నారద మహా పురాణము
81 - కృష్ణాదిమన్త్రభేదనిరూపణమ్
శ్రీ సనత్కుమార ఉవాచ :
అథ కృష్ణస్య మంత్రాణాం వక్ష్యే భేదాన్మునీశ్వర,
యాన్సమారాధ్య మనుజాస్సాధయంతీష్టమాత్మనః.
శక్తిశ్శీమారపూర్వశ్చ శ్రీశక్తి స్మరపూర్వకః,
మారశక్తిరమాపూర్వో దశార్ణా మనవస్త్రయః.
మునిస్స్యానారదశ్చన్దో గాయత్రీ దేవతా పునః,
కృష్ణో గోవిన్దనామాత్ర సర్వకామప్రదో నృణామ్.
చక్రైః పూర్వవదంగాని త్రయాణామపి కల్పయేత్,
తతః కిరీటమనునా వ్యాపకం హి సమాచరేత్.
సుదర్శనస్య మనునా కుర్యాద్దిగ్బంధనం తథా,
వింశత్యర్ణోక్తవతుర్యాదాద్యే ధ్యానార్చనాదికమ్.
ద్వితయే తు దశార్ణోక్తం ధ్యానపూజాదికం చరేత్,
తృతీయే తు హరిం ధ్యాయేత్సమాహితమనాస్సుధీః. శంఖచక్రధనుర్బాణపాశాంకుశధరారుణమ్,
దోర్బ్యాం ధృతం ధమస్తం చ వేణుం కృష్ణదివాకరమ్.
ఏవం ధ్యాత్వా జుపేన్మన్త్రాన్పంచలక్షం పృథక్సుధీః,
జుహుయాత్తద్దశాంశేన పాయ సేన ససర్పిషా.
ఏవం సిద్ధే మనౌ మంత్రి కుర్యాత్కామ్యాని పూర్వవత్,
శ్రీశక్తి కామః కృష్ణాయ గోవిందాయాగ్నిసుందరీ,
రవ్యర్ణో బ్రహ్మ గాయత్రీ కృష్ణా ఋష్యాదయోఽస్య తు,
బీజైరమాబ్ధయుగ్మార్ణైః షడంగాని ప్రకల్పయేత్.
వింశత్యదితజపధ్యానహోమార్చనాదికమ్,
కింబహూకేన మంత్రోఽయం సర్వాభీష్టఫలప్రదః.
శ్రీశక్తిస్మరపూర్వోగజన్మాశక్తి రమాంతికః,
దశాక్షరస్స ఏవాదౌ ప్రోక్తశ్శక్తి రమాయుతః.
మంత్రో షోడశరవ్యర్ణౌ చక్రైరంగాని కల్పయేత్,
వరదాభయహస్తాభ్యాం క్లిష్యంతం ఖాంగకం ప్రియే.
పద్మోత్పలకరే తాభ్యాం శ్లిష్టం చక్రదరోజ్వలమ్,
ధ్యాత్వైవం ప్రజ పేల్లక్ష దశకం తద్దశాంశతః.
ఆజ్యైర్హత్వా తత స్సిద్ధౌ భవేతాం మన్త్రనాయకే,
సర్వకామప్రదౌ సర్వసంపత్సౌభాగ్యదౌ నృణామ్.
అష్టాదశార్ణః కామాంతో మనుస్సుతధనప్రదః,
నారదోఽస్య మునిశ్ఛన్దో గాయత్రీ దేవతా మనోః.
కృష్ణః కామో బీజముక్తం శక్తిర్వహ్నిప్రియా మతా,
షడ్విర్యాడ్యేన బీజేన షడంగాని సమాచరేత్.
పాణౌ పాయసపక్వం చ దక్షే హైయంగవీనకమ్,
వామే దధద్దివ్యదిగంబరో గోపీసుతోఽవతు.
ధ్యాత్వైవం ప్రజ పేన్మన్త్రం ద్వాత్రింశల్లక్షమానత,
దశాంశం జుహుయాదగ్నౌ సితాఢ్యేన పయోంధసా.
పూర్వోక్తవైష్ణవే పీఠే యజేదష్టాదశార్ణవత్,
పద్మస్థం కృష్ణమభ్యర్య తర్పయేత్తన్ముఖాంబుజే.
క్షీరేణ కదలీప క్వైర్దాధ్నా హైయంగవేన చ,
పుత్రార్థ తర్పయేదేవం వత్సరాల్లభతే సుతమ్.
యద్యదిచ్ఛతి తత్సర్వం తర్పణాదేవ సిద్ధ్యతి,
వాక్కామో జేయుతం కృష్ణపదం మాయా తతః పరమ్.
గోవిందాయ రమాపశ్చాదద్దశార్ణం చ సముద్ధరేత్,
మనుస్వరయుతా సర్గయుక్తౌ భృగుతదూర్ధ్వ గౌ.
ద్వావింశత్యక్షరో మంత్రో వాగీశ్వప్రదాయకః,
ఋషిస్స్యాన్నారదశ్ఛన్దో గాయత్రీ దేవతా పునః.
విద్యాప్రదశ్చ గోపాలః కామో బీజం ప్రకీర్తితమ్,
శక్తిస్తు వాగ్భవం విద్యాప్రాప్తయే వినియోజనా.
వామోర్థ్వహస్తే దధతం విద్యాపుస్తకముత్తమమ్,
అక్షమాలాం చ దక్షోర్ద్వాస్పాటికీం మాత్సకామయీమ్.
శబ్దబ్రహ్మమయం వేణుమధః పాణిద్వయే పునః,
గాయత్రీగీతవసనం శ్యామలం కోమలచ్ఛవిమ్.
బర్హావతంసం సర్వజ్ఞం సేవితం మునిపుంగవైః,
ధ్యాత్వైవం ప్రమదావేశవిలాసం భువనేశ్వరమ్.
వేదలక్షం జపేన్మన్త్రం కింశు క్రైస్తద్దశాంశతః,
హుత్వా తు పూజయేన్మంత్రి వింశత్యర్ణవిధానతః.
ఏవం యో భజతే మన్త్రం భవేద్వాగీశ్వరస్తు సః,
అదృష్టాన్యపి సాస్త్రాణి తస్య గంగాతరంగవత్.
తారః కృష్ణయుగం పశ్చాన్మహాకృష్ణ, ఇతీరయేత్,
సర్వజ్ఞత్వం ప్రశబ్దాంతే సీద మేఽగ్నిశ్చమారమ.
ణాంతే విద్యేశవిద్యామాశు ప్రయచ్ఛ తతశ్చ మే,
త్రయస్త్రింశదక్షరోఽయం మహావిద్యాప్రదో మనుః.
నారదోఽస్య మునిశ్చన్దోఽనుష్టుప్ కృష్ణోఽస్య దేవతా,
పాదై స్సర్వేణ పంచాంగం కృత్వా ధ్యాయేత్తతో హరిమ్.
దివోద్యానే వివస్వత్ప్రతిమమణిమయే మండ పే యోగ పీఠే,
మధ్యే యస్సర్వవేదాంతమయపురతరోస్సన్నివిష్ణో ముకున్దః,
వేదైః కల్పద్రురూపైశ్శిఖరిశతపమాలంబికోనైశ్చతుర్ఖః,
న్యాయైస్తర్కెః పురాణైస్స్మతిభిరభివృత స్తాదృశైశ్చామరాద్యైః.
దద్యాద్భిభ్రత్కరాగ్రైరపి దరమురలీపుష్పబాణేక్షుచాపా,
నక్షస్పృకూర్ణకుంభౌ స్మరలలితవపుర్దివ్యభూషాంగరాగః,
వ్యాఖ్యాం వామే వితన్వన్ స్ఫుటరుచిరపదో వేణునా విశ్వమాత్రే,
శబ్దబ్రహ్మోద్భవేన శ్రియమరుణరుచి ర్వల్లవీవల్లభ నః.
ఏవం ధ్యాత్వా జ పేల్లక్షం దశాంశం పాయ సైర్హునేత్,
అష్టాదశార్ణవత్కుర్యాద్యజనం చాప్య మంత్రవిత్.
