శ్రీపరాశరుడు:
కకుద్మతిహతేరిఽష్టే ధేనుకేవినిపాతితే।
ప్రలమ్బేనిధనం నీతే ధృతేగోవర్ధనాచలే॥
దమితేకాళియేనాగే భగ్నేతుఙ్గద్రుమద్వయే।
హతాయాం పూతనాయాంచ శకటే పరివర్తితే॥
కంసాయనారదః ప్రాహ యథావృత్తమనుక్రమాత్।
యశోదాదేవకీగర్భపరివర్తాద్యశేషతః॥
శ్రుత్వాతత్సకలం కంసో నారదాద్దేవదర్శనాత్।
వసుదేవం ప్రతితదాకోపంచ క్రేసుదుర్మతిః॥
సోఽతికాపాదుపాలభ్యసర్వయాదవసంసది।
జగర్హయాదవాంశ్చైవకార్యంచై తదచిన్తయత్॥
యావన్నబలమారూఢౌ రామ కృష్ణౌసుబాలకౌ।
తావదేవమయావద్యావసాధ్యౌరూఢయౌవనౌ॥
చాణూరోత్ర మహావీర్యో ముష్టికశ్చ మహాబలః।
ఏతాభ్యాం మల్లయుద్దేన మారయిష్యామి దుర్మతీన్॥
ధనుర్మహ మహాయాగావ్యజేననీయతౌ।
తథాతథాయతిష్యామి యాస్యే తేసంక్షయంయథా॥
శ్వఫల్కతనయం శూరమక్రూరం యదుపుంగవమ్।
తయోరానయనార్థాయ ప్రేషయిష్యామిగోకులమ్॥
బృన్దావనంచరం ఘోరమాదేక్ష్యామిచకేశినమ్।
తత్త్రైవాసావతిబలస్తావుభౌఘాతయిష్యతి॥
గజః కువలయాపీడో మత్సకాశమిహాగాతౌ।
ఘాతయిష్యతివాగోపౌ వాసుదేవసుతావుభౌ॥
ఇత్యాలోచ్యసదుష్టాత్మా కంసోరామజనార్ధనౌ।
హన్తుం కృతమతిర్వీ రావక్రూరం వాక్యమబ్రవీత్॥
శ్రీపరాశరుడు:
అరిష్టుండను వృషభాసురుడు హతుడుగాగా ధేనుకుడు కూల్చబడగా ప్రలంబుడు చంపబడగా గోవర్ధన గిరి యెత్తబడగా కాళియ సర్పము దమితము గాగా పెనుమ్రాకులు కూల్చబడగా పూతన చంపబడగా శకటుడు తలక్రిందులు చేయబడగా నారదుడు కంసునకు యశోదా దేవకీ గర్భ పరివర్తనాది వార్త లన్నిటిని దెలిపెను. అదెల్ల దేవతలతో విని నాదరుని వలన కంసుడు విని యా దుర్మతి వసుదేవునిపై పగగొనెను. వాడు సర్వ యాదవ సమాజమందు నవ్వసుదేవు నాడిపోసెను. యాదవులం గర్హించెను. ఆపై కర్తవ్య మిట్లాలోచించెను. రామ కృష్ణులు బలవంతులు గానంతలో వారిని గడముట్టింప వలయును. వయసు వచ్చిన వీండ్రసాధ్యు లయ్యేదరు. ఇక్కడ చాణూరుడు మహావీర్యుడు, ముష్టికుడు మహాబలుడు. వీరిద్దరిచే మల్లయుద్దమున నీ యిద్దరు దుర్మతులం గడతేర్చెదను. ధనుర్యా గోత్సవమను నెపమున వ్రజము నుండి వాండ్ర నిటకు రావించి వారు నశించుట కాయా తీరుల యత్నింతును. శూరుడు శ్వఫల్క తనయుడు యడుశ్రేష్టుడు నగు నక్రూరుని వాండ్రను గొని వచ్చుటకు గోకులమునకుం బంపెదను. కువలయా పీడమను గజము నాయోద్దకేగు దెంచిన వాసుదేవ కుమారుల నిర్వుర జంప గలదు. అని యాలోచించి యా దుష్టుడు కంసుడు వీరులగు బలరామ కృష్ణుల గడతేర్ప నిశ్చయించి యక్రూరునితో ఇట్లనెను.
