102 - లింగపురాణానుక్రమణీ నిరూపణమ్

బ్రహ్మోవాచ :-

శృణు పుత్ర ప్రవక్ష్యామి పురాణం లింగ సంజ్ఞితమ్

పఠతాం శృణ్వతాం చైవ భుక్తిముక్తి ప్రదాయకమ్ 

యచ్చ లింగాభిధం తిష్ఠన్వహ్నిలింగే పురాభ్యధాత్

మహ్యం ధర్మాదిసిద్ధ్యర్థమన్నికలకథాశ్రయమ్

తదేవ వ్యాసదేవేన భాగద్వయ సమన్వితమ్

పురాణం లింగముదితం బహ్వాఖ్యాన విచిత్రితమ్

తదేకాదశసాహస్రం హరమాహాత్మ్య సూచకమ్

పరం సర్వపురాణానాం సారభూతం జగత్రయే

పురాణోపక్రమే ప్రశ్నః సృష్టి స్సంక్షేపతః పురా

యోగాఖ్యానం తతః ప్రోక్తం కల్పాఖ్యానం తతః పరమ్

లింగోద్భవస్తదంబా చ కీర్తితా చ తతః పరమ్

సనత్కుమారశైలాదిసంవాదశ్చాడ పావనః

తతో దధీచచరితం యుగధర్మ నిరూపణమ్

తతో భువనకోశాఖ్యా సూర్య సోమాన్వయస్తతః

తతశ్చ విస్తరాత్సర్గప్రిపురాఖ్యానకం తథా

లింగప్రతిష్ఠా చ తతః పశుపాశ విమోక్షణమ్

శివవ్రతాని చ తథా సదాచార నిరూపణమ్

ప్రాయశ్చిత్తాన్యరిష్టాని కాశీ శ్రీశైలవర్ణనమ్

అంధకాఖ్యానకం పశ్చాద్వారాహచరితం పునః

నృసింహచరితం పశ్చా జైలంధరకథాస్తతః

శైవం సహస్రనామార్గ దక్షయజ్ఞ వినాశనమ్

కామస్య దహనం పశ్చాద్ధిరిజాయాః కరగ్రహః

తతో వినాయకాఖ్యానం నృపాఖ్యానం శివస్య చ

ఉపమన్యుకథా చాపి పూర్వభాగ ఇతీరితః

విష్ణుమాహాత్మ్య కథన మంబరీష కథాతతః

సనత్కుమార నందీశ సంపాదశ్చ పునర్మునే

శివమాహాత్మ్య సంయుక్త స్నాన యాగాదికం తతః

సూర్య పూజావిధిశ్చైవ శివపూజా చ ముక్తిదా

దానాని బహుధోక్షాని శ్రాద్ధప్రకరణం తతః

ప్రతిష్ణా తంత్రముదితం తతోఽఘోరస్య కీర్తనమ్

వజ్రేశ్వరీ మహావిద్యా గాయత్రీ మహిమా తతః

త్ర్యంబకస్య చ మాహాత్మ్యం పురాణశ్రవణస్య చ

ఏవం చోపలిభాగస్తే లైంగస్య కథితో మయా

వ్యాసేన హి నిబద్ధస్య రుద్రమాహాత్మ్య సూచితః

లిఖిత్వైతత్పురాణం తు తిలధేనుసమన్వితమ్

ఫాల్గున్యాం పూర్ణిమాయాం యో దద్యాద్భక్త్యా ద్విజాతయే

స లభేచ్చివసాయుజ్యం జరామరణ వర్జితమ్

యః పఠేచ్ఛృణుయాద్వాపి లైంగం పాపహరం నరః

స భుక్తభోగో లోకేఽస్మి న్నంతే శివపురం వ్రజేత్

లింగానుక్రమణిమేతాం పఠేద్యశ్శృణుయాత్తథా

తావుభో శివభక్షౌ తు లోకద్వితయభోగినౌ

జాయేతాం గిరిజాభర్తుః ప్రసాదాన్న్యాత సంశయః

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్ధపాదే లింగపురాణానుక్రమణీ నిరూపణం నామ ద్వ్యుత్తర శత తమోఽధ్యాయః.

శ్రీ బ్రహ్మపలికేను :

చదువు వారికి వినువారికి భుక్తి ముక్తులను ప్రసాదించు లింగపురాణమును ఇపుడు నీకు చెప్పెదను. వినుము. శంకరుడు వహ్నిలింగమున నుండి నాకు ధర్మాది సిద్ధి కొరకు అగ్ని కల్పకథాశ్రయమగు లింగపురాణమును స్వయముగా చెప్పెను. దీనినే వ్యాస మహర్షి రెండు భాగములుగా బహుకథాచిత్రముగా లింగపురాణమును చెప్పెను. ఈ లింగపురాణము శివుని మాహాత్మ్యమును తెలుపునది. పదకొండు వేల శ్లోకములు కలది. జగత్రయమున సర్వపురాణ సారభూతము. పురాణోపక్రమమున సంక్షేపముగా సృష్టి విషయక సంప్రశ్నము, తరువాత యోగాఖ్యానము, కల్పాఖ్యానము, లింగోద్భవము, పార్వతీ చరిత్రము, సనత్కుమార శైలాది సంవాదము, దధీచిచరితము, యుగ ధర్మ నిరూపణము, భువన కోశకథ, సూర్యచంద్ర వంశ కథలు, తరువాత విస్తృతముగా సృష్టి, త్రిపురాఖ్యానము, లింగ ప్రతిష్ట, పశుపాశ విమోచనము, శివవ్రతములు, సదాచార నిరూపణము, ప్రాయశ్చిత్తములు, అరిష్టములు, కాశీ శ్రీశైల వర్ణనములు, అంధకాఖ్యానకము, వరాహ చరితము, నృసింహ చరితము, జలంధరవధ, శివ సహస్ర నామములు, దక్షయజ్ఞ వినాశనము, కామ దహనము, పార్వతీ కళ్యాణము, వినాయకాఖ్యానము, కృపాఖ్యానము, ఉపమన్యుకథ, ఇంతవరకు పూర్వభాగమున వివరించబడినది.

ఉత్తర భాగమున విష్ణు మాహాత్మ్య కథనము, అంబరీష కథ, సనత్కుమార, నందీశ సంవాదము, శివమాహాత్మ్యము, స్నాన యాగాదికము, సూర్యపూజావిధి, ముక్తి ప్రదమగు శివపూజ, బహువిధ దానములు, శ్రాద్ధ ప్రకరణము, ప్రతిష్టి తంత్రము, అఘోర కీర్తనము, వజ్రేశ్వరీ మహావిద్యా, గాయత్రీ మాహాత్మ్యము త్ర్యంబక మాహాత్మ్యము, పురాణ శ్రవణ ఫలము వివరించబడినవి. ఈ పురాణమును వ్రాసి తిలధేను సమన్వితముగా, ఫాలున పూర్ణిమనాడు భక్తితో బ్రాహ్మణునకు దానము చేసినవాడు జరామరణ వర్జితమగు శివసాయుజ్యమును పొందును. పాపహరమగు లింగపురాణమును చదివిననూ వినిననూ ఇహలోకమున సకల భోగములనను భవించి అంతమున శివలోకమును పొందును. ఈ లింగపురాణాను క్రమణిని చదివిననూ వినిననూ శివభక్తులై ఉభయ లోకములలో భోగముల ననుభవించెదరు. సాటిలేని శివుని అనుగ్రహపాత్రులగుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధపాదమున లింగపురాణానుక్రమణికయను నూటారెండవ అధ్యాయము సమాప్తము.