5 - శుక్ల కృష్ణ యజుర్వేద శాఖా వివరణం

 శ్రీపరాశరుడు:

 యజుర్వేదతరోశ్శాఖాస్సప్తవింశన్మహామనిః।

 వైశంపాయన నామా సోవ్యాసశిష్యశ్చకారవై॥

 శిష్యేభ్యః ప్రదదౌతాశ్చ జగృహుస్తేఽప్యానుక్రమాత్॥

 యాజ్ఞవల్క్యశ్చతస్యాభూద్భ్రహ్మరాతసుతోద్విజ।

 శిష్యఃపరమధర్మజ్ఞో గురువృత్తిపరస్సదా॥

 ఋషిర్యోద్యమహామేరోస్సమాజేనాగమిష్యతి।

 తస్యవై సప్తరాత్రాత్తు బ్రహ్మహత్యాభవిష్యతి॥

 పూర్వమేవంమునిగణైస్సమయోయః కృతోద్విజ।

 వైశంపాయన ఏకస్తుతంవ్యతిక్రాన్తవాంస్తదా॥

 స్వస్రీయంబాలకాంసోఽథ పదాస్పృష్టమతాడయత్॥

 శిష్యానాహచభోశిష్యాబ్రహ్మహత్యాపహంవ్రతమ్।

 చరధ్వంమత్కృ తేసర్వేనవిచార్యమిదంతథా॥

 అథాహ యాజ్ఞవల్క్య స్తంకిమేభిర్భగవన్ ద్విజైః।

 క్లేశితై రల్పతేజోభిరశ్చిష్యేహమిదంవ్రతమ్॥

తతఃక్రుద్దోగురుః ప్రాహ యాజ్ఞనవల్క్యం మహామునిమ్।

ముచ్యతాంయత్త్వయాఽధీతం మత్తోవిప్రావమానక॥

నిస్తేజసోవదస్యేతాన్ యస్త్యంబ్రాహ్మణ పుఙ్గవాన్।

తేనశిష్యేణనార్థో స్థిమమాజ్ఞాభఙ్గకారిణా॥

యాజ్ఞవల్క్యస్తతః ప్రాహ భక్త్యైతత్తేమయోదితమ్।

మమాప్యలంత్వయాధీతం యన్మయాతదిదంద్విజ!॥

ఇత్యుక్త్వారుధింరాక్తాని సరూపాణియజూషిసః।

ఛర్ధయిత్వాదదౌతస్మై యయౌచస్వేచ్ఛయామునిః॥

యజూంష్యథవిసృష్టాని యాజ్ఞవల్క్యేనవైద్విజ॥

జగృహుస్తిత్తరాభూత్వాతైత్తిరీయాస్తుతేతతః॥

బ్రహ్మహత్యావ్రతం చీర్ణంగురుణాచోదితైస్తుయైః।

చక్రురాధ్వర్వవం తేతుచరణాన్మునిసత్తమ॥

యాజ్ఞనవల్క్యోఽపి మైత్రేయ! ప్రాణాయామ పరాయణః।

తుష్టావప్రణతస్సూర్యం యజూంష్యభిలషంస్తతః॥

శ్రీపరాశరుడు:

