శ్రీపరాశరుడు:
కాశ్యప దుహితా సుమతిర్ విదర్భరాజ తనయా కేశినీ చద్వేభార్యే సగర స్యాస్తామ్॥
తాభ్యాంచాపత్యార్థమౌర్యః పరమేణ సమాధినాఽఽరాధితో సవరమదాత్॥
ఏకావంశకరమేకంపుత్రమపరాషష్టింపుత్రా సహస్రాణి జనయష్యతి,
యస్యాయదభిమతంతదిచ్ఛయా గృహ్యతామిత్యాకర్ణ్యకేశిన్యేకంవరయమాస॥
సుమతిః పుత్రసహస్రాణి షష్టింవవ్రే॥
తథేత్యుక్తే ఆల్పైరహోభిః కేశినీపుత్రమేకమసమఞ్జసనామానం వంశకరమసూత॥
తస్మాదసమఞ్జసాధం శుమన్నామకుమారోజజ్ఞే॥
సత్వసమఞ్జసోబాల్యాదేవాసద్వ్రుత్తోఽభూత్॥
పితాచాస్యాచిన్తయత్ అయమతీతబాల్యస్సుసుద్దిమాన్ భవిష్యతీతి॥
అథతత్రావేవవయస్యతీతే అసచ్చరితమేవైనం పితా తత్యాజ॥
తన్యాపిషష్టిః పుత్రసహస్రాణి అసమఞ్జసచరితమే వానుచక్రుః॥
తతశ్చాసమఞ్జసచరితానుసారిభిస్సాగరైరపధ్వస్తే యజ్ఞాదిసన్మార్గే జగతి దేవాస్సకల విద్యామయ
మసంస్సృష్టమశేషదోషైర్భగవతః పురుషోత్తమస్యాంశభూతం కపిలం ప్రణమ్య తదర్థమూచుః॥
భగవన్నేభిః సగరతనయైరసమజసచరితమనుగమ్యతే॥
కథమేభిరసద్వృత్తమనుసరద్భిర్జవిష్యతీతి ఆర్తజగాత్పరిత్రాణాయచభగవతోఽత్రశరీర
గ్రహణ మిత్యాకర్ణ్య భగవా నల్పై రేవాహోభిః వినఙ్ క్ష్యన్తీత్యుక్తవాన్॥
అత్రాన్తరేచ సగరోఽశ్వమేధమారభత॥
తత్రచపుత్రైరధిష్టిత మస్యాశ్వం కోఽప్యపహృత్య భువోబిలం ప్రవివేశ॥
తతశ్చతత్తనయాః ఆశ్వఖురగతినిర్భన్దేనవసుధాతలమేకైకం యోజమవనే శ్చచఖ్నుః॥
పాతాళేచాశ్వం పరిభ్రమన్త మవనిపతి తనయస్తే దద్రుశుః॥
నాతిదూరావస్థితంచ భగవన్తమపఘనేశరత్కాలేఽరకమివవతేజోభిరనవరతమూర్ ధ్వమధ శ్చాశేషదిశాశ్చోద్భాసమయానం కపిలర్షి మపశ్యన్ ॥
తతశ్చోద్యతాయుధా దురాత్మానిహయహర్తాఽయమస్మదపకారీ యజ్ఞవిఘ్నకర్తా హన్యతా మిత్యవోచంనంవధావంశ్చ॥
తతస్తేనాపిభగవతాకించిదీషత్పరివర్తితలోచనే నావలోకితాః స్వశరీర సముత్థే నాగ్నినా దాహ్యమానా వినేశుః॥
సగరోఽప్యవగ మ్యాశ్వానుసారితత్పుత్రబలమశేషం పరమర్షిణా కపిలేన తేజసా దగ్ధమ్;
తతోఽం శుమన్తమ సమాజసపుత్ర మాహూ యాశ్వాన్వేషణాయ యుయోజ॥
సతుసగరతనయఖాతమార్గేణకపిలముపగమ్యభక్తినమ్రస్తథాతుష్టావ॥
అథై నంభగవానాహ॥
గచ్చైనంపితామహాయాశ్వం ప్రాపయ వరం వృణీష్వ పుత్రపౌత్రస్తేస్వర్గాద్గాఙ్గాం భువమానాయిష్యతీతి॥
అథాంశుమానపిబ్రహ్మదణ్డహతానామస్మత్పితౄణాంస్వరగాయోగ్యానాంస్వర్గ।
ప్రాప్తికరం వరమస్మాకం భగవాన్ ప్రయచ్చ త్విత్యాహ॥
తదార్ కణ్యతం చాహభగవాన్ ప్రయచ్చ త్విత్యాహ॥
తదమ్భసాచసం స్పృష్టేష్వస్థిభస్మస్వేతే స్వర్గామారోక్ష్యన్తి॥
భగద్విష్ణుపాదాఙ్గుష్ఠ వినిర్గతస్యహిజల స్యైత న్మాహాత్మ్యమ్॥
యన్నకేవలామాభిసన్ధి పూర్వకం స్నానాద్యుపభోగేషూపకారకం కింతు అనభిసంధితమాప్యస్యప్రేత ప్రాణస్యభస్మాస్థిచర్మస్నాయుకేశాద్యుత్సృష్టం శరీరజం యదపితం సద్యః శరీరిణం స్వర్గం నయతీత్యుక్తః ప్రణమ్య భగవతేఽశ్వమాదాయ పితామహ యజ్ఞమాజగామ॥
సగరోఽప్యశ్వమాసాద్యతం యజ్ఞం సమాపయామాస॥
సాగరంచ స్వాత్మజప్రీత్యా పుత్రత్వేకల్పితవాన్॥
తస్యాప్యంశుమతోర్దిలీపః పుత్రోభవత్॥
దిలీపస్యాపిభగీరథః యోఽసౌగఙ్గాం స్వర్గాదిహానీయ భాగీరథీ సంజ్ఞాం చకార॥
శ్రీపరాశరుడు:
సగరుని భార్యలిద్దరు. కాశ్యపపుత్రి సుమతి. విదర్భ రాజపుత్రి కేశిని. వారి వలన సంతానము గలుగ మౌర్వుని పరమ సమాధి నా సగరుడారాధింప నతడు వర మిచ్చెను. ఒకతె వంశోద్దారకుని నొక్కనిని ఇంకొక యావిడ అరువది వేలమంది కొడుకులం గనునని యతడ నుగ్రహించెను. ఇందెవతె ఏదికోరునో తెల్పుమనియే. కేశిని యొక్క కొడుకుం గోరెను. సుమతి యరువది వేలమంది గావలె ననెను. ఔర్యుడు సరియనెను. కొలది దినములలో కేశిని యొక్క పుత్రుం గనెను. అత డసమంజసుడను పేరువాడు. వంశకరుడు కాశ్యప తనయ సుమతి కరువది వేలమంది సుత లుదయించిరి. అసమంజసునికి కుంశుమంతుడు పుట్టెను. ఆ అసమంజసుడు బాల్యము నుండి చెడ్డ నడతలో నుండెను. వీడు బాల్యం గడచి బుద్దిమంతుడు గాగలడని తండ్రి యూహించెను. కాని యప్పుడును నసచ్చరిత్రుడయి యుండుట జూచి తండ్రి వానిని త్యజించెను. ఆ యరువది వేలమంది కొడుకులును నసమంజస చరిత్రమునే యనుకరించిరి. అవ్వల గూడ యసమంజసు ననుకరించు సాగరుల చేత యజ్ఞాది సన్మార్గము చేసి దేవతలు సకల విద్యారూపుని అశేష దోష సంస్పర్శ లేని వానిని భగవంతుడు పురుషోత్తముని యంశమైన వానిని కపిలుని నరసి ప్రణమిల్లి యిట్లనిరి. ఈ సగర పుత్రు లసమంజసుని నడవడి ననుగమించు చున్నారు. ఈ దుర్వృత్తుల చేత జగమే మగునో కదా. ఆర్త జగద్రక్షణ కొఱకు గదా భగవంతుడగు నీవు శరీరము గ్రహించితి వన విని యమ్ముని కొలది దినములలో వారు నశింప గలరనియె. ఈలోన సగరు డశ్వమేధ మారంభించెను. అరువది వేలమంది కొడుకులు రక్షకులుగా వెంబడించిన యా గుఱ్ఱము నేవ్వడో హరించి నిలమందు ప్రవేశించెను. అటుపై సగర పుత్రులు గుఱ్ఱము డెక్కల గుర్తులం బట్టిపోయి యోక్కొక్క యోజన మొక్కొక్కడుగ మేదినీతలముం ద్రవ్విరి. పాతాళ మందాహయము తిరుగుచుండ జూచిరి. అతని దూరమందున్న తేజోమూర్తిని మబ్బులు తొలగిన శరత్కాల మందలి సూర్యుడట్లు తన తేజస్సులచే నెడతెగకుండా క్రిందు మీదున నన్ని దెసలను నుద్భాసింప జేయుచున్న కపిల మహర్షిం గనిరి. మఱియు దురాత్ములై యాయుధము లెత్తికొని గుఱ్ఱము దొంగ యిడుగో యీ యజ్ఞ విఘ్నకారి నపకారిని జంపుదామని అతని మీదికి బరువెత్తిరి గూడ. అటుపై నిట్టిట్టు త్రిప్పిన యాతని చూపున బడి వారు తమ శరీరమందు పుట్టిన యగ్నిచే దహింప బడి నశించిరి. సగరుడును గపిల మహర్షి తేజమ్మున నశ్వానుసారియైన పుత్ర బలమెల్ల మసియయ్యెనని దెలిసికొని యాసమంజసుని కొడుకు నమ్శుమంతుని పిలిచి యశ్వాన్వేషణమునకు నియోగించెను. అతడును సాగరులు ద్రవ్విన దారింబట్టి చని కపిలుని దరికి వచ్చి భక్తి నమ్రుడై యప్పర మహర్షిని స్తుతించెను. అంత నమ్ముని యతని కిట్లనియె. ఈ యశ్వమును బితామహునికిం జేర్పుము. వరము గోరుకోనుము. నీ కొడుకు మనుమడు ప్రపౌత్రుడు (ముని మనవడు) స్వర్గము నుండి గంగను బుడమికి గొనిరాగల డనియె. అంత నంశుమంతుడును బ్రహ్మదండ హతులైన మా పితరులకు స్వర్గమున కయోగ్యు లయిన వారికి స్వర్గప్రాప్తి గూర్చు వరమును మాకు కపిల భగవాను డనుగ్రహించు గాకనియె. అది విని కపిల మహర్షి నేనంటిని గదా! నీ ముని మనుమడీ భూలోకమునకు స్వర్గము నుండి గనగను గొని రాగలడని ఆ గంగోదకముచే నీ యెముకలు బూడిదయు దడిసినంత మీ తాతలు స్వరము నెక్కగలరని. విష్ణు భగవానుని పాదము బొటన వ్రేలినుండి వెడలిన నీటికీ మహిమ గలదు. కేవలమభి సంధి పూర్వకము (సంకల్పముతో జేయబడినది) గానక్కర లేదు. స్నానాద్యుప భోగములందీ పవిత్ర తీర్థము యథాలాపముగ నేని తాకిన నిది ప్రేత ప్రాణి యోక్క (మరణించిన వాని యొక్క) బూడిద యెముకలు చర్మము ప్రేగులు కేశములు మొదలయిన శరీర భాగమేది యిందు విడువ బడినది యా క్షణము యా శరీరిని (జీవుని) స్వర్గమునకుం గొని పోవునన విని యాత దమ్మునికి బ్రణతుడై సెలవు గొని గుఱ్ఱముం గొనివచ్చి పితామహుని జన్నమున కేతేంచినను సగరుండు నయ్యశ్వముం యజ్ఞముం బూర్తి చేసెను. అతడు పుత్ర ప్రీతితో సాగరమును దన పుత్రుడుగా గల్పించు కొనెను. ఆ యంశుమంతునికి దిలీపుడు అతనికి భగీరాథుడు గల్గిరి. అతడే స్వర్గము నుండి గంగ నిక్కడకు గొనివచ్చి భాగీరథి యను పేరెందిన దానింగా నామేను గావించెను.
