స్వాద్యాయసం యయాభ్యాం సదృశ్యతే పురుషోత్తమః।
తత్ ప్రాప్తి కారణం బ్రహ్మతదేతదితి పఠ్యతే॥
స్వాధ్యాయాద్యోగమాసీతయోగాత్స్వాధ్యాయమావసేత్।
స్వాధ్యాయయోగసంపత్త్యాపరమాత్మా ప్రకాశతే॥
స్వాధ్యాయముచే యోగముచే విష్ణువు కన బడును. పురుషోత్తమ ప్రాప్తికి గారణ బ్రహ్మమని (వేదమని) వేదాదులందు బటింపబడి యున్నది. స్వాధ్యాయముచే యోగమును, యోగముచే స్వాధ్యాయమును అభ్యసింప వలెను. స్వాధ్యాయ యోగములు రెండింటి సంపత్తిచే పరమాత్మ వెల్లడి యగును. బ్రహ్మ దర్శనమునకు స్వాధ్యాయమొక కన్ను. యోగము రెండవ కన్ను. మాంస చక్షువుచే బ్రహ్మ వస్తువు దర్శింప శక్యము గాదు.
ఆ యోగమును నేనెరుంగ గోరేదం దెలుపుము. అది తెలిసిన యెడల సర్వాధారమైన పరమేశ్వరుం దర్శింతునన
కేశీధ్వజుడు ఖాండిక్యునకు జనకునకును మున్నెట్లు యోగముం జెప్పెనది నీకు జెప్పెదనన
ఖాండిక్యు డెవ్వరు! కేశిధ్వజుడను ధన్యుడెవ్వరు? వారిద్దరికీ యోగసంబంధ నిమిత్తమైన వాదమేమి జరిగినదన పరాశరుండిట్లు తెలుప దొడంగెను.
ధర్మధ్వజోవై జనకస్తస్య పుత్రోమితధ్వజః।
కృతధ్వజశ్చ నామ్నాసీత్సదాధ్యాత్మ రతిర్ నృపః॥
కృతధ్వజస్య పుత్రోభూత్ఖ్యాతః కేశిధ్వజో నృపః।
పుత్రోమితధ్వజస్యాపి ఖాణ్డిక్యజనకో భవత్॥
కర్మామార్గేణ ఖాణ్డిక్యః పృథివ్యామభవత్పతిః।
కేశీధ్వజోఽప్యతీవాసీదాత్మ విద్యావిశారదః॥
తావుభావసిచైవాస్తాం విజిగీషూ పరస్పరమ్।
కేశీధ్వజేనఖాణ్డిస్యస్స్వ రాజ్యాదవరోపితః॥
పురోధసా మన్త్రిభిశ్చ సమవేతోల్పసాధనః।
రాజ్యాన్నిరాకృతస్సోథ దుర్గారణ్యచరోభవత్॥
ఇయాజసోఽపి సుబహూన్ యజ్ఞాన్ జ్ఞానవ్యపాశ్రయః।
బ్రహ్మవిద్యామధిష్ఠాయ తర్తుం మృత్యుమవిద్యయా॥
ఏకదా వర్తమానస్య యాగే యోగవిదాం వర।
ఘర్మ ధేనుం జఘానోగ్రశ్శార్దూలో విజనే వనే॥
తతో రాజా హతాం శ్రుత్వా ధేనుం వ్యాఘ్రేణచర్ త్విజః।
ప్రాయశ్చిత్తం సపప్రచ్ఛ కిమత్రేతి విదీయతామ్॥
తేప్యూచుర్న వయం విద్య కశేరుః పృచ్ఛ్యతామితి।
కశేరుపరితేనోక్తస్తథైవ ప్రాహ భార్గవమ్॥
శునకం పృచ్ఛ రాజేన్ద్రనాహం వేద్మి సవేత్స్యతి।
సగత్వా తమపృచ్ఛచ్చ సోప్యాహ శృణుయన్మునే॥
నకశేరుర్నచైవాహం నచైకస్సాంప్రతం భువి।
వేత్త్యేక ఏవత్వచ్ఛత్రుః ఖాణ్డిక్యో యోజితస్త్వయా॥
సచాహతం ప్రజామ్యేష ప్రష్టుమాత్మరిపుం మునే।
ప్రాప్త ఏవమయా యజ్ఞోయది మాంస హనిష్యతి॥
