నారద మహా పురాణము
72 - హయగ్రీవోపాసనానిరూపణమ్
సనత్కుమార ఉవాచ : -
ప్రణవో హృదయం విష్ణుర్జేంతస్సురపతిస్తథా,
మహాజలాయ స్వాహాంతో మంత్రో వసుధరాక్షరః.
మునీరిస్తుర్విరాట్చంద్రో దేవతాదధి. వామనః,
తారో బీజం తథా శక్తిర్వహ్నిజాయా ప్రకీర్తితా
చంద్రాక్షిరామబాణీషు నేత్రపంఖ్యైర్మనూద్భవైః,
వర్ణాష్టకంగం కృత్వా చ మూఠి బాలే చ నేత్రయో:
కర్ణయోర్ద్రణయోరోష్ఠతాలుకంఠభూజేషు చ,
పృష్ఠే హృద్యుదరే నాభౌ గుహ్యే చోరస్థలే పునః.
జానుద్వయే జంఘయోశ్చ పాదయోర్విన్య పేదమాత్,
అష్టాదశైవ మంత్రతాప్తతో దేవం విచింతయేత్.
ముక్తాసౌరం రత్నభూషం చప్టోష్ణం భృంగపన్నిభైః,
అలకైర్విలపద్వక్షం కుంభం శుద్ధాంబుపూరితమ్.
దధ్యన్నపూర్ణచషకం దోర్భ్యం పందధతం భజేశ్,
లక్షత్రయం జపేన్మస్త్రం తద్దశాంశం ఘృతపుతైః.
పాయసాన్నేః ప్రజుహుయాద్దధ్యన్నేన యథావిధి,
చంద్రాంతే కల్పితే పీతే పూర్వోత్తే పూజయేచ్చ తమ్,
పంకల్ప్య మూర్తిం మూలేన పంపూజ్య చ విధానతః,
కేపరేషు షడంగాని పంపూజ్య దిగ్గలేషు చ.
వాసుదేవం సంకర్షణం ప్రద్యుమ్నమవిరుద్ధకమ్,
కోణపతేషు శాంతిం చ శ్రియం పరస్వతీం రతిమ్.
ధ్వజం చ వైనతేయం చ కౌస్తుభం వనమాలినమ్,
శంఖం చక్రం గదాం శార్ణం దలేష్వష్టసు పూజయేత్.
దలాగ్రేషు కేశవాదీని దిక్పాలాంప్తదనన్తరమ్,
తదస్త్రాణి చ సంపూజ్య గజానప్టా పమర్చయేత్.
ఐరావతః పుండరీకో వామనః కుముదోంజనః,
పుష్పదంతస్సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః.
కరిణేభ్రము కపిలా పింగలానుపమాః క్రమాత్,
తామ్రాకర్లీం శుభదంతీ చాంగనా హ్యంజనావతి.
ఏవమారాధితో మంత్రి దద్యాదిష్టాని మంత్రిణీ,
శ్రీకామః పాయసాజ్యేన సహస్రం జుహుయాత్సుధీః.
మహతీం శ్రీయమాప్నోతి ధాన్యాప్తిర్ధాన్యహోమతః,
శతపుష్పాసముత్తైశ్చ బీజైర్హుత్వా పహస్రతః.
మహాభయం నాశయేద్ధి నాత్ర కార్యా విచారణా,
దద్ధ్యోదనేన శుద్ధీన హుత్వా ముచ్యత దుర్గతే:.
ధ్యాత్వా త్రివిక్రమం రూపం జపేన్మస్త్రం ప్రమాహితః,
కారాగృహాద్భవేన్ముక్తో బద్దే మంత్రప్రభావతః.
భిత్తా పంపాద్య దేవేశం ఫలకే వా ప్రపూజయేత్,
నిత్యం సుగంధకుసుమైః మహతీం శ్రియమాప్నుయాత్.
హుత్వా రక్తాత్పలైర్మంత్రీ వశయేత్సకలం జగత్,
అన్నాజ్యెర్జుహుయాన్నిత్యమష్టావింశతిపంఖ్యయా.
పితాజ్యాన్నం చ విధివత్ ప్రాప్నుయాదన్నపంక్షయమ్,
ఆపూ పైః షడ్రసోపేతైర్మహనేద్వసుపహప్రకమ్.
