ఇత్యేషకథితస్సమ్యక్తృతీయః ప్రతిసంచరః।
ఆత్యన్తికో విముక్తిర్యాలయో బ్రాహ్మణి శాశ్వతే॥
సర్గశ్చప్రతిసర్గశ్చ వంశమన్వన్తరాణిచ।
పురాణం వైష్ణవంచై తత్సర్వకిల్బిష నాశనమ్।
విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదకమ్॥
మూడవ ప్రతి సంచరమును (లయమును) చెప్పితివి. బ్రహ్మ మందు లయమగుట యను ఆత్యంతిక ముక్తి యిది. సర్గము వంశము మన్వంతరములు వంశాను చరితమను పురాణముల యొక్క యైదు లక్షణములును నీకు దేల్పితిని. మైత్రేయా! ఈ విష్ణు పురాణము సర్వ పాపహరము. సర్వ శాస్త్రముల కంటే పైది. నాల్గు పురుషార్థములును దెల్పునది. ఇంకేమి వచింప వలెనో యడుగుము.
భగవన్ కథితం సర్వం యత్పృష్టోఽసిమయామునే।
శ్రుతంచై తన్మయాభక్త్యానాన్యత్ప్రష్టవ్యమ స్తిమే॥
విచ్చిన్నాస్సర్వసందేహావై మల్యంమనసః కృతమ్।
త్వత్ప్రసాదాన్మ యాజ్ఞాతా ఉత్పత్తి స్థితి సంక్షయాః॥
జ్ఞాతశ్చతుర్విదోరాశిశ్శక్తిశ్చ త్రివిధాగురో।
విజ్ఞాతాసాచకార్ త్స్న్యేన త్రివిధా భావభావనా॥
త్వత్ప్రసాదాన్మ యాజ్ఞాతం జ్ఞేయమన్యైరలంద్విజ।
యదేతదఖిలం విష్ణోర్జగన్న వ్యతిరిచ్యతే॥
కృతార్థోఽహమ సందేహ స్త్వత్ప్రసాదాన్మహామునే।
వర్ణధర్మాయోధర్మావిదితాయదశేషతః॥
ప్రవృత్తం చనివృత్తంచ జ్ఞాతంకర్మమయాఖిలమ్।
ప్రసీదవిప్రప్రవర! నాన్యత్ప్రష్టవ్యమ స్తిమే॥
భగవంతుడా! భక్తితో తమ వలన వినదగిన దంతయు విన్నాను. సందేహములు వాసినవి. మనస్సు పరిశుద్దమైనది. ఉత్పత్తి స్థితి లయములు నాకవగతము లయినవి. సృష్టి, స్థితి, పరిపాలన హేతువులగు బ్రహ్మదక్షాది రాశి, విష్ణు మన్వాది రాశి, రుద్ర కాలాంతకాది రాశి అను త్రివిధ రాసులు. విష్ణు శక్తి, క్షేత్రజ్ఞ శక్తి, అవిద్యా కర్మ శక్తి యను త్రివిధ శక్తులు బ్రహ్మ భావన కర్మ భావన ఉభయ భావన యను భావభావనాత్రయము మీ యనుగ్రహముచే పూర్తిగ దేలిసినవి. నీ యనుగ్రహముచే తెలియదగినది తెలిసినది. వర్ణాశ్రమ ధర్మములు తెలిపినవి. కృతార్థుడ నైతిని. ప్రవృత్త నివృత్త కర్మలు తెలిసినవి. ఈ జగత్ అంతయు విష్ణువు కంటే వేరు కాదు. ఇది ప్రవచింపుమని శ్రమ పెట్టితిని. క్షమించుము. మహానుభావులకు పుత్రునికి శిష్యునికిని భేదము ఉండదు.
