శ్రీపరాశరుడు:
క్షారోదేనయథాద్వీపోజమ్బూసంజ్ఞోఽభివేష్టితః।
సంవేష్ట్యక్షారముదధింప్లక్షద్వీప స్తథాస్థితః॥
జమ్బూద్వీపస్యవిస్తారశ్శతసాహస్రసమ్మితః।
న ఏవద్విగుణో బ్రహ్మన్ ప్లక్షద్వీపోహ్యుదాహృతః॥
సప్తమేధాతిథేఃపుత్రాఃప్లక్షద్వీపేశ్వరస్యవై।
జ్యేష్ఠశ్శాన్తాహయోనామ శిశిరస్తదనన్తరః॥
సుఖోదయస్తథానన్దశ్శివఃక్షేమక ఏవచ।
ధ్రువశ్చసప్తమస్తేషాంప్లక్షద్వీ పేశ్వరాహితే॥
పూర్వంశాన్తాహయంవర్షంశిశిరంసుఖదంతథా।
ఆనన్దంచశివంచైవ క్షేమకంధ్రువమేవచ॥
మర్యాదాకారకాస్తేషాంతథాన్యేవర్శపర్వతాః।
సప్తైవతేషాంనామానిశృణుష్వమునిసత్తమ॥
గోమేధశ్పైవచన్ద్రశ్చనరదోదున్దుభిస్తథా।
సోమకస్సుమనాశ్శైలోవిభ్రాజశ్చైవసప్తమః॥
వర్షాచలేషురమ్యేషువర్షేష్వేతేషుసత్తమ।
వసన్తిదేవగన్ధర్వసాహితాస్సతతంప్రజాః॥
తేషుపుణ్యాజనపదాశ్చిరాచ్చమ్రియతేజనః।
నాధయోవ్యాధయోవాపిసర్వకాలసుఖంహితత్॥
శ్రీపరాశరుడు:
క్షీర సముద్రముచే జంభూ ద్వీపము చుట్టబడి నట్లు ప్లక్ష ద్వీపము లవణోదధిచే పరివృతమై యున్నది. జంబూ ద్వీప విస్పృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్ష ద్వీపము. ప్లక్ష ద్వీపేశ్వరుడు మేధాతిథి, వాని కుమారు లేడ్వురు. శాంతహయుడు (జ్యేష్టుడు) శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు, వారీ ద్వీపము నేలినవారు. వారి పేరా మర్యాదా (హద్దు) కారక పర్వతము లేదు గలవు. అట్లే వర్ష పర్వతములు మఱి యేడు గలవు. మునులారా! వాని పేర్లు వినుడు. గోమేదము, చంద్రము, నరదము, దుందుభి, సోమపము, నుమనస్సు, వైభ్రాజము అనునవి.
తేషాంనద్యశ్చసప్తైవ వర్షాణాంతుసముద్రగాః।
నామతస్తాఃప్రవక్ష్యామి శ్రుతాఃపాపంహరన్తియాః॥
అనుతప్తాశిఖీచై వవిపాపాత్రిదివాక్లమా।
అమృతాసుకృతాచైవ సప్తైతా స్తత్రనిమ్నాగాః॥
ఏతేశైలాస్తథానధ్యః ప్రధానాః కథితాస్తవ।
క్షుద్రనద్యస్తథాశైలాస్తత్రసన్తిసహస్రశః॥
తాఃపిబన్తిసదాహృష్టా నదీర్జ నపదాస్తుతే॥
అపసర్పిణీనతే షాంవై నచై వోత్సర్ పీణీద్విజ!।
నత్వేవాస్తియుగావస్థాతేషుస్థానేషుసప్తసు॥
త్రేతాయుగసమః కాలస్సర్వదై వామహామునే॥
ప్లక్షద్వీపాదిషుబ్రహ్మన్ శాకద్వీపాన్తికేషువై।
పఞ్చవర్షసహస్రాణిజనాజీవన్త్యనామయాః॥
