విష్ణు మహా పురాణము

16 - దుష్యంతోద్భవము

శ్రీపరాశరుడు:

ఇత్యేషసమాసతస్తే యదోర్వంశః కథితః

అథ దుర్వసోర్వంశమవధారాయ

దుర్వసోర్వహిరాత్మజః వ హ్నేర్భర్గో భార్గద్భానుః

తతశ్చ త్రయీసానుః తస్మాచ్చ కరందమః తస్యాపి మరుత్తః

సోఽనపత్యోఽభవత్

తతశ్చపౌరవందుష్యన్తం పుత్రమకల్పయత్

ఏవం యయాతి శాపాత్తద్వంశః పౌరమేవ వంశం సమాశ్రితవాన్

శ్రీపరాశరుడు:

యదు వంశమును సంగ్రహముగ తెల్పితిని. దుర్వసు వంశమిక వినుము. దుర్వసుని కొడుకు వహ్ని. వాని కుమారుడు భార్ధుడు, అతనికి భానువు! అతనికి త్రయీసానువు అతనికి కరందముడు. అతనికి మరుత్తుడు. మరుత్తునికి సంతానము లేదు. అందుచే పూరువంశ్యుని (పౌరవుని) దుష్యంతుని స్వీకరించెను. యయాతి శాపముచే యదు వంశము పౌరవ వంశము నాశ్రయించెను.