నారద మహా పురాణము
69 - కామాక్షా మాహాత్మ్యమ్
మోహిన్యువాచ :-
శ్రుతం కామోదకాఖ్యానం పాపఘ్నం పుణ్యదం నృణామ్ ।
సాంప్రతం శ్రోతుమిచ్ఛామి కామాక్షాయాః ఫలం ద్విజ
మోహిని పలికెను : -
మానవుల పాపములను తొలగించి పుణ్యమును ప్రసాదించు కామోదాఖ్యానమును వింటిని. ఇక ఇపుడు కామాక్షామాహాత్మ్యమును వినగోరుచున్నాను.
వసురువాచ :-
కామాక్షా పరమా దేవీ పూర్వస్యాం దిశి సంస్థితా ।
సాగరానూపతటగా కలౌ సిద్ధి ప్రదా నృణామ్
యస్తత్ర గత్వా కామాక్షం సంపూజ్య నియతాశనః ।
తిష్ఠేదేకాం నిశాం భద్రే స పశ్యతాం దృఢసనః
సా దేవీ భీమరూపేణ యాతి సందర్శనం నృణామ్ ।
తాం దృష్ట్వా నచలే ద్యోవై ససిద్ధిం వాంఛితాం లభేత్
యస్తు దృష్ట్వా సురేశానీం కామాక్షాం భీమరూపిణీమ్ ।
ఆసనాచ్ఛలితస్సద్య స్స విక్షిప్తో భవేధ్రువమ్
తత్రాస్తే పార్వతీపుత్ర సిద్ధ నాధో వరాననే ।
ఉగ్రే తపసీ లోకైస్స ప్రేక్ష్యతే న కదాచన
కృతత్రేతా ద్వాపరేషు ప్రత్యక్షం దృశ్యతేఃఖిలైః ।
కలాంతర్షితస్తి ష్ఠే ద్యావత్పాదః కలేర్ర్వజేత్
కలేః పాదే గతే చైక స్మినోరే చ ధరాతలే ।
స వై ప్రత్యక్షతాం ప్రాప్య సాధయేదఖిలం జనమ్
మోహనాద్యైరుపాయైస్తు మ్లేచ్ఛప్రాయాఙ్ఞానాం స్తదా ।
కృత్వా వశే మహాభాగే గమయేత్రిపదగం కలౌ!
యస్తత్ర గత్వా సిద్దేశం భక్తి భావ సమన్వితః ।
చింతయే ద్వర్ష మాత్రం తు కామాక్షాం నిత్య దార్చయన్
స లభేద్దర్శనం స్వప్నే దర్శనాంతే సమాహితః ।
సూచితాం తేన సిద్ధిం స లబ్జ సిద్దే భవేద్బువి
విచరేత్సర్వలోకానాం కామనాః పూరయన్ళుభో ।
త్రిలోక్యాం యాని వస్తూని తాని సంకర్షయే ద్వరాత్
స మత్స్యనాధః కిల తత్ర సంశ్లో విజ్ఞాన పారంగమ ఏవ భద్రే ।
చచార లోకాభిమతం వితత్వం సపోతి ఘోరం న చ యాతి దృష్టిమ్
యుగాన్యనేకాని పురా భ్రమిత్వా లోకాన్సమగ్రా నహతేష్ట గత్యా ।
తపస్థితోద్యాప్తి మహానుభావో న కాలవేగేన శుభైఃభి భూతః
గండాంత జాతస్తు పురా భవేశిభూ ద్విజస్య కస్యాపీ నుతస్సుభద్రే ।
సజాత మాత్రః కిల పుష్కరాఖ్యీ ద్వీపేస్య పిత్రా హ్యుదధో విసృష్టః
ప్రక్షిప్త మాత్రం కిల తత్ర బాలం మత్స్యోగ్రహీత్ర్కోపి విధేర్నియోగాత్ ।
తత్ర స్థితోతాని యుగాని సోభూ త్కాలస్య గత్యా హ్యజరామరాంగః
తతః కదాచిత్రియయప్రదిష్ణో మహేశ్వర స్సార్థ మగంప్రసూత్వా ।
తత్యోపదేశాయ జగామ భద్రే సలోక లోకాచల మప్రమేయః
తత్సామ్యశృంగే మణిభిః ప్రదీస్తే స్థిత్వా క్షణార్థం హరి మగ్నచేతాః ।
దేవీ ముమాం సంప్రతి బోధ్యశక్త్యా కాలత్రమేణాప్యభిభూయ సత్యాన్
ఉవాచ తత్త్యం సురహస్యభూతం యద్ద్వాద శార్ణార్థ నిజస్వరూపమ్ ।
తతస్తు సా శైలసుతో మహేశం మారాంతకం యావదభిప్రణమ్య
ఆజ్ఞాయ తత్త్యం సమవస్థితాభూ త్రోవత్స మత్స్యస్తు మహార్ణవస్థ ।
ద్రుతం సముళ్పుత్య జగామ శృంగం యో విప్రబాలో హ్యుదరేష్ఠితస్య సతత్త్వసిద్యోఖిల బద్ధముక్తః
