నారద మహా పురాణము
12 - సమయకరణమ్
వసిష్ఠ ఉవాచ :-
వ్యాహృతే శోభనే వాక్యే మోహిన్యా నృపతిస్తదా ।
ఉన్మీల్య నేత్రే రాజేన్ద్ర శతపత్ర నిభే తధా
సగద్గదమువాచేదం ముగ్దో మోహిని దర్శనాత్ ।
మయా బాలే సుబహుశః పూర్ణచన్ద్ర నిభాననాః
దృష్టా ప్రధానుభూతాశ్చ నేదృ గ్దృ ష్టం వపుః క్వచిత్ ।
యాదృశం త్వం ధారయసే రూపం లోక విమోహనమ్
సో హం దర్శనమాత్రేణ త్వదీయేన వరాననే ।
మనోభవ శరైర్విద్ధః పతితస్సహసా క్షి తౌ
అజల్పిత వచో దేవి ! మోహిత స్తవతేజసా
కురు ప్రసాదం కరభోరు మహ్యం దాస్యామి సర్వం తవచిత్త సంస్థమ్ ।
నాదేయ మ స్తీ హ జగత్రయేపి తవాను రాగేణ నిబద్ధచేతసః
ఇమాం ధరాం భూధర భూషితాంగీం సముద్ర వస్త్రాం శశిసూర్యనేత్రాం ।
ఘనస్తనీం వ్యోమసుబద్ధ దేహాం నిష్కాననాం సుందరి వామశీలామ్
పాతాల గుహ్యాం బహు వృక్ష రోమ్ణిం సప్తాధరాం సుభ్రు తవాస్మి దాతా ।
సకోశ బద్ధాం గజవాజి పూర్ణాం సమన్త్రి హృద్యాం నగరై స్సమేతామ్
ఆత్మానమపి దాస్యామి తవ చార్వంగి సంగమే ।
కిం పునర్ద నరత్నాది ప్రసీద మమ మోహిని !
నృపస్య వచనం శ్రుత్వా మోహినీ మధురాక్షరమ్ ।
సమువాచ స్మితం కృత్వా తము త్దా ప్య నృపం తదా
న ధరాం భూధరోపేతాం వరమే వసుధాధిప ! ।
యద్వదిష్యా మ్యహం కాలే తత్కార్యమవి శంకయా
భజిష్యామి న సందేహః కురుష్వ సమయం మమ ।
వసిష్ఠ మహర్షి పలికెను :-
ఇట్లు మోహిని హృద్యముగా మాటలాడగా పద్మముల వంటి నేత్రములను తెరిచి, మోహినిని చూచుటచే ముగ్ధుడై గద్గద స్వరముతో నిట్లు పలికెను. ఓ బాలా నేను చాలా మంది సౌందర్యవంతులను చూచియుంటిని. అనుభవించి యుంటిని. కానీ, ఇంతటి సుందర దేహమును చూచి యుండలేదు. నీవు ధరించిన రూపము లోకమోహనము. ఇట్టి నీ రూపమును చూచినంతనే మన్మధ బాణములచే కొట్టబడి భూమిపై పడితిని. నీ తేజస్సుచే మోహించబడి మాటలు వచ్చుట లేదు. కావున ఓ కర భోరూ? నా యెడ ప్రసన్ను రాలవు కమ్ము. నీ మనసులో నున్నదంతయూ ఇచ్చెదను. నీ అనురాగముచే బద్ద చిత్తడగు వానికి ఈయరానిదేదియు నుండదు. భూధర భూషితాంగి, సముద్ర వస్త్ర, శశిసూర్యనేత్ర, ఘనస్తని, వ్యోమ సుబద్ద దేహ, నిష్కానన, వామశీల, పాతాలగుహ్య, బహువృక్ష రోమ, సప్తధర, సకోశబద్ద, గజవాజిపూర్ణ, సమన్త్రి హృద్య, నగర సమేతయగు ఈ భూమినీయగలను. నీ సంగమముకొరకు నన్ను కూడా ఇచ్చుకోగలను. ఇక ధనరత్నముల గూర్చి చెప్పనేల? కావున నా యెడ ప్రసన్నురాలవు కమ్ము. అనగా రాజును లేపి, మధురమగు మాటలతో ఇట్లు పలికెను. ఓ రాజా? పర్వతములతో కూడియున్న భూమిని నేనడుగుట లేదు. సమయమొచ్చినపుడు నేను చెప్పిన పనిని శంకించక చేయవలయును. అపుడు సందేహము లేకనే నిన్ను సేవించెదను. అట్లు శపథమును చేయుము.
