విష్ణు మహా పురాణము

18 - మాయామోహుడు రాక్షసుల వంచించుట

శ్రీపరాశరుడు:

తపస్యభిరతాన్ సోఽథ మాయామోహోమహాసురాన్

మైత్రేయ గత్వాదదృ శే నర్మదాతీరసంశ్రయాన్

తతోదిగామ్బరోముణ్డబర్హిపిఞ్చధరోద్విజ

మాయామోహోఽసురాశ్లక్షమ్ణుదంవచనమబ్రవీత్

శ్రీపరాశరుడు:

ఓ మైత్రేయా! ఆమాయామోహుకు బయలుదేరి వెళ్ళి నర్మదా నదీ తీరము నాశ్రయించి, తప మాచరించుట యందాసక్తితో నున్న మహా రాక్షసులను చూచెను. పిమ్మట మాయామోహుడు దిగంబరుడు, ముండిత శిరస్కుడు నెమలి పింఛముల దాల్చిన వాడునై రాక్షసులతో మృదువుగా నిట్లనెను.

మాయామోహుడు:

భోదైత్యపతయోబ్రూత యదర్థంతప్యతేతపః

ఐహికార్థంనుపారత్ర్యం తపసః ఫలమిచ్చథ

మాయామోహుడు:

దైత్యపతులారా! మీరీ తపస్సును ఇహికము కొఱకు చేయుచున్నారా! పారలౌకికమునకా! చెప్పెండి.

అసురులు:

పారత్ర్యఫలలాభాయ తపశ్చర్యామహామతే

అస్మాభిరియమారబ్ధా కింవాతేఽత్రవివక్షితమ్

అసురులు:

బుద్దిమంతుడా! పర లోకము కొఱకు మాచే తపము చేయబడు చున్నది. నీకిందు కావలసిన దేది?

మాయామోహుడు:

కురుధ్వంమమవాక్యానియదిముక్తిమభీప్సథ

అర్హధ్వమేతంధర్మంచముక్తిద్వారమసంయుతమ్

ధర్మోవిముక్తేరర్హోఽయం నైతస్మాదపరోవరః

అత్రైవావస్థితా స్స్వర్గం విముక్తిం వాగమిష్యథ

అర్హధ్వంధర్మమేతంచ సర్వే యూయంమహాబలాః

మాయామోహుడు:

మీరు మోక్షమునే కోరుదురేని నా మాటల నాచరింపుడు. ఈ నే చెప్పు ధర్మమునకు తగుదురు. ఇది తెరువ బడిన ముక్తిద్వారము. ఈ ధర్మము మోక్షమునకు తగినది. ఇంత కంటె శ్రేష్టమైనది లేదు. ఈ ధర్మము నందే యుండి మీరు స్వర్గమును గాని, మోక్షమును గాని పొందుదురు.

శ్రీపరాశరుడు:

ఎవంప్రకారై ర్బహుభిర్ యుక్తి దర్శనచర్చితైః

మాయామోహేనతేదైత్యా వేదమార్గాదపావృతాః

ధర్మాయైతదధర్మాయ సదేతన్న సదిత్యపి

విముక్తయేత్విదంనై తద్విముక్తిం సంప్రయచ్చతి

పరమార్థోఽయమత్యర్థం పర్మార్థోనచాప్యాయమ్

కార్యమేతతదకార్యంచ నైతదేవం స్ఫుటంత్విదమ్

దిగ్వాససామయంధర్మో ధర్మోఽయంబహువాససామ్

ఇత్యనేకాన్తావాదంచమాయామోహేన నైకధా

తేనదర్షయతాదైత్యాస్తేధర్మాంస్త్యాజితాద్విజ

అర్హతైతమథోధర్మం మాయామోహేనతేయతః

ప్రోక్తాస్తమాశ్రితాధర్మమర్హన్తస్తేనతేఽభవన్

త్రయీధర్మసముత్సర్గం మాయామోహేనతేఽసురాః

కారితాస్తన్మయా హ్యాసం స్తథాఽన్యే తత్ ప్రభోదితాః

తైరప్యన్యేపరేతైశ్చ తైరప్యన్యేపరేచతైః

అల్పైరహోభిస్సంత్యక్తా తైర్దైత్యైః ప్రాయశస్త్రయీ

పునశ్చ రక్తామ్బరధృత్ మాయామోహో జితేన్ద్రియః

అన్యా నాహాసురాన్ గత్వా మృద్వల్పం మధురాక్షరమ్

స్వర్గార్థంయదివోవాఞ్చా నిర్వాణార్థమథోఽసురాః

తదలంపశుఘాతాదిదుష్టధర్మైర్నిబోధత

విజ్ఞానమయమేవైతదశేషమవగచ్చత

బుధ్యధ్వమేవచ స్సమగ్భుధై రెవ ముదీరితమ్

జగతేతదనాధారం భ్రాన్తిజ్ఞానార్థం తత్పరమ్

రాగాదిదుష్టమత్యర్థం భ్రామ్యతే భవసంకటే

ఏవంబుధ్యత భుధ్యధ్వం బుధ్యతైవ మితీరయన్

మాయామోహస్సదై తేయాన్ ధర్మత్యాజయద్ద్విజ

నానాప్రకారవచనంసతేషాంయుక్తి యోజితమ్

తథాతథాఽవదద్దర్మతత్యజుస్తేయథాయథా

తేఽప్య న్యేషాంతథై వోచురన్యైరన్యేతథోదితాః

మైత్రేయ! తత్యజుర్ధర్మం వేదస్మృత్యుదితంపరమ్

అన్యానప్యన్యపాషణ్డప్రకారైః బహుభిర్ ద్విజ

దైతేయాన్ మొహయామాస మాయామోహోఽ తిమోహకృత్

అల్పేనై వహికాలేన మాయామోహేనతేఽ సురాః

మోహితాస్తత్యజుస్సర్వాం త్రయీమార్గాశ్రితాంకథామ్

కేచిద్వినిన్దాం వేదానాం దేవానామపరేద్విజ

యజ్ఞకర్మకలాపస్యతథాన్యేచద్విజన్మనామ్

నైత్యుక్తిసహంవాక్యంహింసాధర్మాయచేష్యతే

హవీంష్యనలదగ్ధానిఫలాయేత్యర్భకొదితమ్

యజ్ఞైరనేకై ర్దేవత్వమవాప్యేన్ద్రేణభుజ్యతే

శమ్యాదియదిచేత్కాష్ఠంతద్వరంపత్రభుక్పశుః

నిహత్యసపశోర్యజ్ఞేస్వర్గప్రాప్తిర్యదీష్యతే

స్వపితాయాజమానేననకిన్నుతస్మాన్నహన్యతే

తృప్తయేజాయతతేపుంసోభుక్తమన్యేనచేత్తతః

దద్యాచ్చ్రాద్దాం శ్రమాయాన్నంనవహేయుః ప్రవాసినః

జనశ్రద్దేయమిత్యేతదవగమ్యతతోఽత్రవః

ఉపేక్షాశ్రేయసేవాక్యంరోచతాంయన్మయేరితమ్

నహ్యాప్తవాదానభాసోనిపతన్తిమహాసురాః

యుక్తిమద్వచనంగ్రాహ్యంమయాన్యైశ్చభాద్విధైః

శ్రీపరాశరుడు:

ఈ విధములగు ననేకము లగు యుక్తి ప్రదర్శన చర్చలచే (అనగా శుష్కతర్క వాదములచే) మాయామోహుని చే నా రాక్షసులు వేద మార్గము నుండి మరలింప బడిరి. ఇది ధర్మము కొఱకు. ఇది అధర్మము కొఱకు. ఇది యోగ్యము ఇది అయోగ్యము. ఇది మోక్షము కొఱకు. ఇది ముక్తి నివ్వదు. ఇది పరమార్థము. ఇది పరమార్థము కాదు. ఇది కర్తవ్యము. ఇది కర్తవ్యము కాదు. ఇది ఇట్లు కాదు. ఇది ఇట్లే. దిగంబరుల కిది ధర్మము. బహు వస్త్రుల కిది ధర్మము. అనునాసప్త విధములగు ననిశ్చిత వాదము అనేక పర్యాయములు చెప్పుచున్న మాయామోహునిచే రాక్షసు లందఱు ధర్మములను విడుచునట్లు చేయ బడిరి. “పైన చెప్పిన ఏడు విధములగు వాదములు అర్హత ప్రోక్తములు, ఈ మాయామోహుడు అర్హతుడై యిట్లు చెప్పెను. ఈ ధర్మము నాశ్రరించిన వారు అర్హతులని ప్రసిద్దులైరి. వారి వలన బోధింప బడి మఱి కొందఱు, వారి వలన మఱి కొందఱు. ప్రేరితులై త్రయీ ధర్మ త్యాగము చేసిరి. ఇట్లు కొద్ది రోజులలోనే చాలా వఱకు రాక్షసుల చేత త్రయి (వేద త్రయము) విడువ బడెను. అది అర్హత మతము. తిరిగి యెఱ్ఱని వస్త్రములు ధరించి యింద్రియ నిగ్రహము గల మోయామోహుడు ఇతర రాక్షసుల చేరి మృదువుగను అల్పముగను మధుర వచనములతో నిట్లనెను. (బౌద్ద మతము) రాక్షసులారా! మీకోరిక స్వర్గము కావలె ననియా! మొక్షము కొఱకైనచో పశువులను చంపుట మున్నగు దుష్ట ధర్మముల మానుడు. ఈ సమస్తము విజ్ఞాన మయమని తెలిసి కొనుడు. నామాట తెలిసి కొనుడు. విద్వాంసులచే నిట్లే చెప్పా బడినది. (అవి యోగాచార్యు లాత్మఖ్యాతి పక్షమున చెప్పుదురు.) జగత్తంతయు ఆధార శూన్యము. (అధిష్టాన శూన్యమున భ్రాంతి జ్ఞాన సిద్దమని శూన్యఖ్యాతి పక్షమున మాధ్యముకులు) రాగాది దోషములు సంసారమున భ్రమింప జేయుచున్నవి. మీరు తెలిసికొనండి తెలిసి కొనండి తప్పక తెలిసి కొనండి. అని చెప్పుచు నా మాయామోహుడు రాక్షసులను నిజ ధర్మము విడిచి పెట్టునట్లు చేసెను. నానా విధములుగ చెప్పుట యుక్తులను చూపుట నా మాయామోహుడు రాక్షసులను నిజ ధర్మమును వదలిరి. వారు మఱికొందఱికి వారు మఱి కొందఱికి చెప్పిరీ. మైత్రేయా! ఇట్లు శృతి స్మృతి బోధిత ధర్మమును వారు త్యజించి మహా మోహకారి యగు మాయామోహు డింకను నితరులను లోకాయతికాది (చార్వాక) వేద బాహ్య మతముల బోధించి ధర్మ విముఖుల జేయుటయే గాక వేద నిందకులుగా జేసెను. అల్ప కాలముననే మయామోహునిచే నా రాక్షసు లందఱు వైదిక ధర్మవార్తాయే లేకుండుటయే గాక వేదములను నిందించు వారు కొందఱు బ్రాహ్మణులను నిందించు వారు కొందఱునై యిట్లు వాదముల జేయసాగిరి. హింస కూడదని వేదము చెప్పుచుండ యాగపశ్వాది హింస ధర్మ జనక మనుట యుక్తి సహము కాదు. అగ్నిచే దగ్ధములైన హవిస్సులు ఫల జనకము లనుట పసిపిల్లల మాటగ నున్నది. అనేక యజ్ఞముల చేసి యింద్రత్వమును పొందిన ఇంద్రుడు, మనచే హోమము చేయబడిన శంయాది సమిధలను భుజించునని అంత కంటె కోమలము లైన పత్రాదులను భక్షించు మేక మొదలగు పశువులే శ్రేష్టమైనవి. యజ్ఞమున వధింప బడిన పశువునకు స్వర్గ లోకము లభించునేని యాగకర్త తన తండ్రి నెందులకు చంపడు? ఒకడు భుజించిన యన్నముచే మఱి యోకనికి తృప్తియగు నని శ్రాద్ధాదులు పెట్టెదరేని బాటసారులు తమతో కూడ పాథేయముగ నన్నడులను గొంపోవుట కేవలము శ్రమకే గదా! కావున కేవలమివి ప్రాకృత జనుల నమ్మకము లని నా మాటల వలన తెలిసి కొని యీ యజ్ఞములు మున్నగు విషయములలో నౌదాసిన్యము వహించుటయే మీకు శ్రేయస్కరము. అపౌరుషేయములగుటచే వేదములు ఆప్తవాక్యములై ప్రమాణము లందురా! అదియు సరికాదు. ఆప్త వాక్యములు ఆకాశము నుండి తమంతట తాము భూమిపై పడునా? కావు నాచేతను మీవంటి వారి చేతను గూడ యుక్తి యుక్తమైన మాటయే గ్రహింప నగును.

శ్రీపరాశరుడు:

మయామోహేన తే దైత్యాఃప్రకారై ర్బహుభిస్తథా

వృథాపితా యథానిషాంత్రయీంకశ్చిదరోచయత్

ఇత్థమున్మార్గయాతేషుతేషుదైత్యేషు తేఽమరాః

ఉద్యోగంపరమంకృత్వాయుద్దయాసముపస్థితాః

తతోదేవాసురంయుద్ధం పునరేవాభవద్ద్విజ

హతాశ్చతేఽసురాదేవై స్సన్మార్గపరిపన్థినః

సద్దర్మకవచ స్తేషామభూద్యః ప్రథమంద్విజ

తేనరక్షాఽభావత్పూర్వం నేశు ర్నష్టేచ తత్రతే

తతోమైత్రేయ! తన్మార్గవర్తినోయేఽభవన్ జనాః

నగ్నాస్తేతైర్యతస్త్యక్తం త్రయీసంవరణంతథా

కృతాశ్చతేఽసురాదేవైర్నానావేదవినిన్దకాః

బ్రహ్మచారీగృహస్థశ్చవానప్రస్థస్తథాశ్రమీ

పరివ్రాడ్వాచతుర్థో త్రపఞ్చమోనోపపద్యతే

యస్తుసన్త్యజ్యగార్ హస్థ్యంవానస్థోనజాయతే

పరివ్రాడ్వాపిమైత్రేయసనగ్నః పాపకృన్నరః

నిత్యానాం కర్మణాం విప్రయస్యహానిరహర్నిశమ్

అకుర్వన్విహితంకర్మ శక్తఃపత్తితద్దినే

ప్రాయశ్చిత్తేనమహతాశుద్ధిమాప్నోత్యనాపది

పక్షంనిత్యక్రియాహానేః కర్తామైత్రేయమానవః

సంవత్సరంక్రియాహానిర్ యస్యపుంసోభిజాయతే

తస్యావలోకనాత్సూర్యోనిరీక్ష్యస్సాధుభిస్సదా

స్పృష్టేస్నానంసచేలంస్యాచ్చుద్దేఃహేతుర్మహామతే

పుంసోభవతితస్యోక్తానశుద్ధిః పాపకర్మణః

దేవర్షిపితృభూతానియస్యవిప్రస్యవేశ్మని

ప్రయాన్త్యనర్చితాన్యత్రలోకేతస్మాన్నపాపకృత్

దేవాదినిశ్వాసహతం శరీరంయ స్యవేశ్మచ

నతేనసంగమం కుర్యా ద్గృహాసనపరిచ్చదైః

సంభాషణానుప్రశ్నాది సహాస్యాంచైవకుర్వతః

జాయతేతుల్యతాపుంసస్తేనై వద్విజవత్సరాత్

అథభుఙ్త్కేగృహేతస్యకరోత్యాస్యాంతథాసనే

శేతేవాప్యేకశయనే ససద్య స్తత్సమోభవేత్

బ్రాహ్మణాద్యాస్తుయేవర్ణాస్స్వధర్మాదన్యతోముఖాః

యాన్తితేనజ్ఞాసంజ్ఞాంతుహీణకర్మస్వవస్థితాః

చతుర్ణాంయత్రవర్ణానాంమైత్రేయాత్యస్తసంకరః

తద్రాస్యాసాదువృత్తీనాముపఘాతాయజాయతే

అనభ్యర్ చ్యఋషీన్ దేవాన్ పితృభూతాతిథీంస్తథా

యోభుఙ్త్కేతస్యసల్లాపాత్ పతన్తినరకేనరాః

తస్మాదేతాన్నారోనగ్నాం స్త్రయీసంత్యాగదూషితాన్

సర్వదావర్జయేత్ప్రాజ్ఞ ఆలాపస్పర్శనాదిషు

శ్రద్దావద్భిః కృతం యథ్నాద్దేవాన్ పితృపితామహాన్

నప్రీణయతితచ్చ్రాద్దంయదేభిరవలోకితమ్

శ్రీపరాశరుడు:

 మాయామోహునిచే నిట్లే బహు విధములుగ రాక్షసులు వేదము లందు రుచి లేని వారుగ చేయబడిన వారై యధర్మ మార్గానుయాయులు కాగా, దేవతలు గొప్ప ప్రయత్నము చేసి వారితో యుద్దమునకు సన్నద్దులైరి. ఆ యుద్దము నందు సన్మార్గ విరోధులగు రాక్షసులు హతులైరి. ఆ రాక్షసుల కిదివరలో స్వధర్మ కవచమే రక్షకముగ నుండెను ఇపుడది నష్ట మగుటచే దైత్యులు అసమర్థులైరి. మైత్రేయా! ఆ మార్గగాము లందరు వేద కవచమును వీడుటచే (నగ్నులు వస్త్ర హీనులు) నానా విధమైన వారుగాను వేద నిందకులు గను దేవతలచే జేయబడిరి. బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు పరివ్రాట్ (సన్యాసి) అని నాలుగే ఆశ్రమములు. అయిదవది లేదు. గృహస్థు వేషమును విడచిన మాత్రమున వానప్రస్థు గాని పరివ్రాట్ గాని కానేరడు. అతడు నగ్నుడు పాపకారి. శక్తుడైన వాడు ఒక్క రోజు నిత్యకర్మల లోపముచే పతితు డగును. అట్టి వాడు ఆపదలో లేనియప్పుడు గొప్ప ప్రాయశ్చిత్తముచే శుద్దు డగును. ఒక పక్షము (15రోజులు) నిత్యకర్మలు లేనివాడును ఒక సంవత్సరము నిత్యకర్మల విడచిన వాడును కనపడెనేని సత్పురుషుడు సూర్యుని చూడ వలెను. బుద్దిమంతుడా! వానిని స్పృశించిన యెడల సచేల (కట్టు వస్త్రముతో) స్నానము వలన శుద్ధి కలుగును. ఈ చెప్పిన శుద్ధి సజ్జనునికి గాని పాపాత్మునకు గాదు. పాపాత్ముడవగా, నెవ్వని యింట దేవా పితృభూత యజ్ఞము లుండవో వాని యింట నుండి దేవా పితృ భూతములు వెడలి పోవును. ఆ యజమాని కంటె పాపాత్ముడు లేడు. అట్టివానితో సంవత్సర కాలము సంభాషణము ప్రశ్నించుట కలసి యుండుట చేయునాతడు వానితో తుల్యు డగును. (దేవా పితృ భూత అతిథులను పూజించక భుజించిన వాడు పాపమునే తినుచున్నాడు. వానికి నిష్కృతి (ప్రాయశ్చితము) లేదు.) బ్రహ్మాణాది వర్ణముల వారు స్వధర్మమును వదలి హీనకర్మల లోనున్న వారు నగ్ను లన బడుదురు. నాలుగు వర్ణములకు సాంకర్యమున్న చోట సజ్జనులకునికి పతన హేతువే యగును. పంచ మహాయజ్ఞముల (ఋషి, దేవ, పితృ, భూత, అతిథి) నాచారించని వానితో మాట్లాడుటచే మనుజుల్లు నరకమున కేగుదురు. కావున వేదత్రయ ధర్మ త్యాగాముచే భ్రష్టులైన నగ్నులతో సంభాషణ స్పర్శనాదులను ప్రాజ్ఞుడు సదా విడువ వలెను. ఇట్టి వారిచే చూడ బడినదై శ్రద్దావంతులు పెట్టు శ్రాద్దము దేవా పితృ పితామహాదులను సంతోష పెట్ట జాలదు.

