నారద మహా పురాణము
70 - అధ్యాయము
సనత్కుమార ఉవాచ :
అథ వక్ష్యే మహావిష్ణోర్మంత్రాన్లో కేషు దుర్లభాన్,
యాంప్రాప్య మానవాస్తూర్ణం ప్రాప్నువని నిజేప్సితాన్.
యేషాముచ్చారణేనైవ పాపసంఘః ప్రలీయతే,
బ్రహ్మాదయోపియాన్ జ్ఞాత్వా సమర్ధాస్యుః జగత్కృతో.
తారహత్పూర్వకం జేస్తం నారాయణపదం భవేత్,
అష్టాక్షరో మనుశ్చాస్య సాధ్యో నారాయణో మునిః.
ఛన్దః ప్రోక్తం చ గాయత్రీ దేవతా విష్ణురవ్యయః,
ఓం బీజం యం చ తథా శక్తిర్వినియోగోఖిలాస్తయే.
క్రుధోల్కాయ హృదాఖ్యాతం మహోల్కాలమ శిరస్స్మృతమ్,
వీరోల్కాయ శిఖాయాప్రోక్తా ద్యులాయ కవచం మతమ్.
మహోల్కాయేతి చాస్త్రం స్యాదిత్తం పంచాంగకల్పనా,
పునష్టడంగమన్తోతై, షడ్వర్టైశ్చ సమాచరేత్.
అవశిష్టా న్య సేతుక్షిపృష్ఠయోర్మవర్ణకౌ,
సుదర్శనస్య మంత్రేణ కుర్యాద్దిన్తనం తతః.
తారో నమశ్చతుర్ధ్యస్తం సుదర్శనపదం భవేత్,
అస్త్రాయ ఫడితి ప్రోక్తో మంత్రో ద్వాదశవర్ణవాన్.
దశావృత్తిమయం న్యాసం వక్ష్యే విభూతిపంజరమ్,
మూలార్లాన్వతనౌ న్య స్యేదాధారే హృదయే ముఖే.
దోః పన్మూలేషు నాసాయాం ప్రథమా వృత్తిరీరితా,
గలే నాభౌ హృది కుచపార్శ్వపు షేషు తత్పరాః.
మూర్దాస్యనేత్రశ్రవణఝణేషు చ తృతీయకాః,
దోపాదసంధ్యాంగులిషు వేదావృత్యా చ విన్య సేత్.
ధాతుప్రాణేషు హృదయే విన్య సేత్తదనన్తరమ్,
శిరోనేత్రాస్యహృతుక్షిసోరుజంఘపదద్వయే.
ఏకైకనో న్య సేద్వర్ణాన్మంత్రస్య క్రమతస్సుధీః,
న్య స్ఛేదంపోరుపదేష్వర్ణ్వాదమీఠాన్మనోః.
చక్రశంఖగదాంభోజపదేషు స్వస్య ముద్రయా,
శేషాంశ్చ న్యాసవర్యో ఒ యం విభూతిపంజరాఖిధః.
న్య సేన్మూలార్ణమేకైకం సచన్రాం తారసంపుటమ్,
అథవా వై నమోంతేన న్య సేదిత్యపరే జగుః.
తత్త్వన్యాసం తతః కుర్యాద్విష్ణుభావప్రసిద్ధయే,
అష్టాల్లోష్టప్రకృతి శ్చైవేత్యష్టా ప్రకృతయో మతాః.
పృథివ్యాదీని భూతాని తతోహంకారమేవ చ,
మహాంశ్చ ప్రకృతిశ్చైవేత్యష్టా ప్రకృతయో మతాః.
పాదే లింగే హృది ముఖే మూర్ద్నీ వక్షసి హృత్తలే,
పర్వాంగే వ్యాపకం కుర్యాదేకేన సాధకోత్తమః.
మంత్రార్ణహృత్పరాయాద్యమాత్మనే హృదయాంతిమమ్,
తత్తనామ సముచ్చార్య న్య సేత్తత్తళలే బుధః.
అయం తత్త్వాభిధో న్యాసస్సర్వన్యాసోత్త మోతమః,
మూర్తిం న్య సేద్ద్వాదశ వై ద్వాదశాదిత్యసంయుతాః.
ద్వాదశాక్షరవర్లాద్యా ద్వాదశాదిత్యసంయుతాః,
అష్టార్జ్యం మనుశ్చాష్ట ప్రకృత్యాత్మా సమీరితః.
తామాత్మ చతుషస్య యోగాదరాక్షరో భవేత్,
లలాటకుక్షి హృత్కంఠదక్షపార్శ్వాంసకేషు చ.
గలే చ వామపార్శ్వాంసగలప్ప ఢీశ్వనస్తరమ్,
కకుద్యపి న్య సేన్మంత్రీ మూర్తీర్ణ్వాదశ వై క్రమాత్.
ధాత్రా తు కేశవం న్యస్యార్యమ్లం నారాయణం పునః,
మిత్రేణ మాధవం న్యస్య గోవిందం వరుణేన చ.
విష్ణుం చైవాంశునా యుక్తం భగేన మధుసూదనమ్,
న్య సేద్వివస్వతా యుక్తం త్రివిక్రమమతః పరమ్.
వామనం చ తథేంద్రేణ పూష్ణా శ్రీధరమేవ చ,
హృషీ కేశం న్య సేత్పశ్చాత్పర్జన్యేన సమన్వితమ్.
త్వఫ్ఘాయుతం పద్మనాభం దామోదరం చ విష్ణునా,
ద్వాదశార్ణం తతో మన్తం సమ స్తే శిరసి న్య సేత్.
వ్యాపకం విన్య సేతృశ్చాత్ కిరీటమథవా సుధీః,
ధ్రువః కిరీట కేయూరహారాంతే మవరీతి చ.
కుండలాంతే చక్రశంఖగదాంత్యేభోజహస్తతః,
పీతాంబరాంతే శ్రీవత్సాంకితవక్షః స్థలేతి చ.
శ్రీభూమిసహితస్వాత్మజ్యోతిర్ద్వయమతః పరమ్,
వదోద్దీప్తికరాయాంతే సహస్రాదిత్య తేజ పే.
నమోంతో బాణషడ్వర్ణైః కిరీటమనురీరితః,
ఏవం న్యాసవిధిం కృత్వా ధ్యాయేన్నారాయణం విభుమ్.
ఉద్యత్కోట్యర్కసదృశం శంఖం చక్రం గదాంబుజమ్,
దధంతం చ కరైర్భుమి శ్రీభ్యాం పార్శ్వద్వయాంచితమ్.
శ్రీవత్సవక్షసంభ్రాజకౌస్తుభముక్తకంధరమ్,
హార కేయూరవలయాం గదం పీతాంబరం స్మరేత్.
వర్ణలక్షం జపేన్మస్త్రం విధివన్నియతేస్త్రియః,
ప్రధమేన తు లక్షేణ స్వాత్మశుద్ధిర్భ వేదవమ్.
లక్షద్వయజ పేనాధ మంత్రశుద్ధిమవాప్నుయాత్,
లక్షత్రమేణ జేన స్వకమధిగచ్ఛతి.
విష్ణోప్సమీపమాప్నోతి వేదలక్షజపొన్నరః,
తథాచ నిర్మలం జ్ఞానం పంచలక్షజపాద్భవేత్.
లక్షష షేన చాప్నోతి మంత్రీ విష్ణో స్థిరాం మతిమ్,
సప్త లక్ష జపాన్మస్త్రీ విష్ణోసారూప్యమాప్నుయాత్.
అష్టలక్షం జపేన్మస్త్రీ నిర్వాణమధిగచ్ఛతి,
ఏవం జప్త్వా తతః ప్రాజ్ఞో దశాంశం సరసీరు హై.
మధురాక్తైః ప్రజుహుయాత్సంస్కృతే హవ్యవాహనే,
మండూకాత్పరతత్వాన్తం పీలే సంపూజ్య యత్నతః.
విమలోత్కర్షిణీ జ్ఞానా క్రియా యోగా తతః పరా,
ప్రహ్వీ సత్యా తథేశానానుగ్రహా నవమిమతా.
తారోనమో భగవతే విష్ణవే సర్వభూతః,
తాత్మానే వాసుదేవాయ సర్వాత్మేతి పదం తతః.
సంయోగయోదపద్మాంతే పీఠాయ హృదయాంతిమః,
షడ్వింశదక్షరః పీఠమనోనేనాసనం దిశేత్.
మూర్తిం సంకల్ప్య మూలేన తస్యామావాహ్య పూజయేత్,
ఆదౌ చాంగాని సంపూజ్య మంత్రాణాం కేశరేషు చ.
ప్రాగాదిదిగలే వాసుదేవం సంకర్షణం తథా,
ప్రద్యుమ్నమనిరుద్దం చ శక్తీః కోణేషధార్చయేత్.
శాంతిం శ్రియం సరస్వత్యా రతిం సంపూజయేతమాత్,
హేమపీతతమాలెస్ట్రనీలాభాః పీతవాససః.
చతుర్భుజాశ్శంఖచక్రగదాంభోజధరా ఇమే,
సీతకాంచనగోదు(దూర్వావర్ణాశ్చ శక్తయః.
దలాగ్రేషు చక్రశంఖగదాపంకజకౌస్తుభాన్,
పూజయేన్ముసలం ఖడ్గం వనమాలాం యథాక్రమాత్.
రక్తాజపీతకనకశ్యామకృష్ణా పితార్జునాన్,
కుంకుమాభం సమభ్యర్చ్యేద్బహిరగే ఖగేశ్వరమ్.
పార్శ్వయోః పూజయేత్పశ్చాచ్ఛంఖపద్మ నిధీ క్రమాత్,
ముక్తామాణిక్యసంకాశా పశ్చిమే ధ్వజమర్చయేత్.
