శ్రీపరాశరుడు:
హిరణ్యకషిపుశ్శ్రుత్వా తాంకృత్యాం వితథీకృతామ్।
ఆహూయపుత్రంపప్రచ్ఛ ప్రభావస్యాస్యకారణమ్॥
శ్రీపరాశరుడు:
కృత్య వమ్మైనట్లు విని హిరణ్యకశిపుడు పుత్రుని పిలచి యీ ప్రభావమునకు కారణ మడిగెను.
హిరణ్యకశిపుడు:
ప్రహ్లాద! సుప్రభావోఽసి కిమేతత్తేవిచేష్టితమ్।
ఏతన్మన్త్రాదిజనిత ముతాహోసహజంతవ॥
హిరణ్యకశిపుడు:
“ప్రహ్లాదా! మంచి ప్రభావశాలి వైతివి. ఈ నీ మహిమ మంత్రాదులచే కలిగినదా? సహజమా?” ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించి ఇట్లనెను.
ప్రహ్లాదుడు:
న మన్త్రాదికృతస్తాత! నచ నైసర్గికోమనమ।
ప్రభావ ఏష సామాన్యో యస్యయస్యాచ్యుతోహృది॥
అన్యేషాంయో నపాపాని చిన్తయత్యాత్మనోయథా।
తస్యపాపాగమ స్తాతహేత్వభావాన్న విద్యతే॥
కర్మణామనసావాచా పరపీడాంకరోతియః।
తాద్బీజంజన్మఫలతి ప్రభూతం తస్యచాశుభమ్॥
సోహంనపాపమిచ్ఛామి నకరోమి వదామిచ।
చిన్తయన్ సర్వభూతస్థామాత్మన్యసిచ కేశవమ్॥
శారీరంమానసం దుఃఖం దైవం భూతభవంతథా।
సర్వత్రశుభచిత్తస్య తస్యమేజాయతేకుతః॥
ఏవంసర్వేషుభూతేషు భక్తిరవ్యభిచారిణీ।
కర్తవ్యపణ్డితైః జ్ఞాత్వా సర్వభూతమయంహరిమ్॥
ప్రహ్లాదుడు:
“మన్త్రాది కృతము గాదు నైసర్గికము గాదు హృదయము నందు అచ్యుతుని ధరించిన వానికెల్ల యీ ప్రభావము సమానమే. ఎవడు తనకువలె నితరునికి గూడ పాప ఫలము (దుఃఖము) లను చింతించడో వానికి పాప కారణము లేకుండుటచే పాపము పుట్టాడు. మనో వాక్కర్మల (త్రి కరణముల) చే నెవడితరునికి పీడను కల్గించునో అదియే బీజముగా గల జన్మ వానికి నశుభము నదికముగ కల్గించును. అట్టి పాపమును నేను కోరను చేయను. ఒకనికి చెప్పను. కేశవుని సర్వభూతము లందు నా యందును నున్నవానిగ భావించుచు ఇట్లందరి యందు శుభ చిత్తము గల నాకు శారీరక మానసిక, అధిదైవిక అధి భౌతిక దుఃఖము లెట్లు కలుగ గలవు? ఈ విధముగ శ్రీహరిని సర్వ భూతమయునిగ తెలిసికొని పండితులు సర్వభూతము లందు గాఢమైన భక్తిని పరువ వలెను.”
శ్రీపరాశరుడు:
ఇతిశ్రుత్వాస దైత్యేన్ద్రః ప్రాసాదశిఖ రేస్థితః।
క్రోదాన్దకారతముఖః ప్రాహ దై తేయకింకరాన్॥
శ్రీపరాశరుడు:
ఈ వచనములను విని ప్రాసాదాగ్రమున నున్న రాక్షస రాజు క్రోధముచే గ్రమ్మ బడిన ముఖము గలవాడై రాక్షస సేవకులతో నిట్లు పలికెను.
హిరణ్యకశిపుడు:
దురాత్మా క్షిప్యతా మస్మాత్ప్రాసాదా చ్ఛతయోజనాత్।
గిరిపృష్ఠే పతత్వస్మిన్ శిలాభిన్నాఙ్గసంహతిః॥
హిరణ్యకశిపుడు:
ఈ దుష్టుని శతయోజ నోన్నతమగు నీ ప్రాసాదము నుండి త్రోసి వేయుడు. రాళ్ళచే భిన్నమైన యవయవములు గలవాడై పర్వాతాగ్రమున పడుగాక!
