర్దశోఽధ్యాయః

జీర్ణములైన ఆరామములను, దేవాలయములను, వాపీ కూప తటాకములను ఉద్దరించిన వారికి కూడా పూర్తి ఫలము లభించును. శుక్లగోవు నుండి మూత్రమును, కృష్ణగోవునుండి పేడను, తామ్రవర్ణపు గోవు నుండి పాలను, శ్వేతగోవు నుండి పెరుగును, కపిలగోవు నుండి నేతిని తీసుకొని పంచగవ్యమును సిద్ధము చేసుకొనవలయును. ఇట్లు సిద్ధము చేసిన పంచగవ్యము మహాపాతకములను నశింపచేయును. దర్బలచే తీర్థ నదీ జలముచే పంచగవ్యములోని ప్రతిద్రవ్యమును విడివిడిగా ప్రణవముతో కలుపవలయును. ప్రణవముతో పైకి తీసుకొనవలయును. ప్రణవముతో చక్కగా ఆలోడనము చేసి ప్రణవముతో పానముచేయవలయును.మోదుగాకులో కాని, రాగి కలశములో కాని, తామరాకులో కాని, మట్టి పాత్రలో కాని దర్భలతో నుంచి పానము చేయవలయును. సూతకము (ఆశౌచము) ఒకటి వచ్చిన అది పూర్తి కాకమునుపే మరియొక సూతకము వచ్చినచో తరువాత వచ్చిన సూతక దోషము మొదటి దానితో పోవును. జాతాశౌచముతో జాతాశౌచము, మృతాశౌచముతో మృతాశౌచము తొలగిపోవును. గర్భస్రావము జరిగినచో మూడుదినములు ఆశౌచముండును. ఎన్ని మాసముల గర్భస్రావమైనచో అన్ని దినములు ఆశౌచముండును. రజస్వల అయిన స్త్రీ రజోదర్శనము ' ముగిసినపుడు స్నానముచే శుద్ది పొందును. వివాహమున ఏడడుగులు నడచుటచే స్త్రీ తన గోత్రమునుండి విడిపోవును. ఆ స్త్రీకి పిండోదకకర్మలు భర్త గోత్రముచే చేయవలయును. పిండదానమునకు ప్రతి పిండమును రెండు పేర్లతో ఇచ్చుట ఉద్దేశ్యము. కావుననే ఆరుగురికి మూడు పిండములుంచవలయును. ఇట్లు చేసినచో దాత మోహమును, చెందడు. మాత తన భర్తతో వేయి సంవత్సరములు పిండములను భుజించును. అట్లే పితామహికూడా తన భర్తతో వేయి సంవత్సరములు భుజించును. ఇట్లే ప్రపితామహి కూడా అని తెలియవలయును. తలిదండ్రులకు ప్రతి సంవత్సరము శ్రాద్దమును జరుపవలయును. విశ్వేదేవతారహితముగా శ్రాద్దము జరుపపలయును. ఒక పిండమును అర్పించవలయును. నిత్యము నైమిత్తకము, కామ్యము, వృద్ధిశ్రాద్ధము, పార్వణము. అని శ్రాద్ధము అయిదు విధములు. గ్రహణ సమయమున, సూర్య సంక్రమణమున, పర్వదినములలో, ఉత్సవ. దీనములలో మూడు పిండముల నుంచవలయును. ఆబ్దికమున ఒక పిండమునుంచవలయును. వివాహము కొని కన్యకు పిండదానమున సూతకమున విడిగా గోత్రముండదు. వివాహమైన తరువాత వేరు గోత్రముండును. యే వర్ణముతో కన్యావివాహము జరుగునో ఆ వర్ణముతోనే సూతకము పింగోదకములు జరుగును. వివాహము జరిగిన తరువాత నాలుగవ దినము రాత్రినుండి కన్య భర్త గోత్రముతో ఏకత్వమును పొందును. మరణించిన దినమున కాని, రెండు మూడు నాలుగవ దినములలో హిత బుద్ధులైన బంధువులు అస్థి సంచయనమును పంచదశోధ్యాయః చేయవలయును. వర్ణానుక్రమముగా నాలుగు అయిదు ఏడు తొమ్మిది దినములలో అస్తి సంచయనము చేయవలయునని చెప్పబడినది. చనిపోయిన తరువాత పదకొండవదినమున వృషభమును వదిలినచో పేతలోకమునుండి విడివడి స్వర్గలోకమును చేరును. నాభిమాత్రజలమున నిలిచి హృదయమున ధ్యానము చేయవలయును. ఓ పితృదేవతలారా ! మీరొచ్చి ఈ జలాంజలులను స్వీకరించుడు. రెండు చేతులను దగ్గరికి చేర్చి నీటితో నింపి గోశృంగ పర్యంతము పైకి హస్తములు తెచ్చి నీటి మధ్యలో విడువవలయును. నీటిలో దక్షిణాముఖముగా నిలిచి జలమును ఆకాశమున చల్లవలయును. ఆకాశము పితృస్థానము. పితరుల దిక్కు దక్షిణము. జలములు దేవగణములు. జలములే పిత్సగణములు. కావున పితరుల హితమును కోరువారు పితరులకు జలతర్పణము చేయవలయును. పగలు సూర్యకిరణములచే తప్తములై, రాత్రి నక్షత్రములచే వాయువుచే, మధ్యకాలమున రెంటిచే జలములు పవిత్రములగుచున్నవి. సహజముగా జలము కలశములో నున్నను, భూమి పై నున్నను సర్వదా పవిత్రమే. దేవతలకు, పితరులకు జలాంజలీయవలయును. సంస్కారరహితులై మరణించినవారికి స్థలమున జలతర్పణము చేయవలయును. శ్రాద్ధమున హోమ సమయమున ఒక చేతితో నీయవలయును. తర్పణమున రెండు చేతులతో నీయవలయును అని ధర్మము వ్యవస్థీకరించబడినది.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున ధర్మశాంతి నిర్దేశమను పదునాలుగవ అధ్యాయము సమాప్తము.