పాషండ సంభాషణ ఫలమ్ - శతధన్వోపాఖ్యానం:

శ్రూయతేచపురా రాజాఖ్యాతః శతధను ర్భువి

పత్నీచతస్యశైబ్యాఽ భూత్పతిధర్మపారాయణా

పతివ్రతామహాభాగా సత్యశౌచదయాన్వితా

సర్వలక్షణసంపన్నా సంపన్నావినయేనచ

సతురాజాతయాసార్థందేవదేవంజనార్దనమ్

ఆరాధయామాసవిభుంపరమేణసమాధినా

హోమైర్జపైస్తథాదానై రుపవాసై శ్చభక్తితః

పూజాభిశ్చానుదివసం తన్మనా నాన్యమానసః

ఏకదాతుసమంస్నాతౌతౌతుభార్యాపతీజలే

భాగీరథ్యాస్సముత్తీర్ణౌకార్తిక్యాంసముపోషితౌ

పాషణ్డినమాథాయాన్తం సమ్ముఖంతా వపశ్యతామ్

చాపాచార్యస్యతస్యాసౌసఖారాజ్ఞోమహాత్మనః

అతస్తద్గౌరవాత్తేనసఖాలాపమథాకరోత్

నతుసావాగ్యతాదేవీతస్యపత్నీపతివ్రతా

ఉపోషితాస్మీతిరవిం తస్మిన్ దృష్టేదదర్శహ

సమాగమ్యయథాన్యాయ్యం దంపతీతౌయథావిధి

విష్ణోఃపూజాదికం సర్వంకృతవంతౌద్విజోత్తమ!

కాలేనగచ్ఛతారాజామమారాసౌసపత్నజిత్

అన్వారురోహసాదేవీచితాస్థం భూపతింపతిమ్

సతుతేనాపచారేణ శ్వాజఞ్ఞేవసుధాపతిః

ఉపోషితే నపాషణ్డసల్లాపోయత్కృతోఽభవత్

సాపిజాతిస్మరాజగ్నే కాశీరాజసుతాశుభా

సర్వవిజ్ఞానసంపూర్ణా సర్వలక్షణపూజితా

తాంపితాదాతుకామోభూద్వరాయవినివారితః

తయైవతన్వ్యావిరతోవివాహారమభతోనృపః

తతస్సాదివ్యయాదృష్ట్యాదృష్ట్యాస్వానంనిజంపతిమ్

విదిశాఖ్యంపురంగత్వాతదవస్థందదర్శతమ్

తందృష్ట్వెవమహాభాగం శ్వానభూతంపతింతదా

దదౌతస్మైసదాహారంసత్కారప్రవణంశుభా

భుఞ్జన్ దత్తం తయాసోన్నమతిమృష్టమభీప్సితం

స్వజాతిలలితంకుర్వన్ బహుచాటుచకారవై

అతీవవ్రీడితాబాలాకుర్వతాచాటుతేనసా

ప్రణామపూర్వమాహేదందయితంతంకుయోనిజమ్

స్మర్యతాంతన్మహారాజదాక్షిణ్యాల్లపితంత్వయా

యేనశ్వయోనిమాపన్నోమమచాటుకరోభవాన్

పాషణ్డినం సమాభాష్యతీర్తస్నానాదనన్తరమ్

ప్రాప్తోవికుత్సితాం యోనింకింనస్మరసితద్విభో

పాషండులతో నాలపించుట దోషప్రదము (శతధన్వోపాఖ్యానము):

