విష్ణు మహా పురాణము

14 - ఉత్తరక్రియా వివరణము

ఔర్యుడు:

బ్రహ్మేన్ద్రరుద్రనాసత్యసూర్యాగ్నివసుమారుతాన్

విశ్వేదేవాన్ పితృగణానవయంసిమానుజాన్ పశూన్

సరీసృపానృషిగణాన్యచ్చాన్యద్భూతసంజ్ఞితమ్

శ్రాద్ధంశ్రద్దాన్వితః కుర్వన్ప్రీణయత్యఖిలంజగత్

మాసిమాస్యసితేపక్షేపఞ్చదశ్యాంనరేశ్వర

తథాష్టకాసుకుర్వీతకామ్యాన్ కాలాన్ శృణుశ్వమే

శ్రాద్దార్హామాగతంద్రవ్యంవిశిష్టమథవాద్విజామ్

శ్రాద్దంకుర్వీత విజ్ఞాయవ్యతీపతేయనేతథా

విషువేచాపిసంప్రాప్తే గ్రహణేశశిసూర్యయోః

సమస్తేష్వపి భూపాల! రాశిష్వర్కేచ గచ్చతి

నక్షత్రగ్రహపీడాసు దుష్టస్వప్నావలోకనే

ఇచ్చాశ్రద్దాని కుర్వీత నవసస్యాగమేతథా

అమావాస్యాయదామైత్రవిశాఖాస్వాతియోగినీ

శ్రాద్ధైః పితృగణస్తృప్తిం తదాఽఽప్నోత్యష్టవార్షికీమ్

అమావాస్యాయదాపుష్యే రౌద్రేఽథర్ క్షేపునర్వసౌ

ద్వాదశాబ్ధంతదాతృప్తిం ప్రయాన్తిపితరోఽర్చితాః

వాసవాజైకపాదర్ క్షే పితౄణాంతృప్తిమిచ్చతామ్

వారుణేచాప్యామావాస్యా దైవానామపిదుర్లభా

నవస్వృక్షేశ్వమావాస్యాయదైతేష్వవనీపతే

తదాతుతృప్తిదంశ్రాద్దంపితౄణాంశృణుచాపరమ్

గీతంసనత్కుమారేణయథైళాయమహాత్మనే

పృచ్చతీపితృభక్తాయప్రశ్రయావనతాయచ

శ్రాద్ధ ప్రశంశ:

శ్రద్ధతో శ్రాద్దమును చేయు మనుజుడు బ్రహ్మ దేవేంద్ర రుద్ర అశ్వినీ దేవ సూర్య అగ్ని వసు వాయువులను విశ్వే దేవతలను పితృగణమును పశుపక్షులను మనుజులను సర్పములను ఋషి గణములను ఇంకను సమస్త భూతములతో నొప్పు సకల జగత్తును సంతోష పెట్టిన వాడగును. ప్రతిమాసము అమావాస్య నాడు కృష్ణ పక్షము నందు అష్టకల యందు (తిస్రోష్టకలు) శ్రాద్దము చేయవలెను. కాలములను చెప్పెద వినుము. శ్రాద్దమునకు తగిన ద్రవ్యము విశిష్టమైన బ్రాహ్మణుడు సంప్రాప్తము కాగా తెలిసికొని శ్రాద్దమును పెట్టవలెను. అట్లే వ్యతీపాన్నామక యోగము నందు దక్షిణోత్తరాయన కాలమందు విషువము (దివారాత్రములు సమానముగా నున్న సమయము) నందు సంక్రమణము లందు సూర్య చంద్ర గ్రహణము లందు నక్షత్ర గ్రహపీడ లందు దుష్ట స్వప్నమును కన్నను నూతనధాన్యము వచ్చినప్పుడు కామ్య శ్రాద్దములను చేయ వలయును. అమావాస్య అనూరాధా విశాఖా స్వాతి నక్షత్రములతో గూడినపుడు పెట్టిన శ్రాద్దములచే పిత్రుగానము ఎనిమిది సంవత్సరములు తృపిని పొందును. పుష్యమి ఆర్ద్ర పునర్వసు నక్షత్రములతో గూడిన యమావాస్య యందు అర్చితులై పితృదేవతలు ద్వాదశ వార్షిక తృప్తిని పొందుదురు. ధనిష్ఠ పూర్వాభాద్ర శతభిషక్ నక్షత్రములతో కూడిన యమావాస్య పితరులకు దేవతలకు తృప్తి కలుగ జేయగోరు మనుజులకు (పరమ తృప్తి హేతువగుటచే) దుర్లభమైనది. ఈ పైని చెప్పిన తొమ్మిది నక్షత్రములతో గూడిన యమావాస్య యందు పెట్టిన శ్రాదము పితృ దేవతలకు తృప్తి నిచ్చునది. అట్లె తృప్తి నిచ్చు మఱియొక శ్రాదమును చెప్పెద వినుము. ఇది వినయ వంతుడు పితృభక్తుడు మహాత్ముడు నగు నీలుడు అడుగగా సనత్కుమారునిచే చెప్ప బడినది.

