మైత్రేయుడు:
సూర్య వంశ్యాభగవన్ కథితా భవతా మమ।
సోమస్యాప్యథవంశీయాన్ శ్రోతుమిచ్చామి పార్థివాన్॥
కీర్త్యతేస్థిర కీర్తీనాంయేషామద్యాపిసంతతిః।
ప్రసాదసుముఖస్తాన్మే బ్రహ్మన్నాఖ్యాతుమర్హసి॥
శ్రూయతాం ముని శార్దూల! వంశః ప్రథితతేజసః।
సోమస్యానుక్రమాత్ఖ్యాతా యాత్రోర్వీపతయోఽభవన్॥
అయంహివంశోఽతి బలపరాక్రమద్యుతిశీలచేష్టావద్భి రతిగుణాన్వితైర్నహుషయయాతి
కార్తవీర్యార్జునాదిబిర్భూపాలైరలంకృతః తమహం కథయామి శ్రూయతామ్॥
అఖిల జగత్స్రష్టుర్భగవతో నారాయణస్యనాభిసరోజ సముద్భవాబ్జయోనేః బ్రహ్మణః పుత్రోఽత్రిః॥
అత్రేస్సోమః॥
తంచ భగవానబ్జయోనిః అశేషౌషధీద్విజ నక్షత్రాణా మాధిపత్యేఽభ్యషేచయత్॥
సచరాజసూయమకరోత్॥
తత్ప్రభావాదత్యుత్కృష్టాదిపత్యాదిష్ఠాతృత్వాచ్చైనం మద అవివేశ॥
మదావలేపాచ్చ సకలదేవగురోర్ బృహస్పతే స్తారాంనామపత్నీంజహార॥
బహుశశ్చ బృహస్పతి చోదితేనభాగవతా బ్రాహ్మణాచోద్యమానస్సకలైశ్చ దేవర్షిభిర్యాచ్యమానోఽపినముమోచ॥
తస్యచన్ద్రస్యచ బృహస్పతేః ద్వేషాదుశనాః పార్ష్ణిగ్రాహోఽభూత్॥
అంగీరసశ్చసకాశా దుపలబ్దవిద్యోబృహస్పతేస్సాహాయ్యమకరోత్॥
యతశ్చోశనాస్తతోజమ్భనికుమ్భాద్యాః సమస్తా ఏవ దైత్యదానవనికాయా మహాన్తముద్యమం చక్రుః॥
బృహస్పతేరపి సకలదేవసై న్యయుతస్య యతస్సహాయః శక్రోఽభవత్॥
ఏవంచతయోరతీవోగ్రసంగ్రామస్తారానిమిత్తస్తారకామయోనామాభూత్॥
మైత్రేయుడు:
నీవు సూర్యవంశ రాజులం దేల్పిటివి. ఇక సోమవంశ రాజులను వినగోరెదను. ఓ బ్రాహ్మణా! స్థిరకీర్తులగు చంద్ర వంశ్యరాజుల చరిత్ర నేటికిని గీర్తింప బడుచున్నది. ప్రసాద సుముఖుడవై యది యానతీయ దగుదువన శ్రీపరాశరుడిట్లనియె. ఓ ముని శార్దూల! ప్రసిద్ధ తేజుడగు సోముని వంశమున భూపతులు ప్రసిద్ధులు జనించిరి. అనుక్రమముగ వినుము. ఈ వంశ మతిబల పరాక్రమ ద్యుతిశీల చేష్టావంతులు నతిగుణాన్వితులైన సహుష యయాతి కార్తవీర్యార్జునాది రాజన్యులచే నలంకృత మైనది. అఖిల జగత్స్రష్టయగు భగవంతుడు నారాయణుని నాభిసరస్సు నందుద్భవించిన అబ్జయోని బ్రహ్మ యొక్క పుత్రుడత్రి. అత్రి కుమారుడు సోముడు. ఆయనను బ్రహ్మ ఓషధులు ద్విజులు నక్షత్రములకు నధిపతిగా నభిషేకించెను. అతడు రాజసూయ యాగముల జేసెను. దాని ప్రభావమున నత్యున్నతాధిపత్యము వలన నితనిని మదమావేశించెను. మదాతిశయముచే సకల దేవా గురువగు బృహస్పతి భార్య దారను హరించెను. బృహస్పతి ప్రేరేపణ బ్రహ్మ చెప్పినను దేవర్షు లందరు యాచించినను నామెను వదలడయ్యే. బృహస్పతి తోడి ద్వేషముచే శుక్రుడు చంద్రునికి సహాయపడెను. జంభనికుంభాదు లెల్ల దానవులు నాతనితో పెద్ద యుద్దము లేవదీసిరి. బృహస్పతికి శక్రుడు సకలదేవ సైన్యముతో సహాయుడయ్యె. ఇట్లా గురుచంద్రులకు తారా నిమిత్తముగా తారకామయమను ఘోర యుద్దము జరిగెను.
