శ్రీపరాశరుడు:
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే।
సదైక రూపరూపాయ విష్ణవే సర్వ జిష్ణవే॥
నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయచ।
వాసుదేవాయ తారాయ సర్గ స్తిత్యన్తకారిణే॥
ఏకానేక స్వరూపాయ స్థూలసూక్ష్మాత్మనే నమః।
అవ్యక్తవ్యక్త రూపాయ విష్ణవే ముక్తి హేతవే॥
సర్గ స్థితివినాశానాం జగతో యో జగన్మయః।
మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే॥
ఆధారభూతం విశ్వస్యా ప్యణీయాంస మణీయాసమ్।
ప్రణమ్య సర్వ భూతస్థ మచ్యుతం పురుషోత్తమమ్॥
జ్ఞానస్వరూప మత్యన్తనిర్మలం పరమార్ధతః।
తమేవార్థ స్వరూపేణ భ్రాన్తిదర్శనతః స్థితమ్॥
విష్ణుంగ్రసిష్ణుం విశ్వస్య స్థితౌసర్గే తథాప్రభుమ్।
ప్రణమ్య జగతామీశ మజన్మక్షయ మావయ్యమ్॥
కథయామి యథాపూర్వం దక్షాద్యైర్మునిసత్తమైః।
పృష్టః ప్రోవాచ భగవా నబ్జయోనిః పితామహః॥
తైశ్చోక్తం పురుకుత్సాయ భూభుజే నర్మదాతటే।
సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతేనచ॥
పరాశరుడు:
అవికారుడు = షడ్భావ వికారములు 1. ఉనికి, 2. పుట్టుట, 3. పెరుగుట, 4. తఱగుట, 5. పరినమించుట (మార్పు చెందుట), 6. నశించుట అను నాఱు వికృతులు లేనివాడు. శుద్దుడు (ఎట్టి గుణ సంగము లేనివాడు) నిత్యుడు నిత్యసత్తా స్వరూపుడు విష్ణువు (సర్వ వ్యాపకుడు) సర్వము జయించువాడు హిరణ్య గర్భుడు, సృష్టికర్త హరి శంకరుడు వాసుదేవుడు సర్వ దేవతలకు (జ్యోతి స్వరూపులకు) నివాసమైన వాడు తరింప జేయువాడు సృష్టి స్థితి లయములను జేయువాడు ఏకరూపము నానారూపము తానేయైన వాడు స్థూలము = సాకార సగుణ రూపము. సూక్ష్మము = అంతర్యామి జ్ఞాన రూపము నైనవాడు. ఆ విధముగ వ్యక్తము అవ్యక్తము నైనవాడు, ముక్తికి కారణమైనవాడు, జగన్నిర్మాణ పాలన లయములు చేయువాడు, అజరుడు (ముదిమి లేనివాడు), అమరుడు (మరణము లేనివాడు), సర్వమూలము (బీజము) నైనవాడు నైనయా పరమాత్మకు నమస్కారము, నమస్కరించుట యనగా ప్రహ్వీభావము విధేయుడననట అభేదాను సంధానము కూడ. ప్రపంచమున కాధారమైన వాడు అణువు కంటే వణువైన వాడు సర్వ భూతము లందుండు వాడు అచ్యుతుడు, జ్ఞానమూర్తి మిక్కిలి స్వచ్చ మైనవాడు పరమార్ధముగ నిర్మలుడు (గుణ సంగము లేనివాడు) భ్రాంతి దృష్టికి జగముగా (బీజము) నైనవాడు నైన సర్వ వ్యాపకుడు సర్వము కబళించు వాడు సృష్టి స్తితుల జేయు స్వతంత్రుడు సర్వజ్ఞుడు జగదీశ్వరుడు పుట్టుట హానివృద్దులు లేనివాడు బ్రహ్మ తెల్పిన పురాణ కథ నేను జెప్పుచున్నాను. దక్షాదులు పురుకుత్సుడను రాజునకు నర్మదా తీరమున నిది. తెల్పిరి. ఆ రాజు సారస్వతునికి నతడు నాకు నిద్దాని నెఱింగించెను.
