బ్రాహ్మణాన్ భోజయేచ్చ్రాద్దే యద్గుణాంస్తాన్నిబోధమే॥
ఋత్విక్స్వస్రీయదౌహిత్రజామాతృశ్వశురాస్తథా।
మాతులోఽథతపోనిష్ఠః పంచాగ్న్యభిరతస్తథా॥
శిష్యాస్సంబన్ధినశ్చైవ మాతాపితృపరశ్చయః॥
ఏతాన్నియోజయేచ్చ్రాద్దే పూర్వోక్తాన్ ప్రథమేనృప!।
బ్రాహ్మణాన్ పితృతుష్ట్యర్థమనుకల్పేష్వనన్తరాన్॥
మిత్రధ్రుక్కునఖీక్లీబశ్శ్యావదన్తస్తథాద్విజః।
కన్యాదూషయితావహ్ని వేదోజంఘస్సోమవిక్రయీ॥
అభిశస్తథాస్తేనః పిశునోగ్రామయాజకః।
భృతకాద్యాపకస్తద్వద్భృతకాధ్యాపితశ్చయః॥
పరపూర్వాపతిశ్చైవమాతాపిత్రోస్తథోజంఘకః।
వృషలీసూతిపోష్టాచ వృషలీపతిరేవచ॥
తథాదేవలకశ్చైవ శ్రాద్దేనార్హన్తి కేతనమ్॥
ప్రథమేఽహ్ని బుధశ్శస్తాన్ శ్రోత్రియాదీన్నిమన్త్రయేత్।
కథయేచ్చతథైవైషాం నియోగాన్ పితృదైవికాన్॥
తతః క్రోధవ్యవాయాదినాయాసంచద్విజైస్సహ।
యజమానోనకుర్వీతదోషస్తత్రమహానయమ్॥
శ్రాద్దేనియుక్తోభుక్త్వావా భోజయిత్వానియుజ్యచ।
వ్యవాయీరేతసోగర్తే మజ్జయత్యాత్మనః పితౄన్॥
తస్మాత్ప్రథమమత్రోక్తం ద్విజాగ్య్రాణాంనిమన్త్రణమ్।
అనిమంత్ర్యద్విజాన్ గేహమాగతాన్ భోజయేద్యతీన్॥
పాదశౌచాదినాగేహమాగతాన్ భోజయేద్ద్విజాన్॥
పవిత్రపాణిరాచాన్తా నాసనేషూ పవేశయేత్।
పితౄణామయుజోయుగ్మాన్ దేవానామిచ్చయాద్విజాన్॥
దేవానామేకమేకంవా పితౄణాంచనియేజయేత్॥
తథామాతామహాశ్రాద్ధంవైశ్వ దేవసమన్వితమ్।
కుర్వీతభక్తీ సంపన్నస్తంత్రంవావైశ్వదైవికమ్॥
శ్రాద్ధము నందెట్టి గుణములు గల వారిని బ్రాహ్మణులను భుజింప జేయవలెనో చెప్పెద వినుడు. త్రిణాచికేతః = ద్వితీయ కాఠక మందున్న మూడను వాకములగు త్రిణాచికేత మంత్రములను చదివిన వాడు, లేక తదర్థానుష్ఠానము చేయువాడు. త్రిమదుః = 'మధువాతా' అను మూడు ఋక్కుల నధ్యయనము చేసిన వాడు లేక అదివ్రతము గాగలవాడు, లేక చాందోగ్యోక్తమగు మధు విద్యానిష్ఠ గలవాడు. త్రిసుపర్ణః = "బ్రహ్మమేతుమాం" అను అనువాకత్రయము నద్యయనము చేసిన వాడు, లేక తద్ర్వతుడు, లేక "చతుర్వర్గా" అను ఋక్కు నధ్యయనము చేసిన వాడు లేక తద్వ్రతుడు. షడంగవిత్ = శిక్షావ్యాకరణాది షడంగములతో గూడిన వేదము నధ్యయనము చేసిన వాడు, తదర్థ ప్రచారకుడు. యోగీ = బ్రహ్మ ధ్యానము చేయువాడు, జ్యేష్ఠసామగః = 'అజ్యదోహ'మను సంజ్ఞతో చెప్పబడు సామ విశేషమునకు జ్యేష్ఠసామ మని పేరు. దానిని చెప్పువాడు, ఋత్విక్కు, మేనల్లుడు, దౌహిత్రుడు, అల్లుడు, పిల్లనిచ్చిన