తతశ్చ సమస్త శస్త్రాణ్య సురేషు రుద్రపురోగమాదేవాః దేవేషు చాశేషదానవా మముచుః॥
ఏవం దేవాసురాహవసంక్షోభక్షుబ్ధ హృదయ మశేషమేవ జగద్బ్రహ్మాణం శరణం జగామ॥
తతశ్చ భగవానబ్జయోనిరప్యుశనసం నసురాన్ దేవాంశ్చనివార్య బృహస్పతే ర్భార్యా మదాపయత్॥
తాంచాన్తః ప్రసవామవలోక్య బృహస్పతి రప్యాహ॥
నైషమమక్షేత్రేభవత్యాన్యస్యసుతో ధార్యస్సా ముత్సృజైన మలమల మతిధార్ ష్ట్యే నేతి॥
సాచతేనైవముక్తాఽతిపతి వ్రతాభార్ తృవచనానన్తరం త మిషికాస్తమ్బేగర్భ ముత్ససర్జ॥
సచోత్సృష్టమాత్రేవాతితేజసా దేవానాంతేజాం స్యాచిక్షేప॥
బృహస్పతిమిన్ధుంచతస్యకుమారస్యాతిచారుతయాసాభిలాషౌ దృష్ట్వా దేవాస్సముత్పన్న సందేహాస్తారాంపప్రచ్చుః॥
సత్యంకథయాస్మాకంసుభగే సోమస్యాథవా బృహస్పతే రయంపుత్ర ఇతి॥
ఏవంతై రుక్తాసాతారాహ్రియాకించిన్నోవాచ॥
బహుశోఽప్యభిహితాయథాసౌదేవేభ్యోనాచచక్షే తతస్సకుమారా స్తాం శప్తుముద్యతః ప్రాహ॥
దుష్టేఽమ్బ! కస్మాన్మమతాతంనాభ్యాసి॥
అద్యైవతేవ్యళీ కలజ్జావత్యా స్తథాశాస్తిమహంకరోమి॥
యథాచనై వమద్యాప్యతిమన్థరవచనా భవిష్యసీతి॥
అథాహ భగవాన్ పితామహః తంకుమారం సన్నివార్యయమ పృచ్చత్తాంతారామ్॥
కథయ వత్సే! కస్యాయమాత్మజః సోమస్యవాబృహస్పతేర్వా ఇత్యుక్తా లజ్జమానాహ సోమస్యేతి॥
తతః ప్రస్పురదుచ్చ్వసితామలకపోలకాన్తిర్భగవానుడుపతిః కుమార మాలింగ్యసాధుసాధు వత్స ప్రాజ్ఞోఽసీతి బుధ ఇతి తస్య నామ చక్రే॥
తథాఖ్యాత మేవైతత్ సచయథేళాయామాత్మ జంపురూరవసముత్పాదయామాస॥
రుద్రపురోగములు దేవత లసురుల పైని అశేష దానవులు దేవతల మీదను సర్వాస్త్ర శస్త్రములను బ్రయోగించిరి. ఇట్లు భయంకర సంగ్రామ సంక్షుబ్ధ హృదయమై జగత్తు బ్రహ్మను శరణొందేను. ఆయన శక్రుని శంకరుని అసురులను సురలను వారించి బృహస్పతికి తార నిప్పించెను. ఆమె గర్భిణియై యుండుట చూచి బృహస్పతి నా క్షేత్ర మందు నీవింకొకని సుతుని ధరింప రాదు. వీనిని విడువుము. అతిధార్ష్ట్యము చాలింపు చాలింపు మన నామె మహాపతివ్రత గావున నా గర్భమును ఒక యిషీకా స్తంబమున దిగిచెను. తిరిగినదే తడవుగా నా శిశువు మహా తేజస్సుతో దేవతల తేజస్సును జిమ్మి వేసెను. ఆ కుమారుడతి సుందరు డగుటచే వాని యెడ ముచ్చట పడు గురుని చంద్రునింగని దేవతలు సందేహము పుట్టి తారను బ్రశ్నించిరి. సుందరీ! మాకు నిజము చెప్పుము. వీడు సోముని కొడుకా బృహస్పతి తనయుడా అననామె సిగ్గుచే నించుకయు పలుకదయ్యె. వేల్పులు