పరః పరాణాం పరమః పరమాత్మాత్మ సంస్థితః।
రూపవర్ణ దినిర్దే శవిశేషణ వివర్జితః॥
అపక్షయవినాశాభ్యాం పరినామర్ ద్ధి జన్మభిః।
వర్జీ తశ్శక్యతే వక్తుం యస్సదాస్తీతి కేవలమ్॥
సర్వత్రాసౌ సమస్తంచ వాసాత్య త్రేతివైయతః।
తతస్సవాసుదేవేతి విద్వద్భిః పరిపఠ్యతే॥
తద్భ్రహ్మ పరమం నిత్య మజమక్షయమావయ్యమ్।
ఏకస్వరూపంతు సదా హేయాభావాచ్చనిర్మలమ్॥
తదేవ సర్వమేతచ్చ వ్యక్తావ్యక్త స్వరూపవత్।
తథా పురుష రూపేణ కాలరూపేణచ స్థితమ్॥
పరస్య బ్రహ్మణోరూపం పురుషః ప్రథమం ద్విజ।
వ్యక్తావ్యక్తే తథైవాన్యే రూపేకాల స్తథాపరమ్॥
ప్రథాన పురుషవ్యక్త కాలానాం పరమం హి యత్।
పశ్యన్తిసూరయశ్శుద్ధం తద్విష్ణోః పరమంపదమ్॥
ప్రథాన పురుషవ్యక్త కాలాస్తు ప్రవిభాగశః।
రూపాణి స్థితిసర్గాన్త వ్యక్తి సద్భావ హేతవః॥
వ్యక్తం విష్ణు స్తథాఽవ్యక్తం పురుషః కాల ఏవచ।
క్రీడతో బాలకస్యేవ చేష్టాం తస్య నిశామయ॥
అవ్యక్తం కారణం యత్తత్ప్రధాన మృషిసత్తమైః।
ప్రోచ్యతే ప్రకృతిస్సూక్ష్మా నిత్యం సదాసదాత్మకమ్॥
అక్షరంనాన్యదాధార మమేయ మజరంధ్రువమ్।
శబ్ద స్పర్శ విహీనంత ద్రూపాదిభిరసంయుతమ్॥
త్రిగుణం తజ్జగాద్యోనిరనాది ప్రభావాప్యయమ్।
తేనాగ్రేసర్వ మేవాసీద్వ్యాప్తం వై ప్రలయాదను॥
వేదం వాడవిదో బ్రహ్మనియతా బ్రహ్మవాదినః।
పఠన్తి చైతమేవార్ధం ప్రధాన ప్రతిపాదకమ్॥
పరమాత్మయను వస్తువొకటి యున్నది. అది సర్వజీవు లందు నాత్మ రూపమై యున్నది. అది నామరూప వర్గాది నిర్దేశము లేనిది. జన్మాది వికారము లేవియు లేనిది. అయినను నదియొకటి యున్నదని చెప్పుటకు శక్యమయినది. అంతట నంతయునై యున్నది. కావున విద్వాంసులు దానిని వాసుదేవుడని పేర్కొందురు. హేయోపాదేయాది విలక్షణమై నిత్యయై యున్న యా పరబ్రహ్మయే వ్యక్తరూపము నవ్యక్త రూపమునై పురుషుడు మొదలగు రూపముల వ్యవహరింప బడుచున్నను నదియాయా పురుషాదులకు సృష్టి స్థితి కాలము లందభి వ్యక్తమయి యున్నట్లుండును. వ్యక్తము నవ్యక్తము మొదలయిన యాయా పదార్ధములతో, నాగు నా వ్యవహారము పరబ్రహ్మకొక బాలక్రీడ, అవ్యక్తము కారణము, ప్రదానమునను బేరులం బ్రకృతి చెప్పబడును. అది సూక్ష్మము. సదా సదాత్మకము. ఉన్నదియు లేనిదియు నదే. అక్షరము మఱియొక యాధారము లేనిది యమేయము నజరము ధ్రువము శబ్ద స్పర్శములు లేనిది. రూపాదులతో గూడనిది. త్రిగుణాత్మకము జగత్కారణము అనాది సృష్టి మూలము అవ్యయమునైన యాయోక్క పదార్ధము చేతనే ప్రళయ కాలము నుండి యీ విశ్వము వ్యాప్తమయి యున్నది. వేదవాదులు, వేదవేత్తలు బ్రహ్మ నిష్టులు, నీ ప్రధాన ప్రతిపాదక మయిన విషయమునే వేదమని యధ్యయనము సేయు చుందురు.
