విష్ణు మహా పురాణము

20 - జహ్నువు నుండి పరీక్షిత్తు వరకు వంశము

జహ్నోస్తుసురథోనామాత్మజోబభూవ

తస్యాపివిదూరథః

తస్మాత్సార్వభౌమస్సార్వభౌమాజ్జయత్సేనస్తస్మాదారాధితస్తతశ్చాయుతాయురాయుతాయొర క్రోధనః

తస్మాద్దేవాతిథిః

తతశ్చఋక్షోఽన్యోఽభవత్

ఋక్షాద్భీమాసేనస్తతశ్చదిలీపః

దిలీపాత్ప్రతీపః

తస్యాపిదేవాసి శంతనుబాహ్లిక సంజ్ఞాస్త్రయః పుత్రాబభూవుః

దేవాపిర్బాల ఏవాఽరణ్యం వివేశ

శంతనుస్తుమహీపాలోఽభూత్

అయంచ తస్య శ్లోకః పృథివ్యాంగీయతే

యంయంకరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవన మేతి సః

శాన్తిం చాప్నోతి యేనాగ్ర్యాం కర్మాణాతేనశంతనుః

జహ్నువునకు సురథుడు జనించె. అతని నుంచి విదూరధుడు సార్వభౌముడు జయత్సేనుడు అరాధితుడుఅయుతాయువు అక్రోధనుడు దేవాతిథి ఋక్షుడునను వారు తండ్రి కొడుకులు. ఋక్షునికి భీమసేనుడు అతనికి దేవాపిశంతను బాహ్లికులను ముగ్గురు గల్గిరి. దేవాపి బాల్యమంద యావింజొచ్చె. శంతనుడు మహీపతి యయ్యె. అతనిం గూర్చిన శ్లోకమిది పృథివీ యందు కీర్తింప బడుచున్నది. భావము: ఏయే ముసలి వానిని చేతులందాకు నాతడు యౌవనముం బడయును. పరమ శాంతిని బొందును. ఆ పనిచే నాతడు శంతనుడయ్యె.

తస్యచశం తనోరాష్ట్రే ద్వాదశవర్షాణిదేవో నవవర్ష

తతశ్చా శేశారాష్ట్ర వినాశామవేక్ష్యసౌరాజా బ్రాహ్మణానపృచ్ఛత్ కస్మాదస్మాకం రాష్ట్రే దేవోనవర్షతి కొమమాపరాధ ఇతి

తతశ్చతమూచుర్ బ్రాహ్మణాః

అగ్రజస్యతేహీయమవని స్త్వయాసంభుజ్యతే

అతః పరివేత్తాత్వమిత్యుక్త స్సరాజాపున స్తా నపృచ్ఛత్

కింమయాఽత్రవిధేయమితి

తతస్తే పునరాప్యూచుః

యావద్దేవాపిః నపతనాదిభిర్తోషై రభిభూయతే తావదేతత్తస్యార్హం రాజ్యమ్

తదలమేతేన తస్మైదీయతా మిత్యుక్తే తస్యమన్త్రి ప్రవరేణాశ్మరావిణాతత్రారణ్యేతపస్వి నో

వేదవాదవిరోధవక్తారః ప్రయుక్తాః

తైరస్యాప్యతిఋజుమతేర్మహీపతిపుత్రస్యబుద్దిర్వేదవాద విరోధమార్గానుసారిణ్యక్రియత

రాజాచశంతను ద్విఽజవచనోత్పన్న పరిదేవనశోకస్తాన్ బ్రాహ్మణానగ్రతః కృత్వాగ్రజస్యప్రదానా యారణ్యం జగామ

