మైత్రేయుడు:
చక్రేకర్మమహచ్చౌరిర్బిభ్రాణోమానుషీంతనుమ్।
జిగాయశక్రం శర్వంచ సర్వాన్ దేవాంశ్చలీలయా॥
యచ్చాన్యదకకరోత్కర్మ దివ్యచేష్టావిఘాతకృత్।
తత్కథ్యతాం మహాభాగ! పరంకౌతూహలం హిమే॥
మైత్రేయుడు:
శౌరి మానుష మూర్తియై యద్భుత మయిన మహాకార్యము లెన్నో కావించెను. లీలా మాత్రముగ నింద్రుని పరమేశ్వరుం దేవతలను మఱియేమియు వమ్మొనరించె నాయా లీలల నింకను విన ముచ్చట యగుచున్నది. కావున నో మహానుభావా! వానినాన తిమ్మన.
శ్రీపరాశరుడు:
గదతోమమవిప్రర్షే శ్రూయతామిదమాదరాత్।
నరావతారేకృష్ణేనదగ్ధావారాణసీయథా॥
పౌణ్డ్రకోవాసుదేవ స్తువాసుదేవోభావద్భువి।
అవ్తీర్ణస్త్వ మిత్యుక్తోజనై రజ్ఞాన మోహితైః॥
సమేనేవాసుదేవోఽహమవతీర్ణో మహీతలే।
నష్టస్మృతి స్తతస్సర్వ విష్ణుచిహ్నమచీకరత్॥
దూతం చప్రేషయామాస కృష్ణాయసుమహాత్మనే।
త్యక్త్వాచాక్రాదికం చిహ్నం మదీయం నామచాత్మనః॥
వాసుదేవాత్మకం మూఢ! త్యక్త్వాసర్వమశేషతః।
ఆత్మానోజీవితార్థాయతతోమేప్రణతింవ్రజ॥
ఇత్యుక్తస్సంప్రహస్యైనం దూతం ప్రాహజనార్ధనః।
నిజచిహ్నమాహం చక్రం సముత్సృక్ష్యేత్వ యీతివై॥
వాచ్యశ్చపౌణ్డ్రకోగత్వా త్వయాదూత! వచోమమ।
జ్ఞాతస్త్వద్వాక్యసద్భావో యథ్కార్యం తద్విధీయతామ్॥
గృహీతచిహ్నవేషోహమాగమిష్యామితేపురమ్।
ఉత్సృక్ష్యామిచతచ్చక్రం నిజచిహ్నమ సంశయమ్॥
అజ్ఞాపూర్వఞ్చయాదిదమాగచ్చేతిత్వయోదితమ్।
సంపాదమిష్యేశ్వస్తుభ్యం సమాగమ్యావిలంబితం॥
శరణం తేసమభ్యెత్యకర్తాస్మినృపతేతథా।
యథాత్వత్తోభయం భూయేనమేకించిద్భవిష్యతి॥
ఇత్యుక్తేగతేదూతేసంస్మృత్యాభ్యాగతం హరిః।
గరుత్మ న్తమాథారుహ్యత్వరిత స్తత్పురం యయౌ॥
శ్రీపరాశరుడు:
కృష్ణుడు నరావతారమెత్తి కాశీనగరముం గాల్చెను. ఆ కథ తెల్పెద వినుము అజ్ఞాన మోహితులగు జనులు నీవు వాసుదేవుడవే భువినవతరించి నావన పౌండ్రకుడు (పుండ్రదేశ ప్రభువు) వాసుదేవుడనే యిలపై నవతరించితినని జన్మాంతర స్మృతికోలుపోయిన యా పౌండ్రకుడు విష్ణు చిహ్నము లన్నియుం జేయించుకొని కృష్ణునికి ప్రతిగా వానిం ధరించెను.
