యావచ్చబ్రహ్మలోకాత్తుకకుద్మీరైవతోనాభ్యేతితావత్పుణ్యజనసంజ్ఞా।
రాక్షసాస్తామస్యపురీంకుశస్థలీంనిజఘ్నః॥
తచ్చాస్యభ్రాతృశతంపుణ్యజనత్రాసాద్దిశోభేజే॥
తదన్వయాశ్చక్షత్రియాః సర్వదిక్ష్వ భవన్॥
వృష్టస్యాపివార్ ష్టకంక్షత్రమభవత్॥
ఏతే క్షత్ర ప్రసూతావైపున శ్చాంగిరసా స్స్మృతాః।
రథీతరాణాంప్రవరాః క్షత్రోపేతా ద్విజాతయః ఇతి॥
క్షుతవతశ్చమనో రిక్ష్వాకుర్ ఘ్రాణతః పుత్రోజజ్ఞే॥
తస్యపుత్రశతప్రధానాః వికుక్షి నిమి దణ్డాఖ్యాస్త్రయః పుత్రాః॥
శకుని ప్రముఖాః పంచాశత్పుత్రా ఉత్తరాపథరక్షితారోబభూవుః॥
చత్వారింశదష్టౌచ దక్షిణాపథ భూపాలాః॥
స చేక్ష్వాకు రష్టకాయాముత్పాద్య శ్రాద్దార్హంమాంసమానయేతివికుక్షిమాజ్ఞాపయామాస॥
తథేతిగృహీతాజ్ఞో వనమభ్యేత్యానేకాన్ హత్వాతిశ్రాన్తోఽతిక్షుత్పరీతోవికుక్షి రేకం శశ మభక్షయత్।
శేషం చమాంస మానీయపిత్రే నివేదయామాస॥
ఇక్ష్వాకుణా ఇక్ష్వాకుకులాచార్యస్తత్ప్రోక్షణాయ వసిష్ఠశ్చోదితః ప్రాహతదలమనినామేధ్యే।
నామిషేణ దురాత్మనాఽనేనత్వత్పత్రేణై తన్మాంస ముపహతం యతోఽనేనశశోభక్షితః॥
తతశ్చాసౌవికుక్షిర్గురుణైవముక్తశ్శశాదసంజ్ఞామవాప పిత్రాచపరిత్యక్తః॥
కకుద్మి బ్రహ్మ లోకము నుండి తిరిగి భూమికి రానంతలో నుద్వేజనులను పేర రాక్షసులు కుశస్థలీ పురమును ధ్వంసము చేసిరి. ఇతని తమ్ములు నూర్గురు వారికి జడిసి దిక్కులకు పారిపోయిరి. వారి వంశీయులు క్షత్రియులు నలుదేసలం జేదరిరి. వృష్టుని వంశము వార్షకమను పేర క్షత్ర జాతి ఏర్పడెను. నభాగుని కొడుకు నాభాగునన నొప్పెను. వాని కుమారు డంబారీషుడు అతని సుతుడు విరూపుడు. వానికి పృషదశ్వుడు వానికి రథీతరుడు పుట్టిరి. ఈ వంశమున నీ శ్లోకము పఠితము. రథీతరులు సంతతి క్షాత్రసంపన్నులయ్యు తపముచే ఆంగీరసులనెడి ద్విజులు కూడా నయిరి. మనువు తుమ్మిన తఱి నాతని ముక్కు నుండి ఇక్ష్వాకువు పుట్టెను. వికుక్షి నిమి దండుడు నను ముగ్గురాతని నూర్గురు కొడుకులలో ముఖ్యులు. శకుని మొదలగు నేబది మంది యుత్తారా పథమును బాలించిరి. ఎనుబది యెన్మిది మంది దక్షిణా పథపాలకులైరి. ఇక్ష్వాకువు అష్టకా శ్రాద్ధ నిమిత్తముగ మాంసముం దెమ్మని వికుక్షిని పంపెను. ఆతడేగి యనేక మృగములం జంపి మిక్కిలి యాకలిగొని యందొక కుందేటిని దిని వేసెను. తక్కిన మాంసముం దెచ్చి తండ్రికి నివేదించెను. ఇక్ష్వాకువు ఇక్ష్వాకు కుల గురువగు వశిష్టునిది ప్రోక్షింపుమని పలికి నంతట నతడు చాలు నిది యమేధ్యమయిన (అపవిత్రమైన) మాంసము. దురాత్ముడు నీ కొడుకు దీనిని జెరచినాడు. ఇందలి కుందేటిని వీడు తిన్నాడు. అని యిట్లాచార్యునిచే బలుకబడి యా వికుక్షి శశాదుడను పేరొంది తండ్రిచే పరిత్యజింప బడియె. తండ్రి చనిపోగా నీతడీ పృథివిని ధర్మమున బాలించెను.