వర్ణాస్తుతత్రచత్వారస్తా న్ని బోధవదామితే॥
ఆర్యకాః కురువశ్చైవవిదిశ్వాభావినశ్చతే।
విప్రక్షత్రియవైశ్వాస్తేశూద్రాశ్చమునిసత్తమ॥
పుణ్యాత్ములారా! రమ్యములగు నీవర్ష పర్వతము లందును, వర్షము లందును ప్రజలు దేవ గంధర్వులతో గూడి వసింతురు. అందలి దేశములు పవిత్రములు. వీర్యవంతములు. అందు జనులు మృతి నందరు. అది వ్యాధులు లేక సర్వ కాలము సుఖముందురు. అందు నదులు గూడ ఏడే. సముద్ర గాములు. వానిపేర్లు అనుతప్త, శిఖ, విప్రాష, త్రిదివ, కరము, ఆమృత, సుకృత అనునవి. వినినంతనే పాపములు హరించునవి. ప్రధానమైన నదులు, పర్వతములు పేర్కొన బడినవి. చిన్న చిన్న నదులు పర్వతములు వేలకొలది గలవు. ఆచటి వారు ఎప్పుడును యా నదీ జలములనే త్రాగు చుందురు. కాని నదులు తగ్గవు పెరుగవు. ఆ ప్రదేశము లేడింటి యందును యుగ వ్యవస్థ లేదు. ఎల్లప్పుడు త్రేతాయుగ సమముగనే కాలము నడుచును. ప్లక్ష ద్వీపము మొదలు శాక ద్వీపము దనుక జనులు అయిదు వేలేండ్లా యువుఁగల్గి నిరోగులయి యుందురు. వర్ణాశ్రమ విభాగానుసార మక్కడ ధర్మము నాల్గు విధములుగ నుండును. అక్కడ వర్ణములు నాలుగు. వానిని మీకు చెప్పుచున్నాను వినుడు. ఆర్యకులు, కురువులు, వివిశ్వులు భావులు నను పేర విప్రక్షత్రియ వైశ్వశూద్రులు అను నాలుగు వర్ణముల వారుందురు.
జమ్బూవృక్షప్రమాణస్తుతన్మధ్యేనుమహాంస్తరుః।
ప్లక్షస్తన్నామసంజ్ఞోయం ప్లక్షద్వీపోద్విజోత్తమ॥
ఇజ్యతేభగవాంస్తత్రతై ర్వర్ ణైరార్యకాదిభిః।
సోమరూపీజగత్స్రష్టాసర్వ స్సర్వేశ్వరోహరిః॥
ప్లక్షద్వీప ప్రమాణేన ప్లక్షద్వీపస్సమావృతః।
తథై వేక్షురసోదేన పరివేషానుకారిణా॥
ఇత్యేతత్తవమైత్రేయ! ప్లక్షద్వీపఉదాహృతః।
సంక్షేపేణమయాభూయః శాల్మలంమేనిశామయ॥
జంభూ ద్వీపమున జంబూ వృక్షమున్నట్లు అంత పరిమాణము గల జువ్వి చెట్టు ప్లక్ష ద్వీప మధ్య మందున్నది. అందుచే దానికా పేరు గల్గినది. అందు ఆర్యకాది వర్ణముల వారిచే జగత్కర్త సర్వేశ్వరుడును సోమరూపియు నగు నా హరి ఆరాధింప బడును. ప్లక్ష ద్వీప ప్రమాణము గల ఇక్షు (చెఱకు రసము) సముద్రముచే ప్లక్షద్వీప మావరింపబడి యున్నది. మునులారా! ఇట్లు మీకు ప్లక్ష ద్వీపము సంగ్రహముగ వర్ణించితిని. ఇక నాచే శాల్మల ద్వీపమును గూర్చి తెలిసికొనుడు.