అలక్ష్మీం చ పరాభూయ మహతీం శ్రియమాప్నుయాత్,
జుహూయాదయుతం మంత్రి దధ్యన్నం చ పితాన్వితమ్.
యత్ర యత్ర వత్సఒపి తత్రాన్నదికమాప్నుయాత్,
పద్మాక్షతైర్యుతం బిల్వాంతికస్థో జుహుయాన్నరః.
మహాలక్ష్మీం ప లభతే తత్ర తత్ర న సంశయః,
జుహుయాత్సాయ పైర్లక్షం వాచస్పతిపమో భవేత్.
లక్షం. జప్త్వా తద్దశాంశం పుత్రజీవఫలైర్హునేత్,
తత్కా షెరేధితే వహ్మౌ శ్రేష్ఠం పుత్రమవాప్నుయాత్.
పంపాధ్య తారం విలపత్ కర్ణికం చ సువర్ణ కైః,
విలపత్కేపరం మంత్రాక్షరద్వయం ద్వాష్టపత్రకమ్.
శేషయుగ్మాగ్లింత్యపత్రం ద్వాదశాక్షరవేష్టితమ్,
తద్భహిర్మాతృకావర్ణిర్యంత్రం సంపత్ర్పదం నృణామ్,
రక్తం త్రివిక్రమం ధ్యాత్వా ప్రసూనైరక్తవర్ణకైః,
జుహుయాదయుతం మంత్రి పర్వత్ర విజయీ భవేత్.
ధ్యాయేచ్చంద్రోపనగతం పద్మానామయుతం హువేత్,
లభేదకంటకం రాజ్యం సర్వలక్షణసంయుతమ్.
హుత్వా లవంగైర్మధ్వాకైరపామార్గదభైపు వా,
అయుతం సాధ్యనామాఢ్యం పవశ్యీ జాయతే ధ్రువమ్.
అష్టోత్తరశతం హుత్వా హ్యాపామార్గదలైశ్శుభై,
తావజ్జప్త్వా చ సప్తాహాన్మహారోగాతముచ్యతే.
ఉహిరత్పదమాభాష్య ప్రణవో హీయ శబ్దతకి,
పర్వవాగీశ్వరేత్యంతే ప్రవదేదీశ్వరేత్యథ.
పర్వవేదమయాచింత్య పదాంతే పర్వమీరయేత్,
బోధయ ద్వితయంత్యోయం మంత్రస్తారాదిరీరితః.
ఋషిరహ్మాష్య నిర్దిష్టశ్ఛన్లో మట్టుబుదాహృతమ్,
దేవతా స్యాద్ధయగ్రీవో వాగైశ్వర్యప్రదో విభుః.
తారేణ పాదైర్మంత్రప్య పంచాంగొని ప్రకల్పయేత్,
తుషారాద్రిసమచ్ఛాయం తులసీదామభూషితమ్.
తురంగవదవం వందే తుంగపారస్వతః పదమ్,
ధ్యాత్వేవం ప్రజ పేన్మంత్రమయుతం తద్దశాంశతః
మధ్వకైః పాయ పైర్హుత్వా విమలాదిపమవ్వితే,
పూజయేద్వెష్ణవే పీకే మూర్తిం పంకల్ప్య మూలతః.
కర్ణికాయాం చతుర్ధికు యజేత్పూర్వాదితః క్షమాత్,
సనందనం చ సనకం శ్రియం చ పృథివీం తథా,
తద్భహిర్ధిక్టు వేదాశ్చ షట్కోణేషు తతోర్చయేత్,
విరుక్తం జ్యోతిషం పశ్చాద్యజేద్యాకరణం తతః.
కల్పం శిక్షాం చ ఛందాంపి వేదాంగావి త్వమావి వై,
తతోష్టదలమూలే తు మాతరోహ్లి సమర్చయేత్.
వక్రతుండాదికొనష్టా దలమధ్యే ప్రపూజయేత్,
దలాగేష్వర్చయేత్పశ్చాత్ సాధకశ్చాష్టభైరవాన్.
అసితాంగం రురుం చైవ భీషణం రక్త నేత్రకమ్,
బటుకల కొలదమనం దంతురం వికటం తథ్.