శశాదస్యపురంజయోనామవుత్రోఽభవేత్॥
పురాహిత్రేతాయాందైవాసురమతిభీషణం యుద్దమాసీత్॥
తత్రచాతిబలిభిరసురై రమరాః పరాజితాః తేభగవన్తం విష్ణుమారాధయాంచక్రుః॥
ప్రసన్నశ్చదేవానామనాదినిధనః సకలజగత్పరాయణో నారాయణఃప్రాహ॥
జ్ఞాతమేతన్మయాయుష్మాభిర్యదభిలషితం తదర్థమిదంశ్రూయతామ్॥
పురంజయో నామ శశాదస్య రాజర్షేస్తనయః క్షత్రియప్రవరః తచ్చరీరేఽమంశేనస్వయమేవావతీ।
ర్యతానశేషానసురాన్నిహనిష్యామి తద్భవద్భిః పురంజయోసురవదార్థముద్యోజ్యః కార్యతామితి॥
ఏతచ్చ్రుత్వాప్రణమ్యభగవన్తం విష్ణు మమరాః పురంజయసకాశమాజగ్ముః ఊచుశ్చైనమ్॥
భోభోక్షత్రియవర్యాస్మాభిరభ్యర్థితేన భవతాఽస్మాకమరాతివధోద్యతానాం కర్తవ్యం సాహాయ్యమిచ్చామః।
తద్భవతాస్మాకమభ్యాగతానాం ప్రణయభంగోనకార్య ఇత్యుక్తః పురంజయః ప్రాహ॥
త్రైలోక్యనాథోయోయంరాజాయుష్మాకమిన్ద్రః శతక్రతుః అస్యయుద్యహంస్కన్దాదిరూడో।
ఆశశాదునకు పురంజయుడు పుట్టెను. అతని చరిత్ర ఇది. త్రేతా యుగము నందు దేవాసుర యుద్దమతి భయంకరముగ జరిగెను. అందసురుల చేతిలో నమరులోడి విష్ణు నారాధించిరి. సకల జగత్పరాయణుడు ఆద్యంత రహితుడునగు నారాయణుడు వేల్పులకు బ్రసన్నుడై యిట్లనియె. మీ కోరిక నాకు దెలిసినది. అందులకిదె నా పలుకాలింపుడు. రాజర్షియైన శశాదుని తనయుడు పురంజయుడు క్షత్రియ వీరుడు. అతని మేన నేను స్వయముగ నంశావతార మెత్తి యా రాక్షసుల నందరిని సంహరించెద. అందుచే మీరు పురంజయుని అసుర సంహారమునకు సన్నద్ధుం జేయుడనగా విని యమరులు విష్ణు భగవానునికి మ్రొక్కి పురంజయుని దరికి వచ్చి యిటు పలికిరి. ఓ క్షత్రియ శిరోమణీ! మా కోరినటుల మా శత్రు సంహారమున కీవు సాహాయ్యము సేయ గోరుచున్నాము. అభ్యాగతులము కావున మా ప్రీతికి భంగము సేయరాదు. అనవిని పురంజయు డిట్లనెను. మీకు రాజు శతమఖుడు త్రిభువన నాథుడు అతని మూపున నేను గూర్చుండి మీ శత్రువులతో బోరుదునేని నేను మీకు దోడయ్యెద నన విని దేవతలు, దేవేంద్రుడు నిది బాగున్నదని యంగీకరించిరి.
తతశ్చశతక్రతోర్వృషభ రూపదారీణః కకుత్థ్సోఽతితోష సమన్వితో భగవతశ్చ రాచరగురో।
రచ్యుతస్యతేజసాఽఽప్యాయితో దేవాసుర సంగ్రామే సమస్తానే వాసురాన్ని జఘనా॥
యతశ్చ వృషభకకుత్థ్సేణ తేనరాజ్ఞాదైతేయబలం నిషూదితం తతశ్చాసౌ కకుత్థ్ససంజ్ఞామవాప॥
కకుత్థ్సస్యాప్యనేనాః పుత్రోఽభవత్॥
చాన్ద్రస్యతస్యయువనాశ్వస్యచ శాబస్తః యః పురీంశాబస్తీం నివేశాయామాస॥
యోసావుదంకస్య మహర్షేరపకారిణందున్దు నామానమసురం వైష్ణవేనతేజసాప్యాయితః।
పుత్రసహస్రైరేకవింశతిభిః పరివృతోజఘనా దున్దుమారసంజ్ఞాంచావాప॥
తస్యచసమాస్తా ఏవ పుత్రాః దున్దుముఖనిశ్వాసాగ్నినా విప్లుష్టా వినేశుః॥
దృడాశ్వచన్ద్రాశ్వకపిలాశ్వాస్త్రయం కేవలమవశేషితాః॥
తస్యచాపుత్రస్యాతినిర్వేదాత్ మునీనామాశ్రమమణ్డలేనిపసతః కృపాళుభిస్టైర్మునిభిరపత్యోత్పాదనాయేష్టిః కృతా॥
తస్యాంచ మధ్యరాత్రనివృత్తాయాం మన్త్రపూతజలపూర్ణం కలశం వేదిమధ్యేనివేశ్యతేమునయః నుషుపుః॥
అవ్వల నింద్రుడు వృషభ రూపము ధరింప దాని కకుద (మూపుర)మున నత్యంత సంతోషముతో పురంజయ మహారాజు గూర్చుండి చరాచర గురువగు విష్ణు భగవానుని తేజస్సుతో ఆప్యాయితుడగుచు నా దేవాసుర సంగ్రామ మందెల్ల యసురులం గూల్చెను. ఎద్దు మూపురమున (కకుత్తు నందు) స్థితుడయి నందున నాతనికి కకుత్థ్సుడను పౌరుషనామ మేర్పడినది. అతని కుమారు డనేనసుడు. అతని కొడుకు పృథువు. అతని కొడుకు విష్టరాశ్వుడు. వాని పుత్రుడు చంద్ర వంశీయుడగు యువనాశ్వుడు. యువనాశ్వుని సుతుడు శావస్తుడు. ఆతడు నిర్మించినది శావస్తి పురము. వాని కొడుకు బృహదశ్వుడు. వానికి జనించిన వాడు కువలయాశ్వుడు. ఈతడు విష్ణు తేజస్సంయుతుడై తన కొడుకు లిరువది యొక్క వేల మందితో నేగి యుదంక మహర్షి కపకారియైన దుందుడను రాక్షసుని జంపి దుందుమారుడను పేరందెను. అతని కొడుకు లందరు దుందుని ముఖ నిశ్శ్వాసాగ్నిచే దగ్దులై నశించిరి. దృడాశ్వ చంద్రాశ్వ కపిలాశ్వులు ముగ్గురు మాత్రము మిగిలిరి. ధృడాశ్వునికి హర్యశ్వుడు, నికుంభుడు. నికుంభుని కమితాశ్వుడు. వానికి క్రుశాశ్వుడు. వానికి ప్రసేనజిత్తు. వానికి యువనాశ్వుడు గల్గిరి. ఆ యువనాశ్వుడు సంతానము లేక విచార మంది మునుల యాశ్రమ మండలము నందు వసించు చుండ దయాశీలురగు మునులు పుత్రాకామేష్టిం జేసిరి. ఆ యిష్టిలో ఋషులు నడిరేయి దాటిన తర్వాత మంత్ర పూరితమైన జలము నింపిన కలశమును యజ్ఞవేది నడుమ నుంచి యందరు నిదుర వోయిరి.