రక్తం విఘ్నం తథా గ్నేయే శ్యామమార్యం చ రాక్ష సే,
దుర్గాం శ్యామాం వాయుకోణే పేనాన్యం పీతామైశ్వరే.
లోకేశానాయుదైర్యుక్తాన్భహిస్సంపూజయేత్సుధీః,
ఏవ మావరణేర్యుక్తం యోఒర్చయేద్విష్ణుమవ్యయమ్.
భుక్త్వేహి సకలాంభోగానంతే విష్ణుపదం వ్రజేత్.
సనత్కుమార మహార్షి పలికెను :- ఈ లోకములలో లభించ శక్యము కాని మహావిష్ణు మంత్రములను ఇపుడు చెప్పెదను. ఈ మంత్రములను తెలుసుకొని మానవులు త్వరగా సమతమ అభీష్టములను పొందగలరు. ఈ మంత్రములనుచ్చరించుట వలననే పాపరాశులు నశించును. బ్రహ్మాదులు కూడా ఈ మంత్రములను తెలుసుకొని జగత్కార్యములందు సమర్ధులగుచున్నారు. నారాయణ పదము తారహత్నూరకము జేస్తమగును. ఈ మంత్రమునకు ఎనిమిదక్షరములుండును. ఈ మంత్రమునకు సాధ్యుడు నారాయణముని. గాయత్రీ ఛందస్సు, విష్ణువుదేవత, ఓం అనునది బీజము. యం శక్తి. అఖిల ప్రాప్తికి వినియోగము. క్రుద్గల్కునికి హృదయము, మహొల్కునికి శిరస్సు, వీరోలునికి శిఖ, ద్యుల్కునికి కవచము, మహాలునికి అస్త్రము. ఇట్లు పంచాంగ కల్పన చేయవలయును. తరువాత షడంగన్యాసము మంత్రమునందు గల షడ్వర్ణములచే ఆచరించవలయును. మిగిలిన రెండు వర్ణములను కుక్షి పృష్ఠములలో న్యాసము చేయవలయును. సుదర్శన మంత్రముచే దిగ్బంధమును చేయవలయును. చతుర్దీ విభక్త్యస్తమైన సుదర్శన పదము తరువాత నమః అను పదమును తారముగా చేర్చవలయును. తరువాత 'అస్త్రాయ ఫట్' అని చెప్పినచో ద్వాదశాక్టరమంత్రమగును. దశావృత్తిమయమగు విభూతి పంజరమను న్యాసమును చెప్పెదను. మూలమంత్రాక్షరములను స్వశరీరము నందుంచుకొనవలయును. ఆధారమున, హృదయమున ముఖమున, బాహువులందు, పొదములందు, నాసికయందు చేయు న్యాసము ప్రధమావృత్తి యనబడును. గలమున, నాభియందు, హృదయమునందు, కుచములందు, పార్శ్వములందు పృష్టములందు ద్వితీయావృత్తి. శిరస్సు, ఆస్యము, నేత్రము, శ్రవణములు,నాసికలయందు తృతీయావత్తి. బాహువులందు, పాదములందు, సంధులందు, ఆంగుళులయందు చతుర్ణావృత్తి న్యాసము చేయవలయును. ఫ్రణ ప్రాణ హృదయములందు పంచమావృత్తి చేయవలయును. శిరోనేత్రస్యహృతుకి ఊరు జంఘ పదద్వయములందు ఒక్కొక్క మంత్రాక్షరమును న్యాసము చేయవలయును. మంత్రము యొక్క నాలుగక్షరములను హృదయ భుజ ఊరు పాదములందుంచవలయును. చక్ర శంఖ గదా పద్మపదములందు ఆయాముద్రలచే న్యాసము చేయవలయును. ఈ న్యాసమును విభూతి పంజరమందురు. ఒక్కొక్క మూల వర్ణమును సచంద్రముగా తారసంపుటముగా న్యాసము చేయవలయును. లేదా నమోంతముగా చేయవలయునని మరికొందరు చెప్పిరి. తరువాత విష్ణుభావసిద్ది కొఱకు తత్త్వన్యాసమును చేయవలయును. అష్టాక్షర మంత్రము అష్టప్రకృతి స్వరూపమని పూర్వసూరులు చెప్పుచున్నారు. పృథివ్యాది పంచ భూతములు, అహంకారములు, మహత్తత్త్వము, ప్రకృతి అను ఈ ఎనిమిది ప్రకృతులు. పాదమునందు, లింగమునందు, హృదయమునందు, ముఖమునందు, శిరస్సునందు వక్షఃస్థలమున, హృతృలమున సర్వాంగములందు న్యాసము చేయవలయును. ఒకదానిచే వ్యాపకము నాచరించవలయును. మంత్రాక్షరహృత్పరమునకు మొదటిది, ఆత్మకు హృదయాంతిమముగా ఆయా నామముల నుచ్చరించి ఆయాస్థలములందు న్యాసమును చేయవలయును. ఇదియే తత్త్వన్యాసము. ఈ న్యాసము సర్వన్యాసములలో ఉత్తమన్యాసము. ద్వాదశాదిత్య సంయుతులగు ద్వాదశమూర్తి న్యాసమును చేయవలయును. ద్వాదశాక్షర మంత్రము యొక్క ద్వాదశాక్షరములు ద్వాదశాదిత్య సంయుతములు. అష్టాక్షర మంత్రము అష్టప్రకృతి స్వరూపముగా చెప్పబడినది. ఈ అష్టాక్షరములకు ఆత్మ చతుష్యయోగముతో ద్వాదశాక్షరమంత్రమగును. ద్వాదశమూర్తులము క్రమముగా లలాట, కుక్షి, హృదయ, కంఠ, దక్షిణ పొర్శ్వ, భుజ, గల, వామపార్శ్వ భుజ, గల పృష్ఠ కకుత్ స్థానములందుంచ వలయును. ధాతతో కేశవుని, అర్యముతో నారాయణుని, మిత్రునిచే మాధవుని, వరుణునిచే గోవిందుని, అంశువుచే వామనుని, పూషచే శ్రీధరుని, పర్జన్యునిచే హృషీ కేశుని, త్వష్టచే పద్మ నాభుని, విష్ణువుచే దామోదరుని, న్యాసముచేసి, ద్వాదశాక్షరమంత్రమును సమస్త శిరమున న్యాసము చేయవలయును. తరువాత కిరీట మంత్రముచే వ్యాపకన్యాసమును చేయవలయును. కిరీట కేయుర హోరాంతమున ధ్రువము మకరమని, కుండాలాంతమున, చక్ర శంఖ గదాంతమున భోజు హస్తమున, పీతాంబరాంతమున శ్రీ వత్సాంకిత వక్ష స్థలము అని శ్రీభూమి సహిత స్వాత్మ జ్యోతిద్వయమును దీప్తకరాయ. తరువాత సహస్రాదిత్య తేజమునకు బాణ షడ్వర్ణములతో నమోంతము కిరీట మంత్రముగా చెప్పబడినది. ఇట్లు న్యాస వీధినాచరించి ప్రభువగు నారాయణుని ధ్యానము చేయవలయును. ఉదయించుచున్న కోటి సూర్యసముడు, శంఖ చక్రగదా పద్మములను ధరించినవాడు రెండు పార్శ్వములలో శ్రీభూములు కలవాడు, శ్రీవత్సవకుడు, కౌస్తుభమణి చే ప్రకాశించువాడు, ముత్యాలహారములు కంఠమున గలవాడు, హార కేయూరవలయాంగద భూషితుడు, పీతాంబరుడు, అగు నారాయణుని స్మరించవలయును. వీధిననుసరించి ఇంద్రియనిగ్రహము కలవాడై అక్షరలక్ష జపమును చేయవలయును. మొదటి లక్షచే ఆత్మ శుద్ధి, రెండవలక్షచే మంత్రశుద్ధి, మూడవలక్షచే స్వర్గము, సౌలుగవలక్టచే విష్ణుసామీప్యము, అయిదవలక్షచే పరిశుద్ద జ్ఞానము, ఆరవలక్షచే విష్ణువునందు స్థిరబుద్ధి, ఏడవలక్షచే విష్ణుసారూప్యము, ఎనిమిదవలక్షచే నిర్యాణమును పొందును. ఇట్లు ఎనిమిది లక్షలు జపించిన తరువాత దశాంశమును పద్మములచే తేనెను కలిపి సంస్కరించిన అగ్నిహోత్రమున హోమమును చేయవలయును. పీఠమున మండూకమునుండి పరతత్త్వమువరకు పూజించి, విమల, ఉత్కరిణి, జ్ఞాన, క్రియ, యోగా, ప్రహ్యే, సత్యా, ఈశానా, అనుగ్రహా అని తొమ్మిది శక్తులు. ఓం నమో భగవతే విష్ణవే సర్వభూతాత్మనే, వాసుదేవాయ సర్వాత్మా అను మంత్రమును ఉచ్చరించవలయును. సంయోగ యోగ పద్మాంతమున పీఠమున హృదయాంతిమము షడ్వింశాక్షరము అగు పీఠమంత్రము. ఈ పీఠమంత్రముచే ఆసనము నర్పించవలయును. మూర్తిని సంకల్పించి మూలమంత్రముచే ఆవాహన చేసి పూజించవలయును. మొదట అంగములను పూజించి మంత్రి కేశరములందు ప్రాగాదిదిగ్గలములందు వాసుదేవుని, సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్దుని, కోణములందు శక్తులనర్చించవలయును. శాంతిని, శ్రీని, సరస్వతిని, రతిని, క్రమముగా పూజించవలయును. హేమ, పీత, తమాల, ఇంద్రనీల కాంతులు గలవారు. పీతాంబరులు, చతుర్భుజులు, శంఖచక్రగదాపద్మధరులు మొదటి నలుగురు. సీతకాంచన గోదుగ్ధ దూర్వావర్ణులు శక్తులు. దలాగ్రములందు చక్ర శంఖ గదా పద్మ కౌస్తుభములను ముసలమును, ఖడ్గమును, వనమాలను క్రమముగా పూజించవలయును. రక్తా జపీత కనక శ్యామ కృష్ణాసితార్జున వర్ణులను, కుంకుమ వర్ణము గల పక్షిణజును బహిరగ్రభాగమున చక్కగా పూజించవలయును. రెండు ప్రక్కల ముక్తామాణిక్య సంకాశములగు శంఖ పద్మ నిధులను క్రమముగా పూజించవలయును. పశ్చిమ భాగమున ధ్వజమును పూజించవలయును. ఆగ్నేయమున రక్తవర్ణుడగు వీ ఘ్నేశుని, నైబ్రుతి కోణమున శ్యాముడగు ఆర్యుని, వాయవ్యమున శ్యామ యగు దుర్గను, ఈశానకోణమున పీతవర్ణుడగు సేనానీని పూజించి, బాహ్యభాగమున ఆయుధములతో కూడియున్న లోకపాలకులను పూజించవలయును. ఇట్లు ఆవరణలచే కూడి యున్న అవ్యయుడగు విష్ణువును పూజించినపోడు ఇహమున సకల భోగములననుభవించి అంతమున విష్ణుపదమును పొందును.
