104 - స్కన్దపురాణానుక్రమణి

శ్రీ మద్భాగవతస్యాత్ర మాహాత్మ్యం కీర్తితం పరమ్

వజ్రశాండిల్య సంవాద అంతర్లీలాప్రకాశకమ్

తతో మాఘస్య మాహాత్మ్యం స్నానదాన జపోద్భవమ్

నానాఖ్యానసమాయుక్తం దశాధ్యాయైర్నిరూపితమ్

తతో వైష్ణవమాహాత్మ్యే శయ్యా దానాదిజం ఫలమ్

జలదానాది విధయః కామాఖ్యానమతః పరమ్

శ్రుత దేవస్య చరితం వ్యాధోపాఖ్యానమద్భుతమ్

తధాక్షయతృతీయాదేర్విశేషాత్పుణ్య కీర్తనమ్

తతస్త్వయోధ్యామాహాత్మ్యే చక్ర బ్రహ్మాహ్వతీర్థకే

సురాపాపవిమోక్షాఖ్యే తథాధారసహస్రకమ్

స్వర్గద్వారం చన్దహరి ధర్మహర్యుపవర్ణనమ్

స్వర్ణవృష్టేరుపాఖ్యానం తిలోదా సరయూయుతిః

సీతాకుండం గుప్తహరి సరయూ ఘర్ఘరాన్వయః

గోప్రచారం చ దుగ్గేదం గురుకుండాది పంచకమ్

సోమార్కాదీని తీర్థాని త్రయోదశ తతః పరమ్

గయా కూపస్య మాహాత్మ్యం సర్వాఘ వినివర్తకమ్

మాండవ్యాశ్రమ పూర్వాణి తీర్థాని తదనన్తరమ్

అజితాది మానసాది తీర్థాని గదితాని చ

ఇత్యేష వైష్ణవః ఖండో ద్వితీయః పరికీర్తితః

ఇక రెండవది వైష్ణవ ఖండము. ఇపుడు వైష్ణవ ఖండములోని ఆఖ్యానములను వినుము. ఈ ఖండమున మొదట భూమి వారాహ సమాఖ్యానము చెప్పబడినది. ఈ సమాఖ్యానమున వేంకటాచల మాహాత్మ్యము సకల పాప నాశనము వర్ణించబడినది. లక్ష్మీ దేవి యొక్క పవిత్ర కథ, శ్రీనివాస స్థితి, కులాల చరిత్ర, సువర్ణముఖరీ నది, నానాఖ్యాన సమన్వితమగు భారద్వాజ కథ, మతంగాంజన సంవాదము, పురుషోత్తమ మాహాత్మ్యము కీర్తించబడినది. మార్కండేయ చరిత్ర, అంబరీష కధ, ఇంద్రద్యుమ్న కథ, విద్యాపతి కథ, జైమిని ఉపాఖ్యానము, నారదోపాఖ్యానము, నీలకంఠ సమాఖ్యానము, నరసింహోప వర్ణనము, అశ్వమేధ కథ, బ్రహ్మలోక గతి, రధయాత్రావిధి, జన్మస్థాన విధి, దక్షిణామూర్త్యు పాఖ్యానము, గుండెవాఖ్యానము, రథ రక్షా విధానము, శయనోత్సవ కీర్తనము, శ్వేతో పాఖ్యానము, పృధూత్సవ నిరూపణము, డోలోత్సవము, భగవద్ర్వతము, ఉద్దాలకుని నియోగము వలన విష్ణువు యొక్క అకామిక పూజ, నానాయోగ నిరూపణలు కల యోగసాధనము, దశావతార కధనము, స్నానాది పరికీర్తనము, పాపనాశనమగు బదరికా మాహాత్మ్యము, అగ్న్యాది తీర్థ మాహాత్మ్యము, వైనతేయ శిలా భవము, భగవద్వాస కారణము, కపాలమోచన తీర్థము, పంచధారా తీర్థము, మేరు సంస్థాపనము వర్ణించబడినది. ఇక కార్తీక మాహాత్మ్యమున మదనాలస మాహాత్మ్యము, ధూమకేశ సమాఖ్యానము, కార్తీక మాసమున దిన కృత్యములు, పంచ భీష్మవతా ఖ్యానము భుక్తిముక్తి దములుగా వర్ణించబడినవి. ఇక మార్గశిర మాహాత్మ్యమున స్నాన విధానము, పుండ్రాది కీర్తనము, మాలాధారణ పుణ్యకము పంచామృత స్నానము వలన కలుగు పుణ్యము. ఘంటానాదాది జన్మ ఫలము, నానా పుష్పార్చన ఫలము, తులసీదల జప ఫలము, నైవేద్య మాహాత్మ్యము, హరివాసర కీర్తనము, అఖండైకాదశీ పుణ్యము, జాగరణ పుణ్యము, ఉత్సవ విధానము, నామ మాహాత్మ్య కీర్తనము, ధ్యానాది పుణ్య కథనము, మధురా మాహాత్మ్యము, మధురా తీర్థ మాహాత్మ్యము, వన మాహాత్మ్యము, శ్రీ మద్బాగవత మాహాత్మ్యము, అంతర్లీలో ప్రకాశకమగు వజ్రశాండిల్య సంవాదము, మాఘ మాసమున చేయు స్నానదాన జపోద్భవ మాహాత్మ్యము నానా కథా సమన్వితముగా పది అధ్యాయములచే చెప్పబడినది. తరువాత వైష్ణవ మాహాత్మ్యమున శయ్యాదానాది జన్య ఫలితము, జలదానాది విధులు, కామాఖ్యానము, శ్రుతదేవుని చరితము, ఆశ్చర్యకరమగు వ్యాధోపాఖ్యాము, అక్షయ తృతీయాది విశేషముల వలన కలుగు పుణ్యముల వివరములు, అయోధ్యా మాహాత్మ్యమున సురాపాప విమోక్షమను పేరుగల చక్ర బ్రహ్మనామక తీర్థమున ధారా సహస్రకము, స్వర్గద్వారము, చంద్రహరి ధర్మపర్యుప వర్ణనము, స్వర్ణ వృష్ట్యుపాఖ్యానము, తిలోదాసరయూసంగమము, సీతాకుండము, గుప్తహరి సరయూ ఘర్ఘరాన్వయము, గోప్రతారము, దుగ్గేదము గురుకుండాది పంచకము, సోమార్కాది తీర్థములు పదమూడు వర్ణించబడినవి. తరువాత గయాకూప మాహాత్మ్యము సర్వాఘవినివర్తకముగా, మాండవ్యాశ్రమాది తీర్థములు, అజితాది మానసాది తీర్థములు చెప్పబడినవి. ఇది రెండవదియగు వైష్ణవ ఖండము. వివరించబడినది.