మామ, మేనమామ, తపోనిష్టుడు, పంచ + అగ్ని + అభిరతః = ఆహవనీయాది త్రేతాగ్నులు సభ్యావసభ్యాగ్నులు రెండు = మొత్తము అయిదు అగ్నుల యందు అభిరతుడు. లేక వేదాంతము లందు చెప్పబడిన ద్యు, పర్జన్య, పృథివీ, పురుష, యోషిత్ రూపపంచాగ్ని విద్యనుపాసించు వాడు. శిష్యులు, వియ్యంకులు, మాతాపితరుల సేవించు వాడు. పైన చెప్పిన గుణములు గల బ్రాహ్మణులను శ్రాద్ధము నందు ప్రథమమున పితృ దేవతల సంతుష్టికై నియోగింప వలెను. వారు దొరకని సమయము నందు అను కల్పము నందు ఆ గుణములు లేని వారిని నియోగించ వలెను. మిత్ర ద్రోహి, పిప్పిగోళ్ళు గలవాడు, నపుంసకుడు, గొగ్గిపళ్ళ వాడు, బ్రాహ్మణుడు కానివాడు, కన్యల దూషించు వాడు, అగ్నిని వేదములను వదలిన వాడు, సోమ విక్రయము చేయువాడు, మహాపాతకో పేతుడు, దొంగ, కొండెములు చెప్పువాడు, గ్రామార్థమై పౌరహిత్యము చేయువాడు, భృతిచే వేదము చెప్పు వాడు, భరణమిచ్చి వేదాధ్యాయము చేసిన వాడు, రెండవ పెళ్లి చేసికొన్న దాని భర్త, తల్లి దండ్రులను విడిచిన వాడు, శూద్రాపత్యమును పోషించు వాడు, శూద్రస్త్రీ పతి, దేవాలయార్చకుడు వీరలు శ్రాద్ధము నందు ఆమంత్రణమునకు పనికి రారు. పండితుడు మొదట శ్రోత్రియులగు యోగ్యులగు యోగ్యులను నిమంత్రించ వలెను. వారికి పితృ దేవతలకై నిమంత్రణమని చెప్ప వలెను. పిమ్మట బ్రాహ్మణులతో కూడ కోపము, మైథునాదికము చేయరాదు. బ్రాహ్మణులును చేయరాదు. అట్లు చేసిన యెడల మహా దోషము, శ్రాద్ధము నందు నియుక్తుడై భుజించినను, నితరుని భుజింప చేసినను మైథునము చేసిన వాడు తన పితరుల రేతోగర్తము (గుంట)లో ముంచిన వాడగును. అందు వలననే ముందుగా శ్రేష్ఠులగు బ్రాహ్మణులను నిమంత్రణము చేయవలయునని చెప్ప బడెను. బ్రాహ్మణులను నియోగింపక తన యింటికి వచ్చిన నియమితేంద్రియులను పాద్యాదులతో భుజింప జేయ వచ్చును. పవిత్రమును ధరించిన వాడై ఆచమనము చేసిన వారిని ఆసనము లందు కూర్చుండ పెట్టవలెను. పితృ దేవతలకై బేసి సంఖ్య వారిని, దేవతల కొఱకై సరి సంఖ్య వారిని లేక ఉభయులకు ఒక్కొక్కరికి నిమంత్రించ వలెను. అట్లే వైశ్వ దేవముతో మాతామహ శ్రాద్దమును చేయ వలెను. భక్తీ సంపన్నుడై పితృమాతామహ శ్రాద్ధములు తంత్రములుగా వైశ్వా దేవముతో (ఒకే విశ్వే దేవస్థానములో) చేయ వలెను. విశ్వే దేవతలను తూర్పు ముఖముగను, పితృ దేవతలను ఉత్తర ముఖముగను లేక విశ్వే దేవతలను ఉభయాత్మకముగ భుజింప జేయవచ్చును.