శ్రీ సనత్కుమార మహర్షి పలికెను : ఓ మునీశ్వరా! ఇపుడు శ్రీకృష్ణపరమాత్మ మంత్రభేదములను చేప్పెదను. ఈ మంత్రములనుపాసించి మానవులు తమ ఇష్టములను సాధించుకానుచుందురు. శక్తి శ్రీమారపూర్వము, శ్రీ శక్తిస్మరపూర్వకము, మార శక్తి రమాపూర్వము అని దశాక్షరమంత్రములు మూడు విధములు. ఈ మంత్రములకు నారద మహర్షి ముని. గాయత్రీ ఛన్దస్సు శ్రీ కృష్ణపరమాత్మ దేవత. ఈ మూడు మంత్రములకు పూర్వము వలె చక్రములచే అంగకల్పన చేయవలయును. తరువాత కిరీట మంత్రముచే వ్యాపకము నాచరించవలయును. సుదర్శన మంత్రముచే దిగ్బంధమును చేయవలయును. ధ్యానార్చనాదికమంతయూ వింశాక్షర మంత్రమునకు వలె నాచరించవలయును. రెండవ మంత్రమున దశాక్షరమంత్రమునకు చెప్పబడిన ధ్యానపూజాదికమునాచరించవలయును. తృతీయమంత్రమున సావధానుడై శ్రీ హరిని ధ్యానించవలయును. శంఖచక్రధనుర్బాణ పాశాంకుశధరుడు, వేణువును మ్రోగించువాడు అగు కృష్ణదివాకరుని ధ్యానించి అయిదు లక్షలు మంత్రమును జపించవలయును. దశాంశమును నేయి కలిపిన పాయసముచే హోమమును చేయవలయును. ఇట్లు మంత్రము సిద్దించిన తరువాత కామ్యములను సాధించుకోనవలయును. శ్రీ కృష్ణాయ గోవిందాయ నమస్వాహా” అనునది ద్వాదశక్షర మంత్రము. బ్రహ్మముని గాయత్రీ ఛందస్సు. కృష్ణపరమాత్మ దేవత. 3, 4, 2 వర్ణములచే బీజములచే షడంగములను కల్పించవలయును. వింశాక్షర మంత్రమునకు చెప్పబడిన జపధ్యానహోమ అర్చనాదికమును ఆచరించవలయును, ఇంకనూ ఏమి చెప్పవలయును. ఈ మంత్రము సర్వాభీష్ట ప్రదాయకము. శ్రీ శక్తి స్మర పూర్వము పార్వతి శక్తి రమాంతికము. దశాక్షర మంత్రము మొదటనే చెప్పబడినది. ఇట్లు షోడశాక్షరి ద్వాదశాక్షర మంత్రములను చక్రములచే అంగములను కల్పించవలయును. వరదాభయహస్తములచే ప్రియురాళ్ళను ఆశ్లేషించుచున్నవాడు, పద్మోత్సలకరములచే శంఖ చక్రములను ధరించు వాడు అగు కృష్ణుని ధ్యానించి పది లక్షలు జపించవలయును. దశాంశమును నేయిచే హోమము గావించి మంత్రము సిద్ధించిన తరువాత మంత్రనాయకులు కావలయును. ఈ మంత్రమును సర్వకామప్రదములు సర్వసంపత్సౌభాగ్యప్రదములు. కామాంతమగు అష్టాదశాక్షరి మంత్రము సుతధనప్రదము. ఈ మంత్రమునకు నారదమహర్షి ముని గాయత్రీ ఛందస్సు. శ్రీ కృష్ణ భగవానుడు దేవతా. కామబీజము. స్వాహాశక్తి షడ్విర్యాఢ్య బీజముచే షడంగములను ఆచరించవలయును. దక్షిణ హస్తమున పాయసమును, వామహస్తమున నవనీతమును ధరించి దిగంబరుడుగానున్న గోపీపుత్రుడు కాపాడు గౌవుత. ఇట్లు ధ్యానించి ముప్పది రెండు లక్షలు జపించవలయును. దశాంశమును శర్కరపాలు కలిపిన అన్నముచే హోమమును గావించవలయును. పూర్వోక్త వైష్ణవ పీఠమున అష్టాదశాక్షర మంత్రవిధానముచే పూజించవలయును. పద్మస్థుడగు కృష్ణుని పూజించి అతని ముఖాంబుజమున తర్పణ గావించవలయును. క్షీరములచే అరటి పండ్లచే దధిచే, నవనీతముచే పుత్రులను కోరువాడు తర్పణముగావించినచో సంవత్సరకాలములో పుత్రుని పొందును. కోరిన దంతయూ తర్పణము వలననే సిద్ధించును. “ఓం కృష్ణాయ గోవిందాయ నమః" అనునది దశాక్షర మంత్రము దీనికి ద్వొదశాక్షర మంత్రమును జోడించినచో ద్వొవింశత్యక్షరమంత్రము కాగలదు. ఈ మంత్రము వాగీశత్వప్రదము. నారదుడు ఋషి, గాయత్రీ ఛందస్సు, విద్యాప్రదుడగు గోపాలుడు దేవత. కామబీజము వాగ్భవశక్తి విద్యాప్రాప్తికి వినియోగము. నోమోర్థ్వహస్తమున ఉత్తమ విద్యాపుస్తకమును ధరించువానిని, దక్షిణోర్ద్వహస్తమున మాతృకామయమగు స్ఫటికాక్షమాలను ధరించువానిని, అధః పాణి ద్వయముచే శబ్ద బ్రహ్మమయమగు వేణువునూదుచున్న వానిని, గాయత్రీ గీతవసనుని, శ్యామలుని, కోమలంతిని, బర్ధావతంసుని, సర్వజుని, మునిపుంగ సేవవీతుని, ప్రమదావేశ విలాసుని, భువనేశ్వరుని ధ్యానించి నాలుగు లక్షలు జపించవలయును. దశాంశమును కింశుకములచే హోమముగావించి వింశాక్షర మంత్రమునకు వలె పూజించవలయును. ఇట్లు సేవించినవాడు వాగీశ్వరుడగును. అదృష్ణ శాస్త్రములు కూడా గంగాతరంగములవలె దృష్టములగును. ఓం కృష్ణ । కృష్ణ । మహాకృష్ణ । సర్వజ్ఞ। త్వం ప్రసీద మే శ్రీమారమణ । విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే” అనునది ముప్పది మూడక్షరముల మంత్రము మహావిద్యా ప్రదము. నారదమహర్షి ముని. అనుష్టుప్పనస్సు. శ్రీకృష్ణుడు దేవత. సర్వ పాదములచే పంచాంగములను రచించి శ్రీహరిని ధ్యానించవలయును. దివోద్యానమున సూర్యసన్నిభమణిమయమగు మండపమున, యోగ పీఠమధ్యమున, సర్వవేదాన్త్రమయసురతరువు మూలమున కూర్చొనియున్న ముకుందుడు, కల్పవృక్షరూపములగు వేదములచే శిఖరిశత సమాలంబితములగు నాలుగు కోశములచే న్యాయతరపురాణములచే స్మృతులచే అటువంటి అమరాదులచే అభివృతుడు, శంఖమురలీ పుష్ప బాణీకు చాపములను, అక్షమాలను, పూర్ణకుంభములను ధరించినవాడు, స్మరలలిత శరీరుడు, దివ్యభూషాంగరాగుడు, వామహస్తమున వ్యాఖ్యాముద్రను ధరించిన, స్ఫుటరుచిరపదుడు విశ్వమాత్రమున శబ్దబ్రహ్మోద్భవమగు వేణువుచే నూదువాడు, శ్రీధరుడు, అరుణరుచి, గోపికావల్లభుడు కాపాడుగావుత యని ధ్యానించి, లక్ష జపించవలయును. దశాంశమును పాయసముచే హోమము గావించవలయును. ఈ మంత్రమునకు అష్టాదశాక్షర మంత్రమునకు వలె పూజాదినము నాచరించవలయును.
తారో నమో భగవతే నన్దపుత్రాయ సంవదేత్,
ఆనందవపుషే దద్యాద్దశార్ణం తదనన్తరమ్.