అతః పరం బ్రహ్మఖండం మరీచే శృణు పుణ్యదమ్

యత్ర వై సేతుమాహాత్మ్యే ఫలం స్నానే క్షణోద్భవమ్

గాలవస్య తపశ్చర్యా రాక్షసాఖ్యానకం తతః

చక్రతీర్థాది మాహాత్మ్యం దేవీపత్తనసంయుతే

వేతాల తీర్థమహిమా పాపనాశాది కీర్తనమ్

మంగళాదిక మాహాత్మ్యం బ్రహ్మకుండాది వర్ణనమ్

హనుమత్కుండ మహిమాగస్త్యతీర్థ భవం ఫలమ్

రామ తీర్థాది కథనం లక్ష్మీతీర్థ నిరూపణమ్

శంఖాది తీర్థ మహిమా తథా సాధ్యామృతో దిజః

ధనుష్కోట్యాది మాహాత్మ్యం క్షీర కుండాదిజం తథా

గాయత్ర్యాదికతీర్థానాం మాహాత్మ్యం చాత్ర కీర్తితమ్

రామనాథస్య మహిమా తత్త్య జ్ఞానోపదేశనమ్

యాత్రావిధాన కథనం సేతా ముక్తపదం నృణాం

ధర్మారణ్యస్య మాహాత్మ్యం తతః పరముదీరితమ్

స్థాణుః స్కన్దాయ భగవాన్ యత్ర తత్త్యముపారిశత్

ధర్మారణ్య సుసంభూతి స్తత్పుణ్య పరికీర్తనమ్

కర్మ సిద్ధే స్సమాఖ్యానం ఋషి వంశ నిరూపణమ్

అప్సరసీర్థముఖ్యానాం మాహాత్మ్యం యత్ర కీర్తనమ్

వర్ణానామాశ్రమాణాం చ ధర్మతత్త్య నిరూపణమ్

దివసాన విభాగశ్చ బకులార్క కథా శుభా

ఛత్రానస్థా తథా శాంతా శ్రీమాతా చ మతంగినీ

పుణ్యదా చ సమాఖ్యాతా యత్ర దేవ్యస్స మాస్థితా

ఇంద్రేశ్వరాది మాహాత్మ్యం ద్వారకాది నిరూపణమ్

లోహాసుర సమాఖ్యానం గంగాకూప నిరూపణమ్

శ్రీరామచరితం చైవ సత్యమందిరవర్ణనమ్

జీర్ణోద్ధారస్య కథనమాసన ప్రతిపాదనమ్

జాతి భేద ప్రకథనం స్మృతి ధర్మ నిరూపణమ్

తతస్తు వైష్ణవా ధర్మా నానాఖ్యానై రుదీరితాః

చాతుర్మాస్యే తతః పుణ్యే సర్వధర్మ నిరూపణమ్

దానప్రశంసా తత్పశ్చాద్ర్వతస్య మహిమా తతః

తపసశ్చైవ పూజాయాస్సచ్ఛిద్ర కథనం తతః

తద్వృత్తీనాం భిదాఖ్యానం శాలగ్రామ నిరూపణమ్

భారకస్య వధోపాయో వృక్షా చా మహిమా తధా

విష్ణోశాధిపశ్చ వృక్షత్వం పార్వత్యనుతపస్తతః

హరస్య తాండవం నృత్యం రామ నామ నిరూపణమ్

హరస్య లింగపతనం కథా బైజవనస్య చ

పార్వతీ జన్మ చరితం తారకస్య వధోద్భుతః

ప్రణవైశ్వర్య కథనం తారకా చరితం పునః

దక్షయజ్ఞసమాప్తిశ్చ ద్వాదశాక్షర భూషణమ్

జ్ఞానయోగసమాఖ్యానం మహిమా ద్వాదశాక్షరేః

శ్రవణాదిక పుణ్యం చ కీర్తితం శర్మదం నృణామ్

తతో బ్రాహ్మూత్తరే భాగే శివస్య మహిమాద్భుతః

పంచాక్షరస్య మహిమా గోకర్ణ మహిమా తతః

శివరాత్రేశ్చ మహిమా ప్రదోష వ్రత కీర్తనమ్

సోమవార వ్రతం చాపి సీమంతిన్యాః కథానకమ్

భద్రాయూత్పత్తికథనం సదాచార నిరూపణమ్

శివవర్మసముద్దేశో భద్రాయూద్వాహ వర్ణనమ్

భద్రాయుమహిమా చ భస్మమాహాత్మ్య కీర్తనమ్

శబరాఖ్యానకం చైవ ఉమామహేశ్వర వ్రతమ్

రుద్రాక్షస్య చ మాహాత్మ్యం రుద్రాధ్యాయస్య పుణ్యకమ్

శ్రవణాదిక పుణ్యం చ బ్రహ్మఖండోఽయ మీరితః

ఇక ఇపుడు బ్రహ్మఖండ వృతానమును వినుము. ఈ ఖండము అఖండ పుణ్యప్రదము. ఇచట సేతు మాహాత్మ్యమున క్షణమున కలుగు స్నాన ఫలము. గాలవ తపస్సు. రాక్షస చరిత్రము, చక్రతీర్థాది మాహాత్మ్యము దేవీ పత్తన సంయుత్తముగా వర్ణించ బడినది. బేతాల తీర్థ మహిమా, పాప నాశాది తీర్థ మాహాత్మ్యము, మంగలాది మాహాత్మ్యము, బ్రహ్మకుండాది వర్ణనము, హనుమత్కుండ మాహాత్మ్యము, అగస్త్య తీర్థ జన్యఫలము, రామతీర్థాది కధనము, లక్ష్మీతీర్థ నిరూపణము, శంఖాది తీర్థమాహాత్మ్యము, సాధ్యామృతాది జన్యముగా, ధనుష్కోట్యాది మాహాత్మ్యము, క్షీర కుండాది జన్య ఫలము. గాయత్ర్యాది తీర్థ మాహాత్మ్యము ఇచట వర్ణించబడినది. రామనాధ మాహాత్మ్యము, తత్త్యజ్ఞానోపదేశము, యాత్రా విధాన కథనమున సేతు యాత్రముక్తి ప్రదమని, ధర్మారణ్య మాహాత్మ్యము చెప్పబడినది. ఈ మాహాత్మ్యముననే స్థాణవు స్కందునకు తత్యోపదేశము చేయును. ధర్మారణ్య సంభవము, తత్పుణ్య పరికీర్తనము, కర్మసిద్ధి సమాఖ్యానము, ఋషివంశ నిరూపణము, అప్సరసీర్థముఖ్య వర్ణననము, మాహాత్మ్యము, వర్ణాశ్రమ తత్య నిరూపణము. దివస్థాన విభాగము, శుభకరమగు బకులార్క కథ, ఛత్రానన్గా, శాంతా, శ్రీ మాతా, మతంగినీ, పుణ్యదాక్షేత్రమున దేవీ నివాసము, ఇంద్రేశ్వరాది మాహాత్మ్యము, ద్వారకాది నిరూపణము, లోహాసుర సమాఖ్యానము గంగా కూప నిరూపణము, శ్రీరామ చరితము, సత్యమందిర వర్ణనము, జీర్ణోద్ధార కథనము, ఆసన ప్రతిపాదనము, జాతి భేద కథనము, స్మృతి ధర్మ నిరూపణము చేయబడినది. తరువాత నానాఖ్యానములతో వైష్ణవ ధర్మములు చెప్పబడినవి. తరువాత పరమ పవిత్రమగు చాతుర్మాస్యమున సర్వధర్మ నిరూపణము చేయబడినది. దానప్రశంసా, వ్రత మహిమ, తపః పూజాదికముల చిత్ర కథనము, తపః పూజావృత్తి భేదకథనము, శాలగ్రామ నిరూపణము, భారక వధోపాయము, వృక్షాల మహిమ, విష్ణువునకు శాపము, వృక్షత్వము పార్వత్యనుతపము, హరతాండవము, నృత్యము, రామనామ నిరూపణము, హరునకు లింగపతనము, బైజ వన కథ, పార్వతీ జన్మ చరితము, అత్యాశ్చర్యకరమగు తారకాసుర వథ, ప్రణవైశ్వర్య కధనము, తారకా చరితము, దక్షయజ్ఞ సమాప్తి, ద్వాదశాక్షర భూషణము, జ్ఞానయోగ సమాఖ్యానము, ద్వాదశాక్షరి మహిమ, మానవులకు శుభములను ప్రసాదించు శ్రవణాది పుణ్య కధనము వర్ణించబడినది. తరువాత బ్రహ్మోత్తర భాగమున అద్భుతమగు శివ మాహాత్మ్యము, పంచాక్షర మహిమ, గోకర్ల మహిమ, శివరాత్రి మహిమ, ప్రదోష వ్రత కీర్తనము, సోమవార వ్రతము, సీమంతినీ కథానకము, భద్రాయూత్పత్తి కథనము, సదాచార నిరూపణము, శివవర్మ సముద్దేశము, భద్రాయు వివాహ వర్ణనము, భద్రాయు మహిమ, భస్మ మాహాత్మ్య కీర్తనము, శబరాఖ్యానము, ఉమా మహేశ్వర వ్రతము, రుద్రాక్ష మాహాత్మ్యము, పవిత్రమగు రుద్రాధ్యాయ మాహాత్మ్యము, శ్రవణాదికముల పావనత్వము వర్ణించబడినది. ఇట్లు నీకు బ్రహ్మఖండము వివరించబడినది.