భగీరథాత్సుహోత్రస్తస్యాపినాభాగాస్తతోమ్బరీషస్తత్పుత్రస్సిన్దుద్వీపాదయుతాయుః॥
తత్పుత్రశ్చఋతుపర్ణోనలసహాయోఽక్షహృదయజ్ఞోభూత్॥
ఋతుపర్ణపుత్రాస్సరకామః॥
తత్తనయస్సుదాసః॥
సుదాసత్సౌదాసో మిత్రసహోనామ॥
సచాటవ్యాంమృగయర్థమటన్ వ్యాఘ్రద్వాయ మపశ్యత్॥
తాభ్యాంచతద్వానమపగత మృగంకృతంమత్వైకంతయోర్బాణేన జఘాన॥
మ్రియమాణశ్చాసావతిభీషణాకృతి రతికరాళ వదనో రాక్షసోఽభూత్॥
ద్వితీయోఽపి ప్రతిక్రియాం తే కరిష్యామీత్యుక్త్వాఽన్తర్ధానం జగామ॥
కాలేనగచ్చతాససౌదాసోయజ్ఞ మయజయత్॥
పరినిష్ఠిత యజ్ఞేచాచార్యేవసిష్ఠేనిష్క్రాన్తేతద్రక్షోవసిష్ఠరూపమాస్థాయయజ్ఞావసానేమమ
మనుష్యమాంసభోజనందేయం తత్సంస్క్రియతాం క్షణాదా గమిష్యామీత్యుక్త్వానిష్క్రాన్తః॥
భూయస్సూదవేషంకృత్వారాజాజ్ఞయామానుషమాంసం సంస్కృత్య రాజ్ఞే న్యవేదయత్॥
అసావాపిహిరణ్యపాత్రస్థితమాంసమాదాయ వసిష్ఠాగమనప్రతీక్షోఽభవత్॥
ఆగతాయవసిష్ఠా యచనివేదితవాన్॥
భగీరథునికి సహోత్రుడు అతనికి నాభాగుడు అతనికి అంబరీషుడు, సింధుద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు వరుసగా తండ్రి కొడుకులయిరి. ఋతుపర్ణుడు నలునికి సహాయుడై యుండెను. అతడు ‘అక్షహృదయము’ పాచికలను గూర్చిన విద్య నెఱింగిన వాడై సర్వసకాముడు సుదాసుడు(సౌదాసుడు) మిత్రసహుడుగా వంశ వృక్ష క్రమము సాగెను. మిత్రసహుడు వేటకై యదవిం దిరుగుచు రెండు పెద్ద పులులం జూచెను. ఆ రెండింటి చేత నవ్వనము జంతువన్నది లేకుండా జేయ బడెనని తెలిసి యందొక దాని బాణమునం గొట్టెను. అది చచ్చుచు నతిభీషణాకృతియు వికృత కరాళ వాడను డయిన రాక్షసుండయ్యె. రెండవ పులి నీ ప్రతిక్రియ చేసెద లెమ్మని యంతర్ధాన మొందె, కొంతకాల మరుగ నీ సౌదాముడు యజ్ఞము చేసెను. యజ్ఞము సమాప్తియై వశిష్ఠుండు సన నా రక్షస్సు వశిష్టు రూపుగొని యజ్ఞావసాన మందు నాకు మనుష్య మాంస భోజనము పెట్టుము. దానికి సంస్కారము సేయుమని ఇదిగో క్షములో వత్తునని వెళ్లి పోయెను. మరల వంటవాని వేషముతో రాజునాజ్ఞచే మానుష మాంసమును సంస్కరించి తెచ్చి రాజునకు నివేదించెను. ఈ రాజును బంగారు పాత్రము నందున్న మాంసము గొని వశిష్ఠుని రాక కెదురు చూచు చుండెను. అంతలో వశిష్ఠుడు రాగా నదియాయనకు నివేదించెను.