కంసుడు:
భోభోదానవతే! వాక్యం క్రియతాం ప్రీతయేమమ।
ఇతః స్యందనమారుహ్యగగమ్యతాం నన్దగోకులమ్॥
వసుదేవసుతౌతత్రవిష్ణోరం శసముద్భవౌ।
నాశాయకిలసంభూతౌ మమదుష్టౌ ప్రవర్ధతః॥
ధనుర్మహోమమాప్యత్ర చతుర్ధశ్యాం భవిష్యతి।
ఆనేయౌభవతాగత్వా మల్లయుద్దాయతత్రతౌ॥
చాణూరముష్టికౌమల్లౌ నియుద్దకుశలౌమమ।
తాభ్యాంసహానయోర్యుద్దం సర్వలోకోత్రపశ్యతు॥
గజః కువలయాపీడో మహామాత్రప్రచోదితః।
సవాహనిష్యతేపాపౌ వాసుదేవాత్మజౌశిశూ॥
తౌహత్వావసుదేవంచనన్దగోపంచ దుర్మతిమ్।
హనిష్యేపితరంచై నముగ్రసేనంసు దుర్మతిమ్॥
తతస్సమస్తగోపానాం గోధనాన్యఖిలాన్యహమ్।
విత్తం చాపహరిష్యామిదుష్టానాం మద్వదైషిణామ్॥
త్వామృతేయాదవాశ్చై తేద్విషోదానపతే! మమ।
ఏతేషాంచవధాయాహం యతిష్యేఽనుక్రమాత్తతః॥
తదానిష్కణ్టకంసర్వం రాజ్యమేతద యాదవమ్।
ప్రశాదిష్ట్యేత్వయాతస్మాన్మత్ప్రీత్యైవీర! గమ్యతామ్॥
యథాచమాహిషం సర్పిర్ధదిక్షీరం తథాబహు।
గోపాస్సమానయన్త్వాశు తథావాచ్యాస్త్వయాచతే॥
కంసుడు:
ఓ దానపతీ! నాకు సంతుష్టి గలుగ నే చెప్పినట్లు సేయుము. ఇక్కడ నుండి రథమెక్కి నంద గోకులమునకుం జనుము. విష్ణువు నంశమున వసుదేవుని కొడుకులు పరమ దుష్టులు నన్ను గడతేర్పం బుట్టి పెరుగు చున్నారు. ఈ చతుర్దశి నాడు నా ధనుర్యాగోత్సవ మిక్కడ జరుగ నున్నది. నీవేగి మల్ల యుద్దమునకా యిద్దరను గొనిరమ్ము. చాణూర ముష్టికు లిద్దరు నియుద్దమున, బాహు యుద్దమున నేర్పరులు. వారితో నీ యిద్దరు సేయు యద్ధము నిక్కడ లోకము దిలకించు గాక! కువల యాపీడ మను నేనుగు మావటీండ్ర నాయకునిచే ప్రేరితమై యీ వాసుదేవ సుతుల నిద్దరు పిల్లలను జంపగలదు. వారిం జంపి వాసుదేవుని నంద గోపునిం గూడ చంపెద. మిక్కిలి దుష్ట బుద్దియగు మా తండ్రిని ఉగ్రసేనుం గూడ కడతేర్చెద. ఆపై నెల్ల గోపకుల గోధనములను దానములను నేను హరించెదను. వాండ్రు నన్ను జంప వలెనను దురాలోచనలో నున్నారు. నీవు తప్ప యీ యాదవు లందఱు నాకు ద్వేషులు. ఆపై క్రమముగా వీరందఱి వధింప యత్నము సేసెదను. అప్పుడే రాజ్యమెల్ల యాదవ శూన్యమై నిష్కంటక మైనంత నీతో దీనిని నేను శాసింతును. కావున నీవేగుము. గేదె నెయ్యి పెఱుగు పాలుంగొని యాదవులు సత్వర మేతెంచు విధముగ వారికీవు నచ్చ జెప్పుము.
శ్రీపరాశరుడు:
ఇత్యాజ్ఞప్తస్తదాక్రూరో మహాభాగవతో ద్విజ!।
ప్రీతిమానభవత్కృష్ణంశ్వోద్రక్ష్యామీతి సత్వరః॥
తథేత్యుక్త్వాచరాజానం రథమారుహ్యశోభనమ్॥
నిశ్చక్రమతతః పూర్యామధురాయామధుప్రియః॥
శ్రీపరాశరుడు:
అని యిట్లాజ్ఞ యీబడి మహాభాగుడక్రూరుడు భగవద్భక్తుడు రేపేను కృష్ణుని దర్శింతునని యుప్పొంగి వేవేగ కంసరాజున కట్లేనని పలికి రథమెక్కి మధురా నగరము నుండి మధు వంశ్యులకు ప్రియుడగు నక్రూరుడు బయలుదేరెను.
Summary of chapter 15 of the Vishnu Mahā Purāṇa is as follows:
Nārada visits Kaṃsa and reveals the full truth of Kṛṣṇa's identity. Kaṃsa formulates his plan: he announces a Dhanuryāga festival and arranges a wrestling match in the arena, deploying Cāṇūra and Muṣṭika as champion wrestlers, Kuvalayāpīḍa as the arena elephant to kill the boys at the gate, and Akrūra as the trusted emissary to invite and escort Kṛṣṇa and Balarāma to Mathurā.