శ్రీపరాశరుడు:
సామవేదతరోశ్శాఖా వ్యాసశిష్యస్సజైమినిః।
క్రమేణయేన మైత్రేయ! బిభేదశృణుతంమమ॥
సుమన్తుస్తస్యపుత్రోఽభూత్సుత్వాన్ తస్యాప్యభూత్సుతః।
అధీతవన్తౌచైకైకాం సంహితాంతౌమహామతీ॥
సహస్రసంహితాభేధం సుకర్మాతత్సుతస్తతః।
చకారతంచతచ్చిష్యౌ జగ్రాహాతేమహావ్రతౌ॥
హిరణ్యనాభ! కౌలస్యం! పౌష్టిఞ్జిశ్చద్విజోత్తమ।
ఉదీచ్యాస్సామగాశ్శిష్యస్తస్యపఞ్చశతంస్మృతః॥
హిరణ్యనాభాత్తావత్యస్సంహితాయైర్ ద్విజోత్తమైః।
గృహీతాస్తేఽపిచోచ్యన్తే పణ్డితైః ప్రాచ్యసామగాః॥
లోకాక్షిఃకౌముదిశ్చైవ కక్షీవాన్ లాఙ్గలిస్తథా।
పౌష్పిఞ్జిష్యాస్తద్భేదైస్సంహితాబాహుళీకృతాః॥
హిరణ్యనాభ శిష్యస్తుచతుర్వింశతిసంహితాః।
ప్రోవాచకృతనామాసౌశిష్యేభ్యస్సుమహామతిః॥
శ్రీపరాశరుడు:
సామవేద మనెడి వృక్షము యొక్క శాఖలను వ్యాస శిష్యుడగు జైమిని మహర్షి క్రమముగా విభజించిన రీతిని చెప్పెద వినుము. జైమిని పుత్రుడు సుమంతుడు. సుత్వానుడు సుమంతుని కుమారుడు. వీరిరువురు తమ తమ తండ్రుల యొద్ధ నొక్కొక్క సంహితను నధ్యయనము చేసిరి. సుత్వానుని కుమారుడు సుకర్మ కూడ తన తండ్రి యొద్ద అధ్యయనము చేసి సహస్ర సంహితా విభాగము చేసెను. ఆ విభాగమును సుకర్మ శిష్యులగు కోసల దేశీయులైన హిరణ్యనాభుడు పౌష్పింజియు గ్రహించిరి. పౌష్పింజికి ఉత్తర దేశీయులగు నైదు వందల మంది సామగానము చేయువారు శిష్యులుండిరి. హిరణ్యనాభునకు గూడ నంత మంది శిష్యులు, వారిని పండితులు ప్రాచ్యసామగు లందురు. లోకాక్షి, కౌముదికక్షీవాన్ లాంగలి యను పౌష్పింజి శిష్యులనేక సంహితలను శిష్య ప్రశిష్యులతో వ్యాప్తి చేసిరి. హిరణ్య నాభుని శిష్యుడు కృతనామ ముని తన శిష్యులకు నిరువది నాలుగు సంహితాలను చెప్పెను. వారిచేత నీ సామవేదము బహు శాఖలుగ విస్తరింప బడినది.
తైశ్చాపిసామవేదోఽసౌ శాఖాభిర్భహుళీకృతః।
అథర్వాణమథోవక్ష్యే సంహితానాంసముచ్చాయమ్॥
అథర్వవేదంసమునిస్సుమన్తూరమితద్యుతిః
శిష్యమధ్యాపయామాస కబంధంసోఽపిత ద్ద్విధా।
కృత్వాతుదేవదర్శాయ తథాపథ్యాయదత్తవాన్॥
దేవదార్శస్స్యశిష్యాస్తుమేధో బ్రహ్మబలిస్తథా।
శోల్కాయనిః పిప్పలాద స్తథాన్యోద్విజసత్తమ॥
పథ్యస్యాపిత్రయశ్శిష్యాః కృతాయైర్ద్విజసంహితాః।
జాబాలిః కుముదాదిశ్చతృతీయశ్శౌనకోద్విజ॥
శౌనకస్తుద్విధాకృ త్వాదడావేకాంతుబభ్రవే।
ద్వితీయాంసహితాంప్రాదాత్సైన్ధవాయచసంజ్ఞినే॥
సైన్ధవాన్ముఞ్జికేశశ్చాభినద్వేదంద్విధాపునః।
నక్షత్రకల్పోవైతానః సంహితానాంతథైవచ॥
చతుర్థస్స్యాదాఙ్గిరసశ్శాన్తికల్పంతుపఞ్చమః।
శ్రేష్ఠాస్త్వథర్వణామేతేసంహితానాంవికల్పకః॥
ఆఖ్యానైశ్చాప్యుపాఖ్యానైః గాధాభిః కల్పశుద్దిభిః।
పురాణసంహితాంచక్రేపురాణార్థవిశారదః॥