మఱిమఱి యడిగినం జెప్పకున్న జూచి యా పుట్టిన శిశువు ఆమెను శపింప బూని యిట్లనియె. దుష్టురాలా! అమ్మ! మా తండ్రినేల చెప్పవు? ఇదిగో ఇప్పుడే దొంగ సిగ్గు నభినయించు నీకు నేను శాస్తి చేయుదును. (శాస్తి = శాసనము ఆజ్ఞలో బెట్టెదనన్న మాట. తగిన శిక్ష చేసెదనని లోక వ్యవహారములో తాత్పర్యము) ఇప్పుడు గూడ కొంచమైన పలుక కున్నావు. అని బాలుడన పితామహు డా కుమారుని వారించి స్వయముగా తారను జేరి! అమ్మాయి! చెప్పు. వీడెవ్వని కొడుకు సోముని వాడా! బృహస్పతి వాడా! అన నామె లజ్జించుచు మెల్లగ సోముని వాడనియె. అంత నచ్చవు, తేలి చెక్కిళు లందు కాంతులు చెదర నుడుపతి కుమారుం గౌగలించుకొని బాగు బాగు! వత్స! ప్రాజ్ఞుడవు, తెలివైన వాడవు అని వానికి బుధుడని పేరు పెట్టెను. ఇతడు ఇళ యందు పురూరవడను కొమరునిం గనెనన్న యంశము లోగడ చెప్పితిని గదా!
పురూరవాస్త్వతిదానశీలోఽతి యజ్వాఽతి తేజస్వీయం సత్యవాదినమతిరూపస్వినం
మిత్రావరుణ శాపాన్మానుషేలోకే మయావస్తవ్యమితి కృతమ తిరూర్వశీ దదర్శ॥
దృష్టమాత్రేచ తస్మిన్నపహాయ మాన మశేష మపాస్యస్వర్గసుఖాభిలాషం తన్మనస్కాభూత్వా తమేవోపతస్థే॥
సోఽపితామతిశయిత లోకస్త్రీకాన్తి సౌకుమార్యలావణ్య గతివిలాసహాసాదిగుణా మవలోక్య తదాయత్తచిత్తవృత్తి ర్బభూవ॥
ఉభయమపితన్మస్క మనన్యదృష్టిమపరిత్యక్త సమస్తాన్య ప్రయోజనమాభూత్॥
రాజాతుప్రాగల్భ్యాత్తామాహ॥
సుభ్రు! త్వామహమభికామోఽస్మి ప్రసీదానురాగముద్వ హేత్యుక్తాలజ్జావఖణ్డిత మూర్వశీ తంప్రాహ॥
భవత్వేవంయదిమేసమయ పరిపాలనం భవాన్ కరోతిత్యాఖ్యాతేపునరపితామహ॥
అఖ్యాహిమేసమయమితి॥
అథపృష్టా పునరప్యబ్రవీత్॥
శయనసమీపేమ మోరణకద్వయం పుత్రభూతంనాపనేయమ్॥
భవాంశ్చమయా ననగ్నోద్రష్టవ్యః॥
ఘృతమాత్రంచమమాహార ఇతి॥
ఏవమేవేతిభూపతిరప్యాహ॥
పురూరవుడతి దానశీలుడు. అనేక యజ్ఞములు చేసిన వాడు, అతి తేజస్వి, సత్యవాది, రూపసి, మనస్వి (పండితుడు), మిత్రావరుణు లిచ్చిన శాపముచే మానుష్య లోకము నందే నుండ వలయునని నిశ్చయించి యూర్వశియా సుందరునిం జూచి నంతన గుట్టు విడిచి యతనిపై మనసు పడి స్వర్గ సుఖాభిలాషం గూడ విడిచి వానినే జేరెను. అతడును సకల లోకాంగనల నతిశయించు దాని సౌకుమార్య లావణ్య గతి విలాసహావభావాది గుణ విశేషము లుపక్షించి యామెయంద మనస్సు లగ్నమై యుండెను. అయ్యుభయము నొండొరుల మనసుపడి మరుచూపు లేక మఱి యితర ప్రయోజనము లన్నిటిం