నారద మహా పురాణము
1 – పూర్వార్థము: పురాణమాహాత్మ్యకథనమ్
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్
పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిమ్
ఓం శ్రీగురుభ్యో నమః
ఓం శ్రీగణేశాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓమ్॥ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్।
దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్॥
ఓం వేదవ్యాసాయ నమః
వంధే బృందావనాసీనమిందిరానన్దమందిరమ్।
ఉపేన్తం సాన్జకారుణ్యం పరానన్దం పరాత్పరమ్॥
బ్రహ్మవిష్ణుమహేశ్యా యస్యాంశా లోకసాధకః।
తమాదిదేవం చిద్రూపం విశుద్ధం పరమం భజే॥
శౌనకాద్యా మహాత్మాన ఋషయో బ్రహ్మ వాదినః।
నైమిశాఖ్యే మహారణ్యే తప స్త్రీపురుముక్షవః॥
జితేన్జియా జితాహారాః సన్తస్సత్యపరాక్రమాః।
యజన్తః పరయా భక్త్యా విష్ణుమాద్యం సనాతనమ్।
ఆనీర్ష్యాస్సర్వధర్మజ్ఞా లోకానుగ్రహతత్పరాః।
నిర్మమా నిరహంకారాః పరస్మినతమానసాః।
న్యస్తకామా వివృజినాః శమాదిగుణసంయుతాః।
కృష్ణాజినోత్తరీయాస్తే జటిలా బ్రహ్మచారిణః॥
గృణన్తః పరమం బ్రహ్మ జగచ్చక్షుస్పమౌజసః।
ధర్మ శాస్త్రార్థతత్త్వజ్ఞా స్తే పుర్నైమీశకాననే॥
యజ్ఞైర్యజ్ఞపతిం కేచిత్ జ్ఞానైక్జానాత్మకం పరే।
కేచిచ్చ పరయా భక్త్యా నారాయణమపూజయన్॥
ఆది ఋషియైన నారాయణ మహర్షిని, ఉత్తమ మానవుడైన నరమహర్షిని సరస్వతీదేవిని నమస్కరించి జయమును పలుకవలయును.
బృందావనములో కూర్చొనియున్నవాడు, లక్ష్మీదేవి ఆనందమునకు నివాసభూతుడు, గాఢమైన దయకలవాడు పరముల కంటే పరుడు, అన్ని ఆనందముల కంటే ఉత్తమానంద స్వరూపుడు అయిన ఉ పేన్జనకు (శ్రీకృష్ణునకు) నమస్కారము. లోకములను కాపాడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఎవని అంశరూపులో అట్టి జ్ఞాన స్వరూపుడు పరిశుద్దుడు పరముడు అయిన ఆదిదేవుని సేవింతును.
మహానుభావులు, ఋషులు, వేదాధ్యయనపరులు, ఇంద్రియములను జయించినవారు, ఆహారనియమము కలవారు, సత్పురుషులు, సత్యబలులు, అసూయలేనివారు, అన్ని ధర్మములు తెలిసినవారు, లోకములను అనుగ్రహించుట యందు ఆసక్తి కలవారు, అహంకారమమకారములు లేనివారు, పరమాత్మయందే. మనసును నిలిపినవారు, కోరికలను విడిచిన వారు, పాపరహితులు, శమదమాథిగుణములు కలవారు, జింకచర్మమును ధరించినవారు, జడలను ధరించి బ్రహ్మ చర్యము నాచరించువారు, సూర్యునితో సమానమైన తేజస్సు కలవారు అయిన శౌనకుడు మొదలగు మహర్షులు ధర్మశాస్త్రార్థతత్త్వమును తెలిసినవారై నైమిశమను పేరుగల అరణ్యమున శ్రీమహావిష్ణువును ఆరాధించుచు తపమును చేయుచుండిరి. మోక్షమును. కోరుచు కొందరు యజ్ఞపతిని గూర్చి యాగములను చేయుచుండిరి. కొందరు జ్ఞానస్వరూపుని జ్ఞానముతో, మరికొందరు ఉత్తమభక్తి తో శ్రీమన్నారాయణుని పూజించు చుండిరి.