క్షేత్రధాన్యసువర్ణానాం ప్రాప్తయే ధరణీం స్మరేత్.
దేవీం దూర్వాదలశ్యామాం దధానాం శాలిమంజరీమ్,
చింతయేద్భారతీం దేవీం వీణాపుస్తకధారిణీమ్.
దక్షిణే దేవదేవస్య పూర్ణచంద్రనిభాననామ్,
క్షీరాబ్ధి ఫేనపుంజాభై వసానాం శ్వేతవాపసీ.
భారత్యా సహితం యో వై ధ్యాయేద్దేవం పరాత్పరమ్,
వేదవేదార్థతత్త్వజ్ఞో జాయతే సర్వవిత్తమః.
నారసింహమీనాత్మానం దేవం ధ్యాత్వాతిభైరవమ్,
శస్త్రం సంమస్త్య మంత్రేణ శత్రూన్లత్వా నివర్తతే.
నారసింహేన బీజేన మంత్రం సంయోజ్య సాధకః,
శతమష్టోత్తరం జప్త్వా వామహస్తాభిమంత్రితాః.
పునః పునస్సించేత్సర్పదష్ణోఒ పి జీవతి,
గౌరుడేన చ సంయోజ్య పంచార్ణేన జపేత్తదో.
నిర్విషీకరణే ధ్యాయేద్విష్ణుం శీరుడవాహనమ్,
అశోకఫలకే తార్క్ష్యమాలిఖ్యాశోకసంహతా.
అశోకపు షెస్సంపూజ్య భగవన్తం తదగ్రతః,
జుహుయాతాని పుష్పాణి త్రిసంధ్యం సప్తపత్రకమ్.
ప్రత్యక్షో జాయతే పక్షీ వరమిష్టం ప్రయచ్ఛతి,
గాణపత్యేన సంయోజ్య జ పేర్లక్షం పయోవ్రతః,
మహాగణపతిం దేవం ప్రత్యక్షమిహ పశ్యతి వాణీబీజేన సంయుక్తం షణ్మాసం యోజయేన్నరః.
మహాకవ్వరో భూత్వా మోహయేత్సకలం జగత్,
హుత్వా గూడూచీశకలాన్యర్ధాంగులమీతాని చ .
దధిమధ్వాజ్యయుక్తాని మృత్యుం జయతి సాధకః,
శనైశ్చరదినే సమ్యక్ స్పృష్ట్వాశ్వర్థం చ పాణినా.
జప్త్వా చాష్టశతం యుద్దే హ్యపమృత్యుం జయత్యసౌ,
పంచవింశతిధా జప్త్వా నిత్యం ప్రాతః పిబేజ్జలమ్.
సర్వపాపవినిర్ముక్తో జ్ఞానవాన్రోగవర్జితః,
కుంభం సంస్థాప్య విధివదాపూర్య శుద్ధవారిణి.
జప్త్వాయుతం తత స్తేనాభి షేకస్సర్వరోగనుత్,
చన్దసూర్యోపరాగే తు హ్యుయేష్యాష్టసహస్రకమ్.
స్పృష్ట్వా బ్రాహ్మీ ఘృతం జప్త్వా ఓబేత్సాధకసత్తమః,
మేధాం కవిత్వం వాక్సిద్ధిం లభతే నాత్ర సంశయః.
జుహాయాదయుతం బిల్వెర్మహాధనపతిర్భవేత్,
నారాయణస్య మంత్రాయం సర్వమంత్రోత్తమోత్తమః.
ఆలయస్సర్వ సిద్ధీనాం కధితస్తవ నారద,
నారాయణాయ శబ్దాంతే విద్మహే పదమీరయేత్.
వాసుదేవపదం జేస్తం ధీమహీతి తతో వదేత్,
తన్నో విష్ణుః ప్రచోవర్లాన్నంవదేచోదయాదితి.
ఏషోక్తా విష్ణుగాయత్రీ సర్వపాపప్రణాశినీ,
తారో హృద్భగవా జేన్తో వాసుదేవాయ కీర్తితః.
ద్వాదశార్లో మహామన్తో భుక్తిముక్తి ప్రదాయకః,
స్త్రీ శూద్రాణాం వీతార్యోయ: సతారస్తు ద్విజన్మనామ్.
ప్రజాపతిర్ము నిశ్చాస్య గాయత్రీ ఛన్ద ఈరితః,
దేవతా వాసుదేవస్తు బీజం శక్తిర్ధూవశ్చ హృత్.
చంద్రాక్షి వేదపంచార్లె: సమ స్తేనాంగకల్పనమ్,
మూఢి ఫాలేదృశోరా స్యే గలే ద్రోదయే పునః.
కుక్షౌ భౌ ధ్వజే జానుద్వయే పాదద్వయే తథా,
న్య సేతమానన్తవర్ణాన్ సృష్టిన్యాసోయమీరితః.
హృదొదిమస్తకాంతం తు స్థితిన్యాసం ప్రచక్షతే,
పాదోదారభ్య మూర్థానం న్యాసం సంహారకం విదుః.
తత్త్వన్యాసం తతః కుర్యాత్సర్వతంత్రేషు గోపితమ్,
జీవం ప్రాణం తథా చిత్తం హృత్పద్మం సూర్యమండలమ్.
చంద్రాగ్నిమండలే చైవ వాసుదేవం తతః పరమ్,
సంకర్షణం చ ప్రద్యుమ్నం అనిరుద్ధం తతః పరమ్.
నారాయణం చక్రమతస్తత్త్వాని ద్వాదశైవ కు,
మూలార్ణహృత్పరాయాద్యమాత్మనే హృదయాంతిమమ్.
తత్వే నామ పముచ్చార్య న్య సే న్మూర్థాదిషు క్రమాత్,
పూర్వోక్తం ధ్యాన మత్రాపి భానులక్ష జపో మనోః.
తద్దశాంశం తిలైరాజ్యలోలితైర్లవనం చరేత్,
పీకే పూర్వోదితే మస్త్రీ మూర్తిం సంకల్ప్య మూలతః.
తస్యామావాహ్య దేవేశం వాసుదేవం ప్రపూజయేత్,
అంగాని పూర్వమభ్యర్చ్య వాసుదేవాదికాస్తతః.
శాంత్యాదిశక్తయః పూజ్యాః ప్రాగ్వద్దిక్షు విదిక్షు చ,
తృతీయావరణే పూజ్యాః ప్రోక్తా ద్వాదశమూర్తయః.
ఇంద్రాద్యానాయుధైర్యుక్తాన్పూజయేద్ధరణీగృ హే,
ఏవమావరణైరిష్ట్వా పంచభిర్విష్ణుమవ్యయమ్.
ప్రాప్నుయాత్సకలానర్ధాననే నిష్ణు పదం వ్రజేత్.