నహోనరాత్రిర్నభో నభూమి ర్నాసీ త్తమో జ్యోతిరభూన్నచాన్యత్।
శ్రోత్రాదిబుద్ధ్యానుపలభ్యామేకం ప్రాధానికం బ్రహ్మపుమాంస్తదాసీత్॥
విష్ణోస్స్వరూపత్పరతోదితే ద్వే రూపేప్రధానం పురుషశ్చవిప్ర।
తస్యైవతేఽన్యేనధృతేవియుక్తే రూపాన్తరంతద్విజకాలసంజ్ఞమ్॥
ప్రకృతౌసంస్థితం వ్యక్తమతీతప్రలయేతుయత్।
తస్మాత్ర్పాకృతసంజ్ఞోయ ముచ్యతే ప్రతిసంచరః॥
అనాదిర్భ గవాన్ కాలోనాన్తోస్య ద్విజ! విద్యతే!।
అపునచ్చినాన్తతస్త్వేతే సర్గాస్తిత్యన్తసంయమాః॥
గుణసామ్యే తత్తస్తస్నమిన్ పృథక్ పుంసివ్యవాస్తితే।
కాలస్వరూపపంతద్విష్ణోర్మైత్రేయ! పరివర్తతే॥
తతస్తుతత్పరంబ్రహ్మ పరమాత్మాజగన్మయః।
సర్వగస్సర్వభూతేశస్సర్వాత్మా పరమేశ్వరః॥
ప్రధానపురుషౌచాపిప్రవిశ్యాత్మేచ్చయాహరిః।
క్షోభాయామాస సంప్రాప్తేసర్గాకాలేవ్యయావ్యయౌ॥
యథాసన్నిధిమాత్రేణగన్ధః క్షోభాయజాయతే।
మనసోనోపకర్త్రుత్వాత్తథాసౌపరమేశ్వరః॥
సఏ వక్షోభకోబ్రహ్మన్ క్షోభ్యశ్చ పురుషోత్తమః।
స సంకోచవికాసాభ్యాంప్రధానత్వేపిచస్థితః॥
ఆహోరాత్రాదులు పంచభూతములు ఇంద్రియముల కందవు. ప్రధాన వస్తువు అది యొక్కటియే. బ్రహ్మ మనబడున దొక్కటే ప్రపంచ మంతయు. జరిగి పోయిన ప్రళయ కాలమున ప్రకృతి యందు లీనమై యుండును. అదే ప్రాకృత సంచరమను పేరందును. కాలము భగవంతుడు. దానికి మొదలు తుదియును లేవు. అందుచేత నీ సృష్టి స్థితి లయముల కట్టుబాటు నరికట్టుటకు వశము గాదు. సత్వాది గుణముల యొక్క యా సామాన్యావస్థ యందు బురుషుడు వేఱే విడిపడి యున్న తఱి విష్ణువు యొక్క కాలస్వరూపము పరివర్తనము చెందుచునే యుండును. జరుగుచునే యుండును. కాని సర్వాంతర మైన పరామాత్మ వస్తువు హరి తన యిచ్ఛనుసారము వ్యయస్వభావమైన ప్రధాన మందు నవ్యయమైన పురుష తత్త్వము లందు గూడ సృష్టి కాలములో ప్రవేశించును. ఆ వస్తువు యొక్క సన్నిధాన మాత్రమున నా ప్రధాన పురుషాత్మక తత్త్వమందు క్షోభ జనించును. అయ్యెడ మనస్సు నిరుపకార మయినందున (స్తబ్ధమై యున్నందున) ఆ పురుషోత్తము డైన పరమాత్మయే క్షోభింప జేయువాడు. క్షోభింప బడునదియు దానేయై యుండును. ఒకపరి వెలికి, నొకపరి లోనికి (తాబేలు వలె) ముణుచు కొనుచు తానే మిగిలి యుండును. కావుననే ఈ స్థితిలో నాయున్న పదార్ధము ప్రధానమన బడినది. సర్వేశ్వరుడు విష్ణు విట్లు వికాస రూపుడు, అణు రూపమునై బ్రహ్మాది త్రిమూర్తులై వ్యక్త స్థితినందును.