ఏకదా తే మహాత్మానః సమాజం చక్రురుత్తమాః।
ధర్మార్థకామమోక్షాణాముపొయాన్ జ్ఞాతుమీచ్ఛవః॥
షడ్వింశతి సహస్రాణాం మునీనామూర్ధ్వరేతసామ్।
తేషాం శిష్యప్రశిష్యాణాం సంఖ్యా వక్తుం న శక్యతే॥
మునయో భావితాత్మానో మిలితా స్తే మహౌజసః।
లోకానుగ్రహకర్తారో వీతరాగా విమత్సరాః
కాని క్షేత్రాణి పుణ్యాని కాని తీర్థాని భూతలే। కథం
వా ప్రాప్యతే ముక్తిర్నృణాం తాపార్త చేతసామ్॥
కథం హరో మనుష్యాణాం భక్తిరవ్యభిచారిణీ।
కేన సిధ్యత చ ఫలం కర్మణస్త్రీవిధాత్మనః॥
ఇత్యేవం ప్రష్టుమాత్మానముద్యతానెక్ష్య శౌనకః।
ప్రాంజలిర్వాక్యమా హేదం వినయావనతస్సుధీః॥
మహానుభావులు, ఆత్మస్వరూపము తెలిసినవారు, గొప్పతేజస్సు కలవారు, రాగద్వేషములు లేనివారు, లోకములను అనుగ్రహించదలచినవారు అయిన ఆ శౌనకాది మహామునులు ఇరువది ఆరువేల మంది. వారి శిష్యులను, ప్రశిష్యులను. లెక్కించలేము. ఒకనాడు జితేంద్రియులైన వారందరు ధర్మార్థకామమోక్షములను పొందుటకు ఉపాయములను తెలియగోరి ఒకచోట సమావేశమైరి. ఈ భూలోకమున ఏవి పుణ్య క్షేత్రములు ? ఏవి పుణ్యతీర్థములు ? తాపత్రయములచే వేతలను పొందుచున్న మానవులు ఏ సాధనముచే మోక్షమును పొందగలరు ? శ్రీమన్నారాయణుని యందు చలించని భక్తి ఎట్లు కలుగును ? కొయిక వాచిక మానసిక కర్మల ఫలము లభించు సాధనమేది? అని తనను అడుగుటకు సిద్ధపడిన మునులను చూచి శౌనక మహర్షి విద్వాంసుడు కావున వినయముతో చేతులు జోడించి ఇట్లు పలికెను.
శౌనక ఉవాచ :-
ఆ స్తే సిద్దాశ్రమే పుణ్యే సూతః పౌరాణికోత్తమః।
యజన్మభైర్బహువిధైర్విశ్వరూపం జనార్దనమ్॥
స ఏతదఖిలం వేత్తి వ్యాసశిష్యో మహామునిః।
పురాణసంహితావక్తా శాన్తో వై రోమహర్షణీః॥
యుగే యుగేల్పకొస్ధర్మాన్నిరీక్ష్య మధుసూదనః
వేదవ్యాసస్వరూ పేణ వేదభాగం కరోతి వై॥
వేదవ్యాసమునిస్సాక్షిన్నారాయణ ఇతి ద్విజాః।
శుశ్రుమ స్సర్వశాస్త్రేషు సూతస్తు వ్యాపశాసితః॥
తేన సంశోసితస్సూతో వేదవ్యా సేన ధీమతా।
పురాణాని స వేత్త్యేవ నాన్యో లోకే తతః పరః।
స పురాణార్థవిల్లో కే స సర్వజ్ఞస్వబుద్ధిమాన్।
స శాన్తో మోక్షధర్మజ్ఞః కర్మభక్తి కలాపవిత్॥
వేదవేదాంగశాస్త్రాణాం సారభూతం మునీశ్వరాః।
జగద్ధితార్థం తత్సర్వం పురాణేషక్తవాన్మునికి
జ్ఞానార్ణవో వై సూతస్తత్సర్వతత్త్వార్థకోవిదః।
తస్మాత్త మేవ పృచ్ఛామ ఇత్యూచే శౌనకో మునీన్॥
శౌనకమహర్షి చెప్పెను
పవిత్రమైన సిద్దాశ్రమములో పౌరాణికోత్తముడైన సూతుడు విశ్వరూపుడైన జనార్దనుని పలువిధములైన యజ్ఞములతో పూజించుచూ ఉన్నాడు. వ్యాసభగవానుని శిష్యుడు, మహాముని, శాంతుడు అయిన సూతమహర్షి ఈ విషయములన్నియు చక్కగా తెలిసినవాడు. పురాణములన్నిటిని చెప్పువాడు కూడా. ప్రతియుగమునందు ధర్మములు క్షీణించుటను చూచిన శ్రీమన్నారాయణుడు వేదవ్యాసావతారముతో వేదవిభాగమును చేసెను. వేదవ్యాసభగవానులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని అన్ని శాస్త్రములు చెప్పుచుండగా వినుచుంటిమి. సూతమహర్షి అట్టి వ్యాసభగవానులవద్ద విద్యలనభ్య సించినవాడు. ఇట్లు వేదవ్యాసమహర్షి వద్ద బాగుగా అధ్యయనము చేసిన సూతమహర్షి అన్ని పురాణములను చక్కగా తెలిసినవాడు. ఈలోకమున సూతమహర్షి కంటే చక్కగా పురాణములు తెలిసినవారు మరొకరు లేరు. సూతమహర్షి పురాణములు బాగుగా తెలిసినవాడు, సర్వజ్ఞుడు, బుద్ధిమంతుడు, శాంతుడు, మోక్షధర్మములు తెలిసినవాడు, కర్మ భక్తుల వివరములను సాంగోపాంగములతో తెలిసినవాడు. వేదముల, వేదాంగముల శాస్త్రముల సారమునంతటిని లోకముల హితము కొఱకు వేదవ్యాసభగవానుడు పురాణములలో చెప్పియున్నాడు. జ్ఞానసాగరుడైన సూతమహర్షి ఆ పురాణముల తత్త్వార్థమునంతయూ చక్కగా తెలిసినవాడు. కావున మనమందరము వెళ్ళి ఆ సూతమహర్షినే అడిగెదము అని శౌనకుల వారు పలికిరి.