శ్రీపరాశరుడు:
తతస్తంచిక్షిపుస్సర్వేబాలందైతేయ కింకరాః।
పపాతసోప్యధఃక్షిప్తోహృదయేనోద్వహన్ హరిమ్॥
పతమానంజగద్ధాత్రీ జగద్దాతరికేశవే।
భక్తియుక్తందధారై నముపసంగమ్య మేదినీ॥
తతోవిలోక్య తం స్వస్థ మవికీర్ణాస్థిబన్ధనమ్।
హిరణ్యకశిపుః ప్రాహ శమ్భరంమా యినాంవరమ్॥
శ్రీపరాశరుడు:
వారలట్లే త్రోసి వేయగా హృదయమున శ్రీహరిని ధరించి పడుచున్న జగద్దారకుడగు కేశవుని భక్తుడగు నా బాలకుని జగద్దాత్రియగు భూదేవి జాగ్రత్తగ ధరించెను. చెక్కు చెదరకుండ పడిన పిల్ల వానిని చూచిన మాయావులలో శ్రేష్టుడగు శంబరునితో నిట్టనెను.
హిరణ్యకశిపుడు:
నాస్మాభిశ్శక్యాతేహన్తుమయందుర్ వృత్తబాలకః।
మాయాంవేత్తిభవాంస్తస్మాన్మాయయైనంనిషూదయ॥
హిరణ్యకశిపుడు:
దుర్భుద్ది నీ బాలుని మేము చంప జాలము. నీవు మాయావివి గావున మాయతో వీనిని చంప మనెను.
శంభరుడు:
సూదయామ్యేషదై త్యేన్ద్ర! పశ్యమాయా బలంమమ।
సహస్రమాత్ర మాయానాం పశ్యనోదశకంతథా॥
శంబరుడు:
“అట్లే చంప గలను, వేయింబది మాయలు గలవు”.
శ్రీపరాశరుడు:
తతస్సమసృజన్మయాః ప్రహ్లాదేశమ్బరోఽసురాః।
వినాశమిచ్చ దుర్బుద్ధిస్సర్వత్రసమదర్శిని॥
సమాహితమానాభూత్వాశంబరేఽ పివిమత్సరః।
మైత్రేయసోఽపిప్రహ్లాదస్సస్మారమధుసూదనమ్॥
తతోభగవతాతస్యరక్షార్ధంచక్రముత్తమమ్।
ఆజగామసమాజ్ఞప్తంజ్వాలామాలిసుదర్శనమ్॥
తేనమాయాసహస్రంతచ్చమ్భరస్యాశుగామినా।
బాలస్యరక్షతాదేహమేకై కంచనిషూదితమ్॥
శ్రీపరాశరుడు:
అని పలికి సర్వత్ర సమ (బ్రహ్మ) దర్శనము గల ప్రహ్లాదునిపై మాయలను ప్రయోగించెను. సమాహిత చిత్తుడై ప్రహ్లాదుడు ఆ శంబరుని యందు గూడ మాత్సర్యము లేకుండ మధుసూదనుని స్మరింపగా భగవంతుడు వాని రక్షణకై సుదర్శన చక్రమును పంపెను. ఆ చక్రము ప్రహ్లాదుని రక్షించుచు మాయల నణగ చేసెను.
