విష్ణు మహా పురాణము

10 - సూర్య రథస్థదేవతాది వర్ణనము

శ్రీపరశరుడు:

త్ర్యశీతిమణ్డలశతంకాష్ఠయోరన్తరంద్వాయోః

ఆరోహణావరోహాభ్యాంభానోరాబ్దేనయాగతిః

సరథోఽధిష్టితోవైరాదిత్యైః ఋషిభిస్తథా

గన్ధర్వైరప్సరోభిశ్చ గ్రామణీసర్వరాక్షసైః

ధాతాకృతస్థలాచైవపులస్త్యోవాసుకిస్తథా

రథభృద్ర్గామణీర్హేతిస్తుమ్భురుశ్చైవసప్తమః

ఏతేవసన్తివైచైత్రే మధుమాసేసదైవహి

మైత్రేయ! స్యన్దనేభానోస్సప్తమాసాధికారిణః

అర్యమాపులశాశ్చైవరథౌజాఃపుంజికస్థలా

ప్రహేతిఃకచ్చావీరశ్చ నారదశ్చరథేరవేః

మాధవేనివసన్త్యేతే శుచిసంజ్ఞేనిబోధమే

మిత్రోత్రిస్తాక్షకొరక్షః పౌరుషేయోఽథమేనకా

హాహారథస్వనశ్చైవ మైత్రేయైతేవాసన్తివై

వరుణోవసిష్ఠోరమ్భాచ సహజన్యాహుహూరథ

రథచిత్రస్తథాశుక్రేవసన్త్యాషాఢసంజ్ఞితే

ఇన్ద్రోవిశ్వావాసుస్సోతాఏలాపుత్రస్తథాంఽగిరాః

ప్రమ్లోచాచనభాస్యే తేసర్పిశ్చార్కేవసన్తివై

వివస్వానుగ్రసేనశ్చభృగురాపూరణస్తథా

అనుమ్లోచాశజ్ఖపాలోవ్యఘ్రోభాద్రపదేతథా

పూషావాసుఃరుచిర్వాతోగౌతమోఽథధనంజయః

సుషేణోన్యోఘృతాచీచావసన్త్యాశ్వాయుజేరవౌ

విశ్వావసుర్భరద్వాజఃపర్జన్యైరావతౌతథా

విశ్వాచీసేనజిచ్చాపఃకార్తికేఛాదికారిణః

అంశకాశ్యపతార్ క్ష్యాస్తుమహాపద్మస్తథోర్వశీ

చిత్రసేనస్తథావిద్యున్మార్గశీర్షాధికారిణః

క్రతుర్భగస్తథోర్ణాయు (స్సూర్యః) స్ఫూర్జఃకర్కోటకస్తథా

అరిష్టనేమిశ్చైవాన్యా పూర్వచిత్తిర్వరాప్సరాః

పోషమాసేవసన్త్యేతే సప్తభాస్కరమణ్డలే

లోకప్రకాశనార్దాయ విప్రవర్యాధికారిణః

త్వష్టాథ జమదగ్ని శ్చకమ్భలోఽథతిలోత్తమా

బ్రహ్మోపేతోఽథఋత జిద్ధృతరాష్ట్రశ్చసప్తమః

మాఘమాసేవస న్యైతేస పతమైత్రేయ భాస్కరే

శ్రూయతాంచాపరేసూర్యేఫాల్గునేనివసన్తియే

విశ్నురశ్వతరోరమ్భాసూర్యవర్చాశ్చసత్యజిత్

విశ్వామిత్రస్తథారక్షోయజ్ఞోపేతోమహామునే

మానేష్వతేషుమైత్రేయ! వసన్య్తేతేఽత్రాసప్తకాః

సమితుర్మణ్డలేబ్రహ్మన్ విష్ణుశక్త్యుపబృంహితాః

స్తువన్తిమునయస్సూర్యం గన్ధర్వైర్గీయతేపురః

నృత్యన్త్యప్సరసోయన్తి సూర్యస్యానునిశాచరాః

వహన్తిపన్నగాయక్షైః క్రియతేఽభీశుసంగ్రహః

వాలఖిల్యాస్తథైవైనం పరివార్యసమాసతే

సోయంస ప్తగణస్సూర్యమణ్డలేమునిసత్తమ

హిమోష్ణవారివృశ్తీనాం హేతుస్స్వసమయంగతః

శ్రీపరాశరుడు (సూర్య రథస్థ దేవతాది సప్త మార్గము):

సూర్యుడుత్తర దక్షిణ దిశల నడుమ రథముపై నెక్కుచు దిగుచు నుండు దారి నూట యెనబది మూడు మండలములు. ఆయన కాంతి ప్రసార మగు మేర యాయన రథ మనంబడును. ఆ రథము నందు బండ్రెండు మాసము లందు దేవతాది వర్గ మేడు రకములుగ నధిష్టించి యుండును. ఆ వివరణ మీ క్రింది పతాకము నందు స్పష్ట పరుపు బడినది.

