శ్రీపరాశరుడు:
కథితస్తామసస్సర్గో బ్రహ్మణ స్తేమహామునే।
రుద్రసర్గం ప్రవక్ష్యామి తన్మేనిగదతశ్శృణు॥
కల్పాదావాత్మనస్తుల్యంసుతం ప్రధ్యాయతస్తతః।
ప్రాదురాసీత్ర్పభోరజ్కేకుమారోనీలలోహితః॥
రురోదసుస్వరం సోథప్రాద్రవద్ధ్విజసత్తమ।
కింరోదిషీతితం బ్రహ్మారుదన్తం ప్రత్యువాచవై॥
నామదేహీతితంసోథరత్యువాచ ప్రజాపతిః।
రుద్రస్త్వందేవనామ్నాసిమారోదీః ధైర్యమావహ॥
ఏవముక్తః పునస్సోఽథ సప్తకృత్వోరురోదహ॥
తతోన్యానిదదౌతస్మైసప్తనామానివై ప్రభుః।
స్థానానిచై షామష్టానాంపత్నీః పుత్రాంశ్చవై ప్రభుః॥
భవంశర్వమథేశానంతథాపశుపతింద్విజ।
భీమముగ్రంమహాదేవమువాచ సపితామహః॥
చక్రేనామాన్యథై తానిస్థానాన్యేషాంచకారసః।
సూర్యోజాలంమహీవాయుర్వహ్నిరాకాశమేవచ॥
దీక్షితో బ్రహ్మణస్సోమ ఇత్యేతా స్తనవఃక్రమాత్॥
సువర్చలాతథై వోషాసుకేశీచాపరాశివా।
స్వాహాదిశస్తథాదీక్షా రోహిణీచయథాక్రమమ్॥
సూర్యాదీనాంద్విజశ్రేష్ఠరుద్రాద్యైర్నామభిస్సహ।
పత్న్యః స్మృతామహాభాగతదపత్యానిమేశృణు॥
ఏషాంసూతి ప్రసూ తిభ్యామిద మాపూరితంజగత్॥
శ్రీపరాశరుడు:
బ్రహ్మయొక్క తామస సృష్టిని దెల్పితిని మైత్రేయ! ఇక రుద్రసృష్టి తెలుపు చున్నాను వినుము. బ్రహ్మ కల్పాదిని దనకీడగు కొడుకునకై ధ్యానించి నంత నాయన యొడిలో నీలలోహితు డను గుమారు డుదయించెను. అతడు సుస్వరముగ రోదనము సేయుచు బరుగెత్తెను. బ్రహ్మ ఎందుల కేడ్చుచున్నా వనెను. ఆ ప్రజాపతి నాకు ఒక పేరిమ్మనెను. ‘రుద్రుడు’ అను పేరు గల వాడవు నీవు. ఏడువకు. ధైర్యము గొనుమన నా శిశువు మరల యేడు మార్లేడ్చెను. అంతట విధి యాతని కేడుపేర్లు పెట్టెను. మొత్త మా ఎనుమండుగురు రుద్రులకు నెనిమిది స్థానములను ఎనమండుగురు భార్యలను బుత్రుల నొసంగెను. ఆ యేడుగురు పేర్లివి, భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు వారికి స్థానములు సూర్యుడు, జలము, మహి, వాయువు, వహ్ని, ఆకాశము, దీక్షితుడైన బ్రాహ్మణుడు సోముడు ననువారు. ఇవే అష్టమూర్తులు సువర్చల ఉష సువేశి శివస్వాహ దిక్కులు దీక్షారోహిణి యనువారు వారి భార్యలు. వీరి సంతానము, వీరి పుత్ర పౌత్ర పరంపరతో జగమెల్ల నిండినది.
శనైశ్చరస్తథా శుక్రోలోహితాజ్గోమనోజవః।
స్కన్దసవర్గోఽథసంతానో బుధశ్చానుక్రమాత్సుతాః॥
ఏవంప్రకారోరుద్రోసౌసతీంభార్యామవిన్దత।
ఉపయేమేదుహితరం దక్ష స్యైవప్రజాపతేః॥
దక్షకోపాచ్చతత్యాజసాసతీ స్వకలేబరమ్।
హిమవద్దుహితాసాభూన్మేనాయాం ద్విజసత్తమ॥
ఉపయేమే పునశ్చోమామనన్యాం భగవాన్ హరః॥
దేవౌధాతృవిధాతారౌభృగోఃఖ్యాతిరసూయత।
శ్రియంచ దేవదేవస్యపత్నీ నారాయణస్యయా॥
శని శుక్రుడు లోహితాంగుడు (కుజుడు) మనోజవుడు స్కందుడు స్వర్గము సంతానుడు బుధుడు ననువారు వారి కొడుకులు. ఈ విధముగా సృష్టిని బెంచిన రుద్రుడు సతీదేవీం భార్యగా గైకొనెను. ఆమె దక్ష ప్రజాపతి కూతురు, దక్షుని యెడ కోపించి యామె తన శరీరమును బాసి హిమవంతునికి మేనకయందు దయించెను. అపుడామె ‘ఉమ’ యను పేరందెను. ఆమెను భగవంతుడు హరుడు పెండ్లాడెను. భ్రుగువు వలన ఖ్యాతి ధాత విధాతయను దేవతలం గనెను. నారాయణుని పత్నియగు శ్రీదేవిం గనెను.