శాల్మలస్యేశ్వరోవీరోవపుష్మాం స్తత్సుతాన్ శృణు।
తేషాంతునామసంజ్ఞానిసప్తవర్షాణితానివై॥
శ్వేతోథహరితశ్చైవజీమూతో రోహితస్తథా।
వైద్యుతోమానసశ్చైవసుప్రభశ్చమహామునే॥
శాల్మలేనసముద్రోఽసౌద్వీపేనేక్షురసోదకః।
విస్తారద్విగుణేనాథ సర్వతస్సంవృతస్థ్సితః॥
తత్రాపిపర్వతాస్సప్తవిజ్ఞేయారత్నయోనయః।
వర్షాభివ్యఞ్జకాస్తేతుతథాసప్తైవనిమ్నగాః॥
కుముదశ్చోన్నరశ్చైవతృతీయబలాహకః।
ద్రోణోయత్రామహౌషధ్యః సచతుర్థో మహీధరః॥
కఙ్కస్తుపఞ్చమష్షష్టోమహిషస్సప్తమస్తథా।
కకుద్మాన్ పర్వతవరస్సరిన్మామానిమేశృణు॥
శ్రోణీస్తోయావితృష్ణాచ చంద్రాశుక్లావిమోచనీ।
నివృత్తిస్సప్తామీతాసాం స్మృతాస్తాః పాపశాన్తిదాః॥
దీనికి వీరుడైన వపుష్మంతు డధీశ్వరుడు. వాని కుమారుల నామములతో శ్వేతము. హరితము, జీమూతము, రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభమునను వర్ష పర్వతము లేడును ప్రసిద్ధములు. శాల్మల ద్వీపము ఇక్షురస సముద్రముచే పరివేష్టితము. ఈ ద్వీపము ప్లక్ష ద్వీపమునకు రెట్టింపు ప్రమాణము గలది. అక్కడ రత్న గర్భములైన సప్తకుల చలములు సప్త నదులు గలవు. అందు కుముదము, ఉన్నతము, వలాహకము, ద్రోణము, కనకము, మహిషము, కుకుద్మంతము అను పర్వతము లున్నవి. ద్రోనగిరి యందు. మహౌషధు లుండును. ఇందలి నదులు శ్రోణి, తూయ, వితృష్టా, చంద్ర, శుక్ర, విమోచని, నివృత్తి అనునవి. అవి స్మరణ మాత్రాన పాపముల హరించును.
శ్వేతంచహరితంచైవ జీమూతంరోహితంతథా।
వైద్యుతంమానసం చైవసుప్రభంచాతిశోభనమ్॥
సప్తైతానితువర్షాణిచాతుర్వార్ణ్యయుతానివై॥
శాల్మలేయేతువర్ణాశ్చవసన్త్యే తేమహామునే॥
కపిలాశ్చారుణాః పీతాః కృష్ణాశైవపృథక్పృథక్॥
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రాశ్చైవయజన్తితామ్।
భగవన్తంసమస్తస్య విష్ణుమాత్మానత్మానమవ్యయమ్।
వాయుభూతంమఖశ్రేష్ఠైర్యజ్వానోయజ్ఞసంస్థితమ్॥
దేవానామత్రసాన్నిధ్యమతీవసుమనోహరే।
శాల్మలిశ్చమహావృక్షోనామనిర్ వృత్తికారకః॥
ఏషద్వీపస్సముద్రేణసురోదేనసమన్తతః।
విస్తారాచ్చాల్మలస్యైవ సమేనతుససమావృతః॥
కుశద్వీపము:
సురోదకఃపరివృతః కుశాద్వీపేనపర్వతః।
శాల్మలస్యతువిస్తారాద్ద్విగుణేనమహామునే!।
జ్యోతిష్మతఃకుశద్వీపే సప్తపుత్రాన్ శృణుష్వతాన్॥
ఇందలి వర్షములు శ్వేతము, లోహితము, జీమూతము, హరితము, వైధ్యుతము, మానసము, సుప్రభము ననునవి. ఇందు చాతుర్వర్ణ్య వ్యవస్థ యున్నది. కపిల = తేనె రంగు, అరుణ = ఎఱుపు, పీత = పసుపు, కృష్ణము = నలుపు అను రంగులు గల్గి క్రమముగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిందు నివసింతురు. అతి మనోహరమైన యీ ద్వీప మందు దేవతలు సన్నిధి సేసియుందురు. శాల్మల వృక్ష ముండుటచే నీ ద్వీపమునకు శాల్మల ద్వీపమని పేరు. కుశ ద్వీపము చుట్టును సురా సంద్ర మున్నది. శాల్మల ద్వీపమునకు రెట్టింపు విస్తారము గలది.