యేన సంతుష్య సే దేవి ! సమయం తం కరోమ్యహమ్
దశావస్ధాం గతో దేహో మమ త్వ త్సంగమం వినా ।
రాజు పలికెను :-
ఓ దేవీ ! నీవే శపథముచే తృప్తి చెందదవో ఆ శపథమును చేసెదను. నీ సంగమము లేనిచో నా శరీరము దశావస్థలను పొందుచున్నది.
మోహిన్యువాచ :-
దీయతాం దక్షిణో హస్తో బహుధర్మ కరస్తవ
యేన మే ప్రత్యయో రాజన్ ! వచనే తావకే భవేత్ ।
రాజా త్వం ధర్మశీలో సి సత్యకీర్తి ర్జగ త్త్ర యే
నవక్తాస్యనృతం కాలే మా ర్గో యం లౌకికః కృతః ।
ఏవం బ్రువాణాం రాజేన్ద్రోమోహినీం ఇచ్ఛయాతురః
అబ్రవీన్ప్న పతిస్తాం తు సుప్రసన్నమనా నృప ।
జన్మ ప్రభృతి వామోరు నానృతం భాషితం మయా
స్యైరేష్వపి విహారేషు కదాపి వరవర్ణిని ।
అధవా వ్యాహృతైర్వాక్యై: కిమేభిః ప్రత్యయాక్షరైః
దత్తో హ్యేష మయా హస్తో దక్షిణః పుణ్యలాంఛనః ।
యన్మయా సుకృతం కించి తృతమాజన్మ సుందరి!
తత్సర్వం తవ వామోరు యది కుర్యాన్నతేవచః ।
ఆన్తరే హ్యేష దత్తోమే ధర్మో భార్యా భవాంగనే
తవ రూపేణ మే క్షోభ స్సహసా ప్రత్యుపస్థితః ।
ఋతధ్వజసుతశ్చాహం నామ్నా రుక్మాంగదో నృపః
ఇక్ష్వాకువంశసంభూత స్సుతో ధర్మాంగదో మమ ।
మృగవ్యాజేన గహనం ప్రవిష్టశ్చారులోచనే
తతో దృష్టా వనే హృద్యో వామదేవాశ్రమో మయా ।
మునినా జల్పితం తత్ర కించిత్తేన విసర్జితః
ఆరుహ్య వాహనశ్రేష్ఠం మన్దరం ద్రష్టుమాగతః ।
భ్రమమాణో గిరివరం కుతూహలమనాస్తదా
ప్రాప్తం మఛ్ఛ్రవణీ గీతం తవవక్త్రవినిర్గతమ్ ।
తేన గీతేన చాకృష్ట స్త్యత్సమిపముపాగతః
దృష్టే: పధమనుప్రాప్తా మమ త్వం చారులోచనే ।
తతోహం మూర్ఛితో దేవి! విసంజ్ఞః పతతః క్షితౌ
సాంప్రతం చేతనాయుక్త స్తవవాక్యామృతేన హి ।
పునర్జాతమివాత్మానం మన్యేహం లోకమోహిని!
ప్రత్యుత్తరప్రదానేన ప్రసాదం కర్తుమర్హసి ।
నృపేణైవ సముద్దిష్టా మోహిన్యాహోత్తరంవచః
అహం బ్రహ్మభవా రాజం స్త్వదర్థం సముపాగతా ।
శ్రుత్వా కీర్తిం స్మరోపేతా మందరం కనకాచలమ్
పరిత్యజ్య సురాన్సర్వా న్విశ్వంభరపురోగమాన్ ।
సమాహితమనాస్త్యత్ర తపాస్యా నిరతా స్థితా
సంపూజయన్తి దేవేశం గీతదానేన శంకరమ్ ।
గీతదానమహం మన్యే సురాణామతివల్లభమ్
సర్వదానాధికం భూప హ్యనంతగతిదాయకమ్ ।
యేన తుష్టః పశుపతి స్సద్యః ప్రత్యుపకారకః
ఈ ప్సితోయం మయా ప్రాప్తో భవానవనిపాలకః ।
అభిప్రీతోసి మే రాజ న్నభిప్రీతాహ్యహం తవ
తమేవముక్త్యా ద్విజరాజవక్రా కరం గృహీత్వా నృపతేస్తు వేగాత్ ।
ఉత్థాపయామాస ధరాశయాన మింద్రస్య యష్టీమివ మోహినీ సా
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే సమయకరణం నామ ద్వాదశోధ్యాయః ॥