పృథక్తయోః కేచిదాహుశ్రాద్ధస్యకరణం నృప।
ఏకత్రైకేనపాకేన వదన్త్యన్యేమహర్షయః॥
విష్టరార్థంకుశాన్ దత్త్వా సంపూజ్యార్ ఘ్యవిధానతః।
కుర్యాదావాహనం ప్రాజ్ఞో దేవానాంతదనుజ్ఞయా॥
యావామ్బునాచదేవానాం దద్యాదర్ ఘ్యంవిదావిత్।
స్రగ్గన్ధదూపదీపాంశ్చ దత్త్వాతేభ్యోయథావిధి॥
పితౄణామపసవ్యంచ సర్వమేవోపకల్పయేత్।
అనుజ్ఞాంచతతః ప్రాప్యదత్త్వాదర్భాన్ ద్విధాకృతాన్॥
మన్త్రపూర్వంపితౄణాంతు కుర్యాదావాహనంబుధః।
తిలామ్బునాచాపసవ్యం దద్యాదర్ ఘ్యాదికంనృప॥
కాలేతత్రాతిథింప్రాప్తమన్న కామంనృపాధ్వగమ్।
బ్రాహ్మణై రభ్యనుజ్ఞాతః కామంతమపిభోజయేత్॥
యోగినోవివిధై రూపైర్నరాణాముపకారిణః।
భ్రమన్తిపృథివీమేతామవిజ్ఞాత స్వరూపిణః॥
తస్మాదభ్యర్చయేత్ ప్రాప్తం శ్రాద్ధకాలేఽ తిథింబుధః।
శ్రాద్ధక్రియాఫలంహన్తి నరేన్ద్రాపూజితోఽతిథిః॥
పితృ మాతామహ వర్గముల వారికి వేఱుగా శ్రాద్ధము చేయవలయునని కొందరందురు. ఇతర మహర్షులు ఒక చోటనే యొకే పాకముతో చేయ వలయు నందురు. ఆసనార్థమై కుశలనిచ్చి అర్ఘ్యాది విధానముతో పూజించి ప్రాజ్ఞుడు దేవతలయా వాహనమును దేవాత్మ బ్రాహ్మణానుజ్ఞతో చేయ నగును. యవల జలముతో దేవతలకు అర్ఘ్యమును విధాన మెరింగిన వాడై ఈయ వలయును. పూల దండ, గంధము, ధూప దీపములను యథావిధిగా సమర్పించి, పితృ దేవతలకు నపసవ్యముగ సమస్తమును కల్పించి, యనుజ్ఞ పొంది దర్భలను రెండు విధములుగ భాగించి మంత్ర పూర్వకముగ పితృ దేవతల యావాహనము చేయ వలయును. తిలోదకముతో నపసవ్యముగ నర్ఘ్యాదికము సమర్పింప వలయును. ఆ సమయమున నన్నకాముడై ఏతెంచిన బాటసారియగు నతిథిని, బ్రాహ్మణుల యభ్యనుజ్ఞ నొంది, వానిని కూడ భుజింప జేయవలెను. యోగీశ్వరులు, నరులకు నుపకారము చేయువారై వివిధ రూపములతో నవిజ్ఞాత రూపమున భూమి నంతను తిరుగు చుందురు. కావున శ్రాద్ధ కాలమున నేతెంచిన యతిథిని పండితుడైన వాడు అర్చించ వలెను. ఓ రాజా! పూజింపబడిన యతిథి, శ్రాద్ధ మాచరించుటచే కలుగు ఫలమును నాశము చేయును. ఓ పురుషోత్తమా! పిమ్మట ఆ బ్రాహ్మణానుజ్ఞ నొంది, వ్యంజనములు (శాకాదికములు) లవణాదికము లేని యన్నమును మూడు పర్యాయములు హోమము చేయ వలయును.
