నారద మహా పురాణము
3 - యమస్య బ్రహ్మలోకగమనమ్
ఋషయ ఊచు :-
విస్తరేణసమాఖ్యాహి విష్ణోరారాధనక్రియామ్ ।
యయా తోషం సమాయాతి ప్రదదాతి సమిహితమ్
లక్ష్మీభర్తా జగన్నాధో హ్యశేషాఘాఘనాశనః ।
కర్మణా యేన సుప్రీతో భవేద్యస్సచరాచరః
ఋషులుపలికిరి :- శ్రీహరి సంతోషించి సమిహితమునిచ్చు శ్రీమహావిష్ణువు ఆరాధనను సవిస్తరముగా తెలుపుము. లక్ష్మీపతి, జగన్నాధుడు సకలపాపనాశనుడు యే పూజతో ప్రీతిచెందునో తెలుపుము. శ్రీహరి ప్రీతితో చరాచరజగత్తుప్రీతి చెందును.
సౌతిరువాచ :-
భక్తిగ్రాహ్యా హృషీకేశో న ధనైర్థరణీధర ।
భక్త్యా సంపూజితో విష్ణుః ప్రదదాతి మనోరథమ్
తస్మాద్విప్రాస్సదా భక్తిః కర్తవ్యా చక్రపాణినః ।
జనేనాపి జగన్నాథః పూజితః క్లేశహా భవేత్
పరితోషం వ్రజత్యాశు తృషితస్తు జలైర్యధా ।
అత్రాపి శ్రూయతే విప్రా ఆఖ్యానం పాపనాశనమ్
రుక్మాంగదస్య సంవాద మృషిణా గౌతమేన హి ।
ఆసీద్రుక్మాంగదే రాజా సార్వభౌమః క్షమాన్వితః
క్షీరశాయిప్రియో భక్తో హరివాసరతత్పరః ।
నాన్యం పశ్యతి దేవేశా త్పద్మనాభాన్మహీపతిః
పటహం వారణే ధృత్వా వాదయేద్ధరివాసరే ।
అష్టవర్షాధికో యస్తు పంచాశీత్యూనవర్షకః
భునక్తి మానవో హ్యద్య విష్ణోరహని మందధీః ।
స మే దండ్యశ్చ వధ్యశ్చ నిర్వాస్యో నగరాద్బహిః
పితా చ యది వా భ్రాతా పుత్రో భార్యా సుహృన్మమ ।
పద్మనాభదినే భోక్తా నిగ్రాహ్యో దస్యువద్భవేత్
దదధ్వం విప్రముఖ్యేభ్యో మజ్జధ్వం జాహ్నవీజలే ।
మమేదం వచనం శ్రుత్వా రాజ్యం భుంజీత మామకమ్
వాసరే వాసరే విష్ణోః శుక్లపక్షే మహీపతిః ।
అశుక్షేతు విశేషణ పటహే హేమసంపుటే
ఏవం ప్రఘుష్టే భూపేన సర్వభూమౌ ద్విజోత్తమాః ।
గచ్ఛద్భిస్సంకులో మార్గః కృతోలోకైర్హరేర్ద్విజాః
యేకేచిన్నిధనం యాన్తి భూపాలవిషయే నరాః ।
జ్ఞానాత్ప్రమాదతోవాపి తేయాంతి హరిమందిరమ్
అవశ్యంవైష్ణవోలోక ప్రాప్యతే మానవైర్ద్విజాః ।
వ్యాజేనాపి ప్రకుర్వాణై దశీం పాపనాశినీమ్
సోఽశ్నాతి పార్థివం పాపం యోఽశ్నాతి హరివాసరే ।
స ప్రాప్నోతి ధరాధర్మం యోనాశ్నాతి హరేర్దినే
బ్రాహ్మణో నైవ హంతవ్య ఇత్యేషా వైదికీస్మృతిః ।
