విష్ణు మహా పురాణము

22 - ఇక్ష్వాకువంశ భావిష్యద్రాజులు

శ్రీపరాశరుడు:

అతశ్చేక్ష్వాకవోభవిష్యాః పార్థివాః కథ్యన్తే

బృహత్బలస్య పుత్రోబృహత్ క్షణః

తస్మాదురుక్షయస్తస్మాచ్చావత్సవ్యూహస్తతశ్చ వయోమస్తస్మాదపి దివాకరః

తస్మాత్సహదేవస్సహదేవాద్బృహదశ్వస్తత్సూనుర్భానురథస్తస్యచ ప్రతీతాశ్వస్తస్యాపి సుప్రతీకస్తతశ్చ మరుదేవస్తతస్సునక్షత్ర స్తస్మాత్కిన్నరః

కిన్నరాదన్తరిక్షస్తస్మాత్సుపర్ణస్తతశ్చామిత్రజిత్

తతశ్చబృహద్భాజస్తస్యాపిధర్మీధర్మిణః కృతంజయః

కృతంజయాద్రణం జయః

రణం జయాత్సం జయస్తస్మాచ్చాక్యాశ్శాక్యాచ్చుద్దోదన స్తస్మా ద్రాహుళ స్తతః ప్రసేనజిత్

తతశ్చక్షుద్రకస్తతశ్చకుణ్డక స్తస్మాదపిరథః

తత్పుత్రశ్చసుమిత్రః

ఇత్యేతేచైక్ష్వాకవోబృహద్బలాన్వయాః

అత్రానువంశశ్లోకః

ఇక్ష్వాకూణామయం వంశస్సుమిత్రాన్తోభవిష్యతి

యతస్తం ప్రాప్యరాజానం సంస్థాం ప్రాప్స్యతివైకలౌ

శ్రీపరాశరుడు:

ఇటుపై ఇక్ష్వాకు వంశమందు రాబోవు రాజులం దెలిపెద. బృహద్బలుడు బృహత్ క్షణుడు ఉరుక్షయుడు వత్సవ్యూహుడు వ్యోముడు సహదేవుడు బృహదశ్వుడు భానురథుడు ప్రతీతాశ్వుడు సుప్రతీకుడు మరుదేవుడు సురక్షత్రుడు కిన్నరుడు అంతరిక్షుడు సువర్ణుడు అమిత్రజిత్తు బృహద్భాజుడు ధర్మి కృతంజయుడు రణంజయుడు సంజయుడు శాక్యుడు శుద్దోదనుడు రాహులుడు (బుద్దుడు) ప్రసేనజిత్తు క్షుద్రకుడు కుండకుడు సురథుడు సుమిత్రుడు తండ్రి కొడుకులుగా గల్గుదురు. ఈ ఇక్ష్వాకువుల వంశమిది సుమిత్రుని దాక యుండును. కలిలో నాతనిక యీ వంశమునికిం బొందును.