తతస్తే మునయస్సర్వే శౌనకం వాగ్విదాం వరమ్।
సమశ్లిష్య సుసంప్రీతాః సాధు సాధ్వితి చాబ్రువన్॥
అథ తే మునయో జగ్ముః పుణ్యం సిద్దాశ్రమం వనే।
మృగవ్రజసమాకీర్ణం మునిభిః పరిశోభితమ్॥
మనోజ్ఞభూరుహలతాఫలపుష్పవిభూషితమ్।
యుక్తం సరోభిరచ్ఛోదైరతిధ్యాతిథ్యసంకులమ్॥
తే తు నారాయణం దేవమనన్తమపరాజితమ్।
యజనమగ్నిష్టోమేన దదృశూ రోమహర్షణీమ్॥
యథార్జమర్చితా స్తేన సూతేన ప్రథితౌజసః।
తస్యావభృథమీక్షనస్తత్ర తస్థుర్మఖాలయే॥
అధ్వరావభృథస్నాతం సూతం పౌరాణికోత్తమమ్।
పప్రచ్ఛు స్తే సుఖాసీనం నైమిశారణ్యవాసినః।
శౌనకమహర్షి మాటలను వినిన ఋషులందరూ మాటలాడువారిలో నేర్పరియైన శానకమహర్షిని ఆలింగనము చేసుకొని సంతుష్టాంతరంగులై బాగు బాగని అభినందించిరి. తరువాత ఆ మునులందరు మృగముల సమూహములతో మునులతో కూడియున్న, సుందరమైన వృక్షములతో తీగెలతో పూవులతో ఫలములతో శోభించుచున్న, స్వచ్ఛమైన నీరుగల సరస్సులుకల, అతిధులతో, ఆతిధ్యములతో సంకులమైన పవిత్రమైన సిద్దాశ్రమమునకు వెళ్ళిరి. ఆ ఆశ్రమమున అననుడు అపరాజితుడు అయిన శ్రీమన్నారాయణుని అగ్నిష్టోమయాగముచే పూజించుచున్న సూతమహర్షిని చూచిరి. ప్రసిద్ధమైన తేజస్సు గల మునులు సూతమహర్షిచే పూజించబడి అవభృథస్నానము కొఱకు నిరీక్షించుచుండిరి. నైమిశారణ్య వాసులగు మునులు అవభృథస్నానము చేసి సుఖాసీనుడైయున్న పౌరాణికోత్తముడైన సూతమహర్షిని ఇట్లు అడిగిరి.
ఋషయ ఊచుః-
వయం త్వతిథయః ప్రాప్తా ఆతిధేయాస్తు సువ్రత !