సనత్కుమారుడు:

వైశాఖమాసస్యచయా తృతీయా నవంయసౌకార్తికశుక్లపక్షే

నభస్యమాసస్యతుకృష్ణపక్షే త్రయోదశీపఞ్చదశీచమాఘే

ఏతాయుగాధ్యాః కథితాః పురాణై రానన్తపుణ్యాస్తి థయశ్చతస్రః

ఉపప్లవేచంద్రమసోరవేశ్చ త్రిష్వష్టకాస్వప్యయనద్వాయేచ

పానీయామాప్యత్రతితలైర్విమిశ్రం దద్యత్పిత్రుభ్యఃప్రయతో మనుష్యః

శ్రాద్ధంకృతంతేనసమాసహస్రం రహస్యమేతతపితరోవదన్తి

మఘాసితేపఞ్చదశీకదాచిదుపై తియోగంయదివారుణేన

ఋక్షేణకాలస్సపరఃపితౄణాం నహ్యల్పపుణ్యైర్ నృప! లభ్యతేహ

కాలేధనిష్ఠాయదినామతస్మిన్ భవేత్తు భూపాల! తదాపితౄభ్యః

దత్తంజలాన్నంప్రదదాతితృప్తింవర్శాయుతంతత్కులజైర్మనుష్యైః

తత్రైవచేద్భాద్రపదాన్తుపూర్వాః కాలేయదాతత్క్రియతేపితృభ్యః

శ్రాద్ధంపరాంతృప్తిముపేత్య తేన యుగంసహస్రంపితరస్స్వపన్తి

గఙ్గాంశతద్రూంయమునాంవిపాశాం సరస్వతీంనై మిశగోమతీంవా

తథాఽవగాహ్యారచనమాదరేణ కృత్వాపితౄణాందురితానిహన్తి

గాయన్తిచైతత్పితరః కదానుహర్షమఘాతృప్తిమవాప్యభూప!

మాఘాసితాన్తేశుభతీర్తతోయైర్యా స్యామతృప్తింతనయాదిదత్తైః

చిత్తంచవిత్తంచనృణాంవిశుద్ధం శస్తశ్చకాలః కథితోవిధిశ్చ

పాత్రంయథోక్తంపరమాచభక్తిఃనృణాంప్రయచ్చన్త్యభివాఞ్చితాని

సనత్కుమారుడు:

వైశాఖ శుక్ల తదియ కార్తిక శుక్లనవమీ భాద్రపద కృష్ణ త్రయోదశి మాఘ కృష్ణ అమావాస్య ఈ నాలుగు తిథులు పవిత్రములు. యుగాదులు అని పురాణము లందు చెప్ప బడినది. సూర్య చంద్ర గ్రహణము లందు తిస్రోఽష్టకల (మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ కృష్ణ సప్తమి అష్టమి నవమి) యందు దక్షిణోత్తరాయనము లందు మంచి నీరైన నువ్వులతో కలిపి నియమవంతుడై పితృదేవతల కొఱకు అంజలులు సమర్పింప వలెను. అట్లు చేసిన యెడల వెయ్యి సంవత్సరములు శ్రాద్దము చేసినట్లని పితృదేవత లీ రహస్యమును చెప్పుదురు. మాఘ కృష్ణ అమావాస్య శతభిషక్ నక్షత్ర యోగము కలదగుట పితృ దేవతలకు సామాన్య పుణ్యములతో రాదు. ధనిష్ఠా నక్షత్రముతో గూడిన యాకాలమందు తత్కుల సంజాతులగు నరులచే నీయబడిన జలములు పదివేల సంవత్సరముల వరకు తృప్తి నీయగలవు. ఆకాలమే పూర్వాభాద్రతో గూడిన యెడల అట్టి సమయమున నీయబడిన శ్రాదము గొప్ప తృప్తిని కలుగ జేయును. పితృదేవతలు వేయి యుగములు గాఢముగ నిద్రింతురు. గంగ శతద్రు యమున విపాశ సరస్వతి నైమిశారణ్య గత గోమతీ నదులతో స్నానము చేసి పితృ దేవతలకు చేసిన యర్చనము తన దూరి తనాశనము చేయును. భాద్రపద కృష్ణ త్రయోదశి నాడు మాఘ నక్షత్ర యోగము నందు చేసిన శ్రాద్దము వలన తృప్తిచెంది పితరులిటుల గానము చేయుచుందురు. మాఘ క్రుష్ణపక్షమున శుభ తీర్థ జలములతో పుత్రాదులచే నీయబడిన శ్రాదముతో తృప్తిని చెందితిమి. పరిశుద్ద మగు మనసు ధనము ప్రశస్తమగు కాలము చెప్పబడిన విధి యథోక్తమగు పాత్ర (భోక్త) గొప్ప భక్తియు మనుజులకు కోరిన కోర్కెలు నీయ గలవు.