వికాసాణు స్వరూపపైశ్చ బ్రహ్మ రూపదిబిస్తథా।
వ్యక్తస్వరూపశ్చతథా విష్ణుస్సర్వేశ్వరేశ్వరః॥
గుణసామ్యాత్తత స్తన్మాత్ క్షేత్రజ్ఞాదిష్ఠితాన్మునే।
గుణవ్యఞ్జనసంభూతిస్సర్గకాలే ద్విజోత్తమ॥
ప్రధాన తత్త్వముద్భూతంమహాన్తం తత్సమావృణోత్।
సాత్త్వికోరాజసశ్చైవ తామసశ్చత్రిదామహాన్॥
ప్రధానతత్వేన సమం త్వచాబీజమివావృతమ్।
వైవుకారికస్తైజసశ్చ భూతాదిశ్చైవ తామసః॥
త్రివిధోఽయమహంకారో మహత్తత్త్వదజాయత॥
భూతేన్ద్రియాణాంహేతు స్సత్రిగుణత్వా న్మహామునే।
యథాప్రదానేన మహామ్ హతా స తథావృతః॥
భూతాదిస్తూ వికుర్వాణః శబ్దతన్మాత్రకం తతః।
ససర్జశబ్దతన్మాత్రాదాకాశం శబ్ద లక్షణమ్॥
శబ్దమాత్రంతథాకాశంభూతాదిస్ససమావృణోత్।
ఆకాశస్తువికుర్వాణః స్పర్శమాత్రం ససర్జహ॥
బలవానభవద్వాయుస్తస్యర్శోగుణోమతః।
ఆకాశం శబ్దమాత్రం తుస్పర్శమాత్రం సమావృణోత్॥
తతోవాయు ర్వికుర్వాణోరూపమాత్రంససర్జహ।
జ్యోతిరుత్పద్యతేవాయోస్తద్రూపగుణముచ్యతే॥
స్పర్శమాత్రస్తువై వాయురూపమాత్రం సమావృణోత్।
జ్యోతిశ్చాపివికుర్వాణంరసమాత్రం స్ససర్జాహ॥
క్షేత్రజ్ఞునిచే నదిష్టితమైన యా గుణ సామ్యావస్థ నుండి సృష్టి సమయమందు గుణముల యభివ్యక్తి యావిర్భావ మగును. తొలుత భేదమున యా ప్రధాన తత్వము మహాతత్త్వము నావరించెను. ఆ మహాత్తత్త్వము బుద్ది. అది సాత్విక రాజస తామస భేదమున మూడు రకములగును. అది త్రిగుణాతమకము గావున భూతములకు నింద్రియములకు నదికారణ మగును. ఇట్లు ప్రదానముచే మహత్తు, మహాత్తుచే ప్రదానమును బరస్పర మావృతములయి నంతట భూతాదియైన యహంకార తత్త్వము తలుత శబ్దతన్మాత్రను వ్యాకరించెను. దాని నుండి శబ్ద తన్మాత్రమైన యాకాశామును సృజించెను. దానిని భూతాది యావరించెను. ఆకాశం వ్యాక్రుతమై స్పర్శను సృజించెను. అవ్వాల వాయు రూప తన్మాత్రను సృజించెను. వాయువు నుండి యగ్ని పుట్టినది దానికి రూపము గుణము. స్పర్శ తన్మాత్రమైన వాయువు నావరించినది. తేజస్సు వ్యాకరించుచు రస తన్మాత్రను సృజించెను.
