విష్ణు మహా పురాణము

15 - ఋభుముని నిదాఘమునికి అద్వైత ప్రవచనము చేయుట

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తేమౌనినం భూయశ్చిన్తయానం మహీపతిమ్

ప్రత్యువాచాథ విప్రోఽసావద్వైతాన్తర్గతాంకథామ్

శ్రీపరాశరుడు:

ఇలా తాను (భరతుడు) పలుక మౌనిమూని లోలోన నాలోచించుచున్న రాజుం గూర్చి, బ్రాహ్మణుడు అద్వైత విషయ మయిన కథనిలా వచించెను.

బ్రాహ్మణుడు:

శ్రూయతాంనృపశార్దూల! యద్గీతమృభుణాపురా

అవబోధం జనయతా నిదాఘస్య మహాత్మనః

ఋభుర్నామాభావస్త్పుత్రోబ్రాహ్మణః పరమేష్టినః

విజ్ఞాతతత్త్వసద్భావోనిసర్గాదేవభూపతే!

తస్యశిష్యోనిదాఘోఽభూత్పులస్త్యతనయః పురా

ప్రాదాదశేష విజ్ఞానం స తస్మైపరయాముదా

అవాప్తజ్ఞానతన్ద్రస్యనతస్యాద్యైతవాసనామ్

సబుభుస్తర్కయామాసనిదాఘస్య నరేశ్వర!

దేవికాయాస్తటేవీరనగరంనామవై పురమ్

సమృద్దమతిరమ్యంచ పులస్త్యేననివేశితమ్

రమ్యోపవనపర్యన్తేసతస్మిన్ పార్థివోత్తమ

నిదాఘోనామయోగాజ్ఞః ఋభుష్యోఽవసత్పురా

దివ్యవర్షసహస్రేతు సమతీతేఽస్యతత్పురమ్

జగామసఋభుశ్శిష్యం నిదాఘమవలోకజః

సతస్యవైశ్వదేవాన్తేద్వారాలోకనగోచరే

స్తితస్తేనగృహీతార్ ఘ్యానిజవేశ్మప్రవేశితః

ప్రక్షాలితాఙ్ర్ఘిపాణింతుకృతాసనపరిగ్రహమ్

ఉవాచసద్విజశ్రేష్టోభుజ్యతామితిసాదరమ్

బ్రాహ్మణుడు:

ఓ నృపశ్రేష్ఠ! మున్ను జ్ఞానోదయము సేయుచు నిదాఘునికి వర్ణించిన కథను వినుము. చతుర్మఖ బ్రహ్మ సుతుడు ఋభువను నాతడు సహజముగనే తత్త్వజ్ఞానియై యుండెను. ఆతనికి పులస్త్య కుమారుడు నిదాఘుడను వాడు శిష్యుడయ్యెను. అమితానందముతో నతనికి ఋభవ శేష విజ్ఞానము నొసంగెను. జ్ఞానము వడసిన యీ శిష్యుని యద్వైత వాసన యేపాటిదో ఋభువు పర్యాలోచించెను. దేవికా నదీ తీరమందు సర్వ సమృద్దము సర్వ సుందరము నైన పురము ‘వీర నగరమ’ ను పేర పులస్త్యునిచే నిర్మింప బడినది. రామ్యోద్యాన పరిసర మయిన యా పట్టణమంద నిదాఘుడను పేరివాడు యోగాజ్ఞాని ఋభువు శిష్యుడు వసించు చుండె. వేయి దివ్య సంవత్సరములు గడువగా నాతనిం జూడ ఋభుండట కేగెను. వైశ్వదేవ మయిన తర్వాత ద్వారమున గొని యాతని యింత ప్రవేశింప జేయబడెను. నిదాఘ ముని కాలుసేతులు గడిగి యాసనమందు కూర్చుండిన ఋభుని సాదరముగ, మా యింట భోజనము సేయుడని పలికెను.

ఋభుడు:

భోవిప్రవర్య! భోక్తవ్యంయదత్రభావతోగృహే

తత్కథ్యతాంకదన్నేషునప్రీతిస్సతతంమమ

ఋభుడు:

ఓ విప్రోత్తమా! భుజింప దగినది మీ యింట నేమున్నది తెల్పుము. నీరసాన్నములు యెడ నా కెప్పుడును ప్రీతిలేదు.

నిదాఘుడు:

సక్తుయావకవాట్యానామపూపానాంచమేగృహే

యద్రోచాతేద్విజశ్రేష్ఠ! తత్తద్భుఙ్ క్ష్వయథేచ్చయా

నిదాఘుడు:

పేలపిండి యావకము (యావ వికారము) వాత్యము = కందమూలాదికము అప్పములు మా యింట కలవు. ఇందేది నీకు రుచించు నది స్వేచ్చగా భుజింపుము.