శ్రీ మైత్రేయుడు:
క్షీరోదాచ్ర్ఛీస్సముత్పన్నా శ్రూయతేఽమృతమన్థనే।
భృగోఃఖ్యాత్యాం సముత్పన్నే త్యేతదాహ కథంభావాన్॥
మైత్రేయుడు:
అమృత మథన సమయమున లక్ష్మి పల్కడలి నుండి యవతరించేనని వినబడును గదా! భృగువునకు ఖ్యాతి యందుదయించెనను చున్న విది ఎట్లన, శ్రీపరాశరు డిట్లనియె.
శ్రీపరాశరుడు:
నిత్యైవైశాజగాన్మాతావిశ్నోశ్రీరానపాయినీ।
యథాసర్వగతోవిష్ణుస్తథైవేయం ద్విజోత్తమ॥
అర్ధోవిష్ణురియం వాణీ నీతిరేశానయోహరిః।
బోధోవిష్ణురీయం బుద్ధిర్ధర్మోఽసౌసత్కరియాత్వియమ్॥
స్రష్టావిష్ణురియం సృష్టిః శ్రీర్ భూమిర్ భూధరోహరిః।
సంతోషోభగవాన్ లక్స్మీస్తుష్టిర్ మైత్రేయశాశ్వతీ॥
ఇచ్ఛాశ్రీః భగవాన్ కామోయజ్ఞోసౌదక్షిణాతుసా।
ఆజ్యాహుతిరాసౌదేవీపురోదాశో జనార్దనః॥
శ్రీపరాశరుడు (మహాలక్ష్మీ భార్గవి యగుట):
ఈ శ్రీదేవి విష్ణువున కనపాయిని. విష్ణువెట్లు నిత్యుడు సర్వాంతర్యామియో యీమేయు నిత్య స్వరూప విష్ణునితో నిత్యముండునది. విష్ణువు అర్ధము ఈమె శబ్దము. ఈమె నీతి హరినయము (న్యాయము) విష్ణువు బోదము (జ్ఞానము) ఈమె బుద్ది. అతడు ధర్మము. ఈమె సత్క్రియ, హరిస్రష్ట ఈమె సృష్టి. శ్వాతురాలు. భగవంతుడు కామము ఈమె యిచ్ఛ విష్ణువు యజ్ఞము. శ్రీదేవి దక్షిణ. లక్ష్మి ఆఘౌహుతి (నేయి రూపమున నిచ్చు హవిస్సు) హరి పురోడాశము(హోమోపయోగిపిష్ట ద్రవ్యము).
పత్నిశాలమునే లక్ష్మీః ప్రాగ్వంశో మధుసూదనః।
చితిర్లక్మీః హరిర్ యూప ఇద్మాశ్రీః భగవాన్ కుశః॥
సామస్వరూపీ భగవానుద్గీతిః కమలాలయా।
స్వాహాలక్ష్మీః జగన్నాథో వాసుదేవోహుతాశనః॥
శంకరోభగవాన్ విష్ణుః గౌరీ లక్ష్మీః ద్విజోత్తమ।
మైత్రేయ కేశవస్సూర్యస్తత్ప్రభాకమలాలయా॥
విష్ణుః పితృగణః పద్మాస్వదాశాశ్వతపుష్టిదా।
ద్యౌశ్రీస్సర్వాత్మకోవిష్ణురవకాశోఽతివిస్తరః॥
శశాఙ్క శ్రీధరః కాన్తి శ్రీస్త స్యైవానపాయినీ।
ధృతిర్లక్ష్మీః జగచ్చేష్టావాయుస్సర్వత్రగోహారిః॥
జలధిర్ ద్విజగోవిన్దస్తద్వేలా శ్రీఃమహామతే।
లక్ష్మీస్వరూపమిన్ద్రాణీ దేవేన్ద్రో మధుసూదనః॥
యమశ్చక్రధరస్సాక్షాద్దూమోర్ణా కమలాలయా।
బుద్దిశ్ర్శ్రీశ్ర్శ్రీధరోదేవః స్వయమేవధనేశ్వరః॥
గౌరీలక్ష్మీః మహాభాకేశవో వరుణస్స్వయమ్।
శ్రీఃదేవసేనాతద్భర్తాదేవసేనాపతిరరిః॥
అవష్టమ్భోగధాపాణిః శక్తిర్లక్ష్మీఃద్విజోత్తమ।
కాష్ఠాలక్ష్మీః నిమేషోఽసౌముహూర్తోసౌకలాతుసా॥
జ్యోత్స్నాలక్ష్మీః ప్రదీపోసౌసర్వర్వేశ్వరోహరిః।
లతాభూతాజగన్మాతా శ్రీఃవిష్ణుద్రుమసంస్థితిః॥
విభావరీ శ్రీఃదివసో దేవాశ్చక్రగదాధరః।
వరప్రదోవరో విష్ణుఃవధూః పద్మవనాలయా॥
నదస్వరూపీ భగవాన్ శ్రీఃనదీరూప సంస్థితా।
ధ్వజశ్చ పుణ్డరీకాక్షః పతాకా కమలాలయా॥