ఏతత్తేయన్మయాఖ్యాతం పురాణం వేద సమ్మితమ్।
శ్రుతేస్మిన్ సర్వదోషోత్థః పాపరాశిః ప్రణశ్యతి॥
సర్గశ్చప్రతిసర్గశ్చ వంశమన్వన్తరాణిచ।
వంశానుచరితం కృత్స్నం మయాత్రతవకీర్తితమ్॥
అత్రదేవా స్తథాదైత్యాగన్ధర్వోరగరాక్షసాః।
యక్షవిద్యాధరాస్సిద్దాః కథ్యంతేప్సరస స్తథా॥
మునయో భావితాత్మనః కథ్యన్తే తపసాన్వితాః।
చాతుర్వర్ణ్యంతథాపుంసాం విశిష్టచరితానిచ॥
పుణ్యాః ప్రదేశామేదిన్యాః పుణ్యానద్యోథసాగరాః।
పర్వతాశ్చ మహాపుణ్యాశ్చరితానిచ ధీమతామ్॥
వర్ణధర్మాదయోధర్మావేదశాస్త్రాణి కృత్స్నశః।
యేషాం సంస్మరణాత్సద్యస్సర్వపాపైః ప్రముచ్యతే॥
ఉత్పత్తి స్థితి నాశానాం హేతుర్యోజగతోఽవ్యయః।
ససర్వభూతస్సర్వాత్మా కథ్యతేభగవాన్ హరిః॥
అవశేనాపియన్నామ్ని కీర్తితేసర్వపాతకైః।
పుమాన్ విముచ్యతే సద్యస్సింహత్రస్తైః మృగైరివ॥
యన్నామా కీర్తనం భక్త్యావిలాయనమనుత్తమమ్।
మైత్రేయాశేషపాపానాం దాతునామివపావకః॥
కలికల్మషమత్యుగ్రం నరకార్తిప్రదంనృణామ్।
ప్రయాతివిలయంసద్యస్సకృద్యత్రచసంస్మృతే॥
హిరణ్యగర్భదేవెన్ద్రరుద్రాదిత్యాశ్వివాయుభిః।
పావకైః వ సుభిస్సాధ్యైః విశ్వేదేవాదిభిస్సురైః॥
యక్షరక్షోరగై సిద్ధైర్దైత్యగన్దర్వదానవైః।
అప్సరోభి స్తథాతారా నక్షత్రైస్సకలైర్ గ్రహైః॥
సప్తర్షిభిస్తథాధిష్ణ్యైర్ధిష్ణ్యాధిపతి భిస్తథా।
బ్రాహ్మణాద్యైర్ మనుష్యైశ్చతథై వపశుభిర్ మృగైః॥
సరీసృపైః విహంగైశ్చపలాశాద్యైః మహీరుహైః।
వనాగ్నిసాగరసరిత్పాతాళై స్ససురాగ్నిభిః॥
శబ్డాదిభిశ్చ సహితం బ్రహ్మాణ్డమఖిలం ద్విజ।
మేరోరివాణుర్యస్యైతద్యన్మయంచ ద్విజోత్తమ॥
ససర్ వస్సర్వవిత్సర్వ స్వరూపోరూపవర్జితః।
భగవాన్ కీర్తితో విష్ణురత్రపాప ప్రణాశనః॥
యదశ్వమేధావభృథేస్నాతః ప్రప్నోతివై ఫలమ్।
మానవ స్తదవాప్నోతిశ్రుత్త్వైతన్మునిసత్తమ॥
ప్రయాగే పుష్కరేచైవ కురుక్షేత్రే తథార్ణవే।
క్రుతోపవాసః ప్రాప్నోతి తదస్య శ్రవణాన్నరః॥
యదగ్ని హోత్రేసుహుతేవర్షేణాప్నోతి మానవః।
మహాపుణ్య ఫలం విప్రతదస్య శ్రవణాత్సకృత్॥
యజ్జ్యేష్ఠ శ్లుక్లస్వాదశ్యాంస్నాత్వావై యమునాజలే॥
మధురాయాం హరిందృష్ట్వా ప్రాప్నోతి పురుషః ఫలమ్॥
తదాప్నోత్యఖిలం సమ్యగధ్యాయం యశ్శ్రుణోతివై।
పురాణస్వాస్య విప్రర్షే! కేశవార్పిత మానసః॥
యమునా సలిలే స్నాతః పురుషో మునిసత్తమ।
జ్యేష్ఠామూలేసితే పక్షేద్వాదశ్యాంసముపోషితః॥
సమభ్యర్ చ్యాచ్యుతం సమ్యజ్మథురాయాం సమాహితః।
అశ్వమేధస్య యజ్ఞస్య ప్రాప్నోత్య వికలంఫలమ్॥
ఆలోక్యర్ ద్దిమథాన్యేషామున్నీతానాంస్వ వంశజైః।
ఏతత్కి లోచురన్యేషాంపితరస్స పితామహాః॥