తద్భహిషోడశదలేష్వవతారాన్తరేర్దశ,
శంఖం చక్రం గదాం పద్మం నందకం శార్జమేవ చ
తద్బహిర్భూగృ శక్రముఖాన్దశ దిగీశ్వరాన్,
వజ్రాద్యాంస్తద్భహిశ్చేష్ట్వా ద్వారేషు చ తతః క్రమాత్.
మహాగణపతిం దుర్గాం క్షేత్రేశం బటుకం తథా,
పమస్తప్రకటాద్యాశ్చ యోగిన్యస్తద్బహిర్భవేత్.
తద్భహిప్సప్తనద్యశ్చ తద్బాహ్యా తు గ్రహాన్నవ,
తద్బా హ్యే పర్వతానష్టా నక్షత్రాణి చ తద్బహిః,
ఏవం పంచదళావృత్యా పంపూజ్య తరగొననమ్,
వాగీశ్వరపమో వాచి ధనైర్థనపతిర్భవేత్.
ఏవం సిగ్ధ మనో మంత్రి ప్రయోగానర్తుమర్హతి,
అష్ణోత్తరపహప్రం తు శుద్ధవార్యభిమంత్రితమ్.
బీజేన మాసమాత్రం యః పిబేద్ధీమాగ్జితేన్డియః,
జన్మమూకోపి ప నరో నాక్సిద్ధిం లభతే ధ్రువమ్.
వియద్భగుస్థమస్థీరా బిందుమద్బీజమీరితమ్,
చంద్రసూర్యోపరాగే తు పాత్రే రుక్మమయే కై పేత్,
దుగ్ధం వచాం తతో మంత్రి కంఠమాత్రదకే స్థితః,
స్పర్శాద్వి మోక్షపర్యంతం ప్రజ పేన్మస్త్రమాదరాత్.
పిబేత్తత్సర్వమచిరాత్తస్య సారస్వతం భవేత్,
జ్యోతిష్మతీలతాబీజం దినే షేకైకవర్జితమ్.
అష్టోత్తరశతం యావద్భక్షయేదభిమంత్రీతమ్,
పరస్వత్యవతారో సౌ సత్యం ప్యాద్భువి మానవః,
కిం బహూక్తేన విప్రేంద్ర మనోరస్య ప్రసాదతః,
సర్వవేదాగమాదీనాం వ్యాఖ్యాతా జ్ఞానవాన్భవేత్ .
ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే సనత్కుమార విభాగే తృతీయపాదే హయగ్రీవోపాపనా నిరూపణం నామ ద్విసప్తతితమో అధ్యాయః.
సనత్కుమార మహర్షి పలికెను : “ఓం విష్ణవే సురపతయే మహాబలాయస్వాహా” అనునది మంత్రము చంద్రుడు ముని విరాట్చందస్సు. దధివామనుడు దేవత తారము బీజము స్వాహా శక్తి సంఖ్యలు గల మంత్రాక్షరములచే షడంగన్యాసమును శిరస్సున, ఫాలభాగమున, నేత్రములందు, కర్ణములందు, నాసికలందు, ఓషతాలు కంఠములందు భుజప్పష్టహృదయ ఉదరములందు, నాభియందు, గుహ్యమునందు, ఉరస్థలమునందు, జానుద్వయమున, జంఘద్వయమున, పొదములయందు క్రమముగా చేయవలయును. మంత్రోత్పన్నస్థలములు పదునెనిమిది మాత్రమే. తరువాత దైవమును చింతించవలయును. ముత్యములవలే గౌరవర్ణుడు రత్నభూషణములు కలవోడు, చంద్రస్థుడు, తుమ్మెదలవంటి ముంగురులు కలవాడు, పవిత్రజలముతో నింపిన కుంభమును, దధ్యోదనపొత్రను ధరించినవానిని స్వామిని ధ్యానించవలయును. మూడు లక్షలు జపమును చేయవలయును. దశాంశమును ఘృతుతమగు పాయసాన్నముచే, దధ్యోదనముచే యథావిధిగా హోమమును చేయవలయును. తరువాత చంద్రాంతము పూర్వోక్తమగు కల్పిత పీఠమున పూజించవలయును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి విధానోక్తముగా పూజించి, కేసరములందు షడంగములను, దిగ్గలములందు వాసుదేవుని, సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్ధుని, కోణపత్రములందు శాంతిని, శ్రీని, సరస్వతిని రతిని, అష్టదలములందు, ధ్వజమును, వైనతేయుని, కౌస్తుభమును, వనమాలిని, శంఖచక్రగదా శార్జములను