విష్ణు మహా పురాణము

5 - సృష్టి వర్ణనము

శ్రీ మైత్రేయుడు:

యథాససర్జ దేవోసౌదేవర్షి పితృదానవాన్

మనుష్య తిర్యగ్వృక్షాదీన్ భూవ్యోమసలి లౌకసః

యద్గుణం యత్స్వభావం చ యత్స్వరూపం జగద్ద్విజ

సర్గాదౌ సృష్టవాన్ బ్రహ్మా తన్మమాచక్ష్వ విస్తరాత్

శ్రీమైత్రేయుడు:

దేవాది పిపీలికాంతము బ్రహ్మసృష్టి నెట్లు చేసెను? ఆయా పదార్థముల స్వభావము గుణము రూపము నెట్టివి తెల్పుమన శ్రీపరాశర మునీంద్రు డిట్లనియె.

శ్రీపరాశరుడు:

మైత్రేయ కథయామ్యేతత్ శృణుష్వ సుసమాహితః

యథాససర్జ దేవోసౌ దేవాదీనఖిలాన్ విభుః

సృష్టించిన్తయతస్తస్య సర్గాదిషు యథాపురా

అబుద్ధి పూర్వకస్సర్గః ప్రాదుర్భూతస్తమోమయః

తమోమోహో మహామోహస్తామిస్రో హ్యన్ధసంజ్ఞితః

అవిద్యాపఞ్చపర్వైషా ప్రాదుర్భూతా మహాత్మనః

పఞ్చధావస్థితస్సర్గోధ్యాయతో ప్రతిభోధవాన్

బహిరన్తశ్చా ప్రకాశస్సంవృతాత్మానగాత్మకః

ముఖ్యానగాయతశ్చోక్తాముఖ్యసర్గ స్తతస్స్మృతః

తందృష్టాఽసాధకం సర్గమమన్యత పరంపునః

తస్యాభిధ్యాయతస్సర్గ స్తిర్యక్స్రోతాభ్యవర్తత

యస్మాత్తిర్యక్ప్రవృత్తిస్సతిర్యక్స్రోతాస్తతస్స్మృతః

పశ్వాదయస్తేవిఖ్యాతాస్తమః ప్రాయాహ్యవేదినః

ఉత్పథగ్రాహిణశ్వైవతే జ్ఞానేజ్ఞానమానినః

అహంకృతా అహంమానా అష్టావింశ ద్వధాత్మకాః

అన్తః ప్రకాశాస్తేసర్వేహ్యా వృతాశ్చ పరస్పరమ్

తమప్యసాధకం మత్వాధ్యాయతోఽన్యస్తతో భవత్

ఊర్ధ్వస్రోతాస్తృతీయస్తు సాత్త్వికోర్ ధ్వ మవర్తత

తేసుఖప్రీతిబహులాబహిరన్తశ్చనావృతాః

ప్రకాశా బహిరన్తశ్చ ఊర్ద్వస్రోతోద్భవాః స్మృతాః

తుష్టాత్మనస్మృతీయస్తు దేవసర్గశ్చసస్మృతః

తస్మిన్ సర్గేభవత్ప్రీతిర్నిష్పన్నే బ్రహ్మణస్తదా

తతోఽన్యం సతదాదధ్యౌ సాధకంసర్గాముత్తమమ్

అసాధకాంస్తుతాన్ జ్ఞాత్వా ముఖ్యసర్గాదిసంభవాన్

తథాభిధ్యాయత స్తస్యసత్యాభిధ్యాయినస్తతః

ప్రాదుర్భూతస్తదావ్యక్తాదర్వాక్స్రోతాస్తూసాధకః

యస్మాదర్వాగ్వ్యవర్ధన్తతతోఽర్వాక్ర్సోతసఃస్మృతః

తేచ ప్రకాశబహులాస్తమోద్రిక్తారజోధికాః

తస్మాత్తేదుఃఖ బహులా భూయో భూయష్చ కారిణః

ప్రకాశాబహిరన్తశ్చ మనుష్యాస్సాధకాస్తుతే

ఇత్యేతేకథితాస్సర్గాష్షడేతే మునిసత్తమ

ప్రథమో మహతస్సర్గోవిజ్ఞేయో బ్రాహ్మణస్తు సః

తన్మాత్రాణాం ద్వితీయశ్చ భూతసర్గస్తు సంస్మృతః

వైకారిక స్తృతీయస్తూసర్గ ఐన్ద్రియకః స్మృతః

శ్రీపరాశరుడు:

సృష్టిని గూర్చి ఆలోచించు తఱి మున్ముందు దమో మయమైన బుద్ది పూర్వకము గాని (విశేష ధ్యానము లేని) సృష్టి యారంభ మయినది. ఈ తమోగుణ సృష్టి ఆయన నుండి 1. తమో మోహము, 2. మహామోహము, 3. తామిస్రము, 4. అంధ తపస్సు, 5. అవిద్యయు నన నైదు పర్వములుగా (భాగములుగా) ప్రాదుర్భవించినది. భగవంతుడు ధ్యానించు చున్న యెడ మేల్కొనక యున్న (నిద్రాస్థితిలో నున్నట్లున్న) స్థితి యొకటి 1. తమో మోహము, 2. వెలుపల లోపలను వెలుగు లేనిది మహా మోహము, 3. సంవృతాత్మ(తామిస్రము), 4. అవిద్య(అంధ తామిస్రము) కేవల స్థావర మయిన నగాత్మకము. కొండలు ముఖ్యములు గావున వాని సృష్టి ముఖ్యసర్గ మనబడును. సృష్టికర్త యా సర్గమును జూచి యిది సర్వసృష్టి సాధకము కాదను కొనెను. అటుపై ధ్యానించు చున్న యాయనకు తిర్యక్స్రోతసము (పశుపక్ష్యాది) సృష్టి సాగినది. అందు పుట్టిన పశు పక్ష్యాదులు తమోగుణ ప్రాయములు. అవేదులు, జ్ఞానము లేని జీవులు. హద్దుమీరి నడచునవి. తెలివి లేనివైనను తెలివిగల వానివలె ప్రవర్తించునవి. అహం మానములు. (నేనే గొప్ప దానినని యహంకరించు నవి). అంతః ప్రకాశములు (అంతర్వివిదములు) అనగా వానిలో చైతన్య మున్నను నది కప్పడి యుండును. అదిగాక యవి పరస్ప రావృతములు. ఒకదాని కొకటి యావరించి యుండు స్వభావము గలవి. పరస్పర సమ్మూఢములు. (ఒక జీవి సంగతి మరొక జీవికి తెలియదన్న మాట). ఆ తిర్య క్స్రోతస్సును జూచి యిదికూడ సృష్టి సాధకము గాదని మరల ధ్యానింపగా మూడవ సృష్టి యూర్ధ్వస్రోతస్సు అనునది బయలుదేరెను. ఆ జీవులూర్ద్వముగా బోవువారు. అది సాత్వికము. (సత్వగుణ వికార మన్నమాట) ఆ జీవులు సుఖ సంతోషములు హెచ్చుగా గలవారు. లోన వెలుపలను ఆవరణ లేనివారు. బహిరంతః ప్రకాశకులు. అదే దేవసర్గము మూడవది, దాన బ్రహ్మకు సంతుష్టి కలిగెను. అయినను మరియొక సృష్టిని సాధకముగా ధ్యానించెను. లోగడ చెప్పిన ముఖ్య సర్గాదులు అసాధకము లని గ్రహించి వెండియ నిత్యవస్తు ధ్యానము చేయు నతనికి యవ్యక్తము నుండి యర్వాక్స్రోతస్సు ప్రత్యక్ష మయ్యెను. ఆ సృష్టి అడ్డముగా స్రోతోరూపము (ప్రవాహ రూపము)గా తోచినది గావున దాని కాపేరు వచ్చినది. అందలి ప్రాణులు బహు ప్రకాశములు, బహు తమఃప్రాయములు, బహు రాజసము లయ్యెను. అందువలన నా జీవులు దుఃఖప్రాయులు. బహిరంతః ప్రకాశులు మనుష్యులు. వారు సృష్టి సాధకులు. ఆరు విధముల సృష్టి యిక్కడ తెలుప బడినది. వాని వరుస యిది, బ్రహ్మయొక్క మొదటి సృష్టి మహత్సర్గము. రెండవది తన్మాత్ర సృష్టి (భూత సృష్టి). ఐంద్రియకము (వైకారికము) మూడవది.