సంశోషకంతదావాయుం దైత్యేన్ద్ర ఇదమబ్రవీత్।
శీఘ్రమేషమమాదేశాద్దురాత్మానీయతాంక్షయమ్॥
తథేత్యుక్త్వాథసోఽప్యేనం వివేశపావనోలఘు।
శీతోతిరూక్షశ్శోషాయతద్దేస్యాతిదుస్సహః॥
తేనావిష్టంతథాత్మానంసబుధ్వాదైత్యబాలకః।
హృదయేనమహాత్మానందధారాధరణీధరమ్॥
హృదయస్థస్తతస్తస్యతంవాయుమమతిశోషణమ్।
పపౌజనార్దనః క్రుద్దస్సయయౌపవనః క్షయమ్॥
క్షీణాసుస్వమాయాసుపవనేసంక్షయంగతే।
జగామసోఽపిభవనం గురోరేవమహామతిః॥
అహన్యహన్యథాచార్యో నీతింరాజ్యఫలప్రదామ్।
గ్రాహయామాసతంబాలం రాజ్ఞాముశనసాకృతామ్॥
గృహీతనీతిశాస్త్రంతంవినీతంసయదాగురుః।
మేనే తదై నంతత్పిత్రేకథయామాసశిక్షితమ్॥
రాజు వాయు దేవునితో ఈ దుర్మార్గుని శీఘ్రముగా శోశింప జేయుమని ఆజ్ఞాపింపగా ఆ వాయువు పిల్లవాని శరీరములో ప్రవేశించి బాధపెట్టగా ప్రహ్లాదుడు హృదయస్థు జనార్ధనుని ధ్యానించెను. ఆ భగవానుడు హృదయాస్థుడై ఆ వాయువు నంతను పానము చేసెను. ఇట్లన్నియు సమసిపోగా ప్రహ్లాదుడు గురు గృహమును చేరెను. గురువు ప్రతి దినము శుక్ర నీతిని బోధించెను.
ఆచార్యులు:
గృహీతనీతిశాస్త్ర స్తేపుత్రోదైత్యపతేకృతః।
ప్రహ్లాదస్తత్త్వతోవేత్తిభార్గవేణయదీరితమ్॥
ఆచార్యులు:
పూర్తియైన పిమ్మట రాజసన్నిధికి గొంపోయి నీ బాలుడు శుక్రనీతి బాగుగ నెరింగి యున్నాడు అని చెప్పగా
హిరణ్యకశిపుడు:
మిత్రేషువర్తేత కథమరివర్గే చభూపతిః।
ప్రహ్లాద! త్రిషుకాలేషు మధ్యస్థేషుకథంచరేత్॥
కథంమన్త్రిష్వమాత్యేషుభాహ్యేష్వాభ్యన్తరేషుచ।
చారేషుపౌరవర్గేషుశాఙ్కితేష్విత రేషుచ॥
హిరణ్యకశిపుడు:
ముల్లోకములలో భూపతి మిత్రుల యందు శత్రువుల యందు మధ్యస్థుల యందు నెట్లు మెలగ వలెను? మంత్రు లందు, అమాత్యు లందు, ఇతరు లందు, అంతరంగికుల యందు, చారులందు, పౌరులందు, శంకితులందు నితరుల యందు నెట్లు మెలంగ వలెను?
కృత్యాకృత్యవిధానంచదుర్గాటవికసాధనమ్।
ప్రహ్లాదకథ్యతాంసమ్యక్ తథాకణ్టకశోధనమ్॥
ఏతచ్చాన్యచ్చసకలమధీతంభవతాయథా।
తథామేకథ్ యతాంజ్ఞాతుంతవేచ్చామిమనోగతామ్॥
కృత్యాకృత్య విధానమెట్లు? దుర్గములను ఆటవికులను నెట్లు సాధించ వలెను? కంటకములను అనగా చారులను లేక క్షుద్రు శత్రువులను శోధింప వలెను. ఇంకా నిరతములైనవి నీనేర్చిన తెలుపమని రాజడుగగా
శ్రీపరాశరుడు:
ప్రణిపత్యతతఃపాదౌపితుః ప్రశ్రయభూషణః।
ప్రహ్లాదః ప్రాహదైత్యేన్ద్రంకృతాఞ్జలిపుటస్స్థితః॥
శ్రీపరాశరుడు:
నమస్కరించి వినయముతో నిట్లు తెలిపెను.