అతః పరం చతుర్థం తు కాశీ ఖండమనుత్తమమ్

వింద్యనారదయోర్యత్ర సంవాదః పరికీర్తితః

సత్యలోక ప్రభావశ్చాగస్త్యావాసే సురాగమః

పతివ్రతా చరిత్రం చ తీర్థయాత్రా ప్రశంసనమ్

తతశ్చ సప్తపుర్యాభ్యాసం యమిన్యా నిరూపణమ్

బుధస్య చ తధేంద్రాగ్న్యో ర్లోకాప్తిశివశర్మణః

ఆగ్నేస్సముద్భవశ్చైవ క్రత్యాద్వరుణసంభవః

గంధవత్యలకాపుర్యోరీశ్వర్యాశ్చ సముద్భవః

చంద్రార్కబుధలోకానాం కుబేజ్యారభువాం క్రమాత్

మమ విష్ణోర్డువస్యాపి తపోలోకస్య వర్ణనమ్

ధ్రువలోకకథాపుణ్యా సత్యలోక నిరీక్షణమ్

స్కందాగస్త్య సమాలాపో మణికర్లీ సముద్భవః

ప్రభావశ్చాపి గంగాయా గంగానామ సహస్రకమ్

వారాణాసీ ప్రశంసా చ భైరవావిర్భవస్తతః

దండపాణిజ్ఞానవాప్యోరుద్భవస్సమనన్తరమ్

తతః కలావత్యాఖ్యానం సదాచార నిరూపణమ్

బ్రహ్మచారిసమాఖ్యానం తతస్త్రీలక్షణాని చ

కృత్యాకృత్య వినిర్దేశో హ్యవిముక్తీశ వర్ణనమ్

గృహస్థయోగినీ ధర్మాః కాల జ్ఞానం తతః పరమ్

దివోదాస కథా పుణ్యా కాశికా వర్ణనం తతః

మాయా గణపతేశ్చాథ భువి ప్రాదుర్భవస్తతః

విష్ణుమాయా ప్రపంచోడ దివోదాస విమోక్షణమ్

తతః పంచనదోత్పత్తి ర్బిందు మాధవ సంభవః

తతో వైష్ణవ తీర్థాఖ్యా శూలినః కాశికా మగః

జైగీషవ్యేన సంవాదో జ్యేష్ఠ శాఖ్యా మహాశితుః

క్షేత్రాఖ్యానం కందుకేశో వ్యాఘేశ్వర సముద్భవః

శైలేశ రత్నేశ్వర్యో కృత్తివాసస్య చోద్భవః

దేవతానామధిష్టానం దుర్గాసుర పరాక్రమః

దుర్గాయా విజయాశ్చాథ ఓంకారేశస్య వర్ణనమ్

పునరోంకారమాహాత్మ్యం త్రిలోచన సముద్భవః

కేదారాఖ్యా చ ధర్మేశ కథా విష్ణు భుజోద్భవా

వీరేశ్వరసమాఖ్యానం గంగా మాహాత్మ్య కీర్తనమ్

విశ్వకర్మేశమహిమా దక్షయజ్ఞోద్భవస్తథా

సతీశస్యామృతేశాదే ర్భుజస్తంభః పరాశరే

క్షేత్రతీర్థకదంబశ్చ ముక్తి మండప సంకథా

విశ్వేశవిభవశ్చాడ తతో యాత్రా పరిక్రమః

అతః పరం త్వవంత్యాఖ్యం శృణు ఖండం చ పంచమమ్

ఇక ఇపుడు నాలుగవదగు కాశీ ఖండము వర్ణించబడినది. ఈ ఖండము సర్వోత్తమము. ఈ ఖండమున విన్త్య నారద సంవాదము వర్ణించబడినది. సత్యలోక ప్రభావము అగస్త్యా శ్రమమునకు దేవతాగమనము, పతివ్రతా చరిత్రము, తీర్థయాత్రా ప్రశంస, తరువాత సప్తపురి యను పేరుగల సంయమినీ నిరూపణము, బుధ ఇంద్రాగ్నుల ప్రశంస, శివకర్మ లోకాప్తి, అగ్నిసంభవము, ప్రవ్యాద వరుణ సంభవము, గంధవతీ అలకాపురీ వర్ణనము, పార్వతీ పుట్టుక, చంద్రార్క బుధలోకముల వర్ణనము, కుజ గురు సూర్య భూలోకముల వర్ణనము, బ్రహ్మలోకము, విష్ణులోకము, ధ్రువలోకము, తపోలోకముల వర్ణనము, పరమ పవిత్రమగు ధ్రువలోక కథ, సత్యలోక నిరీక్షణము, స్కందాగస్త్య సంభాషణము, మణికర్ల సముద్భవము, గంగా ప్రభావము, గంగా నామ సహస్రకము, వారాణసీ ప్రశంసా, భైరవావిర్భావము, దండపాణి, జ్ఞానవాపుల ఉద్భవము, తరువాత కలావత్యాఖ్యానము, సదాచార నిరూపణము, బ్రహ్మచారి సమాఖ్యానము, తరువాత స్త్రీ లక్షణములు, కృత్యాకృత్య నిర్ణయము, అవిముక్తేశ వర్ణనము, గృహస్థ ధర్మములు యోగినీ ధర్మములు, కాల జ్ఞానము, పవిత్రమగు దీవోదాస కథ, కాశికా వర్ణనము, భూలోకమున మాయాగణపతి సముద్భవము, విష్ణుమాయా ప్రపంచము, దివోదాస విమోక్షణము, పంచనదోత్పత్తి, బిందుమాధవ సంభవము, వైష్ణవ తీర్థమను పేరు గల కాశికకు శివుడు వచ్చుట, జైగీషవ్య సంవాదము, మహేశ్వరునకు జ్యేష్ణశ నామము, క్షేత్రాఖ్యానము, కందుకేశ వ్యాఘేశ్వర సముద్భవము, శైలేశోత్పత్తి, రత్నేశ్వర్యుత్పత్తి, కృత్తివాసోత్పత్తి, దేవతాధిష్టానము, దుర్గాసుర పరాక్రమము, దుర్గా విజయము, ఓంకారేశ్వర వర్ణనము, ఓంకార మాహాత్మ్యము, త్రిలోచనోత్పత్తి, కేదారమనుపేరు గల విష్ణు భుజోద్భవమగు ధర్మేశ కథ, వీరేశ్వర సమాఖ్యానము, గంగా మాహాత్మ్య కీర్తనము, విశ్వకర్మేశ మహిమా, దక్షయజ్ఞోద్భవము, సతీశ అమృతేశాదుల భుజ స్తంభము, పరాశరము నందు క్షేత్ర తీర్థ కదంబము, ముక్తి మండప సంకథా, విశ్వేశ్వరుని వైభవము, తరువాత యాత్రా పరిక్రమము, వర్ణించబడినవి. ఇట్లు నాలుగవదగు కాశీ ఖండము నిరూపించబడినది. ఇక అయిదవది యగు అవంతీ ఖండమును వినుము.