ఉద్భిదోవేణుమాంశ్చైవస్త్వైరథోలమ్భనోధృతిః।
ప్రభాకరోథకపిల స్తన్నామావర్ష పద్ధతిః॥
తస్యాంవసన్తిమనుజాస్సహదైతేయదానవాః।
తథైవదేవగన్ధర్వయక్షకింపురుషాదయః॥
వర్ణాస్థాత్రాపిచత్వారోనిజానుష్ఠానతత్పరాః।
దమినశ్శుష్మిణస్నేహామన్దేహాశ్చమహామునే॥
బ్రాహ్మణాః క్షత్రియావైశ్వాశ్శూద్రాశ్చానుక్రమోదితాః।
యథోక్తకర్మకర్ త్రుత్వాత్స్వాధికారక్షయాయతే॥
తత్రతేతుకుశద్వీపే బ్రహ్మరూపంజనార్ధనమ్।
యజన్తః క్షపయన్త్యుగ్రమధికారంఫలప్రదమ్॥
విద్రుమోహేమశైలశ్చ ద్యుతిమాన్ పుష్పవాం స్తథా।
కుశేశయోహరిశ్పైవసప్తమోమంథరాచలః॥
వర్షాచలాస్తూసప్తైతేతత్రద్వీపేమహామతే।
నద్యశ్చసప్తతాసాంతుశృణునామాన్యనుక్రమాత్॥
ధూతపాపాశివాచైవపవిత్రాసుమతిస్తథా।
విద్యుదమ్భామహీచాన్యాసర్వపాపహరస్త్విమాః॥
అన్యాస్సహస్ర శస్తత్రక్షుద్రనద్యస్తథాచలాః।
కుశద్వీపేకుశస్తమ్భసంజ్ఞయాతస్యతత్స్మృతమ్॥
క్రౌంచ ద్వీపము:
తత్ప్రమాణేనసద్వీసోఘృతోదేవసమావృతః।
ఘృతోదశ్చసముద్రోవైక్రౌఞ్చద్వీపేనసంవృతః॥
ఇందు రాజైన జ్యోతిష్మన్తుని కుమారులు ఉద్భిదుడు, వేణు మంతుడు, స్వైరధుడు, రంధనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అనువారి పేరులతో వర్షము లున్నవి. ఇందు మనుజులతో బాటు దైత్య దానవ దేవ గంధర్వ యక్ష కింపురుషులును వసింతురు. ఇక్కడ స్వధర్మానుష్ఠాన పరులయిన బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజలు వరుసగా దములు, శుష్మిణులు, స్నేహులు, మందేహులు నను పేర నుందురు. అక్కడ పరబ్రహ్మ రూపుడు జనార్ధనుడు డారాధ్యదైవము. అచట జనులు జనార్దను గూర్చి యజ్ఞములు సేసి అధికారము పురుషులుగా నవతరింప వలసిన పురాకృత పుణ్యకర్మ ఫలమును క్షయింప జేసికొందురు. అనగా కేవల నైష్కర్మ్య విషయమున ముక్తి కోరుదురని తాత్పర్యము. విద్రుమము, హేమ, శైలము, ద్యుతిమంతము, పుష్టిమంతము, కుషేశాయము, హరి మందరము ననునవి యచ్చట వర్ష పర్వతము లేడు. ధూతపాప, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుదంభస్సు, మహీ యనునవి మరికొన్ని చిన్న చిన్న ఏరులు వేలకొలది సర్వపాప హరములైన వక్కడ నున్నవి. కుశద్వీప మధ్యమున కుశ స్తంభ మున్నది. అందుచే దాని కాపేరు గల్గినది. ఘృత సముద్రము క్రౌంచ ద్వీపముచే నావృతమయి యటనున్నది.
క్రౌఞ్చద్వీపోమహాభాగ శ్రూయతాంచాపరోమహాన్।
కుశద్వీపస్యవిస్తారాద్ద్విగుణోయస్యవిస్తరః॥
క్రౌఞ్చద్వీపేద్యుతిమతఃపుత్రాస్సప్తమహాత్మనః।
తన్నామానిచవర్షాణితేషాంచక్రేమహీపతిః॥