అగ్నయేకవ్యవాహనాయ స్వదేత్యాదౌనృపాహుతిః।
సోమాయవై పితృమతే దాతవ్యాతదనన్తరమ్॥
వైవస్వతాయచైవాన్యాతృతీయాదీయతేతతః।
హుతావశిష్టమల్పాన్నం విప్రపాత్రేషునిర్వపెత్॥
తతోన్నంమృష్టమత్యర్థమభీష్టమతిసత్కృతమ్।
దత్త్వాజుషధ్వమిచ్చాతోవాచ్యమేతదనిష్టురమ్॥
భోక్తవ్యంతై శ్చతచ్చిత్తైర్మౌనిభిస్సుముఖైస్సుఖమ్।
అక్రుధ్యతాచాత్వరతాదేయంతేనాపిభక్తితః॥
రక్షోఘ్నమన్త్రపఠనం భూమేరాస్తరణంతిలైః।
కృత్వాధ్యేయాస్స్వపితరస్త ఏవద్విజసత్తమాః॥
పితాపితామహశ్చైవ తథైవ ప్రపితామహః।
మమతృప్తింప్రయాన్త్వద్యవిప్రదేహేషు సంస్థితాః॥
పితాపితామహశ్చైవ తథైవ ప్రపితామహః।
మమతృప్తింప్రయాన్త్వద్య హోమాప్యాయితమూర్తయః॥
పితాపితామహశ్చైవ తథైవ ప్రపితామహః।
తృప్తింప్రయాన్తుపిణ్డేన మయాదత్తేన భూతలే॥
మొదట "అగ్నయే కవ్యవాహనాయ స్వధానమః" అనునాహుతి, పిదప "సోమాయ పితృమతేస్వాహా" అను నాహుతి. మూడవ ఆహుతి "వైవస్వతాయ యమాయాంగిరస్వతే" అని హోమము చేయగా మిగిలిన యన్నము నల్పమైన దానిని బ్రాహ్మణుల విస్తళ్ళలో నుంచ వలెను. పిమ్మట మృష్టాన్నమును చక్కగా తయారు చేసిన దానిని వడ్డించి మీ యభీష్టము ననుసరించి భుజింతురు గాక! అని మృదువుగా చెప్పా వలెను. బ్రాహ్మణులు తదేక చిత్తులై మౌనముతో సుముఖతతో సుఖముగ భుజింప వలెను. కోపము, వేగము లేకుండ యజమాని భక్తీ పూర్వకముగ వడ్డించ వలెను. రక్షోఘ్న మంత్రముల చదువ వలెను. తిలలతో భూమి యందాస్తారణమును కల్పించి, యా బ్రాహ్మణులను తమ పితృ దేవతలుగ ద్యానింప వలెను. నా యొక్క పితృపితామహ ప్రపితామహులు ఇపుడీ బ్రాహ్మణుల దేహ మందున్న తృప్తిని పొందుదురు గాక! హోమముచే సంతుష్టి చెందుదురు గాక! అట్లే భూమి యందు నాచే నొసంగ బడిన పిండముచే తృప్తినందుదురు గాక! నా యొక్క భక్తిచే వారు తృప్తి నందుదురు గాక!