మహాకాలవనాఖ్యానం బ్రహ్మశీర్షచ్ఛిదా తతః

ప్రాయశ్చిత్తవిధిశ్చార్నేరుత్పత్తిశ్చ సురాగమః

దేవదీక్షా శివస్తోత్రం నానాపాతక నాశనమ్

కపాలమోచనాఖ్యానం మహాకాల వనస్థితిః

తీర్థం కనఖలేశస్య సర్వపాప ప్రణాశనమ్

కుండమప్సర సంజ్ఞం చ సరో రుద్రస్య పుణ్యదమ్

కుడవేశం చ విద్యాఘ్రం మర్కటేశ్వర తీర్థకమ్

స్వర్గద్వార చతుస్సింధు తీర్థం శంకర వాపికా

శంకరాక గంధతీర్థ తీర్థం పాప ప్రణాశనమ్

దశాశ్వమేధికానంశ తీర్థ చ హరిసిద్ధిదమ్

పిశాచకాది యాత్రా చ హనుమత్కవచేశ్వరౌ

మహాకాలేశ యాత్రా చ వాకేశ్వరతీర్థకమ్

శుక్రే చ పంచమే చాఖ్యే కుశస్థల్యాః ప్రదక్షిణాః

అక్రూరసంజ్ఞకన్యేక పాదం చంద్రార్కవైభవమ్

కరభేశాఖ్య తీర్థం చ లటుకేశాది తీర్థకమ్

మార్కండేశం యజ్ఞవాపీ సోమేశం నరకాంతకమ్

కేదారేశ్వర రామేశ పౌభాగేశ నరార కమ్

కేశవారం శక్తిభేదం స్వర్ణసారముఖాని చ

ఓంకారేశాది తీర్థాని అంధకశ్రుతి కీర్తనమ్

కాలారణ్యే లింగసంఖ్యా స్వర్ణశృంగాభిధానకమ్

కుశస్థల్యా అవంత్యాశోజ్జయిన్యా అభిధానకమ్

పద్మావతీ వై కుముద్వత్యమరావతి నామకమ్

విశాల ప్రతికల్పోభిధానం చ జ్వర శాంతకమ్

శివా నామాదికఫలం నాగోద్గీతా శివస్తుతిః

హిరణ్యాక్ష వధాఖ్యానం తీర్థం సుందర కుండకమ్

నీలగంగా పుష్కరాఖ్యం వింధ్య వాసన తీర్థకమ్

పురుషోత్తమాభిధానం తు తత్తీర్ణం చాఘనాశనమ్

గోమతీ వామనం కుండో విష్ణోర్నామ సహస్రకమ్

వీరేశ్వర సరః కాలభైరవస్య చ తీర్థకమ్

మహిమా నాగపంచమ్యా నృసింహస్య జయంతికా

కుటుంబేశ్వర యాత్రా చ దేవసాధక కీర్తనమ్

కర్కరాజాఖ్య తీర్థం చ విఘ్నేశాది సురోహనమ్

రుద్రకుండ ప్రభృతిషు బహు తీర్థ నిరూపణమ్

యాత్రాష్టతీర్థజా పుణ్యా దేవా మాహాత్మ్య ముచ్యతే

ధర్మపుత్రస్య వైరాగ్యో మార్కండేయేన సంగమః

ప్రాగ్రీయానుభవాఖ్యానమమృతా పరికీర్తనమ్

కల్పే కల్పే పృథజ్నామ నర్మదాయాః ప్రకీర్తితమ్

సప్తమార్హం నార్మదం చ కాలరాత్రి కథా తతః

మహాదేవస్తుతిః పశ్చాతథ కల్ప కథాద్భుతా

విశలాఖ్యానకం పశ్చాజ్జాలేశ్వర కథా తథా

గౌరీవ్రత సమాఖ్యానం త్రిపుర జ్వాలనం తతః

దేహ పాత విధానం చ కావేరీ సంగమస్తతః

దారుతీర్థం బ్రహ్మవర్తం యత్రేశ్వర కథానకమ్

అగ్నితీర్థం రవితీర్థం మేఘనాదాది దారుకమ్

దేవతీర్థం నర్మదేశం కపిలాఖ్యం కరంజకమ్

కుండలేశం పిప్పలాదం విమలేశం చ శూలభిత్

శచీహరణమాఖ్యాన మభ్రకస్య వధస్తతః

శూలభేదోద్భవో యత్ర దానధర్మా: పృథగ్విధాః

ఆఖ్యానం దీర్ఘతపస ఋష్యశృంగకథా తతః

చిత్రసేన కథా పుణ్యా కాశిరాజస్య లక్షణమ్

తతో దేవ శిలాఖ్యానం శబరీ తీర్థకాన్వితమ్

వ్యాధాఖ్యానం తతః పుణ్యం పుష్కరిణ్యరతీర్థకమ్

ఆపేత్యేశ్వర తీర్థం చ శక్రతీర్థం కరోటికమ్

కుమారేశమగస్త్యేశమానందేశం చ మాతృజమ్

లోకేశం ధనదేశం చ మంగలేశం చ కామజమ్

నాగేశం చాపి గోపారం గౌతమం శంఖచూడకమ్

నారదేశం నందికేశం వారుణేశ్వర తీర్థకమ్

దధిస్కందాది తీర్థాని హనూమంతేశ్వరం తతః

రామేశ్వరాది తీర్థాని సోమేశం పింగలేశ్వరమ్

ఋణమోక్షం కపిలేశం పూతికేశం జలేశయమ్

చండార్కం యమతీర్థం చ కాల్డోడీశం వనాదికే

నారాయణం చ కోటీశం వ్యాసతీర్థం ప్రభాసకమ్

నాగేశ సంకర్షణకం ప్రశ్రయేశ్వర తీర్థకమ్

ఐరండీ సంగమం పుణ్యం సువర్ణశిల తీర్థకమ్

కరంజం కామహం తీర్థం భాండీరో రోహిణీ భవమ్

చక్రతీర్థం ధోత పాపం స్కందమాంగి రసాహ్వయమ్

కోటితీర్థమయోన్యాఖ్య మంగారాఖ్యం త్రిలోచనమ్

ఇంద్రేశం కంబుకేశం చ సోమేశం కోహన శకమ్

నార్మదం చార్కమాగ్నేయం భార్గవేశ్వర ముత్తమమ్

బ్రాహం దైవం చ మార్గేశ మాదివారాహకేశవమ్

రామేశమథ సిద్దేశ మాహల్యం కంకటేశ్వరమ్

శాక్రం సౌమ్యం చ నాదేశం తోటేశం రుక్మిణీ భవమ్

యోజనేశం వరాహాశం ద్వాదశీ శివతీర్థకమ్

సిద్దేశం మంగలేశం చ లింగ వారాహ తీర్థకమ్

కుండేశం శ్వేత వరాహం గర్బావేశం రవీశ్వరమ్

శుక్లాదీని చ తీర్థాని హుంగార స్వామి తీర్థకమ్

సంగమేశం నహుషేశం మోక్షణం పంచగోపకమ్

నాగశాపం చ సిద్దేశం మార్కండోక్రూర తీర్థకమ్

కామోదశూలారోపాఖ్యే మాండవ్యం గోపకేశ్వరమ్

కపిలేశం పింగలేశం భూతేశం గాంగ గౌతమే

అశ్వమేధం భృగుకచ్ఛం కేదారేశం పాపనుత్

కలకలేశం చ జాలేశం శాలగ్రామం వరాహకమ్

చంద్రప్రభాసమాదిత్యం శ్రీపత్యాఖ్యం చ హంసకమ్

మూల్యస్థానం చ శూలేన ముగ్రాఖ్యం చిత్ర దైవకమ్

శిఖీశం కోటి తీర్థం చ దశకన్యం సువర్లకమ్

ఋణమోక్షం భారభూతి పుంఖాం ముండిం చ డిండిమమ్

ఆమలేశం కపాలేశం శృంగైరండీ భవం తతః

కోటి తీర్థం లోటణేశం పలస్తుతిరతః పరమ్

దృమిజంగల మాహాత్మ్యే రోహితాశ్వ కథా తతః

ధుంధుమార సమాఖ్యానం వధోపాయస్తతోఽస్యవై

వధో ధుంధోస్తతః పశ్చాత్తతశ్చిత్రవహోద్భవః

మహిమాస్య తతశ్చండీశప్రభావో రతీశ్వరః

కేదారేశో లక్షతీర్థం తతో విష్ణుపదీ భవమ్

ముఖారం చ్యవనాం ధ్యాసం బ్రహ్మణశ్చ సరస్తతః

చక్రౌఖ్యం లలితాఖ్యానం తీర్థం చ బహుగోమయమ్

రుద్రావర్తనం చ మార్కండం తీర్థం పాపప్రణాశనమ్

శ్రవణేశం శుద్ద పటం దేవాంధు ప్రేత తీర్థకమ్

బిహ్వాద తీర్థ సంభూతిః శివోద్ఛేదం ఫలస్తుతిః

ఏష ఖండో హ్యవంత్యాఖ్య శ్శృణ్వతాం పాపనాశనః