కుశలోమనుగాశ్చోష్ణః సివరోఽథాన్ధకారకః।
మునిశ్చదున్దుభిశ్చైవ సప్తైతేతత్సుతామునే॥
తత్రాపిదేవగన్ధర్వ సేవితాస్సుమనోరమాః।
వర్షాచలామహాబుద్దేతేషాంనామానిమేశృణు॥
క్రౌఞ్చశ్చవామనశ్చైవతృతీయశ్చార్ధకారకః।
చతుర్థోరత్నశైలశ్చస్వాహినీహయసన్నిభః॥
దివావృత్పఞ్చమశ్చైవతథాఽన్యఃపుణ్డరీకవా।
దున్దుభిశ్చమహాశైలోద్విగుణాస్తేపరస్పరమ్॥
ద్వీపాద్ధ్వీపేషుయేశైలా యథాద్వీపేషుతేతథా॥
వర్షేష్వేతేషురమ్యేషు వర్శశైలవరేషుచ।
నివసన్తినిరాతఙ్కాస్సహదేవగణైః ప్రజాః॥
పుష్కరాఃపుష్కలాధన్యాస్తిష్యాఖ్యశ్చమహామునే!।
బ్రాహ్మణాఃక్షత్రియావైశ్యాశ్శూద్రాశ్చానుక్రమోదితాః॥
తేతత్రనద్యోమైత్రేయయాః పిబన్తిశృణుష్వతాః।
సప్తప్రధానాశ్శతశస్తథాన్యాః క్షుద్రనిమ్నగాః॥
గౌరీకుముద్వతీ చైవసంధ్యారాత్రిర్మనోజవాన్।
ఖ్యాతిశ్చపుడరీకావచాసప్తైతావర్షనిమ్నగాః॥
తత్రాపివార్ణై ర్భగవాన్ పుష్కరాద్యైః జనార్దనః।
యాగైఃరుద్రస్వరూపస్థ ఇజ్యతేయజ్ఞ సన్నిధౌ॥
క్రౌఞ్చాద్వీపస్సముద్రేణదధిమణ్డోదకేనతు।
ఆవృతస్సర్వతః క్రౌఞ్చద్వీపతుల్యేనమానతః॥
శాకద్వీప వర్ణనమ్:
దధిమణ్డోదకశ్చాపి శాకద్వీపేనసంవృతః।
కౌఞ్చద్వీపస్యవిస్తారాద్ద్విగుణేన మహామునే॥
ఇక క్రౌంచ ద్వీపము కుశ ద్వీపము కంటె రెట్టింపు విరివి గలది. ఇచట ద్యుతి మంతుని కుమారు లేడుగురు పరిపాలకులు. కుశగుడు, మండుగుడు, ఉష్ణుడు, పీవరుడు, అందకారకుడు, ముని, దుందుభి యనువారు. దేవ గంధర్వ నిషేవితములు రమ్యములునైన వర్ష పర్వతము లిందున్నవి అవి క్రోన్చం, వామనము, అందకారకము, దేవవ్రతము, ధమము, పుండరీకవంతము, దుందుభి అనునవి యోకదాని కంటె నొకటి రెట్టింపు ప్రమాణము గలవి. ఇక్కడ దేవ గణములతో గూడి పుష్కరులు పుష్కలులు ననువారు ధన్యులై చరింతురు. బ్రాహ్మణాది చతుర్వర్ణములు. నిందు గలవు. ఇందు ప్రధాన నదు లేడు. గౌరీ, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక యనునవి. అక్కడ పుష్కరాదులచే ధ్యాన యోగమున యజ్ఞమందు రుద్రరూపుడైన జనార్దను దారాదింప బడును. ఇది మీగడ సముద్రముచే ఆవృతము. అది యాద్వీప పరిమాణము గలది. దాని చుట్టును శాకద్వీప మున్నది.
శాకద్వీపేశ్వరస్యాపిభవ్యస్యసుమహాత్మనః।
సప్తైవతనయాస్తేషాం దదౌవర్షాణిసప్తసః॥
జలదశ్చకుమారశ్చ సుకుమారోమరీచకః।
కుసు(సి) మోదస్సుమోదశ్చ సప్తమశ్చమహాద్రుమః॥
తత్సంజ్ఞాన్యేవతత్రాపిసప్తవర్షాణ్యనుక్రమాత్।
తత్రాపిపర్వతస్సప్తవర్షవిచ్చేదకారిణః॥