మాతామహస్తృప్తిముపైతుతస్య తథాపితాతస్యపితాతతోఽన్యః।
విశ్వేచదేవాః పరమాంప్రయాన్తు తృప్తిం ప్రణశ్యన్తుచయాతుధానాః॥
యజ్ఞేశ్వరోహవ్యసమస్తకవ్యభోక్తాఽవ్యయాత్మాహరిరీశ్వరోఽత్ర।
తత్సంనిధానా దపయాన్తుసద్యో రక్షాంస్య శేషాణ్యసురాశ్చసర్వే॥
త్రుప్తేషుతేషువికిరేదన్నంవిప్రేషుభూతలే।
దద్యాదాచమనార్థాయతేభ్యోవారి సకృత్సకృత్॥
సుతృప్తైస్తైరనుజ్ఞాతస్సర్వేణాన్నేనభూతలే।
సలిలేనతతః పిణ్డాన్ సమ్యగ్ధద్యాత్సమాహితః॥
పితృతీర్థేనసలిలం తథైవసతిలాఞ్జలిమ్।
మాతామహేభ్యస్తేనై వపిణ్డాం స్తీర్థేననిర్వ పేత్॥
దక్షిణాగ్రేషు దర్బేషుపుష్పధూపాది పూజితమ్।
స్వపిత్రే ప్రథమంపిణ్డం దద్యాదుచ్చిష్టసన్నిధౌ॥
పితామహాయ చైవాన్యం తత్ప్రిత్రేచతథాపరమ్।
దర్భమూలేలేపభాజః ప్రీణయేల్లేపఘర్షణైః॥
పిండైర్మాతా మహాస్తద్వద్గన్ధమాల్యాది సంయుతైః।
పూజయిత్వాద్విజాగ్య్రాణాం దద్యాదాచమనంతతః॥
పితృభ్యః ప్రథమంభక్త్యాతన్మనస్కో నరేశ్వర!।
సుస్వధేత్యాశిషాయుక్తోదద్యాచ్చక్త్యాచ దక్షిణామ్॥
దత్త్వాచదక్షిణాంతేభ్యోవాచయేద్వైశ్వదైవికాన్।
ప్రీయన్తామితిహయేవిశ్వేదేవాస్త ఈతీరయేత్॥
తథేతిచోక్టైస్తైర్విప్రైః ప్రార్థనీయాస్తదాశిషః।
పశ్చాద్విసర్జయేద్దేవాన్ పూర్వం పైత్య్రాన్ మహీపతే!॥
మాతామహానామప్యేవంసహదేవైః క్రమస్స్మృతః।
భోజనే వ స్వశక్త్యాచ దానేతద్వద్విసర్జనే॥
ఆపాదశౌచనాత్పూర్వంకుర్యాద్దేవద్విజన్మసు।
విసర్జనంతుప్రథమంపితృమతామహేషువై॥
విసర్జయేత్ప్రీతివచస్సంమాన్యాభ్యుత్థితాంస్తతః।
నివర్తేతాభ్యనుజ్ఞాత ఆద్వారాత్తాననువ్రజేత్॥
మాతామహాదులు, విశ్వే దేవతలు పరమ తృప్తి నొందుదురు గాక! రాక్షసులు నశింతురు గాక! హవ్యకవ్యములను (దేవతలకు పితరులకు నొసంగు నన్నములు) భుజించు వాడును, యజ్ఞేశ్వరుడును, అవ్యయుడునగు, శ్రీహరి యిచ్చట నుండుట వలన సమస్త రాక్షసులు, అసురులు వెంటనే తొలగి పోవుదురు గాక! ఆ బ్రాహ్మణులు తృప్తి నందిన వెనుక భూతలము నందు నన్నమును చిమ్మ వలెను. పిదప వారికి నుత్తరాపోషణ మీయ వలెను. తృప్తులైన బ్రాహ్మణుల యనుజ్ఞ నొంది, సావధాన చిత్తుడై అన్నము తోను, నీటితోను భూతలము నందు పిండ ప్రదానము చేయవలెను. పితృ తీర్థము (తర్జనీ మూలము) తో జలమును, తిలోదకమును పిండములను నివ్వ వలెను. మాతామహాదులకు కూడా నట్లే. దక్షిణాగ్రములగు దర్భల మీద పుష్పాదులచే పూజింప బడిన పిండములను ఉచ్చిష్ట సన్నిధానమున పితృ పితామహాదులకు నొసంగి యా దర్భల మూలము నందు లేపభుక్కులగు చతుర్దాది పితరులను లేప ఘర్షణముతో సంతోష పెట్ట వలయును. మాతామహాదులను కూడనట్లే పూజించి యథా శక్తి దక్షిణల నొసంగ వలెను. వారి యాశీస్సులను కోరి, ముందు పితృ దేవతలను పిమ్మట విశ్వే దేవతలను విసర్జింప వలెను. (విశ్వే దేవతంత్ర పక్షమున - ముందు విశ్వే దేవతలకు, తరువాత పితరులకు చేయ వలెను) మాతా మహాదులకు కూడా నిట్లే. ప్రీతి వాక్కుల నడిగి, ద్వార పర్యంతము అనుగమించి మరల వలెను. పిమ్మట వైశ్శ్వ దేవమను నిత్య కృత్యమును చేసి యిష్టుల, శిష్టుల భృత్యులతో భుజింప వలెను.