తదాశ్రమముపగతాశ్చతమవనత మవనీపతిపుత్రం దేవాపిముపతస్థుః

తేబ్రాహ్మణా వేదవాదానుబన్దీని వచాంసిరజ్యమగజ్రేన కర్తవ్యమిత్యర్థవన్తితమూచుః

అసావపిదేవాపిర్వేదవాదవిరోధయుక్తిదూషితమనేకప్రకారం తానాహ

తతస్తేబ్రహ్మణాశ్శన్తనుమూచుః

ఆగచ్ఛహేరజన్నళమత్రాతినిర్భన్దేన, ప్రశాన్త ఏవాసావనావృష్టిదోషః, పతితోఽయమనాది

కాలమభిహితవేదవచనోచ్చారణాత్

పతితేచాగ్రజేనైవేపరివైత్తృత్వం భవతీత్యుక్తశ్శన్తమ స్స్వపుర మాగమ్య రాజ్యమకరోత్

వేదవాదవిరోధవచనోచ్చారణదూశితేచేతసి దేవాపోతిష్ఠత్యపి జ్యేష్ఠభ్రాత ర్యఖిలసస్య నిష్పత్తయే వవర్ష భగవాన్ పర్జన్యః

ఆ శంతనుని రాష్ట్రమందు పండ్రెండేండ్లు పర్జన్యుడు వర్షింపడయ్యె. దాన నశేషరాష్టము నశింప నున్నం జూచి యీ రాజు బ్రాహ్మణులను గని మన రాష్ట్రమున వర్షమును దేవుడెందులకు వర్షించ లేదు? నా యాపరాధమే మని యడిగెను. బ్రాహ్మణు లిట్లనిరి. మీ అన్న యోక్క భూమి ఇది దీనిని నీవనుభవించు చున్నాడు. అందుచే పరివేత్త వాయినావు. (అన్నకు పెండ్లి కాకుండ పెండ్లి చేసికొన్న తమ్ముడు పరివేత్త) అనవిని ఇందు నేనేమి సేయ వలయునని యడిగెను. వారనిరి. దేవాపిపతనాది దోషములకు లోనుగానంత వరకు నీ రాజ్య మాతనిదే. కావున నీ రాజ్యముతో నీకు బనిలేదు. ఇది యాతనికిమ్మని నంతట నాతని మంత్రిముఖ్యుడు అశ్మరావియను వాడక్కడ నరణ్యమందు వేదవాదములకు విరోధముగా వాధించు తపస్యులను ప్రయోగించెను. వారును మిక్కిలి ఋజుబుద్దియైన రాజ తనయుని బుద్దిని వేదవాదములకు విరోధ మార్గమునం బోవునట్లు మార్చిరి. శంతను మహారాజు మాత్రము ద్విజుల మాటలం బట్టి పరితాప దుఃఖము గల్గి యా విప్రులను ముందిడికొని యన్నగారికి రాజ్యదానము సేయ నరణ్యమునా కేగెను. ఆ యాశ్రమము చేరిన వారై వచ్చియున్న రాజ కుమారుడగు దేవాపిని స్తుతించిరి. ఆ బ్రాహ్మణులు వేదవాదాను సారులయిన మాటలు రాజ్యము నగ్రజుచే కర్తవ్యమను నర్థము గలవి పల్కిరి. ఈ దేవాపియ వేదవాద విరోధ యోక్తి దూశితముగ బెక్కురీతుల వారితో పలికెను. అంతట నా బ్రాహ్మణులు శంతనునితో రారమ్ము. ఓ రాజా! అతి నిర్భంధము చాలు చాలు. అనావృష్టి దోషము శమించినది. అనాది కాలముగా చెప్పబడిన వేదవచన దూషణోచ్చారణముచే నీతడు పతితుడైనాడు. అన్నగారిట్లు పతితుడయి నందున నీకు పరివేత్తృత్వ దోషము గలుగదన శంతనుడు తన పురమేగు దెంచి రాజ్యముం గావించెను. వేదవాద విరోధ వచనోచ్చారణముచే భ్రష్టుడైన జ్యేష్ఠ భ్రాత దేవాపి యుండగనే తమ్ముడు శంతనుడు రాజ్య స్వీకారము సేసెను. అంతట సర్వసస్యములు పండుటకు పర్జన్య భగవానుడు వర్షించెను.