యజుర్వేద వృక్ష శాఖలు ప్రధాన మైనవి యిరువది యేడుగ వ్యాస శిష్యుడగు వైశంపాయనుడు రచించి శిష్యుల కివ్వగా వారు గ్రహించిరి. అందు బ్రహ్మ రాత సుతుడగు యాజ్ఞవల్క్యు డొకడు. అతడు మిక్కిలి ధర్మ మెఱింగిన వాడు. గురువృత్తి యందాసక్తి గలవాడు. నేడు మహామేరువు నుండి ఋషి సంఘముతో వచ్చు ఋషికి నేడు రాత్రులలో బ్రహ్మహత్యా దోషము వాటిల్ల గలదు. పూర్వము మునిగణము చేసిన ఈ శపథము వైశంపాయను డతిక్రమించెను. తన సోదరి పుత్రుని కాలితో తాకి చంపెను. అటుపై తన శిష్యులతో నిట్లనెను. శిష్యులారా! బ్రహ్మ హత్యా దోషమును హరించు నట్టి వ్రతమును నా నిమిత్తమై యందఱు చేయుదురు గాక! ఆలోచన వలదు. అనగా యాజ్ఞవల్క్యు డిట్లనెను. భగవంతుడా! వీరినేల క్లేశపెట్ట వలెను? అల్ప తేజస్కులగు వీరందఱు ఎందులకు? నేను చేసెదననగా గురువగు వైశంపాయనుడు కోపించి బ్రాహ్మణుల నవమానించు నీవు నావద్ద అధ్యయనము చేసిన భాగమును కక్కి వేయుము. బ్రాహ్మణ శ్రేష్టులగు వీరిని నిస్తేజస్సులుగా చెప్పు చున్నావు. అట్టి శిష్యుడు నాకేల? నా యాజ్ఞ నుల్లంఘించితి వనెను. అన యాజ్ఞవల్క్యుడు, భక్తితోనే నేను చెప్పితిని. నీ చదువు నాకక్కర లేదని పలికి రక్త సిక్తములై రూపము దాల్చిన యజస్సులను వామనము చేసి ఇచ్చి యాజ్ఞవల్క్యుడు చనేను. యాజ్ఞవల్క్య మహాముని కక్కిన యజుస్సులను ఆ శిష్యులు తిత్తిరి పక్షులుగా నయి స్వీకరించిరి. అందువలన వానికి తైత్తిరీయము లని పేరు గల్గెను. గురు ప్రేరితులై బ్రహ్మహత్యా వ్రతము నాచరించితి. అట్లాచరించి యజుర్వే దాధ్యాయన మొనరించిరి. యాజ్ఞవల్క్యుడును ప్రాణాయామ పరాయణుడై నియమమున యజుర్వేదము నపేక్షించి యిట్లు సూర్యుని స్తుతించెను.

యాజ్ఞవల్క్యుడు:

నమస్సవిత్రేద్వారాయముక్తేరమితతేజసే।

ఋగ్యజుస్సామభూతాయత్రయీదామ్నేచతేనమః॥

నమోఽగ్నీషోమభూతాయజగతః కారణాత్మనే।

భాస్కరాయపరంతేజస్సౌషుమ్నరుచిబిభ్రతే॥

కలాకాష్ఠానిమేషాదికాలజ్ఞానాత్మనేనమః।

ధ్యేయాయవిశ్వరూపాయ పరమాక్షరరూపిణే॥

బిభర్తియస్సురగణానాప్యాయ్యేన్దుంస్వరశ్మిభిః।

స్వధామృతేసచపితౄంస్తస్మైధృత్యాత్మనేనమః॥

హిమామ్బుఘర్మవృష్టీనాం కర్తాహర్తాచయఃప్రభుః।

తస్మైత్రికాలభూతాయ నమస్సూర్యాయ వేధసే॥

అపహన్తితమోయశ్చజగతోఽస్యజగాత్పతిః।

సత్త్వదామధరోదేవో నమస్తస్మైవివస్వతే॥

సత్కర్మయోగ్యోనజనోనైవాపశ్శౌచకారణమ్।

యస్మిన్ననుదితేతస్మైనమోదేవాయభాస్వతే॥

స్పృష్టోయదంశుభిర్లోకః క్రియాయోగ్యోఽభిజాయతే।

పవిత్రకారణాత్మాయస్తస్మై శుద్దాత్మానేనమః॥

నమస్సవిత్రేసూర్యాయభాస్కరాయవివస్వతే।

ఆదిత్యాయాదిభూతాయదేవాదీనాంనమోనమః॥

హిరణ్మయంరథం యస్యకేతవోఽమృతవాజినః।

వహన్తిభువనాలోకచక్షుషంతం నమామ్యహమ్॥

యాజ్ఞవల్క్యుడు:

సృష్టి కర్తవు మోక్ష ద్వారమవు అమిత తేజస్వివి ఋగ్యజుస్సామ వేద రూపుడవు. వేదత్రయాత్మక దీప్తి యుక్తుడవు అగు సూర్యా! నీకు నమస్కారము. ఆతప వర్ష హేతువగుటచే నగ్నీషోమ రూపుడవు కనుకనే కారణ రూపుడవు తేజః కారకుడవు. చంద్రునికి పుష్టిని కలిగించు తేజస్సును ధరించిన వాడవు నగు నీకు నమస్కారము. తన కిరణములచే చంద్రుని తృప్తి పఱచుచు ఆ చంద్రుని ద్వారా దేవతలను స్వధామృతముతో పితృ దేవతలను తృప్తి పఱచుచున్న తృప్తి రూపుడవగు నీకు నమస్కారము. మంచు నీరు తాపము రంగులకు కర్తయై ప్రపంచమును భరించు వాడు కనుకనే హేమంత వర్ష గ్రీష్మ రూపుడును, సృష్టి కర్తయునగు సూర్యునకు నమస్కారము. ఏ సూర్యుడు దయించనిదే నరుడు సత్కర్మాచరణ యోగ్యుడు కాదో. నీరు పవిత్రతను కలిగింప జాలదో అట్టి సూర్య దేవునకు నమస్కారము. ఎవని కిరణములు సోకినంతనే లోకము కార్యాచరణ యోగ్యమగునో అట్టి పవిత్రతకు కారణమైన శుద్దాత్ముడగు సూర్యునకు నమస్కారము. ప్రేరకుడును జనకుడును తమో వినశాకుడును అదితి సంతతి యగు దేవాదులకు నాది భూతుడు నగు భాస్కరునకు నమస్కారము. రమణీయ తేజో మయమైన ఎవ్వని రథమును నిత్యములైన ఛందో రూపాశ్వములు వహించు చున్నావో లోకమునకు నేత్రభూతు (జగచ్చాక్షువు) దిన సూర్యునకు నమస్కరింతును.

శ్రీపరాశరుడు:

ఇత్యేవమాదిభిస్తేన స్తూయామానస్సవై రవిః।

వాజిరూపధరః ప్రాహవ్రియతామితివాఞ్చితమ్॥

యాజ్ఞవల్క్యస్తదాప్రాహప్రణిపత్యదివాకరమ్।

యజూంషితానిమేదేహియానిసన్తినమేగురౌ॥

ఏవముక్తోదదౌతస్మైయజూంషిభగవాన్ రవిః।

అయాతయామాసంజ్ఞానియానివేదనతద్గురుః॥

యజూంషియైరధీతానితానివిప్రైర్ ద్విజోత్తమ।

వాజినస్తేసమాఖ్యాతాస్సూర్యోఽశ్వస్సోఽభవద్యతః॥

శాఖాభేదాస్తుతేషాంవైదశపఞ్చ చవాజినామ్।

కణ్వాద్యాస్తుమహాభాగాయాజ్ఞవల్క్య ప్రకీర్తితాః॥

శ్రీపరాశరుడు:

ఈ విధముగ స్తుతించిన యాజ్ఞవల్క్యునకు ఆశ్వ రూపమున వచ్చి సూర్యుడు వారము కోరుకొమ్మనెను. యాజ్ఞవల్క్యుడు సూర్యునకు నమస్కరించి యిట్లడిగెను. మా గురువగు వైశంపాయను యొద్దలేని యజుర్వేదమును నా కనుగ్రహింపు మనెను. ఇట్లడిగిన యాజ్ఞవల్క్యునకు సూర్య భగవానుడ యాతయామములు (నిలువ యున్నవి) గానివియు వైశంపాయను డేరుంగనివియు నగు యజుర్వేద భాగముల ననుగ్రహించెను. ఆ భాగములను నద్యయనము చేసిన బ్రాహ్మణులు వాజులు (అశ్వములు)గ చెప్ప బడుదురు. సూర్యుడు కూడ వాజీ (అశ్వ) రూపమును ధరించెను గదా! ఆవాజులు యొక్క శాఖలు పదునైదు గలవు. కాణ్వాదులు యాజ్ఞవల్క్యు లుగ చెప్ప బడుదురు.