సుప్తేషుచతేష్వతీవతృట్పరీతస్సభూపాలస్తమాశ్రమంవివేశ॥
సప్తాంశ్చతానృషీన్నైవోత్థాపయామాస॥
తతస్స కలశజలమపరిమేయమాహాత్మ్యమన్త్రపూతంపపౌ॥
ప్రబుద్ధాశ్చ ఋషయః పప్రచ్చుః కేనైతన్మన్త్రపూతంవారిపీతమ్॥
అత్రహిపీతే రాజ్ఞోఽస్యయువనాశ్వస్య పత్నీ మహాబల పరాక్రమ సంపన్న పుత్రంజనయిష్యతీతి।
తద్వచనమాకర్ణ్యసరాజా అజానతా మయా పీతమిత్యాహ॥
గర్భోయువనాశ్వస్యోదరేఽభవత్ క్రమేణచవవృధే॥
ప్రాప్తసమయశ్చ దక్షిణాంగుష్ఠేన కుక్షిమవనీపతేర్నిర్భిద్యనిశ్చక్రామ॥
జాతోనా మైష కం దాస్యతీతితేమునయః ప్రోచుః॥
అథాగమ్యదేవరాజోఽభ్రవీత్ మామయందాస్యతీతి॥
తతోమాంధాతృనామా సోఽభవత్ వక్త్రేచాస్యప్రదేశినీ దేవేంద్రణన్యస్తాతాపపౌ॥
తాంచామృత స్రావిణీమాస్వాద్యాహ్నైవసవ్యవర్థత॥
సతుమాంధాతా చక్రవర్తీ సప్తద్వీపాం మహీంభుషుజే॥
అమ్మునులట్ల నిదురవోవ యువనాశ్వుడు దప్పికగొని యయ్యాశ్రమము లోనికేగి మునులను లేపకయే యతనున్న మంత్ర పూతము మహా మహిమ గలదియునగు కలశ మందలి నీరు ద్రావెను. ఋషులు మేల్కని ఎవ్వడీ జలముం ద్రావెనని యడిగిరి. ఈ జలమును త్రావినచో యువనాశ్వ నృపతి పత్ని మహాబల పరాక్రమ సంపన్నుడగు బుత్రునిం గనగల దనిరి. అది విని యారాజు తెలియక నేనిది త్రావితిననెను. అతని కడుపున గర్భము (శిశువు) ఏర్పడి దినదినాభివృద్ధి నందెను. సమయమయినంత నా శిశువు కుడి బొటన వ్రేల రాజు కుక్షిని భేదించుకొని వెలికి వచ్చెను. ఆ రాజు మరణించెను. పుట్టినాడు గదా వీడేమి కుడుచుకొనునని మునులనిరి. అంతట నింద్రుడేతెంచి నన్ను గుడుచు కొనుచు (మాం దాస్యతి) అనెను. దాననాతడు మాంధాతయను పెరివాడగును. అను దేవేంద్రుడా బిడ్డ నోటం దన చూపుడు వ్రేలినిడగా నంతట నాతడద్దానిం గుడిసెను. ఆ అమృత స్యందియైన వ్రేలింగుడిచి యొకనాటనే చక్కగ వృద్ధి నందెను. ఆ మాంధాత చక్రవర్తి సప్తద్వీపవతియైన మహి ననుభవించెను. ఇక్కడ నొక శ్లోక మిట్లు పశ్లోకితము. సూర్యుడెంత మేర నుదయించును ఎంత దాక సంచరించు నా సర్వ ప్రదేశము యువనాశ్వ తనయుడగు మాంధాత యొక్క క్షేత్ర మనబడును.
మాన్ధాత శశిబిన్దోర్దుహితరమిన్దుమతిముపయేమే॥
పురుకుత్సమమ్బరీషం ముచుకుందంచ తస్యాంపుత్రత్రయముత్పాదయామాస॥
పంచశద్దుహితర స్తస్యామేవ తస్యనృపతేర్బభూవుః॥
ఏతస్మిన్నన్తరే బహ్వృచస్సౌభరిర్నామ ఋషిరన్తర్జలేద్వాదశాబ్డం కాలమువాస॥
తత్రచాన్తర్జలేసంమదో నామాతిబహుప్రజోఽతి ప్రమాణోమీనాదిపతిరాసీత్॥
తస్యపుత్రపౌత్రదౌహిత్రాః పృష్ఠతోగ్రతః పార్శ్వతః పక్షపుచ్చశిరసాంచో పరిభ్రమన్తస్తేనైవ సహాహర్నిశమతినిర్వృతారేమిరే॥
స చాపత్యస్పర్శోపచీయమానహర్షప్రకర్షో బహుప్రకారం తస్యర్షేః పశ్యతః స్వైః పుత్రపౌత్రదౌహిత్రాదిభి స్సహానుదినం సుతారం రేమే॥
మాంధాత శశి(త) బిందుతన నిందుమతిం బరిణయ మాడెను. ఆమె యందాతాడు పురుకుత్సుని, అంబరీషుని, ముచుకుందుని ముగ్గురు పుత్రులం గనెను. ఆమె యందే యారేని కేబది మంది కూతురులుం బుట్టిరి. ఈ నడుమ బహ్వృచుండు (ఋక్మాఖీయుడు) సౌభరియను ఋషి పండ్రెండేండ్లు జలము లందుండెను. అందా నీటిలో సంమదుడను చేపలకు రాజు పెక్కు మంది సంతానము గల్గి అతి ప్రమాణము గలవా డందుండెను. వాని కొడుకులు మనుమలు కూతురు బిడ్డలు వాని వెనుక ముందు నిరుపార్శ్వముల రెక్కలందోకను దల మీదనుం దిరుగుచు వానితోనే రేయిం బవళ్ళు మిక్కిలి తనిసి క్రీడించిరి. వాడును సంతాన స్పర్శ హర్ష ప్రకర్షం జేసి పలు తెరగుల తన పుత్ర పౌత్ర దౌహిత్రాదులతో గూడ ననుదిన మా మహర్షి చూచు చుండ మిగుల క్రీడించెను.
