విష్ణు మహా పురాణము

21 - కంసాంగనాసమాశ్వాసనము - భగవల్లీలా ప్రదర్శనము

శ్రీపరాశరుడు:

తౌసముత్పన్నవిజ్ఞానౌభగవత్కర్మ దర్శనాత్

దేవకీవసుదేవౌతుదృష్వ్టామాయాం పునర్హరిః

మోహాయయదుచక్రస్య వితతానసవైష్ణవీమ్

ఉవాచచామ్బ హేతత! చిరాదుత్కణ్ఠితేనమే

భవన్తౌ కంసభీతేన దృష్టాసంకర్షణేనచ

కుర్వతాం యాతియః కాలోమాతాపిత్రోరపూజనమ్

తత్ఖణ్డమాయుషోవ్యర్థమసాధూనాం హిజాయతే

గురుదేవద్విజాతీనాం మాతాపిత్రోశ్చ పూజనమ్

కుర్వతాంసఫలః కాలో దేహినాం తాతజాయతే

తత్ క్షన్తవ్యమిదం సర్వమతిక్రమకృతం పితః!

కంసవీర్య ప్రతాపాభ్యా మావయోః పరవశ్యయోః

ఇత్యుక్త్వాథప్రణమ్యోభౌయాదువృద్దాననుక్రమాత్

యథావదభిపూజ్యాథచక్రతుః పౌరమాననమ్

శ్రీపరాశరుడు:

భగవల్లీలా దర్శనము చేసి తత్త్వజ్ఞానము వడసిన దేవకీ వసుదేవులను గని హరి యదుజనమును మొహపెట్టుటకు వైష్ణవ మాయను విస్తరింప జేసెను. అమ్మా! అయ్యా! కంసుని భయముచే నెంతో కాలము నుంచి యపేక్షతో నున్న నేను భలభద్రుడును మిమ్మీనాటికి జూడ గంటిమి. తలి దండ్రులం బూజింపని కాలము యాయుర్దాయములో వ్యర్థమైన కాలము దురదృష్టవంతులగు వారి జీవితములోనే యుండును. గురు దేవ ద్విజులను మాతా పితరుల నారాధించు జనుల కాలమే సఫలమైన దగును. కంసుని పరాక్రమ ప్రతాపములకు పరవశులమై యింతకాల మీ ధర్మమును దప్పిన మమ్మిద్దరను తండ్రీ! క్షమింపుము. అని పలికి యా తల్లిదండ్రులకు ప్రణామములు సేసి యదవృద్ధులను గూడ వరుసగా యథావిధిం బూజించి వారిద్దరు పౌర జనమును గౌరవించిరి.