అష్టావింశతివర్ణోఽయం మన్త్రస్సర్వేష్టదాయకః,
నన్దపుత్రపదం జేస్తం శ్యామలాంగపదం తథా.
తథా బాలవపుః కృష్ణం గోవిన్దం చ తథా పునః,
దశార్ణాన్తో భవేన్మంత్రో ద్వాత్రింశదక్షరాన్వితః.
అనయోర్నారద ఋషిశ్చన్ద స్తూష్ణిగనుష్టుభౌ,
దేవతా నన్దపుత్రస్తు వినియోగోఽఖిలాప్తయే.
చక్రైః పంచాంగమర్చా స్యాదంగదిక్పాల హేతుభిః,
దక్షిణే రత్నచషకం వామే సౌవర్ణనేత్రకమ్.
కరే దధానం దేవీభ్యాం శ్లిష్టం సంచిన్తయేద్విభుమ్,
లక్షం జపో దశాంశేన జుహుయాత్సాయ పేన తు.
ఏతాభ్యాం సిద్ధమంత్రాభ్యాం మంత్రి కుర్యాద్యథేప్సితమ్,
ప్రణవః కమలా మాయా నమో భగవతే తతః,
నన్దపుత్రాయ తత్పశ్చాత్ బాలాస్తే వపు షే పదమ్,
ఊనవింశతివర్ణోఽయం మునిరహ్మా సమీరితః.
ఛందోఽనుష్టుబ్ధేవతా చ కృష్ణో బాలవపుస్స్వయమ్,
మంత్రోఽయం సర్వసంపత్తి సిద్ధయే సేవ్యతే బుధైః.
తారోహృద్భగవాన్జేఽన్తో రుక్మిణీవల్లభాయ చ,
వహ్నిజాయావధిః ప్రోక్తో మౄషోడశవర్ణవాన్.
నారదోఽప్య మునిశ్ఛన్దోఽనుష్టువు దేవతా మనోః,
రుక్మిణీవల్లభశ్చన్ద్రదృ ర్వేదాంగాక్షివర్ణకై:
పంచాంగాని ప్రకుర్వీత తతో ధ్యాయేత్సు రేశ్వరమ్.
తాపిచ్ఛచ్ఛవిరంకగాం ప్రియతమాం స్వర్ణప్రభామంబుజ,
ప్రోద్యద్దామభుజాం స్వవామభుజయాన్లీష్యన్స్వచిత్తాశయా,
శ్లిష్యన్తీం స్వయమన్యహస్తవిలపత్సావర్ణవేత్రశ్చిరం,
పాయాన్నసువిశుద్ధపీతవసనో నానా విభూషో హరిః.
ధ్యాత్వైవం ప్రజ పేల్లక్షం రక్తైః పద్మైర్దశాంశతః,
త్రిమద్వేక్తైర్హునేత్పిఠే పూర్వోక్తే పూజయేద్ధరిమ్.
అంగైర్నారదముఖ్యైశ్చ లోకేశైశ్చ చ తదాయుధైః,
ఏవం సిద్ధో మనుర్దద్యాత్సర్వాన్కామాంశ్చ మంత్రిణే.
లీలాదండపదాబ్జోఽపి జనసంపక్తదోః పదమ్,
దండాంతే వా ధరావహ్నిరధీశాడ్యోఽథ లోహితః.
మేఘశ్యామపదం పశ్చాద్భగవన్ సలిలం సదృక్,
విష్ణో ఇత్యుక్త్వాo ద్వయం స్యాదేకోనత్రింశదర్ణవాన్.
నారదోఽస్య మునిశ్ఛన్దోఽనుష్టుప్ప దేవతా మనోః,
లీలాదండహరిః ప్రోక్తో మన్వబ్ధయుగవహ్నిభిః.
వేదైః పంచాంగకం భాగైర్మంత్రవర్ణోత్థితైః క్రమాత్.
సంమోహయంశ్చ నిజవామకరస్థలీలాదండేన గోపయువతీః పరసున్దరీశ్చ, దిశ్యన్నిజప్రియసఖాంపగదక్షహస్తో దేవశ్రియం నిహతకంస ఉరుక్రమో నః.
లక్షం జప్త్వాదశాంశేన జుహుయాత్తిలతండులై:,
త్రిమధ్వ క్తైస్తతోఽభ్యర్చేదంగం దిక్పాల హేతిభిః.
లీలాదండహరిం యో వై భజతే నిత్యమాదరాత్,
ససర్వైః పూజ్యతే లోకైస్తస్య గేహే స్థిరా రమా,
సద్యారూఢా స్మృతి సోయం కేశవాఢ్య ధరాయుగమ్,
భయాగ్నివల్లభా మంత్రపుషార్ణస్సర్వ సిద్ధిదః.
ఋషిస్స్యాన్నారదశ్ఛందో ఉప్లీగ్రోవల్లభస్య తు,
దేవతా పూర్వవచ్చకైః పంచాంగాని తు కల్పయేత్.
ధ్యేయో హరిస్సకపిలాగణమధ్యసంస్థస్తా ఆహ్వయన్దధద్ధక్షిణదోస్థ వేణుమ్,
పాశం సయష్టిమపరత్ర పయోదనీలః పీతాంబరాహిరిపు పిచ్ఛకృతావతంసః.
సప్తలక్షం జపేన్మస్త్రం దశాంశం జుహుయాత్తతః,
గోదుగ్ధైః పూజయేత్పీఠే స్స్యాదండైః ప్రథమావృతిః.
సువర్ణపింగలాం గౌరపింగలాం రక్త పింగలామ్,
గుడపింగాం బభ్రువర్ణాం చోత్తమాం కపిలాం తథా.
చతుష్క పింగలాం పీత పింగలాం చోత్తమాం శుభామ్,
గోగణాష్టకమభ్యర్చ్య లో కేశానాయుధైర్యుతాన్.
సంపూజ్యేవం మనౌ సిద్దే కుర్యాత్కామ్యని మంత్రవిత్,
అష్టోత్తరపహస్రం యః పయోభిర్దినతో హునేత్.
పక్షోత్సగోగణో ముక్తో దశార్ణే చాప్యయం విధిః,
తారో హృద్భగవాన్ జేఽన్తశ్రీగోవిన్దప్తథా భవేత్.
ద్వాదశార్ణో మనుః ప్రోక్తో నారదోఽస్య మునిర్మతః,
ఛన్దః ప్రోక్తం చ గాయత్రీ శ్రీగోవిన్దోఽస్య దేవతా.
చంద్రాక్షియుగభూతార్ణై సర్వై పంచాంగకల్పనమ్. ధ్యాయేత్కల్పద్రుమూలాగ్రితమణివిలసద్దివ్య సింహాసనస్థమ్,
మేఘశ్యామం పిశంగాంశుకమతిషుభగం శంఖవేత్రే కరాభ్యామ్,
బిభ్రాణం గోసహస్రైర్వృతమమరపతిం ప్రౌడహస్తైకకుంభం,
ప్రశ్చోతత్సౌధధారాస్న పిత మభినవాంభోజపత్రాభనేత్రమ్.
రవి లక్షం జపేన్మన్త్రం దుగ్ధైర్హుత్వా దశాంశతక,
యజేచ్చ పూర్వవద్గోష్టస్థితం వా ప్రతిమాదిషు.
పూర్వోక్తే వైష్ణవే పీఠే మూర్తిం సంకల్ప్య మూలతః,
తత్రావాహ్య యజేత్కృష్ణం గురుపూజనపూర్వకమ్.
రుక్మిణీం సత్యభామాం చ పార్శ్వయోరిన్దమగ్రతః,
పృష్ఠతస్సురభిం చేష్ట్వా కేశరేష్వంగపూజనమ్,
కాలింద్యోద్యా మహిష్యోఽష్టౌ వసుపత్రేషు సంస్థితాః,
పీఠకోణేషు బద్ద్వాది కింకిణీం చ తథా పునః.
దాని పృష్ఠయోర్వణుం పురళీవత్సకౌస్తుభౌ,
అగ్రతో వనమాలాదిర్షికష్టసు తథా స్థితాః.