అథాన్తర్జలా వస్థితస్ససౌభారిరేకాగ్రతా సమాధాన మపహాయానుదినం తస్యమత్స్యస్యాత్మజ।
పౌత్రదౌహిత్రాదిభిస్సహాతి రమణీయం లలితమ వేక్ష్యాచిన్తయత్॥
ఆహోధన్యోఽయమీదృశప్యభిమతం యోన్యన్తర మవాప్యైభిరాత్మజ పౌత్రదౌహిత్రాది
భిస్సహ రమమాణోఽతీవాస్మాకం స్పృహా ముత్పాదయితి॥
వయమప్యేవంపుత్రాదిభిస్సహరమిష్యామిత్యేవమభిసమీక్ష్యస తస్మాదన్తర్జలాన్నిష్క్రమ్య।
సన్తానాయనివేష్టు కామః కన్యార్థం మాన్ధాతారం రాజాన మగచ్చత్॥
ఆగమన శ్రవణసమనన్తరంచోత్థాయతేనరాజ్ఞాసమ్యగర్ ఘ్యాదినా పూజితః కృతాసన పరిగ్రహః సౌభరి రువాచ రాజానమ్॥
అవ్వల నా నీటిలో నున్న సౌభరి ఏకాగ్రత నుండి తొలగి (మనసు లక్ష్యమున నిలువక) యనుదిన మా చేప యొక్క కొడుకులు పౌత్రులు దౌహిత్రుల తోడి అతిరమణీయ విలాస మట్టెగని యిట్లనుకొనెను. ఆహా! ఈ మీనరాజెంత ధన్యుడు. అభిమతమైన యొక జన్మాంతర మంది ఈ కొడుకులతో మనుమలతో మునుమనుమలతో నుల్లసిల్లుచు మాకు వేడుక నొదవించు చున్నాడు. మేమునునిట్లు పుత్రపౌత్ర దౌహిత్రులతో నానందింతుము గాక యని లెస్సగ గమనించి యా నీరు వెడలి సంతానము కనువేడుక గొని కన్యకై మాంధాత చక్రవర్తి దరికేగెను. ఆయన రాక వినినంతట భూకాంతుడు లేచి ఎదురేగి లెస్సగ నర్ఘ్య పాద్యాదులం బూజింప నుచితాసనముం గొని సౌభరి రేనింగూర్చి యిట్లనియె.
నివేష్ణుకామోస్మినరేన్ద్ర! కన్యాం ప్రయచ్చమే మాప్రణయం విభాంక్షీః।
నహ్యర్థినః కార్యవశాదుపేతాః కకుత్థ్సవంశే విముఖాః ప్రయాన్తి॥
అన్యేఽపిసన్త్యేవనృపాః పృథివ్యాం మాన్ధాతృ రేషాం తనయాః ప్రసూతాః।
కింత్వర్థినా మర్థితదానదీక్షాకృతవ్రతం శ్లాఘ్య మిదం కులం తే॥
నరేంద్రా! గృహస్థుగా దలచితిని. కావున నాకు నీ కన్యనిమ్ము. యజ్ఞమునకు భంగము సేయకుము! కార్య వశమున వచ్చిన యర్థులు కకుత్థ్స వంశము నందు విముఖులై పోరు గదా! పుడమి యందితరులు రాజులున్నారు. వారికి కూతుండ్రును బుట్టినారు. కాని అర్థులేతెంచి యర్థించిన దాని నిచ్చెడి దీక్షయందు దృడమైన వ్రతనిష్ఠ గల కులము నీ దొక్కటే. నీకు నూట ఏబది మంది కూతుండ్రున్నారు. అందొక యామెను నాకిమ్ము. ఓ రాజోత్తమా! అడిగి లేదని పించుకొనుట అతి దుఃఖ హేతువు. నేను దానికి బాధ పడుచున్నాను.
ఇతిఋషివచనమాకర్ణ్య సరాజా జరాజర్ ఝారితదేహంమృషిమనలోక్య ప్రత్యాఖ్యాన
కాతరస్తస్మాచ్చ శాపతోఽభిభ్యత్, కించిదదోముఖశ్చిరందద్యౌ॥
నరేన్ద్ర కస్మత్సముపైషిచిన్తా మసహ్య ముక్తం న మయాఽత్రకించిత్।
ముని వచన మాలించి యా రాజు ముదిమిచే శరీరము శిథిలమై యున్న యమ్మునిం గని కాదనుటకు జడిసి శాపమునకును వెఱచి యించుక మొగము వంచి చాల తడవాలోచించెను. రాజేంద్రా! ఎందుల కాలోచనలో బడితివి. ఇందేనించుకయు నసహనముగా బలుక లేదు. కూతురేనికేని యవశ్య మీయ వలసినదియే. ఆమె చేత గృతార్థత లభింపకున్న నింకేమున్నది. యని సౌభరి భగవానుని వచనము విని శాపమునకు భయమంది మాంధాత వినయ వినతుడై యిట్లనియె.
భగవన్నస్మత్కుల స్థితిరియంయ ఏవక్యాభిరుచితోఽభిజనవాన్వరస్తస్మైకన్యాప్రదీయతే,
భావద్యాచ్ఞాచాస్మన్మనో రథానామప్యగోచరవర్తినీ కథమ ప్యేషాసంజాతా, తదేవమవస్థితే నవిద్యః కింకుర్మ ఇత్యేతన్మయాచిన్త్యత ఇత్యభిహితేచతేనభూభుజా ముని రచిన్తయత్॥
అయమన్యోఽస్మత్ప్రత్యాఖ్యానోపాయః, వృద్ధోయమనభిమతః స్త్రీణాంకిముత కన్యానామిత్య మునాసంచిన్త్యైతదభిహితమ్ ఎవమస్తు తథాకరిష్యామీతి సంచిన్త్యమాంధాతారముచాచ॥
యద్యేవం తదాదిశ్యతా మస్మాకం ప్రవేశాయ కన్యాన్తః పురవర్షవరః యదికన్యైవకా నస్మా నభిలషతిచ తదాహందార సంగ్రహం కరిష్యామి యథాచేదలమస్మాకమేతేనాతీతకాలారమ్భేణేత్యుక్త్వా విరరామ॥
“స్వామీ! ఇది మా కుల మర్యాద. కన్య కిష్టుడును నుత్తమ వంశ్యుడు నగువరునకు కన్యను మేమిత్తుము. మీ కన్యాయాచన మా మనోరథముల కందనిది. ఎట్లో యిది తటస్థించినది. పరిస్థితి ఇది యిట్లుండ నిపుడేమేమి సేయవలెనో యెరుంగక యాలోచనలో పడినానని” యా చక్రవర్తి యనగా ముని తనలో నిటు తలంచెను. మమ్ము త్రోసి పుచ్చుట కిది యొక యుపాయము. యితడు ముదుసలి ముదితల కనభిమతుడు. కన్యల మాని మరి యేమనవలెను! అని ఈతడాలోచించి యిట్లన్నాడు. అగుగాక! ఇటు సేసేదనని తనలో గుణించుకొని మాంధాతతో ముని యిట్లనియె. ఇట్లేని మే మంతఃపుర ప్రవేశము సేయుటకు వర్షవరునికి (అంతః పురపు కావలి వానికి) ఆజ్ఞ నిమ్ము. ఏ కన్య యేని నన్నభిలషించునేని నేను దార సంగ్రహము సేసికొనెదను. అటుల కాదేని మా ఈ కాలాతీత ప్రయత్న మింతటితో జాలునిట పలికి యూరకుండెను.