ద్యజించి యుండెను. పురూరవుడు ప్రౌడుండు గావున చొరవ సేసికొని సుందరీ! నిన్నేను వలచితిని. ప్రసన్న వగుము. అనురాగముం గొనుమని పలుక నూర్వశి సిగ్గుదొరగి యగుగాక! నాకొక ప్రతిజ్ఞ గలదది నీవు పాలింతువేని యిట్లయగు గాక యన నతడు మరల నామెతో నాకా ప్రతిజ్ఞ యేదో తెలుపుమన నామె మరియిట్లు పలికెను. శయన సమయమున నాకు పుత్రులట్లున్న ఈ మేక పిల్లలను దొలగింప రాదు. నీవు నగ్నుడుగా నాకు గనబడ రాదు. నాకాహారము నేయి మాత్రము గావలెననియె. రాజట్లే కానిమ్మనియె.
తయాసహచావనిపతిరలకాయాం చైత్రరథాదివనేష్వమలపద్మషణ్డేషుమానసాది సరస్వతి రమణీయేషు రమమాణ ఏకషష్టి వర్షాణ్యనుదిన ప్రవర్ధమాన ప్రమోదోఽనయత్॥
ఊర్వశీచతదుపభోగాత్ప్రతిదిన ప్రవర్ధమానానురాగా అమరలోక వాసేఽపినస్పృహాంచకార॥
వినాచోర్వశ్యాసురలోకోఽప్సరసాం సిద్ధగన్ధర్వాణాంచ నాతిరమణీయోఽభవత్॥
తతశ్చోర్వశీపురూరవసోస్సమయవిద్విశ్వావసుః గన్దర్వ సమవేతోనిశి శయనాభ్యాసాదేకమురణకంజహార॥
తస్యచాకేశేనీయమానస్సోర్వశీశబ్ద మశృణోత్॥
ఏవమాహచ మమానాథాయాః పుత్రః కేనాప్యపహ్రియతే, కంశరణముపయామీతి॥
తదాకర్ణ్య రాజామాంనగ్నం దేవీవీక్ష్యతీతినయయౌ॥
అథాన్యమప్యురణకమాదాయగన్ధర్వాయయుః॥
తస్యాప్యపహ్రియమాణస్యాకర్ణ్య శబ్దమాకాశే పునరప్యనాథాఽస్మ్యహమభర్తృకా
కాపురుషాశ్రయేత్యార్తరావిణీబభూవ॥
రాజాఽప్యమర్శవశాదన్ధకారమే తదితి ఖడ్గమాదాయ దుష్టదుష్టహతోఽసీతి వ్యాహరన్నభ్యదావత్॥
తావచ్చగన్ధర్వైరప్యతీవోజ్జ్వలావిద్యుజ్జనితా॥
తత్ప్రభయాచోర్వశీరాజానమపగతామ్బరం దృష్ట్వాఽపవృత్తా సమయా తతక్షణా దేవా పక్రాన్తా॥
పరిత్యజ్య తావప్యురణకౌ గన్ధర్వాస్సురలోకముపగతాః॥
రాజాపితతోమేషావాదాయాతిహృష్టమనాః స్వశయనమాయాతో నోర్వశీందదర్శ॥
తాంచాపశ్యన్ వ్యపగతామ్బర ఏవ్మొత్తరూపోబభ్రామ॥
కురుక్షేత్రే చామ్భోజసరస్యన్యాభిశ్చతసృభి రప్సరోభిస్సమవేతామూర్వశీం దదర్శ॥
తతశ్చోన్మత్తరూపోజాయే హేతిష్ఠమనసిఘోరేతిష్ఠవచసికపటికేహేతిష్ఠేత్యేవమనేక ప్రకారంసూక్తమవోచత్॥
ఆహచోర్వషీ॥
మహారాజాలమనేనావివేక చేష్టితేన॥
అన్తర్వత్న్యహమబ్దాన్తేభవతాఽత్రాగన్తవ్యం, కుమారస్తే భవిష్యతి కాంచనిశామహం
త్వయాసహవత్స్యామీత్యుక్తః ప్రహృష్ట స్స్వపురంజగామ॥
తాసాంచాప్సరసామూర్వశీ కథయామాస॥
అయంస పురుషోత్కృష్టోయేనాహమేతావన్తం కాలమనురాగాకృష్ణమానసాసహాషి తేతి॥
ఏవముక్తా స్తాశ్చప్సరస ఊచుః॥