ఇక అదర్వ వేద సంహితల సముదాయమును చెప్పెదను. మహాతేజస్వి యగు వ్యాస శిష్యుడగు సుమంతుడు కంబంధుడను శిష్యునకు అధర్వ వేదమును చెప్పెను. అతడు దానిని రెండుగా చేసి తన శిష్యులగు దేవశర్మకు పథ్యునకు నిచ్చెను. దేవశర్మ శిష్యులు మేధ బ్రహ్మబల శౌల్కయని పిప్పలాదుడు నని నలుగురు. పద్యుని శిష్యులు మువ్వురు. జాబాలి సుముదాది శౌనకుడు. శౌనకుడు రెండుగ విభజించిన యొక దానిని బభ్రువున కిచ్చెను. రెండవ సంహితను సైంధవుడను వానికిచ్చెను. సైంధవుని తర్వాత ముంజికేషుడు, వేదములు రెండు భాగములు సేసెను. ఈ సంహిత వికల్పములు అయిదు. 1. నక్షత్ర కల్పము, 2. వైతన కల్పము, 3. సంహితా కల్పము, 4. అంగిరస కల్పము, 5. శాంతి కల్పము. ఇవి అధర్వుణులకు శ్రేష్ఠములు. పురాణార్ధ విశారదుడగు వ్యాసముని అఖ్యానములు (చూచి చెప్పిన కథలు) ఉపాఖ్యానములు(విని చెప్పిన కథలు) గాధలచే (ఋభువదాదులు) కల్పశుద్దులు (పితృ కల్పమంత్ర కల్పాదుల) చే పురాణ సంహితను నిర్మించెను.
ప్రఖ్యాతోవ్యాసశిష్యోఽభూత్సూతోవై రోమహర్షణః।
పురాణసంహితాంతస్మై దదౌవ్యాసోమహామతిః॥
సుమతిశ్చాగ్నివర్చాశ్చ మిత్రాయుశ్శాంసపాయనః।
ఆకృతవ్రణోఽథసావర్ణిః షట్చిష్యాస్తస్యచాభవన్॥
కాశ్యపస్సంహితాకర్తా సావర్ణిశ్శాంసపాయనః।
రోమహర్షణికాచాన్యా తిసృణాంమూలసంహితా॥
చతుష్టయంచాప్యేతేన సంహితానామిదంమునే॥
ఆద్యంసర్వపురాణానాంపురాణంబ్రహ్మముచ్యతే।
అష్టాదశపురాణానిపురాణజ్ఞాః ప్రచక్షతే॥
బ్రాహ్మాంపాద్మంవైష్ణవంచ శైవంభాగవతంతథా।
తథాఽన్యంనారదీయంచ మార్కణ్డేయంచ సప్తమమ్॥
ఆగ్నేయమష్టమంచైవ భవిష్యన్నవమంస్మృతమ్।
దశమంబ్రహ్మకైవార్తం లైఙ్గమేకాదశంస్మృతమ్॥
వారాహంద్వాదశంచైవ స్కాన్దంచాత్రత్రయోదశమ్।
చతుర్ధశంవామనాంచ కౌర్మంపఞ్చదాశంతథా॥
మాత్స్యంచగారుడంచైవ బ్రహ్మాణ్డంచతతః పరమ్॥
సర్గశ్చప్రతిసర్గశ్చవంశామంవన్తరాణిచ।
సర్వేష్వేతేషుకథ్యన్తేవంశానుచరితంచయత్॥
యదేతత్తవ మైత్రేయ పురాణం కథ్యతేమయా।
ఏతద్వైష్ణవసంజ్ఞంవై పాద్మస్యాసమనన్తరమ్॥
సర్గేచప్రతిసర్గేచ వంశమనన్వంతరాదిషు।
కథ్య తేభగవాన్ విష్ణురశేషుశ్వేవసత్తమ॥
అజ్ఞానివేదాశ్చ త్వారో మీమాంసాన్యాయవిస్తరః।
పురాణంధర్మశాస్త్రంచ విధ్యాహ్యేతాశ్చతుర్ధశ॥
ఆయుర్వేదోధనుర్వేదో గాన్ధర్వశ్చైవతేత్రయః।
అర్థశాస్త్రంచతుర్ధంచ విధ్యాహ్యష్టాదశైవతాః॥
జ్ఞేయాబ్రహ్మర్షయః పూర్వం తేభ్యోదేవర్షయః పునః।
రాజర్షయః పునస్తేభ్యో ఋషిప్రకృతయస్త్రయః॥
ఇతిశాఖాస్సమాఖ్యాతాశాఖాభేదా స్తథైవచ।
కర్తారశ్చైవశాఖానాంభేదహేతుస్తవోదితః॥
సర్వమన్వన్తరేష్వేవం శాఖాభేదాస్సమాస్స్మృతాః॥
ప్రాజాపత్యాశృతిర్నిత్యాతద్వికల్పాస్త్విమేద్విజ॥
ఏవంతవోదితంసర్వంయత్పృష్టోహమిహత్వయా।
మైత్రేయవేదసంబన్ధంకిమన్యత్కథయామితే॥