తతశ్చమాన్ధాత్రా మునిశాపశంకితేన కన్యాన్తఃపుర వర్షవరః సమాజ్ఞప్తః॥
తేనసహకన్యాన్తఃపురం ప్రవిశన్నేవ భగవానఖిల సిద్ధగన్దర్వమనుష్యేభ్యోఽతిశయేన కమనీయం రూపమకరోత్॥
పవేశ్య చత మృషి మన్తఃపుర వర్షవర స్తాః కన్యాః ప్రాహ॥
భవతీనాంజనయితా మహారాజస్సమాజ్ఞాపయతి॥
అయమస్మాన్ బ్రహ్మర్షిః కన్యార్థీసమభ్యాగతః॥
మయాచాస్య ప్రతిజ్ఞాతంయద్యస్మత్కన్యాయాకాచిద్భగవన్తం వరయతి తత్కన్యాచ్చన్దేనాహంపరిణయనం
కరిష్యామీత్యాకర్ణ్య సర్వా అపితాః కన్యాః సానురాగాః సమన్మథాః కరేణవ
ఇవేభయూథపతిం తమృషి మహమహమికయా వరయాంబభూవుః, ఊచుశ్చ॥
అలంభగిన్యోఽహమిమంవృణోమి వృణోమ్యహం నైషతవానురూపః।
మమైవభర్తా విదినైష సృష్టః సృష్టాఽహమ స్యోపశమం ప్రయాహి॥
వృతోమయాఽయం ప్రథమం మయాఽయం గృహం విశన్నేవవిహన్యసే కిమ్।
మయామయేతిక్షితిపాత్మజానాం తదర్థ మత్యన్తకలిర్బభూవ॥
అంతట మునిశాప శంకితుడై మాంధాత కన్యాంతఃపుర రక్షకుని కానతి నిచ్చెను. వానితో గూడ సౌభరి భగవాను డంతఃపురములోన బ్రేశించుచునే సకల సిద్ధ గంధర్వ మనుష్యుల నతిశయించిన చక్కని రూపముం గైకొనెను. ఆ ఋషిని లోనం బ్రవేశింప జేసి యవ్వర్షవరుడు కన్యలతో నిట్లనియె. మీ తండ్రి మహారాజు ఆజ్ఞాపించు చున్నాడు. ఈ బ్రహ్మర్షి కన్యార్థియై మమ్ముం గూర్చి యభ్యాగతుం డాయెను. నేనును మాట యిచ్చితిని. మా పిల్ల ఎవతెయే నోక్కతే భగవంతుని నిన్ను వరించునేని యామె యిష్టమునకు ప్రాతికూల్యమును సేయననెను. కన్యలందరాలించి యాతనిపై ననురాగమొంది సకాములై యాడయేనులు గజ యూధపతి నట్లా ఋషిని నేను నేనని యందరును వరించిరి. పలికిరి గూడ. అక్కలార! చాలు చాలు. నేనతని వరింతు నితనినే వరింతును. ఇతడు నీకనురూపుడు గాడు చెల్లీ! ఇతడు నాకే మగడుగా సృష్టింప బడినాడు. నేనతనికై సృష్టింప బడినాను. నీవుపశమింపు నేను మొదట వరించితిని. నేను మొదట. ఇంట నడుగు పెట్టినదే తడవు నేనీతని వలచితిని. ఎందులకు భంగము సేసేదవు? నాచేత నాచేత (నాతడు వరింపబడె) నని యా ముని బాలునికై పెద్ద రగడ సాగెను. మిగుల చక్కని వాడని చక్కని ఋషి యని పెర్గన్న యమ్ముని బాలు డందరి చేతను హృదయ పూర్వకముగ వరింప బడినంతట నంతఃపుర రక్షకుడేగి రాజునకు సవినయముగ నదియెల్ల విన్నవించెను.
తదవగమ్య కిమేతత్కథమేతత్కింకరోమి కిం మయాభిహితమిత్యాకులమతిరనిచ్చన్నపికథమపి రాజానుమేనే॥
కృతానురూప వివాహశ్చ మహర్షిస్సకలా ఏవతాః కన్యాస్వమాశ్రమమనయత్॥
తత్రచాశేషశిల్పకల్ప ప్రణేతారంధాతారమివాన్యం విశ్వకర్మాణమాహూయ సకలకన్యకానామేకైకస్యాః
ప్రోత్పుల్లపంకజాః కూజత్కలహంస కారణ్డవాదివిహంగమారామ జలాశయాస్సోపవనా స్సో
పధానాస్సాధుశయ్యాపరిచ్చదాః ప్రాసాదః క్రియన్తామిత్యాదిదేశ॥
తచ్చతదైవానుష్టితమ శేషశిల్ప విశేషాచార్యః త్వష్టా దశితవాన్॥
తతశ్చపరమర్షిణా సౌభారిణాఽఽఙ్ఞప్తస్తేషుగృ హేష్వనపాయీ నన్దనమహానిధిరాసాంచక్రే॥
తతోఽనపరతభక్ష్యభోజ్యలేహ్యాద్యుపభోగై రాగతానుగతభృత్యాదీనహర్నిశమశేష
అది యెరింగి యిదేమి! యిదెట్లు! ఏమి చేయుదును. నేనేమంటినని మనసు చెదిరి రాజు ఇష్ట పడకుండియు నందుల కంగీకరించే. అనురూపముగ నమ్మహర్షి వివాహమాడి యా కన్యలందరిని దన యాశ్రమమునకు గొని పోయెను. అందును నతడశేష శిల్పకల్పనా దక్షునింకొక విధాతనట్లు విశ్వకర్మ నాహ్వానించి యందరి సుందరుల కొక్కొక్కతె కొక్కొక్కటిగ నుత్పుల్ల పంకేరుహములు కూజత్కలహంస కారండవాది విహంగ మాభిరామములగు కాసారముల తోను, నుపవనముల తోను, నుపధానముల తోడి, శయ్యాపరిచ్చదముల తోను, సమగ్రావకాశముగ నిర్మింపుడని యానతిచ్చెను. ఆ ఇచ్చిన యాజ్ఞనచ్చము పాలించి అశేష శిల్ప విశేషచార్యుండగు త్వష్ట యట్లకావించి చూపించెను. అవ్వల నప్సరమర్షి సౌభరి యాజ్ఞంగొని యా సదనములం దెన్నడు విడువక నందన మహానిధి నివాసము చేసెను. ఆపై నెడవడని భక్ష్వభోజ్య లేహ్యచోష్యాది వివిదోపభోగాహారోప హారములతో సందడిగ గ్రందుకొను భృత్య వర్గము నహర్నిశ మా మందిరములందా యిందువదనలు విందారగింప జేసిరి.
