విష్ణు మహా పురాణము

6 - చాతుర్వర్ణ వ్యవస్థ

శ్రీమైత్రేయుడు:

అర్వాక్స్రోతాస్తుకథితోభవతాయస్తు మానుషః

బ్రహ్మన్ విస్తరతో బ్రూహి బ్రహ్మాతమసృజద్యథా

యథాచ వర్ణాన సృజద్యద్గుణాంశ్చ మహామునే

యచ్చతేషాంస్మృతం కర్మ విప్రాదీనాంతదుచ్యతామ్

శ్రీమైత్రేయుడు:

అర్వాక్స్రోతస్సు మానుష సృష్టి యంటిరి. అది బ్రహ్మ యెట్లు సేసెనో సవిస్తారముగ దెల్పుము. వర్ణములు గుణములు వాని కర్మ విశేషములు గూడ నానతిమ్మన.

శ్రీపరాశరుడు:

సత్యాభిధ్యాయినః పూర్వం సిసృక్షోః బ్రాహ్మణో జగత్

అజాయన్త ద్విజశ్రేష్ఠ సత్త్వోద్రిక్తా ముఖాత్ప్రజాః

వక్షసోరాజసోద్రిక్తాస్తథాఽన్యా బ్రాహ్మణోఽభవన్

రజసాతమసా చైవ సముద్రిక్తాస్తథోరుతః

పద్భ్యామన్యాః ప్రజాబ్రహ్మససర్జ ద్విజసత్తమ

తమః ప్రధానాస్తాస్సర్వాశ్చాతుర్వర్ ణ్యమిదంతతః

బ్రాహ్మణాః క్షత్త్రియా వైశ్యాశ్శూద్రాశ్చ ద్విజసత్తమ

పాదోరు వక్షస్థ్సలతో ముఖతశ్చ సముద్గతాః

యజ్ఞ నిష్పత్తయే సర్వమేతద్బ్రహ్మాచకారవై

చాతుర్వర్ ణ్యంమహాభాగ యజ్ఞ సాధన ముత్తమమ్

యజ్ఞైరాప్యాయితా దేవా వృష్ట్యుత్సర్గేణతాః ప్రజాః

ఆప్యాయయన్తే ధర్మజ్ఞ యజ్ఞాః కళ్యాణహేతవః

నిష్పాద్యన్తేనరైస్తైస్తు స్వధర్మాభీరతై స్సదా

విశుద్ధాచరణోపేతైస్సద్భిస్సన్మార్గ గామిభిః

స్వర్గాపవర్గౌ మానుష్యాత్ప్రప్నువన్తి మహామునే

యథాభి రుచితం స్థానం తద్యాన్తిమనుజా ద్విజ

ప్రజాస్తా బ్రహ్మణా సృష్టాశ్చాతుర్వర్ ణ్యవ్యవస్తితాః

సమ్యక్చ్రద్దా సమాచార ప్రవణా మునిసత్తమ

యథేచ్చావాసనిరతాస్సర్వ బాధావివర్జితాః

శుద్దాన్తః కరణాశ్శుద్ధాః సర్వానుష్ఠాన నిర్మలాః

శ్రీపరాశరుడు:

జగత్తు సృజింప నెంచి సత్యవస్తు ధ్యానము సేయ బ్రహ్మ యొక్క ముఖము నుండి సత్త్వ సంపన్నులగు ప్రజలు పుట్టిరి. ఱొమ్ము నుండి రజో గుణోద్రికులు, తొడల నుండి రజస్తమో గుణోద్రికులు, పాదముల నుండి మరి వేరు ప్రజలు నుద్భవించిరి. వారందరు తమః ప్రధాన జీవులు. యజ్ఞ నిర్వహణ మునకై బ్రహ్మ యిదెల్ల గావించెను. చాతుర్వర్ణ్య ముత్తమయిన యజ్ఞ సాధనము. యజ్ఞములచే నాప్యాయితులైన దేవతలు వర్షము గురియించి ప్రజల నాప్యాయన పరతురు. కావున యజ్ఞములు నిర్వహింప బడును. మనుష్య జన్మముచే మోక్షము స్వర్గము నందుందురు. ఇష్టమయిన యే స్థానమునకైన దాన నేగ గలరు. చాతుర్వర్ణ్య వ్యవస్థ గలవారు, శ్రద్ధాచార సంపన్నులు శుద్దాంతఃకరణులు శుద్ధులు సర్వా నుష్ఠానము సేసి పాపము తొలగిన వారు సర్వ బాధా వర్జితులు యదేచ్చా లోక సంచారులు నగుదురు.