ఏకాదశ్యాం నభోక్తవ్య పక్షయోరుభయోరపి
వైలక్ష్యమగమద్రాజా రవిసూనున్జ్విజోత్తమాః ।
లేఖ్యకర్మణివిశ్రాన్త శ్చిత్రగుప్తోఽభవత్తదా
సమ్మార్జితాని లేఖ్యాని పూర్మకర్మోద్భవాని చ ।
గచ్ఛంతి వైష్ణవంలోకం స్వధర్మైర్మానవాః క్షణాత్
శూన్యాస్తు నిరయాస్సర్వే పాపప్రాణివివర్జితాః ।
భగ్నేయామ్యోఽ భవన్మార్గో ద్వాదశాదిత్యతాపితః
సర్వేహి గరుడారూఢా జనా యాంతి హరేః పదమ్ ।
దేవానామపి యే లోకా స్తే శూన్యాహ్యభవంస్తధా
ఉత్పన్నాః పితృదేవేజ్యా స్తీర్ధదేవాదిసత్క్రియాః ।
ముక్యైకాం ద్వాదశీం మర్త్యా నాన్యం జానన్తిం తే వ్రతమ్
శూన్యే త్రివిష్టపే జాతే శూన్యే చ నరకే తధా ।
నారదో ధర్మరాజానం గత్వా చేదమువాచహ
సౌతిపలికెను :- ఓ మహారాజా! హీృషీకేశుడు భక్తిచే గ్రహించబడును. ధనములచే వశుడు కాడు. భక్తిచే పూజించినచో శ్రీ మహావిష్ణువు మనోరథములను ప్రసాదించును. కావున సర్వకాలములందు శ్రీహరి భక్తికలిగి యుండవలయును. ఎవరు పూజించిననూ జగన్నాథుడు క్లేశములను హరించును. దప్పిగొనిన వాడు నీటితో సంతోషించినట్లు పూజచే శ్రీహరి సంతోషించును. ఈ విషయమును ఒకపాపనాశకమగు అఖ్యానము కలదు. రుక్మాంగద మహారాజునకు గౌతమఋషికి జరిగిన సంవాదము కలదు. రుక్మాంగదుడను మహారాజు క్షమశాలి. శ్రీమన్నారయణ ప్రియభక్తుడు, ఏకాదశీవ్రతము నాచరించువాడు. శ్రీహరికంటే ఇతరదైవములను చూడనివాడు. రుక్మాంగదమహారాజు ఏకాదశీదినమున ఏనుగుపై భేరినుంచి ఇట్లు చాటించేడివాడు. ఎనిమిది సంవత్సరములుపైబడినవారినుండి ఎనబదియైదు సంవత్సరముల వయసు కలవారు ఎవరైన శ్రీహరివాసరమగు ఏకాదశినాడు భుజించినచో వారు శిక్షాపాత్రులు వధ్యులు నగరమునుండి బహిష్కృతులగుదురు. అట్లు భుజించు వాడు తండ్రియైననూ, సోదరుడైననూ, పుత్రుడైననూ, భార్య అయిననూ, మిత్రుడైనను దొంగవలె నిగ్రహించదగువాడగును. ఏకాదశినాడు బ్రాహ్మణులకు దానములనిండు. గంగాజలమున స్నానము చేయుడు. ఇట్లు నా ఆజ్ఞను పాలించి నా రాజ్యమును అనుభవించుడు. శుక్లపక్షమున కృష్ణపక్షమున బంగారుతోడుగు తొడిగిన భేరిపై భూమండల మంతటా చాటించుటచే శ్రీహరిలోక మార్గము వెళ్ళువారిచే