విష్ణు మహా పురాణము

22 - బలరామ కృష్ణ కృత జరాసంధ పరాజయము

శ్రీపరాశరుడు:

జరాసంధ సుతేకంస ఉపయేమే మహాబలః

అస్తింప్రా స్తించ మైత్రేయ తయోర్భర్ తృహణంహరిమ్

మహాబల పరీవారో మగదాదిపతిర్బలీ

హన్తుమభ్యాయయౌకోపాత్ జరాసంధస్స యాదవమ్

ఉపేత్యమథురాంసోఽథ రురోధమగదేశ్వరః

అక్షౌహిణీభిస్సైన్యస్య త్రయోవింశతిభీర్ వృతః

నిష్క్రమ్యాల్పపరీవారావుభౌ రామ జనార్ధనౌ

యయుదాతేసమంతస్య బలినో బలిసైనికైః

తతోరామశ్చ కృష్ణశ్చ మతించక్రతురంజసా

ఆయుధానాం పురాణానామాదానే మునిసత్తమ

అనన్తరం హరేశ్శార్ జ్గంతూణీచాక్షయసాయకౌ

ఆకాశాదాగతౌ విప్రతథాకౌ మోదకీగదా

హలంచ బలభద్రస్య గగనాదాగతంమహత్

మనసోఽనభిమతం విప్ర! సానన్దంముసలంతథా

తతో యుద్దే పరాజిత్యస సైన్యం మగధాధీపమ్

పురీంవివిశతుర్వీరావుభౌరామ జనార్ధనౌ

జితేతస్మిన్ సుదుర్వృత్తే జరాసంధే మహామునే

జీవమానేగతేకృష్ణస్తంనామన్యతనిర్జితమ్

పునరప్యాజగామాథ జరాసంధోబలాన్వితః

జితశ్చరామకృష్ణాభ్యామపక్రాన్తోద్విజోత్తమ

దశచాస్టౌచసంగ్రామానేవమత్యన్త దుర్మదః

యదుభిర్మాగధో రాజాచక్రేకృష్ణపురోగమైః

సర్వేష్వే తేషుయుద్దేషుయాదవైస్సపరాజితః

అపక్రాన్తోజరాసంధస్స్వల్పసై న్యైర్బలాదికః

నతద్బలం యాదావానాం విజితంయదనేకశః

తత్తుసన్నిధిమహాత్మ్యం విష్ణోరంశస్యచక్రిణః

మనుష్యధర్మశీలస్య లీలాసాజాగతీపతేః

అస్త్రాణ్యనేకరూపాణి యదరాతిషుముంచతి

మనసై వజగత్సృష్టిం సంహారంచకరోతియః

తస్యారిపక్షక్షపణే కియానుద్యమవిస్తరః

తథాపియోమనుష్యాణాంధర్మ స్తమనువర్తతే

కుర్వన్ బలవతాసందింహీనైర్యుద్ధంకరోత్యసౌ

సామచోప ప్రదానంచ తథాభేదంచ దర్శయన్

కరోతిదణ్డపాతంచ క్వచిదేవపలాయనమ్

మనుష్యదేహినాంచేష్టామిత్యేవమనువర్తతే

లీల జగత్పతేస్తస్య చన్దతః పరివర్తతే

శ్రీపరాశరుడు:

కంసుడు జరాసంధుని కూతుండ్రను ఆస్తి, ప్రాస్తి యనువారిని పెండ్లాడెను. వారిద్దరి భర్తయగు కంసుని హరి చంపెనని మగధాదిపతి జరాసంధుడు పగగొని వానిని చంప దలచి యిరువది మూడక్షౌహిణుల సేనతో దండెత్తి వచ్చి మథురను ముట్టడించెను. బలరామ జనార్దనులల్ప పరివారములతో పురము వెడలి వానితో బోరిరి. అటుపై రామకృష్ణులు తమ తొలుతటి యాయుధములం గైకొని యని సేయవలయునని తోచిన యంత వారికి శార్జ్గము అను ధనువు అక్షయ బాణములు గల అంబుల పొదులు రెండు కౌమోదకి యను గదయు నాకాశమందుండి వచ్చినవి. బలరామునికి అభిమతమైన నాగలియు రోకలియు గగనము నుండి వచ్చెను. అయ్యిరువురకు నవి యభిమతములును ఆనందకరములు నయ్యేను. వానిం గొని మగధపతి వారాయుద్దమునం బరాజితుం గావించి పుర ప్రవేశ మొనరించిరి. ఆ దుష్టుడోడిపోయి ప్రాణములతో బోగా కృష్ణుడది వానిం గెలిచినట్లు గాదనుకొనెను. వాడును సైన్యముల గూర్చికొని తిరిగి వచ్చి పోరి యోడిపోయి మరల పారిపోయెను. ఆ దుర్మార్గుడిట్లు పదునెనిమిది మారులు దండెత్తి యుద్దము చేసి పారిపోయెను. యాదవులల్ప సైన్యముతో బహుసైన్య పరివారునిట్లు పలు పర్యాయము లోడించిరి. అదంతయు విష్ణునంశమైన కృష్ణుని విలాసము. సృష్టిని జగత్సంహారమును గావించు నా చక్రాయుధునకు శత్రు నాశనోద్యమ మేపాటిది? అయినను నవతార మెత్తినందున నా నరకేసరి నర ధర్మమనుసరించియే బలవంతులతో సంధిని బలహీనులతో యుద్దము సామము ఉపప్రదానము (దానము) భేదము అనునవి ప్రదర్శించుచు తుదకు దండపాతముం జేయును. ఒక్కొక్క యెడ పారిపోవుటయుం గలదు. ఈ రీతిగా మనుష్య చేష్టననుసరించును. ఇది యంతయు జగత్పతి యొక్క స్వేచ్చాను సారమైన యొక లీలయే.