సదాప్యచిన్తయత్ అహోఽస్యరాజ్ఞోదౌశ్శీల్యం యేనైతన్మాంసమస్మాకం ప్రయచ్చతి
కిమేతద్ద్రవ్యజాతమితిధ్యానపరోఽభవత్॥
అపశ్యచ్చతన్మానుషమాంసమ్॥
అతః క్రోధకలుషీకృతచేతా రాజనిశాపముత్ససర్జ॥
యస్మాద్భోజ్యమేత దస్మద్విదానాం తపస్వినామ్ అవగచ్చన్నపిభవాన్మహ్యం దదాతితస్మా త్తవైవాత్రలోలుపతాభవిష్యతీతి॥
అనన్తరంచ తేనాపిభగవతై వాభిహితోఽస్మీత్యుక్తే కింకింమయైవాభిహితమితి పునరపిసమాధౌతస్థౌ॥
సమాధి విజ్ఞానావగతార్థశ్చానుగ్రహం తస్మైచకార నాత్యన్తికమేతద్ధ్వాదశాబ్దం తవ భోజనం భవిష్యతీతి॥
ఆహా! ఈ రాజు తప్పునడత వింతయైనది. ఈ మాంసము నాకు బెట్టు చున్నాడు. ఈ ద్రవ్య రాశి యేమని ధ్యానపరుండయ్యెను. అందది మనుష్య మాంసమని కనుగొనెను. అందు వలన కోపముచే మనసు కలుషితమై మావంటి తపస్వులకు దినరానిదని తెలిసియు దీనిం బెట్టితివి గావునా నీకే ఈ యపవిత్ర పదార్థముపై నభిలాష కలుగు గాక! యని రాజును శపించెను. అనంతర మారాజు స్వామీ! తాము నన్నిట్లన్నారు శపించి నారేమని తెలుప ఏమేమి! నేనే యిట్లంటినా యని మరల నమ్మహర్షి సమాది యందు నిలిచెను. దాన జరిగిన దవగతమై యా ఱేనియెడ దయగొని ఈ మనుష్య మంసాశన మాత్యంతికము గాదు (నిరంతరము గాదు), పండ్రెండేండ్లు మాత్రమె యిది నీకు భోజన మగునని యనుగ్రహించెను.
అసావపిప్రగృహయోదకాఞ్జలిం మునిశాపప్రదానా యోద్యతో భగవన్నాయమస్మద్గురుర్నార్హ
స్యేనంకులదేవతాభూత మాచార్యం శప్తుమితిమదయన్త్యా ప్రసాదితః సస్యామ్భుదరక్షణార్థం
తచ్చాపామ్భు నోర్వ్యాం నచాకాశే చిక్షేప కింతుతేనైవ స్వపాదౌ సిషేచ॥
తేనక్రోదాగ్న్యాశ్రితేనామ్భునా దగ్ధచ్ఛాయౌ తత్పాదౌకల్మాషతా ముపగతౌ।
తతస్సకల్మాషపాదాసంజ్ఞామవాప॥
ఆ రాజు గూడ జలాంజలింగొని మునికి ప్రతిశాప మీయనుద్య మించినంత స్వామీ! ఈయన మన గురువు మన కులదేవత యైన యాచార్యు నీయనను శపింప దగదని మదయంతి (పత్ని) బ్రతిమాల నిటు పంటను నటు మేఘములను రక్షింప దలచి యా శాపోదకములు నేల మీదను ఆకాశము నందును జల్లక దానిచే తన పాదములను దడిపి కొనెను. కోపాగ్ని నంటిన యా నీట వాని పాదములు గాలి మిక్కిలి వన్నె దరిగెను, దాన నతడు కల్మషపాదుడని పేరందెను.
వసిష్ఠశాపాచ్చషష్ఠెషష్ఠేకాలేరాక్షసస్వభావముపే త్యాటవ్యాంపర్యటన్ అనేకశోమానుషానభక్షయత్॥
ఏకదాతు కంచిన్ముని మృతుకాలే భార్యాంసగతం దదర్శ॥
తయోశ్చత మతిభీషణం రాక్షసరూప మవేక్ష్యత్రాసాద్దంపత్యోః ప్రధావితాయోః బ్రాహ్మణం జగ్రాహ॥
తతస్సాబ్రాహ్మణీ బహుశ స్తమభియాచితవతీ॥
ప్రసీదేక్ష్వాకుకులతిలకభూతస్త్వం మహారాజోమిత్ర సహోనామ, నరాక్షసః॥
నార్హసిస్త్రీధర్మసుఖాభిజ్ఞోమయ్యకృతార్తాయా మిమ మస్మద్భర్తారం హన్తుమిత్యేవం
బహుప్రకారం తస్యాం విలపన్త్యాం వ్యాఘ్రః పశుమివారణ్యేభిమతంతం బ్రాహ్మణ మభక్షయత్॥
తతశ్చాతి కోవసంన్వితాబ్రాహ్మణీతం రాజానం శశాప॥
యస్మాదేవంమయ్యతృప్తాయాం త్వయాఽయం మత్పతిర్భక్షితస్తస్మాత్త్వమపికామోపభోగ
ప్రవృత్తోఽన్తం ప్రాప్ర్స్యసీతి॥
శప్త్వాచైవంసాఽగ్నిం వివేశ॥
తతస్తస్యద్వాదశాబ్దవిపర్యయేవిముక్త శాపస్య స్త్రీ విషయాభిలాషిణోమదయన్తీతం స్మారయామాస॥
తతః పరమసౌస్త్రీభోగం తత్యాజ॥
వసిష్ఠశ్చా పుత్రేణ రాజ్ఞాపుత్రార్థమభ్యర్థితోమదయన్త్వాగర్భాధానంచకార॥
యదాచసప్తాష్టవర్షాణ్యసౌగర్భోనజజ్ఞే తతస్తంగర్భమశ్మనా సాదీవీజఘాన॥
పుత్రశ్చజాయత॥