ఇత్యేషప్రాకృతస్సర్గస్సంభూతో బుద్ధిపూర్వకః

ముఖ్యసర్గశ్చతుర్థస్తు ముఖ్యావైస్థావరాసః స్మృతాః

పఞ్చమశ్చహియః ప్రోక్తఃతిర్యగ్యోన్య స్సఉచ్చతే

తతోర్ ధ్వస్రోతసాంషష్ఠో దేవసర్గస్తు సంస్మృతః

తతోఽర్వాక్స్రోతసాంసర్గస్సప్తమస్సతు మానుషః

అష్టమోనుగ్రహస్సర్గస్సాత్వికస్తామసశ్చసః

పఞ్చైతే వైకృతాస్సర్గాః ప్రాకృతాస్తు త్రయస్మృతః

ప్రాకృతోవైకృతశ్పైవ కౌమారోనవమస్స్మృతః

ఇత్యేతేవై సమాఖ్యా నవసర్గాః ప్రజాపతేః

ప్రాకృతోవైకృతశ్పైవ జగతో మూలహేతవః

సృజతో జగదీశస్యకిమన్యచ్చ్రోతుమిచ్చసి

ఈ మూడును ప్రాకృత సర్గ మనబడును. ఇది బుద్ధి పూర్వకము. ముఖ్య సర్గము నాల్గవది. తిర్యక్సృష్టి యయిదవది. దేవసర్గ మారవది. మనుష్య సృష్టి ఏడవది. అర్వార్క్సోతసము ఎనిమిదవది. అనుగ్రహ సర్గము, సాత్వికము, తామసము అనునీ యైదు సర్గములు వైకృతములు. ప్రాకృతములు మూడు. కౌమారము కలిసి మొత్తము తొమ్మిది నవ సర్గములని వీనికి పేరు. ఈ ప్రాకృత వైకృత సర్గములు జగత్తునకు మూల కారణములు. మరి యేమి వినవలతు వన

శ్రీమైత్రేయుడు:

సంక్షేపాత్కథితస్సర్గో దేవాదీనాంత్వయామునే

విస్తరాచ్చ్రోతుమిచ్చామిత్వత్తోమునివరోత్తమ

శ్రీమైత్రేయుడు:

దేవ సృష్టి క్లుప్తముగా తెల్పినవి సవిస్తారముగా నానతిమ్మన

శ్రీపరాశారుడు:

కర్ మభిర్ భావితాః పూర్వైః కుశలాకుశలైస్తుతాః

ఖ్యాత్యాతయాహ్యనిర్ముక్తాః సంహారేఽప్యుపసంహృతాః

స్థావారాన్తస్సురాద్యాశ్చ ప్రజా బ్రహ్మంశ్చతుర్విధాః

బ్రహ్మణః కుర్వతస్సృష్టింజ జ్ఞిరేమానసాస్తుతాః

తతో దేవాసుర పితౄన్ మనుష్యాంశ్చ చతుష్టయమ్

సిసృక్షురమ్భాంస్యేతానిస్వమాత్మానమయూయుజత్

యుక్తాత్మనస్త మోమాత్రాహ్యుద్రిక్తాభూత్ప్రజాపతేః

సిసృక్షోర్జఘనాత్పూర్వమసురా జజ్ఞి రే తతః

శ్రీపరాశారుడు:

కుశలురైన వారు కుశలములైన పూర్వ కర్మములచే భావితులై అనగా నాయా వేదోక్త స్వస్వ వర్ణాశ్రమాచార విహిత ధర్మానుష్ఠాన ములచే నాయా కర్మ ఫలానుభవము నందు దాదాత్మ్యము పొందిన వారై దాన నేర్పడిన ఖ్యాతి చేత సపూర్వ సిద్ధమైన సంస్కార విశేషముల చేత, వాసనల చేత విడివడక సంహార కాలమందు గూడ (లయ సమయము నందు గూడ) ఉప సంహృతు లయిరి. అనగా నుపాధి భంగము నొందింప బడియు లయ కారుడైన పరమాత్మ యందు సూక్ష్మ రూపమున నవశిష్టులైరి. వారిలో దేవతలు మొదలు స్థావరములైన పర్వతాదుల వరకు నట్లు భీజ రూపమున నున్నవారు నాల్గు విధములైన జీవులు. మఱియు, సృష్టి చేయు తరివారా బ్రహ్మ యొక్క మనసు నందు బొడమిరి. అవ్వల దేవతలు, అసురులు, పితరులు, మనుష్యులుగా నలు తెఱగుల జీవులను సృజింప నెంచి సృష్టికర్త తన నుదకము లందు సమ్మేళన మొనరించు కొనెను. అట్లు సంయోగ మందినంత మాత్రాన నాతని నుండి తమోమాత్ర తనువు (కేవల చీకటి) ఉద్రేకించినది. అపుడా సృష్టి సంకల్పము చేసిన యాతని యొక్క జఘనము (పిరిది భాగము) నుండి యసురులు పుట్టిరి.

ఉత్ససర్జతతస్తాంతు తమో మాత్రాత్మికాంతనుమ్

సాతుత్యక్తాతనుస్తేనమైత్రేయాభూద్విభావారీ

సిసృక్షురస్య దేహస్థః ప్రీతిమాపతతస్సురాః

సత్త్వోద్రిక్తాస్సముద్భూతాముఖతో బ్రాహ్మణోద్విజ

త్యక్తాసాపితనుస్తేన సత్త్వప్రాయమభూద్దినమ్

తతోహిబలినోరాత్రావసురా దేవతా దివా

సత్త్వమత్రాత్మికామేవతతోన్యాంజగృహేతనుమ్

పితృవన్మన్యమానస్య పితరస్తస్యజజ్ఞిరే

ఉత్ససర్జపితౄన్ సృష్ట్వాతతస్తామపిస ప్రభుః

సాచోత్సృష్టాభవత్సంధ్యాదిననక్తన్తరస్థితిః

రజోమాత్రాత్మికామన్యాంజగృహేసతనుంతతః

రజోమత్రోత్కటాజాతామనుష్యా ద్విజ సత్తమ

తామప్యాశుసతత్యాజ తనుంసద్యః ప్రజాపతిః

జ్యోత్స్నాసమభవచ్చాపి ప్రాక్సంధ్యా యాఽభిధీయతే

జ్యోత్స్నాగమేతుబలినో మనుష్యాః పితరస్తథా

మైత్రేయ సంధ్యా సమయే తస్మాదేతేభవన్తివై

జ్యోత్స్నారాత్ర్యాహనీసంధ్యాచత్వార్యేతానివై విభోః

బ్రహ్మణస్తు శరీరాణి త్రిగుణోపాశ్రయాణితు

ఆ తమోమాత్ర స్వరూపుడయిన తనువును విడిచి వేయవలె ననుకొని విడిచి వేసిన ఆయా తనువు రాత్రి (విభావరి) యయ్యెను. మరియును సృష్టి సేయ నెంచి వేరొక తనువు నందుండి యాతడు సంప్రీతి సెందెను. అంతట సత్త్వోద్రిక్తు లయిన జీవులా బ్రహ్మ ముఖము నుండి జనించిరి. ఆ తనువు (ఉపాధిని కూడా) నతడు విడువగ సత్త్వ గుణప్రాయ మగు దినము జనించెను. అందువలన రాత్రి యసురులు, పగలు సురలు బలవంతులైరి. అటుపై నా విధి సత్త్వగుణ ప్రధానమైన ఇంకొక శరీరమును స్వీకరించెను. అపుడు నేను పితను (తండ్రిని) అని యను కొన్నంతట నతనికి ఇతరులు జనించిరి. అవ్వల నతడా శరీరమును విడిచెను. అట్లు వదలిన యా శరీరమే సంధ్య. సంధ్య యనగా పగటికి రాత్రికి నడిమి స్థితి. ఆ మీద నతడు రజో గుణ మాత్రమైన శరీరమును గైకొనెను. దాన రజో గుణోద్రిక్తు లగు మనుష్యులు పుట్టురి. రజః ప్రకృతి శరీరమును గూడ నప్పటి కప్పుడే త్యజించెను. అంతట జ్యోత్స్న (వెన్నెల) ఏర్పడెను. అదే ప్రాక్సంధ్య (తొలి సంధ్య) యనబడెను. ఆ వెన్నెల ఏర్పడగనే మనుష్యులు పితరులు గూడ నా సంధ్యా సమయమందు బలవంతులగు చున్నారు. వెన్నెల రాత్రి పగలు సంధ్య యను నీ నాలుగును బ్రహ్మ యొక్క త్రిగుణా శ్రయములైన శరీరములు.