జ్ఞానదానోపచారేణ పూజయాస్మాన్యథావిధి॥
దివౌకసో హి జీవస్తి పీత్వా చంద్రకలామృతమ్।
జ్ఞానామృతం భూసురాస్తు మునే త్వన్ముఖనిస్సృతమ్॥
యేనేదమఖిలం జాతం యదాధారం యదాత్మకమ్।
యస్మినతిష్ఠితం తాత యస్మినా లయమేష్యతి॥
కేన విష్ణుః ప్రసన్నః స్యాత్ స కథం పూజ్యతే నరైః।
కథం వర్ణాశ్రమాచారశ్చాతిథేః పూజనం కథమ్॥
సఫలం స్యాద్యథా కర్మ మోక్షోపాయః కథం నృణామ్।
భక్త్యా కిం ప్రాప్యతే పుంభిస్తధా భక్తిశ్చ కీదృశీ॥
వద సూత మునిశ్రేష్ఠ ! సర్వమేతదసంశయమ్।
కస్య నో జాయతే శ్రద్ధా శ్రోతుం త్వద్వచనామృతమ్॥
ఋషులు పలికిరి. ఆతిథ్యమును పొందదగిన అతిథులము మేము వచ్చితిమి. జ్ఞానమును దానము చేసి శాస్త్రోక్తముగా మమ్ములను పూజించుము. దేవతలు చంద్రకళను అమృతమును త్రాగి జీవింతురు. నీ ముఖమునుండి వెలువడు జ్ఞానామృతమును గ్రోలి బ్రాహ్మణులు జీవింతురు. ఈ ప్రపంచమంతయూ ఎవనిచే పుట్టినది ? ఈ ప్రపంచమునకు ఆధారమెవరు ? ఇది అంతయు ఎవరి స్వరూపము ? ఎవనిలో నిలిచియున్నది ? ఎవనిలో లయము చెందును ? విష్ణువు ఏమి చేసినచో ప్రసన్నుడగును ? మానవులు ఎట్లు పూజింతురు ? - వర్ణాశ్రమాచారములెట్లుండును ? అతిథినేట్లు పూజించవలయును ? చేసిన పనీ ఎట్లు సఫలమగును ? మానవులు మోక్షమును పొందు ఉపాయమేది ? భక్తి చే మానవులు పొందునదేది ? ఆ భక్తి ఎటువంటిది ? ఓ మునిశ్రేషా ! సూతమహర్షీ ! మా సంశయములు తొలగునట్లు ఈ విషయమంతయు తెలియజేయుము. నీ అమృత వాక్కులను వినుటకు ఎవనికి శ్రద్ధ కలుగదు ?
సూత ఉవాచ:-
శృణుధ్వమృషయస్సర్వే యదీష్టం వో వదామి తత్।
గీతం సనకముఖ్యేస్తు నారదీయ మహాత్మ నే॥
పురాణం నారదోపాఖ్య మేతర్వేదార్థసంమితమ్।
సర్వపాపప్రశమనం దుష్టగహనివారణమ్॥
దుస్స్వప్ననాశనం ధర్మం భుక్తిముక్తి ఫలప్రదమ్।
నారాయణకథో పేతం సర్వకళ్యాణకారణమ్॥
ధర్మార్థకామమోక్షాణాం హేతుభూతం మహాఫలమ్।
అపూర్వపుణ్యఫలదం శృణుధ్వం సుసమాహితాః॥
మహాపాతకయుక్తో వా యుక్తో వాప్యుపపాతకైః।
శ్రుత్వేతదార్షం దివ్యం చ పురాణం శుద్ధిమాప్నుయాత్॥
య స్యెకాధ్యాయపరద్వాజిమేధఫలం లభేత్ ।
అధ్యాయద్వయపాణేన రాజసూయఫలం తథా॥
జ్యేష్ఠమా సే పూర్ణిమాయాం మూలర్టే ప్రయతో నరః।
స్నాత్వా చ యమునాతోయే మధురైయాముపోషితః॥
అభ్యర్చ్య విధివత్కృష్ణం యత్ఫలం లభతే ద్విజః।
తత్ఫలం సమవాప్నోతి అధ్యాయత్రయపాఠతః॥
తతవక్ష్యామి వస్సమ్యక్ శృణుధ్వం గదతో మమ।
జన్మాయులెర్టిలై: పొ పైర్ముక్తః కోటికులాన్వితః।
బ్రహ్మణః పదమాసాద్య తతైవ ప్రతితిష్ఠతి।
శ్రుత్వాస్య తు దశాధ్యాయాన్భక్తిభావేన మానవః।
నిర్వాణముక్తిం లభతే నాత్ర కార్యా విచారణా।
శ్రేయసాం పరమం శ్రేయః పవిత్రాణామనుత్తమం॥
సూత మహర్షి పలికెను.