అంతియ కాక మహాత్ముడగు కృష్ణుని దగ్గరకు ఓ మూఢా! నీవు బ్రతుకదలతు వేని విష్ణుని గుర్తులు చక్రాది చిహ్నములు విడిచి వాసుదేవుడను నా పేరును వదలి నా కడకు వచ్చి వ్రాలుమని యోక దూతను బంపెను. ఇది విని హరి దూతం గని యల్లన నవ్వి నీ చిహ్నమును నీపై విసర బోవుచున్నానని పౌండ్రకునకు జెప్పుము. నీ మాట లోని భావము తెలిసినది, ఏది సేయనగు నది సేయుము. ఆయా చిహ్నములు వేషము వేసికొనియే నీ పురమున కేతెంతును. నిజ చిహ్నము చక్రమును వదలెదను. సంశయము లేదు. రమ్మని నన్నాజ్ఞా పూర్వముగా నున్న నీ మాటను రేపే నీ కప్పగించెదను. నిముశ మాగను. ఓ రాజా నీ వలన భయమే మాత్రము లేకుండు గాక! ఇదే వచ్చి నిన్ను శరణు జొచ్చెదనని తెలుపమని దూతం బంపి హరి తలంచి నంతన నరుదెంచిన గరుత్మంతునిపై నెక్కి పౌండ్రక నగరమునకుం జనియె.
తతస్తుకేశవోద్యోగం శ్రుత్వాకాశీపతి స్తదా।
సర్వసైన్యపరీవారః పార్ ష్ణిగ్రాహ ఉపాయయౌ॥
తతోబలేనమహతా కాశీరాజ బలేనచ।
పౌన్డ్రకో వాసుదేవోఽసౌకేశవాభిముఖం యయౌ॥
తందదర్శహరిర్దూరాదుదారస్యన్దనేస్థితమ్।
చక్రహస్తం గదాశార్ ఙ్గ బాహుంపాణిగతామ్బుజమ్॥
స్రగ్ధరం పీతవసనం సువర్ణరచితధ్వజమ్।
వక్షస్థలేకృతం చాస్య శ్రీవత్సం దదృశేహరిః॥
కిరీటకుణ్డధరం నానారాత్నోపశోభితమ్।
తందృష్ట్వాభావగమ్బీరం జహాసగరుడధ్వజః॥
యుయుధేచబలేనాస్యహస్త్యశ్వబలినా ద్విజ!।
నిస్త్రింశాసి గదాశూలశక్తికార్ముకశాలినా॥
క్షణేనశార్ఙ్గనిర్ముక్తైశ్శరైరారివిదారణైః।
గదాచక్రనిపాతై శ్చ సూదయామాసతద్భలమ్॥
కాశీరాజబలంచై వంక్షయం నీత్వా జనార్దనః।
ఉవాచపౌణ్డ్రకం మూఢమాత్మచిహ్నోపలక్షితమ్॥
కాశీపతి హరియుద్దోద్యోగ వార్త విని సర్వ సైన్యముతో స్వామి పైకి ద్రొక్కికొని వచ్చెను. వానితో గూడి పౌండ్రకుడు వాసుదేవుని కెదురు నడచెను. చక్కని యాదరము ననున్న వానిని దూరము నుండియ చూచెను. చేతం జక్రము గద శార్ఙ్గము పద్మముం బూని వనమాల ధరించి కిరీట కుండలములు దాల్చి గరుడ చిహ్నితమైన జెండా తోడి వక్షః స్థలము నందు శ్రీవత్స చిహ్నమును రచించు కొనిన వానిని నానారత్నా లంకృతుండై పీతాంబర దారియగు వాని జూచి భావ గంభీరముగ నవ్వెను. నానావిధాయుధ శాలియైన వానితో తీవ్ర యుద్దమునుం గావించెను. శార్ఙ్గధనుర్వియుక్త శరజాలముల గదా చక్ర నిపాతనములను క్షణములో వాని సేనలం గూల్చెను. కాశీరాజు సైన్యమునుం గూల్చి జనార్ధనుడు తన చిహ్నములం జేయించి పెట్టుకొని మూర్ఖుని పౌండ్రకునిం గని యిట్లనియె
శ్రీభగవానుడు:
పౌణ్డ్రకోక్తం త్వయాయత్తుదూతవక్త్రేణమాంప్రతి।
సముత్సృజేతిచిహ్నాని తత్తేసంపాదయామ్యహమ్॥
చక్రమేతత్సముత్సృష్టం గదేయంతే విసర్జితా।
గరుత్మానేషచోత్సృష్టస్సమారోహతుతే ధ్వజమ్॥
శ్రీభగవానుడు:
పౌండ్రకా! దూత ముఖమున నన్ను గూర్చి నీ శార్ఙ్గచక్ర గదాది చిహ్నముల వదలు మన్న నీ మాట అక్షరాల పాటించెదను. ఇదిగో చక్రమును వదలితిని. ఇది గద వీడితిని. ఇడుగో గరుత్మంతునిం గూడ వడలు చున్నాను. నీ ధ్వజముపై నెక్కు గాక!