పూర్వస్తత్రోదయగిరిఃజలధారస్తథాఽపరః।
తథారైవతకశ్శ్యామస్తథైవామ్భోగిరిర్ద్విజ!॥
ఆంబికేయ (ఆస్తికేయః) స్తథారమ్యః కేసరీ పర్వతోత్తమః॥
శాకస్తత్రమహావృక్షస్సిద్దగన్ధన్ధర్వసేవితః।
యత్పత్రవాతసంస్పర్శాదాహ్లాదోజాయతే పరమ్॥
తత్రపుణ్యాజనపదాశ్చాతుర్వర్ణ్యసమన్వితాః।
నద్యశ్చాత్రమహాపుణ్యాస్సర్వపాపభయాపహాః॥
సుకుమారీకుమారీచ నలినీవేణుకీతథా।
ఇక్షుశ్చ ధేనుకాచైవ గభస్తిస్స ప్తమీతథా॥
అన్యాస్త్వయుతశస్తత్రక్షుద్రనద్యోమహామునే।
మహీధరాస్తథాసన్తి శతశోఽథసహస్రశః॥
తాఃపిబన్తిముదాయుక్తాజలదాదిషుయేస్థితాః।
వర్షేషుతేజనపదాస్స్వర్గాదభ్యేత్యమేదినీమ్॥
ధర్మహానిర్నతేష్వస్తినసంఘర్షః పరస్పరమ్।
మర్యాదావ్యుత్ర్క మొవాపితేషుదేశేషుసప్తసు॥
వఙ్గాశ్చామగధాశ్చైవ మానసామన్దగాస్తథా।
వఙ్గాబ్రాహ్మణభూయిష్ఠా మాగధాః క్షత్రియాస్తుతే॥
వైశ్యాస్తుమానసాస్తేషాం శూద్రాస్తేషాంతుమన్దగాః॥
శాకద్వీపేతుతైర్విష్ణుస్సూర్యరూపధరోమునే।
యథోక్తైరిజ్య తేసమ్యక్కర్మభిర్నియతాత్మభిః॥
పుష్కరస్తుతథాద్వీపఃక్షీరోదేనసమావృతః।
శాకద్వీపప్రమాణేన వలయేనేవవేష్టితః॥
క్షీరాబ్దిస్సర్వతో బ్రహ్మన్ పుష్కరాఖ్యేనవేష్టితః।
ద్వీపేనశాకద్వీపాత్తుద్విగుణేనసమన్తతః॥
శాకద్వీప పతియైన భవ్యునికి జలదుడు, కుమారుడు, మనీరకుడు, కుశమోదుడు, మోదకి, మహాద్రుముడు నను పుత్రులు గలరు. అందలి వర్షములు వారిపేర నున్నవి. అందేడు వర్ష పర్వతములు ఉదయగిరి, జలధార, రైవతకము శ్యామము. అంభోగిరి, అస్తికేయము, కేసరి యునునవి. సిద్ద గంధర్వ సేవితమై యిచట శాకమను (టీకుగాని కడిమిగాని) మహావృక్ష మున్నది. దాని యాకుల గాలి తాకినచో పరమాహ్లాదము గల్గును. అక్కడ పవిత్రము లయిన చతుర్వర్ణ ప్రజతో గూడిన జానపదములు గలవు. అచట జనులు నిరాతంకులు ఏ అభ్యంతరము లేనివారు నీరోగులు, నదులు మహా పుణ్యములు. పాప భయహరములు సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, ధేనుక, గభస్తి అనునవి ఏడు చిన్న చిన్న ఏరులు గిరులు వేలున్నవి. జలదాది గిరులపై వసించు జనులా నదీసలిలములను ద్రావుదురు. ఈ నదులు స్వర్గము నుండి వచ్చినవి. అచటి ప్రజలలో ధర్మహాని సుఖ దుఃఖములు, శాత్రము హద్దు మీరి నడుచుట అనునవి లేవు. మగులు మాగధులు మానసులు మండగులు ననుపేర బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజలచట నివసింతురు. శాకద్వీప వాసుల కులదైవము విష్ణువు సూర్య రూపుడుగా యథావిధి శ్రీహరి యీ ప్రజలచే నర్చింప బడును.