బాహ్లీకాత్సోమదత్తః పుత్రోఽభూత్

సోమదత్తస్యాపిభూరిశ్రవశల్యసంజ్ఞాస్త్రయః పుత్రాబభూవుః

శంతనోరప్య మరద్యాం జహ్నవ్యాముదారకీర్తిరశేషశాస్త్రార్థవిద్భీష్మః పుత్రోఽభూత్

సత్యవత్యాం చచిత్రాఙ్గదవిచిత్ర వీర్యౌద్వౌపుత్రావుత్పాదయామాసశంతనుః

చిత్రాఙ్గదస్తుబాల ఏవచిత్రాఙ్గదేనైవ గన్ధర్వేణాహవే నిహతః

విచిత్రవీర్యోఽపికాశీరాజతనయే అమ్భామ్భాలికే ఉపయేమే

తదుపభోగాతిఖేదాచ్చయక్ష్మణాగృహీతః స పఞ్చత్వ మగమత్

సత్యవతీనియోగాచ్చమత్పుత్రః కృష్ణద్వైపాయనోమాతుర్వచనమనతిక్రమణీయమితికృత్వా

విచిత్రవీర్యక్షేత్రేధృతరాష్ట్రపాణ్డూ తత్ప్రహితభుజిష్యాయాం విదురం చోత్పాదయామాస

బాల్హికునికి సోమదత్తుడు. అతనికి భూరి భూరిశ్రవుడు శల్యుడునను ముగ్గురు గల్గిరి. శంతనునికి దేవనది జాహ్నవి యందుదారకీర్తి అశేష శాస్త్రార్థవేత్త భీష్ముడు పుత్రు డుదయించెను. శంతనుని సత్యవతి యందు చిత్రాంగద విచిత్రవీర్యు లిద్దరు గల్గిరి. చిత్రాంగదుడు బాల్యమందే చిత్రాంగదుడను గంధర్వుని చేత యుద్దము నందు గూలెను. విచిత్రవీర్యుడు కాశీరాజు తనయలను అంబ అంబాలిక యను వారిని బెండ్లాడెను. వారి యువభోగాతి ఖేదముచే క్షయవ్యాధికి గురియై మరణించెను. నా పుత్రుడు కృష్ణద్వైపాయనుడు తల్లి మాట జవదాట రాదను సత్యవతీ నియోగముచే విచిత్రవీర్యుని క్షేత్రమందు (భోగస్త్రీ యందు) విదురునిం గనెను.

ధృతరాష్ట్రోఽపిగాన్దార్యాం దుర్యోధన దుశ్శాసన ప్రధానం పుత్రశతముత్పాదయామాస

పాణ్దోరప్యరణ్యేమృగయాయామృషిశాపోపుహతప్రజాజననసామర్ థ్యస్యధర్మవాయుశక్రేృః యుధిష్టిరాభీమాసేనార్జునాః కున్త్యాం నకుల సహదేవౌచ అశ్విభ్యాం మాద్ర్యాం పఞ్చపుత్రాస్సముత్పాదితాః

తేషాంచ ద్రౌపద్యాం పఞ్చైవపుత్రాబభూవుః

యుధిష్టిరాత్ప్రఠీవిన్ధ్యః భీమసేనాచ్చ్రుతసేనః శ్రుతకీర్తిరర్జునాత్ శతానీకోనకులాత్ శ్రుత కర్మాసహదేవాత్