సాదుసాధ్వస్యరూపమప్యనేనహాస్మాకమపిసర్వ కాలమాస్యాభవేదితి॥
అబ్దేచ పూర్ణేసరాజాతత్రాజగామ॥
కుమారం చిరాయుషమస్యైవోర్వశీదదౌ॥
దత్త్వాచైకాంనిశాంతేనరాజ్ఞాసహోషిత్వా పంచపుత్రోత్పత్తయే గర్భమవాప॥
ఉవాచచైనం రాజానమస్మత్ప్రీత్య మహారాజాయసర్వ ఏవగన్ధర్వావరదాస్సం వృత్తాః వ్రియ తాంచవర ఇతి॥
ఆహచరాజా॥
విజితసకలారాతిరావిహతేన్ద్రియ సామర్థ్యోబన్ధుమానమితబలకోశః నాన్య దస్మాకమూర్వశీ సాలోక్యాత్ ప్రాప్తవ్యమస్తి, తదహమనయాసహోర్వశ్యాకాలం నేతుమభిలషామీత్యుక్తే గన్ధర్వాజ్ఞేఽగ్నిస్థాలీందదుః॥
ఊచుశ్చైవమగ్నిమామ్నాయానుసారీ భూత్వాత్రిధాకృత్వోర్వశీ సలోకతామనోరథ ముద్దిశ్య సమ్య గ్యజేథాః తతోఽవశ్య మభిలషితమావాప్స్యసీత్యుక్త స్తామగ్నిస్థాలీమాదాయజగామ॥
అన్తరటవ్యామచిన్తయత్ ఆహోమేఽతీవమూడతాకిమహమకరవమ్॥
వహ్నిస్థాలీమయైషానీతానోర్వశీతి॥
అథై నామటవ్యా మేవాగ్నిస్థాలీంతత్యాజస్వపురంచ జగామ॥
వ్యతీతేఽర్థరాత్రేని నిద్రశ్చాచిన్తయత్॥
మమోర్వశీసాలోక్యప్రాప్త్యర్థమగ్నిస్థాలీగన్ధర్వైర్దత్తాసాచమయాటవ్యాంపరిత్యక్తా॥
తదహంతత్రతదాహరణాయయాస్యామీత్యుత్థాయ తత్రప్యుపగతో నాగ్నిస్థాలీమపశ్యత్॥
శమీగర్భంచాశ్వత్థమగ్నిస్థాలీస్థానేదృష్వాఽచిన్తయత్॥
మయాత్రాగ్నిస్థాలీనిక్షిప్తా సాచాశ్వత్థశ్శమీగర్భోఽభూత్॥
తదేనమేవాహమగ్నిరూపమాదాయస్వపురమాభిగమ్యాంరణింకృత్వాతదుత్పన్నా గ్నేరుప్రాస్తిం కరిష్యామీతి॥
ఏవమేవస్వపురముపగతోఽరణించకార॥
తత్ప్రమాణంచాంగుళైః కుర్వాన్ గాయత్రీ మపఠత్॥
పఠతశ్చాక్షరసంఖ్యాన్యేవాంగుళాన్యరణ్యభవత్॥
తత్రాగ్నింనిర్మథ్యాగ్ని త్రయమామ్నాయానుసారీభూత్వాజుహాన॥
ఊర్వశీసాలోక్యంఫలమభిసంధితవాన్॥
తేనైవచాగ్ని విధినాబహువిధాన్ యజ్ఞానిష్ట్వాగాన్ధర్వా లోకానవాప్యోర్వశ్యాసహావియోగ మవాస॥
ఏకోఽగ్నిరాదావభవత్ ఏతేన త్వత్ర మన్వన్తరేత్రేతా ప్రవర్తితా॥
ఆమెతో గూడ పురూరవు డలకా నగర మందు చైత్రరథ పుష్పోధ్యానము లందు మానస సరోవరము మొదలయిన పద్మ సరస్సు లందతి రమణీయ ప్రదేశములందు విహరించుచు నిరువది యొక్క సంవత్సరములు దినదిన వర్ధమానానంద రస భరితుడై క్రీడించెను. ఊర్వశియు నతనితోడి యుపభోగమున ప్రతిదిన మనురాగ మభివృద్ధి నొంద స్వర్గలోక నివాసము మాటయే మరచెను. ఊర్వశి లేమి నమరలోక మప్సరసలకు గంధర్వుడు తన వారితో గూడ వచ్చి యా రాత్రి వారి పాన్పు నుండి యొక మేకను గొనిపోయెను. ఆకాశ మందది లాగికొన పోవు తరిం బెట్టిన యరపు నూర్వశి