పుష్క రేసవవనస్యాపిమహావీతో భవత్సుతః।
దాతకిశ్చతయోస్తత్ర ద్వేవర్శేనామచిష్నితే॥
మహావీతంతథైవాన్యద్దాతకీషణ్డసంజ్ఞితమ్॥
ఏకాశ్చాత్రమహాభాగాప్రఖ్యాతోవర్షపర్వతః।
మానసోత్తరసంజ్ఞోవై మధ్యతోవలయాకృతిః॥
యోజనానాం సహస్రాణి ఊర్ ధ్వంపఞ్చాశదుచ్చ్రితః।
తాపదేవచవిస్తీర్ణ స్సర్వతఃపరిమణ్డలః॥
పుష్కరద్వీపవలయంమధ్యేనవిభజన్నివ।
స్థితోఽసౌతేనవిచ్చిన్నంజాతంతద్వర్శయోర్ ద్వయిమ్॥
వలయాకారమేకైకం తయోర్వర్షంతథాగిరిః॥
దశవర్షసహస్రాణి తత్రజీవన్తిమానవాః।
నిరామయావిశోకాశ్చ రాగద్వేషవివర్జితాః॥
అధమోత్తమౌనతేష్వాస్తాం నవధ్యవధకౌద్విజ।
నేర్ ష్యాఽసూయాభయంరోషో దోషోలోభాదికోనచ॥
మహావీరబహిర్వర్షందాతకీసంజ్ఞకం (మ)తతః।
మానసోత్తరశైలస్యదేవదైత్యాదిసేవితమ్॥
శాక ద్వీపము అదే ప్రమాణము గల క్షీరాబ్డిచే నావరింప బడియున్నది. క్షీరాబ్ధి పుష్కర ద్వీప సమావృతము, శాక ద్వీపము కంటె రెట్టింపు ప్రమాణము కలది పుష్కరము. పుష్కర ద్వీప మందు పవనుని కుమారులు మహావీతుడు, ధాతకి యనువారు. వారిపేర వర్షములు రెండు. ఇక్కడ వర్ష పర్వతము మానసోత్తర మనున దొక్కటియే. అది యీద్వీపము నడుమ వలయా కారమున నున్నది. ఏబది వేల యోజనముల యెత్తు. అంతే వెడల్పు గలది. అది పుష్కర ద్వీప మండలమును నడిమికి రెండు భాగములు సేయు చున్నట్లున్నది. దాని మూలముననే యీ ద్వీపము రెండు వర్షములుగా విభక్తమైనది. అవి వలయాకారములు. వాని నడుమ పెద్ద గిరి కలదు. అచటి జనులు పదివేలేండ్లు జీవింతురు.
సత్యానృతేనతత్రాస్తాంద్వీ పేపుష్కరసంజ్ఞితే।
నతత్రనద్యఃశిలాద్వీపేవర్షద్వయాన్వితే॥
తుల్యవేశాస్తూమనుజా దేవైస్తత్రైకరూపిణః॥
వర్ణాశ్రమాచారహీనం ధర్మాచరణవర్జితమ్।
త్రయీవార్తాదణ్డనీతిశుశ్రూషారహితంచతత్॥
వారు రాగద్వేష శోకములు లేనివారు. ఆరోగ్యవంతులు వారిలో అధమోత్తమ భేదము లేదు. చంపువాడు చంప బడువాడును లేరు. ఈర్ష్యాసూయ లెరుగరు. భయము రోషము దోషము లోభము శూన్యములు. మానసోత్తర పర్వతమునకు మహావీత ఖండము వెలుపలిది. ధాతకీ ఖండము లోపలిది. దేవ దైత్యులు వసింతురురు. ఈ వర్ష ద్వయమున పుష్కర ద్వీపమందు సత్యానృతము (వాణిజ్యము) లేవు. నదులు లేవు. కొండలు లేవు. ద్వీపములు లేవు.
వర్షద్వయంతు మైత్రేయ! భౌమస్వర్గోయముత్తమః।
సర్వర్తుసుఖదఃకాలో జరారోగాదివర్జితః॥
పుష్కరేధాతకీషణ్డే మహాపీతేచవై మునే॥
న్యగ్రోధః పుష్కరద్వీపేబ్రహ్మణః స్థానముత్తమమ్।
తస్మిన్ని వసతి బ్రహ్మాపూజ్యమానస్సురాసురైః॥
స్వాదుదకేనోదధినాపుష్కరః పరివేష్టితః।
సమేనపుష్కరస్యైర విస్తారాన్మణ్డలాకృతేః॥
ఏవంద్వీపాస్సముద్రైసదాసప్తభిరావృతాః।
ద్వీపశ్చైవసముద్రశ్చసమానౌద్విగుణౌపరౌ॥
పయంసిసర్వదాసర్వసర్వసముద్రేషుసమానివై।
న్యూనాతిరిక్తతాతేషాంకదాచిన్నైవజాయతే॥
స్థాలీస్థమగ్నిసంయోగాదు ద్రేకిసలిలంయథా।
తథేన్దువృద్ధౌసలిలమమ్భోదౌ మునిసత్తమ!॥
అన్యూనానతిరిక్తాశ్చవర్దన్త్యాపోహ్రసన్తిచ।
ఉదయాస్తమాయేష్విన్దోః పక్షయోః శుక్ల కృష్ణయోః॥
మనష్యు లందరి వేషమొక్కటే. వారు దేవ సమ రూపులు. అట వర్ణాశ్రమాచార ధర్మ విచక్షణ లేదు. వేదత్రయము వార్త దండనీతి శోశ్రుష యనునవి లేనేలేవు. ఈ వర్ష ద్వయము భూలోక స్వర్గమే. కాలము జరా రోగములు లేక సర్వసుఖ ప్రదమగును. ఈ రెండు ఖండము లందు పుష్కర ద్వీపమందు న్యగ్రోధ (మఱ్ఱి) మహావృక్షము బ్రహ్మయుండు స్థానము. బ్రహ్మ యచట సురాసురులచే పూజింప బడుచుండును. తియ్యని నీటి సముద్రముచే నది చుట్టు కొన్నది. దాని ప్రమాణము పుష్కర ద్వీప సమానము. ఇట్లు ద్వీపము లేడును సముద్రము లేడింటిచే నావరింప బడియున్నవి. ద్వీపము లన్నియు సమ ప్రమాణములు. సముద్రము లన్నియు వానికి రెట్టింపు ప్రమాణము గలవి.