పాంచజన్యం గదా చక్రం వసుదేవశ్చ దేవకీ,
నన్దగోపో యశోదా చ పగోగోపాలగోపికొః.
ఇంద్రాదయాశ్చ స్థితా బాహ్యా వజ్రాద్యాశ్చ తతః పరమ్,
కుముదః కుముదాక్షశ్చ పుండరీకోథ వామనః.
శంకుకర్ణస్సర్వనేత్రస్సుముఖప్సుప్రతిష్ఠితః,
విష్వక్సేనశ్చ పంపూజ్య స్వాత్వా చార్చ్యప్తతః పరమ్.
ఏకకాలం త్రికాలం వా యో గోవిన్దం యజేన్నరః,
ప చిరాయుర్నిరాతంకో ధనధాన్యపతిర్భవేత్.
“ఓం నమో భగవతే నన్దపుత్రాయ ఆనన్దవపు షే శ్రీకృష్ణాయ గోవిన్దాయ స్వాహా" అనునది ఇరువది యెనిమిది అక్షరములు గల మంత్రము. సర్వాభీష్టప్రదము.
నన్దపుత్రాయ శ్యామలాంగాయ బాలవపు షే కృష్ణాయ గోవిందాయ శ్రీకృష్ణాయ గోవిన్దాయ స్వాహా” అనునది ముప్పది రెండక్షరములు గల మంత్రము. ఈ రెండు మంత్రములకు నారద ఋషి. ఉషైక్ అనుష్టుప్ ఛందస్సులు. నన్దపుత్రుడు దేవత. అఖిలాఫ్రికి వినియోగము. చక్రములచే పంచాంగ కల్పనము. సాయుధులగు దిక్పాలాదులను పూజించవలయును. దక్షిణ హస్తమున రత్న చషకమును, వామహస్తమున సౌవర్ల నేత్రనమును ధరించినవాడు ప్రియాగ్లిష్టదేహుడగు కృష్ణుని ధ్యానించవలయును. లక్ష జపించవలయును. దశాంశమును పాయసముచే హోమము గావించవలయును. ఇట్లు ఈ మంత్రములు సిద్దించిన తరువాత అభీష్టములను సాధించుకానవలయును. __
“ఓం నమో భగవతే నన్దపుత్రాయ బాలవపు షే స్వాహా” అనునది పందామ్మిది అక్షరముల మంత్రము, బ్రహ్మముని అనుష్టుప్ఛన్లస్సు. బాలవపుడగు కృష్ణుడు దేవత. ఈ మంత్రమును పండితులు సర్వసంపత్తి సిద్దికాఱకు ఉపాసింతురు. “ఓం నమో భగవతే రుక్మిణీవల్లభాయ స్వాహా" అను మంత్రము షోడశాక్షరి నారదఋషి. అనుష్టుప్ఛన్లస్సు. రుక్మిణీ వల్లభుడు దేవత. 1, 2, 4, 6, 2 వర్ణములచే పంచాంగకల్పన చేయవలయును. తరువాత సురేశ్వరుని ధ్యానించవలయును. తాపింఛకాంతి గల శ్రీకృష్ణుడు తన అంకముననున్న స్వర్ణకాంతి గల పద్మమాలను కంఠమున ధరించిన ప్రియురాలిని వామభుజముచే ఆలింగనము చేసుకాని, ప్రియురాలిచే కూడా ఆలింగనము చేయబడి, ఇతర హస్తమున సౌవర్ణనేత్రమును ధరించి, పరిశుద్దపీతాంబర ధారి నానాభూషణభూషితుడగు శ్రీహరి కాపాడుగొత అని ధ్యానించి ఒక లక్ష జపించవలయును. దశాంశమును రక్త పద్మములచే త్రిమధువులను కలిపీ హోమమును గావించవలయును. పూర్వోక్త పీఠమున శ్రీ హరిని పూజించవలయును. అంగములను నారద ముఖ్యులను, సాయుధులగు లోకేశులను పూజించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించినచో సర్వాభీష్టములను ఇచ్చును. ఈలీలాదండ । పద్బో । జనసంసక్తదోర్దండ । ధరాదీశ । మేఘశ్యామ । భగవాన్ । 'విష్ణో । ఫట్” అనునది ఇరువది తొమ్మిది అక్షరములు గల మంత్రము. నారద ఋషి. అనుష్టుప్పనస్సు. లీలాదండ హరి దేవత. 9, 4, 4, 3, 4 మంత్రాక్షరములచే అంగకల్పన గావించవలయును. నిజపామకరస్థితదండముచే గోపయువతులను, ఇతర సుందరీమణులను మోహింప చేయుచు, నిజ ప్రియమిత్రుని భుజము పై దక్షిణ హస్తమునుంచినవాడు, కంసుని సంహరించినవాడు, ఉరుక్రముడు మమ్ములను కాపాడుగావుత. ఒక లక్ష జపించవలయును. దశాంశమును త్రిమధు మిశ్రితములగు తిలతండులములచే హోమమును గావించవలయును. తరువాత ఆంగకల్పనగావించి సాయధులైన దిక్పాలకులను పూజించవలయును. లీలాదండధరుడగు శ్రీహరిని ప్రతినిత్యము ఆదరముతో పూజించువాడు అందరిచే పూజించబడును. అతనింటిలో లక్ష్మి స్థిరముగా నిలుచును. సద్యారూఢస్మృతితోయము కేశవాధ్యధరాయుగము. భయాగ్నివల్లభా మంత్రము. అనగా • ఓం కేశావవాయ స్వాహా” అను మంత్రము సప్తాక్షరమంత్రము. సర్వసిద్ధి ప్రదము. నారద ఋషి. ఉమ్లెక్సందస్సు. గోవల్లభుడు దేవత. పూర్వము వలె చక్రములతో పంచాంగ కల్పన గావించి, కపిలాగణ మధ్య స్థితుడు, గోపికలను గోవులను ఆహ్వానించుచు దక్షిణ హస్తమున వేణువును ధరించి యష్టనిపాశమును వామకరమున ధరించి, మేఘ శ్యాముడు, మయూర పింఛాలంకృతుడగు శ్రీహరిని ధ్యానించవలయును. ఏడు లక్షలు జపము చేయవలయును. తరువాత పూర్వోక్త పీఠమున అంగములతో ప్రథమావరణ పూజను గావించవలయును. సువర్ణ పింగల, గౌరపింగల, రక్త పింగల, గుడపింగ, బభ్రువర్ల, ఉత్తమకపిల, చతుష పింగల, పీత పింగల అను గోగణాష్టకమును పూజించి సాయుధులైన లోకపాలులను పూజించి మంత్ర సిద్ధిని పొంది కామనలను సాధించుకానవలయును. ప్రతిదినము అష్ణోత్తరసహస్రము పాలతో హోమము చేసిననచో పది హేను దినములలో గోగణముతో ముక్తుడగును. దశాక్టరమంత్రమునకు కూడా ఇదియే విధి.