కంసపత్న్యస్తతః కంసం పరివార్యహతం భువి

విలేపుర్మాతరశ్చాస్య దుఃఖశోకపురిప్లుతాః

బహుప్రకారమన్వస్థాః పశ్చాత్తాపాతురోహరిః

తాస్సమాశ్వాసయామాసస్వయమస్రా విలేక్షణః

ఉగ్రసేనం తతోబన్ధాన్ముమోచమధుసూదనః

అభ్యషిఞ్చత్తదైవైనం నిజరాజ్యేహతాత్మజమ్

రాజ్యేభిషిక్తః కృష్ణేనాయదుసింహస్సుతస్యసః

చకారప్రేతకార్యాణియేచాన్యే తత్రఘాతితాః

కృతౌర్ ధ్వదైహికంచై నంసింహాసనగతం హరిః

ఉవాచాజ్ఞాపాయవిభోయత్కార్యమవిశఙ్కితః

యయాతిశాపాద్యంశోఽయమరాజ్యార్ హోఽపిసాంప్రయత్

మయిభృత్యేస్థితేదేవానాజ్ఞాపయతుకింనృపైః

ఇత్యక్త్వాసోఽస్మరద్వాయుమా జగామచతత్ క్షణాత్

ఉవాచచై వంభగవాన్ కేశవః కార్యమానుషః

గచ్చేన్ద్రం బ్రూహివాయోత్వమలం గర్వేణవాసవ

దీయతాముగ్రసేనాయసుధర్మాభవతాసభా

కృష్ణోవీతిరాజార్హమేతద్రత్నమనుత్తమమ్

సుధర్మాఖ్యసభాయు కమస్యాంయదుభిరాసితుమ్

ఇత్యుక్తః పవనోగత్వాసర్వమహాశచీపతిమ్

దదౌసోపిసుధార్మాఖ్యాంసభంవాయోః పురందరః

వాయునాచాహృతాం దివ్యాం సభాంతే యదుపుంగవాః

బుభుజుస్సర్వరత్నాఢ్యాం గోవిన్దభుజసంశ్రయాః

అత్తఱి కంసుని భార్యలు, తల్లులను పుడమిం బడియున్న కంసుని చుట్టుం జేరి దుఃఖశోక నిమగ్నులై యేడ్చిరి. అత్తఱి పశ్చాత్తాప వివశుడై హరి తానుం కంట నీరు గ్రుక్కికొనుచు బహువిధముల నస్వస్థలైన వారి నోదార్చెను. అవ్వల హరి యుగ్రసేనుని బంధవిముక్తుం జేసెను. కొడుకుం గోల్పోయిన యతనిని స్వీయ రాజ్య మందభిషిక్తుడై కొడుకునకును మఱియు నప్పుడు గూలిన వారికిని బ్రేతకార్యములు గావించెను. అదంతయు నైనతర్వాత హరి యయానంగని ఆజ్ఞ దయ చేయగా శంకింప వలదు. యయాతి యిచ్చిన శాపముచే నీ యాదవ వంశము రాజ్యార్హము గానిదై యున్నాను నేను భృత్యుడనై చరింప నీవు దేవతలను గూడ శాసింపుము. రాజుల లెక్కేమి? అని పలికి మధువైరి వాయు భగవానునిం దలచి కొనినంత నా క్షణము వాయు వేతేర కార్య నిమిత్తముగ మానుష మూర్తియైన కేశవుండు, ఓ సమీరా! నీ వింద్రుని దరికేగి ఇంద్రా! నీ గర్వము చాలింపుము నీవు ఉగ్రసేనునికి సుధర్మసభ నిచ్చి వేయుము. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ సభ యత్యుత్తమ మయినది రాజార్హమయినది. యదు వంశ్యులు దీని నదిష్టించుట యుక్తము. అన విని వాయువేగి శాచీపతికిది యెల్ల విన్నవింప నాతడును నా సుధర్మ సభను వాయువునకీయ నాతడాదివ్య సభం గొని వచ్చెను. సర్వరత్న సదనమయిన యా సభను గోవిందుని బాహు రక్షణ మంది యాదవు లనుభవించిరి.