పితృగీతాంస్తథైవాత్రశ్లోకాం స్తాన్ శృణుపార్థివ

కృత్వాతథై వభవతాభావ్యంతత్రధృతాత్మనా

అపిధన్యః కులేజాయేదస్మాకంమతిమాన్నరః

అకుర్వన్ విత్తశాఠ్యంయః పిణ్డాన్నో నిర్వపిష్యతి

రత్నంవస్త్రంమహాయానంసర్వభోగాదికంవసు

విభవేసతివిప్రేభ్యోయోఽస్మానుద్ధిశ్యదాస్యతి

అన్నేనవాయథాశక్త్యా కాలేస్మిన్ భక్తినమ్రదీః

భోజయిష్యతివిప్రాగ్ర్యాం స్తన్మాత్రవిభవోనరః

అసమర్థోఽన్నదానస్య దాన్యమామంస్వశక్తితః

ప్రదాస్యతిద్విజాగ్రేభ్యస్స్వల్పాల్పాంవాఽపిదక్షిణామ్

తత్రాప్యసామర్థ్యయుతః కరాగ్రాగ్రస్థితాం స్తిలాన్

ప్రణమ్యద్విజముఖ్యాయకస్మై చిద్భూప! దాస్యతి

తిలైస్సప్తాష్టభిర్వాపి సమవేతం జలాంజలిమ్

భక్తినమ్రస్సముద్దిశ్య భువ్యస్మాకంప్రదాస్యతి

యతః కుతశ్చిత్సంప్రాప్య గోభ్యోవాఽపిగావాహ్నికమ్

అభావేప్రీణయన్నస్మాన్ శ్రద్దాయుక్తః ప్రదాస్యతి

సర్వాభావేవనంగత్వాకక్షమూల ప్రదర్శకః

సూర్యాదిలోకపాలానామిదముచ్చైః పఠిష్యతి

నమేఽస్తివిత్తంనధనంనచాన్యచ్చ్రాద్దోపయుక్తంస్వపితౄన్నతోఽస్మి

తృప్యన్తుభక్త్యాపితరోమయైతౌ కృతౌభుజౌవర్త్మని మారుతస్య

పితృ దేవతలచే గానము చేయబడిన ఈ శ్లోకములను రాజా! వినుము. నీవట్లే చేసి ఆ విషయమై దృఢ చిత్తముతో ప్రవర్తిల్లుము. మన వంశము నందు విత్తశార్యము (ఉండియు లేడను కొనుట) చేయక మనకు పిండ ప్రాదానము చేయు బుద్దిమంతుడు ధన్యుడునగు జనుడు పుట్టునా? సంపద కలిగి మనల నుద్దేశించి బ్రాహ్మణుల కొఱకు రత్నమును వస్త్రమును గొప్ప వాహనమును సర్వ భోగాదికమును ధనమును నిచ్చువాడు మన వంశమున పుట్టునా! పరిమితమగు సంపద గలవాడై తత్కాలమున భక్తినమ్రుడై యథాశక్తిగా అన్నముతో యోగ్యులగు బ్రాహ్మణులకు భోజనము పెట్టువాడు మన వంశమున పుట్టునా! అన్న ప్రదానము చేయుటకు శక్తిలేక తనశక్తి కొలది ధాన్యమును గాని అపక్వ తండులమును అల్పమైన దక్షిణను బ్రాహ్మణోత్తములకు నిచ్చువాడు పుట్టునా? అంతకు గూడా సామర్థ్యము లేక కరాగ్రమున నున్న తిలలను బ్రాహ్మణ శ్రేష్టునకు నమస్కరించి యిచ్చువాడైన పుట్టునా? లేక ఏడెనిమిది నువ్వు గింజలతో ఊడిన జలాంజలి నయిన భక్తి నమ్రుడై యిచ్చువాడైనా పుట్టునా? ఆమాత్రము గూడ లేనివాడై యెచ్చటనైన సంపాదించి గోవుల కొఱకు నొక్కదినమైన సంతుష్టిని కలిగించు గడ్డి మొదలగు దాని నయినా శ్రద్ధతో మాకు తృప్తికై యిచ్చువాడు పుట్టునా! ఏమియు లేనిచో వనమునకు వెళ్లి తనలేమిని ప్రకటించుటకి రెండు చేతుల నెత్తి సూర్యాద్యష్ట దిక్పరిపాలకుల నుద్దేశించి ఈ శోకమును బిగ్గరగా పఠింప వలెను, నాకు హిరణ్యాది రూపమున గాని జీవన ధనమగు ధాన్యాదికము గాని జీవన ధనమగు దాన్యాదికము గాని శ్రాద్దమున కుయోగపడునది లేదు. మా పితృ దేవతలకు నమస్కరించు చున్నాను. మీ ప్రీతి కొఱకై యాకసము నందు నాయీ చేతుల నెత్తితిని. నా భక్తితో దేవతలు తృప్తి చెందుదురు గాక!

ఔర్యుడు:

ఇత్యేతత్పితృభిర్గీతంభావాభావప్రయోజనమ్

యః కరోతికృతం తేన శ్రాద్ధంభవతిపార్థివ!

ఔర్యుడు:

భావాఽభావ ప్రయోగార్హ మగునట్లు పితృ దేవతలచే నిది చెప్పబడినది. శక్తి ఆశక్తి ప్రయుక్త కృత్యమగు దీని నాచరించిన యెడల శ్రాద్దము వానిచే చేయ బడినట్లే.