సంభవన్తి తతోఽమ్బాంసి రసాధారాణితానితు।
రసమాత్రాణిచామ్భాంసిరూపమాత్రం సమావృణోత్॥
వికుర్వాణానిచా మ్భాంసిగంధమాత్రం సస్సర్జిరే।
సంఘాతో జాయతేతస్మాత్తస్యగన్దోగుణోమతః॥
తస్మిం స్తస్మింశ్చతన్మాత్రం తేన తన్మాత్రతాస్మృతా॥
తన్మాత్రాణ్యవిశేషాణి అవిశేషాస్తతోహితో॥
నశాన్తానాపిఘోరాస్తే నమూఢాశ్చావిశేషిణః।
భూతత్న్మాత్రసర్గోయమహంకారాత్తుతామసాత్॥
తైజసానీన్ద్రియాణ్యాహుర్దేవావైకారికాదశ।
ఏకాదశంమనశ్చాత్ర దేవావై కారికాస్మృతాః॥
త్వక్చక్షుర్నసికాజిహ్వా శ్రోత్రమాత్రచపఞ్చమమ్।
శబ్దాదీనామవాప్త్యర్ధంబుడ్డియుక్తానివై ద్విజ॥
పాయూపస్థౌకరౌపాదౌవాక్చామైత్రేయ పఞ్చమీ।
విసర్గశిల్పగత్యుక్తి కర్మ తేషాంచ కథ్యతే॥
ఆకాశ వాయు తేజాంసిసలిలం పృథివీతథా।
శబ్దాదిభిర్గుణై ర్ర్బహ్మన్ సంయుక్తాన్యుత్తరోత్తరైః॥
శాంతాఘోరాశ్చ మూఢాశ్చ విశేషాస్తేన తేస్మృతాః॥
దాని నుండి రసమునకు (రుచికి) నాధారము లయిన జలములు పుట్టినవి. అవి రూప తన్మాత్ర నావరించెను. రస తన్మాత్రము లయిన నీళ్ళు రూప తన్మాత్ర నావరించెను. నీళ్ళు వ్యాకృతి పొందినవై గంధ తన్మాత్రను సృష్టించెను. ఆ గంధ తన్మాత్ర వలన నొక సంఘాతము (ముద్ద) పుట్టినది. కావున దాని గుణము గంధమని చెప్ప బడినది. ఆకాశాదు లందు శబ్దాది గుణములు సూక్ష్మ రూపమున నున్నందున దానికి తన్మాత్ర యను పేరు వచ్చినది. త్న్మాత్రాల విశేష రూపములు గావుననవి శాంతములు, ఘోరములు, మూఢములును గావు. అవిశేషములు, భూత తన్మాత్రాల సృష్టి తమ సాహంకారము నుండి యైనది. తైజసాహంకార జన్యము లింద్రియములు వైకారికములు ననుపేర పది, పదకొండవది మనస్సు. త్వక్కు(చర్మము) చక్షుస్సు(కన్ను) శ్రోతము(చెవి) జిహ్వ(నాలుక) ఘ్రాణము(ముక్కు) ఇవి జ్ఞానేంద్రియములు. ఇవి శబ్దాది విషయ గ్రహణము కొఱకు బుద్దితో జత పడి యుండును. వాక్కు(నోరు) పాయువు(గుదము) ఉపస్థ(జననేంద్రియము) కరములు పాదములు కర్ణేంద్రియములు విసర్గ, శిల్ప, గతి, ఉక్తి యను పనులు చేయును. ఆకాశము, వాయువు తేజస్సు నీరు భూమియు శబ్దాది గుణములతో నొక దాని తరువాత నొకటి అధిక గుణములతో గూడియున్నవి. అందుచేనవి శంతములు, ఘోరములు, మూఢములనని విశేషములుగా చెప్ప బడినవి.
