శ్రీపరాశరుడు:
మైత్రేయైతద్బలం తస్యబలస్యబలశాలినః।
కృతంయదన్యత్తేనాభూత్తదపిశ్రూయతాంత్వయా॥
నరకస్యాసురేన్ద్రస్య దేవపక్షవిరోధినః।
సఖాఽభవన్మహావీర్యో ద్వివిదోవానరర్షభః॥
వైరానుబన్ధం బలవాన్ సచకారసురాన్ ప్రతి।
నరకం హతవాన్ కృష్ణో దేవరాజేనచోదితః॥
కరిష్యేసర్వదేవానాం తస్మాదేతత్ప్రతిక్రియామ్।
యజ్ఞవిధ్వంసనం కుర్వన్ మర్త్యలోకక్షయం తథా॥
తతోవిధ్యం సయామాసయజ్ఞానజ్ఞానమోహితః।
బిభేదసాధుమర్యాదాం క్షయం చక్రేచదేహినామ్॥
దదాహసవనాన్ దేశాన్ పురగ్రామాన్తరాణిచ।
క్వచిచ్చపర్వతాక్షేపైః గ్రామాదీన్ సమచూర్ణయత్॥
శైలానుత్పాట్యతోయేషు ముమోచామ్బునిధౌతథా।
పునశ్చార్ణవ మధ్యస్థః క్షోభాయామాస సాగరమ్॥
తేనవిక్షోభితశ్చాబ్దిరుద్వేలోద్విజజాయతే।
ప్లావయం స్తీరజాన్ గ్రామాన్ పురాదీనతివేగవాన్॥
కామరూపీమహారూపం కృత్వాసస్యాన్యశేషతః।
లుఠన్ భ్రమణ సమ్మర్ధైస్సంచూర్ణయతి వానరః॥
తేనవిప్రకృతం సర్వం జగదేతద్దురాత్మనా।
నిస్స్వాధ్యాయవషట్కారం మైత్రేయాసీత్సుదుఃఖితమ్॥
శ్రీపరాశరుడు:
మైత్రేయ! వినుము. దేవపక్ష విరోధి నరకుడు. వాని మిత్రుడు ద్వివిదుడను వానరుడు. బలశాలి యాతడు. దేవతల యెడ వైరముం గొనెను. కృష్ణుడు దేవేంద్ర ప్రేరణచే నరకుం జంపెను. గావున దీనికి బ్రతిక్రియ చేయుదునని ద్వివిదుడు దేవతల యెడ పగగొని యజ్ఞ విధ్వంస మారంభించెను. మర్త్య లోకమునకు హానియుం జేసెను. సాధువుల మర్యాదలను విచ్చిన్న పరచెను. ప్రాణులను నశింప జేసెను. దేశ నగర గ్రామవన ప్రదేశములను గాల్చెను. పర్వతముల నెత్తి పడవైచి గ్రామములను పిండి గొట్టెను. కొండలను నదులందు బడవైచెను. దాన నుదధిపొంగి కట్టదాటి దరినున్న పురగ్రామాదుల ముంచి వైచెను. ఆ వానరుడు కామరూపి కావున పెద్ద రూపముం గొని దూకుచు సమ్మర్ధ పరచి చూర్ణము గావించు చుండెను. ఆ దుష్టునిచే సర్వజగము ద్వంస మొంది స్వాధ్యాయ వశట్కారములు వోయి మిగుల దుఃఖిత మయ్యెను.