సూర్య రథ పతాకము

మాసము

దేవతలు

ఋషులు

గంధర్వులు

అప్సరసలు

యక్షులు

నాగులు

రాక్షసులు

చైత్రము

ధాత

పులస్త్యుడు

తుంబురుడు

కృతస్థల

రథభృత్తు

వాసుకి

హేతి

వైశాఖ

అర్యముడు

పులహుడు

నారదుడు

పుంజికస్థల

రథౌజుడు

కచ్ఛవేరుడు

ప్రహేతి

జ్యేష్ఠము

మిత్రుడు

అత్రి

హాహా

మేనక

రథస్వనుడు

తక్షకుడు

పౌరుషేయుడు

ఆషాడము

వరుణుడు

వశిష్ఠుడు

హూహూ

సహజన్య

రథచిత్రుడు

నాగుడు

రథుడు

శ్రావణము

ఇంద్రుడు

అంగిరస్సు

విశ్వావసువు

ప్రమ్లోచ

స్రోతస్సు

ఏలాపుత్రుడు

సర్పిస్సు

భాద్రపదము

వివస్వంతుడు

భృగువు

ఉగ్రసేనుడు

అనుమ్లోచ

అపూరణుడు

శంఖపాలుడు

వ్యాఘ్రుడు

ఆశ్వయుజము

పూషుడు

గౌతముడు

వసురుచి

ఘృతాచి

సుషేణుడు

ధనంజయుడు

వాతుడు

కార్తీకము

పర్జన్యుడు

భరద్వాజుడు

విశ్వావసువు

విశ్వాచి

సేనజిత్తు

ఐరావతుడు

ఆపుడు

మార్గశిరము

అంశుడు

కాశ్యపుడు

చిత్రసేనుడు

ఊర్వశి

తార్క్ష్యుడు

మహాపద్ముడు

విద్యుత్తు

పుష్యము

భగుడు

క్రతువు

ఊర్ణాయువు

పూర్వచిత్తి

అరిష్టనేమి

కర్కోటకుడు

సూర్యుడు

మాఘము

త్వష్ట

జమదగ్ని

ధృతరాష్ట్రుడు

తిలోత్తమ

ఋతజిత్తు

కంబళుడు

బ్రహ్మపేతుడు

ఫాల్గునము

విష్ణువు

విశ్వామిత్రుడు

సూర్యవర్చస్సు

రంభ

సత్యజిత్తు

ఆశ్వతరుడు

యజ్ఞోపేతుడు

ఈ దేవతాదులు ఏడ్వురును విష్ణుశక్తి సముప బృంహితులై యాయామాసము లందుందురు. దేవతలు పండ్రెండుగురు ద్వాదశా దిత్యులను పేరం బరుగుదురు. ఋషులు సూర్యుని స్తుతింతురు. గంధర్వులు పాడుదురు. అప్సరస లాడుదురు. పన్నగులు రథమును యక్షులు (గ్రామణులు) పగ్గములం బట్టుదురు. రాక్షసులు బంటులై సూర్యుని వెంట నడుతురు. వాలఖిల్యాది ఋషులు పరివారమై సూర్య భగవానుని సేవింతురు. ఈ సప్త వర్గము తమ తమ మాసము లందు చల్లని వెచ్చని నీరు వర్షించుటకు కారణమై యుందురు. ఉత్తర దక్షిణ దిశల నడుమ సూర్యుడొక్క సంవత్సరము సంచరింప వలసిన చోటున నూట యెనుబది మూడు మండలములు ఉన్నవి. కాడికి, అక్షమునకు పోలుగర్రకు వాయు రూపము లయిన రెండు పగ్గములచే, దిన దినమును ధృవుడు సూర్య రథమును మదికి లాగిన కొలది యది యుత్తరాయణమున నా మండలము నొక్కటొక్కటిగా గడచి మీదికేగును. (ఆరోహణము) ధ్రువుడా రెండు పగ్గముల సడలించిన కొలదీ, దక్షిణాయనము నొక్కొక్క మండలమును సూర్యుడు దిగినపుడు అవరోహ మగుచున్నది. ఆ సూర్య రథమున, దేవతలు, రుదులు, నాగులు, గంధర్సులు, అప్సరసలు, గ్రామణులు (యక్షులు) రాక్షసులు నుందురు. ధాత, కృతస్థన (అప్సరస) పులస్త్యుడు, వాసుకి, రథభృత్తను గ్రామణి (ఇతడొక యక్షుడు) హేతియను రాక్షసుడు, తుంబరుడు అను నీ యేడ్వురును చైత్రమాసమున నుందురు. వీరు మాసాధికారాలు. వైశాఖమున, అర్యముడు, పులహుడు, రథౌజుడు (యక్షుడు) పుంజికస్థల (అప్సరస) ప్రహేతి (రాక్షసుడు) కచ్ఛవీరుడు (నాగుడు) నారదుడు (గంధర్వుడు) అనువారేడ్వు రుందురు. శుచి యందనగా జ్యేష్టమున, మిత్రుడు, అత్రి (మహర్షి) తక్షకుడు (నాగుడు) పౌరశేయు (రాక్షసుడు) మేనక (అప్సరస) హాహా యను గంధర్వుడు, రథస్వనుడను యక్షుడు అను వారందరూ ఆషాఢమున, వరుణుడు, వశిష్ఠుడు, సహజన్యయను రంభ, హూహూరథుడు, రథచిత్తుడు, శుక్రుడు అను వారుందురు. భాద్రపదమున వివస్వంతుడు, ఉగాసేనుడు, భృగుడు, ఆపూరణుడు, అనుమ్లోచ, శంఖపాలుడు, వ్యాఘ్రుడు నను వారుందురు. ఆశ్వయుజుమున పూషుడు వసురుచి (గంధర్వుడు) వాతుడు (రాక్షసుడు) గౌతముడు, ధనంజయుడు (నాగుడు) సుషేణుడు (యక్షుడు) ఘృతాచి (అప్సరస) యుందురు. కార్తికమున విశ్వావసువు (గంధర్వుడు) భరద్వాజుడు, పర్జన్యుడు (రవి) ఐరావతుడు (నాగుడు) విశ్వాచి, సేనజిత్తు (యక్షుడు) ఆపుడు (రాక్షసుడు) అను వారధికులు. మార్గశిరమున అంశుడు (సూర్యుడు) కాశ్యపుడు (ఋషి) తార్క్ష్యుడు (యక్షుడు) మహాపద్ముడు (నాగుడు) చిత్రసేనుడు (గంధర్వుడు) ఊర్వశి, విద్యుత్తు (రాక్షసుడు) అను వారధికులు. పుష్యమున క్రతువు (ఋషి) భగుడు (సూర్యుడు) ఊర్జాయువు (గంధర్వుడు) స్ఫూరుడు (రాక్షసుడు) కర్కోటకుడు (నాగుడు) అరిష్టనేమి (యక్షుడు) పూర్వచిత్తి (అప్సరస) అను వారుందురు. మాఘమున త్వష్ట (రవి) జమదగ్ని (ఋషి) కంబళుడు (నాగుడు) తిలోత్తమ (అప్సరస) బ్రహ్మోపేతుడు (రాక్షసుడు) ఋతుజిత్తు (యక్షుడు) ధృతరాష్ట్రుడు (గంధర్వుడు) ఈ యేడుగురు మైత్రేయా మాఘమాసం నందు భాస్కరుని యందు నివసింతురు. ఫాల్గునమున, విష్ణువు (రవి) ఆశ్వతరుడు (నాగుడు) రంభ, సూర్యవర్చస్సు (గంధర్వుడు) సత్యజిత్తు (యక్షుడు) విశ్వామిత్రుడు, (ఋషి) యజ్ఞోపెతుడు (రాక్షసుడు) సూర్యుని యందు నివసిన్తూరు. ఇట్లు బ్రహ్మ విష్ణు శక్తులచే నుప బృంహితులి, సూర్య మండలమున వీర్గేద్గు రేడ్గురుగా నీయా మాసము లందుందురు. మునులు సూర్యుని పొగడుదురు. గంధర్వులు ఎదుట పాడుదురు. అప్సరస లాడుదురు. సూర్యుని సేవకులై రాక్షసులు నడతురు. పన్నగులు మోయుదురు. యక్షులు, ధర్మ సంయోపనము చేయుదురు. వాలఖిల్యాదు లితని పరివారమయి కొల్తురు. ఈ సప్త గణము మంచును వేడిని నీటిని వర్షించుటకు తమతమ సమయములలో హేతువులై యుందురు.