ఓ ఋషులారా ! మీకిష్టమైనదానిని చెప్పెదను వినుడు. పూర్వము సనకాదులు నారదమహర్షికి చెప్పిన దానిని మీకు చెప్పెదను. దీనికి నారదపురాణమని పేరు. ఈ నారదపురాణము వేదొర్ణముతో సమానము. అన్ని పాపములను నశింపచేయునది. దుష్టగ్రహములను నివారించును. దుఃస్వప్పములను నశింపజేయును. ధర్మమును బోధించును. భోగఫలమును మోక్ష ఫలమును ఇచ్చును. నౌరాయణకథలతో కూడియున్నది. అన్ని శుభములకుమూలకారణమిదియే. ధర్మార్థకామమోక్షములకు కారణమైన మహాఫలము నొసంగును. ఇదివరకెప్పుడూ లభించని పుణ్యఫలమునిచ్చు నీ సొరదపురాణమును సావధానముగా వినుడు. మహాపాపములు కలవాడైనను, ఉపపాతకములు కలవాడైనను ఋషిప్రోక్తము, దివ్యము అయిన ఈ నారదపురాణమును విని పరిశుద్దుడగును. ఈ 'నారదపురాణములో ఒక అధ్యాయమును చదివినచో అశ్వమేధయాగమును చేసిన ఫలమును పొందును. రెండు అధ్యాయములను చదివినచో రాజసూయయాగ ఫలమును పొందును. జ్యేష్ఠమాసమున, పూర్ణిమాతీథి' యందు మూలానక్షత్రమున సావధానుడైన మానవుడు యమునానదిలో స్నానమాడి, మధురలో ఉపవాసముచేసి శ్రీకృష్ణుని పూజించిన కలుగు ఫలితము మూడు అధ్యాయములను చదివినచో కలుగును. ఆ నారదపురాణమును నేను చెప్పేదను. చక్కగా వినుడు. మానవుడు కోటీ కులములలో, వేల జన్మలతో సంపాదించిన పొపములను నశింపచేసుకొని బ్రహ్మ లోకమును చేరి అక్కడే స్థిరనివాసమేర్పరచుకొనును. భక్తి భావముతో ఈ నారదపురాణములో పది అధ్యాయములను చదివి నిర్వాణ మోక్షమును పొందును. ఈ విషయమున సంశయించ వలసిన పనిలేదు. అన్ని శ్రేయస్సులలో ఉత్తమమైన శ్రేయస్సు సాటిలేని పవిత్రత కలది ఈ నారదపురాణము.
దుస్స్వప్ననాశనం పుణ్యం శ్రోతవ్యం యత్నతో ద్విజాః
శ్రద్ధయా సహితో మర్త్యః శ్లోకం శ్లోకార్థమేవ వా॥
పఠిత్వా ముచ్యతే సద్యో మహాపాతకరాశిభిః।
సతామేవ ప్రవక్తవ్యం గుహ్యాద్దుహ్యతరం యతః॥
వాచయేత్పురతో విష్ణోః పుణ్యక్షేత్రే ద్విజాంతికే।
బ్రహ్మ ద్రోహపరాణాం చ దంభాచారయుతాత్మనామ్॥
జనానాం బకవృత్తీనాం న బ్రూయాదిదముత్తమమ్।
త్యక్త కామాదిదోషాణాం విష్ణుభక్తిరతాత్మనామ్॥
సదాచారపరాణాం చ వక్తవ్యం మోక్షసాధనమ్।
సర్వదేవమయో విష్ణుస్స్మరతామార్తినాశనః॥
సద్భక్తవత్సలో విప్రా భక్త్యా తుష్యతి నాన్యథా।
అశ్రద్ధయాపి యన్నమ్ని కీర్తి తేఒథ స్మృతేపి వా
విముక్తః పాత కైర్మర్యో లభతే పదమవ్యయమ్।
సంసారమౌరకాన్తరదావాగ్నిర్మధుసూదనః॥
స్మరతాం సర్వపాపాని నాశయత్యాశుసత్తమాః।
తద్భద్యోతకమిదం పురాణం శ్రావ్యముత్తమమ్॥
శ్రవణాత్పఠనాద్వాపి సర్వపాపవినాశకృత్।
యస్యాస్య శ్రవణే బుద్ధిర్జాయతే భక్తిసంయుతా॥
స ఏవ కృతకృత్యస్తు సర్వశాస్త్రార్థకోవిదః।
యదగ్జితం తపః పుణ్యం తన్మ న్యే సఫలం ద్విజాః॥
యదస్య శ్రవణే భక్తిరన్యథా న హి జాయతే।
సత్కథాసు ప్రవర్తనే సజ్జనా యే జగద్ధితాః॥ ।
దుస్స్వప్నములను నశింపచేయు పవిత్రమైన ఈ నారదపురాణమును ప్రయత్నముతో వినవలయును. శ్రద్ధతో మానవుడు ఒక శ్లోకమును, సగము శ్లోకమునైనను చదివినచో వెంటనే మహాపాతకముల నుండి ముక్తుడగును. పరమ రహస్యమైన ఈ నారదపురాణమును సజ్జనులకు మాత్రమే చెప్పనలయును. పుణ్య క్షేత్రమున బ్రాహ్మణుల సమీపమున శ్రీమన్నారోయణుని ముందు చదివించవలయును (చేప్పవలయును). ఈ నారదపురాణమును బ్రహ్మ ద్రోహులకు, బూటకపు ఆచారమును నటించువారలకు, కొంగలవలె వంచనచే బ్రతుకును కొనసాగించువారలకు చెప్పరాదు. మోక్షసాధనమైన ఈ నారదపురాణమును కామాదిదోషములను వదిలి విష్ణుభక్తియందలి ప్రీతికలిగిన మనసుకల సదాచారపరులకు మాత్రమే చెప్పవలయును.