భూలోకమున శతధన్వుడను నొకరాజుండెను. అతని భార్య శైబ్య యను నామే మిక్కిలి ధర్మాసక్తి గలదియు పతివ్రత మహా ప్రభావోపేత సత్యము, శౌచము, దయలతో కూదినదియు వినయాది సకల సల్లక్షణ సంపన్నురాలు. ఆ ప్రభువామేతో గూడ నేకాగ్రతతో దేవా దేవుడగు జనార్ధనుని భక్తితో జప హోమార్చనాదుల తోను, ఉపవాసముల తోను తదేక చిత్తుడై యనుదినము బారాధించు చుండెను. ఒక రోజున భార్యా భర్త లిరువురు కార్తిక పున్నమి నాడు గంగలో స్నానమాడి యుపవసించిన వారై యెదురుగ వచ్చుచున్న యొక పాషండుని (నాస్తికుని) జూచిరి. చాపాచార్యు డగు నా మహారాజు కాతడు స్నేహితుడగుటచే నాదరముతో సంభాషించెను. ఆ పతివ్రత మాత్రము ముపవసించిన దగుటచే మౌనముతో నుండి యాతడు కంట బడగనే సూర్యుడిని చూచెను. ఆ దంపతు లింటికి వచ్చి యథావిధిగా విష్ణు పూజాదికము ననతయు చేసిరి. చాలా కాలమునకా రాజు మరణించెను. రాణి ఆయనతో అనుగమించెను. ఆ రాజు ఉపవసించి పాషండునితో సల్లాపము చేయుట యను నపచారముచే నొక కుక్కగా పుట్టెను. ఆమె పూర్వ జన్మ స్మృతి గలదై కాశీరాజునకు యోగ్యమైన కుమారిగ పుట్టెను. సర్వ విజ్ఞానముతో సమస్త లక్షణములతో నామే నొప్పారు చుండెను. ఒక వరునకు నీయబోయిన తండ్రిని నివారించి యా పిల్ల దివ్య దృష్టితో తన పతిని కుక్కగా నున్నట్లు తెలిసి కొని విదిశా పట్టణమున కేగి యా స్థితిలో నున్న భర్తను చూచెను. మహానుభావుడగు నాధుని కుక్కగా నున్న వానిని చూడగానే మ్రుష్టమైన యాహారము నిచ్చెను. ఆ ఆహారమును తినుచు నా కుక్క తన జాతి కుచితము లగు ప్రీతి చేష్టల చేయుచుండగా చూచి యామె సిగ్గుచెంది కుయోనిలో బుట్టిన తన భర్తకు నమస్కరించి యిట్లు పలికెను. మహారాజా! నాకు ప్రీతి కరుడవగు నీవు చేసిన మొగమాటము వలన నిట్లు నీచ జంతువుగా జన్మించితివి. స్మరించు చుంటివా! తీర్థ స్నానానంతర మొక నాస్తికునితో సంభాషణము చేయుటచే నీకీ స్థితి వచ్చినది. నీకు జ్ఞాపకము లేదా?

శ్రీ పరాశరుడు:

తయైవంస్మారితే తస్మిన్ పూర్వజాతి కృతేతదా

దద్యౌచిరమథావాప నిర్వేదమతిదుర్లభమ్

నిర్వణ్ణచిత్తస్సతతోనిర్గత్యనగరాద్బహిః

మరుత్ ప్రవతనంకృత్వాసార్గాలీయోనిమాగతః

సాపిద్వితీయేసంప్రాప్తేవీక్ష్యదివ్యేనచక్షుషా

జాత్యాసృగాలంతంద్రష్టుంయయౌకోలాహలంగిరిమ్

తత్రాపిదృష్ట్వాతంప్రాహసార్గాలీంయోనిమాగతమ్

భార్తారమతిచార్వఙ్గీతనయాపృథివీపతేః

అపిస్మరపి రాజేన్ద్ర శ్వయోనిస్థస్యయన్మయా

పునస్తాయోకతస్సజ్ఞాత్వాసత్యంసత్యవతాంవరః

కాననే స నిరాహారస్తత్యాజస్వకళేబరమ్

భూయస్తతోవృకోజజ్ఞేగత్వాతంనిర్జనేవనే

స్మారయామాసభార్తారంపూర్వవృత్తమనిన్దితా

సత్వంవృకోమహాభాగ! రాజాశతధనుర్భవాన్

శ్వాభూత్వాత్వంసృగాలోఽభూః వృకత్వంసాంప్రతంగతః

స్మారితేనయదాత్యక్తస్తేనాత్మాగృద్ద్రతాంగతః

అవాససాపునశ్చైనంశోధయామాసమానినీ

నరేన్ద్ర! స్మర్యతామాత్మా హ్యలంతేగృద్ద్రచేష్టాయా

పాషణ్డాలాపజాతోఽయం దోషోయాద్గృద్ద్రతాంగతః

తతః కాకత్వమాపన్నం సమానన్తరజన్మని

ఉవాచతన్వీభర్తారముపలభ్యాత్మయోగతః

అశేషభూభృతః పూర్వంవశ్యాయసమైబలిందదుః

సత్వంకాకత్వమాపన్నోజాతోద్యబలిభుక్ర్పభో

ఏవమేవబకత్వేఽపి స్మారితస్సపురాతనమ్

తత్యాజభూపతిః ప్రాణాన్ మయూరత్వమవాపచ

మయూరత్వేతతస్సావై చకారానుగతింశుభా

దత్తైః ప్రతిక్షణం భోజ్యైః బాలాతజ్జాతి భోజనైః

తతస్తుజనకోరాజావాజిమేధం మహాక్రతుమ్

చకారతశ్యావాభృ థే స్నాపయామాసతంతదా

స్నాత్వాస్వయంచతన్వఙ్గీ స్మారయామాసతంపతిమ్

యథాఽసౌశ్వసృగాలాద్యా యోనీర్జగ్రాహపార్థివః

స్మృతజన్మకమస్సోఽథతత్యాజస్వకళేబరమ్

జజ్ఞేసజనస్యైవ పుత్రోఽసౌసుమహాత్మనః

శ్రీపరాశరుడు:

ఆమెచే నా రాజు పూర్వ జన్మ యందు చేసిన దోషమును స్మరింప జేయబడిన వాడై మిక్కిలి నిర్వేదపడి యా పట్టణమును దాటి గిరి తటము నుండి క్రిందను పడి నక్కగా పుట్టగా నామె దివ్య దృష్టిచే తెలుసుకొని నక్కగ పుట్టిన తన భర్తను దర్శించుటకై కోలాహల పర్వత ప్రాంతమున కేగి పూర్వ జన్మమున పాషండాలాపమున నీకు కల్గిన నీచ జన్మ వృత్తాంతమును నీకు గుర్తు చేసిన దానిని స్మరించు చుంటివా? అని అడిగెను. నిజము నెరింగి నక్కగ నున్న యా రాజు అడవి యందు నిరాహారుడై చనిపోయి తోడేలుగా జన్మించెను. మరల నామె (శైబ్య) యచటి కేగి రాజా! నీవు కుక్కవు గావు, నక్కవు గావు, తోడేలు గావు, శతధన్వ మహారాజువు. అని స్మరింప జేయగానే యాతడు గ్రద్ద రూపము దాల్చెను. మరల నామె స్మరింప జేయగా కాకిగా పుట్టెను. ఆ పతివ్రత తన దివ్య దృష్టితో తెలుసుకొని వెళ్లి ఇట్లనెను. ఓ రాజేంద్రా! సమస్త రాజులు నీకు వశమై బలులు (కప్పములు - పన్నులు) ఇచ్చు చుండగా కైకొనెడి మహారాజు విపుడు బలులను తిని బ్రతికెడి కాకి (బలిభుక్కు) వైతివి. అని భోధించెను. ఇట్లే కొంగగా జన్మించి యామెచే బోధితుడాయెను. పిదప నెమలి జన్మ నొందెను. ఆమెయు నతని ననుగమించి యా నెమలికి వలసిన భోజ్య పదార్థము నంద జేయుచు జనక చక్రవర్తి చేయుచున్న యశ్వమేద యాగమునకు వెళ్లి అవభృథము (దీక్షాంత స్నానము) నందా నెమలిని స్నానము చేయించి తానూ కూడ స్నానము చేసి యా రాజునకు పూర్వ జన్మ క్రమమును స్మరింప జేయగా నాతడు తన కళేబరము త్యజించి జనక చక్రవర్తి పుత్రుడై పుట్టెను.