నానావీర్యాః పృథగ్భూతాస్తతస్తేసంహతింవినా।
నాశక్నువన్ ప్రజాః స్రష్టు మసమాగామ్య కృత్స్నశః॥
స మేత్యాన్యోన్య సంయోగం పరస్పరసమాశ్రయాః।
ఏకసంఘాతలక్ష్యాశ్చ సంప్రాప్యై క్యామశేషతః॥
పురుశాధిష్టితత్వాచ్చాప్యవ్యక్తానుగ్రహేణచ।
మహాదాద్యా విశేషాన్తా హ్యణ్డ ముత్పాదయన్తితే॥
తత్క్రమేణ వివృద్దంసజ్జలబుద్బుదవత్సమమ్।
భూతేభ్యోఽణ్డం మహాబుద్దే బృహత్తదుదకేషయమ్॥
ప్రాకృతం బ్రహ్మరూపస్య విష్ణోఃస్థానమనుత్తమమ్॥
తత్రావ్యక్తస్వరూపోసౌ వ్యక్తరూపోజగత్పతిః।
విష్ణుర్ బ్రహ్మస్వరూపేణ స్వయమేవవ్యవస్థితః॥
మేరు రుల్బ మభూత్తస్యకరాయుశ్చమహీధరాః।
గర్భోదకంసముద్రాశ్చ తస్యాసన్ సుమహాత్మనః॥
సాద్రిద్వీపసముద్రాశ్చసజ్యోతిర్లోకసంగ్రహః।
తస్మిన్నణ్డేభవద్విప్రసదేవాసుర మానుషః॥
నానావిధ శక్తులు గల్గి నానా రకములునైన యా గుణములు సంహతి లేకుండ (ఒక దానితో నొకటి యొత్తిడి నొందకుండ) ప్రజాసృష్టి చేయుట కసమర్థము లయ్యెను. అందువలన నవి పూర్తిగా గలిసికొని యొక దానికొకటి యాశ్రమమై యొకే సంఘాత మందు లక్ష్యము గొని యేకమయి పురుషాదిష్టితము లగుట వలన నవ్యక్తము యొక్క (అనుగ్రహము) అనుబంధము చేతను మహత్తు మొదలుగ వేశేషాంతము తుదదాక గూడి యొక యండమును జనింప జేయును. అది క్రమముగా భూతముల నుండి నీటి బుడగ వలె సమముగా మీదికి లేచినది. ఉదక మందంతట నావరించినది. అది బ్రహ్మ రూపుడగు విష్ణువు యొక్క ప్రాకృతమై యుత్తమ స్థానము. అవ్యక్త రూపుడుగా విష్ణువిందు వ్యక్తమయినాడు. అట్లండ రూపుడయిన ఈ హరికి మేరువు ఉల్బము (గర్భ వేష్టన మాంసము) పర్వతములు, జరాయువు (ఉల్పవేష్టనము) గర్భమందున్న యుదకము సముద్రాలు. ఆ యండమందు పర్వతములు ద్వీపములు జ్యోతిర్లోక సముదాయము దేవాసుర మనుషులతో గూడ నుండెను.
వారివహ్న్యనిలాకాశైస్తతోభూతాదినా బహిః।
వృతందశగుణై రణ్డం భూతాది ర్మహతాతథా॥
అవ్యక్తేనావృతో బ్రహ్మన్ తైస్సర్వైః సహితోమహాన్।
ఏభిరావరణై రణ్డం సప్తభిః ప్రాకృతైః వృతమ్॥
నారికేలఫలస్యాన్తబీజం బాహ్యదలై రివ॥
జుషన్ రజోగుణం తత్ర స్వయం విశ్వేశ్వరోహరిః।
బ్రహ్మాభూత్వాస్యజగాతో విసృష్టౌసంప్రవర్తతే॥
సృష్టంచ పాత్యమయుగం యావత్కల్పవికల్పనా।
సత్త్వభృద్భగవాన్ విష్ణు రాప్రమేయపరాక్రమః॥
తమోద్రేకీచ కల్పాన్తే రుద్రరూపీ జనార్దనః।
మైత్రేయాఖిలభూతాని భక్ష్య త్యతిభీషణః॥
సంభక్ష్య సర్వభూతాని జగత్యేకార్ణవీకృతే।
నాగపర్యఙ్కశయనే శేతేఽసౌ పరమేశ్వరః॥
ప్రబుద్దశ్చపునఃసృష్టిం కరోతి బ్రహ్మరూపధృత్॥
సృష్టిస్థిత్యన్తకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికామ్।
స సంజ్ఞాంయాతి భగవా నేకఏవ జనార్దనః॥
ప్రష్టాసృజతి చాత్మానంవిష్ణుః పాల్యంచపాతిచ।
ఉపసంహ్రియతేచాన్తే సంహర్తాచస్వయంప్రభుః॥
