విష్ణు మహా పురాణము

14 - ప్రచేతసుని వంశ విస్తరము

శ్రీపరాశరుడు:

పృథోఃపుత్రౌ తుధర్మజ్ఞౌ జజ్ఞాతేఽన్తర్దివాదినౌ

శిఖండినీ హవిర్ధాన మన్తర్ధానా ద్వ్యజాయత

హవిర్దానాత్ షడాగ్నేయీ ధిషణాఽజనయత్సుతాన్

ప్రాచీనబర్ హిషం శుక్రం గాయం కృష్ణం వృజాజినౌ

ప్రాచీనబర్ హిః భగవాన్ మహానాసీ త్ప్రజాపతిః

హవిర్ధానిః మహారాజోయేనసంవర్దితాఃప్రజాః

ప్రాచీనాగ్రాః కుశాస్తస్యపృథివ్యాంవిస్తృతామునే

ప్రాచీనబర్ హిరభవత్ ఖ్యాతోభువిమహాబలః

సముద్రతనయాయాంతుకృతదారో మహీపతిః

మహాతస్తపసః పారేసవర్నాయాంమహామతే

సవర్ణదత్తసాముద్రీదశ ప్రాచీనబర్హిషః

సర్వేప్రచేతసోనామధనుర్వేదస్య పారగాః

అపృథగ్ధర్మచరణాస్తేఽతప్యన్తమహత్తపః

దశవర్షసహస్రాణిసముద్రసలిలేశయాః

శ్రీపరాశరుడు:

పృథువు కుమారులు అంతర్దివాది యను వారిద్దరు. శిఖండిని అంతర్ధానుని (అంతర్ధి) వలన హవిర్ధానుని కనెను. హవిర్దానునికి ఆగ్నేయి(అగ్ని కుమార్తె) యగు దిషణ యందు ఆరుగురు కుమారులు గల్గిరి. వారు ప్రాచీనబర్హి శుక్రుడు గయుడు కృష్ణుడు వృజుడు అజినుడు ననువారు. ప్రాచీనబర్హి భగవంతు డగు ప్రజాపతి మహారాజునై ప్రజాభివృద్ధి సేసెను. భూమిపై నాతడు తూర్పు కొనలుగా కుశలను బరచెను. అనగా ననేక యజ్ఞములు సేసె నన్నమాట. అందుచే ప్రాచీనబర్హి యను ప్రఖ్యాతి నందెను. అతడు మహా తపస్సు చేసి తుదకు సముద్రుని కూతురగు సవర్ణను బరిణయ మాడెను. ఆమె పదిమంది పుత్రులం గనెను.వారికి ప్రచేతసులను పేరు ప్రసిద్దము. అందఱు ధనుర్వేద పారగులు. అందఱు నొకే ధర్మము ననుష్టించిరి. సముద్ర జలము లందుండి పదివేలేండ్లు తీవ్ర తపస్సు సేసిరి.

శ్రీమైత్రేయుడు:

యుదర్ థంతేమహాత్మానస్తపస్తేపుర్మహామునే

ప్రచేతసస్సముద్రాంభస్యేతదాఖ్యాతుమార్హసి

శ్రీమైత్రేయుడు:

వారు సముద్ర జలము లందపస్సు చేయుట ఎందులకని? యడుగగా

శ్రీపరాశరుడు:

పిత్రాప్రచేతసః ప్రోక్తాః ప్రజార్ధ మామితాత్మనా

ప్రజాపతినియుక్తేనబహుమానపురస్సరమ్

శ్రీపరాశరుడు:

ప్రజాపతి యగు ప్రాచీనబర్హి సబహుమానముగ కొడుకులను ప్రజాభివృద్ధి సేయుదని యాదేశించెను.

ప్రాచీనబర్హి:

బ్రాహ్మణాదేవదేవేనసమాదిశ్తోస్మ్యహంసుతాః

ప్రజాస్సంవర్దనీయస్తేమయాచోక్తంతథేతితత్

తన్మమప్రీతయేపుత్రాః ప్రజావృద్దిమతన్ద్రితాః

కురుధ్వంమాననీయా వస్సామ్యగాజ్ఞాంప్రజాపతేః

ప్రాచీనబర్హి:

నేను దేవదేవుడగు బ్రహ్మచే సంతా నాభివృద్ది నొనరింప నాజ్ఞాపింప బడి సరి యంటిని. కావున ప్రజాపతి యాజ్ఞను మనము పాలింప వలెను.