సంకులమాయెను. రుక్మాంగదరాజ్యమున మరణించువారందరు శ్రీవిష్ణులోకమునకు చేరుచుండిరి. రాజాజ్ఞ యను భయముచే లేదా మిషచే నైననూ ద్వాదశీవ్రతము నాచరించుచున్ననూ శ్రీహరిమందిర మును చేరుచుండిరి. ఏకాదశినాడు భుజించువాడు పృధివియందు గలపాపమును భుజించువాడే. ఏకాదశినాడు భుజించనివాడు భూమియందు గల ధర్మము నంతటిని పొందుచున్నాడు. బ్రాహ్మణుని చంపరాదు అనునది వైదికస్మృతి. శుక్షకృష్ణపక్షములలోని ఏకాదశులందు భుజించరాదు అనునది రుక్మాంగదస్మృతి. కావున సూర్యపుత్రుడగు యమధర్మరాజు వికారమును పొందెను. చిత్రగుప్తుడు కూడా వ్రాయుటనాపి విశ్రాని తీసుకొనెను. పూర్వమున చేసిన కర్మల వలన కలుగుపాపములను వ్రాసికూడా ఇపుడు తుడిచివేసెను. మానవులు స్వధర్మాచరణతో క్షణకాలమున విష్ణులోకమునకు వెళ్ళుచుండిరి. నరకములన్నియూ పాపప్రాణి రహితములై శూన్యములాయెను. ద్వాదశాదిత్యులతాపముతో యములోకమార్గము భగ్నమాయెను. జనులందరూ గరుడవాహనారూపుడులై శ్రీహరిలోకమునకు వెళ్లుచుండిరి. దేవలోకములు కూడా శూన్యము లాయెను. పితృయజ్ఞములు, దేవపూజలు తీర్థపూజలు దేవతా సత్కారములు సన్నగిల్లెను. రుక్మాంగదరాజ్యములోనిప్రజలు ద్వాదశీవ్రతమును తప్ప ఇతరపూజలను వ్రతములను తెలియకుండిరి. ఇట్లు స్వర్గము నరకము శూన్యముకాగా నారదమహర్షి యమధర్మరాజునసమీపమునకు వెళ్ళి ఇట్లు పలికెను.
నారద ఉవాచ :-
నాక్రన్ద శ్రూయతే రాజన్ ప్రాంగణే నరకేష్వధ ।
న చాపి క్రియతే లేఖ్యం కించిద్దుష్కృతకర్మణామ్
చిత్రగుప్తోమునిరివ స్థితోఽయం మౌనసంయుతః ।
కారణం కిం నచాయాంతి పాపినో యేన తే గృహమ్
మాయాదంభసమాక్రాంతా దుష్టకర్మరతాస్తధా ।
ఏవముక్తే తు వచనే నారదేన మహాత్మనా
ప్రాహ వైవస్వతో రాజా కించిదైన్యసమన్వితః
నారదమహర్షి పలికెను :- ఓ రాజా? నరకమున ఆక్రందనలు వినవచ్చుటలేదు. చిత్రగుప్తుడు పాపాత్ముల పాపములను వ్రాయుటలేదు. మునివలె మౌనముగాకూర్చొనియున్నాడు. పాపులెవరూ నీలోకమునకు వచ్చుటలేదు. మాయాకర్మపరులు దుష్టకర్మ రతులు ఎవరూ వచ్చుటలేదు. ఏమికారణము? ఇట్లు నారద మహర్షి అడుగగా యమధర్మరాజు కొద్ది దైన్యముతో నిట్లు పలికెను.