ధర్మధ్వజుడను జనకుడుండెను. అతని పుత్రులు మితధ్వజుడు, కృతధ్వజుడునను పేరుగల వారు అధ్యాత్మ నిష్టులైన రాజులుండిరి. కృతధ్వజుని కొడుకు కేశిధ్వజుడు. మితధ్వజుని కుమారుడు ఖాండిక్యుడు కర్మ మార్గాను సారియై పృథివి యందు రాజయ్యెను. కేశిధ్వజుడు మిక్కిలిగ ఆత్మ విద్యా విశారదుడయ్యెను. వారిద్దరు నొండొరులం గెలువ వలయునను కొనిరి. కేశిధ్వజుడు ఖాండిక్యుని రాజ్యము నుండి దించి వేసెను. అతడు మంత్రి పురోహితులతో నల్ప సాధనములు గలవాడై రాజ్య నిరాకృతుడై దుర్గమమైన యరణ్యమున సంచరించెను. జ్ఞాన నిష్టుడై యాతడు బ్రహ్మ విద్యయందుండి ఆ విద్యచే మృత్యువుం దరింప వలెనని యనేక యజ్ఞములు సేసెను. మైత్రేయా! ఒకప్పుడు యాగము నందు వర్తించుచున్న తరి నొక పెద్దపులి నిర్జనారణ్య మందు ఘర్మధేనువుం జంపెను. అంతట నా రాజు విని ప్రాయశ్చిత్త మిప్పుడిక్కడ ఏమన ఋత్విజులు మాకది తెలియదు. కశేరువు నడుగుమన నతడును భార్గవు నడుగు మనియె. అతడు నేనది యెరుగను. శునకునడుగు మతడిది యెరుంగునన నతడాతని నడుగ నా శునకుడు కశేరువు గాదు నేనుగాదు. ఇప్పుడు భూమి మీద నీ విషయ మెరింగిన వాడు. నీ శత్రువు నీచే జయింప బడిన వాడునగు ఖండిక్యుడొక్కడే యెరుంగుననియె. ఖండిక్యుడా శత్రుని దరికిది యడుగ నేగేదను. అతడు నన్ను జంపునా ఈ యజ్ఞము ప్రాప్తమే యగును. (యజ్ఞము సమగ్ర ఫల సిద్ధి గనును) లేదా యతడు నేనడిగిన ప్రాయశ్చిత్తము సమగ్రముగ దేల్పునా దానం గూడ నాయాగమ వికలమగును. చెడకుండును.
ఇత్యుక్త్వారథమారుహ్య, కృష్ణాజినధరో నృపః।
వనం జగామ యత్రాస్తే సఖాణ్డిక్యో మహీపతిః॥
అని రథమెక్కి కృష్ణాజిన దారియైన యా రాజు మహాజ్ఞాని ఖాండిక్యుడున్న తావున కరిగెను. పైపైకి వచ్చి పడుచున్న యాతనిం గని ఖాండిక్యుడు కోపముచే కనులెరుపెక్కి విల్లెక్కిడి యిట్లనియె.
కృష్ణాజినంత్వం కవచమాబధ్యాస్మాన్ హనిష్యసి।
కృష్ణాజినధరే వేత్సి నమయి ప్రహరిష్యతి॥
మృగాణాం వద పృష్ఠేషు మూఢ! కృష్ణాజినం నకిమ్।
యేషాం మయాత్వాయాచో చోగ్రాః ప్రహితాశ్శితసాయకాః॥
నీవు కృష్ణాజినము మీద కట్టుకొని మమ్ము హతమోనర్ప నున్నావు. నేను గృష్ణాజిన ధరుడనై యుండ నన్ను నీవు కొట్టలేవు. ఇది నిపుడెరుంగుదువు. మూర్ఖుడా జంతువుల పృష్టము లందు కృష్ణాజిన ముండదా? అట్టి జంతువులపై నీవును, నేనును నుగ్రమయిన బాణములను విసరలేదా? అలాటి నేను నిన్ను హతము గావించెద నా దగ్గరుండి నీవు బ్రతికి పోలేవు. ఓ దుర్బుద్దీ నీవు నా రాజ్యము హరించిన శత్రువవు, ఆతతాయివి. అన కేశిధ్వజుండనియె.
ఖాండిక్యా! సందేహ మొకటి యడుగ నీదరికి వచ్చితిని. నిన్ను జంపుటకు గాదు. ఇది విమర్శించి కోపమయిన విడువుము. బాణమైన విడువు మనెను.