తనను స్మరించువారి బాధలను తొలగించువాడు, సద్భక్తి యందు వాత్సల్యము కలవాడు, అందరు దేవతల రూపములతో నుండువాడు అయిన శ్రీమహావిష్ణువు భక్తి చే మాత్రమే సంతోషించును. మరియొకదానితో సంతోషించడు. శ్రీహరినామమును అశ్రద్ధతోనైనను కీర్తించినను, తలచినను మానవుడు అన్నిపాపములనుండి విముక్తుడై నాశములేని మోక్షపదమును పొందును. సంసారమను భయంకరమైన అరణ్యమునకు దావాగ్నియైన శ్రీమహావిష్ణువు తనను స్మరించువారి పాపములను వెంటనే ప్రథమోధ్యాయః నశింపచేయును. ఈ నారదపురాణను ఈ యర్థమునే తెలియజేయునది. కావున ఉత్తమమైన ఈ పురాణము తప్పక వినదగినది. ఈ పురౌణమును వీనినను, చదివిననూ అన్నిపాపములు నశించును. ఈ నారదపురాణమును వినవలయునని భక్తితో సంకల్పము కలగిన మానవుడే కృతకృత్యుడు. అతనే అన్ని శాస్త్రార్థములు తెలిసిన విద్వాంసుడు. అతను చేసిన తపస్సు, సంపాదించిన పుణ్యము సఫలము, తపము పుణ్యము లేనిచో ఈ నారదపురాణమును వినవలయుననెడు బుడ్డ కలుగదు. జగద్గతమునుకోరు సజ్జనులు మాత్రమే సత్కథలను వినుటకు సంకల్పింతురు.
నిందాయాం కల హే వాసి హ్యసన్తః పాపతత్పరాః।
పురాణేష్వర్థవోదత్వం యే వదంతి నరాధమః॥
తైరర్జితాని పుణ్యాని క్షయం యాన్తి ద్విజోత్తమాః।
సమస్త కర్మనిర్మూలసాధనాని నరాధమః॥
పురాణాన్యర్థవాదేన బ్రువన్నరకమశ్నుతే।
అన్యాని సాధయన్యేవ కార్యాణి విధినా నరాః
పురాణాని ద్విజశ్రేషాః సాధయస్తి న మోహితా।
అసోయా సేన యః పుణ్యానీచ్ఛతీహ ద్విజోత్తమాః॥
శ్రోతవ్యాని పురాణాని తేన వై భక్తి భావతః।
పురాణశ్రవణే బుద్ధిర్యస్య పుంసః ప్రవర్తతే॥
పురార్జితాని పాపాని తస్య నశ్యన్త్యసంశయమ్।
పురాణే వర్తమానేసి పొరపొ శేన యంత్రితః।
ఆదరేణాన్యగాథాసు సక్తబుద్ధిః పతత్యధః॥
సత్సంగదేవార్చనసత్కథాసు హితోపదేశే నీరతో మనుష్యః।
ప్రయాతి విష్ణోః పరమం పదం యద్దేహావసానేచ్యుతతుల్యతేజాః॥
దుర్జనులు పాపములయందొసక్తి కలవారై నిందించుటయందు, కలహించుటయందు ఆసక్తులై ఉందురు. అర్ణవాదములు (లేని గుణములను పొగడి చెప్పునవి) అని చెప్పు నరాధములు సంపాదించిన అన్ని కర్మలను నిర్మూలించుటకు సాధనములైన పుణ్యములను కోల్పోవుదురు. పురాణములు అర్థవాదములు మాత్రమే అని చెప్పువాడు నరకమును పొందును. ఇతర కార్యములను శాస్త్రవీధిననుసరించి ఆచరించువారు పురాణములను కూడా సాధించేదరు. మోహితులు సాధించజాలరు. ఈ లోకమున ఎక్కువకష్టము లేకుండా పుణ్యములను సంపాదించవలయునని కోరినచో భక్తి భావముతో పురాణములను వినవలయును. పురాణములను వినవలయునను కోరిక కలవానికి పూర్వము సంపాదించిన పాపములన్నీయు నశించితీరును. సంశయమవసరములేదు. పురాణప్రవచనము జరుగుచుండగా పొపపాశముచేత బంధించబడినవాడై ఇతరకథలయందు ఆదరమును ఆసక్తిని చూపినచో అధఃపతనము కలుగును. సజ్జనులసంగమునందు దేవార్చనయందు సత్కథలయందు హితోపదేశమునందు ఆసక్తి కల మానవుడు దేహావసానమున విష్ణువుతో సమానమైన తేజస్సు కలవాడై శ్రీమన్నారాయణుని పరమపదమును పొందును.