దశోత్తారణీఞ్చైవహ్యజ్గుళానాంశాతానివై।
అపాంవృద్దిక్షయౌద్రుష్టౌసాముద్రీణాంమహామునే॥
భోజనంసుష్కరద్వీపేతతరస్వయముపస్థితమ్।
షడ్రశంభుఞ్జతేవిప్ర! ప్రజాస్సర్వాస్సదైవహి॥
స్వాదూడకస్యతరతోదృశ్యతేలోకసంస్థితిః।
ద్విగుణాకాంచనీభూమిస్సర్వజన్తు వివర్జితా॥
లోకాలోకస్తతశ్శైలోయోజనాయుతవిస్తృతః।
ఉచక్రాయేణాపితావన్తిసహస్రాణ్యచలోహిసః॥
తతస్తమస్సమావృత్యతంశైలంసర్వతస్థ్సితమ్।
తమశ్చాణ్డకటాహేన సమన్తాత్పరివేష్టితమ్॥
పఞ్చాశత్కోటివిస్తారా సేయముర్వీమహామునే।
సహైవాణ్డకటాహేనసద్వీపాభ్దిమహీధరా॥
సేయంధాత్రీవిధాత్రీచసర్వభూతగుణాధికా।
ఆధారభూతాసర్వేషాం మైత్రేయ! జగతామితి॥
అన్ని సాగరము లందలి నీరు నెల్లప్పుడును సమము. హెచ్చు తగ్గులు లేవు. నిప్పుచే గిన్నెలో నీరు పొంగినట్లు చంద్రుని వృద్ది ననుసరించి అందలి నీరు పొంగును. ఆ పొంగు క్రుంగు కూడా నన్నిట సమానమే. అన్ని సాగరములు సమముగా పొంగును తగ్గును. శుక్ల కృష్ణ పక్షములందు చంద్రోదయా స్తమయము లందు పదునైదు అంగుళములు పొంగుచు క్రుంగుచు నుండును. పుష్కర ద్వీపవాసు లందురు అన్ని వేళల స్వయంప్రాప్తమైన షడ్రసోపేత భోజనము సేయు చుందురు. స్వాదూదక (మంచి నీటి) సముద్రము చుట్టూ లోకమున్నది. దానికి రెట్టింపు బంగారు భూమి. జంతు రహితము ఆ మీద లోకాలోక పర్వతము పదివేల యోజనములు విరివైనది అంతే ఎత్తున లోతు గలది. అ శైలము నావరించి చీకటి యున్నది. ఆ చీకటి అండకాటాహ మంతట నావరించి యున్నది. ఇంత వరకు గల ఈ భూమి యేబదికోట్ల యోజనముల ప్రమాణము గలది. బ్రహ్మాండ కటాహముతో ద్వీపములతో పర్వతములతో నీధాత్రి విధాత్రి (సృష్టి హేతువు) యై సర్వ భూతములలో గుణాదిక్యము గలదై సర్వ జగదాధారయై యున్నది.
Summary of chapter 4 of the Vishnu Mahā Purāṇa is as follows:
The six outer dvīpas are described in sequence, each double the size of the preceding: Plakṣa-dvīpa (encircled by the salt ocean), Śālmali-dvīpa (by the milk ocean), Kuśa-dvīpa (by the clarified-butter ocean), Krauñca-dvīpa (by the curd ocean), Śāka-dvīpa (by the wine ocean), and Puṣkara-dvīpa (by the sweet-water ocean), whose inhabitants live 10,000 years with spontaneous food. Beyond Puṣkara stands the Lokāloka mountain — the boundary between the illuminated cosmos and the outer darkness. The total extent of the cosmos is fifty crore yojanas.