కచ్చిదస్మత్కులేజాతః కాళిన్దీసలిలాప్లుతః।
అర్చయిష్యతి గోవిన్దం మధురా యాముపోషితః॥
జ్యేష్ఠా మూలేసితే పక్షేకేనై వంవయమప్యుతః।
పరామృద్దిమవాప్స్యామస్తారితాస్స్వకులోద్భవైః॥
జ్యేష్ఠా మూలేఽసి తేపక్షే సమభ్యర్ చ్యజనార్దనమ్।
ధన్యానాం కులజః పిణ్డాన్ యమునా యాంప్రదాస్యతి॥
తస్మిన్ కాలేసమభ్యర్చ్యతత్ర కృష్ణం సమాహితః।
దత్త్వా పిణ్డం పితృభ్యశ్చ యమునా సలిలాప్లుతః॥
యదాప్నోతి నరః పుణ్యం తారయన్ స్వపితామహాన్।
శ్రుత్వాఽధ్యాయంతదాప్నోతి పురాణస్యాస్య శక్తితః॥
ఏతత్సంసారభీరూణాం పవిత్రాణామనుత్తమమ్।
శ్రావ్యణాం పరమం శ్రావ్యం పవిత్రాణామనుత్తమమ్॥
దుస్స్వప్న నాశనం న్రూణాం సర్వదుష్టనిబర్హణమ్।
మంగళం మంగళానాంచ పుత్రసంపత్ప్రదాయకమ్॥
ఇదమార్షంపురాప్రాహఋభవేకమలోద్భవః।
ఋభుః ప్రియవ్రతాయాహసచభాగురయే బ్రవీత్॥
భాగురిః స్తమ్బమిత్రాయదధీఛాయసచోక్తవాన్।
సారస్వతాయతేనోక్తం భృగుస్సారస్వ తేనచ॥
భృగుణా పురుకుత్సాయనర్మ దాయైసచోక్తవాన్।
నర్మదా ధృతరాష్ట్రాయనాగాయా పూరణాయచ॥
తాభ్యాంచ నాగారాజాయ ప్రోక్తం వాసుకయేద్విజ।
వాసుకిః ప్రాహవత్సాయవత్సశ్చాశ్వతరాయవై॥
కమ్బళాయచతేనోక్త మేలాపుత్రాయతేనవై॥
పాతాళం సమనుప్రాప్తస్తతోవేదశిరామునిః।
ప్రాప్తవానేతదఖిలంసచప్రమతయేదదౌ॥
దత్తంప్రమతినాచై తజ్జాతుకర్ణాయధీమతే।
జాతుకర్ణేనచైవోక్త మన్యేషాం పుణ్యకర్మణామ్॥
పులస్త్య వరదానేనమమాప్యేతత్స్మృతిం గతమ్।
మయాపితుభ్యం మైత్రేయ! యథావత్కథితంత్విదమ్॥
త్వమప్యేతచ్చినీకాయ కలేరన్తేవదిష్యసి॥
ఇత్యేతత్పరమంగుహ్యం కలికల్మష నాశనమ్।
యశ్శృణోతినరోభక్త్యాసర్వపాపైః ప్రముచ్యతే॥
సమస్తతీర్థస్నానానిసమస్తామరసంస్తుతిః।
కృతాతేనభవేదేతధ్యశ్శృణోతిదినేదినే॥
ఈ విష్ణు పురాణము వేద తుల్యము. ఇది వినిన పాపరాశి నశించును. పురాణ పంచ లక్షణములు నీ కిందు వర్ణించితిని. ఇందు దేవ దైత్య గంధర్వాదులు చరిత్రలన్నియు తెలుపబడినవి. ఆత్మ దర్శనము సేసిన మునులు చాతుర్వర్ణ్యము మహానుభావుల కథలు పుణ్య క్షేత్ర తీర్థములు వర్ణితములు. వేద శాస్త్ర విషయములు తెలుప బడినవి. విష్ణువును గూర్చి వినిపించితివి. అగ్ని లోహములనట్లీ పురాణము కలికల్మషములను హరించి మనస్సును శుద్ధి సేయును. పిపీలికాది బ్రహ్మ పర్యంతమయిన బ్రహ్మాండ మంతయు నెవ్వని స్వరూపమో యా విష్ణు భగవానుడిందు సంకీర్తంప బడెను. అశ్వమేధ, అవభృథ స్నానము సేసిన ఫలము ప్రయాగ పుష్కరము కురుక్షేత్రము మొదలగు వాని యందు స్నానదానాదులు సేసిన కలుగు ఫల మీ పురాణ శ్రవణముచే