మహామతి మంతుడగు వ్యాస భగవానుడు తన శిష్యుడు సూతుడని ప్రఖ్యాతుడగు రోమహర్షణునకు పురాణ సంహిత నొసంగెను. 1. సుమతి, 2. అగ్ని వర్చసుడు, ౩. మిత్రాయువు, 4. శాంసపాయనుడు 5. ఆకృత వ్రణుడు 6. సావర్ణి అను వారరుగురు రోమహర్షణుని శిష్యులు. సావర్ణి శంసపాయనుడు సంహితా కర్తలు. ఈ మూడు సంహితలకు మూలమగు సంహిత వ్యాసులు రచించి లోమహర్షుణుని కిచ్చిరి. "లోమహర్షణి కాచాణ్య" అని యందు చెప్పిన సంహిత లోమహర్షణుడు రచించినది కాక వ్యాసుల వలన పొందినదని యర్థము. ఈ పురాణ సంహితము మూలముగా గల పురాణములు నాచే రచింప బడినవి. మొదటి పురాణము బ్రహ్మము. పురాణములు పదునెనిమిది అని పురాణజ్ఞులు చెప్పుదురు. 1. బ్రహ్మము, 2. పాద్మము, ౩. వైష్ణవము, 4. శైవము, 5. భాగవతము (దేవీ), 6. నారదీయము, 7. మార్కండేయము, 8. ఆగ్నేయము, 9. భవిష్యము, 10. బ్రహ్మవైవార్తము, 11. లైంగము, 12. వారాహము, 13. స్కాందము, 14. వామనము, 15. కౌర్మము, 16. మాత్స్యము, 17. గారుడము, 18. బ్రహ్మాండము. ఈ పదునెనిమిది పురాణములు గాక ఉప పురాణములు గూడ మునులచే జెప్ప బడినవి. పురాణము లందు సర్గము ప్రతి సర్గము వంశము మన్వంతరములు వంశాను చరితము మను పంచ లక్షణములు చెప్పబడినవి. ఓ మైత్రేయా! నీకిపుడు నేను చెప్పుచున్న పురాణము విష్ణు పురాణము తరువాతది. సర్గాదుల యందు భగవానుడే కర్తగా నన్నిటి యందు చెప్ప బడుచుండును, వేదాంగములు ఆరు. వేదములు నాలుగు. మీమాంస న్యాయము (తర్కము) పురాణము, ధర్మశాస్త్రము నను నీ పదునాలుగు విద్యలు. ఆయుర్వేదము, ధనుర్వేధము, గాంధర్వ (సంగీత) వేదము, అర్థశాస్త్రము(రాజనీతి) అను నీ నాలుగు చేర్చిన పదునెనిమిది విద్యలగును. మొదట బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అని ఋషి ప్రకృతులు మూడు. శాఖలు శాఖా భేదములు తత్కర్తలు ఆభేదమునకు కారణములు తెలుప బడినవి. అన్ని మన్వంతరము లందును శాఖాభేదము లిట్లే యుండును. కల్పాది యందు ప్రజాపతిచే దృష్టమైన శృతి (వేదము) నిత్యమే. ఇపు డధ్యయనము చేయ బడుచున్న శాఖా భేదములు ప్రాజాపత్యశ్రుతి యొక్క వికల్పములు. (కావున అనిత్యముల వంటివి. ప్రతి ద్వారమున కొంచెము మారుచుండును) మైత్రేయా! నీయడిగినంత చెప్పితిమి. వేద సంబంధమైన విషయ మింకేమి నీకు కావలెను.
Summary of chapter 6 of the Vishnu Mahā Purāṇa is as follows:
Jaimini received the Sāmaveda from Vyāsa and his disciple Sukarma organized it into one thousand śākhā-divisions, transmitted principally through Hiraṇyanābha and Pauṣpiñji. For the Atharvaveda, Sumantu transmitted to Kabandha, who divided it into the Pathya and Devaśarmā (Vedadarśa) branches. For the Purāṇas, Vyāsa taught the Purāṇa-saṃhitā to Lomaharṣaṇa (the Sūta), who transmitted it to six disciples. The VP gives the canonical list of the eighteen Mahāpurāṇas: Brahma, Padma, Viṣṇu, Śiva, Bhāgavata, Nārada, Mārkaṇḍeya, Agni, Bhaviṣya, Brahma Vaivarta, Liṅga, Varāha, Skanda, Vāmana, Kūrma, Matsya, Garuḍa, and Brahmāṇḍa.