“ఓం నమో భగవతే శ్రీగోవిందాయ” అనునది ద్వాదశాక్షర మంత్రము, నారద ఋషి, గాయత్రీ ఛందస్సు. శ్రీగోవిందుడు దేవత. 1,2,4,5 అక్షరములచే అంగకల్పన కావించవలయును. కల్పవృక్షమూలమును ఆశ్రయించి మణులచే శోభించు దివ్య సింహాసనమున నున్న వాడు, మేఘ శ్యాముడు, సీతాపరుడు ఆతీసుందరుడు, శంఖ నేత్రధరుడు, గోసహాసపరివృతుడు, అమరపతి, ప్రౌఢహస్తముననున్న కుంభము నుండి జారిపడుచున్న అమృత ధారలచే స్నానము చేయబడువాడు అభినవాంభోజపత్రనేత్రుడగు శ్రీహరిని ధ్యానించవలయును. పన్నెండులక్షలు జపించవలయును. దశాంశమును పాలచే హోమము గావించవలయును. పూర్వమువలె గోషమున నున్నవానిని కాని ప్రతిమాదులందు గాని పూజించవలయును. పూర్వోక్తవైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి అచట శ్రీకృష్ణపరమాత్మను ఆవాహన గావించి, గురుపూజన పూర్వకముగా పూజించవలయును. ఇరుప్రక్కల రుక్మిణీ సత్య భామలను, అగ్రభాగమున ఇంద్రుని, పృష్ఠభాగమున సురభిని, కేశరములందు, అగ్రభాగమున ఇంద్రుని, పృష్ఠభాగమున సురభిని. కేశరములందు అంగములను, కాలిందీ మొదలగు అష్టభార్యలను, వసుపత్రములందు, పీఠకోణములందు బడ్డాది కింకిణిని, పృష్ఠ భాగమున దామములను, ముందు వేణువును, శ్రీవత్స కౌస్తుభములను, అగ్రభాగమున వనమాలను, అష్టదిక్కులలో పాంచజన్యమును, గదను, చక్రమును, వసుదేవుని దేవకీని, నందగోపుని, యశోదను, గోగోపాల గోపికలను, బాహ్యభాగమున ఇంద్రాది దేవతలను, వజ్రాద్యాయుధములను, కుముద, కుముదాక్ష, పుండరీక, వామన, శంకుకర్ణ, సర్వనేత్ర, సుముఖ, సుప్రతిష్ఠితాదులను, విష్వక్సేనుని పూజించి స్వాత్మను పూజించవలయును. ఒకమారు కాని మూడు మార్లు కాని గోవిందుని పూజించువాడు చిరాయువు నిరాధుడు ధనధాన్యాధిపతియగును.
స్మృతిస్సద్యాన్వితా చక్రీ దక్షఃర్ణయుతో ధరా,
నాథాయ హృదయాంతోఽయం వసువ మహామనుః.
మునిర్భ్రహ్మాస్య గాయత్రీ ఛన్దః కృష్ణోఽస్య దేవతా,
వర్ణద్వంద్వైశ్చ సర్వేణ పంచాంగాన్యస్య కల్పయేత్.
పంచవర్షమతిలోలమంగణే ధావమానమతిచంచలేక్షణమ్, కింకిణీవలయహారనూపురైరంజితం నమత గోపబాలకమ్.
ఏవం ధ్యాత్వా జు పేదష్టలక్షం మంత్రి దశాంశతకి,
బ్రహ్మ వృక్షపమిద్భిశ్చ జుహుయాత్పాయ పేన వా.
ప్రాగుక్తే వైష్ణవే పీఠే మూర్తిం సంకల్ప్య మూలతః,
తత్రావాహ్యార్చయేత్కృష్ణం మంత్రి వై స్థిరమానసః.
కేపరేషు చతుర్ధిక్షు విదిక్షంగాని పూజయేత్,
వాసుదేవం బలం దీక్షు ప్రద్యుమ్నమనిరుద్దకమ్.
విదిక్షు రుక్మిణీసత్యభామే వై క్ష్మణార్కజే,
లో కేశాన్సాయుధాన్బా హ్యే ఏవం సిద్దే భవేన్మనుః.
తారశ్రీభువనాకా జేన్తం శ్రీకృష్ణమీరయేత్,
శ్రీగోవిన్దం తతః ప్రోచ్య గోపీజనపదం తతః.
వల్లభాయ తతః పద్మా త్రయం తాత్వాక్షరో మనుః,
మున్యాదికం చ పూర్వోక్తం సిద్ధగోపాలకం స్మరేత్.
మాధవీమండపా సీనౌ గరుడేనాభిపాలితో,
దివ్య క్రీడాసు నిరతా రామకృష్ణౌ స్మరన్జపేత్.
పూజనం పూర్వవచ్చాస్య కర్తవ్యం వైష్ణవోత్తమై:,
చక్రీ మునిస్వరో పేతసర్గీ చైకాక్షరో మనుః.
కృష్ణేతి ద్వ్యక్షరః ప్రోక్తః కామాదిస్స్యాత్స్వర్ణకః,
సైవ జేన్తో యుగార్ణస్స్యాత్కృష్ణాయ నమ ఇత్య పి.
పంచాక్షరశ్చ కృష్ణాయ కామరుద్ధస్తథాపరః,
గోపాలాయాగ్ని జాయాంతో రసవర్ణః ప్రకీర్తితః.
కామః కృష్ణపదం జేన్తo వహ్నిజాయాంతకః పరః,
కృష్ణగోవిన్దకౌ జేన్తౌ సప్తార్ణస్సర్వసిద్ధిదః.
శ్రీశక్తికామాః కృష్ణాయ కామః స్సఫ్తాక్షరః పరః,
కృష్ణగోవిన్షకా జేస్తే హృదన్తోఽన్యో నవాక్షరః.
జేన్తౌ చ కృష్ణగోవిన్దౌ తథా కామః పుటః పరః,
కామశ్నార్జీ ధరాసంస్థో మన్వంద్వాఢ్యశ్చ మన్మథః.
శ్యామలాంగాయ హృదయం దశార్ణస్సర్వసిద్ధిదః,
బాలాంతే వపుషే కృష్ణాయాగ్నిజాయాంతిమోఽపరః.
ద్విషాంతే బాలవపు షే కామః కృష్ణాయ సంవదేశ్,
తతోధ్యాయశ్వహృదయే గోపీజనమనోహరమ్.
శ్రీబన్దావిపినప్రతోలిషు నమత్సంపల్లవల్లీతతిష్వన్తర్జాలవిఘట్టనైసురభిణా వాతేన సంసేవితే,
కాలిన్దీ పులినే విహారిణమధో రాధైకజీవాతుకం,
వన్దే నన్దకిశోరమిన్దువదనం స్పీగ్ధాంబుదాడంబరమ్.
పూర్వోక్తవర్త్మనా పూజా జ్ఞేయా హ్యేషా మునీశ్వర,
దేవకీసుతవర్ణాంతే గోవిందపదముచ్చరేత్.
వాసుదేవపదం ప్రోచ్య సంబుద్ధ్యస్తం జగత్పతిమ్,
దేహి మే తనయం పశ్చాత్ కృష్ణ త్వామహమీరయేత్.
శరణం గత ఇత్యంతో మంత్రో ద్వాత్రింశదక్షరః,
నారదోఽస్య మునిశ్ఛన్దో గాయత్రీ చాప్యనుష్టుభమ్.
దేవస్సుతప్రదః కృష్ణః పాదైస్సర్వేణ చాంగకమ్.
విజయేన యుతో రథస్థితః ప్రసభమానీయ సముద్రమధ్యతః,
ప్రదదత్తనయాన్ద్విజన్మనే స్మరణీయో వసుదేవనన్దనః.
లక్షం జపోయుతం హోమస్తిలైర్మధురసంపుతైః,
అర్చా పూర్వోదితే పీకే అంగలో కేశ్వరాయుధైః. .
ఏవం సిద్ధే మనౌ మంత్రీ వంధ్యాయామపి పుత్రవాన్,
తారో మాయా తతస్సాన్త స్సేన్దుష్వాన్త్రశ్చ సర్వవాన్.
సోఽహం వహ్ని ప్రియాంతోఽయం మన్త్రో వస్వక్షరః పరః,
పంచబ్రహ్మాత్మ కస్యాస్య మన్త్రస్య మునిసత్తమః
ఋషీర్భ్రహ్మా చ పరమా గాయత్రీ ఛన్ద ఈరితమ్,
పరంజ్యోతిః పరం బ్రహ్మ దేవతా పరికీర్తితమ్.
ప్రణవో బీజమాఖ్యాతం స్వాహా శక్తి రుదాహృతా,
త్విహేతి హృదయం ప్రోక్తం సోఽహం వేతి శిరో మతమ్.
హంసశ్చేతి శిఖా ప్రోక్తా హృల్లేఖా కవచం స్మృతమ్,
ప్రణవో నేత్రమాఖ్యాతం అస్త్రం హరి హరేతి చ
స బ్రహ్మా స శవో విప్రుహరి స్సైవ దేవరాట్,
స పర్వరూపస్సర్వాఖ్యసోభరః పరమస్వరాట్.