క్షేత్రధాన్యసువర్ణముల ప్రాప్తి కొఱకు మూర్వాదలశ్యామ, శాలిమంజరులను ధరించియున్న ధరణిని స్మరించవలయును. దేవదేవుని దక్షిణ భాగమున నున్న పూర్ణచంద్రనిభానన క్షీరసాగరతరంగఫీననిభవస్త్రధారిణి, వీణా పుస్తకధారిణియగు భారతీదేవిని ధ్యానించవలయును. బారతీదేవితో కూడియున్న పరాత్పరుని ధ్యానించినవాడు వేదవేదార్థ తత్త్వజుడు సర్వవిత్తముడగును. అతిభయంకరుడగు నారసింహుని ధ్యానము చేసి, మంత్రముచే శస్త్రమును మంత్రించి యుద్దమునకు వెళ్ళినచో శత్రువులను వధించి తిరిగి వచ్చును. సాధకుడు నారసింహబీజముచే మంత్రమును సంయోజన గావించి, ఆప్టోత్తరమును జపించి మంత్రించబడిన జలమును వామహస్తముచే మాటిమాటికి ప్రోక్షణ చేసినచో సర్పదష్టుడు కూడా బ్రతుకును. గారుడ మంత్రముతో సంయోజనము చేసి పంచాక్షరితో జపించవలయును. విషమును తొలగించుటకు గరుడవాహనుడగు విష్ణువును ధ్యానించవలయును. అశోకఫలమున గరుడుని లిఖించీ అశోక పుష్పములతో పూజించి మూడు పూటలా ఏడుమార్లు ఆ పుష్పములను హోమమును చేయవలయును. పక్షి ప్రత్యక్షమై ఇష్టమగు వరముల నిచ్చును. గాణపత్యముచే సంయోజనము చేసి క్షీరవ్రతమును స్వీకరించి లక్ష జపము చేసినచో మహాగణపతిదేవుని ప్రత్యక్షముగా చూడగలడు. వాణీ బీజయుక్తముగా ఆరు మాసములు యోజన చేసినచో మహాకవివరుడై సకల జగత్తును మోహింపచేయును. అర్ధాంగుల మితములగు, గుడూచీశకలములను దధిమధ్వాజ్యయుక్తముగా హోమముగావించినచో మృత్యువును జయించును. శనివారమున రాగి చెట్టును చేతితో తాకి అష్టశతమును జపముగావించినచో యుద్ధమున అపమృత్యువుని జయించును. ప్రతి నిత్యము ప్రాతఃకాలము ఇరువది అయిదుమార్లు జపించి జలపానము చేయవలయును. సర్వపాపవినిర్ముక్తుడై జ్ఞానవంతుడై రోగవర్షితుడగును. కుంభమును స్థాపించి శుద్ధజలమును విధిననుసరించి అన్ని రోగములు నశించును. సూర్య చంద్ర గ్రహణములలో ఉపవసించి ఎనిమిది వేలు బ్రాహ్మీఘృతమును జపించి పానము చేయవలయును. మేధను కవిత్వమును వాక్సిద్ధిని పొందగలడు. బిల్వపత్రములచే పదివేలు హోమము చేయవలయును. మహాధనపతి యగును. ఇది నారాయణమంత్రము సర్వమంత్రోత్తమము. సర్వ సిద్దులకు ఆలయమైన దీనిని నీకు చెప్పితిని. “నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్” అనునది విష్ణుగాయత్రి. ఇది సర్వపాపములను నశింపచేయును. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనునది మహా మంత్రము. ఇది ద్వాదశాక్షరి. భుక్తి ముక్తి ప్రదాయకము. స్త్రీ శూద్రులకు ప్రణవరహితముగా బ్రాహ్మణులకు ప్రణవసహితముగా చెప్పబడినది. ఈ మంత్రమునకు ప్రజాపతిముని. గాయత్రీ ఛందస్సు. దేవత వాసుదేవుడు శక్తి బీజము హృదయము ధ్రువము. చంద్రాక్షి వేదపంచాక్షరములతో అంగ కల్పనము చేయవలయును. శిరస్సున ఫాలభాగమున నేత్రములందు, ముఖమున, కంఠమున, హృదయమున, కుక్షియందు, నాభియందు, ధ్వజమునందు, జానుద్వయమున, పాద ద్వయమున, క్రమముగా మన్తవర్ణన్యాసము చేయవలయును. దీనిని సృష్టిన్యాసమందురు. హృదయము నుండి మస్తకము వరకు చేయు న్యాసము స్థితిన్యాసమందురు. పాదములనుండి మస్తకము వరకు సంహారన్యాసమందురు. సర్వతంత్రములందు గుప్తముగా చెప్పబడిన తత్త్వన్యాసమును తరువాత చేయవలయును. జీవము, ప్రాణము, చిత్తము, హృత్పద్మము, సూర్యమండలము, చంద్రాన్ని మండలములు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, చక్రము అనునవి ద్వాదశ తత్త్వములు. మూలాక్షర హృత్పరము క్రమముగా న్యాసమును గావించవలయును. ఇచట కూడా పూర్వోక్తధ్యాన మునే గావించవలయును. మంత్రమును పన్నెండు లక్షలు జపించవలయును. దశాంశమును నేతితో కలిపిన నువ్వులతో హోమమును చేయవలయును. పూర్వోక్త పీఠమునందు మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు దేవేశుని ఆవహించి వాసుదేవుని పూజించవలయును. మొదట అంగములను పూజించి తరువాత వాసుదేవాదికమును, శాంత్యాది శక్తులను దిక్కులందు, విదిక్కులందు పూజించవలయును. తృతీయావరణమునందు చెప్పబడిన ద్వాదశ మూర్తులను పూజించవలయును. ధరణీగృహమునందు ఆయుధయుక్తులగు ఇంద్రాదులను పూజించవలయును. ఇట్లు పంచావరణలచే అవ్యయుడగు విష్ణువును పూజించి సకలాభీష్టములను పొంది అంతమున విష్ణుపదమును చేరును.
పురుషోత్తమసంజ్ఞస్య విష్ణోర్భేదచతుష్టయమ్ .
త్రైలోకమోహన స్తేషాం ప్రథమః పరికీర్తితః,
శ్రీకరశ్చ హృషీ కేశః కృష్ణశ్చాత్ర చతుర్థకః.
తారః కామో రమాపశ్చా జేన్తస్స్యాత్పురుషోత్తమః,
వర్మాస్త్రాణ్యగ్ని ప్రియాంలో మంత్ర వహ్నీష్ణువర్ణవాన్.
బ్రహ్మమునిస్స్యాద్గాయత్రీ ఛన్దః ప్రోక్త్యాథ దేవతా,
పురుషోత్తమసంజోత బీజశక్తీ స్సరేందిరే.
భూచంద్రికరసాక్ష్యక్షమన్తవర్ణ్వాభాగతః,
కృత్వాంగాని తతో ధ్యాయేద్విధివత్పురుషోత్తమమ్.
సముద్యదాదిత్యనిభం శంఖచక్రగదాంబుజైః,
లసత్కరం పీతవస్త్రం స్మ రేచీపురుషోత్తమమ్.
మహారత్నౌఘఖచితస్పురతో రణమండ పే,
మౌక్తి కౌఘశమదమవిరాజితవితాననే.
నృత్యద్దేవాంగనాబృందక్వణత్కింకిణినూపురే,
లసన్మాణిక్యవేద్యాం తు దీప్తార్కాయుతతేజసి.
బృందారకవ్రాతకీరీటాగ్రకత్నాభిచర్చితే,
నవలక్షం జ పేన్మస్త్రం జుహుయాత్తద్దశాంశతః.
ఉత్ఫుల్లె: కమలైః పీఠా పూర్వోత్తో వైష్ణవ్యేర్చయేత్,
ఏవమారాధ్య దేవేశం ప్రాప్నోతి మహతీం శ్రియమ్.
పుత్రాన్పౌతాన్యశః కాంతిం భుక్తిం ముక్తిం చ విన్హతి,
ఉత్తి ప్లేతి పదం పశ్చాచ్ఛీకరాన్ని ప్రియాంతిమః.
అష్టార్లోస్య మునిర్వ్యాసః పంక్తి శ్ఛన్ల ఉదాహృతమ్,
శ్రీవకరో హరిః ప్రోక్తో దేవతా సకలేష్టదః.
భీషయ ద్వితయం హృత్వా త్తాసయ ద్వితయం శిరః,
శిఖా ప్రమర్ధ యద్దన్యం వర్మ ప్రధ్వంసయ ద్వయమ్.
అస్త్రం రక్షద్వయం సర్వే హుమం తాఃస్సముదీరీతాః,
మస్త కే నేత్రయోః కంఠే హృదయే నాభిదేశ కే.
ఊరుజంఘాంఘియు గ్మేషు మన్తవర్ణానమాన్య పేత్,
తతః పురుషసూక్తోక్తమంతైర్న్యాసం సమాచరేత్.
ముఖే న్య సేదాహ్మణ్యోస్య ముఖమాసీదిమం మనుమ్,
బాహుయుగ్మే తథా బాహూ రాజన్య ఇతి విన్య సేత్ .
ఊరూ తదస్య యద్వేశ్య ఇమమూరుద్యయేన్య సేత్,
న్య సేత్పాదద్వయే మంత్రి పద్భ్యాం శూద్రో అజాయత.
చక్రం శంఖం గదాం పద్మం కరాగ్రేషథ విన్య సేత్,
ఏవం న్యాసవిధిం కృత్వా ధ్యాయేత్పూర్వోత్తమండ పే.
ఆరుణాబ్దానునస్థస్య తార్యపోపరి సంస్థితమ్,
పూర్వోక్తరూపిణం దేవం శ్రీకరం లోకమోహనమ్.
ధ్యాత్వైవం పూజయేదష్టలక్షం మంత్రి దశాంశతః,
రక్తాంబుజైసమిద్భిశ్చ బిల్వక్టీరిద్రుమోద్భవైః.
పయాన్నెసరిషా హుత్వా ప్రత్యేకం సుసమాహితః,
అశ్వత్థాదుంబరప్లక్షవటాః క్షీరిద్రుమాస్మృతాః.
పూజయేడ్వెష్ణవే పీకే మూర్తిం సంకల్ప్య మూలతః,
అంగావరణదిక్పాలహాతిభిస్సహితం విభుమ్.
ఇజ్ఞం సిద్ధే మనో మంత్రి ప్రయోగాన్పూర్వవచ్చరేత్,
తారో హృద్భగవా జేన్తో వహా హేతి తతః పరమ్.
రూపాయ భూర్భువస్వస్స్యాల్లో హితకామికా చ యే,
భూపతిత్వం చ మే దేహి దదాపయ శుచిప్రియా.
రామాగ్నివర్ణో మంత్య్రోయరి భార్గవ్యోస్య మునిర్మతః,
ఛంద్యోనుష్టుప్టేవతాది వరాహస్సముదీరితః.
ఏకదంష్ట్రాయ హృదయం వ్యోమోల్కాయ శిరస్స్మృతమ్,
శిఖా లేజ్యోధిపతయే విశ్వరూపాయ వర్మ చ.
మహాదంష్ట్రాయ చాస్త్రం స్యాత్సంచాంగమితి కల్పయేత్,
అథవా గిరిషట్సుప్త బాణైర్వసుభిరక్షరైః.
విభకైర్మన్తవర్ణస్య పంచాంగాని ప్రకల్పయేత్,
తతో ధ్యాయేదనేకారనిభమాదివరాహకమ్.
ఆణ హ్రీం స్వరనిభం జాన్వోరధోనాభేసితప్రభమ్,
ఇష్టాభీతిగదా శంఖచక్రశక్త్యసిఖేటకాన్.