నిర్గమ్య మత్స్యో దరతః శుభాస్యే నమః ప్రచక్రే భవయోః పురస్తాత్ ।
విజ్ఞాత తత్యోఃపి మహేశ్వరస్తం పప్రచ్ఛ తధర్భ గతేర్నిదానమ్
సవర్ణయామాస యధార్థమేవ తయోఃపురస్సర్వమపి ప్రవృత్తమ్ ।
ఆకర్ణ్య తద్దత్త మనుప్రసన్నా సోమామహేశానుమతిం చ కృత్వా
తం కల్పయా మాస సుతం శుభాంగే సోత్సంగ అస్ధాప్య చుచుంబ వక్రమ్ ।
సుతో మమాయం కిల మత్స్యనాధో విజ్ఞాతతత్యాఖిల సిద్ధనాధః
నిజేచ్ఛయా సంప్రతి యాతు లోకా స్కీర్తిం వితన్వన్సుఖమావయోశ్చ ।
తతః ప్రభృత్యేష సుతాంబికాయా లోకాన్సమగ్రా నవిహృత్య కామమ్
తత్సిద్ద పీఠం సమవాప్య తత్ర తపస్యుపాదిష్ట ఇవాస్థితోస్తి ।
తం సిద్దనాధం మనసా విచిన్య నరో భవేత్సద్ద సమస్త కామః
సంప్రాప్య విద్యాం నిజవాక్య వాహో నిమజ్జయే త్పండిత వర్గజాతమ్ ।
ఏతాం కధాం తస్య జగత్పవిత్రాం శృణోతి యః కర్ణ పధప్రయాతమ్
సచాభికామం సమవాప్య భూమౌ స్వర్గం ప్రయత్యేవ సురార్చితాంఘ్రిః ।
ఏ తన్మయా తే కథితం సునేత్రే శ్రీసిద్ధ నాధస్య చరిత్ర యుక్తమ్
కామాక్ష మాహాత్మ్య మఘఘ్నమాద్యం భూయోపి కింతే ప్రవదామి భద్రే
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున సిద్ధనాధ చరిత్రయుక్తం కామాక్షా మాహాత్మ్యం నామైకోనసప్తతి తమోఽధ్యాయం.
వసువు పలికెను :
ఉత్తము రాలగు కామాక్షాదేవి పూర్వ దిక్కున సాగర తీరమున కలదు. మానవులకు సిద్ధిని ప్రసాదించును. ఇచటికి వెళ్ళి నియమిత భోజనుడై కామాక్షను పూజించి ఒకరాత్రి యున్నచో కామాక్షాదేవిని చేరగలడు. ఈదేవి భీమరూపముతో మానవులకు దర్శనము నిచ్చును. ఆమెను చూచి భయపడని వాడు మాత్రమే వాంఛితార్థసిద్ధిని పొందగలడు. దేవరాజ్జి భయంకర రూపిణియగు కామాక్షిని చూచి ఆసనమునుండి చలించినవాడు పతనమగును. ఇచటనే పార్వతీపుత్రుడగు సిద్ధనాధుడుండును. ఇతను ఉగ్రమగు తపమునాచరించుచు లోకులకు కనబడడు. కృతవ్రేతా ద్వాపయుగములలో అందరిచే చూడబడెడివాడు. కలియుగమున ఒకపాదము గడుచు వరకు అంతర్థానముగా నుండును. ఒక పాదము గడిచిన తరువాత ఘోరమగు భూమండలమున ప్రత్యక్షమై సకల జనులను సాధించును. మోహనాధ్యుపాయములచే మేచ్చప్రాయులగు జనులను తన వశమున నుంచుకొని కలి మూడు పాదములను గడుపును. ఇచటికి వెళ్ళి భక్తి భావసమన్వితుడై కామాక్షాదేవిని పూజించు సిద్దేశుని ఒక సంవత్సరము ధ్యానించినచో స్వప్నమున సిద్దేశుని దర్శించును. దర్శనాంతమున సిద్దేశుడు సూచించిన లోకత్రయమున గల సకల వస్తువులను తీర్చుచు సంచరించును. ఇచట నుండు మత్స్యనాధుడు విజ్ఞాన పారంగతుడు ఘోరతపము నాచరించుచు లోకాభిమతములను ప్రసాదించుచు దృష్టిగోచరుడుగాన యుండును. ఈ మత్స్యనాధుడు అడ్డులేని గతి కలవాడై సకల లోకములను అనేక యుగములు తిరుగుచు కాలవేగమున అభిభూతుడు కాక ఇపుడు కూడా తపములో