పూజించవలయును. దలాగ్రముందు కేశవాదులను, దిక్పాలురను, తరువాత వారి అస్త్రములను పూజించి అష్టదిగ్గజములను పూజించవలయును. ఐరావతము, పుండరీకము, పోమనము, కుముదము, అంజనము,పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము అనునవి అష్టదిగ్గజములు. ఈ గజముల పత్నులు అభ్రము, కపిల పింగళ అనుపమ, మకర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి అనునవి. ఇట్లు ఆరాధించినచో మంత్రము ఇష్టములనిచ్చును. సిరిని కోరువాడు నేయి కలిసిన పొయసముచే ఒక వేయి హోమమును చేయవలయును. ఇట్లు చేసినచో గొప్పధనమును పొందును. ధాన్యముచే హోమము గావించినచో ధాన్యము లభించును. శత పుష్పబీజములచే ఒకవేయి హోమమును చేసినచో దుర్గతినుండి విముక్తుడగును. త్రివిక్రమ రూపమును ధ్యానము చేసి, సావధాన మనస్కుడై మంత్రమును జపించవలయును. మంత్ర ప్రభావమువలన కారాగృహాబద్దుడు కూడా విముక్తుడగును. దేవేశుని గోడమీదకాని, ఫలకము మీదకాని చిత్రించి పూజించవలయును. ఇట్లు ప్రతిదినము సుగంధపుష్పములచే పూజించినచో మహాసంపదలను పొందును. ఎఱ్ఱని కలువలచే హోమమును గావించినచో సకలజగము వశమగును. నేయి కలిపిన అన్నముచే ప్రతిదినము ఇరువది. యెనిమిది మారులు హోమముగావించినచో అక్షయాన్నమును పొందును. షడ్రసోపేతములగు అపూపములచే ఎనిమిది వేలు హోమముగావించినచో దొరిద్ర్యము తొలగి మహాసంపద కలుగును. దధ్యన్నముచే పదివేలు హోమము చేసినవారున్న ప్రదేశమున అక్షయాన్నమును పొందును. బిల్వవృక్షసమీపమున నుండి పద్మాకరములచే హోమమును గావించినచో మహాసంపదను పొందును. పొయసముతో లక్షహోమమును గావించినచో బృహస్పతి సముడగును. లక్షజపముచేసి దశాంశమును పుత్రజీవ ఫలములతో బృహస్పతి సముడగును. లక్షజపముచేసి దశాంశమును పుత్రజీవఫలములతో హోమము గావించినచో ఉత్తమపుత్రులను పొందును. ససాధ్యతారము విలసత్కర్లీకము సువర్ణములచే శోభించు కేసరములు కలది మంత్రాక్షర షోడశపత్రములు గలది శేషయుగ్మార్లాంతపత్రము ద్వాదశాక్షరవేష్టితము, బయట మాతృకావర్ణములచే కూడియున్న యంత్రము సర్వసంపతదము. రక్తవర్ణుడగు త్రివిక్రముని ధ్యానించి రక్తవర్ణపుష్పములచే పదివేలు హోమమును గావించిన అంతటా జయమును పొందును. చంద్రాసనగతుని ధ్యానించి పది వేలు పద్మములచే హోమమును గావించినచో సర్వలక్షణసంయుతము అకంటకమగు రాజ్యమును పొందును. నేయికలిపిన లవంగములచే కొని ఉత్తరేణి దలములచేగాని ఎవని పేరు చెప్పి హోమమును గావించిన వాడు వశమగును. ఉత్తరేణిదళములచే అష్టోత్తర శతమును ఏడు రోజులు హోమము గావించి, అంతయే జపముచేసినచో మహారోగమునుండి విముక్తిని పొందును. ఉమీరత్పదమును ప్రణవోహయ శబ్దమునుండి సర్వవాగీశ్వర ఈశ్వర సర్వవేదమయ అచిన్త్య సర్యం బోధయ బోధయ అను మంత్రము తారాదిమము. ఈ మంత్రమునకు ఋషి బ్రహ్మ. అనుష్టుప్ఛన్లస్సు. హయగ్రీవస్వామిదేవత. హయగ్రీవస్వామి వాగైశ్వర్యప్రదుడు