దధతం చ కరైంష్ట్రా గ్రలసద్ధరణిం స్మరేత్,
ఏవం ధ్యాత్వా జు పేల్లక్షం దశాంశం సరసీరు హైః.
మధ్వజ్జెర్జుహుయాతీతే పూర్వోత్తే వైష్ణవే యజేత్,
మూలేన మూర్తిం సంకల్ప్య తస్యాం సంపూజయేద్విభుమ్.
అంగావరం దిక్పాలహోతియప్రసిద్ధయే,
జపాదేవావనిం ధనం ధాన్యం మహీం శ్రియమ్.
సింహార్కే సితపక్షస్యాష్టమ్యాం గవ్యేషు పంచసు,
శిలాం శుద్దాం వినిక్షిప్య స్పృష్ట్వా తామయుతం జపేత్.
ఉదజ్మఖస్తతో మంత్రి తాం శిలాం నిఖనేద్భువి,
భూత, ప్రేతా హి చౌరాని కృతాం బాధాం నివారయేత్.
ప్రాతర్భగుదినే సాధ్యభూతలాన్మృదమాహరేత్,
మంత్రి తాం మూలమంత్రేణ విభజేళ్తాం త్రిధా పునః.
చుల్లామేకం సమాలిప్యాప్సపరం పాక భాజనే,
గోదుగ్ధ పరమాలోగ్య శోధితాంస్తండులోని పేల్.
సమ్యక్శుద్ధే శుచిఃరేష జపన్మస్త్రం పచేచ్చరున్,
అవతార్యం చరుం పశ్చార్వహ్నౌ దేయం యథావిధి.
సంపూజ్య ధూపదీపాద్యైః పశ్చాదాజ్యప్తుతం చరుమ్,
జుహుయాత్సంస్కృత వహ్నౌ అష్టోత్తరశతం సుధీః.
ఏవం ప్రజుహుయాన్మస్త్రి కవివరేషు సప్తసు,
విరోధో నశ్యతి క్షేత్రే శత్రుచౌరాద్యుపద్రవాః.
భానూదయే ప్యారవారే సాధ్య క్షేత్రాన్మృదం పునః,
ఆదాయ పూర్వవిధినా హవిరాపాద్య పూర్వవత్.
జూహుయాదేధితే వహ్నౌ పూర్వసంఖ్యాకమాదరాత్,
ఏవం స సప్తవారేషు జుహుయాత్ క్షేత్ర సిద్ధయే.
జుహుయాన్లక్షసంఖ్యాకం గవ్య శ్చైవ సపాయ సైః,
అభీష్టభూమ్యాధిపత్యం లభతే నాత్ర సంశయః.
ఉద్యద్దేః పరిఘం దివ్యం సితదంష్ట్రాగ్రభూధరమ్,
స్వర్ణాభం పార్థవే పీతే మండలే సుసమాహితః.
ధ్యాత్వాప్నోతి మహీం రమ్యాం వరాహస్య ప్రసాదతః,
వారుణే మండలే ధ్యాయేద్వారాహం హిమసన్నిభమ్.
మహోపద్రవశాంతిస్స్యాత్సాధకస్య న సంశయః,
వశ్యార్థం చ సదా ధ్యాయేద్వహ్యాభం వహ్నిమండలే.
ధ్యాయేదేవం రిపోచ్చాటే కృష్ణాభం వాయుమండలే,
ద్యుమండలగతం స్వచ్ఛం వారాహం సర్వసిద్ధిదమ్.
శత్రుభూతగ్రహక్ష్వేడామయపీడాదిశాంతయే,
భృగ్వర్థీశయుతం వ్యోమబిందుభూషితమస్తకమ్.
పురుషోత్తముడను పేరుగల విష్ణువును నాలుగు భేదములు గలవు. వారిలో మొదటి వాడు త్రైలోక్య మోహనుడు. రెండవవాడు శ్రీకరుడు. హృషీ కేశుడు కృష్ణుడు అను వారు మూడవ నాలుగవ భేదములు. ఈ మంత్రమున ఓంకారము కామము. తరువాత రమాపదమును. చతుర్థ్యస్త పురుషోత్తమ పదమును చెప్పవలయును. ఓం రమాపురుషోత్తమాయ అనునది మంత్రము. వర్మ అస్త్రములు అగ్ని ప్రియాంతము వహ్నీందు వర్ణములు గల మంత్రమిది. ఈ మంత్రమునకు బ్రహ్మ ముని. గాయత్రీ ఛందస్సు. పురుషోత్తముడు దేవత. స్మరబీజము, ఇందిర శక్తి, భూదందైకరసాక్షి అక్షిమంత్ర వర్ణములచే విభాగముతో అంగముల నేర్పరిచిన తరువాత విధిననుసరించి పురుషోత్తముని ధ్యానించవలయును. ఉదయించు సూర్యసన్నిభుడు, శంఖచక్రగదాపద్మములచే శోభించు హస్తములు కలవాడు, పీతాంబరుడు అగు పురుషోత్తముని స్మరించవలయును. మహా రత్నసమూహములచే చెక్కబడిన, శోభించు మండపమున, ముత్యముల సమూహము శమదమ విరాజిత వితానమున, నర్తించు దేవాంగనా బృందముల ధ్వనించు కింకిణులు గల నూపురములు గల, ప్రకాశించు మాణిక్య వేదిక యందు, ప్రకాశించు సూర్య తేజస్సు గల, బృందారక వ్రాత కిరీటాగ్ర రత్నాభిచర్చితమగు మండలమున నవలక్ష పర్యాయములు మంత్రమును జపించవలయును. దశాంశమును పూర్వోక్త వైష్ణవ పీఠమున వికసించిన కమలములచే హోమమును చేసి అర్చించవలయును. ఇట్లు దేవేశుని పూజించి గొప్పసంపదను పొందును. పుత్రులను పౌత్రులను, కీర్తిని, కాంతిని, భుక్తిని, ముక్తిని పొందును. తరువాత శ్రీకారాగ్ని ప్రియాంతిమమగు 'ఉత్తిష్ఠ' అని పదమునుచ్చరించవలయును. ఈ మంత్రము అష్టాక్షరములు కలది. ముని వ్యాసమహర్షి, పంక్తి ఛందస్సు. శ్రీకరనాముడు శ్రీహరి దేవత భీషయద్వితయము హృదయము. త్రాసయ త్రాసయ అనునది శిరము. ప్రమర్దయ ప్రమర్దు' అనునది శిఖ, ప్రధంసయ ప్రధ్వంసము అనునది కవచము. రక్ష రక్ష అనునది అస్త్రము. ఇవి అన్నియు హుం అనునది అంతమునందు కలవి. మస్తకమున, నేత్రములలో, కంఠమున, హృదయమున, నాభియందు, ఊరు జంఘపాదద్వయములందు క్రమముగా మన్త వర్ణ న్యాసమును చేయవలయును. తరువాత పురుషసూక్తమంత్రములచే న్యాసము నాచరించవలయును. బ్రాహ్మణోగ్య ముఖమాసీత్ అను మంత్రమును ముఖమున, బాహూరాజన్య అను మంత్రమును బాహుద్వయమున, ఊరూ తదస్య యద్వేశ్య అను మంత్రమును ఊరుద్వయమున, పద్బ్యాం శూద్రో ఆజాయత అను మంత్రమును పాదద్వయమున న్యాసమును చేయవలయును. చక్ర శంఖ గదా పద్మములను కరాగ్రములందు న్యాసమును చేయవలయును. ఇట్లు న్యాసవిధిని పూర్తి చేసి పూర్వోత్తమండపమున ధ్యానమును చేయవలయును. అరుణాబ్దానమున నున్న గరుడుని మీదున్న పూర్వోక్తరూపుడగు, లోకమోహనుడగు శ్రీకరుని ధ్యానము చేసి పూజించి ఎనిమిది లక్షలు జపమును చేయవలయును. దశాంశమును రక్త పద్మములచే బిల్వసమిధలచే, క్షీరిద్రుమ సమిధలచే హోమమును చేయవలయును. పొలన్నముచే నేతితో వేరు వేరుగా హోమమును గావించవలయును. రాగి, మేడి, జువ్వి, మట్టి వృక్షములు క్షీరిద్రుమములన బడును. వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, అంగావరం దీక్సాలాయుధములచే కూడిన విభువును పూజించవలయును. ఇట్లు మస్త్రము సిద్ధించిన తరువాత పూర్వము వలే ప్రయోగముల నాచరించవలయును. “ఓమ్ నమో భగవతే వరాహరూపాయ భూర్భువస్వః” అనునది మంత్రము. నాకు భూపతిత్వమును ఇమ్ము, అని ప్రార్థించవలెను. ఈ మంత్రమునకు బార్గవ ఋషి. అనుష్టుపునస్సు, ఆదివరాహము దేవత. ఏకదంష్ట్రునకు హృదయము వ్యో మోలునను శిరము, తేజోధిపతికి శిఖ, విశ్వరూపునకు కవచము, మహాదంష్ట్రునకు అస్త్రము అని పంచాంగమును కల్పించవలయును. గిరి, షట్, సప్త బాణవసు అక్షరములుగా మన్త వర్యములకు విభాగము చేసి పంచాంగములను కల్పించవలయును. తరువాత అనేక సూర్యసన్నిభుడగు ఆదివరాహుని ధ్యానము చేయవలయును. స్వర్ణవిభుని జానువులలో, సిత ప్రభుని నాభి అధోభాగమున, ఇష్ట భయగదోశంఖచక్రశక్తి ఖడ్గఖేటములను హస్తములలో ధరించియున్న, దంష్ట్రాగ్రములందు శోభించు ధరణి కలవాడు అయిన వరాహమును