యమ ఉవాచ :-
యోఽయం నారద భూపాలః పృధివ్యాం సాంప్రతం స్థితః
స హి భక్తో హృషీకేశే పురాణపురుషోత్తమే ।
ప్రబోధయతి రాజేన్ద్ర స్సజనం పటహేన హి
నభోక్తవ్యం నభోక్తవ్యం సంప్రాప్తే హరివాసరే ।
యే కేచిద్భుoజతే మర్త్యా స్తే మే దండేషు యాంతి హి
తద్భయాద్ది జనాస్సర్వే ద్వాదశీం సముపాసతే ।
వ్యాజేనాపి మునిశ్రేష్ఠ ద్వాదశ్యాం సముపోషితాః
ప్రయాంతి వైష్ణవం లోకం దాహప్రలయవర్జితమ్ ।
ద్వాదశీ సేవనాల్లోకాః ప్రయాంతి హరిమందిరమ్
తేన రాజ్ఞా ద్విజశ్రేష్టా మార్గా లుప్తా మమాధునా ।
కృతా హి నరకాశ్శూన్యా లోకాశ్చాపిదివౌకసామ్
విశ్రాన్తం లేఖకైర్లేఖ్యం లిఖితం మార్జితం జనైః ।
ఏకాదశ్యుపవాసస్య మహాత్మ్యైన ద్విజోత్తమ
బ్రహ్మహత్యాదిపాపాని అభుక్యైవ జనా ద్విజ ।
సముపోష్య దినం విష్ణోః ప్రయాంతి హరిమందిరమ్
సోఽహం కాష్ఠమృగేశైవ ముల్యో జాతో మహామునే ।
నేత్రహీనః కర్ణహీనః సంధ్యాహీనో ద్విజో యధా
స్త్రీజితో వా పుమాన్యద్వ త్షండో వా ప్రమదాపతిః ।
త్యక్త మస్త్యహకాంబ్రహ్మంల్లోకపాలత్వమిదృశమ్
యాస్యామి బ్రహ్మలోకే వై దుఃఖం జ్ఞాపయితుం స్వకమ్ ।
నిర్వ్యాపారోం నియోగీ తు నియోగే యస్తు తిష్ఠతి
స్వామివిత్తం సమశ్నాతి స యాతి నరకం ధ్రువమ్
యమధర్మరాజు పలికెను :- ఓ నారదా! ఇపుడిక భూమండలముననున్నరాజు పురాణపురుషోత్తముడగు శ్రీహరియందు భక్తి కలవాడు. అతను పటహముతో ప్రజలను ఏకాదశినాడు భుజించరాదని బోధించుచున్నాడు. భుజించినవారిని దండించెదనని హెచ్చరిం చుచున్నాడు. అతని భయముతో ప్రజలందరు ద్వాదశీవ్రతము నాచరించుచున్నారు. మిషతోనైనను ద్వాదశీవ్రతము నాచరించుటచే నరకమునకు రాక విష్ణులోకమునకు వెళ్ళుచున్నారు. ద్వాదశీ సేవనమువలన హరిమందిరమునకు వెళ్ళుచున్నారు. కావున ఆరాజు ఇపుడు నాలోకమార్గమును లోపింపచేసెను. దేవలోకములను నరకలోకమును శూన్యము చేసెను. వారికి విశ్రాన్తి కలిగినది. వ్రాసిన దానిని తుడిచి వేయుచున్నారు. ఇది యంతయు ఏకాదశ్యుపవాసమహిమయే. బ్రహ్మహత్యాదిపాపములను అనుభవించకుండగనే ఏకాదశీఉపవాసములచే హరిమందిరమునకు వెళ్ళుచున్నారు. ఇపుడు నేను కాష్ఠమృగమువలె అయితి. నేత్రహీనుడును కర్ణహీనుడనైతిని. సంధ్యాహీనుడగు ద్విజునివలె అయితిని. స్త్రీ జితుడగు పురుషునివలె నపుసంకడగు ప్రీపతివలె కామనలను వదిలి ఇటువంటిలోకపాలత్వమును వహించుచున్నాను. కావున నాదుఃఖమును తెలుపుటకు బ్రహ్మలోకమునకు వెళ్ళుచున్నాను. ఒక కార్యమున నియమించబడినవాడు వ్యాపార శూన్యునిగా స్వామిధనమును అనుభవించినచో అతను నరకమునకు వెళ్ళును.