తస్మాదిదం నారదనామధేయం పుణ్యం పురాణం శృణుత ద్విజేంద్రా।
యస్మిన్ శ్రుతే జన్మ జరాడీహీనో నో భవేదచ్యుతనిష్ఠచేతాః॥
వరం వరేణ్యం వరదం పురాణం నిజప్రభాభావితసర్వలోకమ్।
సంకల్పితార్థప్రదమాదిదేవం స్మృత్వా ప్రోజేన్ముక్తి పదం మనుష్యః॥
బ్రహ్మేశవిష్ణ్వాదిశరీరభేదైర్విశ్వం సృజత్యత్తి చ పాతి విప్రాః।
తమాదిదేవం పరమం పరేశమాధాయ చేతస్యుపయాతి ముక్తిమ్॥
యో నామజాత్యాదివికల్పహీనః పరః పరాణాం పరమః పరస్మాత్।
వేదానవేద్యస్వజనప్రకాశస్సమీడ్యతే సర్వపురాణవేదైః॥
తస్మాత్తమీశం జగతాం విముక్తిముపాసనాయాలమజం మురారిమ్।
పరం రహస్యం పురుషార్థ హేతుం స్మృత్వా నరో యాతి భవాబ్ధిధపారమ్॥
కావున ఓ బ్రాహ్మణోత్తములారా ! పవిత్రమైన ఈ నారదపురాణమును వినుడు. దీనిని వినినచో మానవుడు శ్రీమన్నారాయణునియందు మనసు కలవాడై జన్మ జరాది బాధలు లేనివాడగును. శ్రేష్ఠుడు, శ్రేష్ఠతముడు, వరముల నిచ్చువాడు పురాణపురుషుడు తన సంకల్పముచే అన్ని లోకములను సృజించినవాడు కోరిన వాటినిచ్చువాడు, ఆదిదేవుడు అగు శ్రీహరిని స్మరించి మానవుడు మోక్షమును పొందును. ఓ బ్రాహ్మణులారా! శ్రీమన్నారాయణుడు బ్రహ్మ, శివుడు, విష్ణువు అను పేర్లతో శరీరభేదమును పొంది ఈ ప్రపంచమును సృజించును, నశింపచేయును, పొలించును. ఈశ్వరులకు ఈశ్వరుడగు ఆ యాదిదేవుని మనసున నిలుపుకొనిన మానవుడు ముక్తిని పొందును, పేరు జాతి మొదలగునవి లేనివాడు పరులందరికి పరుడు, పరమున కం టే పరముడు, వేదాన్త వేద్యుడు, తనభక్తులకు మాత్రమే తెలియువాడు అగు శ్రీమన్నారాయణుడు అన్ని పురాణములచే వేదములచే స్తుతింపబడుచున్నాడు. కావున జగన్నాథుడు, మోక్షమునిచ్చువాడు పుట్టుకలేనివాడు అగు ఆ మురారియే సేవించదగినవాడు. పరమరహస్యము అన్నీ పురుషార్థములకు మూలకారణము అయిన శ్రీహరిని స్మరించినచో మానవుడు సంసారసాగరమును దాటును.