శ్రీపరాశరుడు:

తతస్తేతత్పితుః శ్రుత్వావచనం నృప నన్దనాః

తథేత్యుక్త్వాచ తం భూయః పప్రచ్చుఃపితరంమునే

యేనతాత ప్రజావృద్దౌ సమర్ థాఃకర్మణావయమ్

భవేమ తత్సమస్తంనః కర్మ వ్యాఖ్యాతుమర్హసి

ఆరాధ్య వరదం విష్ణుమిష్టప్రాప్తిమసంశయమ్

సమేతి నాన్యథా మర్త్యః కిమన్యత్కథయామి వః

తస్మాత్ప్రజావివృద్ధ్యర్థం సర్వభూతేశ్వరంహరిమ్

ఆరాధయతగోవిన్దంయదిసిద్దిమభీప్స్యథ

ధర్మమర్ధంచాకామంచ మోక్షంచాన్విచ్చాతాంతథా

ఆరాదనీయోభగవాననాదిః పురుషోత్తమః

యస్మిన్నారాధితేసర్గంచకారాదౌప్రజాపతిః

తమారాధ్యాచ్యుతంవృద్ధిః ప్రజానాంవోభవిష్యతి

వారునువల్లేయని తండ్రీ! సంతాన వృద్దికేమి డేయ వలయునో వివరింపు మనిరి. ఆయన విష్ణువు వరదుడు కావున నాయన నారాధించిన నభీష్టము సిద్దించును. ఇంకొక దానగాడు కావున గోవిందు నారాధింపు డనియె. ధర్మార్ధ కామ మోక్షములను పురుషార్ధములు గావలయునను వారికి భగవంతుడు పురుషోత్తము డారాధనీయుడు. ఆయన నర్చించియే మొదట ప్రజాపతి ప్రజాభివృద్ధిని సాధించెను.

శ్రీపరాశరుడు:

ఇత్యేవముక్తాస్తేపుత్రాఃపిత్రా ప్రాచేతసా దశ

మగ్నాఃపయోధిసలిలే తపశ్చేరు స్సమాహితాః

దశవర్షసహస్రాణిన్యాస్తచిత్తా జగత్పతౌ

నారాయణే మునిశ్రేష్ఠ సర్వలోక పరాయణే

తత్త్రైవతేస్థితా దేవమేకాగ్ర మనసో హరిమ్

తుష్టువుర్యస్స్తుతః కామాం స్తోష్టురిష్టాన్ ప్రయచ్చతి

స్తవంప్రచేతసోవిష్ణోస్సముద్రామ్భసియంస్థితా

చక్రుస్తంమే మునిశ్రేష్ఠ సుపుణ్యం వక్తు మర్హసి

శృణుమైత్రేయ గోవిన్దం యథాపూర్వంప్రచేతసః

తుష్ణువుస్తన్మాయీ భూతా స్సముద్ర సలిలేశయాః

నతాస్స్మ సర్వవచనం ప్రతిష్ఠా యత్రశాశ్వతీ

త మాద్యన్త మశేషస్య జగతః పరమం ప్రభుమ్

జ్యోతిరాద్య మనౌపమ్య మణ్వనన్త మపారవత్

యోనిభూత మశేషస్య స్థావరస్య చరస్యచ

యస్యాహఃప్రథమం రూపమరూపస్యతతోనిశా

సంధ్యాచాపరమేశస్యత స్మైకాలాత్మనేనమః

భుజతేఽనుదినందేవైః పితృభిశ్చసుదాత్మకః

జీవభూతస్సమస్తస్యతస్మైసోమాత్మనేనమః

యస్తమో హన్తితీవ్రాత్మాప్రభాభిర్భాసయన్నభః

ఘర్మశీతామ్భసామ్యోని స్తస్మై సూర్యాత్మనేనమః

కాఠిన్యవాన్ యోబిభర్తిజగదేతదశేషతః

శబ్దాదిసంశ్రయోవ్యాపీ తస్మై భూమ్యాత్మానేనమః

యద్యోనిరూపంజగతాం బీజరూపంచ దేహినామ్

తత్తోయరూపమీశస్యనమామో హరిమేధసః

యోముఖంసర్వదేవానాం హవ్యభుక్కవ్యభుక్తథా

పితౄణాంచనమస్తస్మై విష్ణవే పావకాత్మనే

పఞ్చదావస్తి తోదేహేయశ్చేష్టాంకురుతేఽ నిశమ్

ఆకాశయోనిర్భాగవాంస్తస్మై వాయ్వాత్మనేనమః

అవకాశమశేషాణాంభూతానాంయః ప్రయచ్చతి

అనన్తమూర్తిమాన్ శుద్ధస్తస్మైవ్యోమాత్మనె నమః

సమస్తేన్ద్రియ వర్గాస్యయస్తథాస్థానముత్తమమ్

తస్మైశబ్దాదిరూపాయనమః కృష్ణాయవేధసే

గృహ్ణాతివిషయాన్నిత్యమిన్ద్రియాత్మాక్షరాక్షరః

యస్తస్మై జ్ఞానమూలాయ నతాస్స్మహరి మేధాసే

గృహీతానిన్ద్రియైరర్దానాత్మనేయః ప్రయచ్చతి

అన్తఃకరనభూతాయతస్మై విశ్వాత్మనేనమః

ప్రచేతసులు (సంతాన వృద్దికి హనిగూర్చిన స్తుతి):

అన విని వారు నారాయణ ధ్యాన నిష్టులై సముద్ర మందు నిలిచి తపస్సు చేసి హరిని స్తుతించిరి. సర్వ వాక్కులకు నెక్కడ ప్రతిష్ఠ పర్యవసానమో యట్టి ఆదిమూర్తిని జగత్ప్రభుని మొక్కెదము. మొట్ట మొదట జ్యోతిస్సు, అణువుకంటె అణువు మహత్తు కంటె మహాత్తునై యేది చరాచర జగత్తునకు కారణ మైనదో, అహస్సు (పగలు) రాత్రియు సంధ్యయు లేని మొదటి రూపమేదియో అట్టి కాలస్వరూపికి నమస్కారము. దేవతలచే, పితృ దేవతలచే ననుదినము సుధా రూపమున భుజింప బడునట్టి సర్వ భూతుడైన యా పరమాత్మకు నమస్కారము. ఎవ్వడు తీవ్రరూపియై తన ప్రభలచే నభంబును వెలిగించుచు దమస్సు జెండాడునో ఘర్మమునకు గీష్మము- ఉక్క) చలికి జలములకు కారణమైన సూర్య స్వరూపికి నమస్కారము. ఈ జగత్తు నెల్లనెవ్వడు కాఠిన్య మొంది భరించు నట్టి శబ్దాది గుణాశ్రయుడై వ్యాపించు భూమి స్వరూపికి నమస్కారము. జగత్కారణము దేహులకు బీజమునైన ఉదకము స్వరూపమైన ఈశ్వరుని యా హరిని బుద్ది నిల్పి నమస్కరింతుము. ఎవ్వడు సర్వ దేవతల హవ్యములను పితృ దేవతల కవ్యముల నారగించునో యట్టి పావకమూర్తి (అగ్ని)కి నమస్కారము. దేహమందైదు రూపముల నుండి చేష్టను (కర చరాణాదుల పనిని) జేయునో అట్టి వాయు స్వరూపికి నమస్కారము. అశేష భూతములకు నవకాశము నొసంగు ననంత మూర్తి యగు శుద్దమైన ఆకాశామూర్తికి నమస్కారము. సర్వేంద్రియ స్థానమైన శబ్దాది రూపమైన కృష్ణునికి వేధకు నమస్కారము. ఇంద్రియ రూపియై యక్షరము క్షరమున గూడ తానే విషయముల (శబ్దాడులను) గ్రహించి యాత్మకందించు నంతఃకరణ స్వరూపికా విశ్వాత్మకునకు నమస్కారము.