రజోమాత్రాత్మికామేవతతోఽన్యాంజగృహేతనుమ్

తతః క్షుద్బ్రహ్మణో జాతాజజ్ఞేకోపస్త యాతతః

క్షుత్ క్షామానన్ధకారేఽథ సోఽసృజద్భగవాన్ ప్రభుః

విరూపాశ్శ్మశ్రులా జాతాస్తేఽభ్యదావంస్తతః ప్రభుమ్

మైవంభోరక్ష్యతామేషయైరుక్తం రాక్షసాస్తుతే

ఊచుర్జక్షామ ఇత్యన్యేయేతేయక్షాస్తుజక్షతాత్

అప్రియేణతుతాన్ దృష్ట్వాకేశాశ్శీర్యన్తవేధసః

హీనాశ్చశిరసోభూయః సమారోహన్తతచ్చిరః

సర్పణాత్తేఽభవన్ సర్పా హీనత్వాదహయః స్మృతాః

తతఃకృద్దోజగత్సష్టా క్రోదాత్మానో వినిర్మమే

వర్ణేనకపిశేనోగ్రా హూతాస్తేపిశితాశనాః

అవ్వల రజోగుణ ప్రధాన మయిన మరొక శరీరము నతడు గ్రహించెను. దాన నాకలి, కోపము బుట్టినవి. అటు పైని యంధకారమున నాకలికి బక్క చిక్కిన వారిని యతడు సృష్టించెను. వారు వికృత రూపులు, గడ్డములు పెరిగిన వారునై యా సృష్టికర్త దగ్గరకు పరువెత్తిరి. మఱియు మనలను పుట్టించిన వీనిని రక్షింప వలదని వారనిరి. దాన వారికి రాక్షసులను పేరు వచ్చినది. వారిలో కొందఱు ఈ సృష్టికర్తను జక్షామ (తిని వేయుదుమని) యార్చిరి. అందుచే వారికి యక్షులని పేరు వచ్చినది. బ్రహ్మ వారిని యనిష్టముగ జూచి నంతట వారి కేశములు రాలి పోయెను. అట్లు శిరోహీన ములయి వాండ్రు బ్రహ్మ శిరస్సుపై కెగ బ్రాకిరి. అట్లు సర్పణము చేసి నందున వారికి సర్పములను పేరు వచ్చెను. శిరస్సు హీనమగుట వలన యాహి యను పేరు గూడ వచ్చెను. (అనగా పాము లయిరన్న మాట) అందుకే కృద్ధుడై జగత్కర్త క్రోధ స్వరూపులను బుట్టించెను. వారు కపిశ వర్ణులు. (పసుపు మీరిన ఎరుపు రంగు వారు) భయంకరులు నైన పిశితాశను లని పేరొందిరి.

