శ్రీపరాశరుడు:
కంస స్తతోద్విగ్నమనాః ప్రాహసర్వాన్ మహాసురాన్।
ప్రలమ్బకేశిప్రముఖానాహూయాసురపుంగవాన్॥
శ్రీపరాశరుడు:
కంసు డవ్వల మనముద్వేగ మందగా ప్రలంబకేశి ప్రముఖులగు నెల్ల మహాసుర వరులం బిలిచి యిట్లనియె
కంసుడు:
హేప్రలమ్భమహాబాహోకేశిన్ ధేనుక పూతనే।
అరిష్టాద్యాస్తథైవాన్యేశ్రూయతాం వచనం మమ॥
మాంహన్తుమమరైర్యత్నః కృతః కిలదురాత్మభిః।
మద్వీర్యతాపితాన్ వీరో నత్వేతాన్ గణయామ్యహమ్॥
కిమిన్ద్రేణాల్పవీర్యేణ కింహరేణై కచారిణా।
హరిణావాపికిం సాధ్యం ఛిద్రేష్వసురఘాతినా॥
కిమాదిత్యైః కింవసుభిరల్పవీర్యః కిమగ్నిభిః।
కింవాన్యైరమరైస్సర్వైర్మద్బాహుహుబలనిర్జితైః॥
కింనదృష్టోఽమారపతిత్మయాసంయుగమేత్యసః।
పృష్టేనైవవహన్ బాణానపచ్ఛన్నశ్చవక్షసా॥
మద్రాష్ట్రేవారితావృష్టిర్యదాశక్రేణకింతదా।
మద్భాణభిన్నైర్జలదైరాపోముక్తాయథేప్సితాః॥
కిముర్వ్యామవనీపాలా మద్బాహుబలభీరవః।
తేసర్వేసన్నతింయాతాజరాసంధమృతేగురుమ్॥
అమరేషుమమావజ్ఞాజాయతేదైత్యపుంగవాః।
హాస్యంమేజాయతేవీరా స్తేషుయత్నపరేష్వపి॥
తథాపిఖలుదుష్టానాం తేశామప్యాధికంమయా।
అపకారాయదై త్యేన్ద్రాయతనీయందురాత్మనామ్॥
కంసుడు:
ఓ ప్రలంబా! వీరాగ్రేసర! ఓ కేశి! ధేనుకా! పుతనా! అరిష్టాదులారా! మఱియుం గల మీరందఱు నా మాట నాలింపుడు. దురాత్ములగు దేవతలు నన్ను జంపు యత్నములో నున్నారు గదా! నేను వీరుడను. నా వీర్యముచే నట్టుడికి నట్లుడికిన వీరులను నేను లెక్క సేయను. అల్పబలుడగు నింద్రునిచే నొంటరిగ దిరుగు హరునిచే దొంగదారుల నసురులకు ఘాతసేయు హరిచే నేమగును? దేవతల లెక్కేమి? వసువులు నల్పవీర్యు లగ్నులు మఱియుం గల యెల్ల యమరులు నా బాహు బలమున డీలు వడిన వారి లెక్కేమి? అమరరాజు నాతో యుద్దమునకు నేను విసరిన యమ్ముల నెల్ల ఱొమ్మునంగాక పిఱదం తలగి పారిపోయినాడు మీరు చూడలేదా? నారాష్ట్రమున జినుకు వడకుండ నయ్యింద్రు డాపిన తఱి నా బాణములచే విడివిడి మేఘములు కుంభవృష్టి గురియ లేదా? ఈ యుర్వింగల యుర్వీశ్వరు లందఱు నా బాహు బలమునకు పిరికి పందలై నా గురువు (శ్వశురుడు) ఒక జరాసంధుడు తప్ప అందరు నాయడుగులం దలలు వంచినారు. దేవతలందు నాకు తిరస్కార భావమగు చున్నది. వారందులకు బూనుకోనుట యన్న నాకు నవ్వు వచ్చుచున్నది. అయినను నా దుష్టులు దురాత్ములు కపకారము సేసితీర వలసిందే. అవశ్యము పూనుకొన వలసినదే.
తద్యేయశస్వినః కేచిత్పృథివ్యాం యేచయజ్వనః।
కార్యోదేవాపకారాయతేషాం సర్వాత్మనావధః॥
ఉత్పన్నశ్చాపిమేమృత్యుర్భూతపూర్వస్సవైకిల।
ఇత్యేతద్దారికా ప్రాహదేవకీగర్భసంభవా॥
తస్మాద్భాలేషుచపరోయత్నః కార్యోమహీతలే।
యాత్రోద్రిక్తంబలంబాలే! సహా న్తవ్యః సహ న్తవ్యః ప్రయత్నతః॥
ఇత్యాజ్ఞాప్యాసురాన్ కంసః ప్రవిశ్యాశుగృహం తతః।
ముమోచవసుదేవం చదేవకీంచ నిరోధతః॥
అందువలన నెవ్వరు పుడమిపై పేరు మోసిన వారు యజ్ఞములు సేసిన వారుం గలరో వారివారిని దేవతల కపకారము చేయుటకై వెదకి వెదకి సర్వ విధముల వధింప వలసినదే. లోగడ నా పాలిట మృత్యువైన వాడు ఇపుడు మరల పుట్టినాడని దేవకి గర్భమందు పుట్టిన పసిపిల్ల చెప్పినది. కావున ఎక్కడ బాలులందు బలోద్రేకము గానబడు వానింబట్టి యీ పుడమిపై మట్టు బెట్టుటకు గట్టి యత్నము సేయ వలసినదే వానిం గడతేర్ప వలసినదే. అని యిట్లు కంసుండసుర కానయిచ్చి గృహమ్ము సొచ్చి దేవకీ వసుదేవులం కారాగారము నుండి విడిపించెను.
కంసుడు:
యువయోర్ ఘాతితాగర్ భావృథై వై తేమయాధునా।
కోప్యాన్య ఏవనాశాయమమగర్భస్సముద్యతః॥
తదలం పరితాపేన నూనంతద్భావినోహితే।
అర్భకా యు వయో ర్దోషాచ్చాయుశోయద్విమోజితాః।
అపుడు కంసుడు నేను మీ శిశువుల నకారనముగ జంపితిని. ఇపుడెవ్వడో యొక్కడు నా కొఱకొక్కిడ పుట్టి యున్నాడు. పరితాప పడకుడు! మీకు ముందేరుగడి కావలసిన పిల్లలు నిజముగా మీ దోషము (పాపము) చేత నాయువు గోల్పోజేయ బడినారు. ఇందు నా దోషమేమియు లేదని కంసుని భావము.
శ్రీపరాశరుడు:
ఇత్యాశ్వాస్యవిముక్త్వాచకంసస్తౌపరిశంకితః।
అంతర్ గృహం ద్విజశ్రేష్ఠ ప్రవివేశతతఃస్వకమ్॥
శ్రీపరాశరుడు:
అని యిట్లాశ్వాసించి యప్పటికిని మదిలో శంకవాయకయ యా దంపతులం విడిచి పుచ్చి యాపై కంసుడు తన యంతర్గృహము లోనికి జొచ్చెను.
Summary of chapter 4 of the Vishnu Mahā Purāṇa is as follows:
Kaṃsa, desperate after Yogamāyā's declaration, responds with systematic violence: he dispatches demonic agents throughout the land with orders to kill all powerful and extraordinary children born in recent times, so that the child prophesied to destroy him cannot survive.