తతస్స మన్త్రిభిస్సార్ధమేకాన్తేస పురోహితః।
మన్త్రయామాస ఖాండిక్యస్సర్వైరేవ మహామతిః॥
తమూచుర్మన్త్రిణో వధ్యో రిపురేష వశంగతః।
హతేస్మిన్ పృథివీ సర్వా తవ వశ్యా భవిష్యతి॥
ఖాణ్డిక్యశ్చాహ తాన్ సర్వానేవమేవతన్న సంశయః।
హతేస్మిన్ పృథివీ సర్వా మమవశ్యా భవిష్యతి॥
నహన్మి చేల్లోకజయో మమత్వస్య వసుంధరా॥
నాహంమన్యేలోకజయాదదికాస్యాద్వసున్ధరా।
పరలోకజయోనన్తస్స్వల్పకాలో మహీజయః॥
తస్మాన్నైనం హనిష్యేహం యత్పృచ్ఛతి వదామి తత్॥
ఖాండిక్యు డంతట నేకాంతమున పురోహితునితో గూడ మంత్రు లందరితో నాలోచన చేసెను. అతనిం గని మంత్రులు ఇతడు శత్రువు ఇపుడు స్వాధీనుడైనాడు. ఇతడు నీకు జంప దగిన వాడు. అతడీల్గిన భూమియెల్ల నీవశమగును. అనా ఖాండిక్యుడు వారందరి గని యిది యింతే సందియము లేదు. ఇతడీల్గిన భూమి ఎల్ల నా వశమగును. వానికి పరలోక జయము నాకు సర్వ భూజయము. చంపనిచో నాకు పుణ్య లోక విజయము. వానికి వసుంధర. పరలోక జయము కంటే వసుంధర ఘనమని నేనను కొనను. పరలోక జయ మనంతము (శాశ్వతము) మహిజయమల్ప కాలము. (అశాశ్వతము) కావున వీని నేజంపను. అడిగినదది చెప్పెదను అనెను. అంతట ఖాండిక్య జనకుడు శత్రువు దరికేతెంచి నీయడుగ వలసినదంత యడుగుము. నేను సమాధానము చెప్పెదననియె.
తతస్సర్వం యథావృత్తంఘర్మంధేనువధంద్విజ।
కథయిత్వాస పప్రచ్ఛ ప్రాయశ్చిత్తం హితద్ర్వతమ్॥
స చాచష్ట యథాన్యాయం ద్విజ! కేశిధ్వజాయతత్।
ప్రాయశ్చిత్తమశేషణ యద్వైతత్ర విధీయతే।
విదితార్థస్స తేనై వమనుజ్ఞాతో మహాత్మనా।
యాగభూమిముపాగమ్య చక్రేసర్వాః క్రియాః క్రమాత్॥
అంతట కేశిధ్వజుడు ఘర్మదేను వధ మొదలుకొని జరిగినదెల్ల తెల్పి దానం గల ప్రాయశ్చిత్త మేమని యడిగెను. అతడది యథా న్యాయముగ విధి విహితముగ కేశిధ్వజుని కెరింగించెను. ఆతడది తెలిసికొని యమ్మహాత్ముని యాజ్ఞగొని యాగ భూమికి వచ్చి సర్వక్రియలు క్రమముగ నిర్వర్తించెను. యాగము చక్కగ నడపి అవభృథస్నాతుడై కృతకృత్యుడై యా పార్థివుండు ఇట్లాలోచించెను.
పూజితాశ్చ ద్విజాస్సర్వే సదస్యా మానితా మయా।
తథైవార్ధిజనోఽప్యర్ థైజితోఽభిమతైర్మయా॥
యథార్హం మస్యలోకస్య మయా సర్వం విచేష్టితమ్।
అనిష్పన్నక్రియం చేత స్తథాపిమమ కింయథా॥
ఇత్ధంసంచింతయన్నేవ సస్మారస మహీపతిః।
ఖాణ్డిక్యాయ నదత్తేతి మయావై గురుదక్షిణా॥
సర్వ ద్విజులను బూజించితిని. సదస్యులను సమ్మానించితిని. అర్థిజనమున కభీష్టార్థ సమృద్ధి చేకూర్చితిని. ఇహ మందు (ఈ లోక మందు) ఏది యర్హమైన క్రియాయో యదెల్ల నేననుష్టించితిని. అయినను నా మనస్సు ఏదో క్రియాలోపము సేసినట్లున్నది. అని యాతడాలోచించుచునే ఆ భూపతి ఖాండిక్యునికి గురుదక్షిణ ఈయ లేదని జ్ఞాపకము సేసి కొనెను. వెంటనే యరదమెక్కి యాతడు ఖాండిక్యుడున్న దుర్గమ గహనమున కేగెను.