యుండెను. పూర్వ భవమున ఒక బ్రాహ్మణుని పుత్రుడు గండాంత జాతుడుండెను. ఇతను పుట్టగానే పుష్కర ద్వీపమున తండ్రి సముద్రమున విడిచెను. సముద్రమున ప్రవేశించగనే విధి నియోగము వలన ఒక మత్స్యము మ్రింగెను. ఆ మత్స్యదరముననే ఇతను చాలా యుగములు జరామరణములు లేక యుండెను. అంతట ఒకసమయమున ప్రియురాలి కోరికచే శివుడు పార్వతీ దేవితో కలిసీ తత్యోప దేశమును చేయుటకు లోకా లోకాచలమునకు వెళ్ళెను. ఈ పర్వత శృంగమున మణి ప్రకాశమున శ్రీహరియందు మనసునుంచి ఒక క్షణార్థము గడిపి తాపత్రయముచే ప్రాణులను మోహింపచేసి శక్తిచే పార్వతీ దేవిని ప్రబోధించి ద్వాదశాక్షరార్థ నిజ స్వరూపమగు పరమ రహస్యమునుపదేశించెను. అంతట ఆ పార్వతీదేవి మారాంతకుడగు శివుని నమస్కరించి తత్యము తెలియక నిలిచి యున్నంతలోమహాసముద్రమున నున్న మత్స్యము త్వరగా ఎగిరి ఆ శృంగముల చేరెను. మత్స్యదరమున నున్న బాలుడు తత్త్యసిద్ధిని పొంది అఖిల బంధవిముక్తుడై మత్యోదర మునుండి బయలు వెడలి పార్వతీ పరమేశ్వరుల ముందు నిలిచి నమస్కరించెను. అంతయూ తెలిసియున్ననూ మహేశ్వరుడు ఆ బాలకుని మతోదర ప్రవేశమునకు కారణము నడిగెను. ఆ బాలకుడు వారి ముందు జరిగిన వృత్తాంతము నంతటిని వివరించెను. అంతట పార్వతీ దేవి ఆ వృత్తాంతమును విని ప్రసన్నురాలై మహేశ్వరుని అనుమతిని పొంది అతని పుత్రునిగా చేసుకొని తన వడిలో నిడుకొని మోమును ముద్దాడెను. అఖి తత్యము తెలిసిన ఈసిద్ధనాధుడగు మత్స్యనాధుడు నా పుత్రుడు. ఇపుడు ఇతను తన ఇష్టానుసారముగా అన్ని లోకములలో తిరుగుచు కీర్తిని మాకు ఆనందనమును విస్తరింప చేయుగాక అని పార్వతీ దేవి పలికెను. అప్పటి నుండి పార్వతీ పుత్రుడగు ఈ మత్స్యనాధుడు యధేష్టముగా సకల లోకములను తిరుగుచు సిద్ద పీఠమును చేరి తపస్సులో నుండెను. ఈ సిద్ధ నాధుని మనసులో ధ్యానించినవారు సమస్త కామములను పొందును. సమగ్ర విద్యను పొంది తన వాక్యజాతమును పండిత వర్గమునంతనూ నిలుపును. జగత్సవిత్రమగు ఈ కథను విననివారు ఇహమున అన్ని కామనలను పొంది దేవతల పూజల నంది స్వర్గమును చేరును. ఇట్లు శ్రీసిద్ధ నాథ చరిత్రయుతమగు కామాక్షో మాహాత్మ్యమును సకల పాప నాశనమును నీకు తెలిపితిని. ఇంకేమి చెప్పవలయునో తెలుపుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున సిద్ధనాధ చరిత్రయుక్తమగు కామాక్షా మాహాత్మ్యమను అరువది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 196 of the Nārada Mahā Purana is as follows:
వివిధ పవిత్ర వ్రతముల సమాప్తి సమయంలో ఆచరించవలసిన పారణ విధి మరియు బ్రాహ్మణ పూజా సమర్పణ విధానము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. శాస్త్రోక్తంగా పారణ ఒనర్చుట వలన వ్రత సంపూర్ణ ఫలము సిద్ధించునని నిరూపించబడినది.