శుద్దేచతాసాం మనసిశుద్దేన్తసంస్థితేహరౌ

శుద్దజ్ఞానంప్రపశ్యన్తివిష్ణ్వాఖ్యం యేనతత్పదమ్

తతఃకాలాత్మకోయే ఽసౌతస్యాంశః కథితోహరేః

సపాతయత్యఘం ఘోరమల్పమల్పాల్పసారవత్

అధర్మబీజభూతంతుతమోలోభసముద్భవమ్

ప్రజాసుతాసుమైత్రేయ రాగాదికమసాధకమ్

తతస్సాసహజసిద్దిస్తాసాంనాతీవజాయతే

రసోల్లాసాదయశ్చాన్యాస్సిద్దయోఽష్టౌభవన్తియః

తాసుక్షీణాస్వ శేషాసువర్ధమానేచపాతకే

ద్వాన్ద్వాభిభవ దుఃఖార్తాస్తాభవన్తి తతఃప్రజాః

తతోదుర్గాణితాశ్చ క్రుర్దాన్వం పార్వతమౌదకమ్

కృత్త్రిమంచతథాదుర్గం పురఖర్వటకాదియత్

గృహాణిచయథాన్యాయం తేషుచాక్రుః పురాదిషు

శీతాతపాదిబాథానాం ప్రశామాయ మహామునే

ప్రతికారమిమంకృత్వా శీతాదేస్తాః ప్రజాః పునః

వార్తోపాయం తతశ్చక్రుర్హస్త సిద్ధించ కర్మజామ్

వారికి చిత్తము శుద్ధమై యందు హరి వసింప వారు విశుద్ధ జ్ఞాన రూపమయిన విష్ణువను పరమ పదముం దర్శింతురు. అంతట హరి యొక్క యంశమైన కాలాధిష్ఠాన దేవత అల్పము వారి ఘోరము నయిన పాపము నంతను ద్రుంచును. ఆ పాపము అధర్మ భీజము. తమో లాభాది గుణ సంభవము. అది ప్రజల యందు రాగ ద్వేషాది రూపమున నుండి యసాధక మగును. ముక్తి సాధకము గాకుండును. అందువలన ప్రజలకు సహజ సిద్ధి (సాయుజ్య ముక్తి రూపమైనది) గలుగదు. రసోల్లాసము మొదలైన యష్ట సిద్ధులు మాత్రమే గలుగును. ఇట్లా యా సిద్ధులు క్షీణించి నంతట పాతకము మరల పెంపొంద ద్వంద్వములకు రాగ ద్వేషములు, సుఖ దుఃఖములు మొదలయిన జంటలకు లొంగి ప్రజలు మున్ను దుఃఖ వశులైరి. ఆ దుఃఖ సహనమునకై వారు ధాన్వము (ఎడారి) మరు పార్వతము, ఔదకము, పురఖర్వటము (400 గ్రామాల పరగణాలకు ముఖ్య గ్రామము) గ్రామాదికమునగు కృత్రిమ దుర్గములను గల్పించు కొనిరి. శీతవాతాతపాది సహనమునకై ఇండ్లు వాకిండ్లు నిర్మించుకొన మొదలిడిరి. ఆ మీద బ్రతుకు తెరువునకు వార్తోపాయమును కృష్యాది జీవన వ్యాపారమును గల్పించు కొనిరి. కర్మ సిద్ధమగు శిల్పాది హస్త సిద్ధిని సాధించు కొనిరి.