పృథివ్యాపస్తథా తేజోవాయురాకాశ ఏవచ।
సర్వేన్ద్రియాన్తః కరణం పురుశాఖ్యంహి యజ్జగత్॥
స ఏవసర్వభూతాత్మా విశ్వరూపోయతోవ్యయః।
సర్గాదికంతతోస్యైవ భూతస్థముపకారకమ్॥
స ఏవ సృజ్య స్సచసర్గాకర్తా సఏవపాత్యత్తిచ పాల్యతేచ।
బ్రహ్మాద్యవస్థాభి రశేషమూర్తిర్విష్ణు ష్ఠోవరదో వరేణ్యః॥
పదిరెట్లు జలాగ్ని వాయ్యాకాశ భూతముల చేతను అవ్వల భూతాదియైన యహంకార తత్వము చేతను అందమావృతమయి యున్నది. భూతాది మహత్తు చేతను మహత్తు అవ్యక్తము చేతను నావరింప బడి యున్నవి. ఈ యేడావరణములును ప్రాకృతములు ప్రకృతి మూలములు. దీనితో నండము కొబ్బరి కాయలోని బీజము వెలుపలి దిప్పచేత వలె నీ యేడావరణముల చేతను ఆవరింప బడియున్నది. విశ్వేశ్వరుడయిన విష్ణువు హరి రజో గుణమును బొంది బ్రహ్మయై యీజగము సృష్టించుటయందు బ్రవృత్తుడగును. సృజించిన దీనిని యుగానుసారముగా కల్ప వికల్పన యున్నంతవరకు సత్త్వగుణముంబూని విష్ణు వమేయ పరాక్రముడై రక్షించును. కల్పాంతము నందు తమో గుణోద్రేకము నంది జనార్ధనుడు రుద్ర రూపియై అతి భయంకరుడై యేళ్ళ భూతములం భాక్షిమ్చును. అన్ని భూతములం దిని జగత్తేక సముద్రమైనంత శేషశయనమందీ పరమేశ్వరుడు పరుండును. ఆపై మేల్కొని బ్రహ్మ రూపియై మరల సృష్టి చేయును. ఒక్కడే భగవంతుడు శ్రీహరి. సృష్టి, స్థితి, లయకారిణి బ్రహ్మ విష్ణు శివాత్మిక యునుగా శక్తియను పేరందును. స్రష్టయై తనను దా సృజించును. విష్ణువై పాలింప వలసిన దానిని పాలించును. స్వయంప్రభువై చివర సంహర్తయై దీని నుపసంహరించును. పృథివ్యాప స్తేజో వాయురాకాశములు జ్ఞాన కర్మేంద్రియములు. అంతఃకరణ పురుషుడనబడు తత్త్వము జగత్తును ఆ విష్ణువే. సర్వభూతాత్మా విశ్వరూపుడు నయినా యవ్యయుడాయనయే. భూతము లందలి సృష్ట్యాది కార్యమెల్ల యా యనకుపకారకమే. ఆ హరియే సృజింప బడిన వస్తువు. సృజించు వాడు వరేణ్యుడు బ్రహ్మాది వివిదావస్థలచే సర్వమూర్తి వరదుడు వరేణ్యుడు వరిష్ణుడునగు నాహరియే సృజ్యుడు సృజింపబడు సర్వము. ఆయనయే సర్గాకర్త. ఆయనయే పాలించును. భక్షించును. పాలింప బడును.
Summary of chapter 2 of the Vishnu Mahā Purāṇa is as follows:
A systematic account of Vedic time measurement beginning from the smallest unit (paramāṇu — the indivisible atom of time) through nimesa, kāṣṭhā, kalā, muhūrta, ahorātra, pakṣa, māsa, ṛtu, ayana, saṃvatsara, up to the divine year, mahāyuga (catur-yuga), manvantara, and kalpa. Brahmā's full lifespan (100 Brahmā-years = parārdha × 2) and the current position in cosmic time are established. The present kalpa is identified as the Vārāha Kalpa.