శ్రీపరాశరుడు:
ఇత్యుచ్చార్యవిము క్తేనచక్రేణాసౌవిదారితః।
పాతితోగాదయాభగ్నోధ్వజశ్చాస్యగరుత్మతా॥
తతోహాహాకృతేలోకే కాశీపుర్యధిపోబలీ।
యుయుధేవాసుదేవాసుదేవేన మిత్రస్యాపచితౌస్థితః॥
తతశ్శార్ఙ్గ ధనుర్ము క్తైశ్చిత్త్వాతస్యశిరశ్శరైః।
కాశీపుర్వాం సచిక్షేపకుర్వన్ లోకస్య విస్మయమ్॥
హత్వాతం పౌణ్డ్రకకం శౌరిః కాశిరాజంచాసానుగమ్।
పునర్ ద్వారావతీం ప్రాప్తో రేమేస్వర్గగతోయథా॥
శ్రీపరాశరుడు:
అని పలికి వదలిన చక్రాయుధముచే వాడు చీల్చబడెను. గదచే దెబ్బకు కూల్చ బడెను. గరుడునిచే ధ్వజము విరిగి పడెను. ఆవల లోకము హాహాకార మొనరింప కార మొనరింప కాశీరాజు మిత్రునిపై మక్కువతో వాసుదేవునితో బోరెను. శార్ఙ్గధనుర్విముక్త బాణములచే గొట్టి లోకము వెఱగువడ వానిం గాశీపురం బడునట్లు విసరి వైచెను. శౌరి పౌండ్రకుని కాశిఱేనిని సపరివారముగ జంపి తిరిగి ద్వారవతిం జేరి స్వర్గధామ మందట్లు దాను గ్రీడించెను.
తచ్చిరః పతితంతత్ర దృష్ట్వాకాశీపతేః పురే।
జనః కిమేతదిత్యాహ ఛిన్నం కేనేతి విస్మితః॥
జ్ఞాత్వాతం వాసుదేవేన హతం తస్యసుత స్తతః।
పురోహితేనసహితస్తోషయామాసశంకరమ్॥
అవిముక్తేమహాక్షేత్రే తోషితస్తేన శంకరః।
వరం వృణీష్వేతితదాతం ప్రోవాచ నృపాత్మజమ్॥
సవవ్రే భగవన్ కృత్యాపితృహన్తుర్వధాయమే।
సముత్తిష్ఠతు కృష్ణస్యత్రత్ప్రసాదాన్మహేశ్వర॥
ఆ పడిన కాశీరాజు తలంగని ఏమిది? ఎవ్వడిది నరకెనని వింతపడి వాసుదేవునిచే వాడీల్గుట విని వాని కొడుకు పురోహితునితో గూడ శంకరుం బూజించి సంతుష్టు నొనరించెను. అవిముక్తమను నమ్మహాక్షేత్రమున వానిచే సంతుష్టి నొందిన శంకరుడు వరము గోరుకొమ్మనియె. అతడు నా తండ్రిం జంపిన వాని జంపుటకు నీ అనుగ్రహముచే కృత్యయను శక్తి విజృంభించుగాతమనియె.
శ్రీపరాశరుడు:
ఏవం భవిష్యతీత్యుక్తేదక్షిణాగ్నేరన న్తరమ్।
మహాకృత్యాసముత్తస్థౌ తస్యైవాత్మవినాశనీ॥
తతోజ్వాలాకారాళాస్వాజ్వలత్కేశకపాలికా।
కృష్ణకృష్ణేతికుపితాకృత్యాద్వారావతీం యయౌ॥
శ్రీపరాశరుడు:
అట్లయగు లెమ్మని శూలియనిన క్షణమున దక్షిణాగ్ని నుండి మహాకృత్య యను శక్తి వాని నాశమునకే జ్వాలాకారాళమైన ముఖముతో నగ్ని శిఖలట్లున్న జుట్టుతో పుర్రెల మాలతో కృష్ణ! కృష్ణ! అనుచు కోపముతో ద్వారవతికిం జనెను.
తామవేక్ష్యజనస్త్రాసాద్విచలల్లోచనోమునే।
యయౌశరణ్యం జగతాం శరణం మధుసూదనమ్॥
ఆమెంగని ద్వారకా జనము భయపడి కన్నులు గిఱ్ఱునం దిఱుగ సర్వ జగచ్చరణ్యుడగు మధు సూదనుని శరణొందెను.