వ్రీహయశ్చయవాశ్చైవగోధూమా అణవస్తిలాః

ప్రియఙ్గవోహ్యుదారాశ్చకోరదూషాస్సతీనకాః

మాషాముద్గామసూరాశ్చనిష్పావస్సకులత్థకాః

ఆఢక్యశ్చణకాశ్చైవశణాస్సప్తదశస్మృతాః

ఇత్యేతా ఓషదీనాంతు గ్రామ్యాణాంజాతయో మునే

ఓషధ్యోయజ్ఞికాశ్చైవ గ్రామ్యారణ్యాశ్చతుర్ధశ

వ్రీహయస్సయవామాషాగోధూమా అణవస్తిలాః

ప్రియఙ్గసప్తమాహ్యేతే అష్టమాస్తూకులుత్థకాః

శ్యామాకాస్త్యథనీవారాజర్తిలాస్సగామేధుకాః

తథావేణుయవాః ప్రోక్తాస్తద్వాన్మర్కటకామునే

గ్రామ్యారణ్యాస్స్మృతాహ్యేతా ఓషధ్యస్తు చతుర్దశ

యజ్ఞనిష్పత్తయేయజ్ఞస్తథాఽసాంహేతురుత్తమః

ఆమీద యవగోధుమాదిగ పదునేడు రకముల పంటలను పండించ నేర్చు కొనిరి. (17 రకముల పంటలు వ్రీహలు, యవలు, గోధుమలు, ప్రియంగువులు = కొఱ్ఱలు, ఉదారములు = ధరలను వడ్లు, కోర దూషములు, సతీనకములు = అంకాలు అనెడి పప్పు ధాన్యము. మాషములు = మినుములు, ముద్గములు = పెసలు, మసూరములు = చిరు సెనగలు, నిష్పావములు = అనుములు, కులుత్థములు = ఉలవలు, ఆఢక్యములు = కందులు, చణకములు = సెనగలు, శణములు = జనుములు ఇవి గ్రామౌషది జాతులు. యజ్ఞికములు(యజ్ఞోపయోగాములైన ఔషధులు గ్రామ్యములు అరణ్యములు పదునాల్గు రకములు అవి. వ్రీహులు = ఎఱ్ఱవడ్లు యవలు, మాషములు, గోధుమలు, అనువులు, తిలలు, ప్రియంగువులు, కులుత్థములు = ఉలవలు, శ్యామాకములు = చామలు, నీవాకములు = నెవరి ధాన్యము, జర్తిలములు = అడవి నువ్వులు, గవేధుకలు = అడవి గోధుమలు, వేణుయవలు = వెదురు బియ్యము. మర్కటములు = ధాన్య విశేషములు అను నవి పదునాల్గు రకములు. ఇవి కూడ గ్రామ్యములు అరణ్యము లను భేదము లందినవి. ప్రజాకారణము లుగా నివి యజ్ఞములతో బాటు సృష్టింప బడినవి.