అన్యేచపాణ్డవానామాత్మజాస్తద్యాథా

యౌధేయీతుదిష్టిరాద్దెవకంపుత్రమవాప

హిడింబాఘటోత్కచం భీమసేనాత్పుత్రం లేభే

కాశీచభీమసేనాదేవసర్వగం సుతమవాప

సహదేవాచ్చ విజయాసుహోత్రం పుత్రమవాప

రేణుమత్యాంచ నకులోఽపినిరమిత్రమజీజనత్

అర్జునస్యాప్యులూప్యాం నాగాకన్యాయామిరావాన్నామ పుత్రోఽభవత్

మణిపురపతిపుత్య్రాం పుత్రికాధర్మేణ బభ్రూవాహనం నామపుత్ర మర్జునోఽజనయత్

సుభాద్రాయాం చార్భకత్వేఽపియోఽసావతి బలపరాక్రమస్సమస్తారాతిడ్విజేతా సోఽభిమన్యురజాయత

అభిమాన్యోరుత్తరాయాం పరిక్షీణేషుకురుష్వశ్వత్థామప్రయుక్త బ్రహ్మాస్త్రేణ గర్భ ఏవభాస్మీకృతో భగవతస్సకల సురాసురవన్దితచరణయుగళస్యాత్మేచ్ఛేయా కారణమానుష రూపధారిణోఽనుభావాత్పునర్జీవితమవాప్య పరీక్షిజ్జజ్ఞే

యోఽయంసాంప్రతమేతద్భూమణ్డల మఖణ్డితాయతిః ధర్మేణపాలయతీతి

ధృతరాష్ట్రుడు గాంధారి యందు దుర్యోధన దుశ్శాసన ముఖ్యుల నూర్గురు కొడుకు లంగాంచె. పాండు వరణ్య మందు వేటాడుచు ఋషి శాపముచే సంతానముంగను సామర్థ్యముం గోల్పోయెను. వాని భార్య కుంతీ యందు ధర్మ వాయు శక్రువులచే యుధిష్టిర భీమసేన అర్జునులును మాద్రియందు అశ్వనీ దేవతలచే నకుల సహదేవులును జనించిరి. పాండవులకు ద్రౌపది యందైదుగురు పుత్రులు (ఉప పాండవులు) గల్గిరి. యుధిష్ఠిరుని వలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శ్రుతసేనుడు, శ్రుతకీర్తి అర్జునుని వలన శతానీకుడు నకులుని వలన, సహదేవుని వలన శ్రుతకర్మయుం గల్గిరి. పాండవుల కింకను పుత్రులు గలరు. యుధిష్టిరునికి యౌధేయియందు దేవకుడు గల్గెను. భీముని వలన హిడింబ ఘతోత్కచునిం గాంచె. వాని వలన కాశియను నామె సర్వగుడను కుమారునిం గనెను. సహదేవుని వలన విజయ సుహోత్రుడను పుత్రుని గాంచె. నకులుడు రేణుమతి యందు నిరమిత్రుంగాంచెను. అర్జునునకు ఉలూపియను నాగకన్య యందు ఇరావంతుడను కొడుకుదయించె. మణిపురపతి కూతురు నందు అర్జునుడు పుత్రికా ధర్మముతో, అనగా సోదరులు లేని కన్యను నీకిచ్చి చున్నాను. ఈమె యందు కలిగిన పుత్రుడు నాకు పుత్రుడు కాగలడను కన్యాదానకాల నిబంధనతో పెండ్లాడి బభ్రువాహనునిం గాంచె. అతనికి సుభద్ర యందు అభిమన్యు డుదయించె. అతడర్భకు డయినప్పుడు అతి బలపరాక్రమ శాలియై సర్వ శత్రుంజయ శాలియై యొప్పెను. అభిమన్యునకు ఉత్తర యందు పరీక్షిత్తు జనించె. కురురాజు లందఱు క్షయింప అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే గర్భమందు భస్మీకృతుడయ్యు, సకల సురాసుర వందిత చరణారవిందుడగు భగవంతుని యాత్మ సంకల్పముచే నకారణ మానుష రూప దారియు నైన శ్రీహరి యొక్క ప్రభావము వలన పునరుజ్జీవితుడై పరీక్షిత్తు ఉదయించెను. ఈ మహానుభావుడే యిప్పుడీ భూమండలము ధర్మముచే అనగా ఉత్తరోత్తరాభివృద్దియగు నఖండ సంపద కలుగు నట్లు పాలించు చున్నాడు.