కాశీరాజసుతేనేయమారాధ్యవృషభధ్వజమ్।
ఉత్పాదితామహాకృత్యేత్యవగామ్యాథచక్రిణా॥
జహికృత్యామిమాముగ్రాం వహ్నిజ్వాలాజటాలకామ్।
చక్రముత్సృష్టమక్షేషుక్రీడాస క్తేనలీలయా॥
తదగ్నిమాలాజతిలజ్వాలోద్గారాతిభీషణామ్।
కృత్యామనుజగామాశువిష్ణుచక్రం సుదర్శనమ్॥
చక్రప్రతాపనిర్దగ్దా కృత్యామాహేశ్వరీ తదా।
ననాశవేగినీవేగాత్తదప్యనుజగామతామ్॥
కృత్యావారాణమసీమేవ ప్రవివేశత్వరాన్వితా।
విష్ణుచక్రప్రతిహత ప్రభావా మునిసత్తమ!॥
తతః కాశీబలం భూరిప్రమథానాం తథాబలమ్।
సమస్త శస్త్రాస్త్రయుతం చక్రస్యాభిముఖంయయౌ॥
శస్త్రాస్త్రమోక్షచతురం దగ్ద్వాతద్బళమోజసా।
కృత్యాగర్భామశేషాంతాం తదావారాణసీంపురీమ్॥
సభూభృద్భృత్యపౌరాంతు సాశ్వమాతఙ్గమానవామ్।
అశేషగోష్ఠకోశాంతాం దుర్నిరీక్ష్యాంసురై రపి॥
జ్వాలాపరీష్క్రుతాశేషగృహప్రాకారచత్వరామ్।
దదాహతద్దరేశ్చక్రంసకలామేవతాం పురీమ్॥
అక్షీణామార్షమత్యుగ్రం సాధ్యసాధననసస్పృహమ్।
తచ్చక్రం ప్రస్ఫురద్దీప్తి విష్ణోరభ్యాయయౌకరమ్॥
కాశీరాజు కొడుకు వృషభ వాహనునిం గొల్చి యీ శక్తినుత్పాదింప జేసినాడని గమనించి పాచిక లాటలో నున్న హరి ఈ ఉగ్రశక్తిం గృత్యను వహ్నిజ్వాలా జటిలమైన యాకారము గలదానిం గూల్పుమని లీలా మాత్రముగ సుదర్శనమును వదలనది అగ్ని మాలా జటిలముగ జ్వాలలం గ్రక్కుచున్న మహాభీషణ మైన కృత్యను వెన్ధరిమెను. చక్ర ప్రతాపమున ప్రతిహత ప్రభావయై యా మహేశ్వరీ శక్తి బెండువడి పరుగిడి వారాణసీ పురమునే ప్రవేశించెను. చక్రాయుధము దానిని వెంబడించి తఱిమెను. అంతట కాశీసైన్యము ప్రమథ గణ సేనలు సమస్త శస్త్రాస్త్ర సంయుతముగ చక్రమున కెదురు నడిచెను. సుదర్శనము విజృంభించి కొండలతో గుట్టలతో గజములతో గుఱ్ఱములతో భటులతోడి దానిని అశేష గోష్ఠికోశాగారాదులతో దేవతలకేసి దేరిపార చూడరాని యా కాశీపురిని అశేష గృహ ప్రాకార చాత్వరములను జ్వాలలతో నలుదెసలం గ్రమ్మి పురమెల్ల దహించి వైచెను. అంతకునుం జల్లారని యాగ్రహముతో నత్యుగ్రమైన హరి చక్రాయుధము ఇంకను సాధింప వలసిన పని సాధనము లేమని యను కొనుచునే యత్యద్భుత దీప్తితో విష్ణువు కరమున కేతెంచెను.
Summary of chapter 34 of the Vishnu Mahā Purāṇa is as follows:
Pauṇḍraka, the king of the Puṇḍra country, has been styling himself the true Vāsudeva — bearing counterfeit versions of Kṛṣṇa's symbols. Kṛṣṇa marches to battle, kills Pauṇḍraka, and also kills the king of Kāśī who allied with him. The Kāśī king's son Sudakṣiṇa performs intense tapas and invokes a kṛtyā (a fire-demon) to avenge his father's death. The kṛtyā is sent to Dvārakā; Kṛṣṇa's Sudarśana cakra destroys it and turns back to Kāśī, burning the entire city.