ధ్యాయతోంగాత్సముత్పన్నాగన్దర్వాస్తస్యతత్ క్షణాత్

పిబన్తోజజ్ఞిరేగాంవైగన్దర్వాస్తేనతేద్విజ

ఏతానిసృహ్ట్వభగవాన్ బ్రహ్మాతచ్చక్తిచోదితః

తతస్స్వచ్చన్దతోన్యానివయాంసివయసోసృజత్

అవయోవాక్షసశ్చక్రేముఖతోఽజాస్ససృష్టవాన్

సృష్టవానుదరాద్గాశ్చపార్ శ్వాభ్యంచప్రజాపతిః

పద్భ్యాంచాశ్వాన్ సమాతఙ్గాన్ రాసభాన్ గవయాన్ మృగాన్

ఉష్ట్రా నశ్వతరాంశ్చైవ న్యఙ్కూనన్యామ్శ్చజాతయః

ఓషథ్యఃఫలమూలిన్యోలోమభ్యస్థాస్యజజ్ఞిరే

త్రేతాయుగముఖేబ్రహ్మ కల్పస్యాదౌదిజోత్తమ

సృష్ట్వా పశ్యౌషదీస్సమ్యక్ యుయోజ సతథాధ్వరే

గౌరజః పురుషోమేషశ్చాశ్వాశ్వతరగార్దభాః

ఏతాన్గ్రామ్యాన్ పశూనాహురారణ్యాంశ్చ నిబోధమే

శ్వాపదాద్విఖురాహస్తివానరాః పక్షిపఞ్చమాః

ఔదకాః పశవష్షష్ఠాః సప్తమాః స్తుసరీసృపాః

అటుమీద ధ్యానము చేసినంతట నవ్విధి శరీరము నుండి గంధర్వులు పుట్టిరి. వారు గాం = గోవును కుడుచుచు పుట్టి నందున గంధర్వులని పేరొందిరి. ఇట్లీ భూతములను సృష్టించి శక్తి ప్రేరణముచే దనంత దాను బక్షులను (వయాంసి వయసః) సృష్టించెను. ఱొమ్మునుండి గొఱ్ఱెలను, ముఖము నుండి అజము(మేక)లను, ఉదరము నుండి, ఇరు పార్శ్వముల నుండి గోవులను, పాదముల నుండి గుర్రములు, ఏనుగులను, గాడిదలను గవయము (అడవి యావు గురుపిడి) లను లేళ్ళను ఒంటెలను ఆశ్వతరము(కంచర గాడిద) లను న్యంకువులను (ఒక జాతి లేడి(ఇర్రి)) మరి పెక్కు జాతులను సృష్టించెను. ఆయన రోమముల నుండి ఓషధులు, ఫల జాతులు దుంపలు పుట్టెను. కల్పాది త్రేతాయుగ మందు పశువులు ఓషధులను పుట్టించి వానినతడు యజ్ఞము లందుపయోగ పరచెను. గోవు మేక పురుషుడు అశ్వము ఆశ్వతరము గార్ధభము గ్రామ్యములైన పశువు లందురు. అరణ్య మృగములు శ్వాపదములు (పులులు, ఖడ్గ మృగములు మొదలైన క్రూర జంతువులు ద్విశఫములు (రెండు డెక్కలు కలవి) ఏనుగులు వానరములు పక్షులు అనునవి యైదు రకములు. ఔదకములు (జల జంతువులు) యారవ పశుజాతికి చెందినవి. సారీసృపములు (సర్పజాతి) ఏడవ రకము.