స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి, దశాంశమును పద్మములను నేతితో కలిపి హోమమును చేయవలయును. వైష్ణవ పీఠమున పూజించవలయును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి ఆ మూర్తియందు ప్రభువును పూజించవలయును. అంగావరణ దిక్పాలహోతి యంత్రప్రసిద్ది కొఱకు జపము చేయగనే ధనధాన్యభూసంపదలను దానము చేయవలయును. సూర్యుడు సింహరాశిలో ఉన్నపుడు శుక్లపక్షమున అష్టమితిథియందు పంచగవ్యములందు శుద్ధమగు శిలనుంచి, ఆ శిలను స్పృశించి పది వేలు జపమును చేయవలయును. తరువాత మంత్రసిద్ధిని పొందినవాడు ఉత్తరాభిముఖుడై ఆశలను భూమియందు నిక్షిప్తము చేయవలయును. ఇట్లు చేసినచో భూత ప్రేతసర్పచోరాది బాధలు తొలగును. శుక్రవారమున ప్రాతః కాలమున సాధ్యమగు భూమినుండి మట్టిని తేవలయును. ఆ మట్టిని మూల మంత్రముచే మంత్రించి మూడుగా విభజించవలయును. ఒక భాగమును పొయ్యి మీద అలికి, మరొక భాగమును పాక పాత్రను పూసి, ఆవుపాలతో చక్కగా ఆలోడనము చేసి శుద్ధి పరిచిన తండులముల నుంచవలయును. చక్కగా శుద్ధి చేయబడిన పాకశాలలో మంత్రమును జపించుచు చరువును వండవలయును. ఆచరువును పొయి మీది నుండి దింపి అగ్నిలో యథావిధిగా హోమమును చేయవలయును. ధూపదీపాదులతో చక్కగా పూజించి నేయి కలిపిన చరువును సంస్కరించబడిన అగ్నిలో నూటా ఎనిమిది మార్లు హోమమును చేయవలయును. ఇట్లు మంత్రమును పొందినవాడు ఏడుశుక్ర వారములలో హోమమును గావించవలయును. స్వక్షేత్రమున గల విరోధము నశించును. శత్రు చోరాదుల వలన కలుగు ఉపద్రవములు నశించును. ఇట్లే మంగళవారమున సూర్యోదయకాలమున సాధ్య క్షేత్రమునుండి మట్టిని స్వీకరించి పూర్వవిధిగా హవిస్సును సిద్ధము చేసి నూటాఎనిమిది మార్లు సంస్కృతాగ్నిలో హోమమును గావించవలయును. పాయసముతో కూడిన గవ్యములలో లకసంఖ్యగా హోమమును గావించవలయును. ఇట్లు గావించినచో తాను కోరిన భూమికి ఆధిపత్యము లభించును. బాహువులలో పరిఘను ధరించి, తెల్లని దంష్ట్రాగ్రమును భూమిని ధరించి, స్వర్ణసన్నిభుడగు వరాహస్వామిని పీత పార్థివ మండలమున సావధాన మనస్కుడై ధ్యానము చేసినచో, వరాహస్వామి అనుగ్రహముచే చక్కని భూమీని పొందగలడు. వారుణ మండలమున హిమసన్నిభుడగు ఆదివరాహుని ధ్యానమును చేయవలయును. ఇట్లు చేసినచో సాధకునికి మహోపద్రవములు శాంతించును. సకలవశ్యత కొఱకు వహ్నిమండలమున వహ్నిసన్నిభుడగు వరాహస్వామిని ధ్యానించవలయును. శత్రువులను పారద్రోలుటకు వాయుమండలమున కృష్ణవర్ణుడగు వరాహస్వామిని ధ్యానించవలయును. ద్యుమండలమున నున్న స్వచ్ఛుడు సర్వ సిద్దీ ప్రదుడగు వరాహ స్వామిని శత్రు గ్రహ క్షేడా, ఆమయ పీడాదీ శాంతికోజుకు, వ్యోమ బిందు భూషితమస్తకుని ధ్యానించవలయును.
ఏకాక్షరో వరాహస్య మంత్రః కల్పద్రుమోపరః,
పూజాద్యర్ఘ్యాధికం సర్వమస్యాం పూర్వోక్తవచ్చరేత్.
సవామకర్ణి నిద్రా స్యాద్వరాహాయ హృదంతిమః,
తారాద్యో వసువర్ణో ఒయం సర్వేశ్వర్యప్రదాయకః.
బ్రహ్మా మునిస్స్యాద్గాయత్రీ ఛందో వారాహసంజ్ఞకః,
దేవశ్చంద్రేంద్వబ్థివేతైస్స వేణాంగక్రియామతా.
ధ్యానపూజాప్రయోగాది ప్రాగ్వదస్యా పి కల్పయేత్,
ప్రణవాదౌ చ జేస్తం చ భగవతీతి పదం తతః.
ధరణి ద్వితయం పశ్చాద్ధర్థ్వయముదీరయేత్,
ఏకవింశతివర్ల్యా మంత్రో వహ్నిప్రియాంతిమ.
వరాహాస్య మునిశ్ఛంద్రో గాయత్రీనివృరాదికా,
దేవతా ధరణీ బీజం తారశ్శక్తిర్వసుప్రియా.
రామవేదాగ్నిబాణాక్షినేవారైరంగకల్పనమ్,
శ్యామాం చిత్రవిభూషాఢ్యం పద్మస్థాం తుంగసుస్తనీమ్.
నీలాంబుజద్వయం శాలిమంజరీం చ శుకం కరైః,
దధతీం చిత్రవసనాం ధరాం భగవతీం స్మరేత్.
ఏవం ధ్యాత్వా జ పేల్లక్షం దశాంశం పాయ సేన తు,
సాజ్యేన జుహుయాన్మస్త్రీ విష్ణోః పీకే సమర్పయేత్.
మూర్తిం సంకల్ప్య మూలేన తస్యాం వసుమతీం యజేత్,
ఆంగాని పూర్వమారాధ్య భూవహ్నిజలమారూఖాన్.
దిక్పాతేషు చ సంపూజ్య కోణపతేషు తత్కలాః,
నివృత్తి ప్రతిష్ఠా చ విద్యానాం త్రైశ్చ తత్కలాః.
ఇంద్రాద్యానపి వజ్రాదీన్పూజయేత్తదనన్తరమ్,
ఏవం సిద్దే మనౌ మంత్రీ సాధయేదిష్టమాత్మనః.
ధరణీం ప్రభజన్నేవం పశురత్నాంబరాదిభిః,
ధరణ్యా వల్లభస్సస్యా సుఖీ జీవేచ్ఛతం సమాః.
త్రైలోక్యమోహన్ మంత్ర జగన్నాధస్య కీర్త్యతే,
తారః వామో రమాబీజం హృదంతే పురుషోత్తమః.
శ్రీకంఠః ప్రతిరూపాంతే లక్ష్మీతి నివాసి చ,
సకలాంలే జగత్పశ్చాత్ క్షోభణీతి పదం వదేత్.
సర్వ హృదయాంతేతు విదారణపదం వదేత్,
తత స్త్రిభువనాంతంతు మదోన్మాదక రేతి చ.
సురాసురాంతే మనుజసుందరీ జనవర్ణతః,
మనాంధీ తాపయ ద్వంద్వం దీపయద్వితయం తతః.
శోషయద్వితయం పశ్చాన్మారయద్వితయం తతః,
స్తంభయ ద్వితయం భూయో మోహయద్వితయం తతః.
ద్రావయద్వితయం తావధాకరయయుగం తతః,
సమస్తపరమో యేన సుభగేన చ సంయుతమ్.
సర్వసౌభాగ్యశబ్దాంతే కరసర్వపదం వదేత్,
కామప్రదాదమునహ్మ సేన్దుర్లనుయుగం తతః.
చక్రేణ గదయా పశ్చాళణేన తదనన్తరమ్,
సర్వబాణి రేడియుగం పాశేనాంతే కటద్వయమ్.
అయశేనేత సంప్రోచ్య తాడయ ద్వితయం పునః,
కురుశబ్దద్వయమధో కింతిష్ఠసి పదం వదేల్.
తావద్యావత్పదస్యాంతే సమాహితమనన్తరమ్,
తతో మే బుద్ధి రాభాస్య భగమంతే చ వర్మఫట్.
హృదంత్యోఒ యం మహామంత్రో ద్విశతార్ణస్సమీరితః,
జైమినిర్మనురస్యోక్తశ్చదశ్చామిత మీరితమ్.
దేవతా జగతాం మో హే జగన్నాథః ప్రకీర్తితః,
కామో బీజం రమాశక్తి వినియోగ్యో ఖిలాషయే.
పురుషోత్తమత్రిభువనోన్మాదకాంతేనగ్నివర్మచ,
హృదయం కీర్తితం పశ్చాజ్జిగతోభణశబ్దితః.
లక్ష్మీదయితవర్మాస్తశ్శిరః ప్రోక్తం శిఖా పునః,
మన్మథోత్తమశబ్దాంతే మంగజే పదమీరయేత్.
కామదాయేతి హుం ప్రోచ్య న్య సేద్వర్మ తతః పరమ్,
పరమాంతే భృగుకర్ణాభ్యాం చ సర్వపదం తతః.
సౌభాగ్యకరవర్మం తే కవచం పరికీర్తితమ్,
సురాసురాంతే మనుజసుందరీతి పదం వదేత్.
హృదయాంతే విదా పశ్చాద్రణసర్వపదం వదేత్ ,
తతః ప్రహరణధరసర్వకాముకతత్పదమ్.
హనయుగ్మం చ హృదయం బంధనాని తతో వదేత్,
ఆకర్షయద్వయం పశ్చాన్నహాబలపదం తతః.
వర్మ చాస్త్రం సమాఖ్యాతం నేత్రం స్వాతదనంతరమ్,
వదేల్షిభువనం చ్చర సర్వజనేతి చ .