ప్రహ్లాదుడు:
మమోపదిష్టంసకలంగురుణానాత్రసంశయః।
గృహీతంచమయాకింతు నసదేతన్మతంమమ॥
సామచోపప్రదానంచభేదదణ్డౌతథైవచ।
ఉపాయాఃకథితాహ్యేతేమిత్రాదీనాంచసాధనే॥
తానేవాహంనపశ్యామిమిత్రాదీంస్తాతమాక్రుధః।
సాధ్యాభావేమహాబాహోసాధనైః కింప్రయోజమ్॥
సర్వభూతాత్మకే తాతజగన్నాథేజగన్మయే।
పరామాత్మనిగోవిన్దేమిత్రామిత్రకథాకుతః॥
త్వయ్యస్తిభగవాన్ విష్ణుర్మయిచాన్యత్రచాస్తిసః।
యతస్తతోఽయంమిత్రంమే శత్రుశ్చేతిపృథక్కుతః॥
తదేభిరలమత్యర్ థందుష్టారమ్భోక్తివిస్తరైః।
అవిద్యాన్తర్గతైర్యత్నః కర్తవ్యస్తాతశోభనే॥
విద్యాబుద్దిరవిద్యాయామాజ్ఞానాత్తాత! జాయతే!।
బాలోగ్నింకిన్నఖద్యోతమసురేశ్వర! మన్యతే॥
ప్రహ్లాదుడు:
నాకు గురువుచే సర్వము ఉపదేశింప బడినది. అందు సందేహము లేదు. కాని యిది యోగ్యమైనది కాదని నా యభిప్రాయము. సామదాన భేద దండోపాయములు మిత్రాదులను సాధించుట విషయమై చెప్ప బడినవి. అట్టి మిత్రాదులే నాకు లేరు. కోప పడకుము. సాధ్యములైన మిత్రాదులే లేనప్పుడు సాధనము లెందుకు? సర్వభూత నియామకుడును జగత్ప్రభువును జగన్మయుడును పరమాత్మయునగు గోవిందుని యందు మిత్రమిత్రుల ప్రసక్తియే లేదు. భగవంతుడగు విష్ణువు నీయందు నాయందు నితరుల యందు గలడు గావున వీడునాకు మిత్రము ఇతడు నాకు శత్రువను విభాగమే లేదు. అట్టియెడ దుష్టములైన యద్యమములకు సంబంధించిన నీతి శాస్త్రాది వచనములలో నేమి ప్రయోజనము. అవిద్యాంతర్గతము లయిన వానిచే శోభానమగు ఆత్మయందు యత్నము కర్తవ్యం. అజ్ఞానులకు అవిద్య యందు విద్యాబుద్ది కల్లుగును. బాలుడు మిణుగుఱు పురుగును అగ్నినిగా తలచును గాదా!
తత్కర్మయన్నబన్ధాయ సావిధ్యాయావిముక్తయే।
ఆయాసాయాపరంకర్మ విద్యాఽన్యాశిల్పనైపుణమ్॥
తదేతదవగమ్యాహమసారంసారముత్తమమ్।
నిశామయమహాభాగప్రణమ్యాహంబ్రవీమియత్॥
నచిన్తయతికోరాజ్యంకోధనంనాభివాఞ్చతి।
తథాపిభావ్యమీవితదుభయం ప్రాప్యతేనరైః॥
సర్వ ఏవమహాభాగమహత్త్వంప్రతిసోద్యమః।
తథాపిపుంసాంభాగ్యాని నోద్యమాభూతిహేతువః॥
జడానామవివేకానామశూరాణామాపిప్రభో।
భాగ్యభోజ్యానిరాజ్యాని సన్త్యనీతిమతామపి॥
తస్మాద్యతేత పుణ్యేషుయఇచ్చేన్మహతీం శ్రియమ్।
యతితవ్యంసమత్వేచనిర్వాణమపిచేచ్ఛతా॥
దేవామనుష్యాఃపశవః పక్షివృక్షసారీసృపాః।
రూపమేతదనన్తస్య విష్ణోర్భిన్నమివస్థితమ్॥
ఏతద్విజానతాసర్వంజగత్స్థావరజఙ్గమమ్।
ద్రష్టవ్యమాత్మవద్విష్ణుర్యతోఽయం విశ్వరూపధృత్॥
ఏవంజ్ఞాతేసభగవాన నాదిః పరమేశ్వరః।
ప్రసీదత్యచ్యుత స్తస్మిన్ ప్రసన్నేక్లేశసంక్షయః॥
ఏతచ్చ్రుత్వాతికోపేనసముత్థాయతదాసనాత్।
హిరణ్యకశిపుః పుత్రంపదావక్షస్యతాడయత్॥