వినెను. దిక్కులేని నా బిడ్డ నేవ్వడో లాగికొని పోవుచున్నాడు. నేనెవ్వని శరణొందేద ననెను. అది వినియు రాజు దిగంబరిగా నున్న నన్ను దేవి చూడ గలదని వెలిక పోడయ్యే. అవ్వల రెండవ మేకను గూడ గంధర్వులు లాగికొని పోయిరి. దాని యరపు గూడ విని మరల నేననాథను. అభర్తృకను. కుత్సితు నొక్కని గట్టుకొని తిరుగు చున్నానని యాక్రందించెను. పురూరవు డందులకు గోపము గొని చీకటి గదా యని ఖడ్గముం గొని “ఓరి! దుష్ట దుష్ట! ఇదె చచ్చిటివి చూడుమనుచు బరువెత్తెను. అంతలో గంధర్వులు మిక్కిలిగ నుద్దీపించు మెరపును జూపిరి. ఆ వెలుగులో నూర్వశి రాజుం దిగంబరి గాగని మున్ను చేసికొన్న కట్టడ దప్పినదని యాక్షణమే వెడలి పోయెను. గంధర్వులు నా మేకల నక్కడనే విడచి సురలోక మేగిరి. ఆ మేకలం గొని రాజానంద భరితుడై తన పాన్పున కేతెంచి యూర్వశిం గానడయ్యే. ఆమెనట గానక దిగంబరిగానే వెఱ్రి వాడట్లు వెఱ్రి పర్వులు పెట్టెను. కురుక్షేత్ర మందు తామర కొలనిలో నితరాప్సరసలు నల్వురగూడి యున్న యూర్వశిం గాంచెను. ఆ వెఱ్రి రూపుతోనే యింతీ! నిలు నిలు! మనసునం బరమ ఘోరవు. మాటం గపటవు ఓసి నిలునిలు మనియిట్లు పలుభంగులయిన సూక్తములం బల్కెను. ఊర్వశియు నిట్లనియె. మహారాజా! ఈ యవివేక చేష్టలు చాలును. నేనిపుడు గర్భిణిని. ఏడాది తరువాత నీవిటకు రాదగును. నీకు కొడుకు గలుగ గలడు. ఒకానొక రేయి నీతో గలిసి యుందును గదా యన హర్షించి పురూరవుడు తన పురమునకుం జనెను. ఆయప్సరసలతో నూర్వశి నేనిన్నాళ్ళనురాగమున మనసాకర్షింపబడి యున్న పురుషుడీతడనెను. వారు నిట్లనిరి. బాగు బాగు! ఈతని చక్కదన మెంత చక్కనిది. ఈతనితో మాకు గూడ కలకాలమునికి జతపడు గాక! యనిరి. ఏడాది కాగానే యా రాజచట కేతెంచెను. అతని కూర్వశి కుమారుని దీర్ఘాయుష్మంతుని సమర్పించెను. సమర్పించి యొక్క రేయి యాతనితో నుండి యైదుగురు కొడుకులు గలుగు గర్భాముం ధరించెను. మఱియు ఱేనింగని నాకు బ్రీతిగలుగ సర్వ గంధర్వులు మహారాజునకు నీకు వరమీయ నున్నారు, వరమడుగుము అన రాజు రిపుల నందరం గెలిచితిని. ఇంద్రియ పాటవ మించుకయు సడల లేదు. బంధు సమృద్ధియు గలదు. అమిత సైన్యకోశ సమృద్ధియుం గలదు. ఊర్వశీ సాలోక్యము కంటె మరియోకటి మాకు గావలసినది లేదు. కావున నేనీయూర్వశి తోడన కాలము గడుపగోరెద నన గంధర్వులా రాజున కొకస్థాలిని (పాత్రను) ఒసంగిరి. మఱియు నిట్లు పలికిరి. వేదామ్నాయము ననుసరించు