ఏవం ధ్యాత్వా జు పేదష్టలక్షహోమో దశాంశతః,
పూజాప్రణవపీఠేఽస్య సాంగావరణ కైర్మతా.
ఏవం సిద్దే మనో జ్ఞానం సాధ కేన్ద్రప్య నారద,
జాయంతే తత్త్వమస్యాదివాక్యోక్తం నిర్వికల్పకమ్.
“ఓం ధరానాథాయ నమః” అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మముని. గాయత్రీ ఛందస్సు. శ్రీకృష్ణుడు దేవత. వర్ణద్వంద్వముచే పంచాంగకల్పన చేయవలయును. పంచవక్తవయస్కుడు, అతిలోలుడు, అంగణమున పరుగిడువాడు అతిచంచలేక్షణుడు, కింకిణీవలయహారనూపురభూషితుడు అగు గోపబాలుని నమస్కరించుడు. ఇట్లు ధ్యానము గావించి ఎనిమిది లక్షలు జపించ వలయును. దశాంశమును బ్రహ్మవృక్షసమిధలచే కాని పాయసముచే కానీ హోమము గావించవలయును. పూర్వోక్త వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, అచట ఆవాహనగావించి స్థిరమనస్కుడై అర్చించవలయును. కేసరములందు, నాలుగు దిక్కులందు విదిక్కులందు అంగపూజను గావించవలయును. వాసుదేవుని, బలరాముని, దిక్కులందు ప్రద్యుమ్నానిరుద్ధులను, విదిక్కులందు రుక్మిణీ సత్యబామలను లక్షణం జాంబవతులను, సాయుధులగు లోకపాలకులను బయట పూజించవలయును. ఇట్లు చేసిన మంత్రము సిద్ధించును.
“ఓం శ్రీ భువనకాపయ శ్రీకృష్ణాయ శ్రీగోవిందాయ గోపీజనవల్లభాయ" అనునది ఇరువది అయిదక్షరముల మంత్రము. మున్యాదికమంతయు పూర్వోత్తమువలెనే యుండును. సిద్ద గోపాలుని స్మరించవలయును. మాధవీ మండపా సీనులు గరుడాభిపాలితులు, దీవ్యక్రీడానిరతులు అగు రామకృష్ణులను స్మరించుచు జపించవలయును. విష్ణు భక్తులు ఈ " మంత్రమునకు పూజనము పూర్వోక్తవిధిగా నాచరించవలయును. శ్రీ అనునది ఏకాక్షర మంత్రము. కృష్ణ అనునది ద్వ్యక్షరమంత్రము. శ్రీకృష్ణ అనునది త్ర్యక్షర మంత్రము. శ్రీ కృష్ణాయ అననునది చతురక్షరీ మంత్రము. కృష్ణాయనమః అనునది పంచాక్షర మంత్రము శ్రీకృష్ణాయ నమః గోపాలాయ స్వాహా అనునవి షడక్షరమంత్రములు శ్రీకృష్ణాయ స్వాహా అనునది కూడా షడక్షరమంత్రము. కృష్ణాయ గోవిందాయ నమః అనునది నవాక్షర మంత్రము ఓం శ్రీ గోవిందాయ నమః అనునది అష్టాక్షర మంత్రము. శ్రీధరాశ్యామలాంగాయ నమః అనునది దశాక్షరమంత్రము. బాలవపు షే కృష్ణాయ స్వాహా అనునది మరియొక దశాక్షరి. బాలవపు షే కృష్ణాయ నమః, అనునది ఇంకాక దశాక్షరి. తరువాత గోపీ జనమనోహరుని స్వప్పదయమున ధ్యానించవలయును. శ్రీబృష్ణావన ప్రాంతమున వికసించిన పూలచే - వంగిన తీగల సమూహములు : కలిపాదలందు పరస్పర సంఘర్షము వలన పరిమలవంతమగు వాయువుచే సేవించబడిన కాలిందీతీరమున విహరించు చున్నవాడు రాధ జీవమునకు ముఖ్యాధారుడు, నందకిశోరుడు, స్నిగ్లాంబుదాడంబరుడు ఇందువదనుడగు శ్రీకృష్ణుని నమస్కరించుచున్నాను. ఈ మంత్రములకు పూర్వోక్తవిధానముచే పూజాదికము నాచరించవలయును. .
దేవకీసుత । గోవిన్ద । వాసుదేవ । జగత్పతే । దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః" అనునది ముప్పది రెండక్షర ముల మంత్రము. నారద ముని గాయత్రీ అనుష్టుప్ఛన్లస్సులు.
సుతప్రదుడగు శ్రీకృష్ణుడు దేవత. అన్ని పాదములచే అంగన్యాసము కావించవలయును. అర్జునునితో కలిసి రథము మీద కూర్చొని సముద్రమధ్యమునకు వెళ్ళి, మరణించిన బ్రాహ్మణపుత్రులను తెచ్చి ఇచ్చిన శ్రీకృష్ణుని ధ్యానించవలయును. ఒక లక్ష జపము చేయవలయును. దశాంశము. మధుర మిశ్రితములగు తిలలచే హోమమును గావించవలయును. పూర్వోక్త పీఠమున అంగ సాయుధ ద్సీల పూజగావించవలయును. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినచో గొడ్రాలియందు కూడా పుత్రులను పొందును. . “(ఓం )”
సోహం హంస స్వాహా నమః' అనునది అష్టాక్షర మంత్రము. పంచ బ్రహ్మాత్మకమగు ఈ మంత్రములకు బ్రహ్మ ఋషి. గాయత్రీ ఛందస్సు. పరంజ్యోతి పరబ్రహ్మ దేవత. ప్రణవము బీజము. స్వాహాశక్తి, స్వాహా అనునది హృదయము. సొహం వా అనునది శిరస్సు. హంస అనునది శిఖా. 'నమః' అనునది కవచము. ప్రణవము నేత్రము. హరిహరి అనునది అస్త్రము. అతనే బ్రహ్మ అతనే శివుడు, అతనే హరి, అతనే ఇంద్రుడు, అతనే సర్వరూపుడు, సర్వనాముడు, అతనే ఆక్టరుడు పరముడు, స్వరాట్. ఇట్లు ధ్యానించి ఎనిమిది లక్షలు జపించవలయును. దశాంశము హోమము గావించవలయును. పూర్వోక్త ప్రణవపీఠమున సాంగావరణపూజ గావించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత సాధకునికి “తత్త్వమసి" ఇత్యాది వాక్యముల నిర్వికల్పకజ్ఞానము కలుగును.
కామో జేఽన్తో హృషీ కేశో హృదయాంతో గజాక్షరః,
ఋషిర్భ్రహ్మాస్య గాయత్రీ ఛందో గాయత్రవీరితమ్.
దేవతా తు హృషీ కేశో వివియోగోఽఖిలాప్తయే,
కామో బీజం తథాయేతి శక్తిరస్య హ్యుదాహృతా.
బీజేనైవ షడంగాని కృత్వా ధ్యానం సమాచరేత్,
పురుషోత్తమమంత్రోక్తం సర్వం వాప్య ప్రకీర్తితమ్.
లక్షం జపోఽయుతం హోమో ఘృతేనైవ ప్రకీర్తితః,
తర్పణం సర్వకామాప్యై ప్రోక్తం సoమోహినీసుమైః.
శ్రీబీజం చ చతుర్థ్యంతశ్రీధరో జేస్తకస్తథా,
త్రైలోక్యమోహనశ్శబ్ధో నమోంతో మనుమీరితః,
ఋషిర్భ్ర చ గాయత్రీ ఛన్దశ్రీధరదేవతా,
శ్రీబీజం శక్తరామేతి బీజేనైవ షడంగకమ్.
పురుషోత్తమవద్ద్యానపూజాదికమిహోదితః,
లక్షం జపస్తథా హోమ ఆజ్యేనైవ దశాంశతః,
సుగన్ద శ్వేతపుష్పైస్తు పూజాం హోమాదికం చరేత్,
ఏవం కృతే తు విప్రేన్ద్రసాక్షాత్స్యాశ్రీధరస్స్వయమ్.