బంధహేతువు కాని కర్మయే కర్మ యనబడును. మోక్షమున కుపయోగించు విద్యయే విద్య. ఇతర కర్మ వృథా ప్రయాసము కొఱకే. ఇతర విద్య కేవలం శిల్ప చాతుర్యము కొఱకే కావున దీనినంతను ఆసారముగా తలంచి యుత్తమమైన సారమును వినిపించెద. నమస్కరించి చెప్పు చున్నాను. రాజ్యమును గూర్చి యెవడు యోచించడు. ధనమును ఎవడు కోరడు. అయినను అదృష్టములే సంపదలకు కారణములు గాని యత్నములు కావు. జడులు (యత్నము లేనివారు) అవివేకులు శౌర్య హీనులు నీతి లేని వారికి గూడ రాజ్యములు అదృష్ట వశమున భోగ్యములగు చున్నవి. ఆ కారణముచే గొప్ప సంపదను కోరువాడు పుణ్యముల విషయమై యత్నించ వలెను. మోక్షమును గోరువాడు భగవదాత్మక మగుటచే నన్నిటి యందు సమ బుద్దిని చేయవలెను. దేవతలు మునుష్యులు పశువులు పక్షులు వృక్షములు పాములు అన్నియు నా అనంతుని రూపమే, విష్ణువు కంటే అది వేరుగా కనబడు చున్నది. ఈ సంగతి తెలిసిన వాడు స్థావర జంగమాత్మక సర్వ ప్రపంచము అంతర్యామి యగు ఆత్మతో కూడిన దానినిగ జూడ వలెను. విష్ణుదేవుడు విశ్వ రూపుడదు గదా! ఇట్లు తెలిసిన వానియెడ అనాదియగు పరమేశ్వరుడు అచ్యుతుడు ప్రసన్నుడగును. అతడు ప్రసన్నుడు కాగా క్లేశములెల్ల నశించును.
ఉవాచచసకోపేనసామర్షః ప్రజ్వలన్నివ।
నిష్పిష్యపాణినాపాణింహన్తుకామోజగద్యథా॥
హేవిప్రచిత్తేహేరాహో హేబలైషమహార్ణవే।
నాగపాశైః దృఢంబధ్వాక్షిప్యతాంమావిలమ్బథ॥
అన్యథాసకలాలోకాస్తథాదైతేయదానవాః।
అనుయాస్యన్తిమూఢస్యమతమస్యదురాత్మనః॥
బహుశోవారితోఽస్మాభిరయంపాపస్తథాప్యారేః।
స్తుతిం కరోతిదుష్టానంపక్షేవోపకారకః॥
తతస్తేసత్వరా దైత్యాబధ్వాతంనాగబన్ధనైః।
భర్తురాజ్ఞాంపురస్కృత్యచిక్షిపుస్సలిలార్ణవే॥
తతశ్చచాలచలతాప్రహ్లాదేనమహార్ణవః।
ఉద్వేలోఽభూత్పరంక్షోభముపేత్యచసమన్తతః॥
భూలోకమఖిలందృష్ట్వాప్లావ్యమానంమహామ్భసా।
హిరణ్యకశిపుః దైత్యానిదమాహమహామునే॥
దైతేయాస్సకలైశ్శైలైరత్రైవవరుణాలయే।
నిశ్చిద్రైస్సర్వతస్సర్వైశ్చీయథామేషదుర్మతిః॥
నాగ్నిర్ధహతినైవాయంశ స్త్రైశ్చిన్నోనచోరగైః।
క్షయంనీతోనవాతేననవిషేణనకృత్యయా॥
నమాయాభిర్నకాహివోచ్చాత్పాతితోనచదిగ్గజైః।
బాలోఽతిసుష్టచిత్తోయంనానేనార్దో స్తిజీవతా॥
తదేషతో యరాణ్మధ్యేస్మాక్రాన్తోమహీదరైః।
తిష్టత్వబ్దసహస్రాన్తం ప్రాణాన్ హాస్యతిదుర్మతిః॥
తతోదైత్యాదానవాశ్చపర్వతై స్తంమహోదధౌ।
ఆక్రమ్యచయనంచ క్రుర్యోజనానిసహస్రశః॥
సచితః పర్వతైరన్తస్సముద్రస్యమహామతిః।
తుష్టావాహ్నికవేళాయామేకాగ్రమతిరచ్యుతమ్॥