సిద్ధించును. యమున యందు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు స్నానము సేసి, మథుర యందు హరిం దర్శించిన పుణ్యము దీనిచే గల్గును. జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడుపవసించి యమునా జలముల స్నానము సేసి పితరుల నర్చించిన పుణ్యమీ పురాణ పఠన శ్రవణాదుల గల్గును. మథురానాథు నయ్యెడ సేవించిన పుణ్యము నిది యిచ్చును. ఇది దుస్స్వప్న నివారకము. మంగళముల కెల్ల మంగళము. పుత్రులను సంపదల నిచ్చును. బ్రహ్మ ఋభునకు అతడు ప్రియవ్రతునకు అతడు భాగురికి ఆయన స్తంబ మిత్రునకు నాతడు దదీచికి ఆయన సారస్వతునికి యతడు భృగునకు ఆయన పురుకుత్సునికి నతడు నర్మదకు నర్మద ధృతరాష్ట్రునికి, నాగునికి, ఆపూరణునకు ఆ యిద్దరు నాగేంద్రుడైన వాసుకికి, వాసుకి వత్సునికి, అతడు అశ్వతరునకు, అతడు కంబళునకు, అతడెలా పుత్రునుకి నుపదేశించెను.
వేదశిరుడను ఋషి పాతాళమున కేగి యిది వినెను. అతడు ప్రమతికి అతడు జాతుకర్ణునికి, మరి పుణ్యు లెందరికో వినిపించెను. పులస్త్య మహర్షి వరముచే నాకిది జ్ఞప్తికి వచ్చినది. నేను నీకు యథాతదముగా దెల్పితిని. నీవు దీనిం గలియుగము తుదిని శినీకునకు ఉపదేశింప గలవు. ఇది పరమ గుహ్యము కలి పాపహరము. భక్తితో విన్న యతడు సర్వపాప విముక్తుడగును. సర్వ తీర్థ స్నాన ఫలము సర్వ దేవతా స్తుతి ఫలము దీనిచే గల్గును. కపిల గోదాన ఫలమిది చేకూర్చును.
యస్త్వే తత్స కలం శృణోతి పురుషః కృత్వామనస్యచ్యుతమ్
సర్వం సర్వమయం సమస్త జగతామాధారమాత్మాశ్రయమ్।
జ్ఞానజ్ఞేయమనాదిమన్తరహితం సర్వామరాణాంహితమ్
సప్రాప్నోతి నసంశయోఽస్త్యవికలం యద్వాజిమేధేఫలమ్॥
యత్రాదౌభగవాంశ్చరాచర గురుర్మధ్యే తథాఽన్తేచస
బ్రహ్మజ్ఞానమయోఽచ్యుతోఽఖిల జగన్మధ్యాన్త సర్గప్రభుః।
తత్సర్వం పురుషః పవిత్రమమలం శృణ్వన్ పఠన్ వాచయన్
ప్రాప్నోత్యస్తినతత్పలం త్రిభువనేష్వేకాన్తసిద్ధిర్హరిః॥
యస్మిన్ న్యస్తమతిర్నయాతి నరకం స్వర్గోపియచ్చిన్తనే
విఘ్నోయత్రనివేశితాత్మ మనసోబ్రాహ్మోఽపిలోకోఽల్పకః।
ముక్తించేతసియః స్థితోఽమలదియాంపుం సాందదాత్యవ్యయః
కించిత్రంయదఘంప్రయాతివిలయం తత్రాచ్యుతే కీర్తితే॥
యజ్ఞైర్యజ్ఞవిదో యజన్తిసతతం యజ్ఞేశ్వరం కర్మిణో
యంవై బ్రహ్మమయం పరాపరమయంధ్యాయన్తిచజ్ఞానినః।
యంసంచింత్యనజాయతే నమ్రియతేనోవర్ధతేహీయతే
నై వాసన్నచసద్భవత్యతితతః కింవాహరేః శ్రూయతామ్॥
కవ్యంయః పితృరూపధృద్విదిహుతం హవ్యంచభుజ్త్కేవిభు
ర్దేవత్వే భగవాననాదినిధనస్స్వా హస్వధాసంఙ్ఞితే।