సౌతిరువాచ :-
ఏవముక్త్యా యయౌ విప్రా నారదేన సమన్వితః
యయౌ విరించిసదనం చిత్రగుప్తేన చాన్వితః ।
స దదర్శ సమాసీనం మూర్తామూర్తజనావృతమ్
వేదప్రియం జగద్బీజం సర్వేషాం ప్రపితా మహమ్ ।
స్వభవం భూతనిలయ మోంకారాఖ్యమకల్మషమ్
శుచి శుచిపదం హంసం బ్రహ్మాణం దర్భలాంఛనమ్ ।
ఉపాస్యమానం వివిధై ర్లోకపాలైర్దిగీశ్వరైః
ఇతిహాసపురాణైశ్చ వేదైర్విగ్రహసంస్థితైః ।
మూర్తిమద్భిస్సముద్రైశ్చ నదీభిశ్చసరోవరైః
దేహధృగ్భిస్తధా వృక్ష రశ్వత్థాద్యైర్విశేషతః ।
వాపీకూపతడాగాద్యై ర్మూర్తిమద్భిశపర్వతైః
అహోరాత్రైస్తధా పక్షే ర్మాసై సంవత్సరైర్ద్విజాః ।
కళాకాష్టానిమేషైశ్చ ఋతుభిశ్చయనైర్యుగైః
మన్వన్తరైస్తధాకలైః నిమేషైరున్మిషైరపి ।
ఋక్షైర్యోగైశ్చ కరణేః పౌర్ణమాసేందుసంక్షయైః
సుఖైర్దుఃఖైస్తధా ద్వందై క్లాభాలాభైర్జయాజయైః ।
సత్యానృతైశ్చదేవేశో వేష్టితో ధర్మపావకః
కర్మవిద్భిశ్చ పురుషై రనురూపైరుపాస్యతే ।
సత్యైన రజసా చైవ తమసా చ పితామహః
శాంతమూఢాతిఘోరైశ్చ వికారైః ప్రాకృతైర్విభుః ।
వాయునా శ్లేష్మపిత్తాభ్యాం మూగైరాతంకనామభిః
ఆనందేన చవిశ్వాత్మా పరధర్మం సమాశ్రితః ।
అనుక్తైరసీ భూతైశ్చ సంవృతో లోకకృత్స్వయమ్
దురుక్తైః కటు వాక్యాద్మే ర్మూర్తిమద్భిరుపాస్యతే ।
తేషాం మద్యేఽవిశత్సౌరి సుప్రీదేవ వధూర్యధా
విలోకయన్నధోభాగం నమ్రవక్త్రో వ్యదర్శయత్ ।
తే ప్రవిష్టం యమం దృష్ట్వా సకాయస్థం సనారదమ్
విస్మితాక్షా మిథః ప్రోచుః కిమయం భాస్కరిస్త్విహ ।
సంప్రాప్తా హి లోకకరం ద్రష్టుం దేవం పితామహమ్
నిర్వ్యాపారః క్షణం నాస్తి యోఽయంవ్యగ్రో రవేస్సుతః ।
సోఽయమభ్యాగతః కస్మా త్కచ్ఛిత్క్షేమం దివౌకసామ్
ఆశ్చర్యాతిశయం మన్యే యన్మార్జితపటయమ్ ।
లేఖకస్సమనుప్రాప్తో దైన్యేన మహతాన్వితః
నకేనచిత్పదో హ్యస్య మార్జితోఽ భూచ్చ ధర్మిణా ।
యన్నదృష్టం శ్రుతం వాపితదిహై వ ప్రదృశ్యతే
ఏవముచ్చరతాం తేషాం భూతానాం కృతశాసనః ।
నిపపాతాగ్రతో విప్రా బ్రహ్మణో రవినన్దనః
మూలచ్ఛిన్నో యధా శాఖీ త్రాహి త్రాహీతి సంరుదన్ ।
పరిభూతోఽస్మి దేవేశ యన్మార్జితపటఃకృతః
త్వయా నాదేన విధురం పశ్యామి కమలాసన ।
ఏవం ఋవన్సనిశ్చేష్టో బభూవ ద్విజసత్తమాః
తతో హలహలాశబ్ద స్సభాయాం సమవర్తతత ।
యోఽయం రోదయతే లోకా న్సర్వాస్త్రా వరజంగమాన్
సోఽయం రోదితి దుఃఖార్తః కస్మాద్వైవస్వతో యమః ।
అధవా సత్యగాధేయం లౌకికీప్రతిభాతి నః
జనసంతాపకర్తా యః సోఽచిరేనోపతప్యతే ।