ఈ ప్రహ్లాదుని వచనములు విని కోపముతో నాసనము నుండి లేచి హిరణ్యకశిపుడు కుమారుని వక్షమును దన్ని, మండి పడుచు జగమును నశింప జేయువాని వలె ఓ విప్రచిత్తా! ఓ రాహో! ఓ బలా! నాగ పశాములతో గట్టిగా గట్టి వీనిని సముద్రమున త్రోసి వేయుడు. ఆలసింప వలదు. లేని యెడల అన్ని లోకములు దైత్య దానవులు ఈ దుష్ట బుద్ధి యొక్క మతము ననుసరింతురు అనేక విధములు మాచే నివారింప బడినను ఈ పాపాత్ముడు శత్రు స్తోత్రములు చేయు చున్నాడు. దుష్టులను చంపుటయే మేలు! అని పలుకగా రాక్షసులు వెంటనే ప్రహ్లాదుని నాగ పాశములతో బంధించి ప్రభువు నాజ్ఞను పురస్కరించుకొని సముద్ర జలమున త్రోసిరి. చలించుచున్న ప్రహ్లాదునితో సముద్రము గూడ చలించి క్షోభించెను. అప్పుడు రాక్షసులతో హిరణ్యకశిపుడు “దైత్యులారా! ఈ సముద్రము నందే వీనిని పర్వతములచే సందు లేకుండ కప్పివేయుఫు. అగ్ని శత్రములు సర్పములు వాయువు విషము కృత్య మాయలు ఉన్నట దేశము నుండి త్రోపులు దిగ్గజములు మున్నగు వానితో వీనిని చంప శక్యము కాలేదు. వీడు బ్రతికి ప్రయోజనము లేదు. నీటి మధ్యము నందు పర్వతముతో నచ్చాధింప బడి యుండు గాక! వేయి సంవత్సరాల కైన చావ గలడు అని పలుకగా రాక్షసులట్లే చేసిరి. నీటి మధ్యమున పర్వతాక్రాంతుడై యున్న ప్రహ్లాదుడు నిత్య కృత్యాచరణ సమయమున నేకాగ్ర చిత్తముతో నచ్యుతుని నిట్లు స్తుతించెను.
ప్రహ్లాదుడు (విష్ణుస్తుతి):
నమస్తే పుణ్డరీకాక్ష! నమస్తే పురుషోత్తమ!।
నమస్తే సర్వలోకాత్మ న్నమస్తే తిగ్మచక్రిణే॥
నమస్తే వాసుదేవాయ నమస్తే కరుణాకర।
నమస్తే విశ్వరూపాయ నమస్తే సర్వ మూర్తయే॥
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ।
జగద్దితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః॥
బ్రహ్మత్వేసృజతేసర్వంస్థితౌ పాలయతేపునః।
రుద్రరూపాయ కల్పాన్తే నమస్తుభ్యం త్రిమూర్తాయే॥
దేవాయక్షా సురాస్సిద్దానాగ గన్దర్వకిన్నరాః।
పిశాచా రాక్షసాశ్చైవమనుష్యాః పశవస్తథా॥
పక్షిణస్ద్సావరాశ్చైవ పిపీకసారీసృపాః।
భూమ్యమ్భ్యగ్నిర్న భోవాయుశ్శబ్దస్స్పర్శ స్తథారసః॥
రూపంగన్దోమనోబుద్దిరాత్మాకాలస్తథాగుణాః।
ఏతేషాంపరమార్ధశ్చసర్వమేతత్త్వమచ్యుత॥
విద్యావిద్యేభావంత్సత్య మసత్యంత్వంవిషామృతే।
ప్రవృత్తంచనివృత్తంచ కర్మవేదోదితంభవాన్॥
ప్రహ్లాదుడు:
పుండరీకాక్షా! పురుషోత్తమా! సర్వ లోకాత్మకా! తీక్ష్ణ సుదర్శన చక్రదారీ! బ్రహ్మజ్ఞులకు ధ్యేయ భూతుడా! గోబ్రాహ్మణ హితకరా! జగద్దితవరా! గోవిందా! నమస్కారము. సృష్టి కాలమున బ్రహ్మగను నుండు త్రిమూర్తి స్వరూపుడ వగు నీకు నమస్కారము. దేవాదులు రాక్షసులు మనుష్యులు పశువులు స్థావరములు చీమలు పాములు పంచ భూతములు వాని గుణములగు శబ్దము స్పర్శ రూప రస గంధములు మనస్సు బుద్ది అహంకారము కాలము వీనియన్నిటి పరమార్ధమును నీవే. విద్య అవిద్య సత్యమసత్యము విషము అమృతము ప్రవృత్తి నివృత్తి వేదవిదిత కర్మయు నీవే.