మోహినిపలికెను:- ఓరాజా? అనేకధర్మములనాచరించియున్న నీదక్షిణహస్తమును నాచేతిలోనుంచుము. అపుడు నీమాటపై నాకు విశ్వాసము కలుగును. ఈ మూడు జగములలో నీవు ధర్మశీలుడవగురాజువు. సత్యకీర్తివి. అవసరమున్నపుడు కూడా అసత్యమును మాటలాడవు. ఇది లౌకికమార్గము. ఇట్లు మోహిని పలుకుచుండగా కామముచే పీడించబడు రాజు సుప్రసన్నమగు మనసుతో ఇట్లు పలికెను. ఓ వామోరూ? నేను పుట్టిన నాటినుండి యధేచ్ఛావిహారములలో కూడా ఎపుడూ ఆ బద్ధమును మాటలాడలేదు. అయినను ఈనమ్మకమును కలిగించువట్టిమాటలేల? ధర్మమునకు చిహ్నమగునా ఈ దక్షిణహస్తమును ఇచ్చుచున్నాను. నేను నీమాటను చేయనిచో పుట్టిన నాటినుండి నేను చేసిన పుణ్యకర్మలఫలమంతయూ నీకు చేరును. ఇదిగో నాహస్తమునిచ్చుచున్నాను. ధర్మబద్ధముగా నాకు భార్యవు కమ్ము. నీరూపముచే నాకు తాపము కలుగుచున్నది. నేను ఋతధ్వజునిపుత్రుడను. నాపేరు రుక్మాంగదుడు. ఇక్ష్వాకువంశ సంభూతుడను. నాపుత్రుడు ధర్మాంగదుడు. నేను వేటయను మీషచే అరణ్యమునకు వచ్చితిని. ఆయరణ్యమున సుందరమగు వామ దేవమహర్షి యాశ్రమమును చూచితిని. అచట వామదేవమహర్షి నీకు అన్నియు సమకూరునని చెప్పెను. అటనుండి అశ్వమునధిరోహించి మందరపర్వతమున తిరుగుచుండగా నీగానము నాచెవిన బడినది. ఆగానముచే ఆకర్షింపచబడి నీసమీపమునకు చేరితిని. నీవు నాచూపున పడితివి. అంతట నేను స్పృహను కోల్పోయి మూర్ఛిల్లితిని. నీవాక్యామృతముచే ఇపుడే స్పృహ వచ్చినది. ఓలోకమోహినీ నాకు మరల జన్మ లభించినదని తలచుచున్నాను. నామాటలకు బదులు పలికి నన్ను అనుగ్రహించుము. రాజిట్లుపలుకగా మోహినీదేవి ఈవిధముగా బదులుపలికెను. నేనుబ్రహ్మమానసపుత్రుని. నీకొరకే ఇటకొచ్చితిని. నీకీర్తిని విని మదనపీడితనై మందరపర్వతమునకు వచ్చితిని. బ్రహ్మ మొదలగు దేవతలనందరిని విడిచివచ్చితిని. ఇచట సావధానమగు మనసుతో తపస్సును చేయుచున్నాను. శంకరుని గీత దానముచే పూజించుచున్నాను. గీతదానము దేవతలకు అతిప్రియమని తలచుచున్నాను. ఈగీతదానము అన్నిదానములలో ఉత్తమదానము అనన్తమగు మోక్షమును ఇచ్చునది. ఈగీతదానము. ఆనన్తమగు మోక్షమును ఇచ్చునది. ఈగీతదానముచే శంకరుడు ప్రీతిచెంది వెంటనే ఉపకార మును చేయును. నేను కోరిన రాజువగు నీవు నన్ను చేరితివి. నన్ను మెచ్చితివి. నేనుకూడా నిన్ను వరించుచున్నాను. ఇంద్రుని యష్టివలె నున్న యామోహిని రాజుతోఇట్లుపలికి భూమిమీద పరుండి యున్న రాజును చేయిపట్టుకొని లేపెను.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున ఉత్తరభాగమున సమయకరణమను పన్నెండవ అధ్యాయము.
Summary of chapter 139 of the Nārada Mahā Purana is as follows:
శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావ భూమియైన మథుర మరియు నిత్య రాసలీలా భూమియైన బృందావన క్షేత్ర మాహాత్మ్యము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. యమునా నదీ స్నానము, బృందావన పరిక్రమ మరియు కృష్ణ భక్తి రస వైభవము ఇక్కడ అభివర్ణించబడినవి.