నహి దుష్క తకర్మా హి నరః ప్రాప్నోతి శోభనమ్
తతో నివారయామాస వాయుస్తేషాం వచస్తదా ।
లోకానాం సమచిత్తానాం మతం జ్ఞాత్వా హి వేధసః
నివార్య శంకాం మార్తండిం శనైరుత్థాపయన్ విభుః ।
భుజాభ్యాం సాధు పీనాభ్యాం లోకమూర్తిరుదారధీః
విహ్వలం తం పలాయన్త మాసనేసన్నవేశయత్ ।
స కాయస్థమువాచేదం వ్యోమమూర్తరవేస్సతమ్
కేన త్వమభిభూతోఽసి కేన స్థానాగ్వివాసితః ।
కేనాపామార్జితో దేవ పటో లోకపటస్తవ
బ్రూహి సర్వమశేషేణ కుశకేతుర్వదత్వయమ్ ।
యః ప్రభుస్తాత సర్వేషాం స తే కర్తా సమున్నతిమ్
ఆపనేష్యతి మార్తండే దుఃఖం హృదయసంస్థితమ్
స ఏవముక్తస్తు ప్రభంజనేన దినేశసూనుస్తమధో బభాషే ।
విలోక్య వస్త్రం కుశకేతుసూనోస్సగద్గదం మన్తముదీరయన్వచః
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే యమస్యబ్రహ్మలోకగమనంనామ తృతీయోఽధ్యాయః.
సౌతిపలికెను :- యమధర్మరాజు ఇట్లు పలికి నారదునితో చిత్రగుప్తునితో కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అచట యమధర్మరాజు మూర్తిమంతులకు మూర్తిరహితలకు ప్రీతిపాత్రుడు, వేదప్రియుడు, జగద్బీజభూతుడు, అందరికి ప్రపితామహుడు, స్వయంభూ, భూతనిలయుడు, ఓంకారాఖ్యుడు, కల్మషరహితుడు, శుచి, శుచిపదుడు, హంసరూపుడు, దర్భలాంఛనుడు లోకపాలురచే దికాల్పురచే సేవించబడువాడు, ఇతిహాసములు, పురాణములు, వేదములు, సముద్రములు, నదులు, సరోవరములు, అశ్వత్థాది వృక్షములు, వాపీకూపతటాకాదులు, సర్వతములు, ఆహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళాకాష్ట నిమేషములు, ఋతువులు, అయనములు, యుగములు, మన్యర్తములు, కల్పములు, నిమేషములు, ఉన్మేషములు, ఋక్షములు, యోగములు, కరణములు, పౌర్ణములు, అమావాస్యలు. సుఖములు, దుఃఖములు, ద్వంద్వములు, అన్నియు ఆకారములను ధరించి సేవించుచుండగా ,ధర్మపాలకుడుగానున్నవాడు, కర్మవిత్తులగు పురుషులచే, అనురూపులచే సేవించబడువాడు, సత్త్వరజస్తమోగుణములచే శాంత,మూఢ, అతఘోరములను ప్రాకృత వికారములచే శ్లేష్మపిత్తాదివాయువులచే ఆతంకమూర్తములచే ఇంకాచెప్పబడనివి. ఇతరభూతములచే సేవించబడుచు ఆనందముతో విశ్వాత్మ,పరమధర్మమును ఆశ్రయించి యున్నవాడు, లోకకర్త, కటు కావ్యాది దురుస్తులు మూర్తిమత్తులై ఉపాసించుచుండగా విరాజిల్లు బ్రహ్మను ఆసీనుని సందర్శించెను. వారిమద్యకు సిగ్గుపడుచున్న పెళ్ళి కూతురువలె ప్రవేశించెను. క్రింద చూచుచు తలవంచుచు చూచుచుండెను. అట్లు చిత్రగుప్తుడు నారదుడు వెంటరాగా ప్రవేశించిన