నాన్తోఽస్తి యస్యనచయస్యసముద్భవోఽ స్తివద్దిర్నయస్యపరిణామవివర్జితస్య।
నాపక్షయంచాసము పైత్యవికారివస్తుయ స్తంనతోస్మి పురుషోత్తమ మీశమీడ్యమ్॥
తస్యైవయోనుగుణభుగ్భహుదై క ఏవశుద్దోఽప్యశుద్ద ఇవభాతిహిమూర్తిభేదైః।
జ్ఞానాన్వితస్సకలస త్త్వవిభూతికర్తాతస్మై నమోస్తుపురుషాయసదాఽవ్యయాయ॥
జ్ఞాన ప్రవృత్తినియ మైక్యమయాయపుం సోభోగప్రదానపతవేత్రిగుణాత్మకాయ।
ఆవ్యాకృతాయభావభావనకారణాయవన్దేస్వరూపభవనాయసదాఽజరాయ॥
వ్యోమానిలాగ్ని జలభూచరనామయాయ శబ్దాదిభోగ్యవిధయోపనయక్షమాయ।
పుంసస్సమస్తకరణై రుపకారకాయవ్యక్తాయసూక్ష్మబృహదాత్మవాతేనతోఽస్మి॥
అచ్యుతానిపై మనస్సు నిలిపి ఇది సంపూర్ణంగా విన్నవాడు విష్ణు సాయుజ్య మందును. దీనియందు మది నిల్పిన వానికి స్వర్గము కూడ విఘ్నమని పించును. బ్రహ్మకల్పము కూడ అల్పమై తోచును. హరి ప్రసన్నుడై ముక్తి నిచ్చును. హరి కథా శ్రవణము సేసిన జ్ఞానులు పునరావృత్తి రహిత స్థితి నందుదురు. పితరులు తృప్తు లగుదురు. హవ్యకవ్యము లారగించు నవిష్ణు విభుండు సర్వ శక్తి మయుడు వీనులంబడెనేని అట్టి పుణ్య శ్రవులు బ్రహ్మ నిష్టు లగుదురు.
Summary of chapter 8 of the Vishnu Mahā Purāṇa is as follows:
The formal conclusion of the entire Viṣṇu Mahā Purāṇa. The five lakṣaṇas (defining characteristics) of a Purāṇa are enumerated: sarga (creation), vaṃśa (dynastic lineage), manvantara (cosmic time cycles), vaṃśānucarita (royal biographies), and pratisaṃcara (dissolution) — and all five have been taught in this Purāṇa in full. The Phalaśruti declares that hearing this Purāṇa is equal to the Vedas, removes all pāpa, grants all four puruṣārthas, and ultimately confers Viṣṇu-sāyujya. The complete transmission lineage is given: Brahma → Ṛbhu → Priyavrata → Bhāguri → Stamba Mitra → Dadīci → Sārasvata → Bhṛgu → Purukutsa → Narmadā (the river goddess) → Dhṛtarāṣṭra (the Nāga king) → Āpūraṇa → Vāsuki → Vatsa → Aśvatara → Kambala → Eelaputra. Parāśara himself received the Purāṇa from Pulastya by grace. He will teach it to Maitreya, who will transmit it to Śinī at the end of Kali Yuga. The Purāṇa ends with two mangala-ślokas in praise of Viṣṇu as the one without modification, the sole Puruṣottama, the Akhilātmaka — the lord of all jñāna and all śrī.