మహాకాల వనాఖ్యానము, బ్రహ్మ శిరచ్ఛేదము, ప్రాయశ్చిత్తవిధి, అగ్నిసముద్భవము, దేవతాగనము, దేవదీక్ష, నానాపాతక నాశనమగు శివస్తోత్రము, కపాలమోచనాఖ్యానము. మహాకాలవనస్థితి, సర్వపాప ప్రణాశనమగు కనఖలేశ తీర్థము. అప్సర కుండము, పావనప్రదమగు రుద్రసరోవర్ణనము, కుండవేశ తీర్థము, విద్యాఘ్ర తీర్థము, మర్కటేశ్వర తీర్థము. స్వర్గద్వార తీర్థము, చతుస్సింధు తీర్థము, శంకర వాపికా తీర్ణము, పాప ప్రణాశనమగు శంకరాక తీర్థము, గంధ తీర్థము, దశాశ్వమేధికా తీర్థము, అనంశ తీర్థము, హరిసిద్ధిదము, పిశాచకాది యాత్ర, హనుమత్కవచ తీర్థము, ఈశ్వర తీర్థము. మహాకాలేశయాత్ర, వాల్మీకేశ్వర తీర్థము, శుక్ర పంచకము, కుశస్థలి ప్రదక్షిణలు, అక్రూర తీర్థము, ఏకపాద తీర్థము, చంద్రార్క వైభవము, కరభేశతీర్థము, బటుకేశాది తీర్థములు, మార్కండేశ తీర్థము, యజ్ఞవాపి, సోమేశ తీర్థము, కరకాంతక తీర్థము, కేదారేశ్వర రామేశ సౌభాగ్యేశ నరార్కక క్షేత్రములు, కేశవార్క తీర్థము, శక్తి భేదము, స్వర్ణసార ముఖములు, ఓంకారేశాది తీర్థములు. అంధక శ్రుతి కీర్తనము, కొలారణ్యమున లింగసంఖ్య, స్వర్ణ శృంగ నామము. కుశస్థలీ, అవంతి, ఉజ్జయినీ నామములు, పద్మావతీ, కుముద్వతి అమరావతి నామములు, విశాల ప్రతికల్పాభిధానము. జ్వర శాంతికము, శివనామాదిక ఫలము, నాగోద్గీతా శివస్తుతి, హిరణ్యాక్ష వధాఖ్యానము, సుందరకుండ తీర్థము, నీలగంగా పుష్కర తీర్థము, వింధ్య వాసన తీర్థము, పురుషోత్తమ తీర్థము, సర్వపాప నాశకము, గోమతీ తీర్థము, వామన కుండము, విష్ణు నామ సహస్రకము, వీరేశ్వర సరస్సు, కాలభైరవ తీర్థము, నాగపంచమి మహిమ, నృసింహ జయంతి, కుటుంబేశ్వరయాత్ర, దేవసాధక కీర్తనము, కర్కరాజ తీర్థము, విఘోశాది సురోహనము, రుద్రకుండాది బహుతీర్థ నిరూపణము, పవిత్రమగు అష్టతీర్థయాత్ర, రేపో మాహాత్మ్యము, ధర్మరాజవైరాగ్యము, మార్కండేయ సమాగమము, ప్రాగ్రీయాను భవాభ్యానము, అమృతా పరికీర్తనము, నర్మదానదికి ప్రతి కల్పమున నుండు నామ భేదములు. ఋషులు చేసిన నర్మదా తీర్థము, కాలరాత్రి కథ, మహాదేవస్తుతి, పృథ కల్పకథా, విశల్యాఖ్యానము, జాలేశ్వర కథా, గౌరీవ్రత సమాఖ్యానము, త్రిపుర వాహము, దేహపాత విధానము, కావేరీ సంగమము, దారు తీర్థము, బ్రహ్మవర్తము, ఈశ్వరకథ, అగ్ని తీర్థము, రవి తీర్థము, మేఘనాదాది దారుక తీర్థము, దేవ తీర్థము, నర్మదేశ తీర్థము, కపిల తీర్థకము కరంజక తీర్ధము, కుండలేశ తీర్థము, పిప్పలాద తీర్థము, విమలేశ తీర్థము, శూలభితీర్థము శచీహరణాఖ్యానము, అభ్రక వధ, శూలభేదోద్భవము, పృధగ్విధ దాన ధర్మములు, దీర్ఘ తపసుని ఆఖ్యానము, ఋష్య శృంగకధ, చిత్రసేనా కధ, కాశిరాజ్య లక్షణము, దేవశిలాఖ్యానము, శబరీ తీర్థ కధ, పవిత్రమగు వ్యాధా ఖ్యానము. పుష్కరిణీ తీర్థము, అర్క తీర్థము, ఆమేశ్వర తీర్థము, శక్ర తీర్థము, కరోటి తీర్థము, కుమారేశ తీర్థము, అగస్త్యేశ తీర్థము, ఆనందేశ తీర్థము, మాతృజ తీర్థము, లోకేశము, ధనదేశము, మంగలేశము, కామజము, నాగేశము, గోపారము, గౌతమ తీర్థము, శంఖచూడకము, నారదేశము, నందికేశము, వారుణేశ్వర తీర్థము, దధిస్కందాది తీర్థములు, హనుమంతేశ్వర తీర్థము, రామేశ్వరాది తీర్థములు, సోమేశము, పింగలేశ్వర తీర్థము, ఋణమోక్షము, కపిలేశము, పూతికేశ తీర్థకము, జలేశయము, చండార్కము, యమతీర్థము, కాల్డో డీశము, వనాది తీర్థములు, నారాయణ తీర్థము, కోటీశ తీర్థము, వ్యాస తీర్ధము, ప్రభాస తీర్థము, నాగేశ తీర్థము, సంకర్షణ తీర్థము, ప్రశ్రయేశ తీర్థము, పవిత్రమగు ఐరండీ సంగమము, సువర్ణశిల తీర్థము, కరంజ తీర్థము, కామహతీర్థము, భాండీరము, రోహిణీ భవము, చక్రతీర్థము, దౌతపాపము, స్కంధ తీర్థము, ఆంగేర సతీర్థము, కోటీతీర్థము, అయోన్యాఖ్యము, అంగార తీర్థము, త్రిలోచనము, ఐందేశము, కంబుకేశము, సోమేశము, కోహనము, నర్మదా తీర్థము, అర్కతీర్థము, ఆగ్నేయ తీర్థము, భార్గవేశ్వర తీర్థము, బ్రాహ్మము, దైవము, మార్దేశము, ఆదివారాహము, కేశవ తీర్థము, రామేశము, సిద్దేశము, అహల్యా తీర్థము, కంకటేశ్వరము శాక్రతీర్థము, సౌమ్యతీర్థము, నాదేశము, తోటేశము, రుక్మిణీభవము, యోజనేశము, వరాహాశము, ద్వాదశీ తీర్థము, శివతీర్థము, సిద్దేశము, మంగలేశము, లింగతీర్థము, వారాహ తీర్థము, కుండేశ తీర్థము, శ్వేత వారాహ తీర్థము, గర్భావేశము, రవీశ్వరము, శుక్లాది తీర్థములు, హుంగార స్వామి తీర్థములు, సంగమేశ తీర్థము, నహుషేశ తీర్థము, మోక్షణ తీర్థము, పంచగోపక తీర్థము, నాగశాప తీర్థము, సిద్దేశ తీర్థము, మార్కండ తీర్థము, అక్రూర తీర్థము, కామోద తీర్థము, శూలారోప తీర్థము, మాండవ్యము, గోపకేశ్వరము, కపిలేశము, పింగలేశ తీర్థము, భూతేశ తీర్థము, పాపనాశకమగు కేదారేశ తీర్థము, కలకేశము, జాలేశము, శాలగ్రామ తీర్థము, వరాహ తీర్థము, చంద్ర ప్రభాస తీర్థము, ఆదిత్య తీర్థము, శ్రీపతి తీర్థము, హంసక తీర్థము, మూల్యస్థానము, శూలేశము, ఉగ్రతీర్థము, చిత్రదైవ తీర్థము, శిఖేశ తీర్థము, కోటి తీర్థము, దశకన్య తీర్థము, సువర్ణ తీర్థము, ఋణ మోక్ష తీర్థము, భారభూతి తీర్థము. పుంఖా తీర్థము, ముండి తీర్థము, డిండిమ తీర్థము, ఆమలేశ తీర్థము, కపాలేశ తీర్థము, శృంగ తీర్థము, ఐరండీ భవ తీర్థము, కోటి తీర్థము, లోటణేశము, తరువాత ఫలస్తుతి. దృమి జంగల మాహాత్మ్యమున, రోహితాశ్వ కధా, ధుంధుమార సమాఖ్యానము, ధుంధుమారవధోపాయము, ధుంధుమార వథ, చిత్రవహోద్భవము. చిత్రవహమహమి. చండీశ ప్రభావము. రతీశ్వరము, కేదారేశము, లక్ష తీర్థము, విష్ణుపదీ భవము, ముఖారము, చ్యవనాంధాస్యము, బ్రహ్మసరస్సు, చక్రసరస్సు, లలితా సరస్సు, బహు గోమయ తీర్థము, రుద్రావర్తము, మార్కండ తీర్థము, పాప ప్రణాశన తీర్థము, శ్రవణేశ తీర్థము, శుద్ద పట తీర్థము, దేవాంధుప్రేత తీర్థము, జిహ్వాద తీర్థ సంభవము, శివోద్చేదము, ఫలస్తుతి, విస్తృతముగా వర్ణించబడినది. ఇది అవంతీ ఖండము. వినువారికి సర్వపాపములను నశింపచేయును.