తస్యఛాశ్మకిత్యేవనామాభవత్॥
ఆశ్మకస్యమూలకోనామపుత్రోఽభవత్॥
వశిష్ఠ శాపముచే పండ్రెండేండ్ల కాలము నందు రాక్షస స్వభావము గొని యడవి యందరుగుచు ననేక మనుష్యులను దినివేసెను. ఒకప్పుడొక మునిని భార్యా సంగతుడై యుండ జూచెను. వాని భీషణ రాక్షస ఆకారము చూసి హడలి యా దంపతులు పారిపోవు చుండ వాడు బ్రాహ్మణుం బట్టెను. అంత ఆ బ్రాహ్మణి పెక్కు తెరగుల భర్త నిమ్మని యాచించెను. దయ సూపుము. నీ విక్ష్వాకుకుల తిలకుడవు. మహారాజువు మిత్ర సహుడవు నా యెడ గృతార్థుడు గాని యీ నా భర్తను జంప దగదని అనేక ప్రాకారముల నామె ఏడ్చుచుండ నా పులి జంతువుం దినట్లు యా విప్రుని దిని వేసెను. అందుచే నతి కోపమును గని యా బ్రాహ్మణి యా రాజును శపించెను. నేనీ విప్రుని తోడి సుఖమున నసంతృప్తురాలనై యుండ నా భర్తం దింటివి కావున నీవు కామోపభోగ ప్రవృత్తుడవై యున్న తరిం జావొందెదవు గాక యని శపించెను. ఇటు శపించి యామె యగ్ని ప్రవేశము చేసెను. అటుపై పండ్రెండేళ్ళు స్త్రీ విషయాభిలాషియై యున్న గడువ శాపముక్తి నంది స్త్రీవిష యాభిలాషియై యున్న యాతనికి మదయంతి జ్ఞాపకము చేసెను. ఆ మీదట నతడు స్త్రీ భోగము ద్యజించెను. అపుత్రకుండై యారాజు పుత్రార్థమై యాచింప వశిష్ఠుండు మదయంతికి గర్భా దానమును జేసెను. ఏడెనిమిదేండ్లకు కూడ శిశువు జనింప కున్నంత నా దేవి (ఆశ్మతో) రాతితో గర్భముం గొట్టికొనెను. అంత పుత్రుండు బుట్టెను. వానికి అశ్మకుడనియే పేరయ్యెను. అశ్మకునికి మూలకుడు కొడుకయ్యెను.
యోఽసౌనిః క్షత్రేక్ష్మాతలేఽస్మిన్ క్రియమాణే స్త్రీ భిర్వివస్త్రాభిః పరివార్య పరిరక్షితః తతస్తం
నారీకవచం సముదాహరన్తి॥
మూలకాద్దశరథః తస్మాదిలిబిలః తతశ్చ విశ్వసహః॥
తస్మాచ్చాఖట్వాఙ్గః యోఽసౌదేవాసురాణాం సంగ్రామే దేవై రభ్యర్థితోహ్యసురాన్ జఘాన॥
స్వర్గేచకృతప్రియైర్దేవైర్వరగ్రహణాయచోదితః ప్రాహ॥
యద్యవశ్యం వరోగ్రాహ్యస్తన్మమాయుః కథ్యతామితి॥
అనన్తరం చతైరుక్తమేక ముహూర్త ప్రమాణం తవాయురిత్యుక్తోఽథాస్ఖలితగతినావిమానేన
లఘిమ్నాయుక్తోమర్ త్యలోకమాగమ్యేదమహ॥
యథాన బ్రాహ్మణేభ్యస్సకాశాదాత్మాపిమేప్రియతరః నచ స్వధర్మోల్లఙ్ఘనం
మయాకదాచిదప్యనుష్టితం నచ సకల దేవమానుషపశుపక్షివృక్షాదికేష్వప్యచ్యుత
వ్యతిరేకవర్తినీ దృష్టి ర్మాభూత్ తథా తమేవదేవం మునిజనాను స్మృతం భగవన్త మస్ఖలితగతిః ప్రాప్స్యా మీత్యశేషదేవగురౌభగవ త్యనిర్దేష్యవపుషి సత్తామాత్రాత్మన్యాత్మానం
పరమాత్మనివాసుదేవాఖ్యేయు యోజ తత్రైవచ లయమవాప॥
అత్రాపిశ్రూయతేశ్లోకోగీతస్సప్తర్షిభిః పురా! ఖట్వాఙ్గేన సమోనాన్యః కశ్చి దుర్వ్యాం భవిష్యతి॥
యేనస్వర్గాదిహాగత్య ముహూర్తం ప్రాప్యజీవితమ్।
త్రయోఽనుసందితాలోకా బుద్ద్యాసత్యేనచై వహి॥
ఖడ్వాఙ్గాద్దీర్ఘబాహుః పుత్రోఽభవత్॥
తతోరఘురభత్॥
తస్మాదప్యజః॥
అజాద్దశరథః॥
పరశురాముడు క్ష్మాతలము నిః క్షత్రియ మొనరింప స్త్రీలు వివస్త్రలై చుట్టు వారుకొని ఈతనిని రక్షించిరి. అందువలన నతనిని నారీకవచుడని పిలుతురు. మూలికుని వలన దశరథుడు వాని వలన ఇలిబిలుడు వానికి విశ్వసహుడు వానికి ఖట్వాంగుడు గల్గిరి. ఖట్వాంగుడు దేవాసుర సంగ్రామమందు దేవత లర్థింప నసురులం గూల్చెను. స్వర్గమందు గూడ తమకు బ్రియము సేసినాదని వారము గోర ప్రేరేపితుడై వరము గ్రహింపక తప్పదందు రేని నా యాయుర్థాయమెంతో