అచ్యుతానంతగోవిన్దపదం జేస్తం నమోంతకమ్,
మంత్రోఽస్య శౌనక ఋషిర్విరాట్ఛన్దః ప్రకీర్తితః.
ఏషాం పరాశరవ్యాపనారదా ఋషయస్స్మృతా,
విరాట్చన్దస్సమాఖ్యాతం పరబ్రహ్మాత్మకో హరి:.
దేవతా బీజశక్తీ తు పూర్వోక్తే సాధకైర్మతే,
శంఖచక్రధరం దేవం, చతుర్బాహుం కిరీటినమ్..
సర్వైరప్యాయుధైర్యుక్తం గరుడోపరి పరిస్థితమ్,
సనకాదిమునీన్దైస్తు సర్వదేవైరుపాపితమ్.
శ్రీభూమిసహితం దేవముదయాదిత్యసన్నిభమ్, ప్రాతరుద్యత్సహస్రాంశుమండలోపమకుండలమ్.
సర్వలోకప్య రక్షార్థమనన్తం నిత్యమేవ హీ,
అభయం వరదం దేవం ప్రయచ్ఛన్తం ముదాన్వితమ్..
ఏవం ధ్యాత్వార్చయేత్పతే వైష్ణవే సుపమాహితః, ఆద్యావరణసాంగైస్స్యాచ్చక్రశంఖగదాదిభిః.
ముసలాఢ్యధనుపాశాంకుశైః ప్రోక్తం ద్వితీయకమ్,
సనకాదికశాక్తేయవ్యాపనారదశౌనకై:
తృతీయం లోకపాలైస్తు చతుర్థం పరికీర్తితమ్,
లక్షం జపో దశాంశేన ఘృతేన హవనం స్మృతమ్.
ఏవం సిద్ధే మనౌ మన్త్రీ ప్రయోగానప్యుపాచరేత్,
శ్రీవృక్షమూలే దేవేశం ధ్యాయన్వై రోగిణం స్మరన్.
సృష్ణా జప్త్వాయుతం సాద్యం స్మృత్వా వా మనసా ద్విజ,
రోగిణం రోగనిర్ముక్తం కుర్యాన్మన్త్రీతు మండలాత్.
కన్యార్థి జుహుహల్లాజేర్చిల్వేశ్చాపి ధనాప్తయే,
వస్త్రార్ధి గంధకుసుమైరారోగ్యాయ తిలైర్హునేత్.
రవివారే జలేస్థిత్వా నాభిమాత్రే జపేత్తు యః,
అష్టోత్తరసహస్రం వైప జ్వరం నాశయేద్ధ్రువమ్.
వివాహార్థం జపేన్మాషం శశిమండలమధ్యగమ్,
ధ్యాత్వా కృష్ణం లభేత్కన్యాం వాంఛితాం చాపి నారద.
వసుదేవపదం ప్రోచ్య నిగడచ్ఛేదశబ్దతః,
వాసుదేవాయ వర్మాస్త్రే స్వాహాంతో మనురీరితః.
నారదోఽస్య ఋషిశ్ఛందో గాయత్రీ కృష్ణ దేవతా,
వర్మ బీజం శిరశ్శక్తిరన్యత్సర్వం దశార్ణవత్.
బాలః పవనదీర్ఘేన్దుయుక్తో ఘంటీశయుర్జలమ్,
అత్రిర్వ్యాసాయ హృదయం మనురష్టాక్షరోఽవతు.
బ్రహ్మానుష్టుప్ మునిశ్ఛన్దో దేవస్సత్యవతీసుతః,
ఆద్యం బీజం నమశ్శక్తి: దీర్ఘఢ్యోనాదినాంగకమ్.
వ్యాఖ్యాముద్రికయా లపత్కరతలం సద్యోగ పీఠ స్థితమ్,
వామే జానుతలే దధానమపరం హస్తం పువిద్యావిధిమ్,
విప్రవ్రాతవృతం ప్రసన్నమనపం సాథోరుహాగద్యుతిమ్,
పారాశర్యమతీవపుణ్యచరితం వ్యాపం స్మరేత్సిద్ధయే.
జ పేదష్టసహస్రాణి పాయ సైర్హోమమాచరేత్,
పూర్వోక్త పీఠే వ్యాపస్య పూర్వమంగాని పూజయేత్.
ప్రాచ్యాదిషు యజేత్పైలం వైశంపాయనజైమినీ,
సుమంతుం కోణభాగేషు శ్రీశుకం రోమహర్షణమ్.
ఉగ్రశ్రవపమన్యాశ్చ మునీన్సేంద్రాదికాయుధాన్,
ఏవం సిద్ధమనుర్మంత్రీ కవిత్వం శోభనాః ప్రజాః.
వ్యాఖ్యానశక్తిం కీర్తిం చ లభతే సంపదాం చయమ్,
నృసింహో మాధవో దృష్టో లోహితో నిగమాదిమః,
కృశానుజాయా పంచార్ణో మనుర్విషహరః పరః,
అనన్తపంక్తిపక్షీంద్రా మునీశ్ఛన్దస్సురా మతాః.
తారవహ్నిప్రియే బీజశక్తీ మన్త్రస్య కీర్తితే,
జ్వలజ్జ్వలమహామన్త్రీ స్వాహా హృదయమీరితమ్.
గరుడేతి పదస్యాంతే చూడాననశుచిప్రియా,
శిరో మంత్రో గరుడతః శిఖే స్వాహా శిఖా మనుః.
గరుడేతి పదం ప్రోచ్య ప్రభంజయ యుగం వదేత్,
ప్రభేదయ యుగం పశ్చాద్విత్రాసయ విమర్దయ.
ప్రత్యేకం ద్విస్తతః స్వాహా కవచస్య మనుర్మతః,
ఉగ్రరూపధరాంతే తు పర్వవిషహరేతి చ.
భీషయ ద్వితయం ప్రోచ్య సర్వం దహద హేతి చ,
భస్మీ కురు తతస్వాహా నేత్రమంత్రోఽయమీరితః,
అప్రతిహతవర్ణాంతే బలాయ ప్రహతేతి చ,
శాసనాంతే తథా హుంఫట్ స్వాహాస్త్రమనురీరితః.
పాదే కటౌ హృది ముఖే మూర్ద్ని వర్ణానవిన్య సేత్.
తప్తస్వర్ణనిభం ఫణీన్ద్రనికరైః క్లుప్తాంగభూషం ప్రభుమ్,
స్మర్తృణాం శమయన్త్రముగ్రమఖిలం నృణాం విషం తత్కణాత్, చంచగప్రచలద్భుజంగమభయం పాణ్యోర్వరం బిభ్రతమ్
పక్షచ్చారితసామగీతమమలం శ్రీ పక్షిరాజం భజే.
పంచలక్షం జపేన్మన్త్రం దశాంశం జుహుయాత్తిలై,
పూజయేన్మాతృకాపీఠే గరుడం వేదవిగ్రహమ్.
చతుర్థ్యన్తః పక్షిరాజః స్వాహా పీఠమనుస్మృతః,
దృష్ట్వాంగం కర్ణికామధ్యే నాగాన్యంతేషు పూజయేత్.
తద్భహిర్లోకపాలాంశ్చ వజ్రాద్యైలపత్కరాన్,
ఏవం సిద్ధమనుర్మన్త్రీ నాశయేన్గరలద్వయమ్.
దేహాంతే లభతే చాపి శ్రీవిష్ణోః పరమం పదమ్.
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే కృష్ణాదిమస్త్రభేదనిరూపణం నామ ఏకాతీతిత మోఽధ్యాయః.