అతః పరం నాగరాఖ్యః ఖండష్షష్ఠోభిధీయతే

లింగోత్పత్తి సమాఖ్యానం హరిశ్చంద్రకథా శుభా

విశ్వామిత్రస్య మాహాత్మ్యం త్రిశంకు స్వర్గతిస్తథా

హాటకేశ్వర మాహాత్మ్యే వృత్రాసుర వధ స్తథా

నాగబిలం శంఖతీర్థం అచలేశ్వర వర్ణనమ్

చమత్కార పురాఖ్యానం చమత్కార కరం పరమ్

గయశీర్షం బాలశాఖ్యం వాలమండలం మృగాహ్వయమ్

విష్ణుపాదం చ గోకర్ణం యుగరూపం సమాశ్రియః

సిద్ధేశ్వరం నాగసరస్సప్తాగ్గేయం హ్యగస్త్యకమ్

భ్రూణగర్తం నలేశం చ భైష్మం వైడురమర్కరమ్

శారమిష్ఠం సోమనాధం దౌర్గమాతర్జకేశ్వరమ్

జామదగ్న్యవధాఖ్యానం నైఃక్షత్రియ కథానకమ్

రామప్రదం నాగపురం షడ్లింగం చైవ యజ్ఞభూః

ముండీరాదిత్రికారం చ సతీపరిణయాహ్వయమ్

రుద్ర శీర్షం చ యాగేశం వాలఖిల్యం చ గారుడమ్

లక్ష్మీశాప్సప్తవింశ సోమప్రాసాద మేవ చ

అంబాబద్ధం పాండుకాఖ్యమాగ్నేయం బ్రహ్మకుండకమ్

గోముఖం లోహముష్ట్యాఖ్యమజాపాలేశ్వరీ తథా 

శానైశ్చరం రాజవాపీ రామేశో లక్ష్మణేశ్వరః

కుశేశాఖ్యం లవేశాఖ్యం లింగం సర్వోత్తమోత్తమమ్

అష్టషష్టిసమాఖ్యానం దమయంత్యాస్త్రీజాతకమ్

తతో వై రేవతీ చాత్ర భక్తికాతీర్థసంభవః

క్షేమంకరీ చ కేదారం శుక్లతీర్థముఖారకమ్

సత్యసంధేశ్వరాఖ్యానం తథా కర్లోత్పలా కథా

అటేశ్వరం యాజ్ఞవల్క్యం గౌర్యంగాణేశ మేవ చ

తతో వాస్తు పదాఖ్యానం అజాగృహ కథానకమ్

సౌభాగ్యాంధుశ్చ శూలేశం ధర్మరాజ కథానకమ్

మిష్టాన్నదేశ్వరాభ్యానం గాణపత్యత్రయం తతః

జాబాలి చరితం చైవ మకరేశ కథా తతః

కాలేశ్వర్యంధకాఖ్యానం కుండమాప్సరసం తథా

పుష్యాదిత్యం రోహితాశ్వం నాగరోత్పత్తి కీర్తనమ్

భార్గవం చరితం చైవ వైశ్వామిత్రం తతః పరమ్

సారస్వతం పైప్పలాదం కంసారీశం చ పైండకమ్

బ్రహ్మణో యజ్ఞ చరితం సావిత్ర్యోఖ్యాన సంయుతమ్

రైవతం భార్తయజ్ఞాఖ్యం ముఖ్యతీర్ధ నిరీక్షణమ్

కౌరవం హాటకేశాఖ్యం ప్రభాసం క్షేత్రకత్రయమ్

పౌష్కరం నైమిషం ధర్మమరణ్యత్రితయం స్మతమ్

వారాణసీ, ద్వారకాఖ్యావన్త్యాఖ్యేతి పురీత్రయమ్

బృన్దవనం ఖాండవాఖ్యమద్వైతాఖ్యం వనత్రయమ్

కల్పశ్శాలస్తథానల్లిగ్రామత్రయ మనుత్తమమ్

అసిశుక్లపితృసంజ్ఞం తీర్థత్రయముదాహృతమ్

త్ర్యర్బుదౌ రైవతశ్చైవ పర్వత త్రయ ముత్తమమ్

నదీనాం త్రితయం గంగా నర్మదా చ సరస్వతీ

సార్థకోటి త్రయ ఫల మేకైకం చైషు కీర్తితమ్

కూషికా శంఖతీర్థం చా మరకం బాల మండనమ్

హాటకేశ క్షేత్రఫలప్రదం ప్రోక్తం చతుష్టయమ్

సాంబాదిత్యం శ్రాద్దకల్పం బోధిష్ఠిరమధాంధకమ్

జలశాయి చతుర్మాసమశూన్య శయనవ్రతమ్

మంకణీశం శివరాత్రి స్తులాపురుషదానకమ్

పృథ్వీదానం వానకేశం కపాలమోచనేశ్వరమ్

పాపపిండం మాసలైంగం యుగమానాది కీర్తనమ్

నివేశశాకం భార్యాఖ్యా రుదైకాదశకీర్తనమ్

దానమాహాత్మ్య కథనం ద్వాదశాదిత్య కీర్తనమ్

ఇత్యేష నాగరః ఖండ ప్రభాసాఖ్యోఽధునోచ్యతే

ఇక ఇపుడు ఆరవదగు నాగర ఖండమును చెప్పెదను. ఈ ఖండమున లింగోత్పత్తి సమాఖ్యానము, శుభకరమగు హరిశ్చన్డకధ, విశ్వామిత్ర మాహాత్మ్యము, త్రిశంకుస్వర్గము, హాటకేశ్వర మాహాత్మ్యమున వృత్రాసుర వధ, నాగబిల శంఖతీర్థ అచలేశ్వర వర్ణనము, అత్యంత చమత్కారమును కలిగించు చమత్కార పురాఖ్యానము, గయ శీర్షము, బాలశాఖ్యము, వాలమండము, మహ్వయము, విష్ణుపాదము, గోకర్ణము, యుగరూపము, సమాశ్రయము, సిద్దేశ్వరము, నాగసరస్సు, సప్తర్షి చరిత్రము, అగస్త్య చరిత్రము, భ్రూణనర్తము, నలేశము, భైష్మము, వైడురము, అర్కకము, శారమిష్టము, సోమనాధము, దౌర్గము, అతర్జలేశ్వరము, జామదగ్న్య వధాఖ్యానము, నైఃక్షత్రియ కధానకము, రామప్రదము, నాగపురము, షడ్లింగము, యజ్ఞభూమి, ముండీరాదిత్రికము, అర్కము, సతీపరిణయము, రుద్ర శీర్షము, యాగేశము, వాలఖిల్యము, గారుడము, లక్ష్మీశాపము, సప్తవింశసోమ ప్రాసాదము, అంబాబద్ధము, పొండుకము, ఆగ్నేయము, బ్రహ్మకుండకము, గోముఖము, లోహముష్టి, అజాపాలేశ్వరీ శానైశ్చరము, రాజవాపీ, రామేశము, లక్ష్మణేశ్వరము, కుశేశము, లవేశము, సర్వోత్తమోత్తమ లింగము, అష్టషష్టి సమాఖ్యానము, దమయంతీ త్రిజాతకము, రేవతీ తీర్థము, భక్తికా తీర్థము, క్షేమంకరీ, కేదారము, శుక్ల తీర్థ ముకారకము, సత్యసంధేశ్వరాఖ్యానము, కర్లోత్పల కథ, అటేశ్వరము, యాజ్ఞవల్క్యము, శౌర్యము, గాజేశ్వరము, వాస్తు పదాఖ్యానము, అజాగృహకధానకము, సౌభాగ్యాంధు, శూలేశము, ధర్మరాజు కధానకము, మిష్టాన్నదేశ్వరాఖ్యానము, గాణపత్యత్రయము, జాబాలి చరితము, మకరేశ కధా, కాలేశ్వర్యంధకాఖ్యానము, అప్సరస కుండము పుష్యాదిత్యము, రోహితాశ్వము, నాగరోత్పత్తి కీర్తనము, భార్గవ చరితము, వైశ్వామిత్రము, సారస్వతము, పైప్పలాదము, కంసారీశము, పైండకము, బ్రహ్మయజ్ఞ చరిత్ర, సావిత్ర్యోఖ్యానము, రైవతము, భార్తయజ్ఞము, ముఖ్యతీర్థ నిరీక్షణము, కౌరవము, హాటకేశాఖ్యము, ప్రభాస క్షేత్ర త్రయము, పౌష్కర, నైమిశ, ధర్మములను అరణ్యత్రయమ, వారాణాసీ, ద్వారక అవస్తాయను పురీత్రయము, బృన్దావన, ఖాండవ, అద్వైత నామక అరణ్యత్రయము, కల్ప, శాల, నల్గియను గ్రామత్రయము, అసి శుక్ల పితృనామక తీర్థత్రయము, శ్రీ అర్బుద రైవత నామక పర్వత త్రయము, గంగా నర్మదా సరస్వతీ యనునదీ త్రితయము అనునవి. పైన చెప్పిన త్రికములలో ఒక్కొక్క త్రికము సార్థకోటి త్రయ ఫలముగా కీర్తించబడినది. కూషికా శంఖ తీర్థము, అమరకము, బాలమండకము, హాటకేశ క్షేత్రము అను క్షేత్ర చతుష్టయము క్షేత్ర ఫలప్రదముగా చెప్పబడినది. సాంబాదిత్యము, శ్రాద్ధకల్పము, బోధిష్ఠిరము, అంధకము, జలశాయి చతుర్మాసము, అశూన్య శయన వ్రతము, మంకణేశము, శివరాత్రి, తులాపురుష దానకము, పృధ్వీదానము, వానకేశము, కపాలమోచనేశ్వరము, పాప పిండము, మాసలైంగము, యుగమానాది కీర్తనము, నివేశము, శాకంభరీ, ఏకాదశ రుద్రకీర్తనము దాన మాహాత్మ్య కథనము, ద్వాదశాదిత్య కీర్తనము ఇవియన్నీయు సవిస్తరముగా నిరూపించబడినవి. ఇట్లు నీకు నాగర ఖండమును వర్ణించితిని. ఇక ఇపుడు ప్రభాస ఖండమును చెప్పెదను వినుము.