చెప్పుదని వేల్పులం గోరెను. ఆ పైని వారు ఒక ముహూర్త మాత్రమనిరి. అంతట నస్ఖలితయైన లఘువైన (మిక్కిలి తేలిక యైన) విమానమున మర్త్య లోకమునకు వచ్చి యిట్లనియె. బ్రాహ్మణుల కంటె నాకు ఆత్మగూడ ప్రియతరము గానట్లు, ఎన్నడేని స్వధర్మమును నేను ల్లంఘింపని యట్లు, సకల దేవ మానుష పశు పక్షి వృక్షాదులందచ్యుతుని కంటె వేరైనా దృష్టి కలుగ కుండునట్లు, ఆ దేవుని ముని జనాను స్మృతుని భగవంతునే యస్ఖలిత గతినై పొంద గల్గునట్లు, కోరి దేవగురువు అనిర్దేశ్య రూపుడు సత్తామాత్రుడు నైన వాసుదేవు డనబడు ఆత్మయందు ఆత్మను సంయోజించి యందె లయ మొందెను. సాయుజ్య ముక్తి వడసె నన్నమాట. యీతని విషయమున మున్ను సప్తర్షులు గానము సేసిన (గీతము) శ్లోక రూపమిది వినబడును. దాని భావమిది. ఏ మహానుభావుడు స్వర్గము నుండి యిటకు వచ్చి ముహూర్త మాత్రాయుర్దాయమును బొంది జ్ఞానముచే సత్యముచే ముల్లోకాల ననుసంధించెనో అట్టి ఖట్వాంగూని సమానమైన వాడవని పైనింకొకడు లేడు, ఉండబోడు. ఖట్వాంగునికి దీర్ఘబాహువు వానికి రఘువు వానికి అజుడు, అజునికి దశరథుడును పుత్రులైరి.
తస్యాపి భగవానబ్జనాభోగతః స్థితత్యర్థమాత్మాంశేన రామలక్ష్మణ భరత శత్రుఘ్ను రూపేణ చతుర్థా పుత్రత్వమయాసీత్॥
రామోఽపిబాల్య ఏవ విశ్వామిత్ర యజ్ఞ రక్షణాయగచ్చం స్తాటకాం జఘాన॥
యజ్ఞేనేచామారీచమిషుపాతాహతం సముద్రేచిక్షేప॥
సుబాహుప్రముఖాం శ్చక్షయమనయత్॥
దర్శన మాత్రేణైవ అహల్యా మాపాపం చకార॥
జనక గృహేచ మాహేశ్వరం చాప మనాయాసేన బభాజ్ఞ॥
సీతాంచాయోనిజాం జనక రాజతనయాం వీర్యశుల్కాం భేజే॥
సకలక్షతక్షయకారిణ మశేషహైహయకులధూమ కేతుంచ పరశురామ మపాస్త వీర్య బలావలేపం చకార॥
పితృవచనాచ్చా గణిత రాజ్యభిలాషోభ్రాతృ భార్యాసమేతోవనం ప్రవివేశ॥
విరాధ ఖరదూషణాదీన్ కబన్ధ వాలినౌ జఘాన॥
బధ్వాచమ్భోనిధి మశేషరాక్షసకులక్షయం క్రుత్వాదశాననాపహృతాం తద్వదాపహృతకళఙ్కా మాప్యనలప్రవేశ శుద్దా మశేష దేవేశసంస్తూయమానశీలాం జనకరాజ తనయామయోధ్యామానిన్యే॥
తతస్తయోరభిషేమజ్గళం మైత్రేయ వర్షశతేనాపివక్తుం నశక్యతే, సంక్షేపేణశ్రూయతామ్॥
రామాయణ కథ:
ఆ దశరథునికి అబ్జనాభుడు జగత్ స్థితి కార్యమును దనయంశమున రామలక్ష్మణ భరత శత్రుఘ్న రూపమున నలురూపుల పుత్రత్వము నందెను. రాముడు బాల్యమందు విశ్వామిత్ర యజ్ఞ రక్షణకై యేగుచు తాటకం గూల్చెను. యజ్ఞమందు మారీచుని నొక్క బాణమున సముద్ర మందు బడవేసెను. సుబాహు ప్రముఖ రాక్షసులను క్షయ మందించెను. దర్శన మాత్రమున అహల్యను పాప రహితం గావించెను. జనకునింట మహేశ్వర చాపము సునాయాసముగా విరచెను. అయోనిజను జనక రాజ తనయయగు వీర్యశుల్కను సీతం బెండ్లాడెను. సకల క్షత్రక్షయకారిని హైహయ వంశ దూమకేతువును పరశురాముని (వీర్యము బలము గర్వము వోవ) బెండువడ చేసెను. పితృ వాక్యముచే రాజ్యాభిలాషం గణింపక భార్యతో భ్రాతతో వనముం జొచ్చెను. విరాధ ఖర దూషణాదులను కబంధుని వాలిని గూల్చెను. సముద్రముం బంధించి అశేష రాక్షస కుల క్షయము చేసి రావణుడు హరించిన సీతను వానిం జంపుటచే కళంకము వాసిన దానిని అగ్ని ప్రవేశము చేసి పరిశుద్ద ననిపించుకున్న దానిని అశేష దేవాధీశ సంస్తూయ మాన శీలను జనకరాజ తనయను అయోధ్యకు గొనివచ్చెను. అటుపై నా సీతా రాముల పట్టాభిషేక మంగళము మైత్రేయా! నూరేండ్ల కైన వర్ణింప శక్యము గాదు. సంక్షేపగా వినుము.