గాయత్రంచ ఋచశ్చైవత్రివృత్ స్తోమంరథన్తరమ్

అగ్నిష్టోమంచయజ్ఞానాం నిర్మమేప్రథమాన్ముఖాత్

యజూంషిత్రైష్టుభంఛన్దస్త్సోమంపఞ్చదశంతథా

బృహత్సామతథోక్థ్యంచదక్షిణాదసృజన్ముఖాత్

సామానిజగతీ ఛన్దస్త్సోమంసప్తదశంతథా

వైరూపమతిరాత్రంచపశ్చిమాదసృజన్ముఖాత్

ఏకవింశమథర్వాణమాప్తోర్యామాణమేవచ

అనుష్టుభంచవై రాజముత్తరాదసృజన్ముఖాత్

ఉచ్చావచానిభూతానిగాత్రేభ్యస్తస్యజజ్జిరే

దేవాసురపితౄన్ సృష్ట్వామనుష్యాంశ్చప్రజాపతిః

తతఃపునస్ససర్జాదౌసంకల్ప్యసపితామహః

యక్షాన్ పిశాచాన్ గన్ధర్వాం స్తథై వాప్సరసాంగణాన్

నరకిన్నరరక్షామ్సివయః పశుమృగోరగాన్

అవ్యయంచవ్యయంచై వయదిదంస్థాణుజఙ్గమమ్

తత్ససర్జతదాబ్రహ్మాభగవానాదికృద్విభుః

తేషాంచయానికర్మాణిప్రాక్సృష్ట్యాంప్రతిపేదిరే

తాన్యేవతే ప్రపద్యన్తేసృజ్యమానాః పునః పునః

హింస్రాహింస్రేమృదుక్రూరే ధర్మాధర్మా నృతానృతే

తద్భావితాః ప్రపద్యన్తే తస్మాత్తత్తస్యరోచతే

ఇన్ద్రియార్థేషుభూతేషుశరీరేషుచసప్రభుః

నానాత్వంవినియోగంచతథై వవ్యసృజత్స్వయమ్

నామరూపంచభూతనాంకృత్యానాంచప్రపఞ్చనమ్

వేదశబ్దేభ్య ఏవాదౌదేవాదీనాంచకారసః

ఋషీణాంనామధేయానియథావేదశృతానివై

తథానియోగయోగ్యా నిహ్యన్యేషామపిసోకరోత్

యథార్తుష్వృతులింగానినానారూపాణిపర్యయే

దృశ్యన్తేతానితాన్యేవతథాభావాయుగాదిషు

కరోత్యేవంవిధాంసృష్టింసర్గాదౌసపునఃపునః

సిసృక్షాశక్తియుక్తోసౌసృజ్యశక్తి ప్రచోదితః

ఆయన ప్రథమ ముఖము నుండి గాయత్ర ఛందస్సును ఋగ్వేదమును త్రివృస్తోమమును (అనగా దేవతా స్తుతి సాధన భూతములగు ఋక్కుల సముదాయము) రథంతర సామమును యజ్ఞములలో యజ్ఞష్టోమ మనెడి సోమసంస్థా విశేషమును సృష్టించెను. దక్షిణ ముఖము నుండి యజుర్వేదమును త్రైష్టుభ ఛందస్సును పంచదశ స్తోమమును బృహత్సామను ఉక్థ్యమను సోమ సంస్థను సృజించెను. పశ్చిమ ముఖము నుండి సామ వేదమును జగతీ ఛందస్సును, సప్తదశ స్తోమమును వైరూపసామాను అతిరాత్ర మనెడి సోమయాగ సంస్థను సృజించెను. ఉత్తర ముఖము నుండి యథర్వణ వేదమును, అనుష్టుభ ఛందస్సును ఏకవింశ స్తోమమును వైరాజ సామను ఆపోర్యామ మనెడి సోమయాగ సంస్థను సృజించెను. బహువిధ భూతము లాయన యవయవముల నుండి జనించెను. దేవాసుర పితరులను మనుష్యులను సృజించి ఆ మీద మరల సంకల్పము చేసి యక్ష పిశాచ గంధర్వులను, అప్సరో గణములను, నర, కిన్నర రాక్షసులను, పక్షులను, పశువులను, లేళ్ళను, పాములను, అవ్యయము వ్యయమునైన ఈ స్థావర జంగమ పంచమును సృజించెను. వాని వానికి క్రిందటి సృష్టిలో నేయే కర్మములు విహితములో వానినే ఈ సృష్టి యందవియవి పొందినవి. హింస, అహింస, మృదుత్వము, క్రౌర్యము, ధర్మము, అధర్మము, ఋతము, అనృతము ననునవెల్ల నా బ్రహ్మచే భావింప బడినవే యాయా భూతములు పొందును. అవే వానికి రుచించును. ఇంద్రియార్థముల యందు శబ్దాది విషము లందన్న మాట. శరీరము లందు నానాత్వమును వినియోగమును బ్రహ్మ స్వయముగా సృజించెను. నామ రూపములు ఆయాకృత్యముల వివరణము వేద శబ్దముల నుండియే మొదట దేవాదుల కేర్పరచెను. ఋషుల పేరులు మున్ను వేదముల యందు వినబడినవే యిప్పుడును చేసెను. అట్లే వానిని నియోగ యోగ్యములం గావించెను. అనగా వానివానికి నియోగింప బడిన (కర్మమునకు) అనుగుణముగా గావించెను. ఋతువులందు ఋతు విపర్యయ మందు (ఋతువులు మారినపుడు) ఋతు చిహ్నములు నానా రూపములై యెట్లు కనిపించునో యట్లే ఆయా కృత త్రేతాది యుగము లందు గూడ యాయా యుగ ధర్మములు వివిధ రూపముల గనిపించును. సిసృక్షతో గూడి (సృజింప నిచ్చతో) సృజింప దాగిన వస్తువుల యొక్క శక్తిచే ప్రేరేపింప బడి బ్రహ్మ సృష్టికార్యము చేయుచునే యుండును.