వాడవై యగ్నిని మూడుగా జేసి ఊర్వశీ సలోకతామనోరథ సిద్ద్యర్థమని (సంకల్పము సేసి) చక్కగా యాగము సేయుము. దాన నవశ్య మభిలషితమంద గలవు. అన నాతడాయగ్ని స్థాలింగొని యేగెను. నట్టడవిలో అక్కడ! నా తెలివి తక్కువ తనమిది యేమి? నేనిపుడేమి సేసితిని? అగ్నిస్థాలిం గొని వచ్చితిని. ఊర్వశిం గాదు. అని యాస్థాలి నడవిలో విడిచెను. స్వపురమున కేగెను గూడ. అర్థరాత్రి గడవ మెలకువ వచ్చి యిట్లను కొనెను. ఊర్వశీ సాలోక్య ప్రాప్తికి గంధర్వులు నాకు అగ్నిస్థాలి నిచ్చిరి. నేనద్దాని నడవిలో బారవేసితిని. అందుచేనది తెచ్చుట కేగెదనని లేచి యటకేగి యచ్చట దాని గానడయ్యే.
ఇక్కడనేనగ్ని పాత్ర నుంచితిని అదే అశ్వత్థము, శమీ గర్భము నైనది. అందుచే నదే యగ్ని రూపము గొని నేను పురమేగి యరణిం గావించి యందు ఉదయించిన యగ్నిని ఉపాసించెదను, అని పురమునకు వచ్చి యరణిం గావించెను. అదే యంగుళముల కొలతతో నరణిం జేయువాడై గాయిత్రిం బఠించెను. పఠించు చుండగా గాయత్రీ మంత్రాక్షరములెన్నో యన్ని అంగుళముల యరణి తయారయ్యెను. అందగ్నిని మథించి త్రేతాగ్నుల నతడామ్నాయాను సారియై హోమము సేసెను. ఊర్వశీ సాలోక్యమును ఫలముగా నభిసంధానము సేసెను. (సంకల్పము చెప్పి కొనెనన్న మాట) అదే యగ్ని విధానమున బహువిధ యజ్ఞము సేసి గంధర్వ లోకములు వడసి యూర్వశితో నెడబాటు లేని స్థితి నందెను. మొదట నేకాగ్నియే యుండెను. ఈతని చేత నీమన్వంతరము నిట్లు త్రేతాగ్నులు ప్రవర్తింప బడెను.
Summary of chapter 6 of the Vishnu Mahā Purāṇa is as follows:
The Soma (Candra) is born from the eye of Atri Maharṣi. Brahmā installs him as the lord of oṣadhis, dvijas, and nakṣatras. The Tārakāmaya war follows: Tārā is abducted by Candra; devas and asuras fight; Brahmā arbitrates, Tārā is restored, and Budha is born from her union with Candra. The narrative of Pūrūravas and Ūrvaśī is narrated: they live together for twenty-one years under three conditions; when the Gandharvas steal the mekes (sheep), the conditions are broken and Ūrvaśī departs; their reunion at Kurukṣetra; Pūrūravas discovers the method of producing the Gāndharvā fire from two pieces of wood, establishing the Tretāgni tradition.