ఋభుడు:

కదన్నాని ద్విజైతాని మృష్టమన్నంప్రయచ్చమే

సంయావపాయసాదీని ద్రప్సఫాణితవన్తిచ

ఋభుడు:

ఓ ద్విజ! ఇవన్నియు పనికిమాలిన యన్నములు. సంయావము = పారుపత్తులు, పాయసము = పరమాన్నము, ద్రప్సము = పెరుగు, పాణితములు = బెల్లపు భక్ష్యములు బెట్టుము.

నిదాఘుడు:

హే హేశాలిని! మద్గేహేయథ్కిమ్నిదతిశోభనమ్

భక్ష్యోపసాధానంమృష్టం తేనాస్యాన్నం ప్రసాదయ

ఇత్యుక్తాతేనసాపత్నీమ్రుష్టమన్నంద్విజస్యయత్

ప్రసాదితవతీతద్వైభార్తుర్వచనగౌరవాత్

తంభుక్తవన్తమిచ్చాతోమ్రుష్టమన్నంమహామునిమ్

నిదాఘఃప్రాహభూపాల! ప్రస్రయావనతస్థ్సితః

నిదాఘుడు:

ఓ గృహిణీ! మంచి యాహారము నా యింట నే కొంచమేని భక్ష్యోపస్కరణమైన రుచి కరమైన దేదేని ఈయన కాహారము సమకూర్చును. అన నా యిల్లాలు ఆ ద్విజునకు భర్త మాట యందున్న గౌరవముతో వడ్డించెను. ఆ యన్నమును మనసార భుజించుచున్న యమ్మహామునింగని వినయ వినతుడై నిలిచి

నిదాఘుడు:

అపితేపరమాతృప్తిరుత్పన్నాతుష్టిరేవచ

అపితేమానసంస్వస్థమాహారేణకృతంద్విజ

క్వనివాసోభవాన్విప్ర క్వవాగంతుంసముద్యతః

ఆగమ్యతేచభావతాకుతస్తచ్చద్విజోచ్యతామ్

నిదాఘుడు:

నీకు బరమ తృప్తి తుష్టియుం గలిగెనా? నీ మనస్సు స్వస్త మొనరించి కొంటివా? నీ నివాస మెక్కడ? ఎటకేగ భూనితివి? ఎటనుండి నీవు వచ్చున్నావో యదియుం దేలుపుము.

ఋభురుడు:

క్షుద్యస్యతస్యభుక్తేన్నేతృప్తిర్ బ్రాహ్మణజాయతే

నమేక్షుదభవత్తృప్తింకస్మాన్మాంద్విజపృచ్చసి

వహ్నినాపార్థివధాదాతౌ క్షపితేక్షుత్సముద్భవః

భవత్యమ్భసిచక్షీణే నృణాంతృదపిజాయతే

క్షుత్తరుష్ణేదేహధర్మాఖ్యేనమమైతేయథోద్విజ

తతఃక్షుత్సంభవాఽభావాత్తృప్తిరస్త్యేవమేసదా

మనసస్స్వస్థతాతుష్టిశ్చిత్తధర్మామిమౌద్విజ

చేతసోయస్యతత్పృచ్చపుమానేభిర్ణయుజ్యతే

క్వనివాసస్థావేత్యుక్తంక్వగంతాసిచయత్త్వయా

కుతశ్చాగమ్యతేతత్ర త్రితాయేపినిబోధమే

పుమాన్ సర్వగతోవ్యాపీ ఆకాశవదయంయతః

కుతఃకుత్రక్వగన్తాసీత్యేతదస్యార్తవత్కథమ్

సోఽహంనగన్తానాగన్తానైక దేశానికేతనః

త్వంచాన్యేచనచత్వంచనాన్యేనై వాహమప్యహమ్

మృష్టంనమృష్టమిత్యేశాజిజ్ఞాసామేకృతాతవ

కింవక్ష్యసీతితత్రాపిశ్రూయతాంజసత్తమ

కిమస్వాద్వాథవామృష్టం భుఞ్ఙతోఽస్తిద్విజోత్తమ

మృష్టమేవయథామృష్టంతదేవోద్వేగకారకమ్

అమృష్టంజాయతేమృష్టంమృష్టాదుద్విజతేజనః

ఆదిమధ్యా వసానేషుకిమన్నంరుచికారకమ్

మృణ్మయంహిగృహంయద్వన్మ్రుదాలిప్తంస్థిరంభవేత్

పార్థివోఽయంతథాదేహః పార్తివైఃపరమాణుభిః

యవగోధుమముద్గాది ఘృతంతైలంపయోదధి

గుడంఫలాదీనితతథాపార్థివాః పరమణవః

తదేతద్భావతాజ్ఞాత్వామృష్టామృష్టవిచారియత్

తన్మనస్సమతాలమ్భికార్యంసామ్యంహిముక్తయే

ఋభువు:

ఓ బ్రాహ్మణా! ఎవని కాకలి గలదో యతడు భుజించిన దృప్తి కలుగును. నాకాకలి లేదు. తృప్తిం గూర్చి ఎందుల కడిగెదవు? వహ్నిచే (జఠరాగ్నిచే) పార్థివధాతువు క్షయించినంత నాకలి దప్పికలు పుట్టును. ఆకలి దప్పికలు దేహ ధర్మములు. ఇవి నాకు లేవు. ఆకలి తీరిన తృప్తి. ఓ విప్ర! మనస్సు స్వస్తమాయి యుండుట తుష్టి. ఇవి చిత్తము యొక్క ధర్మములు. ఎవనికి చిత్తము గలదో వానికే ఈ ధర్మములు. వాని నీ ప్రశ్నము లడుగుము. పురుషుడు (ఆత్మ) వీనితో గూడి యుండడు. నీ నివాస మెక్కడ? ఎచటికి వెళ్ళెదవు? ఏట నుండి వచ్చు చున్నావని మూడు ప్రశ్న లడిగితివి. ఈ ప్రశ్న మర్థ వంతమెట్లు? పురుషుడు సర్వగతుడు. ఆకాశము వలె వ్యాప్తియై యుండుట వలన నీ ప్రశ్నలు కుదురవు. నేను వెళ్ళువాడను గాను. వచ్చు వాడనుంగాను. ఒక దేశము నందుండు వాడను గాను. నీవును నితరులును నీవు గావు ఇతరులును గారు. నేను నేనును గాను నీవేమి చెప్పుడువో యని రుచిగా నున్నదా? రుచి హీనమా! అన్నమని జిజ్ఞాస సేసితివి. ఆ విషయంలో గూడ చెప్పెద. ఓ ద్విజోత్తమా! వినుము. తినువానికి స్వాదువని యస్వాదువని యేమున్నది. రుచి కరమయిన యన్నము రుచి కరమెట్లో యట్లె యదె యుద్వేగ కారకము నగును. అమృష్టమే (అరుచికరమే) మృష్టమగును( రుచి కరమగును). రుచి కరమయిన వస్తువుం గని జనముద్వేగ పడును (ఆందోళన పడును) అన్నము ఆదిని నడుమను తుదను గూడ రుచి కారక మందువా? మట్టి యిల్లు మట్టి పూత పెట్టిన స్థిరమయి నిలిచి నట్లు ఈ దేహము పార్థివము (భూ పరమాణు మయము) పార్థివ పరమాణువుల వలన అనగా యవలు, గోధుమలు, పెసలు, నెయ్యి, నూనె, పాలు, పెరుగు, బెల్లము, పడ్లు మొదలయిన వాని వలన స్థిర మగును. కావున నీవీ యంశము నెరిగి ఇది మృష్టము (రుచి) అమృష్టము (అరుచి) అను విచారణకు దిగిన మనస్సును సమత్వ లంబ మయిన దానింగా జేయు నగును. అట్టి సామ్యము (సమ బుద్ది) ముక్తికి కారణ మగును.

బ్రాహ్మణుడు:

ఇత్యాకర్ ణ్యవచస్తస్యపరమార్థాశ్రితంనృప

ప్రణిపత్యమహాభాగోనిదాఘోవాక్యమబ్రవీత్

ప్రసీద మద్దితార్థాయ కథ్యతాంకస్త్వమాగతః

నష్టోమోహ స్తవాకర్ ణ్య వచాంస్యేతానిమే ద్విజ!

బ్రాహ్మణుడు:

ఈ విధముగా నిదాఘునికి ఋభుడు తత్త్వోపదేశము సేయ నా పరమార్థ వచనము లాలించ మహానుభావుడు నిదాఘు డిట్లనెను.

ఋభుడు:

ఋభురాస్మితవాచార్యఃప్రజ్ఞాదానాయతేద్విజ

ఇహాగాతోహంయాస్యామిపరమార్థ స్తవోదితః

ఏకమేవమిదంవిద్ధి నభేదిసకలంజగత్

వాసుదేవాభిదేయస్య స్వరూపంపరమాత్మనః

తతేత్యుక్త్వానిదాఘేనప్రణిపాతపురస్సరమ్

పూజితఃపరయాభక్త్యాఇచ్చాతఃప్రయయావృభుః

ఋబుడు:

నా మేలు కొఱకు దయచేసిన మహాత్ముడ వెవ్వడవో తెలుపుము. బ్రాహ్మణుడా! ఈ నీ మాటలు విన్న నా మోహము పోయినది. అన ఋభుడు: నేను ఋభుడను. నీకాచార్యు డనై జ్ఞానమీయ వచ్చితిని. పరమార్థము నీకు దేల్ప బడినది వెళ్ళు చున్నాను. ఈ జగమెల్ల నొక్కటే వస్తువు. భేదమిందు లేదు. వాసుదేవా భిధమయిన పరమాత్మ యొక్క స్వరూపమిది యని గ్రహింపుము, అన నౌనని పలికి నిదాఘుడు సాష్టాంగ ప్రణతుడై పరమ భక్తితో బూజింప ఋభువు స్వేచ్చం జనియె.