శ్రీపరాశరుడు:
అతః పరం యయాతేః ప్రథమ పుత్రస్యయదోర్వంశమహం కథయామి॥
యత్రాషేషలోకనివాసోమనుష్యసిద్దగన్ధర్వయక్షరాక్షసగుహ్యక కింపురుషాప్సరోరగవిహగ
దైత్యదానవాదిత్యరుద్ర వస్వశ్విమరుద్దేవర్షిభిర్ముముక్షుభిర్ధర్మార్థకామమోక్షార్థిభిశ్చ
తత్తత్ఫాలలాభాయాసదాభిష్ణుతోఽపరిచ్ఛేద్య మహాత్మ్యం శేనభాగవాననాదినిధనోవిష్ణు
రవతతార అత్రశ్లోకః॥
యదోర్వంశం నర శ్శ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే।
యత్రావతీర్ణం కృష్ణాఖ్యం పరంబ్రహ్మ నరాకృతి॥
శ్రీపరాశరుడు:
ఈ మీద యయాతి పెద్దకొడుకు యదువు యొక్క వంశము నేను దెల్పెద. ఇందు అశేశాలోక వాసుడు మనుష్యసిద్ద గంధర్వ యక్షరాక్షస గుహ్య కింపురుషాప్సరోరగవిహగ దైత్యదానవాదిత్య రుద్ర వస్వశ్విమరు ద్దేవర్షుల చేత మోక్షార్థుల చేత నాయా ఫలలబ్దికై యెప్పుడు స్తుతింప బడుచు అపరిచ్చిన్న మహాత్మ్యము యొక్క యంశముతో భగవంతుడనాది నిధనుడు విష్ణువు అవతరించెను. కృష్ణాఖ్యమగు పరబ్రహ్మ మెందు నరాకృతిని అవతరించెనో ఆ యదువు యొక్క వంశమును విని నాతడు సర్వపాప విముక్తు డగును.
సహస్రజితక్రోష్టునలనహుషసంజ్ఞాశ్చ త్వారోయదుపుత్రా బభూవుః॥
సహస్రజిత్పుత్రశ్శతజిత్॥
తస్యహైహయ హేహాయవేణుహయాస్త్రయః పుత్రాబభూవుః॥
హైయహపుత్రోధర్మ స్థాస్యాపిధర్మనేత్రః తతః కున్తిః కున్తేస్సహజిత్॥
తత్తనయోమహిష్మాన్ యోఽసౌమాహీష్మతీం పురీం నిర్మాపయామాస॥
తస్మాద్భద్రశ్రేణ్యస్తతోదుర్దమస్తస్మాద్దనకః ధనకస్యకృతవీర్యకృతాగ్నికృతధర్మకృతౌజన॥
శ్చత్వారః పుత్రాబభూవుః॥
కృతవీర్యాదర్ జునస్సప్తద్వీపాధిపతిర్బాహుసహస్రోజజ్ఞే॥
యోసౌభగవదంశమత్రి కులప్రసూతం దత్తాత్రేయాఖ్యమారాధ్య బాహుసహస్రమధర్మ సేవా నివారణం స్వధర్మసేవిత్వం రణేపృథి వీజయం ధర్మతశ్చానుపాలన మరాతిభ్యోఽపరాజయ మఖిల జగత్ప్రఖ్యాతపురుషాచ్చమృత్యుమిత్యేతాన్ వరా నభిలషితవాన్ లేభేచ॥
తేనేయమశేషద్వీపవతీపృథివీసమ్యక్పరిపాలితా॥
దశయజ్ఞసహస్రాణ్యసావయజత్॥
తస్యచశ్లోకోఽద్యాపిగీయతే॥
ననూనం కార్తవీర్యస్య గతిం యాస్యన్తిపార్థివాః।
యజ్ఞేర్దానైస్తథాపోభిర్వా ప్రశ్రయేణశ్రుతేనచ॥
యదువు కుమారుల సహస్రాజిత్తు క్రోష్టువు నలుడు నహుషుడు ననువారు నల్గురు. సహస్ర జిత్తు కొడుకు శతజిత్తు అతనికి హైహయ హేహయ వేణుహయులు అను ముగ్గురు పుత్రులు. హైహయుని కొడుకు ధర్ముడు. వానివాడు ధర్మనేత్రుడు వానికి కుంతి వానికి సహజిత్తు వానికి మహిష్మంతుడు గలిగిరి. మహిష్మంతుని నిర్మాణమే మాహహ్మతీ నగరము. వానికి భద్రశ్రేణ్యుడు వానికి దుర్దముడు వానికి ధనకుడు వానికి క్రుతవీర్యుడు కృతాగ్ని కృతధర్ముడు కృతౌజుడు నను నల్గురు గల్గిరి. కృతవీర్యునికి అర్జునుడు (కార్త వీర్యార్జునుడు) గల్గెను. ఇతడు సప్త ద్వీపాధిపతి వేయి బాహువులు గల వాడయ్యెను. ఈయన భగవదంశ సంభూతుడు అత్రి వంశీయుడు నైన దత్తాత్రేయు సేవించి బాహుసహస్రము అధర్మసేవా నివారకము స్వధర్మ సేవిత్వము రణమందు పృథ్వీజయము ధర్మ పరిపాలనము శత్రువుల వలన నపరాజయము జగత్ప్రఖ్యాతడైన పురుషుని వలన మృత్యువు నను నీ తాను కోరిన వరములను వడసెను. అతనిచే నశేషద్వీపవతి వసుమతి చక్కగా భావింప బడెను. ఇతడు పదివేల యజ్ఞములు చేసెను. పార్థివులు యజ్ఞములచే దానములచే తపస్సులచే వినయముచే శ్రుతముచే (వినికిడిచే) పాండిత్యముచే నిజముగా కార్తవీర్యుని దారిం జనలేరు. అని యితడుప శ్లోకింప బడెను.