తారములగు మంత్రపాదములతో పంచాంగములను కల్పించవలయును. తుషారాద్రిసమచ్ఛాయుడు, తులసీదామభూషితుడు, తుంగసారస్వతుడగు తురంగవదనునికి నమస్కారము. ఇట్లు ధ్యానము చేసి మంత్రమును పదివేలు జపించవలయును. తేనె కలిపిన పాయసముచే దశాంశమును హోమమును గావించి, విమలాదియుతమగు వైష్ణవపీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పూజించవలయును. కర్ణికయందు తొలుగు దిక్కులలో పూర్వాదిగా క్రమముగా పూజించవలయును. సనందన మహర్షిని, సనకమహర్షిని, శ్రీని, పృథివిని, బయటదిక్కులలో వేదములను షట్కోణములందు పూజించవలయును. నిరుక్తమును, జ్యోతిషమును వ్యాకరణమును, కల్పమును, శిక్షను, ఛందస్సును ఈ వేదాంగములను పూజించవలయును. తరువాత అష్టదలమూలమున అష్టమాతృకలను పూజించవలయును. దలమధ్యమున వక్రతుండాదికములను పూజించవలయును. దలాగ్రముందు అష్టభైరవులను పూజించవలయును. అసితాంగుడగు గురువును భీషణుడు రక్తనేత్రుడు, కటుకుడు, కాలదమనుడు, దంతురుడు, వికటుడు మొదలగువారిని, బయట షోడశదలమున శ్రీహరి దశావతారములను శంఖ చక్రగదా పద్మనందక శార్జములను, బహిర్భాగమున భూగృహమున ఇంద్రుడు మొదలగు పదిమంది దీక్పాలకులను, ఆ బయట వజ్రాదులను పూజించి, ద్వారములందు క్రమముగా మహాగణపతిని, దుర్గను, క్షేత్రేశుని, వటుకుని, సమస్త ప్రకటాది యోగినులను, ఆ బయట సప్తనదులను, ఆ బయట నవగ్రహములను, ఆ బయట అష్టపర్వతములను, ఆ బయట నక్షత్రములను, ఇట్లు పదునైదు ఆవృత్తులు హయగ్రీవుని పూజించి వాగీశ్వరునితో సముడగును. ధనములో ధనపతి యగును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును. పరిశుద్ధజలమును వెయ్యి ఎనిమిది మార్లు మంత్రించి, బీజముచే, ఒక మాసము పొనము చేసినచో పుట్టు మూగియైనను వాక్కును పొందును. చంద్రసూర్యగ్రహణసమయమున బంగారు పాత్రలో పాలనుంచి, కంఠమాత్రోదకమున నిలిచి గ్రహణ స్పర్శనుండి మోక్షము వరకు మంత్రమును ఆదరముతో జపించవలయును. తరువాత పాత్రలోని పొలను త్రాగవలయును. అట్లు త్రాగినచో శాస్త్ర పాండిత్యము లభించును. జ్యోతిష్మతీలతాబీజమును ఒక్కొక్కదినమున ఒక్కొక్కటిగా పెంచుచు అష్టోత్తరశతమగు వరకు అభిమంత్రితమును భుజించవలయును. అట్లు చేసినవాడు సరస్వత్యవతారమగును. ఇంకనూ ఏమి చెప్పవలయును. ఈ మంత్రప్రభావముచే సర్వవేదాగమవ్యాఖ్యాత యగును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున సనత్కుమార విభాగమున తృతీయ పాదమున హయగ్రీవోపాసనా నిరూపణమను డెబ్బది రెండ - అధ్యాయము సమాప్తము.
Summary of chapter 73 of the Nārada Mahā Purana is as follows:
పరమ మంగళ స్వరూపుడైన పరమశివుని దివ్య పంచాక్షరీ మంత్రోపాసన ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. శివ మంత్ర జపము, బిల్వపత్రార్చన, రుద్రాభిషేక విధి మరియు ఆత్మలింగ పూజా వైభవము ఇక్కడ భక్తిరసభరితంగా వివరింపబడినది.