“శ్రీ హృషీకేశాయ నమః” అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మ ఋషి, గాయత్రీ ఛందస్సు, హృషీకేశుడు దేవత. అఖిలాఫ్రికి వినియోగము. కామబీజము ఆయ అనునది శక్తి. బీజము చేతనే షడంగములను కల్పించి ధ్యానించవలయును. పురుషోత్తమ మంత్రమునకు చెప్పినదంతయూ ఇచట ఆచరించవలయును. లక్ష జపము పదివేలు నేయిచే హోమమును గావించవలయును. సంమోహినీ పుష్పములచే తర్పణము గావించిన సర్వాభీష్టములు. సిద్దించును. । శ్రీ శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః” అనునది పదునాలుగక్షరముల మంత్రము. బ్రహ్మరుషి. గాయత్రి ఛందస్సు. శ్రీధరుడు దేవత. శ్రీ బీజము 'ఆయ 'శక్తి, బీజముచే షడంగకల్పనము. 'ధ్యానపూజాదికమంతయు
పురుషోత్తమమంత్రమునకు వలె చేయవలయును. లక్షజపము దశాంశము నేయిచే హోమము. సుగంధశ్వేత పుష్పములచే పూజను హోమాదికమును ఆచరించవలయును. ఇట్లు చేసినవాడు సాక్షాత్తు శ్రీధరుడగును.
“అచ్యుతాయనమః” “అనంతాయనమః" ఈగోవిన్దాయనమః"అనునవి మంత్రరాజములు. శౌనక ఋషి విరాట్ఛందస్సు. పరాశరవ్యాసనారదులు ఋషులు. విరాట్చనస్సు పరబ్రహ్మత్మ కమగు హరి దేవత. బీజశక్తులు పూర్వోత్తములు. శంఖచక్రధరుడు, చతుర్భాహుడు, కిరీటి, సర్వాయుధయుతుడు, గరుడవాహనారూడుడు, సనకాదిమునీంద్రులచే సర్వదేవతలచే ఉపాసించ బడువాడు, శ్రీభూమిసహితుడు, ఉదయాదిత్యసన్నిభుడు, ఉద్యదాదిత్యసహస్ర సన్నిభకుండలుడు, సర్వలోకరక్షణ కాఱకు అనన స్థితుడు, భయప్రదుడు, వరదుడు, ముదాన్వితుడు, అగు హరిని, ధ్యానించి, వైష్ణవపీఠమున అర్చించవలయును. ప్రథమావరణమున శంఖ చక్ర గదా ఖడ్గములను, ముసల" ధనుః 'పాశాంకుశములను ద్వితీయావరణమున, సనకాదిక శాక్తేయ వ్యాసనారద శౌనకులను తృతీయావరణమున, చతుర్ధావరణమున లోకపాలులను, పూజించవలయును. లక్ష జపము దశాంశము నేతితో హోమము గావించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములనాచరించవచ్చును. -బిల్వవృక్షము క్రింద నున్న దేవుని ధ్యానించుచు రోగిని స్మరించుచు, లేదా రోగిని స్పశించికాని పది వేలు జపించవలయును. మనసులో స్మరించికాని జపించవలయును. ఇట్లు నలుబది రోజులు చేసినచో రోగులకు రోగవిముక్తి లభించును. కన్యను కోరువాడు పేలాలచే హోమముగావించవలయును. ధనార్ణి' బిల్వములచే హోమమును చేయవలయును. వస్త్రార్జిగంధకుసుమములచే ఆరోగ్యార్ధి తిలలచే హోమమును గావించవలయును. ఆదివారమున నాభిమాత్రము జలములో నుండి అష్టోత్తర. సహస్రము జపించినచో జ్వరము నశించును. వివాహము కాఱకు ఒకమాసము చన్దమండలమధ్యగతుడగు కృష్ణుని ధ్యానించిన కోరిన కన్యను పొందవచ్చును.
“వసుదేవనిగడచ్చేదవాసుదేవాయ హుంఫట్ స్వాహా" అనునది మంత్రము. నారద , ఋషి గాయత్రీ చంధస్సు. శ్రీ కృష్ణుడు దేవత, కవచము. బీజము శిరము శక్తి మొదలగునవన్నియు దశాక్టరమంత్రమునకు వలే చెప్పుకానవలయును. బాలాత్రిఃవ్యాసాయ నమః అనునది అష్టాక్షర మంత్రము బ్రహ్మముని అనుష్టుప్ఛన్లస్సు సత్యవతీ పుత్రుడు దేవత. ఆద్యబీజము. నమశ్శక్తి దీర్ఘాఢ్యముచే అంగాదికము చేయవలయును. వ్యాఖ్యాముద్రచే శోధించు కరతలము కలవాడు. యోగపీఠస్థితుడు, వామజానుతలమున ఇతర హస్తమునుంచినవాడు, సువిద్యానిధి, విప్రసమూహావృతుడు, ప్రసన్న మనస్కుడు, పాథోరుహాద్యుతి, పుణ్య చరితుడు పరాశరపుత్రుడగు వ్యాసుని సిద్ధి కారకు స్మరించవలయును. ఎనిమిది వేలు జపించవలయును. దశాంశమును పాయసముచే హోమమునాచరించవలయును. పూర్వోక్తవ్యాసపీఠమున అంగ పూజ గావించవలయును. ప్రాచ్యాది దిక్కులందు పైలుని, వైశంపాయనుని, జైమినిని, సుమంతుని, కోణ భాగములందు శ్రీశుకుని రోమహర్షణుని, ఉగ్రశ్రవసుని, ఇతర మునులను, ఇంద్రాదికులను, వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొంది కవిత్వమును, ఉత్తమ సంతానమును, వ్యాఖ్యాన శక్తిని, కీర్తిని, సంపదలను పొందును. ఓం నృసింహాయస్వాహా ఓం మాధవాయస్వాహా ఓం లోహితాయ స్వాహా అను మంత్రములు పంచాక్టరులు. విషహరములు, అనంతముని, పంక్తి ఛందస్సు, పక్షీంద్రుడు దేవత, ఓం బీజము, స్వాహా శక్తి స్వాహా యనునది హృదయము గరుడచూడానన స్వాహా అనునది శిరోమంత్రము స్వాహా యనునది శిఖ, గరుడ ప్రభంజయ ప్రభంజయ । ప్రభోదయ, ప్రభేదయ । విక్రాసయ "విత్రాసయ । విమర్ధయ విమర్ధయ । స్వాహా అనునది కవచ మంత్రము. ఉగ్రరూపధర సర్వవిషహర భీషయ భీషయ సర్వం దహ దహ । భస్మీ కురు । స్వాహా -అనునది నేత్ర మంత్రము. అప్రతిహతబలాయ ప్రహతశాసన హుంఫట్ స్వాహా అనునది అస్త్రమంత్రము. పాదకటిహృదయముఖ మూర్ధములందు వర్ణన్యాసమును చేయవలయును. తప్తసువర్ణ నిభుడు ఫణీస్ట్రనికరములచే క్లుప్తాంగభూషుడు, స్మరించువారల తాపమును చల్లార్చువాడు సమస్త జనుల విషమును హరించువాడు ముక్కుకానను కదిలించుటచే పాములను భయమును కదిలించువాడు, పక్షములచే సామగానము చేయువాడు అగు పక్షిరాజును సేవించెదను. అని ధ్యానము చేసి అయిదు లక్షలు జపించి దశాంశమును తిలలచే హోమమును - చేయవలయును. మాతృకాపీఠమున వేద విగ్రహుడగు గరుడుని పూజించవలయును. పక్షిరాజాయ స్వాహా అనునది పీఠమంత్రము. కర్ణికామధ్యమున అంగమును పూజించి యంత్రములందు నాగులను పూజించవలయును. ఆ బయట లోకపాలురను వజ్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొందినవాడు గరలమును నశిపచేయగలడు. దేహాంతమున శ్రీవిష్ణుపదమును పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున, బృహదుపాఖ్యానమున తృతీయపాదమున కృష్ణాదిమస్త్రభేద నిరూపణమను ఎనుబది యొకట - అధ్యాయము సమాప్తము.
Summary of chapter 82 of the Nārada Mahā Purana is as follows:
సమస్త దేవతల ఆరాధనకు ఉపకరించే దివ్య యంత్రముల లేఖన విధానము ఈ అధ్యాయంలో వివరించబడినది. పీఠ పూజ, యంత్ర ప్రాణప్రతిష్ఠ మరియు ప్రతిమా పూజా క్రమములు ఇక్కడ శాస్త్రబద్ధంగా అభివర్ణించబడినవి.