వక్తవ్యం ధార్మి కేభ్యస్తు శ్రద్దధానేభ్య ఏవ చ।
ముముక్షుభ్యో యతిభ్యశ్చ వీతరాగేభ్య ఏవ చ॥
వక్తవ్యం పుణ్యదేశే చ సభాయాం దేవతాగృహే।
పుణ్య క్షేత్ర పుణ్యతీర్థ దేవబ్రాహ్మణసన్నిధౌ
ఉచ్ఛిష్టదేశే వక్తార ఆఖ్యానమిదముత్తమమ్।
పచ్యస్తే నరకే ఖోరే యావదాభూతసంప్లవమ్॥
మృషా శృణోతి యో మూడో దంభీ భక్తివివర్జితః।
సోఒపి తద్వన్మహాహోరే నరకే పచ్యతేక్షయే॥
నరో యస్సత్కాథామధ్యే సంభాషాం కురుతేఒన్యతః।
స యాతి నరకం ఘోరం తదేకాగ్రమనా భవేత్॥
శ్రోతా వక్తా చ విపేన్హా ఏష ధర్మసనాతనః।
అసమాహితచిత్తస్తు న జానాతి హి కించన॥
తత ఏకమనా భూత్వా పిబేద్ధరికథామృతమ్।
కథం సంభ్రాన చిత్తస్య కథాస్వాదః ప్రజాయతే॥
కిం సుఖం ప్రాప్యతే లోకే పుంసా సంభ్రాంతచేత।
తస్మాత్సర్వం పరిత్యజ్య కామం దుఃఖస్య సాధనమ్॥
సమాహితమనా భూత్వా కుర్యాదచ్యుతచిన్తనమ్।
యేన కేనాప్యుయేన స్మృతో నారాయణోవ్యయః॥
అపి పాతకయుక్తస్య ప్రసన్నస్యాన్న సంశయః।
యస్య నారాయణీ భక్తిర్విభౌ విశ్వేశ్వరేవ్య।
తస్య స్యాత్సఫలం జన్మ ముక్తి శ్చైవ కరే స్థితా॥
ధర్మార్థకామమోక్షాఖ్యపురుషార్థా ద్విజోత్తమాః।
హరిభక్తి పరాణాం వై సంపద్యస్తే న సంశయః॥
ఇతి శ్రీ బృహన్నారదీయపురాణే పూర్వభాగే ప్రథమపాదే సూతర్షిసంవాదో నామ ప్రథమోధ్యాయః॥
శ్రద్దగా వినువారికి ధార్మికులకు చెప్పవలయును. కోరికలు లేనివారికి, మోక్షమును కోరువారికి, యతులకు చెప్పవలయును. పవిత్రమైన ప్రదేశములో, సభలో, దేవాలయములో, పుణ్య క్షేత్రములలో, పుణ్యతీర్థములలో, దైవసన్నిధిలో బ్రాహ్మణ సన్నిధిలో చెప్పవలయును. అపవిత్రమైన ప్రదేశములలో ఈ నారదపురాణమును చెప్పువారు ప్రళయకాలము వరకు నరకమున పడియుందురు. మూరుడు, కపటి, భక్తి లేనివాడు, వినినట్లు నటించినవారు కూడా నరకమును పడును. సత్కథ చెప్పుచున్నపుడు మరియొకనితో మాట్లాడువారు కూడా ఘోరనరకమును పొందును. కావున చెప్పువారు, వినువారు సావధానమనస్కులై యుండవలయును. ఇదియే సనాతనధర్మము. సావధానమనస్కుడు కానివాడు ఏ కొంచెము కూడా తెలియలేడు. కావున ఏకాగ్రమనస్సుతో హరికథామృతమును గ్రోలవలయును. వ్యాకులమనస్సు కలవాడు హరికథలోని రసమును ఎట్లు ఆస్వాదించును ? వ్యాకులమైన మనసు కలవాడు ఏ ఆనందమునూ పొందలేడు. కావున దుఃఖసాధనమైన అన్ని కామనలను వదిలి పెట్టి ఏకాగ్రమనస్సులో శ్రీహరిని ధ్యానించవలయును. పాపములు చేసినవాడైనను ఏదో ఒకవిధముగా అవ్యయుడైన నారాయణుని స్మరించినచో శ్రీహరి ప్రసన్నుడగును. జగన్నాథుడు, అవ్యయుడు అయిన శ్రీమన్నారాయణునియందు భక్తి కలవాని జన్మ సఫలమగును. మోక్షము అతని చేతిలో ఉండును. ఓ బ్రాహ్మణోత్తములారా! హరిభక్తి పరులకు ధర్మార్థకామమోక్షములు సిద్ధించుటలో ఎట్టి సంశయము లేదు.
ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సూతఋషిసంవాదమను పేరుగల మొదటి అధ్యాయము ముగసినది.
Summary of chapter 1 of the Nārada Mahā Purana is as follows:
పవిత్రమైన నైమిశారణ్య పుణ్యక్షేత్రంలో శౌనకాది మహర్షులు సత్రయాగం ఒనర్చుచున్న శుభసమయంలో సర్వశాస్త్ర పారంగతుడైన సూత మహర్షి అక్కడికి వేంచేయగా, ఋషులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయనను పూజించి సమస్త పాపములను హరించి ముక్తిని ప్రసాదించే శ్రీహరి దివ్యచరిత్రను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించిరి. అప్పుడు సూత మహర్షి సంతోషించి పూర్వము బ్రహ్మమానస పుత్రుడైన సనందన మహర్షి దేవర్షి నారద మహర్షికి ఉపదేశించిన పరమ పావనమైన శ్రీ నారద మహాపురాణ దివ్య కథానకమును నైమిశారణ్య ఋషులకు వినిపించుటకు ఉపక్రమించినట్లుగా ఈ అధ్యాయంలో శ్రీహరి లీలలు ప్రారంభమైనవి.