విదితాఖిలవిజ్ఞానౌసర్వజ్ఞానమయావపి

శిష్యాచార్యక్రమం వీరౌఖ్యాపయన్తౌయదూత్తమౌ

తతస్సాందీపనింకాశ్యమవ న్తీపురవాసినమ్

విద్యార్థంజగ్మతుర్బాలౌకృతోపనయనక్రమౌ

వేదాభ్యాసకృతప్రీతీ సంకర్షణ జనార్దనౌ

తస్యశిష్యత్వ మభ్యేత్య గురువృత్తిపరౌహితౌ

సరహస్యం ధనుర్వేదం ససంగ్రహమధీయతామ్

అహోరాత్రచతుష్షష్ట్వాతదద్భుతమభూద్ద్విజ

సాందీపనిరసంభావ్యంతయోః కర్మాతిమానుషమ్

విచిన్త్యతౌతదామేనేప్రాప్తౌచన్ద్రడివాకరౌ

సాఙ్గాంశ్చతురోవేదాన్ సర్వశాస్త్రాణిచై వహి

అస్త్రగ్రామమశేషంచప్రోక్తమాత్రమవాప్యాతౌ

ఊచతుర్ వ్రియతాం యాతే దాతవ్యాగురుదక్షిణా

సోప్యతీన్ద్రియమాలోక్యతయోః కర్మమహామతిః

అయాచతమృతం పుత్రం ప్రభాసేలవణార్ణవే

గృహీతాస్త్రౌతతస్తౌతాసార్ ఘ్యహస్తోమహోదధిః

ఉవాచనమయాపుత్రోహృతస్సాందీపనేరితి

దైత్యః పఞ్చజనోనామశఙ్ఖరూపస్సబాలకమ్

జగ్రాహయోఽస్తిసలిలేమమైవాసురసూదన

ఇత్యుక్తోన్తర్జలం గత్వాహత్వాపఞ్చజనంచతమ్

కృష్ణోజగ్రాహతస్యాస్థిప్రభవంశంఖముత్తమమ్

యస్యనాదేత్యానాంబలహానిరజాయత

దేవానాంవవృద్ధేతేజోయాత్యధర్మశ్చసంక్షయమ్

తంపాఞ్చజన్యమాపూర్యగత్వాయమపురం హరిః

బలదేవశ్చ బలవాన్ జిత్వావైవస్వతం యమమ్

తంబాలం యాతనసంస్థంయథాపూర్వశరీరిణమ్

పిత్రేప్రదత్తవాన్ కృష్ణోబలశ్చ బలినాంవరః

మధరాంచపునః ప్రాప్తావుగ్రసేనేన పాలితామ్

ప్రహృష్ట పురుష స్త్రీ కాముభౌరామజనార్ధనౌ

బలరామ కృష్ణులు సర్వ విజ్ఞాన వేత్తలు సర్వజ్ఞులు నైనను గురుశిష్య భావమిట్లుండ వలెనని లోకమున వెల్లడింప గోరి కాశీలో జన్మించిన యవంతీ నగరము నందు వసించు చున్న సాందీపని సన్నిధానమున కయ్యిద్దరు నుపనయనము లయిన తరువాత నేగిరి. తొలుత వేదాధ్యయనము నెడ బ్రీతిగొనిరి. ధనుర్వేదమును సరహస్యముగ జదివిరి. అరువది నాల్గు రోజులలో సర్వ విద్యాగ్రహణము గావించిరి. అది చూడ నత్యద్భుత మయ్యెను. ఇతరుల కసంభవ మైనపని అనుకోని వారి యీ యమానుష చర్యను చూచి సాందీపని చంద్ర సూర్యులిట్లు వచ్చినారని యనుకొనెను. సాంగముగ నాల్గు వేదములను సర్వ శాస్త్రములను అస్త్ర గ్రామమంతయును నుపదేశ మాత్రమున నయ్యన్నదమ్ములు గ్రహించి గురు దక్షిణ యేమి సమర్పించు కొందుమని యాచార్యు నడిగిరి. ఆ మహాబుద్దిశాలి వారి యతీంద్రియ కర్మ వైభవము గాని లవణో దధియందు ప్రభాస క్షేత్రమున పోయిన కొడుకు నిండని కోరెను. ఆ యిద్దరు నస్త్రములం బట్టినంత సముద్రు డర్ఘ్యముం గైకొని సాందీపని పుత్రుని నేనపహరింప లేదు. పంచ జనుడను దైత్యుడు శంఖ రూపము దాల్చి యా బాలకుం బట్టుకొని నా యుదకము లందున్నాడు. అన విని కృష్ణుడు సాగర జలముల జొచ్చి యా పంచజనుం జంపి వాని యెముకలం బొడమిన శంఖము గైకొనెను. దాని నాదము చేత దైత్యులకు తేజో హానియు దేవతలకు తేజో వ్రుద్దియు అధర్మ క్షయము నయ్యెను. ఆ పంచజన్యము బట్టి యెత్తి శ్రీహరి యమపురికి బలభద్రునితో నేగి సూర్యపుత్రుని యమునిం గెలిచి యాతనల నున్న యాగురు బాలకుని నెప్పటి శరీరముతో నున్న వానిం గొనివచ్చి నయ్యిద్దరు సమర్పించిరి. ఉగ్రసేన పరిపాలనలో నున్న మథురకు దయచేసిరి. పౌరస్త్రీ పురుష వర్గ మానంద భరిత మగుచుండ బలరాం కృష్ణులు తిరిగి విచ్సెసిరి.