సోమేశో యత్ర విశ్వేశోఽర్కస్థలం పుణ్యదం మహత్

సిద్ధేశ్వరాదికాఖ్యానం పృథగత్ర ప్రకీర్తితమ్

అగ్నితీర్థం కపర్దేశం కేదారేశం గతిప్రదమ్

భీమభైరవచండీశ భాస్కరేందుమజేశ్వరాః

బుధజ్యభృగుసౌరాగు శిఖీశాహారవిగ్రహాః

సిద్దేశ్వరాద్యాః పంచాన్యే రుద్రాస్నత వ్యవస్థితాః

వరారోహా హ్యజాపాలా మంగలా లలితేశ్వరీ

లక్ష్మీశో వాడవేశశ్చోర్వీశః కామేశ్వరస్తథా

గౌరీశవరుణేశాఖ్యం దుర్వాసేశం గణేశ్వరమ్

కుమారేశంచండకల్పం శకులీశ్వరసంజ్ఞకమ్

తతః కోప్రోధ కోటీశ బాలబ్రహ్మదిసత్కథా

నరకేశసంవర్ణేశ నిధీశ్వరకధా తతః

బలభద్రేశ్వరస్యాధ గంగాయా గణపస్య చ

జాంబవత్యాఖ్యసరిత పాండుకూపస్య సత్కధా

శతమేధలక్షమేధ కోటిమేధకథా తథా

దుర్వాసార్కఘటస్థాన హిరణ్యాసంగమోత్కథా

నగరార్కస్యకృష్ణస్య సంకర్షణసముద్రయోః

కుమార్యాః క్షేత్రపాలస్య బ్రహేశస్య కధాపృధక్

పింగలాసంగమేశస్య శంకరార్కఘటేశయోః

ఋషితీర్థ్యనర్ణార్క త్రితకూపస్య కీర్తనమ్

ససోపానస్య పర్ణార్కన్యంకుమత్యోః కధాద్భుతా

వారాహస్వామివృతానం ఛాయాలింగాఖ్యగుల్ఫయోః 

కథాకనకనందాయాః కుంతీగంగేశయోస్తధా

చమగోద్ఛేదవిధు త్రిలోకేశకథా తతః

మంకణేశతైపురేశ షండతీర్థకథాస్తథా

సూర్యప్రాచీతీక్షణయో రుమానాధకథాతథా

భూద్ధారశూలస్థలయో శ్చ్యవనార్కేశయోస్తథా

ఆజాపాలేశబాలార్క కుబేరస్థలజాకధా

ఋషితోయా కధా పుణ్యా సంగాలేశ్వరకీర్తనమ్

నారదాదిత్యకధనం నారాయణనిరూపణమ్

తప్తకుండస్యమహాత్మ్యం మూలచండీశవర్ణనమ్

చతుర్వక్రగణాధ్యక్షక లంబేశ్వరయోఃకధా

గోపాలస్వామివకులస్వామినోర్మురుతాం కధా

క్షేమార్కోన్నతవిఘ్నేశజలస్వామికథాతథా

కాలమేఘస్య రుక్మిణ్యా దుర్వాసేశ్వరభద్రయోః

శంఖావర్తమోక్షతీర్థ గోష్పదాచ్యుతపద్మనామ్

జాలేశ్వరస్య హుంకారేశ్వరచండీశయోఃకధా

ఆశాపురస్థలివిఘ్నేశ కలాకుండకధాద్భుతా

కపిలేశస్య చ కథా జరద్దవశివస్య చ

నలకర్కోటేశ్వరయో ర్హాటకేశ్వరజా కధా

నారదేశయన్తభూషా దుర్గకూటగణేశజా

సుపర్లేలాఖ్యభైరవ్యోర్భల్లతీర్థభవాకధా

కీర్తనం కర్దమాలస్య గుప్తసోమేశ్వరస్య చ

బహుస్వర్ణేశశృంగేశ కోటీశ్వరకధా తతః

మార్కండేశ్వరకోటీశదామోదరగృహాత్కధా

స్వర్ణరేఖా బ్రహ్మకుండం కుంతీభీమేశ్వరాతథా

మృగీకుండం చ సర్వస్వం క్షేత్రవస్త్రానపధే స్మృతమ్

దుర్గాభిల్లేశగంగేశ దైవతానాం కధాద్భుతా

తతోర్బుదేశ్వరకధా ఆచలేశ్వరకీర్తనమ్

నాగతీర్థస్య చ కధా వసిష్టాశ్రమవర్ణనమ్

భధ్రకర్లస్య మాహాత్మ్యం త్రినేత్రస్య తతః పరమ్

కేదారస్య చ మహాత్మ్యం తీర్తాగమనకీర్తనమ్

కోటీశ్వరరూపతీర్థహృషీకేశకధాస్తతః

సిద్దేశశుక్రేశ్వరయోర్మణికర్లేశకీర్తనమ్

పంగుతీర్థయమతీర్థ వారాహతీర్థవర్ణనమ్

చంద్రప్రభాసపిండోదశ్రీమాతాశుక్లతీర్థజమ్

కాత్యాయన్యాశ్చ మాహాత్మ్యము తతః పిండారకస్య చ

తతః కనఖలస్యాథ చక్రమానుష తీర్థయోః

కపిలాగ్ని తీర్థకధా తధా రక్తానుబంధజా

గణేశ పాళేశ్వరయో ర్యాత్రాయాముజ్జ్వలస్య చ

చండీస్థాన నాగోద్భవ శివకుండ మహేశజా

కామేశ్వరస్య మార్కండేయోత్పత్తేశ్చ కధా తతః

ఉద్దాలకేశ సిద్దేశ గతతీర్థ కథా పృథక్

శ్రీదేవ ఖాతోత్పత్తిశ్చ వ్యాసగౌతమ తీర్థయోః

కులసంతార మాహాత్మ్యం రామకోట్యాహ్వతీర్థయోః

చంద్రోద్భేదేశాన శృంగ బ్రహ్మస్థానోద్భవోఅద్భుతమ్

త్రిపుష్కర రుద్రప్రద్ర గుహేశ్వర కథా శుభా

అవిముక్తస్య మాహాత్మ్యముమామహేశ్వరస్య చ

మహౌజసః ప్రభావశ్చ జంబూతీర్థస్య వర్ణనమ్

గంగాధర మిశ్రకయోః కధావాద ఫలస్తుతిః

ద్వారకాయాశ్చ మాహాత్మ్యే చన్తశర్మ కధానకమ్

జాగరాద్యర్చనాద్యాఖ్యా వ్రతమేకాదశీ భవమ్

మహాద్వాదశికాఖ్యానం ప్రహ్లాదర్షి సమాగమః

దుర్వాసన ఉపాఖ్యానం యాత్రోపక్రమ కీర్తనమ్

గోమత్యుత్పత్తి కథనం తస్యాం స్నానాదిజం ఫలమ్

చక్రతీర్థస్య మాహాత్మ్యం గోమత్యుదధిసంగమః 

సనకాదిప్రదాఖ్యానం నృగతీర్థ కధాతతః

గోప్రచార కథా పుణ్యా గోపీనాం ద్వారకాగమః

గోపీరస్సమాఖ్యానం బ్రహ్మతీర్థాది కీర్తనమ్

పంచనద్యాగమాఖ్యానం నానాఖ్యాన సమన్వితమ్

శివలింగగదాతీర్థకృష్ణపూజాదికీర్తనమ్

త్రివిక్రమస్య మూర్తాఖ్యా దుర్వాసః కృష్ణ సంకథా

కుశదైత్యవధోచ్చార విశేషార్చనజం ఫలమ్

గోమత్యాం ద్వారకాయాం చ తీర్ధాగమనకీర్తనమ్

కృష్ణమందిరసంప్రేక్షా ద్వారవత్యభిషేచనమ్

తత్ర తీర్థావాసకథా ద్వారకా పుణ్యకీర్తనమ్

ఇత్యేష సప్తమః ప్రోక్తః ఖండః ప్రాభాసితో ద్విజాః

స్కాందే సర్వోత్తరవధే శివమాహాత్మ్య వర్ణనే

లిఖిత్వైతత్తు యో దద్యాద్దేమశూలసమన్వితమ్

మాఘ్యం సత్కృత్య విప్రాయ స శైవే మోదతే పదే

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్థపాదే స్కన్ద పురాణానుక్రమణీ వర్ణనం నామ చతురధిక శతతమోఽధ్యాయః.