ఏతాశ్చ సహయజ్ఞేన ప్రజానాంకారణంపరమ్

పరాపరవిధః ప్రాజ్ఞాస్తతో యజ్ఞాన్ వితన్వతే

ఆహన్యహన్యనుష్ఠానంయజ్ఞానాంమునిసత్తమ

ఉపకారకరంపుంసాం క్రియమాణాఘశాన్తిదమ్

యేషాంతుకాలసృష్టోసౌపాబిన్దుర్మహామతే

చేతస్సువవృధేచక్రు స్తేనయజ్ఞేశుమానసమ్

వేదాన్వేద్యంతథాదేవాన్యజ్ఞాకర్మాడికంచయత్

తత్సర్వం నిన్దమానాస్తేయజ్ఞవ్యాసేధకారిణః

ప్రవృత్తిమార్గవ్యుచ్ఛిత్తికారణోవేదనిన్దకాః

దురాత్మానోదురాచారా బభూవుః కుటిలాశాయాః

సంసిద్దాయాంతువార్తాయాం ప్రజాః సృష్ట్వాప్రజాపతిః

మర్యాదాంస్థాపయామాస యథాస్థానంయథాగుణమ్

వర్ణానామాశ్రమాణాంచ ధర్మాన్ ధర్మభృతాంవర

లోకాంశ్చ సర్వవర్ణానాంసమ్యగ్ధర్మానుపాలినామ్

ప్రాజాపత్యం బ్రాహ్మణానాం స్మృతంస్థానంక్రియావతామ్

స్థానమైన్ద్రంక్షత్త్రియాణాం సంగ్రామేష్యనివర్తినామ్

వైశ్యానాంమారుతంస్థానం స్వధర్మనిరతాత్మనామ్

గాన్ధర్వంశూద్రజాతీనాం పరిచర్యానువర్తినామ్

అష్టాశేతిసహస్రాణియతీనామూర్ ధ్వరేతసామ్

స్మృతంతేషాంతుయత్ స్థానంతదేవగురువాసినామ్

సప్తర్షీణాంచయత్ స్థానం స్మృతంతద్వైవనౌకసామ్

ప్రాజాపత్యంగృహస్థానాం బ్రహ్మసంజ్ఞితమ్

యోగినామమృతంస్థానం స్వాత్మసంతోషకారిణామ్

ఏకాన్తినస్సదాబ్రహ్మధ్యాయినో యోగినోహియే

తేషాంతత్పరమంస్థానం యద్వైపశ్యన్తిసూరయః

వీనికి యజ్ఞముత్త కారణము. యజ్ఞా నుష్టానము పాపశాంతి గూర్చుటకై ప్రతిదిన మనుష్టింప బడి ప్రజల కుపకారక మగును. ఎవరి మనస్సు లందు కాలముచే సృజింప బడిన పాపబిందు విరపు కొన్నదో క్రమాభివృద్దినందునో అట్టివారు వేదములను వేదముల వలన దెలియనగు విషయములను దేవతలను యజ్ఞాది కర్మముల నెల్ల నిందించు వారు యజ్ఞములకు భంగము సేయువారు ప్రవృత్తి మార్గమునకు (కర్మ మార్గమునకు) విచ్చిత్తి కల్గించు వారు వేద నిందలకు దురాత్ములు దురచారులు కుటిలులునై బయలు దేరినారు. వార్త సిద్ద మైనంతట (జీవన విధానము ఏర్పడిన మీదట) ప్రజాపతి ప్రజలను సృష్టించి ఆయా స్థానము గుణమును బట్టి యొక మర్యాద (కట్టడ) ఏర్పరచెను. వర్ణముల ఆశ్రమముల యొక్కయు ధర్మములను స్వధర్మ పరిపాలనము సేయు నాయా వర్ణము లన్నిటికి గలుగు పుణ్య లోకములను బరమేష్వరుడు సృజించెను. కర్మ పరులయిన బ్రాహ్మణులకు ప్రాజాపత్యము అను స్థానమును, యుద్దము లందు వెనుజూపని క్షత్రియులకు ఇంద్ర స్థానమును, స్వధర్మ నిరతులైన (పశుగోరక్ష వాణిజ్యాది నిరతులైన) వైశ్యులకు వాయు దేవతా స్థానమును, పరిచర్య చేసి ధన్యులగు శూద్రులకు గంధర్వ స్థానమును నేర్పరచెను. ఊర్ధ్వరేతస్కు లయిన యతులకు ఎనుబది ఎనిమిది వేల స్థానములు. అవియే గురుకుల వాసులగు నైష్ఠిక బ్రహ్మచారులకు నేర్పఱచెను. వానప్రస్థులకు సప్తర్షుల కేస్థానమో యదే నిర్దేశించెను. గృహస్థులకు ప్రాజా పాత్యస్థానము (బ్రహ్మలోకము) న్యాసులకు (సన్యాసులకు పరివ్రాజులకు) బ్రహ్మస్థానము బ్రహ్మైక్య రూపము ఆత్మ సంతుష్టులగు యోగులకు అమృత స్థానము నేర్పరచెను. ఏకాంత నిష్ఠులు బ్రహ్మ ధ్యాన నిష్ఠులు, యోగులు నైనవారి స్థానము పరమోన్నత స్థానము. శూరులు బ్రహ్మ విద్వరిష్ఠులు దానినే సదా దర్శింతురు.

గత్వాగత్వానివర్తన్తేచన్ద్రసూర్యదయోగ్రహాః

అద్యాపిననివర్తన్తేద్వాదశాక్షరచిన్తకాః

తామిస్రమన్దతామి స్రంమహారౌరవరౌరవౌ

అసిపత్రవనంఘోరం కాలసూత్రమవీచికమ్

వినిన్దకానాం వేదస్యయజ్ఞవ్యాఘాతకారిణామ్

స్థానమేతత్స మాఖ్యాతంస్వధర్మత్యాగినామపి

చంద్ర సూర్యాది గ్రహాలూ ఆయా గ్రహాదికార స్థానము నందున్న జీవులు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చుచునే యుందురు. కాని ద్వాదశాక్షర మహామంత్ర ధ్యాన నిష్ఠుల య్యుత్తమోత్తమ స్థానమున కేగిన వారేగిరే కాని యిప్పటికిని వారు తిరిగి రారు. తామిస్రము అంధ తామిస్రము రౌరవము మహారౌరావము అసిపత్ర వనము ఘోరము కాలసూత్రము అవీచికము నను ఘోర నరకములు వేద నిందకులకు యజ్ఞ ద్వంసకులకు స్వధర్మ త్యాగులకు జెప్ప బడిన స్థానములు.