ఏవంశ్రాద్ధంబుధః కుర్యాత్పైత్రం మాతామహంతథా।
శ్రాద్డై రాప్యాయితా దుద్యుస్సరకామాన్ పితామహాః॥
త్రీణి శ్రాద్దేపవిత్రాణిదౌహిత్రః కుతపస్తిలాః।
రజతస్యకథాదానం తథాసంకీర్తనాదికమ్॥
వర్జ్యానికుర్వాతాశ్రాద్ధంక్రోధోఽధ్వగమనంత్వరా।
భోక్తురప్యత్రరాజేన్ద్రత్రయమేతన్నశస్యతే॥
విశ్వేదేవాస్సపితర స్తథామాతామహానృప।
కులంచాప్యాయతే పుంసాంసర్వంశ్రాద్ధం ప్రకుర్వతామ్॥
సోమాధారః పితృగణో యోగాధారశ్చచన్ద్రమాః।
శ్రాద్దే యోగివియోగస్తుతస్మాద్భూపాల శస్యతే॥
ఈ విధముగా పండితుడు పితృ శ్రాద్ధమును మాతామహ శ్రాద్ధమును చేయవలెను. శ్రాద్ధములచే తృప్తి నందిన పితామహులు సర్వ వాంచలను ననుగ్రహింతురు. దౌహిత్రుడు (సుతా పుత్రుడు) కుతప కాలము అనగా 8/15 దిన భాగము, తిలలు ఈ మూడు శ్రాద్ధము నందు పవిత్రములు. అట్లే వెండి వృత్తాంతము, వెండి దానము, తత్సంకీర్తనము మొదలగునవి పవిత్రములు. శ్రాద్ధము చేయు నతడు భోక్తము కోపమును మార్గ గమనమును వేగమును విడువ వలెను. శ్రాద్ధ మాచరించు వాని కులము పితరులు మాతామహులు విశ్వేదేవులు తృప్తిని చెందుదురు. పితృ గణము సోముని (చంద్రుని) పై ఆధారపడి యున్నది. ఆ సోముడు యోగాముపై ఆధారపడి యున్నాడు. కావున ఓ రాజా! శ్రాద్ధము నందు యోగిని నిమంత్రించుట ప్రశస్తము. వెయ్యి మంది బ్రాహ్మణులకు ముందున్న యోగి భోక్తలను, యజమానుని తృప్తి నొందించును.
Summary of chapter 15 of the Vishnu Mahā Purāṇa is as follows:
The qualified categories of brāhmaṇas to be invited to śrāddha are enumerated: triṇāciketaḥ, trimadhu, trisuparna, ṣaḍaṅgavid, yogī, jyeṣṭhasāmagaḥ, ṛtvij, dāyādaḥ, tapasvin, and pañcāgni. The disqualified categories are also listed — including mitra-drohī, napuṃsaka, false brahman, soma-seller, mahāpātaki, thief, grāma-purohita, salaried Veda teacher, śūdrā-pati, and devalaka. The full śrāddha procedure is described in detail: invitation, pādya-arghya pūjā, ācamana, seating directions, silence and meditation, Agni-homa, piṇḍa-dāna, conclusion, and atithi-sevā. Foods giving pitṛ-tṛpti for specified durations, and prohibited items, are also listed.