మనాంసి పరయుగ్మాంతే దారయ ద్వితయం చ మే,
వశమానయ వర్మాంతే నేత్రమన్తస్సమీరితః.
షడంగమంత్రాస్తారాద్యాః ఫట్ నమోంతాః ప్రకీర్తితాః,
తార సైలోక్యశబ్దాంతే మోహనేతిపదం వదేత్.
హృషీకే శేతి సంప్రోచ్యా ప్రతిరూపాదిశబ్దతః,
మన్మధానన్తరం పర్వ స్త్రీణాం హృదయమీరయేత్.
ఆకర్షణ పదాగచ్చదాగచ్ఛ హృదయాంతమః,
అనేకవ్యాపకం కృత్వా జగన్నాధం స్మరేత్సుధీః.
క్షీరాబ్లేస్తు తటే రమ్యం సురద్రుమలతాంచితమ్,
ఉద్యదరాభుజాలాభం స్వధామ్నో జ్వాలదిబ్ము ఖమ్.
ప్రసూనావతిసౌరభ్యమాద్యన్మధుకరారవమ్,
దివయవాతోచలత్కంజపరాగోద్ధూలితాంబరమ్.
స్వర్వధూగీతమాధుర్యభిరామం చింతయేద్వనమ్,
తదంతర్మణి సంపత్తిస్పురతో రణమండ పే.
విలసనౌక్తికోద్దామదామరాజద్వితానకే,
మణివేద్యాదివియత్ కిరీటాగ్రసమర్చతే.
దివ్య సింహాసనే విప్ర సమాసీనం స్మరేద్విభుమ్,
శంఖ పాశేషుచాపాని ముసలం నందకం గదమ్.
అంకుశం దధతం దోర్బి ప్లే కమలయోరసి,
పశ్యత్యంకస్థయాంభోజియా రాగోల్లసద్దృశా.
ధ్యాల్వెవం ప్రజ పేల్లక్షచతుష్కం తద్దశాంశతః,
కుంద్యేర్థచంద్రో పర్మెర్వా జాతీపు ష్పైశ్చ హోమయేత్.
యాగభూమిం తథాత్మానం యానోపకరణం తథా,
పూజయిష్యన్జగన్నాథం గాయత్ర్యా ప్రోక్షయేద్బుధః.
త్రైలోక్యమోహనాయాంతే విద్మ హే పద్మ మీరయేత్,
త్మరాయ ధీమహీత్యుక్త్వా తన్నో విష్ణుః ప్రచోదయాత్.
గాయత్యేషా సమాఖ్యాతా సర్వశుద్ధికరీ పరా,
కల్పయేదాసనం పీలే పూర్వోత్తే వైష్ణవే సుధీః.
పక్షిరాజాయ తద్వంద్వం పీఠమంత్ర్యోయమీరితః,
మూర్తిం సంకల్ప్య మూలేన తస్యామావాహయేదతః.
వ్యాపకం న్యాసమంత్రేణ తతస్సంపూజ్య భక్తితః,
శ్రీవత్సహృదయం తేన శ్రీవత్సం స్తనయోగ్యజేత్.
కౌస్తుభాయ హృదంతేన యజ్వేక్షసి కౌస్తుభమ్,
పూజయేద్వనమాలాయై హృదంతేన గలే చ తామ్.
కర్ణికాయాం తత్యోఅభ్యర్యేద్విధివచ్చాన్య దేవతాః,
దలేషు పూజయేత్పశ్చాలక్ష్మ్యాద్యావృతచామరాః.
బంధూకుసుమాభాసా ముక్తాహారలసత్కుచాః,
ఉత్ఫుల్లాంభోజనయనా మదవిభ్రమమంధరాః.
లక్ష్మీ సరస్వతీ చైవ ధృతిం ప్రీతిస్తతః పరమ్,
కాంతిశ్శాంతిస్తుష్టి పుష్టి బీజాద్యా బేనంతాః.
భృగుః ఖడ్రాశచంద్రాభ్యో దేవ్యాబీజముదాహృతమ్,
హ్రస్వత్రయక్లీబసర్వరహితస్వరసంయుతమ్.
దేవ్యా బీజక్రమాదాసామాగౌ చ వినియోజయేత్,
దలాగ్రేషు యజేచ్ఛంఖం శార్జం చక్రమపిం గదామ్.
అంకుశం ముసలం పాశం సముద్రామనుభిః పృథక్,
మహాజలచరాయాంతే వర్మాస్త్రం వహ్నివల్లభా.
పాంచజన్యః ప్రతారాధో నమోంతః శంఖపూజనే,
శార్జయ సశయాంతే చ వర్మాస్త్రం వహ్నివల్లబా.
శార్జయ హృదయం మన్తో మహాద్యశ్శార్థపూజనే,
సుదర్శన మహాంతే తు చక్రరాజపదం వదేత్.
హయయుగ్మం సర్వదుష్టభయమునే కురుద్వయమ్,
భిన్లిద్వయం తతః పశ్చాద్విదారయయుగం తతః.
పరమంత్రాన్ గ్రంద్వంద్వ భక్షయద్వితయం పునః,
భూతాని త్రాసయద్వంద్వం వర్మ ఫడ్వహ్నిసుందరీ.
సుదర్శనాయ హృదయం ప్రోక్త శ్చక్రార్చనే మనుః,
మహాఖడ్గతిక్షపదాఛివియుక్తం సమీరయేత్.
హుం ఫట్ స్వాహా చ ఖడ్గాయ నమః ఖడ్గార్చనే మనుః,
మహాకౌమోదకీత్యస్తే వదేచ్చివ మహాబలే.
సర్వాసురాంతకే పశ్చాతసీదయుగలేతి చ,
వర్మాస్త్రవహ్నిజాయాంతకౌమోదకీహృదంతమః.
కౌమోదక్యర్చనే ప్రోక్తో మన్తస్సర్వార్థసాధకః,
మహాంకుశపదాత్కుట్టయుగ్మం హుం ఫట్ వసుప్రియా.
అంకుశాయ నమః ప్రోక్తో మంత్ర ఏవాంకుశార్చనే,
సంవర్తకమహాంతేతు ముసలేతిపదం వదేల్.
యోధయద్వితయం వర్మ ఫడంతో వహ్నిసుందరీ,
ముసలాయ నమః ప్రోక్తో మనో ముసలపూజనే.
మహాపాశాహోదయద్వయమాకర్షయ ద్వయమ్,
హుం ఫటం స్వాహా చ పాశాయ నమః పాశార్చనే మనుః.
తారాద్యా మనవో హ్యేతే తతశ్శక్రాదికాన్యజేత్,
వజ్రాద్యానపి సంపూజ్య పర్వ పిశ్వరో భవేత్.
మాసమాత్రం తు కుసుమైః పూజయిత్వా హయారిజై,
కుముదైర్వా ప్రజుహుయాదప్టోత్తరసహస్రకమ్.
మాసమాత్రేణ వశ్యాస్స్యుస్తస్య సర్వే నృపోత్తమాః,
యస్య నామ యుతం మన్తం జపేదయుతసంఖ్యయా.
స భవేద్దాసవత్సద్యో మంత్రస్యాస్య ప్రభావతః,
బహునా కిమిహోక్తేన మనునానేన సాధకః.
సాధయేత్సకలాన్కామాన్విష్ణుతుల్యో న సంశయః.
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే సప్తతితమోధ్యాయః.
వరాహస్వామి యొక్క ఏకాక్షర మంత్రము మరియొక కల్పవృక్షము. ఈ మంత్రమునకు కూడా అర్ఘ్యాది పూజలు పూర్వము వలెనే ఆచరించవలయును. ఓంకారము ఆదియందుకల ఈ మంత్రము అష్టాక్షరి. సర్వేశ్వర్యప్రదము. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ గాయత్రీ ఛందస్సు. వరాహస్వామి దేవత ధ్యాన పూజా ప్రయోగాదులను మొదటి వలెనే ఆచరించవలయును. ఈ మంత్రము ప్రణవాదికము. చతుర్థ్యనము తరువాత భగవతి అను పదము, దాని తరువాత రెండు మార్లు ధరణీ అని, హరియని రెండుమార్లు ఉచ్చరించవలయును. అనగా ఓమ్ నమో భగవతి ధరణి ధరణి హరే హరే యని చెప్పి తరువాత చతుర్ద్యన్తము వరాహాయ అని పలుకవలయును. ఈ మంత్రము ఇరువది ఒక్క అక్షరములు గలది. ఈ మంత్రమునకు వరాహస్వామి ముని, గాయత్రీ ఛంధస్సు. ధరణి దేవతా తారము బీజము వసుప్రియా శక్తి రామవేదాన్ని బాణాక్టుల వర్ణములతో అంగన్యాసమును గావించవలయును. శ్యామ వర్ణము గలది, చిత్ర విభూషణ శోభిత, పద్మాసనస్థ, తుంగస్తనీ, నీలాంబుజ ద్వయమును, శాలిమంజరిని, చిలుకను చేతితో ధరించునది, చిత్రవస్త్రధారిణీ యగు భూదేవిని స్మరించవలయును. ఇట్లు ధ్యానమును చేసి లక్షజపమును చేయవలయును. దశాంశమును నేతితో కలిపిన పాయసముతో హోమమును గావించవలయును. విష్ణు పీఠమున పూజించవలయును. మూల మంత్రముతో మూర్తిని సంకల్పించి, ఆ మూర్తిలో భూదేవిని పూజించవలయును. మొదట అంగములను ఆరాధించి, భూవహ్నిజలమారుతములను దిక్పాత్రములందు పూజించి, కోణ పత్రములందు ఆకులను నివృత్తి, ప్రతిష్ఠ మొదలగు విద్యాకలలను, ఇంద్రాదులను వజ్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొందిన తరువాత స్వేషమును సాధించుకొనవలయును. పశురతాంబరాదికములచే భూదేవినిట్లు సేవించువాడు. ధరణీ వల్లభుడగును. నూరు సంవత్సరములు సుఖముగా జీవించును. ఇక ఇపుడు జగన్నాధుని త్రైలోక్యమోహన మంత్రమును చెప్పెదను. కాముడు తార, రమాబీజము హృదంతమున పురుషోత్తముడు నుండవలయును.