శ్రీపరాశరుడు:
ఖాండిక్యోఽపి పునర్ దృష్ట్వాతమాయాన్తం ధృతాయుధః।
తస్థౌహన్తుం కృతమతి స్తమాహస పునర్ నృపః॥
భోనాహంతేఽపరాధాయ ప్రాప్తః ఖాణ్డిక్య మా క్రుథాః।
గురోర్నిష్కృతిదానాయ మామవేహిత్వమాగతమ్॥
నిష్పాదితో మయా యాగస్సమ్యక్త్వదుపదేశతః।
సోహం తే దాతుమిచ్ఛామి వృణీష్వ గురుదక్షిణామ్॥
భూయస్సమన్త్రిభిస్సార్థం మన్త్రయామాసపార్థివః।
గురు నిష్క్రయకామోఽయం కింమయా ప్రార్ధ్యతామితి॥
తమూచుర్మన్త్రిణో రాజ్యమశేషం ప్రార్థ్యతామయమ్।
శత్రుభిః ప్రార్ధ్యతే రాజ్యమనాయాసితసై నికైః॥
ప్రహస్య తానాహ నృపస్సఖాణ్డిక్యో మహామతిః।
స్వల్పకాలం మహీపాల్యం మాదృశైః ప్రార్ధ్యతే కథమ్॥
ఏవమేతద్భవన్తోత్రహ్యర్ధసాధనమన్త్రిణః।
పరమార్ధః కథం కోత్ర యూయం నాత్ర విచక్షణాః॥
ఇత్యుక్త్వా సముపేత్త్యేనం సతుకేశిధ్వజం నృపః।
ఉవాచకిమవశ్యంత్వం దదాసి గురుదక్షిణామ్॥
బాఢమిత్యేవ తేనోక్తః ఖాణ్డిక్యస్తమథాబ్రవీత్।
భవానధ్యాత్మవిజ్ఞానపరమార్థవిచక్షణః॥
ఖాండిక్యుడు మరల తనవైపు వచ్చుచున్న యాతనిం గని యాయుధముం జేకొన నెంచి నిలువ బడెను. అతనిం గని కేశిధ్వజుడు ఖాండిక్య! ఓ మహానుభావ! నీకే యపరాధము సేయ రాలేదు. కోపింపకుము. గురు ఋణము దీర్ప దక్షిణ ఈయగా వచ్చినాడనని తెలియును. నీ యుపదేశముచే యాగము చక్కగా జరిపితిని. అందుచే నేను గురుదక్షిణ ఈ వచ్చితిని. కోరుమనియే. మరల యా రాజు మంత్రులతో మంతనము సేసి ఇతడు గురు నిష్క్రయము కోరుచున్నాడు. నేనేమి యడుగ వలయునన వారు సర్వ రాజ్య మడుగుము. సైనికులను శ్రమ పెట్టకుండ శత్రు రాజులు రాజ్యము నడుగుట ఎందేని కలదనిరి. వారింగని ఖాండిక్యుడు నవ్వి మహాజ్ఞాని గావున మహీపాలన మల్పకాల బోగము. నావంటి వారది యెట్లు కోరుదురు? తాము ముందర నర్థసాధన ఆలోచనపరులు. ఇక్కడ పరమార్థ మిక్కడ యేది యెట్లు? అనుదాన మీరు విచక్షులు గారు. అని పలికి యా రేడు కేశిధ్వజుని దరికి వచ్చి నీవవశ్యము గురుదక్షిణ నిత్తువా? మంచిదని యాతనిచే ననిపించుకొని ఖాందిక్యు డతనితో నీవధ్యాత్మ పరామర్థ మందు విచక్షణుడవు (వివేకివి). నాకీవు గురు నిష్క్రయము (దక్షిణ) ఇత్తువేని క్లేశ ప్రశమనమునకు (సర్వ దుఃఖ శాంతికి) ఏ పని చేయవలెనో యది యానతిమ్మనియే.
Summary of chapter 6 of the Vishnu Mahā Purāṇa is as follows:
Parāśara narrates the Upākhyāna of Keśidhvaja and Khāṇḍikya from the lineage of the Janaka kings. Dharmadhvaja had two sons: Kṛtadhvaja (follower of ātma-vidyā) whose son was Keśidhvaja, and Mitadhvaja (follower of karma-mārga) whose son was Khāṇḍikya. Keśidhvaja defeated and expelled Khāṇḍikya from the kingdom. During a yajña conducted by Keśidhvaja, a tiger killed the gharmadhenu (the sacrificial cow). The ṛtvijas could not determine the prāyaścitta. Through a chain of inquiry, all admitted that only Khāṇḍikya, the enemy now in the forest, knew the answer. Keśidhvaja, valuing his yajña's integrity over pride, traveled to his enemy's forest. Khāṇḍikya refused his ministers' counsel to kill Keśidhvaja and instead revealed the prāyaścitta. Keśidhvaja returned, completed the yajña, then came back to pay guru-dakṣiṇā. Khāṇḍikya, declining the kingdom, asked instead for the knowledge of how to attain liberation — for that alone would end all kleśa.