ఏకదాదుహితృస్నేహాకృష్ణ హృదయస్స మహీపతిః కి మతిదుఃఖితాస్తా ఉతసుఖితావేతి విచిన్త్యతస్యమహర్షేరాశ్రమ సమీపము పేత్యస్పురదంశుమాలం స్పటిక మణిమయ ప్రాసాదమాల మతిరమ్యోపవన జలాశయం దదర్శ॥
ప్రవిశ్యచైక కంప్రాసాదమాత్మజాం పరిష్వజ్యకృతాసనపరిగ్రహః ప్రవృత్త స్నేహనయనామ్బుగర్భొ బ్రవీత్ అయిపుత్రివత్సే భవత్యాస్సుఖముతకించిద సుఖమ్ అపితే మహర్షిః స్నేహవా నుతనసంస్మర్యతే అస్మద్గృహవాస ఇత్యుక్తా తత్తనయాపితరమాహ॥
తాతాతిరమణీయోఽత్రప్రాసాదోఽతిమనోజ్ఞముపవనమతికల వాక్యవిహంగాభిరుతాః।
ప్రోత్పుల్ల పద్మాకర జలాశయా మనోనుకూలభక్ష్యభోజ్యానులేపన వస్త్రభూషణాదిభోగో।
మృదూనిశయనాసనానిసర్వసంపత్సమవేత మేత ద్గార్హాస్థ్యమ్॥
తథాపి కేనవా జన్మభూమిర్న స్మర్యతే॥
తద్దుఃఖ కారణం యదస్మద్గృహా న్మహర్షి రయేస్మద్భర్తా ననిష్కామ్రతి॥
కింత్వేకం మమైవ కేవలమయతిప్రీత్యాసమీపపరివర్తీ నాన్యాసా మస్మద్భగినీనామ్॥
ఏవంచమమసోదర్యోఽతి దుఃఖితా ఇత్యేవమతి దుఃఖ కారణమిత్యుక్తస్తయా ద్వితీయం ప్రాసాద ముపేత్యతనయాం పరిష్వజ్యోపవిష్టస్తథై వపృష్టవాన్॥
తయాపి సర్వమేవ ప్రాసాదాద్యుపభోగసుఖం భృశమాఖ్యాతం స్వపిత్రేమమైవ కేవలమతిప్రీత్యా భర్తాపార్శ్వపరివర్తినా న్యాసామస్మద్భగినీనామిత్యేవమాది శ్రుత్వాసమస్తప్రాసాదేషు రాజా ప్రవిశ్య తనయా స్తథైవాపృచ్చత్॥
సర్వాభిశ్చతాభిస్తథైవాబిహితః పరితోషవిస్మయనిర్భరవివశహృదయో భగవన్తం సౌభరి మేకాన్తావస్థితముపెత్య సకృత పూజోఽబ్రవీత్॥
ఒకతరి కూతురులపై వాత్సల్యమున మనసులాగ నమ్మహీపతి యా కన్యలు మిగుల దుఃఖితలా? లేక సుఖమున్నారా? అని యాలోచించి యమ్మహర్షి యాశ్రమ సమీపమున కేతెంచి, కన్నులు మిరుమిట్లు గొలుపు కిరణములు జిమ్ము స్పటిక మణిమయ ప్రాసాదమాలా మనోహరమయిన యుద్యాన వనము నందలి సరోవరమును దర్శించెను. ఒక్క ప్రాసాదమందు బ్రవేశించి కూతురుం గౌగలించుకొని యామె యిడిన చక్కని యాసనమందు గూర్చుండి వాత్సల్యరసపూరముబికి యానంద బాష్పములు గురియ, అమ్మాయీ! నీకు సుఖమే కద! అసుఖ మించుకయు లేదు గద. నీపైనీ మహర్షి చెలిమి వాటించునా; లేదా? మన యింటనునికి మాట జ్ఞప్తికి వచ్చునా? అని యడుగ కూతురు తండ్రికిట్లనియె. నాన్నగారూ! ఈ సౌధమతి రమణీయము. ఈ ఉద్యానవనమతి మనోహరము. ఉత్పుల్ల పద్మాకర జలాశయములు అవ్యక్త మధురకూజిత విహంగములచే హృదయంగములు. మనోనుకూల భక్ష్య భోజ్యములు అనులేపనములు అంబరాభరణాది భోగము మృదుల మృదులశయనాసనాది సర్వసంపదల సమృద్ధము. మీ గార్హస్థ్య మద్భుతము అయినను పుట్టిల్లు నెవ్వరు మరువగలరు? నీ ప్రసాదము చేతనే నాకీ యశేష శోభన వైభవము. కాని ఒక్కటే నాకు భేద కారణము. నా ఇల్లు వెడలి ఈ మహర్షి నా వల్లభుడెటకును వెడలడు. నా ప్రీతికై కేవలమితడు నా చెంతన యుండును. నా సోదరీమణుల చెంతకేగిన జాడయే లేదు. దీన నాయప్పజెల్లెండ్రు పరితపింతురేమో! ఇది నాకొక్కటి దుఃఖ కారణమన విని యా రాజు రెండవ ప్రాసాదమున కేతెంచి యామెయుం దన ప్రాసాదాద్యుప భోగ వైభవము వర్ణింప విని యా బాలికయు నా మగడు నా చెంతన ప్రొద్దెల్ల నుండు నొండుమెడకు పోడని వాపోవ విని యిట్లందరి సౌధములకేగి యందరు నిట్లుగ్గడింప నానందాశ్చర్య నిర్భరవివశ హృదయుండై సౌభరి భగవంతుం డేకాంతమున నుండుతరిం దరిసి యాతని పూజలందికొని యిట్లనియె.