సమస్తకర్మభోక్తాచకర్మోపకరణానిచ।
త్వమేవవిష్ణోసర్వాణిసర్వకర్మఫలంచయత్॥
మయ్యన్యత్రతథాశేషభూతేశుభువనేశుచ।
తవై వవ్యాప్తిరైశ్వర్య గుణసంసూచకీప్రభో॥
త్వాంయోగినశ్చిన్తయన్తి త్వాంయజన్తిచయజకాః।
హవ్యకవ్యభుగేకస్త్వం పితృఏవస్వరూపదృత్॥
రూపంమహత్తేఽచ్యుత! యాత్రవిశ్వం తతశ్చసూక్ష్మం జగదేతదీశ।
రూపాణిసూక్ష్మాణిచభూతభేదాస్తేష్వన్తరాత్మాఖ్యమతీవసూక్ష్మమ్॥
తస్మాచ్చసూక్ష్మాదివివిశేషణానామగోచరేయత్పరమాత్మరూపమ్।
కిమప్యచిన్త్యంతవరూపమస్తి తస్మైనమస్తేపురుషోత్తమాయ॥
సమస్త కర్మ ఫలభోక్తవు నీవే. కర్మ ఫలము నీవే. నాయందు తదితరుల యందు ప్రాణులందు భువనము లందు నీవు వ్యాపించి యుండుట నీ యైశ్వర్యమును సూచించును. యోగులు నిన్నే ధ్యానింతురు. యజ్ఞకర్తలు నిన్నే ఆరాధింతురు. దేవతల కొఱకు హోమము చేయ బడిన ద్రవ్యమును పితృ దేవతా రూపము ధరించియు భుజించు వాడవు నీవే ఈ విశ్వమంతయు నీ మహాద్రూపము. ఇంకను సూక్ష్మముగ నుండు రూపము నీవే. అట్టి పురుషోత్తముడ వగు నీకు నమస్కారము.
సర్వభూతేషుసర్వాత్మన్ యాశక్తిరపరాతవ।
గునాశ్రయానమస్తస్యై శాశ్వతాయై పరేశ్వర॥
యాతీతగోచరావాచాం మనసాంచావిశేషణా।
జ్ఞానిజ్ఞానపరిచ్చేద్యాతాంవందేచేశ్వరీంపరామ్॥
ఓంనమోవాసుదేవాయ తస్మై భగవతేసదా।
వ్యతిరిక్తంనయస్యాస్తి వ్యతిరిక్తోఽఖిలస్యయః॥
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై మహాత్మనే।
నామరూపంనాయస్యాస్తియోఽ స్థిత్వేనోఫలభ్యతే॥
యస్యావతారరూపాణి సమర్చాన్తిదివౌకసః।
అపశ్యన్తఃపరంరూపం నమస్తస్మై పరాత్మనే॥
సర్వాత్మకా! సర్వ బూతము లందు సత్యాది గుణముల నాశ్రయించి యున్న యేనీ అపరాశక్తి (ప్రకృతి) గలదో ఆ శక్తికి నమస్కారము. వాక్కునకు మనసునకు నిర్విశేషమై బ్రహ్మ జ్ఞానుల జ్ఞానమునకు మాత్రము లక్ష్యమగు స్వతంత్రమైన పరాశాక్తికి (చిచ్చక్తి) నమస్కరింతును. సమస్త జగన్నివాస భూతుడు ప్రకాశ రూపుడు షడ్గునైశ్వర్య సంపన్నుడునగు వానికి నమస్కారము. ఎవనికి వేరైనది లేదో (సర్వము తదాత్మకము కావున) సమస్తము కంటె నెవడు వ్యతిరిక్తుడో (కార్య రూపమగు జగత్తు కంటె వేరైన వాడు కావున) వానికి నమస్కారము. నామ రూపములు ఎవనికి (క్షేత్రజ్ఞునకు) లేవో, ఏ ఒకడున్నట్లు గోచరించు (బ్రహ్మగా) చున్నాడో వానికి నమస్కారము. ఎవని పరరూపము చూడలేక వాని అవతార రూపముచే ఆరాధించు చున్నారో అట్టి మహాత్మునకు నమస్కారము.
