గాః పాలయంతౌచపునస్సహితౌబలకేశవౌ।
భ్రమమాణౌవనేతస్మిన్ రమ్యంతాళవనంగతౌ॥
తత్తుతాళవనందివ్యం ధేనుకోనామదానవః।
మృగమాంసకృతాహారస్సదాధ్యా స్తేఖరాకృతిః॥
బలకేశవులు గోపాలనము సేయుచుం దిరుగుచు నా బృందావనమునం దందమైన తాళ వనమున కేగిరి. ధేనుకుడను రాక్షసుడు గార్ధభ రూపముతో మృగ మాంసములం దినుచు నా వనమందు వసించెను. ఆ వనము పండిన తాటి పండ్లతో సమృద్ద మగుట చూచి గోపాలురా పండ్లపై కోరిక గల్గి రామ కృష్ణులతో నిట్లనిరి.
హేరామ హేకృష్ణ సదా ధేనుకేనై షరక్ష్యతే।
భూప్రదేశోయత స్తస్మాత్పక్వానీమానిస న్తివై॥
ఓ రామా! ఓ కృష్ణా! ధేనుకుని రక్షణలో నున్నందున ఈ ప్రదేశమందు పండిన ఈ తాటిపండ్లు సమృద్ధిగా నున్నవి. ఈ పండ్లు చూడు తమ సువాసనలచే దిక్కులం బరిమళింప జేయుచున్నవి. మేము వీనిం దిన గోరెదము. నీ కిష్టమేని వీనిని రాల్తము,
ఇతిగోపకుమారాణాం శ్రుత్వాసంకర్షణో వచః।
ఏతత్కర్తవ్యమిత్యుక్త్వాపాతయామాసతానివై॥
కృష్ణశ్చపాతయామాస భువితానిఫలానివై॥
ఫలానాంపతతాంశబ్దమాకర్ణ్యసుదురాసదః।
ఆజగామసదుష్టాత్మాకోపాద్దై తేయగర్దభః॥
పద్భ్యాముభాభ్యాంసతదాపశ్చిమాభ్యాంబలంబలీ।
జఘానోరసితాభ్యాంచసచతేనాభ్యగృహ్యత॥
గృహీత్వాభ్రామయామాససోఽమ్బరేగత జీవితమ్।
తస్మిన్నేవసచిక్షేప వేగేనతృణరాజని॥
తతః ఫలాన్యనేకానితాళాగ్రాన్నిపతన్ ఖరః।
పృథివ్యాం పాతయామాస మహావాతోఘనానివ॥
అన్యానథసజాతీయానాగతాన్ దైత్యగర్దభాన్।
కృష్ణశ్చిక్షేపతాళాగ్రే బలభద్రశ్చలీలయా॥
క్షణేనాలంకృతాపృథ్వీపక్వైస్తాలఫలై స్తదా।
దైత్యగర్దభదేహైశ్చ మైత్రేయ! శుశుభేఽదికమ్॥
అని గోప కుమారులన విని సంకర్షుణుండు (బలరాముడు) ఈ పని చేయ వలసినదని యా పండ్లను రాల్చెను. కృష్ణుడును రాల్చెను. పండ్లు పడుచున్న సడి ఇని దుష్టుడు దరియరాని క్రూరుడు గర్ధభాకారుడు ధేనుకుడు కోపముతో వెనుక కాళ్ళను నేలం దాడించుచు వచ్చి యా రామకృష్ణుల రోమ్మునం గొట్టి వారికి పట్టువడెను. కృష్ణుడు వానిం జేతనెత్తి ఆకాశామునందిట్టటు త్రిప్పినంత వాడసువుల బాసెను. వాని నటనున్న పచ్చిక బయల విసరి వైచెను. వాడు తాళ వృక్షాగ్రము నుండి కూలుచు మహావాయువు మేఘముల నట్లు తాటి పండ్లను చెట్ల నుండి జలజల రాల్చెను. వాని పరివారము మరికొందరు గాడిదలు తన మీదికి రాగా కృష్ణుడు, బలభద్రుడు వారిం బట్టి యవలీలగ విసరివైచిరి. క్షణములో నా ప్రదేశము తాడి పండ్లతో ఖర రాక్షస దేహములతో మిక్కిలి శోభించెను. అవ్వల గోవులు నిరాబాధములై యాతాల వనమందు మున్నెన్నడు రుచిచూడని లేత గడ్డిని మేసినవి.
Summary of chapter 8 of the Vishnu Mahā Purāṇa is as follows:
Dhenukāsura, a powerful demon who has taken the form of a donkey, dwells in the Tālavana (palm forest) and prevents anyone from enjoying the ripe palm fruits. Balarāma seizes him by his hind legs and hurls him into the palm trees, killing him and freeing the forest.