యముని అచటివారు చూచి ఆశ్చర్యము చెంది ఏమిటి? యముడు ఇచటనున్నాడు అనుకొనిరి. లోకకర్తయగు బ్రహ్మను చూడవచ్చెను. ఇతను వ్యాపారరహితముగా ఒక క్షణము కూడా ఉండడు. ఎపుడూ కార్యవాపృతుడుగా నుండును. అటువంటివాడు ఎందుకోచ్చేను? దేవతలు కుశలముగా నున్నారా? అట్లే చిత్రగుప్తుడు కూడా వ్రాసినదానిని. తుడిచి దీనముగా వచ్చియున్నోడు. ఇతని పటమును ఇంతవరెకెవ్వరూ తుడిచి యుండలేదు. ఇదివరకు చూడనిదానిని వినని దానిని చూచుచున్నాము. ఇట్లు అనుకొనుచున్నవారు, చూచుచుండగా యమధర్మరాజు మూలమును ఛేదించిన వృక్షమువలె కాపాడుము, కాపాడుము" నాకు పరాభవము జరిగినది. నా పటములోని వ్రాతను తుడిచి వేసిరి. నీవు నాధుడవుండగా దిక్కులేని వానినైతిని. ఇట్లు అనుచు బ్రహ్మముందు పడెను. ఇట్లు నిశ్చేష్టునిగా యమధర్మరాజుండుటను చూచి సభలో కోలాహలము మొదలాయెను. ఇతను స్థావరజంగమాత్మకములగు సకలలోకములను ఏడిపించువాడు ఈనాడు ఎందువలన తానే రోదించుచున్నాడు. జనులకు సంతాపమును కలిగించువాడు తానే స్వయముగా పరితపించును, అనుమాట యధార్థముగా నున్నది. దుష్కృతమును చేయువాడు మంచిని పొందజాలడు కదా? అనుకొనిరి. అంతట వాయువు వారిని వారించెను. సమచిత్తులగు లోకుల, బ్రహ్మ అభిప్రాయమును తెలుసుకొని అట్లు చేసెను. శంకను వారించి యమ ధర్మరాజును మెల్లగా లేపి ఉదారబుద్ధియగు వాయువు పారిపోవుచున్న భయపడుచున్న యమధర్మరాజును బలిష్ఠములైన తన భుజములచే స్థానమున కూర్చుండబెట్టెను. మరియు వ్యోమమూర్తి కాయస్తుడు అగు సూర్యపుత్రుని గూర్చి ఇట్లు పలికెను. నిన్నెవరు అవమానించిరి. ఎవరు నిన్ను స్థానభ్రష్టుని చేసిరి? నీ లోకపటమును ఎవరు తుడిచివేసిరి? దీనినంతటిని వివరముగా చెప్పుము. సర్వనాధుడు నీకు మరల ఉన్నతిని ప్రసాదించగలడు. నీహృదయములోని దుఃఖమును నశింపచేయగలడు. ఇట్లు వాయువు ఓదార్చగా యమధర్మరాజు అతని ముఖమును చూచుచు జగద్గురువుతో మెల్లగా ఇట్లు పలికెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున యముడు బ్రహ్మలోకమునకు వెళ్ళుటయను మూడవ అధ్యాయము.
Summary of chapter 130 of the Nārada Mahā Purana is as follows:
ఏకాదశీ మరియు ద్వాదశీ తిథులు కలిసిన హరివాసర సమయంలో ఆచరించవలసిన దివ్య నియమములను వశిష్ఠ మహర్షి ఈ అధ్యాయంలో విశదీకరించినారు. హరివాసర సమయంలో అన్నవర్జనము చేసి శ్రీహరి ధ్యానంలో గడిపే భక్తులకు సిద్ధించే అక్షయ పుణ్యఫలము ఇక్కడ నిరూపించబడినది.