లక్ష్మణ భరత శత్రుఘ్న విభీషణ సుగ్రీవాఙ్గదజామ్బవద్దనుమత్ప్రభృతిభిస్సముత్ఫుల్ల వదనై
శ్చత్రచామరాదియుతై స్సేవ్యమానో బ్రహ్మేన్ద్రాగ్నియమనిరృతి వరుణ వాయు కుబేరేశాన ప్రభృతిమరైర్వసిష్ఠ వాసుదేవ వాల్మీకి మార్కణ్డేయ విశ్వామిత్ర భరద్వాజాగస్త్య ప్రభృతిభిర్మునివరైః ఋగ్యజుస్సామాదైః సంస్తూయమానో నృత్తగీతవాద్యాద్యఖిల మఙ్గళ వాద్యైర్వీణా మృదఙ్గభేరీపటహంశంఖకాహల గోముఖ ప్రభృతి భిన్సునాదై స్సమస్తభూభృతాంమధ్యేసకల లోక రక్షణార్థం యథోచితమభిషిక్తో దాశరథిః కోసలేన్ద్రో రఘుకులతిలకో జానకీ ప్రియో భ్రాతృత్రయ ప్రియః సింహాసనగతస్త్వేకాదశాబ్దసహస్రాణి రాజ్యమకరోత్॥
శ్రీ సీతా రామచంద్ర పట్టాభిషేక వైభవము:
లక్ష్మణ భరత శత్రుఘ్న విభీషణ సుగ్రీవంగద జాంబవద్దనుమత్ప్రభృతుల మోములు విప్పార చత్రచామరాదు లూని సేవింప బ్రహ్మేంద్రాగ్ని యమ నిరృతి వరుణ వాయు కుబేర ఈశానన ప్రభృతులలో సర్వామరులతో వశిష్ఠ వామదేవ వాల్మీకి మార్కండేయ విశ్వామిత్ర భారద్వాజాగస్త్యాదులైన మునివరుల ఋగ్యజు స్సామాదులచే సంస్తుతింప నృత్య గీతవాదాదులు, మంగళ వాద్యములు, వీణా, వేణు, మృదంగ భేరీపటహ శంఖకాహళ గోముఖ తూర్య నాదములతో సమస్త భూపతుల మధ్యమందు సకల లోక రక్షణమునకై యథావిధిగ నభిషిక్తుండై దాశరథి కోసలేంద్రుడు రఘుకుల తిలకుడు జానకీ ప్రియుడు ముగ్గురు తమ్ములకు గూర్చువాడు సింహాసన మదిష్టించి పదునొకండు వేలేండ్లు రాజ్యము చేసెను.
భరతోఽపిగంధర్వ విషయ సాధనాయ గచ్ఛన్ సంగ్రామే గన్ధర్వకోటీస్తిస్రోజఘాన॥
శత్రుఘేనాప్యతి బలపరాక్రమో మధుపుత్రో లవణోనామ రాక్షసేశ్వరో నిహతః
మధురాచానివేశితా॥
ఇత్యేవమాద్యతి బలపరాక్రమ విక్రమణై రతీవదుష్ట నిబర్హాణా దశేషస్యాస్యజగతోనిష్పాది
తస్థిత యోరామలక్ష్మణ భరత శత్రుఘ్నాః పునరపిదివామారూఢాః॥
యోపితేషుభగవదం శేయేఽష్వనురాగిణః కోసలనగర జానపదాస్తేఽపితన్మనవస్తత్సా
లోక్యమవాపుః॥
అతిదుష్ట సంహారిణః రామస్యహికుశలవౌద్వౌపుత్రౌ లక్ష్మణ స్యాఙ్గదచన్ద్రకేతూ తక్షక పుష్కలౌ భరతస్య సుబాహుశూరాసేనౌశత్రుఘ్నస్య॥
కుశస్యాతిథిః అతిథేరాపినిష ధఃపుత్రోఽభూత్॥
నిషధస్యాప్యనలస్తస్యాపినభః నభసః పుణ్డరీకః తత్తనయః క్షేమదన్వాతస్యచదేవానీకస్తస్యాప్య హీనగుః అహీనగోరపిగురుః తస్యచపారియాత్రః పారియాత్రాద్బలః బలాచ్చలః తస్యాప్యుత్కః
ఉత్కాద్వజ్రనాభః తస్మాచ్ఛం ఖణః తస్మాద్వ్యుషితాశ్వస్తతశ్చవిశ్వసహోజజ్ఞే॥
తస్మాద్దిరణ్యనాభః మహాయోగీశ్వరాజ్ఞేమినేః శిష్యాద్యాజ్ఞ్యవల్క్యాద్యోగమవాప॥
హిరణ్యనాభస్యపుత్రః పుష్యః తస్మాద్ద్రువసంధిః తతస్సు దర్శనస్తస్మాదగ్నివర్ణః తతశ్చశీఘ్రగ స్తస్యాపిమరుః పుత్రోఽభవత్॥
యోఽసౌయోగమాస్థాయాద్యాపికలాపగ్రామామాశ్రిత్యతిష్ఠతి॥
అగామియుగేసూర్యవంశ క్షత్రప్రవర్తయితాభవిష్యతి॥
తస్యాత్మజః ప్రశుశుక్రః తస్మాత్ సుసంధిస్తతశ్చాప్యమర్షః తస్యచాసహస్యా తతశ్చభవః॥
తస్మాచ్చబృహద్భలః యోఽర్జునతనయేనాభిమన్యునాభారతయుద్దేక్షయమనీయత॥
ఏతేహీక్ష్వాకుభూపాలాః ప్రాదానఎనమయేరితః।