దృష్టస్తే భగవన్ సుమహానేషసిద్ధి ప్రభావః నైవం విధమన్యస్యకస్యచిదస్మాభిర్విభూతివిలసితమవ లక్షితంకియదేతద్భగవతస్తపసః ఫలమిత్యభిపూజ్యతమృషిం తత్రైవతేనర్షివర్యేణసహ కంచి త్కాలమాభిమాతోపభోగాన్ బుభుజే స్వపురం చాజగామ॥
కాలేనగచ్చతా తస్యతాసురాజతనయాసు పుత్రశతంసార్థమభవత్॥
అనుదినానురూడస్నేహప్రసరశ్చ సతత్రాతీవ మమతాకృష్ణహృదయోఽభవత్॥
అప్యేతేఽస్మతృత్రాః కలభాషిణః పద్భ్యాంగచ్చేయుః, అప్యేతేయౌవనినోభవేయుః, అపికృత దారానేతాన్ పశ్యేయమ్ అప్యేషాం పుత్రాభవేయుః అప్యేతత్పుత్రాన్ పుత్రసమన్వితాన్ పశ్యేయమిత్యాదిమనోరథా ననుదినం కాలసంపత్తివృద్దానవేక్ష్యైతచ్చిన్తయామాస॥
సౌభారేః విరాగదాశాయాం మనసః ప్రవృత్తిరద్భుతమిదమ్ మనోరథానాంనసమాప్తిరస్తివర్షాయుతేనా ప్యథవాపి లక్ష్యైః।
పూర్ణేషుపూర్ణేషు పునర్నవానా ముత్పత్తయస్సన్తి మనోరథానామ్॥
పద్భ్యాంగతా యౌవనినశ్చజాతా దారైశ్చసంయోగమితాః ప్రసూతాః।
దృష్టాస్సుతా స్తత్తనయప్రసూతిం ద్రష్టుం పునర్వాంచతి మేఽన్తరాత్మా॥
ద్రక్ష్యామితేషామపిచేత్ప్రసూతిం మనోరథోమేభవితాతతోఽన్యః।
పూర్ణేఽపితస్యాప్యపరస్యజన్మ నివార్యతేకేన మనోరథస్య॥
అమృత్యుతో నైవమనోరథానా మన్తోఽస్తివిజ్ఞాతామిదంమయాఽద్య।
మనోరథాసక్తి పరస్యచిత్తం నజాయతేవై పరమార్థంసంగి॥
నమేసమాదిర్జలవాసమిత్రమత్స్యస్యసంగాత్సహసై వనష్టః।
పరిగ్రహస్సంగకృతోమయాఽయం పరిగ్రహోత్థాచమమాపిలిప్సా॥
దుఖంయదేవైక శరీరజన్మ శతార్థసంఖ్యాతమిదంప్రసూతమ్।
పరిగ్రహేణక్షితిపాత్మజనాం సుతైరనేకై ర్భహూళీ కృతంతత్॥
సుతాత్మజైస్తత్తనయైశ్చభూయో భూయశ్చ తేషాంస్వపరిగ్రహేణ।
విస్తారమేష్యత్యతిదుఃఖహేతుః పరిగ్రహోవై మమతాభిధానః॥
చీర్ణంతపోయత్తుజలాశ్రయేణ తస్యర్ ద్ధిరేషాతపసోఽన్తరాయః।
మత్స్యస్యసం గాదభవచ్చయోమే సుతాదిరోగోముషితోఽస్మితేన॥
నిస్సంగతాముక్తిపదంయతీనాం సంగాదశేషాః ప్రభావన్తి దోషాః।
ఆరూడయోగోఽపిని పాత్యతేఽధః సంగేనాయోగీ కిముతాల్పసిద్ధిః॥
సోఽహంచరిష్యామితథాఽత్మనోఽర్థే పరిగ్రహగ్రాహగృహీతబుద్ధిః।
యథాహిభూయః పరిహీనదోషో జనస్యదుఃఖై ర్భవితాన దుఃఖీ॥
భగవంతుడా! ఈ నీ గొప్ప యణిమాదిసిద్ధి ప్రభావముం చూచితిని. ఇట్టి విభూతి వైభవమును మేమింకొకని యెడ దిలకించి యుండము. ఇదంతయు భగవన్మూర్తియగు నీ తపస్సు యొక్క ఫలము. అని యమ్మునిం బూజించి యక్కడనే యమ్మునివరునితో గొంత కాలముండి యభిమత భోగముల ననుభవించి తన పురమునకు వచ్చెను. కొంత కాలము గడువ నమ్మునికా రమణు లందు నూటయేబది మంది పుత్రులు గల్గిరి. దినదిన మట్లు పెంపెక్కిన స్నేహ ప్రసారము గల యా ముని మమకారము మనసు నాకర్షింప నీ నా పిల్లలు ముచ్చటగ బలుక నేర్తురా? ముద్దుగ నడుతురా? యువకులగుదురా? యువతులం బెండ్లాడుదురా? అట్టి యందము నేనుగందునా? వీరికి కొడుకు లుదయింతురా? వీరు కొడుకులకు గొడుకులం గన నేను గనులార గనుగొందునా? ఈ మున్నగు కోరికలను కాల సంపదచే నను దినము పెరుగుచున్న వానిం జూచి యిట్లాలోచించెను. ఒక మనోరథము వెంట మనోరథము పుట్టును. మనోరథములకు సమాప్తి పదివేలు కాదు. లక్షల యేండ్లకైన లేదు. మనోరథములు పూర్ణము లయిన కొలది క్రొత్తవి పోటమరించును. కాళ్ళు వచ్చి నడక వచ్చినది యౌవనమును గందిరి. భార్యలతో గలయిక యేర్పడెను. సంతానుము కల్గినది. కొడుకుల గంటిని. వారి కొడుకుల పుట్టువును నా ఇంకను చూడ వలయునని కోరుచున్నది. వారి సంతానముం గూడ చూచెద గాక! అవ్వల మరొక మనోరథము పుట్టును. అదియును నిండిన నాపై నింకొకటి పుట్టును. మనోరథముల నెవ్వడు వారింప గలడు? మృత్యువు దాకా మనోరథముల కంతు లేదు. ఇప్పటికిది నాకు దెలిసినది. మనోరథార్థములందు సక్తమయిన మనస్సు పరమార్థ మందు సక్తము కాదు. నీట వసించు చేపల స్నేహముచే నా సమాధి వెంటనే నశించినది. ఆ సంగముచే నంగనా పరిగ్రహము చేసితిని. సంసార పరిగ్రహముచే నత్యంత విప్స (వాంఛ) యతిశయించినది. ఒక్క శరీరము