ఏకదారైవతోద్యానేపపౌపానం హలాయుధః।
రేవతీచమహాభాగ తథైవాన్యావరస్త్రియః॥
ఉద్గీయమానొవిలసల్లలనామౌళిమధ్యగః।
రేమేయదుకుల శ్రేష్ఠః కుబేర ఇవనన్దనే॥
తతస్సవానరోభ్యేత్యగృహీత్వాసీరిణోహలమ్।
ముసలంచచకారాస్యసంముఖంచ విడమ్భనమ్॥
తథై వయోషితాం తాసాం జహాసాభిముఖం కపిః।
పానపూర్ణాంశ్చ కరకాన్ చిక్షేపాహత్యవైతదా॥
తతః కోపరీతాత్మాభర్ త్సయామాసతం హలీ।
తథాఽపితమవజ్ఞాయ చక్రేకిలకిలధ్వనిమ్॥
తతస్స్మయిత్వాసబలో జగ్రాహముసలం రుషా।
సోఽపిశైలశిలాంభీమాంజగ్రాహ ప్లవగోత్తమః॥
చిక్షేపసచతాంక్షిప్తాం ముసలేనసహస్రధా।
బిభేదయావశ్రేష్ఠపపాతమహీతలే॥
అథతన్ముసలంచాసౌ సముల్లఙ్ఘ్యప్లవంగమః।
వేగేనాగత్యరోషేణకరేణోరస్యతాడయత్॥
తతోబలేనకోపేన ముష్టినామూర్ ధ్నితాడితః।
పపాతరుధిరోద్గారీ ద్వివిదః క్షీణజీవితః ॥
పతతాతచ్ఛరీరేణ గిరేశ్శృఙ్గమశీర్యత।
మైత్రేయ! శతధావజ్రీవజ్రేణేనవిదారితమ్॥
పుష్పవృష్టింతతోదేవారామస్యోపరిచిక్షిపుః।
ప్రశశం సుస్తతోభ్యేత్యసాధ్వేత త్తేమహత్కృతమ్॥
అనేనదుష్టకపినాదైత్యపక్షోపకారిణా।
జగన్నిరాకృతంవీర! దిష్ట్యాసక్షయమాగతః॥
ఇత్యుక్త్వాదివామాజగ్ముర్దేవాహృష్టాస్సగుహ్యకాః॥
ఏవం విధాన్యనేకాని బలదేవస్యధీమతః।
కర్మాణ్యపరిమేయాని శేషస్యధరణీభృతః॥
ఒకప్పుడు బలరాముడు రైవతుని యుద్యానమున తన యింతి రేవతితో మఱియుం గల పెక్కుమంది తరుణులతో మద్యపానము సేసెను. అప్పుడు పెల్లున పాటలు పాడుచు తరుణీ రత్న మధ్యమందు నందన వనమునం గుబేరుడట్లు క్రీడించెను. అంతట నా కోతి యేతెంచి హలాయుధుని నాగలిని ముసలమును గైకొని యీ బలరాముని ముందు కోతిచేష్టలు సేసెను. అట్లే యా యంగనల ముందు పండ్లగిలించి వెక్కిరించెను. మద్యపూర్ణము లయిన కళ్ళు ముంతల పగులగొట్టి యట్టిటు పారవైచెను. అప్పుడు హాలి కోపము గొని వానిం బెదర గొట్టెను. అయినను వాడాతని నవమానించుచు కిలకిల ధ్వని సేసెను. వానినట్లు వెక్కిరింప నిచ్చి బలరాముడు రోశముగొని ముసలము చేపట్టెను. వాడునొక రాతిబండం బట్టుకొని విసరెను. దానిని బలరాముడు ముసలాయుధమున బగుల గొట్టి క్రింద బడవైచెను. అవ్వల వాడావలకు దూకి బలరాముని రొమ్మున ముసలముతో గొట్టెను. అవ్వల బలరాముడు కోపము గొని వాని నడినెత్తిం గుప్పిట బొడచినంత వాడు రక్తము గ్రక్కుకొని ప్రాణములు వాసి నేలపై గూలెను. వజ్రాయుధ వజ్రముచే వలె వాని శరీరముచే నాగిరి శృంగము నూరు బ్రద్దలయ్యెను. అంతట దేవతలు వచ్చి రామునిం గని నీ విక్రమము బాగు బాగని కొనియాడుచు పుష్ప వర్షముం గురిపించిరి. రాక్షస పక్షమున కుపకారియైన యీ పాడు కోతిచే జగమెల్ల ధ్వంసము చేయబడినది. భాగ్యవశమున వాడు నాశనమందినాడని సురలు పలికి గుహ్యకులతో గూడ నమరు లానంద భరితులై స్వర్గమున కేతెంచిరి. ఇట్టివి ధరణిందాల్చు శేషుని మూర్తియైన బల్లదేవుని లీలలనంతములు. అపరిమేయములు.
Summary of chapter 36 of the Vishnu Mahā Purāṇa is as follows:
Dvivida the vānara (a friend and ally of the slain Narakāsura) causes great devastation in the land as revenge. Balarāma is on the Raivataka hill enjoying himself with Revatī and drinking Vāruṇī wine. Dvivida appears, steals Balarāma's weapons and mounts, and insults him with taunting words and obscene gestures. Balarāma kills him with his fist, and the great vānara falls — his body filling a valley.