యస్మిన్ననన్తే సకలం విశ్వంయస్మాత్తథోద్గతమ్

లయస్థానంచయస్తస్మైనమః ప్రకృతి ధర్మిణే

శుద్దస్సంలక్ష్యతేభ్రాన్త్యాగుణవానివ యోఽగుణః

తమాత్మరూపిణం దేవంనతాస్స్మపురుషోత్తమమ్

అవికారమజంశుద్ధం నిర్గుణం యన్నిరఞ్జనమ్

నతాస్స్మతత్పరం బ్రహ్మ విష్ణోర్యత్పరమంపదమ్

అదీర్ ఘహ్రాస్వమాస్థూలమనణ్వశ్యామలోహితమ్

అస్నేహచ్చాయమాతనుమసక్తమ శరీరిణమ్

అనాకాశ మసంస్పర్శ మగన్ధమరసంచయత్

ఆచక్ష్వశ్రోత్రమచలమవాక్పాణిమమానసమ్

అనామగోత్ర మసుఖ మతేజస్క మహేతుకమ్

అభయంభ్రాంతిరహితమని ద్రమజరామరమ్

అరజోశబ్దమమృతమప్లవంయదసంవృతమ్

పూర్వాపరేనవై యస్మిన్ తద్విష్ణోః పరమంపదమ్

పరమీశిత్వగుణవత్సర్వభూతమసంశ్రయమ్

నతాస్స్మతత్పరం విష్ణోః జిహ్వాదృగ్గో చరంనయత్

ఎయనంతుని యందనంత విశ్వమున్నదో యేనినుండి బయలు వెడలినదో యెయది లయ స్థానమో యట్టి ప్రకృతి ధర్మికి నమస్కారము. శుద్దుడై (గుణలేపము లేని వాడయ్యు) భ్రాంతిచేత గుణము కలవాదట్లు గనబడు చుండునో యట్టి యాత్మ రూపూని దేవుని పురుషోత్తముని మ్రోక్కుచున్నాను. అవికారుడు అజుడు శుద్దుడు నిర్గుణుడు నిరంజనుడు నగు నా దేవుని గూర్చి వినతు లయ్యెదము. ఆ పరబ్రహ్మ విష్ణువుని పరాత్పరుని మ్రొక్కెదము. పొడవు పొట్టి స్థూలము అణువు ఎఱుపు నలుపు నిగనిగ చాయయు లేక అల్పము గాక కాననంటక అశరీరమై అనాకాశమై అసృర్శమై యగంధమై అరసమై ఆచక్షువై అశ్రోత్రమై యచలమై అవచానమై యనిద్రమై యజరామరమై అనామగోత్రమై యసుఖమై యతేజస్కుడై యహేతుకమై యభయమై భ్రాంతి రహితమై యనిద్రయై అరజస్కమై ఆశబ్దమై అప్లవమై (మునుగునది తెలునదియు గానిది) అసంవ్రుతమై (నిరావరణము) పూర్వపరములు లేనివై విష్ణు పరమ పదమై పరమై ఈశిత్వ గుణవంతమై సర్వభూతమై (సర్వమై) అసంశ్రయమైన యా విష్ణు తత్త్వమును జిహ్వకు దృష్టికి గోచరముగాని దానిని మ్రొక్కెదము.

శ్రీపరాశరుడు:

ఏవంప్రచేతసోవిష్ణుం స్తువన్తస్తత్సమాధయః

దశవర్షసహస్రాణితపశ్చేరుర్మమహార్ణవే

తపః ప్రసన్నో భగవాం స్తేషామన్తర్జలే హరిః

దదౌదర్శసమున్ని ద్రనీలోత్పలదలచ్ఛవిః

పతత్రిరాజమారూఢమవలోక్య ప్రచేతసః

ప్రణిపేతుశ్షిరోభిస్తంభక్తిభారావనామితైః

తతస్తానహభగవాన్ మ్రియతామీప్సితోవరః

ప్రసాదసుముఖోహంవో వరదస్సముపస్థితః

తతస్తమూచుర్వరడంప్రణిపత్యప్రచేతసః

యథాపిత్రాసమాదిష్టం ప్రజానాంవృద్దికారణమ్

సచాపిదేవస్తందత్త్వాయథాభిలషితంవరమ్

అన్తర్ధానంజగామాశు తేచనిశ్చక్రము ర్జలాత్

శ్రీపరాశరుడు:

ఇట్లు ప్రచేతసులు విష్ణువు నందు సమాధిగొని పదివేలేండ్లు మహాబ్ది యందు తప మాచరించిరి. అంతట ప్రసన్నుడై భగవంతుడా నీటిలో విప్పారిన నల్లగలువ రేకుల నిగనిగ నలుపు తళుకు నెమ్మేనితో ఖగరాజు నెక్కి సాక్షాత్కరింప నా హరింగని వారు భక్తి భారమున తలలు వంచి ప్రణతులైరి. అవ్వల భగవంతుడు మీ యభీప్సిత వరమడుగ మని ప్రసాద సుముఖుడై యవ్వర దుడుపస్థితు డైనంత (ఎదుట కేతేర) వారవ్వరదుని మ్రొక్కి తండ్రి ప్రజాభివృద్ది సేయుదని యాదేశామును తపః కారణమును విన్నవించిరి. ఆ దేవుడును నవ్వర మనుగ్రహించి యంతర్ధాన మందెను. వారును నీట నుండి వెడలిరి.