అనష్టద్రవ్యతాచతస్యరాజ్యేఽభవత్॥
ఏవంచ పఞ్చాశీతివర్షసహస్రాణ్యవ్యాహతారోగ్య శ్రీబలపరాక్రమో రాజ్యమకరోత్॥
మహిష్మత్యాం దిగ్విజయాభ్యాగతోనర్మదాజలావగాహనక్రీడాదిపానమదాకులేనాయత్నే
నైవతేనాశేష దేవదైత్యగన్దర్వేశజయోద్భూతమదావలేపోఽపిరావణః పశురివ బద్ద్వాస్వనగరైకాన్తేష్టాపితః॥
యశ్చపఞ్చాశీతివర్శసహస్రోపలక్షణ కాలావసానే భగవన్నారాయణాం శేన పరశురామేణోపసం హృతః॥
తస్యచపుత్రశతప్రధానాః పఞ్చపుత్రాబభూవుః శూరశూరసేన వృషసేన నమధు జయధ్వజ సంజ్ఞాః॥
జయధ్వజా త్తాళ జఙ్ఘః పుత్రోఽభవత్॥
తాళజఙ్ఘస్యతాళజజ్ఘాఖ్యం పుత్రశతమాసీత్॥
ఏషాం జ్యేష్ఠోవీతిహోత్రః తథాఽన్యోభరతః॥
భరతాద్వృషః॥
వ్యషస్యపుత్రోమధురభవత్॥
తస్యాపివృష్టిప్రముఖం పుత్రశతమాసీత్॥
యతోవృష్టిసంజ్ఞామేతద్గోత్రామవాప॥
మధుసంజ్ఞహేతుశ్చ మధురభవత్॥
యాదశ్చయదునామోపలక్షణా దితి॥
అతని రాజ్యమందు ద్రవ్యనష్ట మనునది (దొంగతనము) లేనేలేదు. ఇట్లు ఎనుబది యైదువేల సహస్రముల వ్యాహతమైన యారోగ్యము బలము పరాక్రమముం బొంది రాజ్యము చేసెను.
మాహిష్మతీ నగరమందు దిగ్విజయమునకై బయలు దేరి వచ్చి నర్మదా జలములం దిగి జలక్రీడలాడి పానమదముచే వ్యాకులుడై యున్న యా కార్తవీర్యునిచే అశేష దేవదైత్య గంధర్వాధీశుల జయించి నందున బుట్టిన మదమున గల్గిన గర్వాతిశయము నందిన రావణుడును పశువటు బంధింప బడి తనన నగర మందేకాంతమున నుంచ బడెను. ఈ మహాత్ముడు ఎనుబది యైదువేల యేండ్ల చివర భగవన్నారాయణాంశమైన పరశురామునిచే నుపసంహరింప బడెను. అతని నూర్గురు పుత్రులలో నైదుగురు ప్రధానులు శూర శూరసేన వృషసేన మధు జయధ్వజులను పేరివారు. జయధ్వజునికి తాళజంఘుడు, అతనికి తాళజంఘులను నూర్గురు కొడుకులు గల్గిరి. వీరిలో జ్యేష్టుడు వీతిహోత్రుడు మఱి యొకడు భరతుడు, భరతునికి వృషుడు అతనికి మధురుదు అతనికి నూర్గురు కొడుకులు గల్గిరి. ఈ వంశ మందు వలన వృష్టివంశము అను ప్రసిద్ది బొందెను. మధువను నాతడు మధువంశమను పేరునకు గారణ మయ్యెను. యదువు పేరలక్షింప బడుచు యాదవులు నయిరి.
Summary of chapter 11 of the Vishnu Mahā Purāṇa is as follows:
The Haihaya lineage descending from Yadu is traced, including the founding of Māhiṣmatī. Kārtavīryārjuna (Arjuna of the thousand arms), a great devotee of Dattātreya, is described: he receives five extraordinary boons, rules for 85,000 years, captures Rāvaṇa in the Narmadā river when the demon is floating in his pleasure-boat, and is ultimately slain by Paraśurāma. The Vṛṣṭi vaṃśa of the Yadu lineage is also traced.