తతస్సాపితరంతన్వీవివాహార్థమచోదయత్

సచాపికారయామాసతస్యాంరాజాస్వయంవరమ్

స్వయంవారేకృతే సాతంసంప్రాప్తం పతిమాత్మనః

వరయామాసభూయోపిభర్ తృభావేనభామినీ

బుభుజేచతయాసార్థంసభోగాన్నృపనన్దనః

పితర్యుపరతేరాజ్యం విదేహేషుచకారసః

ఇయాజాయజ్ఞాన్ సుబహూన్ దదౌదానాణిచార్థినామ్

పుత్రానుత్పాదయామాస యుయుధేచసహరిరిభిః

రాజ్యంభుక్త్వాయథాన్యాయం పాలయిత్వావసుంధరామ్

తత్యాజసప్రియాన్ ప్రాణాన్ సంగ్రామేధర్మతోనృపః

తతశ్చితాస్థంతంభూయో భర్తారంసాశుభేక్షణా

అన్వారురోహవిధివద్యథాపూర్వం ముదాన్వితా

తతోఽవాపతయాసార్థం రాజపుత్రయాసపార్థివః

ఐన్ద్రానతీత్యవై లోకాన్ కామదుహోఽక్షయాన్

స్వర్గాక్షయత్వమతులం దామ్పత్యమతి దుర్లభమ్

ప్రాప్తంపుణ్యఫలంప్రాప్య సంశుద్దింతాంద్విజోత్తమ

ఏషపాషణ్డసంభాషదోషః ప్రోక్తోమయాద్విజ

తథాశ్వమేథావభృథస్నానమాహాత్మ్యమేవచ

తస్మాత్పాషణ్డిభిః పాపైరాలాపం స్పర్శనంత్యజేత్

విశేషతః క్రియాకాలేయజ్ఞాదౌచాపి దీక్షితః

క్రియాహానిర్ గృహేస్యమాసమేకం ప్రజాయతే

తస్యావలోకనాత్సూర్యం ప్రపశ్యేన్మతిమాన్నరః

కింపునర్ యైస్తుసంత్యక్తాత్రయీసర్వాత్మనాద్విజ

పాషణ్డభోజిభిః పాపైః వేదవాదవిరోదిభిః

సహాలాపస్తుసంసర్గస్సహాస్యాచాతిపాపినీ

పాషణ్డిభిర్దురాచారై స్తస్మాత్తాన్ పరివర్జయేత్

పాషణ్డినో వికర్మస్థాన్ బైడాలప్రతికాన్ శఠాన్

హైతుకాన్ బకవృత్తీంశ్చ వాఙ్మాత్రేణా పినార్చయేత్

పిదప కాశీరాజ పుత్రికయగు నా పతివ్రత యగు శైబ్య తన తండ్రిని తనకు వివాహార్థమై ప్రేరేపించగా నా రాజు స్వయంవర మేర్పాటు చేసెను. అందుల కేతెంచిన తన భర్తను గమనించి యామె యాతనిని మఱల వరించెను. ఆ రాజపుత్రు డామేతో చిరకాలము భోగముల నన్నుభవించి తన తండ్రి గతించిన తరువాత విదేహ దేశ రాజ్యమును పరిపాలించెను. అనేక యజ్ఞములను చేసెను. యాచకులకు దానముల ననేకుముల నిచ్చెను. పుత్రులను పడసెను. శత్రువుల నోడించెను. న్యాయముగా భూమిని పరిపాలించి భోగముల ననుభవించి ప్రియములైన తన ప్రాణములను క్షత్రధర్మము ననుసరించు యుద్దము నందు విడిచి పెట్టెను. చితి యందున్న తన భర్తను వెనుకటి జన్మమందు వలె సంతోషముతో ననుగమించెను. ఆ రాజపుత్రు డామెతో గూడ నింద్ర లోకముల నతిక్రమించి యున్న యక్షయ లోకములను వెంటనే పొందెను. ఇట్లా దంపతుల వెనుకటి పరిశుద్దిని పొంది తమ పుణ్య ఫలముగా అక్షయ లోకమును గూడ పొందిరి. నీకిపుడు పాషండుని సంభాషణము వలన వచ్చిన దోషము అశ్వమేధ యాగపు నవభృథస్నాన మహిమయు చెప్ప బడినవి. కావున పాషండుల తోను, పాపాత్ముల తోను సంభాషించుట స్పృశించుట పనికిరాదు. యజ్ఞాది కర్మలలో దీక్షితుడైన వానికి అసలు కూడదు. ఒక మాస కాలము నిత్య కర్మము విడిచిన వానిని చూచినా యెడల బుద్దిమంతుడు సూర్య సందర్శనము చేయ వలెను. బ్రాహ్మణుడా! పూర్తిగ వేదములను వదలి పాషండాన్నమును తినుచు వేద మతమునకు విరోధులుగ నుండు మహాపాపులతో సంభాషణము సంబంధము సహస్తితియు మహాపాప హేతువులని చెప్ప నక్కర్లేదు. కావున వారితో నవి పనికిరావు. పాషండులు = నాస్తికులు, వికర్మస్థాన్ = వికర్మల నాచరించు వారిని బిడాల వ్రతులు ఎదుట ప్రియమును చెప్పి పరోక్షమున మిక్కిలి అపకారము చేయువారు (పిల్లివంటి వారు) శఠులు = వ్యక్తముగా అపరాధము చేయువారు, హైతుకులు = హేతువాదము చేయువారు అనగా అన్ని కర్మలను హేతువులతో సందేహించు వారు బకవృత్తులు = అధోద్రుష్టులై స్వార్థముల సాధించుటలో నిమగ్నులై దుర్మార్గులై అవినయముతో నుండువారు వీరిని మాటతో నైన గౌరవింప రాదు.

దూరతస్తైస్తుసంపరకస్త్యాజ్యశ్చాప్యాతిపాపిభిః

పాషణ్డిభిర్దురాచారై స్తస్మాత్తాన్ పరివర్జయేత్

ఏతేనగ్నావాఖ్యాతాదృష్టాశ్శ్రాద్దోపఘాతకాః

ఏషాంసంభాషణాత్పుంసాం దినపుణ్యం ప్రణశ్యతి

ఏతేపాషణ్డినః పాపాన హ్యేతానాలపే ద్బుధః

పుణ్యంనశ్యతి సంభాషా దేతేషాం తద్దినోద్భవమ్

పుంసాంజటాధరణమౌణ్డ్యవతాంవృథైవ మోఘాశినామఖిలశౌచ్గానిరాకృతానామ్

తోయప్రదానపితృపిణ్డబహిష్కృతానాం సంభాషణాదపి నరా నరకం ప్రయాన్తి

మహాపాపులగు పాషండుల దురాచారము గలవారు, వీరితో సంపర్కము పూర్తిగా విడువ వలెను. కనపడినందు వలననే శ్రాద్దమును పాడుచేయు వారు నగ్నులని నీకిది వరకు చెప్పితిని. వీరితో సంభాషణము చేసిన యెడల ఒక రోజు చేసిన పుణ్యము నశించును. పాషండులు కూడ పాపాత్ములు. వీరితో సంభాషణము చేయుట వలన నా దినము చేసిన పుణ్యము నశించును. వ్యర్థముగా జడలను ధరించిన వారు = అనగా అధర్వ వేదమున చెప్పిన శ్రౌత, పాశుపత వ్రతము లకంగముగ చెప్ప బడినవి కాకుండ వ్యర్థముగ జడలను ధరించిన వారు శిఖ లేకుండ ముండనమును చేయించు కొనిన వారు, మోఘాశులు = దేవతాతిథి పిత్రాదుల పూజ కుపయోగింపని యన్నము తినువారు, అఖిల (బాహ్యాభ్యంతర) శౌచము లేనివారు, తర్పణము చేయుట పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుట మున్నగునవి లేని వారును వీరితో సంబాషణ చేసినను నరకప్రాప్తి కలుగును.