తృష్ణాలక్ష్మీః జగత్స్వామీలో భోనారాయణః పరః।
రతీరాగశ్చధర్మజ్ఞ లక్ష్మీఃగోవిన్దఏవచ॥
కింవాత్రాబహునోక్తేన సంక్షేపేణేదముచ్యతే॥
దేవతిర్యఙ్మనుష్యేషు పున్నామా భగవాన్ హరిః।
స్త్రీనామ్నీ శ్రీశ్చవిజ్ఞేయా నానయోర్విద్యతేపరమ్॥
లక్ష్మీ పత్నిశాల మధుసూదనుడు ప్రాగ్వంశము. త్రేతాగ్ని పాలకుడు. శ్రీదేవి చితి(దేవి) హరియూప స్తంభము. శ్రీయిధ్మ, హరికుశ. భగవంతుడు సామస్వరూపి ఉద్గీతి(సామ) కమలాలయ. ఇందిస్వాహా రూపిణి జగన్నాథుడు అగ్ని శంకర భగవానుడు విష్ణువు గౌరీ లక్ష్మి. సూర్యుడు కేశవుడు ప్రభ పద్మాలయ విష్ణువు, పితృగణము స్వధాదేవి. ఈమె శాశ్వతమైన పుష్టి నిచ్చునది. శ్రీదేవి ద్యులోకము. అతి విస్తారమైన అవకాశము. ఆకాశము విష్ణువు. శ్రీధరుడు(విష్ణువు). శశాంకుడు (చంద్రుడు) కాంతి లక్ష్మి. అనుపాయిని ధృతి. రమ, జగచ్చేష్టాత్మకుడు వాయు సర్వగుడగు వాయువు, సముద్రము గోవిందుడు వేల (చెలియలి గట్టు) లక్ష్మి, శచీదేవి లక్ష్మి. దేవేంద్రుడు మధుసూదనుడు. యముడు చక్రిధూమోర్ణ (యమ పత్ని) కమలాలయ. సమృద్ది (సంపద) శ్రీ శ్రీధరుడు. కుబేరుడు. గౌరీ. లక్ష్మి. వరుణుడు. హరి శ్రీదేవి దేవసేన. దేవసేనాధిపతి హరిగధాపాణి అవష్టంభము (ఊత, పూనిక) లక్ష్మీ శక్తి. కాష్ఠలక్ష్మీ నిమేషము హరి. ముహూర్తము ముకుందుడు కలారూపిణి కమలాలయ. వెన్నెల సిరి సకలమైన వెలుగు సర్వేశ్వరుడు. తీగ జగన్మాత చెట్టు శ్రీ విష్ణువు. విభావరి (రేయి) శ్రీదేవి దివసము (పగలు) చక్ర గదాపాణి వరప్రదుడు(హరి) వరుడు (పెండ్లికొడుకు) పద్మ వనవాసిని(లక్ష్మి) వధువు (పెండ్లిక కూతురు) నాదము భగవంతుడు. శ్రీదేవి నది. పతాక కమల గేహిని. తృష్ణ లక్ష్మీ, లోభము జగత్స్వామి నారాయణుడు. రథి లక్ష్మి, రాగము గోవిందుడు. ఇట వేయి మాటలెందులకు? దేవతలలో పశు పక్ష్యాదులలో మనుష్యులలో పురుష నామమైన దెల్ల పురుషోత్తముడు భగవంతుడు విష్ణువు. స్త్రీ నామమైన దెల్ల శ్రీదేవి. వీరికంటె మఱి పరము లేదు.
Summary of chapter 8 of the Vishnu Mahā Purāṇa is as follows:
When Brahmā's creation proceeds too slowly, he becomes angry. From his anger and annoyance, Rudra (Śiva) arises — blazing, of dual form (male-female), filling all the three worlds. Brahmā asks Rudra to separate his male and female aspects and assist in creation. Rudra does so, giving rise to the eleven Rudras (Ajaikapāt, Ahirbudhnya, Virūpākṣa, Raivata, Hara, Tryambaka, Sāvitra, Jayanta, Pinākin, Aparājita, Mṛtyurūpa). Dakṣa Prajāpati is born from Brahmā's right thumb.