పుట్టుటే దుఃఖమయి యుండ నూటయేబది శరీరముల నిటగన్నాడను. రాజ కన్యలం బెండ్లాడుటతో ననేక పుత్రులతో నది మిక్కిలి పెంపబడినది పౌత్రుల చేతను, వారి కుమారు చేతను వారి వారి పరిగ్రహముల చేతను దుఃఖహేతువు తెగ పెరుగును. మమకారమునకు పర్యాయమే పరిగ్రహము. నీట నుండి చేసిన తపస్సునకు నీయభివృద్ది యంతరాయము (విఘ్నము). చేప తోడ నుండుట వలన నాకు సుతాదుల యెడ వలపు గలిగెను. దానిచే నేను ముషితుడ నయితిని హరింప బడినాడను. యతులకు నిస్సంగత్వము ముక్తిస్థానము. సంగము వలన నెల్ల దోషములు గల్గును. యోగా రూఢుడయిన వాడు ముక్తిచే గ్రిందికి త్రోయ బడును. అల్పసిద్ది గలవాని మాట చెప్పెడి దేమి. భార్యయనెడి గ్రహము (మొసలి) పట్టి
బుద్ది చెడిన నేను నావారి దుఃఖములకు దుఃఖ పడక దోషముల దొలగి ఆత్మసిద్ది నందుట కనువుగ నిక జరించెద. సర్వధాత అచింత్య రూపుడు అణువు కంటె నణువు మహత్తుకంటె మహత్తు యుగ భేధముచే సితాసిత వర్ణుడు లేక శుద్దబద్ద రూపుడు ఈశ్వరుల కీశ్వరుడు నైన విష్ణువును తపసుచే ఆరాధింతును.
తస్మిన్నశేషౌజసిసర్వరూపిణ్యవ్యక్తవిస్పష్టతనావనన్తే।
మమాచలంచ త్తమపేతదోషం సదాఽస్తువిష్ణావభవాయభూయః॥
సమస్తభూతదమలాడనన్తాత్స ర్వేశ్వరా దన్య దానాదిమధ్యాత్।
యస్మాన్నకిం చిత్తమాహం గురూణాం పరంగురుం సంశ్రయ మేమి విష్ణుమ్ ॥
సమస్త శక్తి మంతుడును సర్వ రూపుడును కారణకార్య రూపుడును ననంతుడును నగు నా విష్ణు దేవుని యందు దోషదూరమైన చిత్తము తిరిగి పునరావృత్తి లేని ముక్తి యెల్లపుడు స్థిరముగా నుండు గాక! ఆది మధ్యంతములు లేని వాడును దోషరహితుడును సమస్త రూపుడును సర్వేశ్వరుడును విష్ణువు కంటే నితరమే మాత్రము లేక పోవుటచే నేను గురువులకు పరమ గురువగు నా విష్ణువును శరణు పొందు చున్నాను.
ఇత్యాత్మానమాత్మనై వాభిదాయసౌసౌభరిరపహాయస్వపుత్రగృహాసనపరిచ్చాదాదిక
మశేషమర్థజాతం సకల భార్యాసమవేతో వనం ప్రవివేశ॥
తత్రాప్యనుదినం వైఖానస నిష్పాద్యమ శేషక్రియా కలాపం నిష్పాద్యక్షపితసకలపాపః
పరిపక్వమనోవృత్తిరాత్మన్యగ్నీన్ సమారోప్యభిక్షురభవత్॥
భగవత్యాసజ్యాఖిలకర్మకలాపమజమవికార్మమరణాదిధర్మ మవాపపరమనన్తంపర।
ఇత్యేతన్మాంధాతృదుహితృసంబన్దాద్యాఖ్యాతమ్॥
లిఖతి లేఖయతి శిక్షయతి అధ్యాపయతి ఉపదిశతిపశ్యాయష్టౌజన్మాన్యసన్మతిరరపధర్మః వాఙ్మనసో రసనమార్గానుసరణ మ శేషహేయేషువా మమత్వం నభవతీత॥
యిట్లు తనను దాన తెలిసికొని సౌభరి గృహారామక్షేత్ర పుత్ర కళత్ర విషయ సముదాయము నెల్ల విడిచి, భార్య లందరిలో నడవిం బ్రవేశించెను. అందున ననుదినము వైఖానన (వానప్రస్థ) ప్రక్రియ ననుసరించి అఖిల పాపములం దొలగించికొని, పరిపక్వ మనోవర్తనుడై తన యందగ్నులను ఆరోపించుకొని భిక్షువు (సన్యాసి) ఆయెను. సకల కర్మ కలాపమును భగవంతుని యందర్పించి జన్మ జరాది వికార శూన్యము మరణాది ధర్మ రహితము దిగ్దేశాది సంబంధ శూన్యము పరమ పదమునగు నచ్యుత స్థాన మందెను. ఇది మాంధాతృ దౌహిత్ర చరిత్రము దేల్పితిని. ఈ సౌభరి చరిత్ర మెవ్వడు స్మరించునో, జడువునో, జదివించునో, వినును, వినిపించునో, ధారణ సేయునో, వ్రాయును, వ్రాయించునో, నేర్పును, అధ్యయనము సేయించునో, ఉపదేశించునో, వాని కేనిమిది జన్మములు అసద్బుద్ధి అధర్మము వాజ్మనః కాయముల చేన సన్మార్గ వర్తనము సమస్త హేయ పదార్థము లందు మమకారమునుం గలుగదు.
Summary of chapter 2 of the Vishnu Mahā Purāṇa is as follows:
Purañjaya/Kakutstha is born with Viṣṇu's aṃśa and fights as a hero in cosmic battle. Ikṣvāku is born from Manu's sneeze. His descendant Vikukṣi is also called Śaśāda. Kuvalaśva/Dhundumāra destroys the demon Dhundhu. Yuvanāśva accidentally drinks the consecrated water intended for his queen; Māndhātā is born from his right side and is named and nursed by Indra himself. Māndhātā's famous descendant Saubhari performs austerities in the Yamunā and, upon emerging, marries fifty daughters of Māndhātā — but later renounces all in disillusionment and attains liberation.