“ఈ శ్రీకంఠప్రతిరూప లక్ష్మీనివాస సకల జగతోభణ సర్వ స్త్రీ హృదయవిదారణ ! త్రిభువనమనోన్మాదకర ! సురాసుర మనుజ సుందరీ జన మనంపి తాపయ !
తాపయ ! దీపయ ! దీపయ ! శోషయ ! మారయ ! మారయ ! స్తంభయ
స్తంభయ ! మోహాయ ! మోహాయ ! ద్రావయ ! ద్రావయ ! ఆకర్షయ ! ఆకర్షయ
సమస్త పరమసుభగ ! సర్వసౌభాగ్యకర ! సర్వకామప్రద ! అముం బ్రహ్మ
సేను, హనుమాను చక్రేణ గదయా ఖణేన సర్వబాజైః భేది భేది ! పాశీన
కట ! కట ! జయ సేన తాడయ ! తోడయ ! కురు ! కురు ! తావద్యోవత్సమా
హితం ! మే సిద్ది రాభాస్యః”
అనునది మంత్రము. దీని చివర భాగమని పలుకవలయును. ఫట్ అనునది కవచము. ఈ మహామంత్రము హృదంతము.
రెండు వందల అక్షరములు కలది. ఈ మంత్రమునకు మహర్షి జైమినీ. అమితమను ఛందస్సు. జగన్మోహనమునకు జగన్నాథుడు దేవత. కామ బీజము రమాశక్తి అభిలాప్తికి వినియోగము. పురుషోత్తమ ! త్రిభువనోన్మాదక అనునది అగ్నికవచము. జగతోభణశబ్దము హృదయము. లక్ష్మీదయిత అనునది శిరము.మన్మధోత్తమ అనునది శిఖ. మన్మథోత్తమమంగజే కామదాయ హుం అని వర్మ న్యాసము చేయవలయును. పరమభృగుకర్ణాభ్యాం సర్వసౌభాగ్యకర అనునది కవచము. సురాసురమనుజ సుందరీ హృదయ విత్ ! రణ సర్వప్రహరణ ధర ! సర్వకాముక ! హన ! హన ” అనునది హృదయము. తరువాత బంధనములను చెప్పవలయును. ఆకర్షయ ! ఆకర్షయ ! మహాబల !” అనునది కవచము అస్త్రము. తరువాత నేత్రము త్రిభువనకవచ సర్వజనమనాంసి హర హర దారయ దారయ, వశమానయ" అనునది నేత్రమంత్రము. తారాదులు, ఫట్ నమోంతములు షడంగ మంత్రములుగా చెప్పబడినవి. "త్రైలోక్యమోహన! హృషికేశ ! ప్రతిరూపమన్మథ ! సర్వ స్త్రీణాం హృదకర్షణ” అను మంత్రముచే వ్యాపకమునాచరించి జగన్నాథుని స్మరించవలయును. క్షీరాబ్ధతీరమున సురవృక్షశోభితము, ఉద్యద్భాస్కర ప్రభాప్రకాశిత దిబ్ముఖము, పుష్పముల సుగంధములచే మదించిన తుమ్మెదలు చేయు ఝంకారములు కలది, దివ్యవాయువుచే పైకి లేచిన పద్మ పరాగముచే నిండిన ఆకాశ భాగముకలది, దేవతా స్త్రీ గానమాధుర్యముచే సుందరమగు వనమును ధ్యానించవలయును. ఆ వనములోపల మణుల కాంతులచే ప్రకాశించు తోరణమండపమునందు, శోభించు ముత్యాల మాలలచే ప్రకాశించు వితానము కలది, మణి వేద్యాది వియత్కిరీటాగ్రములచే పూజింపబడిన దివ్య సింహాసనమునందు విప్రులతో కలిసి కూర్చొనియున్న స్వామిని స్మరించవలయును. శంఖపాశబాణ ధనుర్ముసలనందక గదాంకుశములను చేతులలో ధరించియున్న, వక్షస్థలమున లక్ష్మి శోభించున్న, అంకమున నున్న పద్మరాగ శోభితమగు లక్ష్మీదేవియొక్క అనురాగదృక్కులచే చూడబడుచున్న స్వామిని ధ్యానము చేసి నాలుగు లక్షలు మంత్రజపమును చేయవలయును. దానిలో దశాంశమును అర్థచంద్రాకారమున నున్న కుండమున పద్మములతో కాని జాతి పుష్పములతో కాని హోమమును చేయవలయును. శ్రీహరిస్వరూపమగు యాగ భూమిని యాగోపకరణములను జగన్నాథుని పూజింపదలచినవారు. గాయత్రీమంత్రముచే ప్రోక్షించవలయును.
“త్రైలోక్యమోహనాయ విద్మహే స్మరాయ ధీమహి
తన్నో విష్ణుః ప్రచోదయాత్”
అనునది గాయత్రి. ఈ గాయత్రీ సర్వోత్తమము సర్వశుద్దీకరము. పూర్వోత్తమగు వైష్ణవ పీఠమున ఆసనమును కల్పించవలయును. “పక్షిరాజాయఠ ద్వంద్వం” అనునదీ పీఠ మంత్రము. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తిలో ఆవాహన గావించవలయును. వ్యాపకన్యాసమంత్రముచే భక్తితో చక్కగా పూజించి శ్రీవత్సహృదయుని శ్రీవత్సమును స్తనములందు న్యాసమును చేయవలయును. “కౌస్తుభాయనమః” అని వక్షస్థలమున కౌస్తుభమును పూజించవలయును. వనమాలాయై నమః” అని కంఠమున వనమాలను పూజించవలయును. తరువాత కర్ణికయందు యథావిధిగా అంగదేవతలను పూజించవలయును. తరువాత దలములందు చామరావృతలు, బంధూక కుసుమా భాసలు, ముక్తాహారములచే శోభించు కుచములు గల వారు, వికసించిన పద్మములవంటి నేత్రములు కలవారు. మద విభ్రమమంధరలు, అగు లక్ష్మి సరస్వతి, ధృతి, ప్రీతి, కాంతి, శాంతి, తుష్టి, పుష్టి మొదలగువారిని పూజించవలయును. భృగు భద్రాంశ సంద్రాఢ్యము దేవీబీజము. ప్రస్వత్రయ యుతము, క్లబసర్వరహితము, స్వరసంయుతము దేవీ బీజక్రమమున వీరికి ఆదియును వినియోగమును చేయవలయును. దశాగ్రములందు శంఖమును, శార్జమును, చక్రమును, ఖడ్గమును, గదను, అంకుశమును, ముసలమును, పాశమును, స్వస్యముద్రచే మంత్రములచే పూజించవలయును. ‘మహా జలచరాయ” అనునది కవచము. వహ్ని వల్లభ అస్త్రము. పాంచజన్యాయ నమః అనుదానిచే శంఖమును పూజించవలయును. శార్ణాయ నమః - అనునది శార్ణపూజలో మంత్రము. “సుదర్శన! మహాచక్రరాజ ! హాయ్ హాయ సర్వ దుష్ట భయాన్తం కురు, కురు, భిన్ది భిన్ది, విదారయ విదారయ, పరమంత్రాన్ గ్రస ! గ్రస ! భక్షయ ! భక్షయ ! భూతాని త్రాసయ ! త్రాసయ ! ఫట్" అనునది మంత్రము. ఇది చక్రార్చనామస్త్రము. “మహాఖడ్గ తీక్షచ్చలి ముక్త! హుం ఫట్ స్వాహా ఖడ్గాయ నమః" అనునది ఖడ్గార్చనామంత్రము. “మహాకౌమోదరి! మహాబలే ! సర్వాసురాంతకే ప్రసీద ప్రసీద” అనునది కౌమోదకీ అర్చనా మంత్రము. మహాంకుశ కుట్ట కుట్ట హుంఫట్ అంకుశాయ నమః" అనునది అంకుశార్చన మంత్రము.” మహాపాశ ! ఆహ్లాదయ ! ఆహ్లాదయ ! అకరయ ! ఆకరయ ! హుంఫట్ స్వాహా ! పొశాయ నమః” అనునది పొతార్చన మంత్రము. ఈ మంత్రములన్నియు తారాదీకములే. తరువాత ఇంద్రాదులను పూజించవలయును. వజ్రాదులను కూడా పూజించి సర్వ సిద్ధీశ్వరుడగును. ఒక నేల హయారిజ పుష్పములచే పూజించి, కలువలతో వెయ్యి ఎనిమిది మార్లు హోమమును గావించవలయును. ఒక మాసములో రాజులందరు వశులగుదురు. ఎవరి నామమును కలిపి పదివేలు జపము చేతురో వారు ఈ మంత్రప్రభావము వలన వెంటనే దాసులగుదురు. ఇంకను ఏమి చెప్పవలయును ? ఈ మంత్రముచే సాధకుడు సకల కొమములను సాధించుకొనగలడు. విష్ణువంతటి వాడగును. సంశయముతో పనిలేదు.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున డెబ్బదియ - అధ్యాయము ముగిసినది.
Summary of chapter 71 of the Nārada Mahā Purana is as follows:
భక్త రక్షకుడైన శ్రీ నరసింహ స్వామి యొక్క ఉగ్ర మంత్రోపాసనా విధానము ఈ అధ్యాయంలో ప్రబోధించబడినది. నృసింహ అనుష్టుప్ మంత్ర జపము, కవచ పారాయణము మరియు భయ నివారణ పూర్వక పూజా క్రమము ఇక్కడ విశదీకరించబడినది.