ఈ ప్రభాస ఖండమున విశ్వేశుడు వర్ణించబడెను. పుణ్యప్రదమగు అర్కస్థలము, సిద్దేశ్వరాదీకాఖ్యానము, ఇచట విడిగా చెప్పబడినది. అగ్ని తీర్థము, కపర్దేశము, కేదారేశము, భీమ, భైరవ, చండీశ, భాస్కలేందు కుజేశ్వరములు, బుధ, గురు, శుక్ర, శని శిఖాశులు హర విగ్రహులుగా, ఇతరులను సిద్ధేశ్వరాది పంచ రుద్రులు, ఇచట వ్యవస్థితులైరి. వరారోహా, ఆజాపాలా, మంగలా, లలితేశ్వరీ, లక్ష్మీశుడు, వాడవేశుడు, ఉర్వీశుడు, కామేశ్వరుడు, గౌరీశ, వరుణేశ, దుర్వాసేశ, గణేశ్వర, కుమారేశ, చండకల్ప శకులీశ్వర నామక క్షేత్రములు వర్ణించబడినవి. తరువాత కోటీశ బాల బ్రహ్మాది సత్కధ చెప్పబడినది. నరకేశ సంవర్ణేశ నిధీశ్వర కథలు, బలభద్రేశ్వర, గంగాగణపతి కధలు, జాంబవతీ నదీ కథ, పాండుకూప కథ, శతమేధ, లక్షమేధ, కోటి మేధ కథలు, దుర్వాస అర్కఘట స్థాన హిరణ్యాసంగమ కథ, నగరార్క, కృష్ణ సంకర్షణ సముద్రముల కథ, కుమారీక్షేత్రపాల బ్రహ్మేశ కథలు వేరు వేరుగా, పింగలా సంగమేశ కథ శంకరార్క ఘటేశుల కథలు, ఋషి తీర్థ నస్టార్క త్రిత కూప కీర్తనము, సోపాన పర్లార్కన్యయ మతీ కథలు, వారాహ స్వామి వృతానము, ఛాయాలింగ గుల్పకథలు కనక నందా కథ, కుంతీ గంగేశుల కథ, చమగోద్ఛేద విదురత్రిలోకేశ కథలు, మంకణేశ త్రిపురేశ షండతీర్థ కథలు, సూర్యప్రాచీత్రిక్ష ఉమానాథ కథలు, భూద్దార శూలస్థల కథ, చ్యవనార్కేశ కథలు, అజాపాలేశ, బాలార్క కుబేరస్థలజా కథలు, ఋషితోయ కథ, సంగాలేశ్వర కీర్తనము, నారదాదిత్య కథనము, నారాయణ నిరూపణము, తప్తకుండ మాహాత్మ్యము, మూల చండీశ వర్ణనము, చతుర్వక్ర గణాధ్యక్ష కలబేశ్వర కథ, గోపాలస్వామి వకులస్వామి కథ, మరుత్తుల కథ, క్షేమార్కోన్నత విఘ్నేశ జలస్వామి కథా, కాలమేఘ రుక్మిణీ, దుర్వాసేశ్వర, భద్ర, శంఖావర్త, మోక్షతీర్థ, గోప్పదాచ్యుత పద్మ, జాలేశ్వర, హుంకారేశ్వర చండీశుల కథలు, ఆశాపురస్థవిఘ్నేశ కలాకుండ కథ, కపిలేశ కధా, జరద్దవ శివకథ, నలకర్కోటేశ్వరుల కథ, హాటకేశ్వర కథ, నారదేశ యన్తభూష దుర్గకూట గణేశ కథలు, సుపర్లా ఇలా భైరవీ భల్ల -తీర్థ భవకథా, కర్ణమాల కీర్తనము, గుప్తసోమేశ్వర కథ, బహు స్వర్ణేశ, శృంగేశ కోటీశ్వర కధ, మార్కండేశ్వర, కోటీశ, దామోదర గృహోత్కధా, స్వర్ణరేఖా, బ్రహ్మకుండ కుంతీ భీమేశ్వర కథ, మృగీకుండ సర్వస్వకథ, వస్త్రా పథ క్షేత్ర కథా, దుర్గాభిల్లేశ గంగేశ రైవత కథ, అర్బుదేశ్వర కథ, అచలేశ్వర కీర్తనము, నాగతీర్థకథ, వసిష్టాశ్రమ వర్ణనము, భద్రకర్ల మాహాత్మ్యము, త్రినేత్ర మాహాత్మ్యము, కేదార మాహాత్మ్యము, తీర్థాగమన కీర్తనము, కోటీశ్వర రూప తీర్థ హృషీకేశ కథలు, సిద్ధేశ శుక్రేశ్వర మణి కల్లేశ కీర్తనము, పంగు తీర్థ యమతీర్థ వారాహ తీర్థవర్ణనము, చన్ద ప్రభాస, పిండోద శ్రీమాతా శుక్ల తీర్థజ కథ, కాత్యాయనీ మాహాత్మ్యము, పిండారక మాహాత్మ్యము, కనఖల కథ, చక్రమానుష తీర్థ, కపిల తీర్థ అగ్నితీర్థ కధా, రక్తాను బంధజ కథ, గణేశ పార్ధేశ్వర యాత్ర యందు ఉజ్జ్వల కథ, చండీస్థాన, నాగోద్భవ, శివకుండ, మహేశ కథలు, కామేశ్వర కథ, మార్కండేయోత్పత్తి కథ, ఉద్దాలకేశసిద్దేశ గత తీర్థకథ, శ్రీదేవఖాతత్పత్తి, వ్యాస గౌతమ తీర్థముల కథ, కుల సంతార మాహాత్మ్యము రామకోటి తీర్థమాహాత్మ్యము, చంద్రోద్భేదేశాన శృంగ బ్రహ్మస్థానోద్భవము, త్రిపుష్కర, రుద్రప్రద గుహేశ్వర కథలు, అవిముక్త మాహాత్మ్యము ఉమామహేశ్వరుల కథ, మహోజా ప్రభావము, జంబూతీర్థ వర్ణనము, గంగాధర మిశ్రక కథ, ఫలస్తుతి, ద్వారకా మాహాత్మ్యమున చన్తశర్మ కధా, జాగరాద్యర్చనాది వ్రతములు, ఏకాదశీ వ్రతము, మహాద్వాదశీ వ్రతము, ప్రహ్లాదర్షి సమాగమము, దుర్వాసుని ఉపాఖ్యానము, యాత్రపక్రమ కీర్తనము, గోమత్యుత్పత్తి కథనము, గోమతీ స్నాన జన్యఫలము, చక్రతీర్థ మాహాత్మ్యము, గోమతీ సముద్ర సంగమము, సనకాది హ్రదాఖ్యానము, నృగతీర్థకధా, గోప్రచార కధా, గోపికలు ద్వారకకు వచ్చుట, గోపీసరస్సమాఖ్యానము, బ్రహ్మతీర్థాది కీర్తనము, పంచనద్యాగమాఖ్యానము, నానాఖ్యాన శివలింగ గదా తీర్థ కృష్ణపూజాది కీర్తనము, త్రివిక్రమ మూర్త్యాఖ్య కథ, దుర్వాస కృష్ణ సంకథ, కుశదైత్యవధ, ఉచ్చార విశేషార్చన జన్యఫలము, గోమతియందు, ద్వారకయందు, తీర్థాగమన కీర్తనము, కృష్ణమందిర సంప్రేక్ష, ద్వారవత్యభిషేచనము. తీర్థావాస కధా, ద్వారకాపుణ్య కీర్తనము, ఇవియన్నియు సవిస్తరముగా వర్ణించబడినవి. ఇదియే ఏడవదియగు ప్రాభాసిక ఖండము. ఈ ఖండమున సర్వోత్తమ కథలు శివమాహాత్మ్యము వర్ణించబడినవి. ఈ స్కాంద పురాణమును వ్రాసి మాఘ పూర్ణిమ నాడు. హేమ శూల సమన్వితముగా బ్రాహ్మణుని సత్కరించి దానము చేసినచో అతను శివలోకమున ఆనందమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధపాదమున స్కన్దపురాణానుక్రమణియను నూటానాలుగవ అధ్యాయము.