యోఽన్తస్తిష్ఠన్నశేషస్య పశ్యతీశశ్శుభాశుభమ్।
తంసర్వసాక్షిణంవిష్ణుం నమస్తస్మై పరమేశ్వరమ్॥
నమోఽస్తు విష్ణవేతస్మైయస్యాభిన్నమిదంజగత్।
ధ్యేయస్సజగతామాద్యస్సప్రసీదతుమేఽవ్యయః॥
యత్రోతమేతత్ప్రోతంచవిశ్వమక్షరసంజ్ఞకే।
ఆధారభూతస్సర్వస్య సప్రసీదతుమేహరిః॥
ఓం నమో విష్ణవేతస్మైనమస్తస్మైపునఃపునః।
యత్రసర్వంయథాస్సర్వంయస్సర్వం సంశ్రయశ్చయః॥
సర్వగత్వాదనన్తస్య సఏవాహమవస్తితః।
మత్తస్సర్వమహం సర్వం మయిసర్వంసనాతనే॥
ఆహామేవావ్యయోనిత్యః పరమాత్మాత్మసంశ్రయః।
బ్రహ్మసంజ్ఞోఽహమేవాగ్రే తథాఽన్తేచపురఃపుమాన్॥
ఎవడు సర్వ హృదయము లందుండి శుభాశుభ కర్మలనెల్ల సాక్షిగ చుచు చున్నదో విశ్వ రూపుడైన యా సర్వసాక్షియగు పరమేశ్వరుని నమస్కరించెద. ఎవడు సర్వ వ్యాపకుడో ఎవని కంటె జగత్తు భిన్నము కాదో ఆతడు సర్వ ద్యేయుడు సర్వ జగదాద్యుడు నాశ రహితుడైన యాతడు ప్రసన్నుడగు గాక! వస్త్రమెట్లు పడుగు దీర్ఘతంతువులందు గ్రథితమై అడ్డతంతువు లందు అనుస్యూతమై యున్నదో యట్లే యే పరమాత్మ యందు ఓతప్రోత భావమున సర్వ ప్రపంచము ఆధార పదియున్నదో యట్టి అవ్యయమై అక్షర సంజ్ఞతో నొప్పు ప్రధాన మహాదాది రూపమున నున్న శ్రీహరి ప్రసన్నుడగు గాక! ఎవ్వని యందు (ప్రళయమున) సర్వము గలదో ఎవ్వని వలన (సృష్టి యందు) సర్వము వచ్చు చున్నదో ఎవడు (స్థితి కాలమున) సర్వ రూపుడుగ నుండునో అట్టి సర్వాధారుడును సర్వ వ్యాపకుడునగు పరమాత్మకు నమస్కారము. అనంతుడు అంతట ఆత్మ రూపుడు నుండుటచే నేనా యనంతుడనై యున్నాను. సనాతనుడనగు నా యందే సర్వము నున్నది. నాశ రహితుడను నిత్యుడను పరమాత్మను స్వమహిమ యందు ప్రతిష్ఠితుడను బ్రహ్మ సంజ్ఞ గలవాడను నేనే. సృష్టికి పూర్వ మందు ప్రళయానంతర మందు సర్వాతీతుడనై యున్న పురుషుడను నేనే.
Summary of chapter 19 of the Vishnu Mahā Purāṇa is as follows:
In a distinctive variation from other Purāṇas: Prahlāda, undeterred by his father's cruelty, goes himself to meditate in the ocean floor — submerged under mountains, bound in serpent-chains — performing tapas for Viṣṇu. Viṣṇu, moved by this devotion, appears to Prahlāda in his Nṛsiṃha form (man-lion), dissolves the mountains, releases the serpent-bonds, and embraces him.