ఏతేషాంచరితం శృణ్వన్ సర్వపాపైః ప్రముచ్యతే॥
పఠత్యేషాం తుచరితం యోవైశ్రద్డా సమన్వితః।
సర్వాన్ కామానవాప్యేహహ్యన్తే స్వర్గేమహీయతే॥
భరతుడు గంధర్వ రాజ్య సాధనకై యేగి మూడుకోట్ల గంధర్వులం గూల్చెను. శత్రుఘ్నుడు అతి బలపరాక్రము మధుపుత్రుని లవణునిం జంపెను. మధురా నగరమును నిర్మించెను. ఈ విధముగా నతిబల పరాక్రమ విక్రంబుల నతిదుష్టనిబర్హణము చేసి యశేష జగత్తునకు స్థితిని (ఉనికి) నిర్వహించి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరలి దివమ్ము నధిష్టించిరి. ఆ భగవ వదవతార మూర్తులందెవ్వ రనుక్తులై రాకోసల రాజ్య ప్రజల జానపదులును తన్మనస్కులై తత్సాలోక్య మందిరి. సుష్ట సంహారి రాముని కుమారుల కుశలవు లిద్దరు, లక్ష్మణుని కొడుకులుం గదచంద్రకేతువులు, భరత పుత్రులు తక్షక పుష్కలులు, శత్రుఘ్నుని తనయులు సుబాహు శూరసేనులు. కుశుడు, అతిథి నిషధుడు అనలుడు నభుడు పుండరీకుడు క్షేమధన్వుడు దేవానీకుడు హీనగుడు గురుడు పారియాత్రుడు బలుడు ఛలుడు ఉత్కుడు వజ్రనాభుడు శంఖణుడు వ్యుషితాశ్వుడు విశ్వసహుడు హిరణ్యనాభుడు నను తండ్రి కొడుకుల వరుసలో కుశ వంశ వృక్షము వర్ణితము. హిరణ్యనాభుడు మహా యోగీశ్వరుడైన జైమినికి శిష్యుడై యాజ్ఞ్యవల్క్యుని వలన యోగముం బడసెను. హిరణ్యనాభుని కొడుకు పుష్యుడు వానికి ద్రువసంధి వాని వలన సుదర్శనుడు వాని వలన అగ్నివర్ణుడు వానికి శీఘ్రగుడు ఆతనికి మరువుం గల్గిరి. ఈ మరువు యోగా నుసంధానము సేసి యిప్పుడును కలాపగ్రామ మందున్నాడు. రాబోవు యుగమందు సూర్యవంశ ప్రవర్తకుడీతడు గాగలడు. అతని కొడుకు ప్రశుక్రుడు, వానికి సుసంధి వానికి అమర్షుడు అతనికి సహస్వంతుడు అతనికి భవుడు, భవునికి బృహద్బలుడు గల్గిరి. ఈ బృహద్బలుడు భారత యుద్దము నందు అభిమన్యుని చేతిలో నీల్గెను. ఇక్ష్వాకు వంశ రాజులను బ్రదానముగా నేను దెల్పితిని. వీరి చరిత్ర విని నతడు పాప ముక్తుడగును. శ్రద్ధతో నిది చదివిన సర్వాభీష్టములు బొంది స్వర్గమందు బూజింప బడును.
Summary of chapter 4 of the Vishnu Mahā Purāṇa is as follows:
Sagara performs the Aśvamedha yajña; the horse is stolen and hidden in the pātāla. Sagara's 60,000 sons dig down to the pātāla to retrieve it and are burned to ashes by the gaze of the sage Kapila Maharṣi. Aṃśumān undertakes a mission to retrieve the horse and receive Kapila's instruction on how the Gaṅgā must be brought down to liberate his ancestors. Dilīpa and then Bhagīratha continue this quest; Bhagīratha ultimately brings the Gaṅgā to earth. Also narrated are: Triśaṅku's story, Kalmāṣapāda/Mitra-saha who is possessed by a rākṣasa, Khaṭvāṅga who attains mokṣa in a single muhūrta by surrendering completely to Viṣṇu, and the lineage continuing through Daśaratha to Rāma, Bharata, Lakṣmaṇa, and Śatrughna.